Ichchapuram
-
సిక్కోలు మట్టిపై ఇంటాక్ అమితమైన ప్రేమ
‘ఏ స్టోరీ ఆన్ స్టోన్’ పవిత్రమైన సిక్కోలు గడ్డపై అనంతమైన అభిమానంతో రాసిన ప్రేమలేఖ. అటు ఇచ్ఛాపురంలోని (Ichchapuram) సురంగి వారి కోట నుంచి ఇటు శ్రీకూర్మంలోని కుడ్య చిత్రాల వరకు ఏ కథను వదలకుండా ‘ఇంటాక్’ సభ్యులు అందంగా గుదిగుచ్చిన బంతిపూల మాల. ప్రతి ప్రాంతాన్ని, ప్రతి చరిత్రను, ప్రతి గాథను మనసారా ప్రేమించి ఆరారా అచ్చువేసిన ఓ పుస్తకమిది. పుస్తకమే కాదు ఆ ప్రయత్నం వెనుక ఉన్నది స్వచ్ఛమైన ప్రేమ. ఈ మట్టిపై, ఇక్కడి కథలపై, ఈ దారుల్లో దాగున్న అపురూప చరిత్రపై అమితమైన ఇష్టం. అంతే ఇష్టం మీకూ ఉంటే.. గ్రంథాలయంలోని ఈ పుస్తకాన్ని తిరగేయండి. పేజీలు ప్రియురాలిలా మారి చెప్పే ఊసులు వినండి. నెచ్చెలిలా చిత్రాలు వివరించే నులివెచ్చని జ్ఞాపకాలను ఆస్వాదించండి. – శ్రీకాకుళం కల్చరల్ఒక ప్రాంత చరిత్ర గుర్తుండాలంటే.. అక్కడి కథలు మళ్లీ మళ్లీ చెప్పుకోవాలి. ఆ ప్రాంత ప్రాశస్త్యం తెలియాలంటే.. ఆ గాథలు చరిత్రలో మిగిలిపోయే ప్రయత్నమేదో చేయాలి. అలాంటి ప్రయత్నమే ఇంటాక్ చేసింది. శ్రీకాకుళం జిల్లా చరిత్రను అందమైన పుస్తకంగా అచ్చు వేసి అందుబాటులో ఉంచింది. దేశంలోని అన్ని యూనివర్సిటీలకు, కళాశాలలకు, గ్రంథాలయాలకు చేరే విధంగా చర్యలు తీసుకుంది. భారత జాతీయ సంస్కృతి కళ వారసత్వ సంపద పరిరక్షణ సంస్థ కేంద్ర సహకారంతో నడుస్తోంది. ఇక్కడి శాఖ జిల్లాపై ఉన్న ప్రేమతో సంస్కృతి, వారసత్వ సంపదను అందరికీ తెలియజేసేందుకు విశేష కృషి చేసింది.దూసి ధర్మారావు జిల్లా శాఖ కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడి ఇండియన్ బ్యాంకులో ఉద్యోగం చెస్తున్న మండా శ్రీనివాసరావు ఫొటోగ్రఫీ నైపుణ్యాన్ని ఉపయోగించుకుని ‘శ్రీకాకుళం ఏ స్టోరీ ఆన్ స్టోన్’ (Srikakulam A story on stone) అనే పుస్తకం రూపొందించారు. అందులో జిల్లాలోని చారిత్రక స్థలాలు, కళలు, సంస్కృతి వారసత్వ సంపదలు, కవులు, గాయకులు, నటులు, పర్యాటక ప్రదేశాల గురించి నిక్షిప్తం చేశారు. అనంతరం కేవీజే రాధాప్రసాద్ కన్వీనర్‌గా ఉన్న సమయంలో విద్యార్థులకు మన సంస్కృతి వారసత్వాలను పరిచయం చేసే ప్రక్రియలో వారికి వ్యాసరచన పోటీలు, వారికి అక్కడి సందర్శింప చేసే కార్యక్రమం చేశారు.సేకరణ, నిక్షిప్తీకరణ, నివేదన స్థానికంగా ఉండే చారిత్రక ప్రాధాన్యత కలిగిన అంశాలను ఎంచుకొని ఆ ప్రాంతానికి స్వయంగా వెళ్లి అక్కడి ప్రజల ద్వారా తెలుసుకున్న అంశాలతో పాటు చారిత్రక అంశాలను అధ్యయనం చేసి వాటిని రికార్డు చేసి రిపోర్టును కేంద్ర శాఖకు పంపుతారు. వారి సొంత ఖర్చులతో వెళ్లి విషయ సేకరణ చేస్తారు. ఇప్పటి వరకు 150 టూరిజం స్థలాలను, 100కు పైగా చారిత్రక స్థలాలను గుర్తించి పుస్తకంలో నిక్షిప్తం చేశారు. పురాతన తాళపత్ర గ్రంథాలను కూడా సేకరించారు. అలాగే హెరిటేజ్ ఫొటోగ్రఫీ ప్రదర్శనలో ప్రదర్శించగా ఎన్నో ప్రశంసలు వచ్చాయి. కోల్‌కతాలో కూడా ప్రదర్శించారు. శ్రీకాకుళం నా ప్రేమనగర్ శ్రీకాకుళం కేవలం ఒక ఊరి పేరో, ఒక జిల్లా పేరో మాత్రమే కాదు. అభ్యుదయ సామాజికవాదుల ఊపిరి ఉత్తేజం నింపే ఆక్సిజన్. జీవనదుల నేల, ఖనిజాల గని, శ్రమమజీవుల తూర్పు ప్రాంతం. జిల్లా పేరు చెబితే ఇండియన్ హెర్క్యులస్ కోడి రామ్మూర్తి నాయుడు, వయోలిన్ విద్వాంసుడు వెంకటస్వామి నాయుడు, హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు, ఆధునిక సాహిత్యానికి, కథ, నాటకం, ముత్యాల సరాలు అందించిన గురజాడ.. పెన్ను గన్ను పట్టిన పాణిగ్రహి గుర్తుకు వస్తారు. ప్రసిద్ధ ప్రజా కళాకారుడు వంగపండు వంటి వారికి .. ఇక్కడి సీమ కొండలు, సాలూరవతలి సువర్ల కొండలే కాక కత్తు లు దులపరించిన చిలకలు, పాముని యెంటదగిలి న చీమలు గుర్తొస్తాయి. శ్రీకాకుళం రా వీర శ్రీకాకుళం రా – వీర యోధులనే కన్న గడ్డ శ్రీకాకుళం రా... అందుకే శ్రీకాకుళం నా ప్రేమనగర్. – అట్టాడ అప్పలనాయుడు, ప్రముఖ కథ, నవల రచయితఇంటాక్ ద్వారా మూడు పుస్తకాలు ఇంటాక్ తరఫున గుర్తించిన చారిత్రక ప్రదేశాలన్నింటితో ఒక పుస్తకాన్ని రూపొందించారు. ‘శ్రీకాకుళం... ఏ స్టోరీ ఆన్ స్టోన్ ’ పేరుతో పుస్తకాన్ని ఇప్పటికి మూడు సార్లు ముద్రించాం. కళింగ ఆంధ్ర చరిత్ర, స్టోరీ ఆన్ స్టోన్స్ శ్రీకాకుళం, జిల్లా చరిత్రపై బిట్స్‌తో ఒక పుస్తకాన్ని కూడా రూపొందించాం. – వి.జగన్నాథం నాయుడు, అదనపు కన్వీనర్, ఇంటాక్ శాఖ దూసి కోసం ప్రయత్నం మహాత్మా గాంధీ అడుపెట్టిన దూసి రైల్వే స్టేషన్‌ను గాంధీ స్మారక స్థలిగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమం కొనసాగుతోంది. – నూక సన్యాసిరావు, కన్వీనర్, ఇంటాక్ శ్రీకాకుళం శాఖవిద్యార్థులకు పోటీలు విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాలు, చారిత్రక కట్టడాల వంటి వాటిపై జిల్లా స్థాయి, జోనల్ స్థాయిల్లో పోటీలు నిర్వహించి వారిలో చిన్నతనం నుంచి అవగాహన కల్పిస్తున్నాం. – నటుకుల మోహన్, ఇంటాక్ కో కన్వీనర్220 సమర్పణ పత్రాలు చారిత్రక ప్రదేశాలతో ఇంటాక్ సమర్పణ పత్రాలు అందించాను. జిల్లాలో చారిత్రక నిర్మాణాల సంపద, తీరప్రాంత చారిత్రక సంపదతో కలిపి మొత్తం 220 ప్రదేశాలు ఉన్నట్లు గుర్తించాను. వీటిని అన్నింటిని రికార్డు చేసి ఈ పత్రాలను క్రమపద్ధతిలో ఇంటాక్ సంస్థకు రికార్డులు పంపించాం. – మండా శ్రీనివాస్, ఇంటాక్ ఫొటోగ్రాఫర్చరిత్ర తెలియాలని..జిల్లా చరిత్ర విద్యార్థులకు తెలియాలని నేను కన్వీనర్‌గా ఉన్న సమయంలో పోటీలు నిర్వహించేవాళ్లం. ధర్మారావు కాలంలో రూపొందించిన పుస్తకాన్ని కలెక్టర్ల సాయంతో పునర్ముద్రణ చేసి యూనివర్సిటీలకు, గ్రంథాలయాలకు ఉచితంగా అందించాం. – కేవీజే రాధా ప్రసాద్, పూర్వపు కన్వీనర్, ఇంటాక్ -
ఇచ్ఛాపురం.. ఇచ్చట పనిచేయలేం!
ఇచ్ఛాపురం రూరల్: జిల్లా శివారు మండలమైన ఇచ్ఛాపురంలో పని చేసేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. ఇక్కడ పనిచేయడం కత్తిమీద సాములా మారిందని భయపడుతున్నారు. ధైర్యం చేసి వచ్చిన అధికారులు కూడా నెల తిరిగే లోపే ఏదో ఒక వంకతో ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. ఎన్నికల విధుల నిర్వర్తించడానికి వచ్చిన ఎంపీడీఓ వై.వి.ప్రసాదరావు ఎన్నికల తర్వాత కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయించుకున్నారు. తర్వాత వచ్చిన ఎంపీడీఓ ఎం.ఈశ్వరరావు తొలుత కొనసాగుదామనే వచ్చారు. అయితే స్థానిక కూటమి నేతల ఒత్తిడి తట్టుకోలేక వారం రోజుల్లోనే రణస్థలం మండలానికి వెళ్లిపోయారు. దీంతో నెల రోజుల నుంచి ఎంపీడీఓ పోస్టు ఖాళీగా ఉంది.⇒ ఈఓపీఆర్డీగా పనిచేసిన సత్యనారాయణ వారం కిందట అరకు వెళ్లిపోయారు. 20 రోజుల క్రితం సెర్ప్ ఏపీఎంగా విధులు నిర్వహించిన సనపల ప్రసాదరావు కంచిలి మండలానికి వెళ్లిపోగా, ఇంత వరకు ఆ పోస్టులో చేర్పించేందుకు డీఆర్డీఏ అధికారులు ఎంత ప్రయత్నం చేసినా.. ఇచ్ఛాపురం వచ్చేందుకు ఏపీఎంలు విముఖత చూపిస్తుండటంతో ప్రస్తుతం ఆ పోస్టు ఖాళీగానే ఉంది.⇒ ఇచ్ఛాపురం, కవిటి మండలాలకు సంబంధించి పంచాయతీరాజ్ డీఈగా పనిచేస్తున్న ఏ.సూర్యప్రకాశరావు మూడు నెలలు క్రితం టెక్కలి ఈఈగా డిప్యూటేషన్‌పై వెళ్లిపోవడంతో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం నిత్యం టెక్కలి పరుగులు తీస్తున్నారు.⇒ గృహనిర్మాణ శాఖలో కొంత కాలంగా డీఈ పోస్టు ఖాళీగా ఉండగా, ఇక్కడికి వచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. ఇదే శాఖలో జేఈగా పనిచేసిన దిలీప్‌రెడ్డి కంచిలి మండలానికి బదిలీపై వెళ్లిపోగా, ఈ పోస్టులో చేరేందుకు సంబంధిత శాఖకు చెందిన ఉద్యోగులు ఇష్టపడక పోవడంతో కేశుపురం గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న విశ్వనాథంను ఇన్చార్జి ఏఈగా నియమించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.⇒ టి.బరంపురం, మబండపల్లి, తేలుకుంచి, హరిపురం, కేశుపురం, ఈదుపురం, తులసిగాం, కొఠారీ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు బదిలీపై వెళ్లి పోవడంతో ఆ స్థానాల్లో చేరేందుకు ఇతర పంచాయతీ కార్యదర్శులు జంకుతున్నారు.⇒ వీఆర్వోలది కూడా అదే పరిస్థితి. మండలం, పంచాయతీల్లో ప్రతిపక్షం పార్టీకి చెందిన ఎంపీపీ, జెట్పీటీసీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉండటంతో జీర్ణించుకోలేని కూటమి నేతలు తాము చెప్పినట్లే జరగాలంటూ సంబంధిత అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అర్హులైన వారికి సైతం పింఛన్లు తొలగించాలని, గ్రామ స్థాయిలో పనులు జరగాలంటే తాము చెప్పినట్లే జరగాలంటూ ఆదేశాలు జారీ చేస్తుండటం, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్‌చే సంబంధిత అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తుండటంతో ఇక్కడ పనిచేసేందుకు ఇష్టం లేదని అధికారులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. దీంతో సంబంధిత ఖాళీ పోస్టుల్లో ఇన్‌చార్జీలే దర్శనమిస్తున్నారు. -
అమెరికాలో ఇచ్ఛాపురం యువకుడు మృతి
ఇచ్ఛాపురం: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన పి.రూపక్‌రెడ్డి(26) అమెరికాలోని జార్జ్ సరస్సులో మునిగి మృతిచెందాడు. అతని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పి.కవిరాజ్‌రెడ్డి, ధనవతి దంపతుల కుమారుడు పి.రూపక్‌రెడ్డి పది నెలల క్రితం ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడి హరీష్‌బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చేరాడు. డెలావర్‌లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం (ఆగస్టు 27) న్యూయార్క్‌లోని జార్జ్ లేక్‌కు భారతదేశానికి చెందిన ఐదుగురు స్నేహితులతో కలిసి వెళ్లాడు. సరస్సు మధ్యలో పెద్ద రాయి కనిపించడంతో దానిపై నిలుచుని ఫొటోలు తీసుకునేందుకు ఎక్కారు. ఈ క్రమంలో రూపక్‌రెడ్డి, అతని స్నేహితుడు రాజీవ్ ప్రమాదవశాత్తు నీటిలో జారిపడ్డారు. మిగిలిన స్నేహితులు రాజీవ్‌ను కాపాడగా, రూపక్‌రెడ్డి నీటిలో మునిగిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రెస్క్యూ టీం వచ్చి గాలించిం రూపక్‌రెడ్డి మృతదేహాన్ని వెలికితీశారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో పి.కవిరాజ్‌రెడ్డి, ధనవతి దంపతులు, వారి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
-
ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..
-
సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే
-
మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!
-
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @ఇచ్ఛాపురం (శ్రీకాకుళం జిల్లా)
-
ఇచ్చాపురం: వైఎస్సార్సీపీ సామాజిక బస్సుయాత్ర సభ (ఫొటోలు)
-
‘పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే’
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఇచ్చాపురం నుంచి వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆ పార్టీ నేతలు అన్నారు. గురువారం.. ఇచ్ఛాపురంలో మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే వి.కళావతి, గొర్లె కిరణ్ కుమార్, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, వరదు కల్యాణి పాల్గొన్నారు. ‘‘గత నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తాం. ఇచ్చిన హామీలను అమలు చేసిన నాయకుడు సీఎం జగన్. అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు అందించాం. కేబినెట్లోనూ సామాజిక న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్. వైఎస్సార్సీపీకి ఓటు వేయని వారికి సంక్షేమ పథకాలు అందించాం. సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతీ నాయకుడూ, కార్యకర్త పనిచేస్తున్నారు, అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అందించాం. విద్యారంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాం. నాడు-నేడుతో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే’’ అని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. -
సిక్కోలు గుండెల్లో ఆ గురుతులు పదిలం
ఇచ్ఛాపురం రూరల్: సరిగ్గా నాలుగేళ్ల కిందట.. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి వద్ద.. అశేష జన సందోహం ఓ చారిత్రక ఘట్టానికి సాక్షిగా నిలిచింది. 3,648 కిలోమీటర్ల మేర 341 రోజుల పాటు సాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ఆఖరి అడుగు లొద్దపుట్టిలో పడింది. ఆ అడుగే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు పునాదిని పటిష్టం చేసింది. నాలుగేళ్లయినా ఆ జ్ఞాపకాలు సిక్కోలు గుండెల్లో ఇంకా పచ్చగా మెదులుతున్నాయి. ఒక్కడిగా మొదలై.. ఒక్కొక్కరిని కలుపుకుంటూ.. ఉప నదులు తోడైన మహానదిలా రాష్ట్రమంతా సాగిన ఈ పాదయాత్ర చరిత్రలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. 13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు, 2,516 గ్రామాల గుండా సాగిన పాదయాత్ర ఆఖరి ఘట్టంలో వైఎస్ జగన్ చేసిన ప్రసంగం ఇంకా చాలా మందికి గుర్తుంది. నేడు అందరితో ప్రశంసలు పొందుతున్న నవరత్నాలను ఆనాడే వైఎస్ జగన్ వివరించారు. పాదయాత్రలో చూసిన కష్టాలతోనే సంక్షేమ పథకాలకు ఊపిరి పోశారు. ఈ యాత్ర ఇచ్చిన సత్తువతోనే జనం గుండెల్లో స్థానాన్ని పదిలం చేసుకున్నారు. యాత్ర ముగింపునకు గుర్తుగా ఇచ్ఛాపురంలో విజయ స్థూపం కూడా ఏర్పాటు చేశారు. ఇదిప్పుడు మంచి పర్యాటక స్థలంగా పేరు పొందింది. కోట్ల హృదయాలను గెలుచుకున్నారు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగిన ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ముఖ్యంగా ఆయన ప్రజల కష్టాలను నేరుగా చూడటంతో అవి తీర్చడానికే హామీలిచ్చి 97 శాతం నెరవేర్చారు. ఆయనతో అడుగులు కలపడం అదృష్టంగా భావిస్తున్నాను. రానున్న ఎన్నికల్లో ఇచ్ఛాపురం నియోజకవర్గాన్ని జగనన్నకు కానుకగా ఇస్తాం. – పిరియా సాయిరాజు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, ఇచ్ఛాపురం ఆ చెమట చుక్కే అభివృద్ధికి చుక్కాని ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చిందించిన చెమట చుక్కలన్నీ రాష్ట్రాభివృద్ధికి చుక్కానిలయ్యాయి. ఓ సమర్థుడైన పాలకుడి పాలన కోసం ఎదురు చూసిన కోట్లాది మంది ప్రజల కలలను నిజం చేస్తూ ఆయన సంక్షేమ పాలన సాగిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఇచ్ఛాపురంలో పడిన జగనన్న అడుగుల చప్పుళ్లు, ఇచ్చిన హామీలు, నెరవేర్చిన వైనాలు సిక్కోలు ప్రజలు ఎప్పటికీ తమ గుండెల్లో పదిలంగానే ఉంటాయి. – పిరియా విజయ, జిల్లాపరిషత్ చైర్పర్సన్, శ్రీకాకుళం కలలో కూడా ఊహించని అవకాశం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ము ఖ్యమంత్రి బడుగు, బలహీన వర్గాలకు అత్యున్నత స్థానాలు ఇవ్వలేదు. తన క్యాబినెట్లో దళితులకు ఉన్నత పదవులు ఇచ్చిన జగనన్న ఇచ్ఛాపురం శివారు ప్రాంతంలో నన్ను డీసీఎంఎస్ చైర్‌పర్సన్‌గా ఎంపిక చేశారు. నాకు ఈ అవకాశం వస్తుందని కలలోనైనా అనుకో లేదు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించి, నా లాంటి వంద లాది మందిని అందలమెక్కించారు. – ఎస్.సుగుణ, డీసీఎంఎస్ చైర్పర్సన్ -
వి‘హంగామా’.. విదేశీ పక్షులతో ‘తేలుకుంచి’ పులకింత
సాక్షి, శ్రీకాకుళం: పచ్చని చెట్లు తెల్లటి దుప్పటి కప్పుకున్నాయా.. అన్నట్లు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి గ్రామంలో విదేశీ పక్షులు కనువిందు చేస్తున్నాయి. మేఘాల పల్లకిలో వేల కిలోమీటర్లు అలుపూ సొలుపు లేకుండా పయనించి అబ్బురపరుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు చిత్ర విచిత్రమైన చప్పుళ్లతో చెట్లపై సందడి చేస్తున్నాయి. ఇవీ ప్రత్యేకతలు.. చెట్లపై కొమ్మలు, రెమ్మలు ఉంటే తప్ప గూడు ఏర్పాటు చేసుకోలేని ఈ పక్షులు గుడ్లు పెట్టేందుకు చెట్లనే ఆశ్రయిస్తుంటాయి. ఒక్కో పక్షి 2 నుంచి 6 గుడ్లు వరకు పెడుతుంటాయి. 27 నుంచి 30 రోజుల వరకు తల్లి పక్షి గుడ్లు పొదుగుతుంది. పొదిగిన రోజు నుంచి 36 రోజుల పాటు ఆహారాన్ని తీసుకువచ్చి అందించి సంరక్షిస్తాయి. పిల్ల పక్షులు ఎగిరేంత వరకు తల్లి పక్షి గానీ, మగ పక్షి గానీ గుళ్లలో కాపలాగా ఉంటాయి. ఏటా తొలకరి జల్లులు కురిసే జూన్‌లో సైబీరియా నుంచి వస్తోన్న ఈ పక్షుల అసలు పేరు ఓపెన్ బిల్ స్టార్క్స్ (నత్తగొట్టు కొంగలు, చిల్లు ముక్కు కొంగలు). శాస్త్రీయ నామం ‘అనస్థోమస్’. తూర్పు–దక్షిణాసియా ఖండంలో ముఖ్యంగా భారత్, శ్రీలంక నుంచి మొదలుకొని తూర్పు ప్రాంతంలో విస్తారంగా సంచరిస్తుంటాయి. వీటి జీవిత కాలం సుమారు 30 ఏళ్లు. బాగా ఎదిగిన పక్షి 81 సెంటీమీటర్ల పొడవు, 11 కిలోల బరువు ఉంటుంది. రెక్కలు విప్పారినప్పుడు 149 సెంటీ మీటర్ల వరకు ఉంటుంది. పగలంతా తంపర భూములు, వరి చేలల్లో తిరుగుతూ చేపలు, నత్తలు, కప్పలు, పురుగులు, ఆల్చిప్పలను ఆహారంగా తీసుకుంటాయి. 6 నెలల పాటు పిల్లలతో గడిపిన పక్షులు పిల్లలు ఎగిరేంత బలం రాగానే డిసెంబర్, జనవరిలో తమ ప్రాంతాలకు పయనమవుతుంటాయి. మోడువారిన చెట్లపై నివసిస్తున్న పక్షులు ఆడపడుచుల్లా విదేశీ పక్షులు.. ఈ పక్షులను తేలుకుంచి గ్రామస్తులు తమ ఆడపడుచుల్లాగా భావిస్తుంటారు. గ్రామస్తులకు వాటితో విడదీయరాని అనుబంధం ఉంది. సకాలంలో పక్షులు గ్రామానికి చేరకపోతే ఇక్కడి ప్రజలు ఆందోళనపడుతుంటారు. ఏటా జూన్‌లో ఈ పక్షుల రాకతోనే నైరుతి పవనాలు ఆరంభమవుతాయని గ్రామస్తుల నమ్మకం. వీటి రాకతో తమ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండుతాయని వారి విశ్వాసం. తాము కూర్చున్న చోట పక్షులు వాలుతాయే తప్ప ఎవ్వరికీ ఎటువంటి హాని చేయవని, వీటిని వేటగాళ్ల బారినుంచి తామే రక్షిస్తుంటామని గ్రామస్తులు చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా పక్షులకు హాని తలపెట్టాలని చూస్తే గ్రామ కట్టుబాటు ప్రకారం ఆ వ్యక్తికి గుండు గీయించి ఊరేగిస్తారు. తిత్లీ, పైలాన్ తుఫాన్ తీవ్రతకు చెట్లు నేలకొరగడంతో విహంగాలకు తేలుకుంచిలో విడిదిలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఏడాదికి వీటి సంఖ్య 30–40% తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం పక్షులు గూళ్లు పెట్టేందుకు నానాపాట్లు పడుతున్నాయి. చెట్లనే ఆవాసాలుగా ఏర్పాటు చేసుకునే ఈ పక్షులు చెట్లు లేక గడ్డికుప్పలు, ఇళ్లపై, పంట పొలాల చాటున గూళ్లు పెట్టుకునేందుకు సిద్ధపడుతున్నాయి. రాత్రి సమయాల్లో విష పురుగులు బారినపడి పక్షులు మృతి చెందుతున్నాయి. పక్షులను సంరక్షించేందుకు గ్రామంలో చెట్లు పెంచాలని అధికారులకు తేలుకుంచి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
YSR: గుర్తుందా నాటి విజయ గాథ
ఇచ్ఛాపురం: సమర్థత కలిగిన ఓ నాయకుడు పరిపూర్ణ మహానాయకుడిగా రూపాంతరం చెందిన రోజులవి. అప్పటి అధికార పక్షాన్ని దునుమాడుతూ స్వరంలో భాస్వరాన్ని మండించిన కాలమది. ఊరి మధ్య నిలబడి ధిక్కార పతాకాన్ని ధైర్యంగా ఎగరేసిన నేతను జనాలకు చూపిన సమయమది. ఇప్పటికి పంతొమ్మిదేళ్ల కిందట అంటే 2003లో.. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర పుటలో సువర్ణాక్షరాలతో లిఖితమైంది. మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఆయన చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర సరిగ్గా జూన్ 15వ తేదీన ఇచ్ఛాపురంలో ముగిసింది. పాదయాత్ర ముగిశాక ఆయన ప్రస్థానం చరిత్ర చెప్పుకునేలా సాగింది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీని గద్దె దించడానికి అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2003 ఏప్రిల్ 9 తేదీ రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేపట్టారు. తన పాదయాత్రలో ప్రజలను కలిసి వారి కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగారు. వైఎస్సార్ ఆవిష్కరించిన ప్రజాప్రస్థాన విజయ స్థూపం మండు వేసవిలో పాదయాత్ర చేస్తూ చాలాసార్లు అనారోగ్యానికి గురయ్యారు. అయినా ఆ యజ్ఞాన్ని ఆపలేదు. ఇలా సుమారు 68 రోజుల పాటు 11 జిల్లాలు 56 నియోజక వర్గాల గుండా 1470 కిలోమీటర్ల దూరం అలుపెరుగకుండా నడిచి జూన్ 15 తేదీన ఇచ్ఛాపురం పట్టణంలో ప్రజాప్రస్థాన పాదయాత్రకు ముగింపు పలికారు. ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ప్రజాప్రస్థాన విజయ స్థూపాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు ఆ ప్రాంతం ఇక్కడ పర్యాటకంగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. -
బోన్ క్యాన్సర్ అని తెలియడంతో...
జలుమూరు: మండలంలోని టి.లింగాలుపాడు పంచాయతీకి చెందిన దువ్వారాపు రాము(32) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో పెయింటర్‌గా పనిచేసిన రాము అనారోగ్యం కారణంగా కొద్ది నెలల క్రితం స్వగ్రామం చేరుకున్నాడు. గతంలో మెదడు సంబంధిత వ్యాధి బారిన పడటంతో రెండుసార్లు శస్త్ర చికిత్స చేశారు. ఇటీవల మళ్లీ అనారోగ్యానికి గురి కాగా వైద్యపరీక్షలు చేయించగా బోన్ క్యాన్సర్ అని తేలడంతో మాసికంగా కుంగిపోయాడు. భార్య, పిన్ని చర్చికి వెళ్లిన సమయంలో శ్లాబ్‌కు చున్నీ కట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. రాముకు బాల్యం నుంచి కష్టాలే. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో పిన్ని అసిరిపోలమ్మ అన్నీ తానై పెంచింది. ఈ క్రమంలో వివాహం కూడా చేసింది. రాముకు భార్య యమున, కుమారుడు హర్షవర్దన్ ఉన్నారు. అసిరిపోలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పారినాయుడు తెలిపారు. లారీని ఢీకొట్టిన బైక్ ఇచ్ఛాపురం: ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచిలి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పులారి జానకిరావు (27), పిన్నింటి దర్మరాజు, మద్దిలి ప్రవీణ్‌కుమార్‌లు ఆదివారం ఒడిశా నుంచి ఆంధ్ర వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. సుమండి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని అదుపు తప్పి ఢీకొట్టారు. ఈ ఘటనలో జానకిరావు అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన ధర్మరాజు, ప్రవీణ్‌కుమార్‌లను 108 వాహనంలో ఇచ్ఛాపురం సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం తీసుకెళ్లారు. ఒడిశా గొలంత్ర పోలీసులు కేసు నమోదు చేసి జానకిరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బరంపురం పెద్దాసుపత్రికి తరలించారు. (చదవండి: భార్యపై కతితో దాడి చేసి...ఆ తర్వాత...) -
పూజించారు.. పట్టుకుపోయారు
ఇచ్ఛాపురం రూరల్: గ్రామదేవత అంటే ఆ దొంగలకు భయంతో పాటు భక్తి మెండుగా ఉంది కాబోలు...ప్రత్యేక పూజలు చేసి మరీ అమ్మవారి వెండి ప్రతిమను ఎత్తుకుపోయారు. ఇచ్ఛాపురం మండలం మండపల్లిలో ఇటీవల తొమ్మిది రోజుల పాటు గ్రామస్తులు ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు పూజా గది తలుపు తాళాన్ని రంపపు బ్లేడ్‌తో కట్ చేసి లోపలికి ప్రవేశించారు. సుమారు 42 తులాల విలువైన అమ్మవారి వెండి ప్రతిమను ఎత్తుకు పోయే ముందు అమ్మవారి సన్నిధిలో పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయని పూజారి రమేష్ రౌళో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సీఐ డి.వి.వి.సతీష్‌కుమార్, రూరల్ ఎస్సై బడ్డ హైమావతిలు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌ను రప్పించి పరిశోధించారు. అమ్మవారి అలంకరణ నగలు, హుండీలను ప్రతి రోజూ పూజారి ఇంటికి తీసుకువెళ్తుండటంతో పెద్ద మొత్తంలో నష్టం కలగలేదని గ్రామపెద్దలు తెలిపారు. (చదవండి: మితిమీరి.. దిగజారి) -
బతుకు నిత్య నృత్యం
ఆ చీకటి లాంటి రూపం.. నీ దేహంపై మోహం వద్దని చెబుతుంది. చేతిలోని కరవాలం.. నీ దుర్గుణాలను తెగనరుకు అంటూ సూచిస్తుంది. మెడలోని పుర్రెల మాల.. ఎన్ని అవాంతరాలు దాటితే బతుకు అంత బాగుంటుందని వివరిస్తుంది. బయటకు వచ్చిన రక్తపు నాలిక.. నీ విజయాలు ప్రపంచానికి చూపడానికి భయపడవద్దని చెబుతుంది. ఆ భయంకరమైన ఆహార్యం.. మనిషంటే మంచి చెడుల కలబోతని వివరిస్తుంది. కానీ వివరాలన్నీ పల్లెపల్లెకూ వెళ్లేదెలా..? సంస్కృత శ్లోకాలు వినిపించని చోట, సాంస్కృతిక నృత్యాలు జరగని చోట ఈ రహస్యాలు ఆ ప్రాంతానికి చెప్పేదెలా..? దానికి సమాధానమే ఈ నాట్యకారులు. కాళికా మాత వేషధారణలో కనిపించే నాట్యకారులు నిజానికి దైవ రహస్యాలు వివరించే దూతలు. ఇంకాస్త లోపలకు వెళితే.. – ఇచ్ఛాపురం రూరల్ చైత్రం నుంచి జ్యేష్ట మాసం వరకు ఉద్దానం పల్లెలు చూసి తీరాల్సిందే. చిరు జల్లులు చిలకరించడానికి మేఘాలు మూటాముల్లె సర్దుకుని ఆకా శయానం చేసే రోజుల్లో ఉద్దానంలో చల్లదనం సంబరాలు జరుగుతాయి. ఆ తర్వాత గ్రామ దేవతల సంబరాలు కొనసాగుతాయి. ఆది, మంగళవారాల్లో ఊ రూరూ మార్మోగిపోతుంది. కానీ అందరి కళ్లు ఒక్కరి మీదే ఉంటాయి. వారే కాళికా వేషధారులు. అమ్మోరు రూపాలుగా పిలిచే కాళీమాత, రాజమ్మ, సంతోషి మాత, భద్రకాళీ, దానప్ప, గురప్ప, మంకినమ్మ అ మ్మవార్ల వేషధారణలో కళాకారులు ఊరూరా నాట్యాలు చేస్తూ కనిపిస్తారు. శ్రమ, అంకితభావం కాళికా దేవి నాట్యమంటే ఆషామాషీ కాదు. తరాలు మారిన కొద్దీ ఆ వేషధారణలోని రహస్యాన్ని విడమరిచి చెప్పే వారు కనుమరుగైపోతున్నారు. కానీ కాలం మళ్లీ మారుతోంది. ఈ నాట్యాలకు పునరుజ్జీవం వస్తోంది. ఎంతో శ్రమ, అంకిత భావం ఉంటే తప్ప ఈ నాట్యం కుదరదు. నిష్టతో, మాంసాహారం తీసుకోకుండా వస్త్రాలంకరణ చేయాలి. కాలికి గజ్జెలు, చేతికి గాజులు, ఒళ్లంతా పసుపు పూసుకొని తలపై కిరీటం ధరించి, నెమలి పింఛాలను ధరించి, రెండు చేతుల్లో పొడవైన కత్తులను చాకచక్యంగా తిప్పుతూ సన్నాయి మేళానికి అనువుగా పాదం కదపాలి. ఒక్కో సమయంలో పూన కం వచ్చి వేష«ధారణలో కళాకారుడు స్పృహ కో ల్పోయిన సందర్భాలు కోకోల్లాలు. దరువుకు అనువుగా.. సాధారణంగా అమ్మవార్ల నృత్యాని కి పద్నాలుగు దరువులుగా డప్పు వాయిస్తారు. ఈ దరువులకు వేషధారణల్లో కళాకారులు వివిధ భంగిమల్లో తాండవం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. రెండు కత్తులతో గరిడీ దరువు, జులవా దరువు, వసంతమ్మోరు దరువు, భద్రకాళీ దరువు, జాలారీ దరువు, రాజమ్మ దరువు, మంకినమ్మ దరువు, దానప్ప దరువు, మూడు వరసల సవర దరువులతో పాటు మరికొన్ని సన్నాయి మేళం ద్వారా దరువులు వాయిస్తుంటారు. ఈ దరువులకు తగ్గట్టుగా కళాకారుడు ఉగ్ర రూపంలో నృత్యం చేస్తుంటాడు. నిష్టతో వేషధారణ ఆహార నియమాలు పాటి స్తూ నిష్టతో అమ్మవారి వేషధారణ చేస్తుంటాం. కేవలం చిన్న రంధ్రం నుంచే చుట్టూ చూస్తుంటాం. చుట్టూ వందలాది మంది ఉంటూ మమ్మల్ని ఉత్సాహపరుస్తుంటారు. ఆ సమయంలో మాలో పూర్తిగా ఆధ్యా త్మికత్వం నిండిపోతుంది. – కె.కోటేశ్వరరావు, నృత్య కళాకారుడు ఇదే ఉపాధి అమ్మవారి మేళం అంటే నాకు ఎంతో ఇష్టం. సరదా గా నేర్చుకున్న ఈ నృత్యం ఇప్పుడు నాకు ఉపాధి మార్గంగా మారింది. యువకుల్లో ఈ నాట్యంపై ఉన్న అపోహలు కూడా ఇప్పుడు పోయా యి. చాలా మంది నేర్చుకుంటున్నారు. – సురేష్ పండిట్, కాళీమాత నృత్య కళాకారుడు తరతరాలుగా.. మాది ఈదుపురం గ్రామం మా పూర్వీకుల నుంచి తరతరాలుగా ఈ ఆట కడుతున్నాం. ఉద్దానం ప్రాంతంలో చాలా మంది యువకులు ఇప్పుడు మంచి ఆటను ప్రదర్శిస్తున్నారు. – నారాయణ సాహూ, కాళికా ఉపాసకుడు, నృత్య కళాకారుడు -
ఏం జరిగిందో.. ఏ కష్టం వచ్చిందో..?
సాక్షి, ఇచ్ఛాపురం (శ్రీకాకుళం): ఏం కష్టం వచ్చిందోగాని వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మున్సిపాలిటీ పరిధి రత్తకన్న గ్రామం సంతోషం వీధిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకోగా.. ఈది జయలక్ష్మి (21) ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. జయలక్ష్మికి గత ఏడాది మే నెలలో ఒడిశా రాష్ట్రంలోని కోటిలింగి గ్రామానికి చెందిన మంచాల పితాంబర్‌తో వివాహమైంది. ఈమె తల్లిదండ్రులు చంద్రమ్మ, మోహనరావులు కొన్నేళ్ల క్రితం వివిధ ప్రమాదాల్లో మృతి చెందడంతో సోదరి, సోదరులు ఈది నాగమ్మ, రామయ్యలవద్ద పెరిగింది. ఈమె ఆదివారం సాయంత్రం అత్తవారింటి నుంచి కన్నవారిల్లైన సోదరింటికి వచ్చింది. అయితే ఏం జరిగిందోగాని.. సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో వంటగదిలో సీలింగ్ హుక్‌కి ఉరివేసుకొని మృతి చెందింది. చదవండి: (యువతిపై అత్యాచారం, హత్య.. కట్టెల కోసమని అడవిలోకి వెళ్లగా..) ఇంటికి వచ్చిన సోదరి హుక్‌కి వేలాడుతున్న జయలక్ష్మిని చూసి కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవారు అక్కడకు చేరుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సోదరి నాగమ్మ ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్ఐ వి.సత్యనారాయణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఉద్దానం గూనచారు.. తింటే వదల్లేరు
ఇచ్ఛాపురం రూరల్: ఉద్దానం ప్రాంతంలో చేసే విందుల్లో విశేష వంటకం ‘గూనచారు’. వేడివేడి అన్నంలో గూనచారు వేసుకుంటే ‘ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి’ అంటూ పాట పాడక తప్పదు. ఈ వంటకం అంత రుచికరంగా ఉంటుంది మరి. అరచేతికి అంటిన గూనచారు వాసన వారం రోజులపాటు పోదంటే అతిశయోక్తి కాదు. శ్రీకాకుళం జిల్లాలో ‘భోజీ పులుసు’గా పిలిచే గూనచారు కేవలం ఉద్దానం ప్రాంతానికే సొంతం. మట్టి బాన (పెద్ద కుండ)లో తయారు చేసే ఈ చారు 10 నుంచి 15 రోజులపాటు నిల్వ ఉంచినా చెక్కు చెదరకుండా.. రంగూ, రుచి పోకుండా అంతే రుచిగా ఉంటుంది. ఈ చారును ఉద్దానం వాసులు ఇతర రాష్ట్రాల్లో ఉండే మిత్రులు, బంధువులు, సహోద్యోగులకు పంపిస్తుంటారు. పోషకాల రారాజు గూనచారులో అన్నిరకాల పోషక విలువలు ఉంటాయని విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ పూడి రామారావు తెలిపారు. ముఖ్యంగా ఇందులో ఏ, బీ, సీ, డీ, కే విటమిన్లు ఉంటాయని చెప్పారు. ఇది క్యాన్సర్ నిరోధకంగా పని చేస్తుందని.. రక్తహీనతను తగ్గించే ఔషధ గుణాలు, నరాల బలహీనతను తగ్గించే గుణాలు, వీర్యకణాల వృద్ధి, ఐరన్, మాంసకృత్తులు, శరీర నిర్మాణానికి అవసరమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయని ఆయన వివరించారు. గూనచారు ఎసిడిటీని రూపుమాపుతుందని పేర్కొన్నారు. ఇలా తయారు చేస్తారు ► మొదట చింతపండు నానబెట్టి రసం తీయాలి. ఆ రసాన్ని కనీసం గంటపాటు బానలో మరిగించాలి. మరిగించిన రసంలో బెల్లం, పసుపు పొడి, కారం, అరటి ముక్కలు, మునగ, పనస ఇత్యాది కూర ముక్కలు కలపాలి. ► ఇలా తయారైన రసాన్ని మరో గంటసేపు మరిగించాలి. అందులో బాగా వేయించిన బియ్యం పిండిని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ► పోపు పెట్టడం చాలా ముఖ్యమైన ఘట్టం. మొదటిగా వంటనూనెను పావుగంట మరిగించాలి. తరువాత ఉల్లికి గాట్లు పెట్టి ఆ నూనెలో వేసి బాగా వేయించాలి. తర్వాత ఎండుమిరప కాయల్ని దోరగా వేయించాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి ముద్దలు వేయాలి. ఈ పోపు కార్యక్రమం ఇంచుమించు గంటసేపు సాగాలి. ► తయారైన పోపుని బియ్యం పిండి కలిపి, మరిగించిన చింతపండు రసంలో కలిపి తగినంత ఉప్పు, కారం పొడి అందులో వేయాలి. ఆ తరువాత బానపై మూతపెట్టి అరగంట సేపు ఉంచాలి. అంతే.. భోజీ పులుసు అదేనండీ.. అదే ఉద్దానం ‘పేటెంట్’ గూనచారు తయార్. మామూలుగా ఉండదు ఉద్దానం ప్రాంతంలో వివిధ ఫంక్షన్లకు ప్రత్యేకంగా తయారు చేసే గూనచారు మామూలుగా ఉండదు. నాకెంతో ఇష్టమైన వంటకం ఇది. ఉద్యోగరీత్యా ఇతర దేశంలో ఉన్న నేను స్వదేశానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ చారును తయారు చేయించుకుని విందారగిస్తాను. స్థానికంగా దొరికే మసాలా దినుసులతో తయారు చేసే ఈ చారును ఇతర రాష్ట్రాల్లోని వారికి ఉద్దానం వాసులు బహుమతిగా పంపిస్తుంటారు. ఇప్పటివరకు నేను ఎన్నో రాష్ట్రాలు, దేశాలు తిరిగినప్పటికీ ఉద్దానం ప్రాంతంలో తయారు చేసే గూనచారును ఎక్కడా చూడలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉద్దానం పేటెంట్ గూనచారు. – తిప్పన శంకరరావురెడ్డి, ప్రవాసాంధ్రుడు, తిప్పనపుట్టుగ, ఇచ్ఛాపురం మండలం ఫంక్షన్లలో భలే డిమాండ్ మా తాతల కాలం నుంచీ ఉద్దానం ప్రాంతంలో జరిగే ప్రతి ఫంక్షన్లో గూనచారు వండాల్సిందే. చింతపండు, బెల్లం, పనస పొట్టుతో ప్రత్యేకంగా తయారు చేసే ఈ చారు చాలా రుచికరంగా ఉంటుంది. పెళ్లిళ్ల సీజన్లో మాకు చాలా డిమాండ్ ఉంటుంది. దీనిని చాలా జాగ్రత్తగా తయారు చేయాలి. ముఖ్యంగా చింతపండు, బెల్లం, ఉల్లిపాయలతో తయారు చేసే పాకం బాగుండాలి. చారు వాసన సుమారు అర కిలోమీటరు వరకు వ్యాపిస్తుంది. 15 రోజులపాటు నిల్వ ఉంచుకుని దర్జాగా తినొచ్చు. – దున్న ఢిల్లీరావు, గూనచారు తయారీదారు, బూర్జపాడు, ఇచ్ఛాపురం మండలం -
అచ్చెన్న ఎత్తులు చిత్తు, రెండు చోట్లా పరాభవం
సాక్షి, శ్రీకాకుళం: పలాస–కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఒక ఎంపీ, మరో ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లాలోని మిగతా మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ ప్రతినిధులు దృష్టి సారించారు. ఎన్నికల ఆద్యంతం అక్కడే తిష్ట వేశారు. ఫోన్లో బెదిరింపులకు దిగారు. నేరుగా బేరసారాలు సాగించారు. అక్కడితో ఆగకుండా పెద్ద ఎత్తున డబ్బును సమకూర్చి దగ్గరుండి పంపిణీ చేయించారు. ఎలాగైన గెలవాలని విశ్వప్రయత్నాలు చేశారు. కానీ ప్రజలు వాటిన్నింటినీ తిప్పికొట్టారు. జిల్లాలో పలాస, ఇచ్ఛాపురం, పాలకొండలో ఎన్నికలను టీడీపీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వీటిపైనే ఎక్కువ దృష్టిసారించారు. పోలింగ్ వరకు తమ శక్తియుక్తులన్నీ ప్రదర్శించారు. అచ్చెన్నతో పాటు ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర్ శివాజీ, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌతు శిరీష, మిగతా మాజీ ఎమ్మెల్యేలంతా టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం అడ్డదారులు తొక్కారు. కానీ జనం మాత్రం వైఎస్సార్ సీపీ వైపే నిలబడ్డారు. నిజంగా ఇది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి ఘోర పరాభవమే. ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌కు కూడా చావు దెబ్బ వంటిదే. పంచాయతీ ఎన్నికల్లోనూ కళా వెంకటరావు వంటి వారు ఎంత ప్రయత్నించినా గెలవలేకపోయారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముందు కుట్రలు, కుతంత్రాలు నడవవని ఈ ఎన్నికలు రుజువు చేశాయని వైఎస్సార్సీపీ నేతలు భావిస్తున్నారు. పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు, పాలకొండలో విశ్వాసరాయి కళావతి, పాలవలస విక్రాంత్, ఇచ్ఛాపురంలో పిరియా సాయిరాజ్, నర్తు రామారావు తదితర నేతలే బాధ్యత తీసుకుని గెలిపించారు. చదవండి: గూగుల్ పే ఉందా.. అయితే డబ్బులు పంపండి చిన్నారి ఉసురు తీసింది.. కుక్కలు, కోతులా? హత్యా? -
కన్నీటితో కడుపు నింపలేక..
మందులు కొనడమనే మాట మర్చిపోయి అన్నం పెడితే చాలు అనుకునే స్థితికి వచ్చారు. ఆస్పత్రికి తీసుకెళ్లాలనే ఆలోచన వదిలేసి ఆ పూటకు కడుపు నింపితే అదే పదివేలు అనుకుంటున్నారు. పిల్లలు పుట్టడం, వారు చక్కగా ఎదగడం.. పేదల బతుకుల్లో కనిపించే సంతోషాలివే. కానీ ఆ దంపతులకు ఈ సంతోషం కూడా మిగల్లేదు. కడుపున పుట్టిన బిడ్డ కదల్లేక మంచంపై పడి ఉంటే కనీసం చికిత్స కోసం ఆలోచన చేయలేని దుస్థితి వారిది. కూలికి ఒకరు.. బిడ్డ వద్ద కాపలాకు మరొకరుగా ఉంటూ బతుకీడుస్తున్నారు. కూలి డబ్బులతో కుటుంబం గడవడం కష్టమవుతున్న తరుణంలో బిడ్డ భవిష్యత్ కోసం చేతులు చాచి సాయం కోరుతున్నారు. శ్రీకాకుళం ఇచ్ఛాపురం మండలంలోని కొఠారి గ్రామానికి చెందిన దువ్వు తులసయ్య, తోయమ్మ దంపతులు చేస్తున్న అభ్యర్థన ఇది. సాక్షి, ఇచ్ఛాపురం : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం కొఠారీ గ్రామానికి చెందిన దువ్వు తులసయ్య, తోయమ్మలకు పుట్టిన ఒక్కగానొక్క కొడుకు మోహనరావు. కొడుకు పుట్టగానే తమకు వంశోద్ధారకుడు పుట్టాడన్న సంతోషంతో ఆ దంపతులు మురిసిపోయారు. 7వ తరగతి వరకు ఎంతో చలాకీగా ఉన్న మోహనరావు ఆ తర్వాత ఒక్కసారిగా నీరసించిపోయాడు. కాళ్లు ముందుకు పడకపోవడం, చేతుల్లో చలనం లేకపోవడంతో మంచానికే పరిమితమైపోయాడు. కూలి చేసుకుని బతికే ఆ దంపతులకు కొడుకు పరిస్థితి అర్థం కాలేదు. అప్పులు చేసి మరీ విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, బరంపురం ఆస్పత్రులకు తిప్పారు. అయినా ఫలితం కనిపించలేదు. రోజూ కూలి పనికి వెళ్తే గానీ వారి కడుపు నిండదు. ఇలాంటి పరిస్థితుల్లో రూ. లక్షలు ఖర్చు పెట్టి కుమారుడికి చికిత్స చేయించడం వారికి అసాధ్యమైపోయింది. ఎదిగొచ్చిన కొడుకుకు తల్లి తోయమ్మ చిన్నపిల్లాడిలా సపర్యలు చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో 64 శాతం అంగ వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం ఉండగా,స్థానిక టీడీపీ నేతలు కేవలం వెయ్యి రూపాయలు పింఛన్ ఇప్పించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివ్యాంగులకు రూ.3 వేలు అందిస్తున్నారు. అయితే తల్లిదండ్రులిద్దరూ ఒకప్పుడు కూలికి వెళ్లేవారు. కానీ మోహనరావు పరిస్థితి మారినప్పటి నుంచి ఒకరు బిడ్డ వద్ద ఉంటే మరొకరు పనికి వెళ్తున్నారు. ఒకరి కూలి డబ్బులతో కుటుంబం గడవడం, మోహనరావుకు మందులు కొనడం సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దంపతులు సాయం కోరు తున్నారు. బిడ్డ భవిష్యత్‌ను కాపాడడానికి దాతలు చేయూతనిస్తారని ఆశ పడుతున్నారు. సాయమందించాలనుకునే వారు 90590 67952 నంబరును సంప్రదించాలని కోరుతున్నారు. -
సోంపేట బహిరంగ సభలో వైఎస్ విజయమ్మ
-
మీ కోసం పుట్టిన పార్టీ : వైఎస్ విజయమ్మ
సాక్షి, శ్రీకాకుళం : గత ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటైనా నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. చంద్రబాబు మాయమాటలు, తీపి మాటలు విని మోసపోవద్దని ప్రజలకు సూచించారు. డ్వాక్రా మహిళలు, రైతులు, నిరుద్యోగుల ఇలా ప్రతి ఒక్కరిని చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచిస్తున్న వైఎస్ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని వైఎస్ విజయమ్మ కోరారు. వైఎస్సార్సీపీ ప్రజల కోసమే పుట్టిందని.. ఇది అందరి పార్టీ అని అన్నారు. ఈ ఎన్నికల్లో ఇచ్చాపురం వైఎస్సార్సీపీ అభ్యర్థి పిరియా సాయిరాజ్, ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ను భారీ మెజారిటీతో గెలిపించి వైఎస్ జగన్‌కు ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేటలో జరిగిన ప్రచారసభలో ఆదివారం విజయమ్మ ప్రసంగించారు. ఆమె ఏం మాట్లాడారంటే.. ఒక్క హామీ అయిన నేరవేర్చారా? గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 600 వాగ్దానాలు ఇచ్చారు. వాటిల్లో ఒక్క హామి అయినా నెరవేర్చారా? ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామన్నారు. తెరిచారా? డ్వాక్రా అక్క చెల్లమ్మలకు రుణమాఫీ జరిగిందా? రెండు రూపాయలకే ఇరవైలీటర్ నీళ్లు ఇస్తామన్నారు. ఇచ్చారా? బ్రాందీ షాపులు రద్దు చేస్తామన్నారు. రద్దు చేసారా? నీళ్లు ఇవ్వడం లేదు గాని మద్యం మాత్రం అందుబాటులో ఉంచారు. ప్రతి ఇంటికి రెండువేల రూపాయిలు నిరుద్యోగ భృతి ఇస్తా మన్నారు. ఇచ్చారా? బాబు వస్తే జాబు వస్తుంది అన్నారు. ఒక్కటైనా వచ్చిందా? వీటిపై ప్రజలు ఆలోచన చేయాలి. వైఎస్సార్ పాలన ఒక్కసారి గుర్తుచేసుకోండి.. ఈ రోజు ప్రతి ఒక్కరిని రాజశేఖరరెడ్డిగారి పాలనను గుర్తు చేసుకోమని అడుగుతున్నా. ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకం గుర్తు చేసుకోమని కోరుతున్నా. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, పంటలకు గిట్టుబాటు ధరలు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీకే రుణాలు, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు.. ఇలా ప్రతి ఒక్కటీ గుర్తు చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టమని మీ అందర్నీ కోరుతున్నా. రైతే రాజుగా చేశాడు. మళ్లీ జగన్ బాబు అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం వస్తుంది. 9 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిదో చూస్తున్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి. రాజన్న రాజ్యం తీసుకొస్తాడు. ఈ ఎన్నికల్లో ఇచ్చాపురం వైఎస్సార్సీపీ అభ్యర్థి పిరియా సాయిరాజ్, ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌లను భారీ మెజారిటీతో గెలిపించండి’ అని విజయమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
ప్రజాసంకల్పయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నాను
-
ఇడుపులపాయ టూ ఇచ్ఛాపురం @ 3648 కీ.మీ
-
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో జనసందోహం
-
కీడ్నీ బాధితులకు ప్రత్యేకంగా పెన్షన్
-
గ్రామంలో చదువుకున్న పది మందికి ఉద్యోగాలు
-
ప్రతి పార్లమెంట్‌ను జిల్లాగా చేస్తాం
-
రైతుల తరపున ఇన్సూరెన్స్‌ను ప్రభుత్వమే చెల్లిస్తుంది
-
యాత్ర ముగిసినా..పోరాటం కోనసాగుతుంది
-
ముగిసిన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర
-
చంద్రబాబు ప్రభుత్వాన్ని నేలమట్టం చేస్తాం
సాక్షి, ఇచ్చాపురం: ‘నిన్నటి దినం ప్రజాసంకల్ప యాత్ర.. రేపు వైఎస్ జగన్ పట్టాభిషేక యాత్ర. ఈ ప్రజాసంకల్పయాత్ర ఇంత పెద్దఎత్తున విజయవంతం కావడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, దివంగత నేత వైఎస్సార్ కుటుంబాన్ని ప్రేమించే ప్రతీ అభిమానీ ఆశీస్సులే..’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభలో పాల్గొన్న ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై, టీడీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. ‘పేద రైతు కుటుంబానికి చెందిన నాలాంటి వాడిని ఎమ్మెల్యే చేసిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిది. అయితే.. సంతలో పశువులను కొన్నట్టు 23 మంది ఎమ్మెల్యేలను కొన్న నీచ చరిత్ర చంద్రబాబుది. మరోసారి గెలవడానికి చంద్రబాబు తన అక్రమ సంపాదనతో ఓట్లను కొనడానికి ప్రయత్నిస్తాడు. కానీ జగన్ సునామీలో చంద్రబాబు అక్రమ సంపాదన కొట్టుకపోవడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను గెలిపించడానికి మా ధన మాన ప్రాణాలను లెక్క చేయం. అక్రమ సంపాదనతో చంద్రబాబు అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు, పార్టీ కార్యకర్తల సహాయంతో నేలమట్టం చేద్దాం’అంటూ రాచమల్లు ఉద్ఘాటించారు. -
పోరాటం కొనసాగుతూనే ఉంటుంది: వైఎస్ జగన్
చరిత్రాత్మక ప్రజాసంకల్పయాత్ర ముగిసిన సందర్భంగా ఇచ్ఛాపురం పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.. ఆయన ఏమన్నారంటే.. యుద్ధం నారాసురుడు ఒక్కడితోనే కాదు.. ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు పాలించాలనేది నాకున్న సంకల్పం. నా పాలన చూసి.. నాన్న ఫోటోతోపాటు నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలన్నది నా ఆశ . నవరత్నాలను ప్రతి ఇంటికీ చేర్చి.. వాటి మేలును ప్రతి ఒక్కరికీ చెప్పండి. అవి జనంలోకి తీసుకెళితే.. చంద్రబాబు నాయుడు ఎంత డబ్బులిచ్చినా.. ప్రజలు ఓటు వేయరు. ఈ 14 నెలలు పేదవాడితోనే ఉన్నాను. వారి కష్టాలు వింటూనే.. వారికి భరోసా ఇస్తూనే నడిచాను. ప్రతి పేద వాడికి మంచి చేయాలనే తపన ఉంది. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు బయలుదేరిన మీ బిడ్డకు తోడుగా ఉండమని, ఆశీర్వదించమని కోరుతున్నాను. ప్రజాసంకల్పయాత్ర ఇంతటితో ముగుస్తున్నా.. పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఎన్నికలకు మూడు నెలల సమయం ఉంది. మనం యుద్దం చేసేది నారాసురుడి ఒక్కడితోనే కాదు ఎల్లో మీడియాతో కూడా యుద్ధం చేయాలి. జిత్తులు మారిన చంద్రబాబు అనేక పొత్తులు పెట్టుకుంటాడు. ప్రజల దీవెనలతో చంద్రబాబు మోసాలను, అన్యాయాలను జయిస్తా. చిలుకా గోరింకలు తలదించుకునేలా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 ఎమ్మెల్యేలను చంద్రబాబు సంతలో పశువులను కొన్నట్టు కొన్నారు. ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేసి నలుగురిని మంత్రులుగా చేశారు. ప్రత్యేక హోదాను ఖూనీ చేసి.. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేశాడు. టీడీపీ ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా కొనసాగారు. నాలుగేళ్లు హోదా ఇవ్వకపోయినా చంద్రబాబు బీజేపీని పొగిడారు. ప్రత్యేక హోదాను వెటాకారం చేస్తూ అసెంబ్లీలో మాట్లాడారు. హోదా కోసం పోరాడితే జైల్లో పెట్టిస్తానని అంటారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అని హోదా కోసం మాట్లాడేవారిని ప్రశ్నించారు. చిలుక, గోరింకలు తలదించుకునేలా టీడీపీ, బీజేపీ ప్రేమ కొనసాగింది. ఎన్నికలు వచ్చేటప్పటికీ రంగులు మారుస్తున్నారు. ఎన్నికలకు మూడు నెలలు ముందే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొస్తారు. ఎన్నికల దగ్గరకు వచ్చే సమయానికి రాష్ట్ర సమస్యలను వదిలేసి మీడియా మేనేజ్మెంట్ చేస్తున్నారు. ప్రజలకు ఏం చెయ్యకపోయినా.. చేసినట్లు ఎల్లో మీడియా గ్లోబెల్ ప్రచారం చేస్తుంది. చెడిపోయిన రాజకీయ వ్యవస్థని మార్చాలంటే.. చెడిపోయిన రాజకీయ వ్యవస్థని మార్చాలంటే జగన్‌కు మీ అందరి దీవెనలు కావాలి. రాబోయే రోజుల్లో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తాం. కలెక్టర్లు ఏడు నియోజకవర్గాలకే బాధ్యుడిగా ఉంటే.. ప్రజలకు అందుబాటులో ఉంటారు. కలెక్టర్ల వ్యవస్థను పూర్తిగా ప్రజల వద్ద తెచ్చేందుకు ఏపీలో 13 జిల్లాల స్థానంలో 25 జిల్లాలను ఏర్పాటుచేస్తాం. సమస్యలు పరిష్కరించేందుకు గ్రామ సచివాలయాలు ఏర్పాటుచేస్తాం. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామానికి చెందిన పది మందికి ఉద్యోగాలు ఇస్తాం. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను గుర్తించేటప్పుడు.. పార్టీలను చూడం. అర్హత ఆధారంగానే లబ్ధిదారులను గుర్తిస్తాం. ప్రతి గ్రామంలోనూ 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వాలంటరీగా నియమిస్తాం. గ్రామ వాలంటీర్లకు రూ. 5వేల చొప్పున జీతాలు ఇస్తాం. ప్రతి ప్రభుత్వ పథకం మీ ఇంటికి వచ్చేవిధంగా చూస్తాం. రేషన్ బియ్యం సైతం డోర్ డెలివరీ చేస్తాం. జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా.. గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా రాజ్యం నడుస్తుంది. రేషన్‌కార్డు, ఇల్లు సహా.. చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదైనా మంజూరు చేయాలంటే మీరు ఏ పార్టీ వారని అడుగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందురులో పెన్షన్‌కోసం వృద్ధులు కోర్టుకు వెళ్లే దారుణమైన పరిస్థితి నెలకొంది. గ్రామ స్వరాజ్యం లేని జన్మభూమి కమిటీలను నడుపుతున్నారు. అంబులెన్స్ లేక.. గర్భిణీ బస్సులోనే ప్రసవించారు విజయనగరం జిల్లా గరివిడి మండలంలో ఓ ఘటన నాకు ఎదురైంది. గర్భిణీ పురిటి నొప్పులు వస్తున్నాయని ఫోన్ చేస్తే.. టైర్ పంక్చర్ అయిందని 108 సిబ్బంది చెప్పారు. అంబులెన్స్ లేకపోవడంతో ఆ గర్భిణీ బస్సులోనే ప్రసవించారు. రాష్ట్రంలో పేదవాడికి వైద్యం అందడం లేదు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. ఉద్దానంలో 4వేల మంది కిడ్నీ బాధితులుంటే.. ప్రభుత్వం 1400 మందికి మాత్రమే సాయం చేస్తుంది. 370 మందికి మాత్రమే పెన్షన్లు అందుతున్నాయి. డయాలసిస్ పేషెంట్లకు ముష్టి వేసినట్లు 2500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. బినామీలో కోసం విద్యారంగాన్ని బాబు నాశనం చేశాడు కవిటి మండలంలో అమ్మాయిలు చదివే జూనియర్ కాలేజీల్లో బాత్రూమ్లు లేకపోవడం దారుణం. చంద్రబాబు తన బినామీల కోసం విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారు. చంద్రబాబు ముక్యమంత్రి అయ్యాక ఆరువేల ప్రభుత్వ పాఠశాలలు మూయించివేశారు. ఎస్సీ, బీసీ, ఎస్టీల హాస్టళ్లను మూసివేయించారు. మధ్యాహ్న భోజన పథకానికి ఆరు నెలలుగా బిల్లులు చెల్లించలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలానికి చెందిన గోపాలన్న నన్ను కలిశారు. అక్కడ ఫ్లెక్సీలో ఉన్న వ్యక్తి తన కొడుకు అని, తాను ఫీజులు కట్టలేకపోవడంతో ఇంజినీరింగ్ చదువుతున్న తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. డ్వాక్రా మహిళలను కోర్టు మెట్లు ఎక్కించారు.. విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో డ్వాక్రా మహిళలను కోర్టు మెట్లు ఎక్కించారు. డ్వాక్రా సంఘాల మహిళలపై బ్యాంకు సిబ్బంది దాడులు చేస్తున్నారు. వడ్డీలు కట్టేందుకు అక్కాచెల్లమ్మలు తాళిబోట్లు తాకట్టు పెట్టే దుస్థితి నెలకొంది. 2016 నుంచి డ్వాక్రా సంఘాల వడ్డీలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఉద్యోగాలు లేవు.. ఉన్న ఉద్యోగాలు గోవిందా.. చంద్రబాబు హయంలో ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతి లేదు. నిరుద్యోగ యువత నిరాశలో ఉన్నారు. బాబు వచ్చాడు కానీ.. జాబు రాలేదని నిరుద్యోగులు నన్ను కలిశారు. విభజన సమయానికి లక్షా 42వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో 90వేల మేర ఖాళీలు ఏర్పడ్డాయి. మొత్తం దాదాపు 2లక్షల 20వేల ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగాన్ని కుడా భర్తీ చేయలేదు. 30వేల ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా.. గృహ నిర్మాణ శాఖలో 3500మంది ఉద్యోగాలు గోవిందా.. గోపాలమిత్ర ఉద్యోగాలు గోవిందా.. ఆయూష్‌లో పనిచేస్తున్న 30వేల మంది ఉద్యోగాలు గోవిందా.. మధ్యాహ్నం భోజనం పథకంలో పనిచేస్తున్న 85వేల మంది ఉద్యోగాలు గోవిందా.. బెంగళూరులో కాఫీ.. చెన్నైలో ఇడ్లీ సాంబార్..! రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంటే.. చంద్రబాబు మాత్రం రాజకీయాలే ముఖ్యమనుకుంటున్నారు. జాతీయ రాజకీయాలంటూ చంద్రబాబు బెంగళూరుకు వెళ్లి.. కుమారస్వామితో కాఫీ తాగారు. కానీ కర్ణాటక పక్కనే ఉన్న అనంతపురం జిల్లా రైతుల పరిస్థితి ఆయనకు గుర్తుకురాలేదు. మరోవైపు చంద్రబాబు చెన్నై వెళ్లి స్టాలిన్‌తో ఇడ్లీ సాంబార్ తిన్నారు. కానీ పక్కనే ఉన్న తన సొంత జిల్లా చిత్తూరు రైతుల గురించి ఆయన పట్టించుకోరు. విమాన చార్జీలు ప్రభుత్వమే భరిస్తోంది కదా అని ఆయన పశ్చిమ బెంగాల్ వెళ్లి మమతను కలుస్తారు. కానీ, ఆయనకు రాష్ట్రంలోని రైతుల దుస్థితి కనిపించడం లేదు. వైఎస్సార్ హయాంలో ఏపీలో 42.70 లక్షల హెక్టార్ల పంటసాగు ఉంటే..చంద్రబాబు హయాంలో 40 లక్షల హెక్టార్లకు పడిపోయింది. అందుకే ఏపీలో పర్జలు చంద్రబాబును ‘నిన్ను నమ్మం బాబు’ అంటున్నారు. నాబార్డ్ నివేదిక ప్రకారం దేశంలోనే రైతు అప్పుల విషయంలో ఏపీ రెండో స్థానంలో ఉంది. రుణమాఫీ పేరుతో చద్రబాబు చేసిన దగాకు వడ్డీలు పెరిగిపోయి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వడ్డీలేని రుణాలు కూడా రైతులకు అందడం లేదు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. తన హెరిటేజ్ కోసం చంద్రబాబు దళారీలకు కెప్టెన్ అయ్యారు. రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి.. మూడింతలు ధరలు పెంచి తన హెరిటేజ్‌లో చంద్రబాబు అమ్ముతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటివరకు తెరవలేదు. పలాస జీడిపప్పు రైతులు కేజీ 650 రూపాయలకు కూడా అమ్ముకోలేకపోతున్నారు. చంద్రబాబు మాత్రం హెరిటేజ్‌లో జీడిపప్పు కిలో 1100 రూపాయలకు అమ్ముతున్నారు. రైతు శివన్న గురించి.. అనంతపురంలో శివన్న అనే రైతు కలిశారు. శివన్న పొలంలో వేరుశనగ వేశానని చెప్పాడు. పంట ఎలా ఉందని అడిగితే.. బాబు రాగానే కరువు వచ్చిందన్నారు. అనంత పర్యటనకు చంద్రబాబు వచ్చినప్పుడు సాయం అడిగామన్నారు. కరువుతో ఎండిపోతున్నాం సాయం చేయమంటే.. చంద్రబాబు అయ్యో నాకు కరువు గురించి తెలియదు అని అధికారులపై మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో వ్యవసాయం కుదేలైన పరిస్థితిని కళ్లకు కట్టేలా శివన్న చెప్పారు. రెయిన్ గన్లతో ప్రభుత్వం రైతులను మభ్యపెట్టిన తీరును శివన్న నాకు వివరించారు. అందుకే రైతులు నిన్న నమ్మం బాబు అంటున్నారు. ప్రజల గుండె చప్పుడును నా గుండె చప్పుడుగా మార్చుకున్నా పాదయాత్రలో ఎంతమందిని కలిశాం.. ఎంతమందికి భరోసా ఇచ్చామన్నదే ముఖ్యం నాలుగున్నరేళ్లలో బాబు పాలన ఎంత ఘోరంగా ఉందో ప్రజలు చెప్పారు. కరువు, నిరుద్యోగం వీటికి తోడు చంద్రబాబు మోసం ప్రజల పాలిట శాపంగా మారింది. ప్రజాసంకల్పయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నాను. ప్రజల గుండె చప్పుడును నా గుండె చప్పుడుగా మార్చుకున్నాను. 14 నెలలుగా 3648 కిలోమీటర్లు నేను నడిచినా.. నడిపించింది ప్రజలు.. పైనున్న దేవుడు. ఇచ్ఛాపురం: వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చాపురం పాత బస్టాండ్ బహిరంగ సభ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్ ఘాట్) నుంచి 2017 నవంబర్ 6వ తేదీన జననేత చేపట్టిన ‘ప్రజా సంకల్పయాత్ర’, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. మొత్తం 341 రోజుల పాటు సాగిన ప్రజాసంకల్పయాత్ర.. 134 నియోజకవరాగలు, 231 మండలాలు, 2,516 గ్రామాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్ల గుండా సాగింది. జననేత 55 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ఇప్పటివరకు 123 సభల్లో పాల్గొన్న వైఎస్ జగన్.. పాదయాత్రలో అఖరి బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. ఇచ్ఛాపురం: వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయసంకల్ప స్తూపాన్ని అవిష్కరించారు. అక్కడి ఆయన ఇచ్ఛాపురం పాత బస్టాండ్ వద్ద జరిగే సభాస్థలికి బయలుదేరారు. ఇప్పటికే లక్షలాది మందితో సభాస్థలి కిక్కిరిసింది. జై జగన్ నినాదాలతో ఆ ప్రాతమంతా మారుమోగుతోంది. ఇచ్ఛాపురం: వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయసంకల్ప స్తూపం వద్దకు చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న సర్వమత ప్రార్థనల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఇచ్ఛాపురం చేరుకున్న అశేష ప్రజానీకం అడుగడుగునా వైఎస్ జగన్‌కు నీరాజనం పలుకుతున్నారు. ఇచ్ఛాపురం: వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్ఛాపురంలోని విజయసంకల్ప స్తూపాన్ని అవిష్కరించే క్షణం కోసం జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇచ్ఛాపురంతోపాటు పరిసర ప్రాంతాల్లో జనసందోహం నెలకొంది. 16వ నెంబర్ జాతీయరహదారి కిలోమీటర్ల మేర జనం బారులు తీరారు. పైలాన్ వద్దకు వైఎస్ జగన్ రాకకోసం లక్షలాది మంది జనం ఎదురు చూస్తున్నారు. ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాలు జగన్ నినాదాలతో మారుమోగుతున్నాయి. ఇచ్ఛాపురం: బాహుదా నదీ తీరంలో ఏర్పాటైన విజయసంకల్ప స్థూపం (పైలాన్)ను ఇచ్ఛాపురంలో కాసేపట్లో వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున అక్కడికి తరలివచ్చారు. పైలాన్‌ను వైఎస్ జగన్ ఆవిష్కరించే అపురూప క్షణాల కోసం తామంతా వేచిచూస్తున్నామని వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. స్థూపాన్ని ఆవిష్కరించిన తర్వాత కాలినడకన పాత బస్టాండ్ వద్దకు చేరుకుని భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. తిరుపతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతమైన సందర్భంగా యువజన విభాగం నేత భూమన అభినయ రెడ్డి నేతృత్వంలో తిరుపతిలోని అలిపిరి వద్ద పార్టీ శ్రేణులు కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కుసుమ కుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు ఇమామ్, రాజేంద్ర, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కర్నూలు: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర ముగింపు నేపధ్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. వైఎస్ సర్కిల్లో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాజా విష్ణు వర్దన్ రెడ్డి, నరసింహులు యాదవ్, తెర్నకల్ సురేందర్ రెడ్డి, రెహమాన్, మద్దయ్య, మున్నా తదితరులు పాల్గొన్నారు. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా పాణ్యం నియోజకవర్గంలోని షరీన్ నగర్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు విశ్వేశ్వర్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, ఫిరోజ్, బెల్లం మహేశ్వర రెడ్డి, సులోచన, శ్రీనివాసులు, విక్రమ్, డేవిడ్‌లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలతో అభిషేకం, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతపురం: వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ శ్రేణులు రాయదుర్గం మండలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి ఉడేగొళం మధ్యనేశ్వర స్వామి దేవాలయం వరకు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనయుడు కాపు ప్రవిణ్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూడేరు మండలం పి. నాగిరెడ్డిపల్లిలో సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. విడపనకల్లు మండలం డోనేకల్లులో వైస్సార్సీపీ నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. చిత్తూరు: ప్రజాసంకల్ప పాదయాత్ర ముగింపు సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు పురుషోత్తం రెడ్డి, చంద్రశేఖర్, రాహుల్ రెడ్డి,లీనారెడ్డిలు, ఇతర కార్యకర్తలు గాంధీ సర్కిల్లో కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా, వైఎస్ జగన్‌కు సంఘీభావం తెలియచేస్తూ పీలేరు, కలికిరి, కలకడ, వైవి పాలెం,గుర్రంకొండ, వాల్మీకి పురం మండలాలలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైఎస్సార్: జిల్లాలోని ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విజయవంతమైన సందర్భంగా సుండుపల్లి జెడ్పీటీసీ హకీం ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విజయవంతమైన సందర్భంగా రాయచోటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా బీసీ ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతపురం: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా ఎస్ కే యూనివర్సిటీ సమీపంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు, ఆకుతోటపల్లి గ్రామస్థుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. 101 టెంకాయలు కొట్టి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. నెల్లూరు: వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయవంతమైన సందర్భంగా రూరల్ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నాయకులు పిండి సురేష్, బొబ్బల శ్రీనివాస్ యాదవ్, కాకి వెంకటేశ్వర్లు భారీ కేక్‌ను కట్ చేశారు. మూడు నెలల్లో రాజన్న రాజ్యం రాబోతోందని, జిల్లాలో కచ్చితంగా 10 సీట్లు గెలుస్తామని బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా వైఎస్సార్ సీపీ విద్యార్ధి విభాగం నాయకులు విష్ణు వర్దన్ రెడ్డి, మేర్లపాక వెంకటేష్, సందీప్, రాజేష్, యశ్వంత్, బన్నీ,నాగరాజులు నాయుడుపేటలోని శ్రీ పోలేరమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, 101టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. విజయనగరం: ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు విజయనగరం నుంచి భారీగా జనం తరలి వస్తున్నారు. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు నెల్లిమర్ల వైఎస్సార్ సీపీ సమన్వయకర్త బడుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో నెల్లిమర్ల నియెజకవర్గం నుంచి భారీగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఇచ్ఛాపురం: వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రగా బయలుదేరి లొద్దపట్టి చేరుకున్నారు. అక్కడ వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు. వైఎస్సార్ సీపీ నేతలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. జననేతతో కలిసి నడవటానికి పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు అక్కడకు చేరుకున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న దారులన్నీ జనసంద్రంగా మారాయి. వైఎస్సార్: వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా కడప జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, ఎమ్మెల్యే అంజాద్ బాషా, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్‌లు పాల్గొన్నారు. గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతం అయిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో 3648 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైన రోజు పాదయాత్ర విజయవంతం కావాలని స్వామివారికి మొక్కుకున్నారు. పాదయాత్ర విజయవంతం కావడంతో కార్యకర్తలు స్వామి వారికి కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కు చెల్లించుకున్నారు. చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఇచ్ఛాపురం : విజయ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు పాడేరు సమన్వయ కర్త విశ్వేశ్వర రాజు ఆధ్వర్యంలో గిరిజనులు భారీగా ఇచ్ఛాపురానికి తరలి వచ్చారు.పాడేరు, జీకే వీధి, జీ మాడుగుల, కొయ్యురు మండలాల నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు భూసరి క్రిష్ణా రావు, లకే రత్నభాయ్,కోడా సురేష్, గాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం : పెందుర్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త అదీప్ రాజ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు కారు ర్యాలీ ద్వారా ఇచ్ఛాపురానికి బయలుదేరారు. జననేతకు జేజేలు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి విజయవంతంగా పూర్తి చేసిన రాజన్న తనయుడికి జనం జేజేలు పలికారు. సాక్షి టీవీ కేఎస్సార్ లైవ్ షోలో పలువురు మాట్లాడుతూ... జననేతకు అభినందనలు తెలిపారు. పాదయాత్రతో వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారని హైదరాబాద్‌కు చెందిన రాజ్యలక్ష్మి అనే మహిళ పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, కత్తితో దాడి చేసినా ప్రజాసంకల్పయాత్రను విజయవంతం చేయడం మామూలు విషయం కాదన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర తర్వాత జనసమ్మోహనరెడ్డిగా మారిపోయారని విస్సన్నపేటకు చెందిన జయకర్ ప్రసంశించారు. ప్రజాసంకల్పయాత్ర విజయసంకల్పయాత్రగా మారడంలో ఎటువంటి సందేహం లేదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని కడపకు చెందిన డాక్టర్ రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చివరిరోజూ అదే ఉత్సాహం: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలంలోని కొజ్జీరియా నుంచి చివరిరోజు పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభించారు. జననేత వెంట నడిచేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిందరినీ చిరునవ్వుతో పలకరించి ముందుకు సాగారు. చివరిరోజు పాదయాత్ర మొదలు పెట్టడానికి ముందు వైఎస్ జగన్ వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. జననేత పాదయాత్ర సాగుతున్న దారిలో యువత కోలాహలం కన్పిస్తోంది. దారులన్నీ జనసంద్రం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్ ఘాట్) నుంచి 2017 నవంబర్ 6న వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 341 రోజుల తర్వాత బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. జన నాయకుడి జైత్రయాత్రకు సంఘీభావంగా తరలివెళుతున్న జనంతో దారులన్నీ జనసంద్రంగా మారాయి. -
అన్ని దారులు ఇచ్ఛాపురం వైపే..
సాక్షి, విశాఖపట్నం: అందరి చూపులు అక్కడే... అన్ని దారులు అటువైపే.. వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలొస్తున్నాయ్ అన్నట్టుగా వేలు.. లక్షలు.. కోట్ల అడుగులు అటువైపు కదులుతున్నాయి. వజ్రసంకల్పంతో దాదాపు 14 నెలల పాటు సాగిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు పండగలో భాగస్వాములవ్వాలని ప్రతి ఒక్కరూ ఉత్తుంగ తరంగాల్లో ఉరకలెత్తు తున్నారు. ఈ మహోజ్వల ఘట్టానికి వేదికవుతున్న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వెళ్లేందుకు పార్టీలకతీతంతా జనసైన్యం కదులుతోంది. కదం తొక్కుతోంది. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గతేడాది నవంబర్ 6వ తేదీన చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారంతో ముగియనుంది. నిప్పులు చెరిగే ఎండను, కుండపోతవర్షాన్ని, వణికించే చలిని సైతం లెక్క చేయ కుండా మొక్కవోని సంకల్పంతో నగరాలు, పట్టణాలు, పల్లెలనే తేడాలేకుండా అలుపెరగకుండా సాగిన పాదయాత్ర నేటి మధ్యాహ్నంతో ముగియనుంది. ప్రజాసంకల్ప యాత్ర ముగింపును పురస్కరించుకుని ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేసిన 88 అడుగుల భారీ ఫైలాన్ ఆవిష్కరించి అనంతరం జరిగే భారీబహిరంగసభలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ మహోజ్వల ఘట్టంలో భాగస్వాములవ్వాలని విశాఖ వాసులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ చరిత్రాత్మక పాదయాత్ర ముగింపు పండుగలో పాల్గొనేందుకు జిల్లా వాసులు వేలాదిగా తరలి వెళ్తున్నారు. ఇచ్ఛాపురం, బరంపురం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, రైళ్లన్నీ మంగళవారం సాయంత్రం నుంచే కిక్కిరిసిపోయాయి. ఇప్పటికే అనకాపల్లి పార్లమెంటు కో ఆర్డినేటర్ వరుదు కళ్యాణితో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, శ్రేణులు ఇచ్చాపురానికి తరలి వెళ్లారు. పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, విశాఖ, అనకాపల్లి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు తైనాల విజయకుమార్, గుడివాడ అమర్నాథ్, విశాఖ సిటీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, పార్లమెంటు కో ఆర్డినేటర్లు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవిలతోపాటు అసెంబ్లీ కో ఆర్డినేటర్లు, పార్టీ, అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా, నియోజక వర్గ నేతలు బుధవారం తెల్లవారుజామున బయల్దేరి తరలి వెళ్తున్నారు. బస్సులు, కారులు, ప్రత్యేక వాహనాల్లో పార్టీ శ్రేణులతో పాటు పార్టీలకతీతంగా వివిధ వర్గాల ప్రజలు కూడా ఇచ్ఛాపురం తరలివెళ్తున్నారు. -
341వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, శ్రీకాకుళం: ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారిలో భరోసా నింపుతూ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తుది అంకానికి చేరింది. ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్ ఘాట్) నుంచి 2017 నవంబర్ 6వ తేదీన చేపట్టిన ‘ప్రజా సంకల్పయాత్ర’, బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనున్న సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం వైఎస్ జగన్ పెద్ద కొజ్జిరియా నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి లొద్దకుట్టి మీదుగా జననేత పాదయాత్ర ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర సాగుతుంది. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సూచకంగా ఏర్పాటు చేసిన విజయసంకల్ప స్తూపాన్ని జననేత ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి తన తండ్రి మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజాప్రస్థానం విజయస్తూపం, తన సోదరి షర్మిల చేసిన మరో ప్రజాప్రస్థానం స్తూపం మీదుగా ఇచ్ఛాపురం పాత బస్టాండ్ సెంటర్లో జరిగే బహిరంగ సభ ప్రాంతానికి వైఎస్ జగన్ చేరుకుంటారు. అక్కడ జననేత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడితో ఆయన చారిత్రాత్మకమైన పాదయాత్ర ముగుస్తుంది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. -
పర్యావరణాన్ని రక్షించే అభివృద్ధే కావాలి
ఇచ్ఛాపురం: పర్యావరణాన్ని రక్షించే అభివృద్ధి సమాజానికి అవసరమని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో రెండో రోజైన సోమవారం పర్యటించిన ఆయన తొలుత ఇచ్ఛాపురంలోని స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సోంపేట మండలంలోని థర్మల్ వ్యతిరేక పోరాటంలో చనిపోయిన వారి స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఉద్యమకారులు, బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యమకారుడు గున్న జోగారావు భార్య జగదాంబ మాట్లాడుతూ ఉద్యమంలో తన భర్త చనిపోయాడని, ఆ సమయంలో పరామర్శలకు వచ్చిన నేతలు పింఛను అందజేస్తామని, పిల్లకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఇచ్చిన హమీ నెరవేరలేదని పవన్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ చిత్తడి నేలలను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. థర్మల్ విద్యుత్ కర్మాగారాన్ని నిలుపుదల చేసేందుకు ఈ ప్రాంత ప్రజలు దేశ చరిత్రలో నిలిచిపోయేలా ఉద్యమం చేశారన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా చెరువులతో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగిపోయాయని, ఇలాంటి ప్రాంతంలోనూ ఆక్వా చెరువులు నిర్మించడం వల్ల పంటపొలాలకు నష్టం వాటిల్లుతోందన్నారు. ప్రభుత్వాలు చిత్తడి నేలల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ సంఘం నాయకులు డా. వై.కృష్ణమూర్తి, బి.ఢిల్లీరావు, శ్రీరామమూర్తి, బి.సుందరరావు, గంగాధర్ పట్నాయక్ ఉన్నారు. అనంతరం పవన్ పలాస పట్టణానికి చేరుకొని రాత్రికి అక్కడే బస చేశారు. -
ప్రధాన మంత్రిపై ఏపీ ప్రజలు విశ్వాసం కోల్పోయారు
-
చంద్రబాబు కూడా పార్టీ పెట్టలేదు.. కానీ!
సాక్షి, ఇచ్చాపురం : వచ్చే ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదో తెలియదని, అయితే ప్రజలను మాత్రం మోసం చేయనని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తమకు ఆర్గనైజేషన్ లేదని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ జనసైనికులంతా ఓ వ్యవస్థీకృత సంస్థలాగ పని చేస్తుందని తెలిపారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నిజంగా అమలవుతాయా అని అడిగితే.. తనను నమ్మాలంటూ ఏపీ సీఎం సూచించినట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఏర్పాటుచేసిన సభలో పవన్ మాట్లాడుతూ.. టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి అనుభవం ఉందని నమ్మానని.. టీడీపీ నుంచి ఏ పదవి, కాంట్రాక్టులు తాను కోరుకోలేదన్నారు. హామీలివ్వడం మాత్రం టీడీపీకి అలవాటైందని ఎద్దేవా చేశారు. ‘రాజకీయ పార్టీని స్థాపించడంలో చాలా కష్టాలుంటాయి. అంతేందుకు ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు సైతం పార్టీని స్థాపించలేదు. దివంగత నేత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే అందులోకి చంద్రబాబు వెళ్లారు. జనమే నా బలం. హెరిటేజ్‌లాగా నాకు ఓ సంస్థ అంటూ ఏదీ లేదు. అయినా ముందడుగు వేశాను. రెండేళ్లూ పనిచేశాక రాజకీయాలపై అవగాహన వచ్చింది. డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు. సేవ చేయడానికి వచ్చాను. మీ కష్టాలు అర్ధం చేసుకుంటాను. గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చారు. నెగ్గిన అనంతరం చంద్రబాబు వెనుకబడిన ఉత్తరాంధ్రకు అండగా ఉంటారని భావించా. కానీ అలా జరగలేదు. పుష్కరాలకు 2వేల కోట్లు ఖర్చు చేశారు. విదేశీ పర్యటనలకు టీడీపీ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ కిడ్నీ రోగులకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. సోంపేటలో రొయ్యల చెరువు పేరుతో కాలుష్యం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్లోనూ మొండిచేయి చూపారు. నేను మాత్రం సమస్యల మీద నిజాయితీగా మాట్లాడుతా, పోరాడుతా. ఇప్పటికీ శ్రీకాకుళం ఇంకా వెనుకబడి ఉంది. కిడ్నీ రోగుల కోసం హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యులను తీసుకొస్తే ఆ నివేదికను పక్కన పడేసారు. ఇష్టానికి మమ్మల్ని బెదిరిస్తే తిప్పికొడతాం. 3లక్షల మంది మత్స్యకారుల జీవితాలు అగమ్యగోచరంగా ఉన్నాయంటూ’ పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇచ్చాపురం నుంచి పవన్ పోరాట యాత్ర ప్రారంభం
-
ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
సాక్షి హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మాజీ ఎమ్మెల్యే ఎంవీ కృష్ణారావు అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని స్వగృహంలో బుధవారం మరణించారు. కృష్ణారావు నాలుగు పర్యాయాలు ఇచ్చాపురం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. కుటుంబీకులు గురువారం మధ్యాహ్నం ఫిల్మ్ నగర్‌లోని మహాప్రస్థానంలో ఎంవీ కృష్ణారావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కమ్యూనిస్ట్ నాయకుడి నుంచి పీహెచ్డీ వరకూ ఎంవీ కృష్ణారావుది కృష్ణా జిల్లా చిన్నతాళపర్రు. ఆయన 1936, డిసెంబరు 12న జన్మించారు. మండవ వీయన్న చౌదరి, లక్ష్మీభాయమ్మ తల్లిదండ్రులు. ఆయన విశాఖపట్నంలో ఉన్నత చదువు చదివారు. విద్యార్థి దశలోనే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. ఎస్ఎఫ్ఐలో చురుగ్గా వ్యవహరిస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయ శాఖకు ప్రధాన కార్యదర్శిగా, విశాఖ కమ్యూనిస్ట్ శాఖకు కార్యదర్శిగా వ్యవహరించారు. ఎమ్మెస్సీ పట్టా పొందిన ఆయన.. అస్సాంలోని గౌహతి విశ్వవిద్యాలయంలో ఆరున్నరేళ్ల పాటు రసాయనశాస్త్ర ఉపన్యాసకుడిగా పనిచేశారు. అదే యూనివర్సిటీలో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్కె బారువా వద్ద విటమిన్‘డి’పై పరిశోధన చేసి 1975లో పీహెచ్డీ పట్టా పొందారు. నిమిషానికి 700 పదాల వరకు చదివిన వివేకానందుడు, జాన్ కెన్నడీలను ఆదర్శంగా తీసుకొని తాను కూడా నిమిషానికి 600 పదాల వరకు చదివే నైపుణ్యాన్ని సాధించారు. పోరాటాల్లో చురుగ్గా.. ప్రజలకు చేరువగా వీయన్న చౌదరి ఎ1 రైల్వే కాంట్రాక్టర్‌గా ఉండటంతో తండ్రికి చేదోడు, వాదోడుగా ఉండాలని నిర్ణయించుకున్న ఎంవీ.. తన భార్య శేషమాంబతో కలసి ఇచ్ఛాపురంలో స్థిరపడ్డారు. ఉద్దానం ప్రాంతంలో రంగాల గెడ్డ, గొనామారీ గెడ్డ కాంట్రాక్ట్ పనులు చేపడుతూ ప్రజలకు దగ్గరయ్యారు. అప్పటి కృషికర్ స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే బెందాళం వెంకటేశ్వరశర్మ వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. 1980లో శ్రీకాకుళంలో ఓసీలుగా పరిగణనలో ఉన్న ‘రెడ్డి’గా పిలిచే.. వారు చేస్తున్న పోరాటంలో పాల్గొన్నారు. ప్రభుత్వంతో పోరాడి ‘రెడ్డిక’గా మార్చి వారిని బీసీలుగా పరిగణించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అనంతరం 1982 మార్చి 29న సినీనటుడు ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. రాజకీయ అరంగేట్రం 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున ఇచ్ఛాపురం నుంచి పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1987లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో మరోసారి గెలిచారు. అయితే ఆయన ఎన్టీఆర్ కటౌట్ పెట్టుకొని గెలిచినట్లు కోర్టు తీర్పు ఇవ్వడంతో.. 1994 ఎన్నికల్లో అర్హత కోల్పోయారు. దీంతో తన అనుచురుడు దక్కత అచ్యుత రామయ్యరెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకున్నారు. 1999లో మరో మారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996లో రాష్ట్ర ఖనిజాభివృద్ధి చైర్మన్‌గా, 2000లో ప్యానెల్ స్పీకర్‌గా, 1987 నుంచి 94 వరకు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. వైఎస్సార్సీపీలో చురుకైన పాత్ర 2004లో టికెట్ ఆశించినా టీడీపీ నాయకులు తిరస్కరించడంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సా ర్ మరణాంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీని సమర్థంగా నడిపించారు. మున్సిపాలిటీ, సాధారణ ఎన్నికల్లో చురుగ్గా పనిచేసి తన శిష్యుడు పికల పోలారావు కోడలు పిలక రాజలక్ష్మిని మున్సిపల్ చైర్‌పర్శన్‌గా, కంచిలి మండలానికి చెందిన మరో శిష్యుడు పలికల భాస్కరరావు కుమార్తెను జెడ్పీటీసీగా గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించారు. -
ఇచ్ఛాపురంలో బాల బాహుబలి!
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం పట్టణంలోని మహాలక్ష్మి ప్రైవేటు ఆస్పత్రిలో శనివారం ఐదు కిలోల బరువున్న మగ శిశువు జన్మించాడు. చిన్నాకుల వీధికి చెందిన తండా రాజేష్, జ్యోత్స్న దంపతులకు ఈ చిన్నారి జన్మించినట్లు వైద్యులు కోదండరామ్ తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారన్నారు. సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలు మూడున్నర కేజీలుంటే ఆశ్చర్యపోతారు. అలాంటింది ఐదు కిలోల బరువున్న బాలుడు జన్మించిన ట్టు తెలుసుకున్న స్థానికలు ఈ ‘బాల బాహుబలి’ని చూసేందుకు ఆసక్తి చూపారు. -
బొజ్జ గణపయ్య కింద పడి యువకుడు మృతి
వినాయకుడి నిమజ్జనం సమయంలో విగ్రహం కింద నీటిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణం సమీపంలోని బహుదానదిలో శనివారం అర్ధరాత్రి ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని ముత్యాలమ్మపేటకు చెందిన ఓ విగ్రహాన్ని నిమజ్జనం కోసం బహుదానది పాయకు తీసుకొచ్చారు. విగ్రహాన్ని నిమజ్జనం కోసం నీటిలో వదిలిన సమయంలో ముత్యాలమ్మపేటకు చెందిన బీటెక్ విద్యార్థి సురేష్‌రెడ్డి (21) విగ్రహం కింద పడి నీటిలో మునిగిపోయాడు. తోటి వారు గుర్తించి విగ్రహాన్ని తొలగించడానికి 20 నిమిషాల సమయం పట్టింది. అప్పటికే సురేష్‌రెడ్డి మృతి చెందాడు. -
కుక్క కాటుతో బాలుడికి తీవ్ర గాయాలు
ఆరు బయట ఆడుకుంటున్న బాలుడిని పిచ్చి కుక్క కరిచి తీవ్రంగా గాయపరిచింది. ఇచ్చాపురం పట్టణం ఉప్పాడ వీధికి చెందిన లక్ష్మీనారాయణ అనే రిక్షా కార్మికుని కుమారుడు ఈశ్వరరావు(6) సోమవారం ఉదయం తమ ఇంటి వద్ద ఇసుకలో ఆడుకుంటుండగా పిచ్చి కుక్క అతని వీపుపైన, దవడపైన కండ ఊడేలా కరిచింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
సబ్ ట్రెజరీ కార్యాలయంలో తనిఖీలు
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఉన్నతాధికారి మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సబ్ ట్రెజరీ కార్యాలయం సిబ్బంది తీరుపై అందిన ఫిర్యాదుల మేరకు విచారణ చేస్తున్నట్టు జిల్లా అసిస్టెంట్ ట్రెజరీ అధికారి రామనాథం తెలిపారు. కార్యాలయానికి వచ్చిన ఆయన రికార్డులను తనిఖీ చేయడంతోపాటు సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. -
అంతా.. అనుకున్నట్టే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మున్సిపాలిటీలను గెలుచుకునేందుకు తెలుగుదేశం పార్టీ అనుకున్నట్టే చేసింది. పంతాన్ని నెగ్గించుకుంది. మూడు పట్టణాలను తన ఖాతాలో వేసుకుంది. జిల్లా లో శ్రీకాకుళం, రాజాం, పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, పాలకొండ మున్సిపాలిటీలున్నాయి. వీటిలో మూడు నెలల క్రితం పలాస, ఇచ్ఛాపురం, పాలకొండ, అమదాలవల సలకు ఎన్నికలు జరిగాయి. కోర్టులో కేసులు ఉన్నందున శ్రీకాకుళం, రాజాం ఎన్నికలు నిలిచిపోయాయి. ఎన్నికలు జరిగిన నాలుగింటిలో మూడు మున్సిపాలిటీలను తెలుగుదేశం, ఒకటి వైఎస్సార్సీపీ దక్కిం చుకుంది. ఆమదాలవలసలో మాత్రం వైఎస్సార్సీపీ అధికస్థానాలను కైవసం చేసుకున్నా కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రకు ఆ పీఠం కూడా తెలుగుదేశం పార్టీకే వెళ్లిపోయింది. సార్వత్రిక ఎన్నికలు జరగడం, ప్రభుత్వం ఏర్పడడం జరిగిపోయినా మున్సిపల్ పగ్గాలు ప్రతినిధుల చేతికి రావడం ఆలస్యమయ్యాయి. ఈ క్రమంలో గురువారం ఎన్నికల అనంతరం సభ్యులతో ప్రమాణస్వీకారం కూడా చేయించడంతో ఈ ప్రక్రియకు తెరపడింది. పలాస, పాలకొండ మున్సిపాలిటీల్లో టీడీపీకి పూర్తి మేజారిటీ ఉండడంతో ఆ పార్టీ వారే అధ్య క్ష పీఠాలను అధిరోహించారు. ఆమదాలవలసలో కాంగ్రెస్ సభ్యులు అధికార పార్టీకి కొమ్ము కాయడంతో పీఠం టీడీపీ వశమైంది. ఇచ్ఛాపురం పీఠాన్ని చేజి క్కిం చుకునేందుకు అధికార పార్టీ ఎన్ని కుయక్తులు పన్నినా ఫలితం లేకపోయింది. సభ్యులంతా వైఎస్సార్‌సీపీవైపు చివరివరకూ నిలవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ రెండు కుర్చీలు అదే పార్టీకి దక్కాయి. ఇచ్ఛాపురంలో ‘దేశం’ కుళ్లు రాజకీయాలు ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో అధిక వార్డులు వైఎస్ఆర్ సీపీకే దక్కాయి. 23 వార్డులకు టీడీపీకి కేవలం ఎనిమిది రాగా, వైఎస్సార్సీపీకి 13 దక్కాయి. రెండు స్వతంత్రులకు లభించాయి. వైఎస్సార్సీపీ సభ్యులు చేజారిపోకుండా ఆ పార్టీ విప్ జారీ చేసింది. కానీ అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా ఎలాగైనా పురపాలిక పీఠం దక్కించుకునేందుకు కొద్దిరోజులుగా కుయుక్తులు పన్నుతూ వచ్చింది. ఒక్కో సభ్యునికీ రూ.15 లక్షల వరకూ ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ఇండిపెండెంట్లను తన వైపు తిప్పికొని అధిపత్యానికి సరిపడా సీట్లను వైఎస్సార్సీపీ నుంచి తెప్పించుకునేందుకు నానా పాట్లు పడింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డిపై ముందు నుంచీ ఉన్న అభిమానం, ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కించుకునేందుకు ఆ పార్టీ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఎన్ని చేసినా తాము పార్టీ ఫిరాయింపులకు దూరమేనంటూ పరోక్షంగా సంకేతాలు పంపించారు. చివరకు చైర్మన్, వైస్ చైర్మన్ రెండు పీఠాలు వైఎస్సార్సీపీకే దక్కాయి. కాంగ్రెస్ దౌర్భాగ్యం దేశం, రాష్ర్టంలోనూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్‌పార్టీ మున్సిపల్ అధ్యక్ష ఎన్నికలో టీడీపీతో కుమ్మక్కయింది. సార్వత్రిక ఎన్నికల్లోనూ కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన ఆ పార్టీ ఆమదాలవలసలో మునిసిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం అమ్ముడుపోయింది. అక్కడ మొత్తం 23 వార్డులకు ఎన్నికలు జరగ్గా టీడీపీ 8, వైఎస్సార్సీపీకి 10 వార్డులు దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి మూడు, స్వతంత్రులకు రెండు దక్కాయి. ఎన్నికలు ముగిసిన అనంతరం ఎవరిపనిలో వారుండగా ‘దేశం’ నేతలు మాత్రం మిగతా సభ్యుల్ని తనవైపు రప్పించుకునే పనిలో పడ్డారు. ఫలితంగా ఓ సభ్యుడు టీడీపీలోకి జారిపోయాడు. దీంతో ఆ పార్టీ బలం 9కి చేరింది. అయితే వైఎస్సార్సీపీపై ఉన్న అభిమానంతో మరో స్వతంత్రుడు ఆ పార్టీలోకి వెళ్లగా ఆ పార్టీ బలం మొత్తం 11కి చేరింది. ఇక్కడ కథ మారింది. వైఎస్సార్సీపీకి పీఠం దక్కకుండా చేసేందుకు టీడీపీ బేరాలకు దిగింది. కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని శిబిరాలకు తీసుకుపోయింది. గురువారం జరిగిన పాలకవర్గ ఎన్నికల్లోనూ భారీ ఆఫర్ ప్రకటించింది. ఒక్కో వ్యక్తికీ నజరానాగా లక్షల రూపాయలు ముట్టజెప్పడంతోపాటు వైస్ చైర్మన్ పదవినిస్తామంటూ కాళ్లబేరానికి దిగింది. దీంతో ముగ్గురు కాంగ్రెస్ వార్డు సభ్యులు టీడీపీకి మద్దతు పలికారు. ఫలితంగా చైర్మన్ పదవి టీడీపీకి చెందిన తమ్మినేని గీతకు దక్కగా వైస్ చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.వెంకట రాజ్యలక్ష్మికి నజరానాగా దక్కింది. మహిళలకే కిరీటాలు ఆకాశంలో సగం అన్న చందాన జిల్లాలో మున్సిపల్ పాలక వర్గాలు అత్యధికంగా మహిళలకే దక్కాయి. రాజకీయాల్లో ఇన్నాళ్లూ తెరచాటునే ఉన్న మహిళలు ఏకంగా పురపాలిక పీఠాల్నే అధిరోహించడం శుభపరిణామం. ఎన్నికలు జరిగిన నాలుగు మున్సిపాలిటీల్లో పలాస తప్పా ఇచ్ఛాపురం, పాలకొండ, ఆమదాలవలసల్లో మహిళలకే చైర్మన్ కిరీటాలు దక్కాయి. నాలుగు మున్సిపాలిటీల్లో పరిస్థితి ఇలా.. శ్రీకాకుళం సిటీ: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిస్థితి ఇలా ఉంది. ఇచ్ఛాపురంలో 23 వార్డులుండగా టీడీపీ ఎనిమిది, వైఎస్సార్సీపీ 13, స్వతంత్రులు ఇద్దరు విజయం సాధించారు. దీంతో వైఎస్సార్సీపీకి చెందిన పిలక రాజ్యలక్ష్మి చైర్మన్‌గా ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా అదే పార్టీకి చెందిన కాళ్ల శకుంతలను ఎనుకున్నారు. పలాసలో 25 వార్డులకు టీడీపీ 17, వైఎస్సార్సీపీ 8 స్థానాల్లో గెలిచింది. దీంతో టీడీపీకి చెందిన కోత పూర్ణచంద్రరావు చైర్మన్‌గా, అదే పార్టీకి చెందిన గురిటి సూర్యనారాయణ వైస్ చైర్మన్‌గా ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఆమదాలవలసలో మొత్తం 23 వార్డులున్నాయి. వీటిలో వైఎస్సార్సీపీ 10, టీడీపీ 8, కాంగ్రెస్ 3, స్వతంత్రులు 2 స్థానాల్లో గెలుపొందారు. అధ్యక్ష ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున బీ-ఫారం పొందిన బొడ్డేపల్లి అజంతాకుమారి చైర్పర్సన్ అభ్యర్థిగా రంగంలోకి దిగగా, టీడీపీ నుంచి తమ్మినేని గీత కూడా బరిలోదిగడంతో ఎన్నిక (చేతులెత్తే విధానం) అనివార్యమయ్యింది. వాస్తవానికి మెజార్టీ స్థానాలు టీడీపీకి లేకపోవడంతో కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు సభ్యుల మద్దతుతో పాటుగా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిలు కూడా ఓటింగ్‌లో పాల్గొన్నారు. టీడీపీ తరఫున మొత్తం 15 మంది మద్దతివ్వగా, వైఎస్సార్సీపీ సభ్యులు 10 మందితో పాటు స్వతంత్రుడితో సహా 11 మంది మద్దతిచ్చారు. దీంతో టీడీపీ అభ్యర్థి గీతకు అధ్యక్ష పీఠం దక్కింది. కీలకమైన మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి కానుకగా వైస్ చైర్‌పర్సన్‌గా కూన రాజ్యలక్ష్మికి టీడీపీ నేతలు అవకాశమిచ్చారు. పాలకొండలో ఉన్న 20 వార్డు స్థానాల్లో టీడీపీకి 12, వైఎస్సార్సీపీ 3, స్వతంత్రులు 5 గెలుచుకున్నారు. దీంతో టీడీపీకి చెందిన పల్లా విజయనిర్మల అధ్యక్షురాలుగా, వైస్ చైర్‌పర్సన్‌గా అదే పార్టీకి చెందిన శిరిపురపు చూడామణిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పార్టీ ఇచ్ఛాపురం పి.రాజ్యలక్ష్మి కె. శకుంతల వైఎస్సార్సీపీ పాలకొండ పి. విజయనిర్మల ఎస్. చూడామణి టీడీపీ పలాస కె.పూర్ణచంద్రరావు జి.సూర్యనారాయణ టీడీపీ ఆమదాలవలస టి.గీత (టీడీపీ) కె.వెంకట రాజ్యలక్ష్మి కాంగ్రెస్ -
ఇచ్ఛాపురంలో వైఎస్సార్ సీపీ పాగా
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ పిలక రాజ్యలక్ష్మి, వైస్ చైర్‌పర్సన్‌గా కె.శకుంతల ఎన్నికయ్యారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో టెక్కలి ఆర్డీవో శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ముందుకు సభ్యులందరితోనూ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వైఎస్సార్ సీపీకి చెందిన 13వ వార్డు కౌన్సిలర్ పిలక రాజ్యలక్ష్మి పేరును చైర్‌పర్సన్‌గా చదివివినిపించారు. ఆమెకు మద్దతుగా ఆ పార్టీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు చేతులెత్తారు. అనంతరం టీడీపీ అభ్యర్థి బుగత కుమారి పేరు ను ప్రస్తావించగా 11 ఓట్లు వచ్చాయి. (8 మంది టీడీపీ కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎమ్యెల్యే అశోక్, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఓటేశారు). దీంతో చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి పేరును ఖరారు చేశారు. వైస్‌చైర్‌పర్సన్‌గా వైఎస్సార్ సీపీకి చెందిన కాళ్ల శకుంతులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిద్దరికీ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అభినందనల వెల్లువ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లుగా ఎన్నికైన రాజ్యలక్ష్మి, శకుంతలను ఎన్నికల అధికారి శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ బి.అశోక్, సభ్యులతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు ధర్మాన కృష్ణదాస్, పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ ఇన్చార్జి రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, నర్తు రామారావు, శ్యాంప్రసాద్, నరేంద్రలు పుష్పగుచ్చాలతో అభినందించారు. చైర్పర్సన్ రాజ్యలక్ష్మి వైఎస్సార్ సీపీ మునిసిపల్ కన్వీనర్, మాజీ మునిసిపల్ చైర్మన్ పిలక పోలారావు కోడలు కాగా, వైస్‌చైర్‌పర్సన్ కాళ్ల శకుంతల పార్టీ నాయకుడు కాళ్ల దేవరాజ్ భార్య. రాజ్యలక్ష్మి (ఎమ్మెస్సీ) ఉన్నత విద్యావంతురాలు కావడంతో మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో నడుస్తుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు సంబరంగా మున్సిపల్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి, అక్కడ దివంగత ముఖ్యమంత్రి ైవె .ఎస్. రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. -
ఇంతకీ చంద్రబాబు సాధించిందేమిటి?
టీడీపీ ఎన్నికల పొత్తు అనే కొండను తవ్వింది. ఇచ్ఛాపురం అనే ఎలకను పట్టింది. ఈ మధ్యలో మాత్రం టీవీ సీరియల్ లో ఉన్నన్ని ట్విస్టులను చూపించింది. ఇంతా చేసి చంద్రబాబు ఇంత గొడవ చేసింది ఒక్క ఇచ్ఛాపురం కోసమేనా? మిగతా అన్ని చోట్లా బిజెపి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయనకు ఎలాంటి అభ్యంతరమూ లేదా? ఈ ఒక్క సీటు కోసమే పొత్తును వదులుకునేందుకు కూడా ఆయన సిద్ధమయ్యారా? ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానమేమీ రాలేదు. చివరికి 'అబ్బే ఇప్పటి వరకు జరిగిందంతా కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే' అంటూ చెప్పడం వారి డ్రామాకు కొసమెరుపు. పురందేశ్వరికి టిక్కెట్ ఇవ్వడం , నరసాపురం స్థానం రఘురామరాజుకు ఇవ్వకపోవడమే అసలు డ్రామాలకు మూలకారణం అనేది సగటు ప్రజలకూ తెలిసిన నిజం. అంతేకాక నరేంద్ర మోడీ సికింద్రాబాద్ బహిరంగ సభలో చంద్రబాబుతో కలిసి పాల్గొంటున్నా సీమాంధ్రలో జరగబోయే సభల్లో పవన్ కల్యాణ్ నే వెంట పెట్టుకుంటున్నారన్నది టీడీపీకి షాకిచ్చింది. మోడీ పక్కన బాబు లేకపోతే సీమాంధ్రలో రాజకీయ లబ్ధి ఉండకపోవచ్చునన్నది బాబు భయం. అయితే టీడీపీ వైఖరితో విసిగిపోయిన బిజెపి కూడా ఒంటిరిపోరుకు సై అనేసరికి చంద్రబాబు వెనువెంటనే దిగొచ్చారు. బిజెపి కేంద్ర నాయకత్వం కూడా దృఢంగా వ్యవహరించడంతో ఆయన ఖంగుతిన్నారు. అయితే ఈ డ్రామా అంతా జరిగిన తరువాత బిజెపి, టీడీపీల కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేస్తారా? వారి మధ్య విభేదాలను తొలగించడం సాధ్యమౌతుందా? ఇరు పార్టీల మధ్య సమన్వయానికి ఏర్పాట్లేమైనా చేశారా? ఇప్పటికీ తెలంగాణలో ఈ పొత్తు పనిచేయడం లేదని వార్తలు వస్తున్నాయి. పలు చోట్ల బిజెపికి టీడీపీ సహకరించడం లేదన్న రిపోర్టులు వస్తున్నాయి. తెలంగాణలోనూ ఇరు పార్టీల మధ్య సమన్వయానికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో పైస్థాయి పొత్తు క్షేత్రస్థాయిలో చిత్తు అయిపోతోందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో అసలు టీడీపీతో పొత్తు వల్ల తమకు నష్టమే తప్ప లాభం లేదని బిజెపి నేతలు ఇప్పటికే భావిస్తున్నారు. 2004 లో చంద్రబాబు పరిస్థితికీ, నేటి పరిస్థితికీ చాలా తేడా ఉందని బిజెపి నేతలు భావిస్తున్నారు. అప్పుడు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబుకి, ఇప్పుడు పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకి పోలిక లేదని. అప్పట్లా రాజకీయాలను చంద్రబాబు శాసించే స్థాయిలో లేరని బిజెపి నేతలు భావిస్తున్నారు. -
ఇచ్ఛాపురం టీడీపీలో నిరసన జ్వాల
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: అగ్గి రేగింది.. అసమ్మతి భగ్గుమంది.. ఢీ అంటే ఢీ అని సవాల్ చేసింది... వెరసి ఇచ్ఛాపురం టిక్కెట్ వ్యవహారం జిల్లా టీడీపీలో నిరసన జ్వాల రగిల్చింది. పార్టీ శ్రీకాకుళం లోక్‌సభ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్నాయుడు ఇంటిపై దాడికి పురిగొల్పింది. ‘మా ఇచ్ఛాపురం సీటు ను బెందాళం అశోక్‌కు కాకుండా బీజేపీకి ధారాదత్తం చేయడం దారుణం. 2009లో వైఎస్ హవాలో కూడా మా నియోజకవర్గంలో టీడీపీని గెలిపించుకున్నాం. అలాంటి స్థానాన్ని బీజేపీకి ఇచ్చేస్తారా.. మా అశోక్‌ను కాదని అక్కడెలా పోటీ చేస్తారో.. ఎంపీగా మీరెలా గెలుస్తారో చూస్తాం..’ అని ఆ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో రగిలిపోయారు. ఇచ్ఛాపురాన్ని బీజేపీకి కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించడం, దానికి కింజరాపు నేతలు మద్దతి చ్చినందుకు నిరసనగా సోమవారం మధ్యాహ్నం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయాన్ని (కింజరాపు రామ్మోహన్నాయుడు గృహం) ఇచ్ఛాపురం టీడీపీ శ్రేణులు ముట్టడించాయి. సుమారు 200 వాహనాల్లో వందలాది మంది బెందాళం అశోక్ మద్దతుదారులు, పార్టీ నాయకులు తరలివచ్చారు. కార్యాలయం ఎదుట బైఠాయించి, నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఇచ్ఛాపురాన్ని బీజేపీకి ఇవ్వాలన్న నిర్ణయాన్ని మార్చుకోవాలని. అశోక్‌కు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే నియోజకవర్గంలో టీడీపీని భూస్థాపితం చేస్తామం టూ నినదించారు. సుమారు గంటన్నర సేపు వారి నిరసన కొనసాగింది. అనంతరం వారు ఒక్కసారిగా రామ్మోహన్నాయుడి కార్యాల యంలోకి చొచ్చుకుపోయారు. అక్కడున్న కుర్చీలను విరగ్గొట్టారు. నియోజకవర్గంలోని నాలుగుమండలాల నుంచి వచ్చిన పార్టీ ముఖ్య నేతలు సీపాన వెంకటరమణ, జి.కె.నాయుడు, జట్లు జయప్రకాష్, సదానంద రౌళొ, పొందల కృష్ణారావు, మణిచంద్ర ప్రసాద్, బెందాళం రమేష్, సూరాడ చంద్రమోహన్, వానుపల్లి కృష్ణారావు తదితరులు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. స్వతంత్రులుగా పోటీ ఇచ్ఛాపురం అసెంబ్లీ సీటును బీజేపీకి కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇందుకు జిల్లా కీలక నేతలు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని జిల్లా టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు సీపాన వెంటకరమణ ఈ సందర్భం గా హెచ్చరించారు. బెందాళం అశోక్‌కు టిక్కెట్ ఇవ్వకపోతే.. ఈనెల 19న ఎంపీ సీటుకు బెందా ళం ప్రకాష్, ఎమ్మెల్యే సీటుకు అశోక్ స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తారన్నారు. అన్ని స్థానాలు ఇచ్చేయండి ఇచ్ఛాపురంలో పార్టీకి జరిగిన అన్యాయానికి నిరసనగా మిగిలిన నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకొని ఆ సీట్లనూ బీజేపీకి ఇచ్చేయాలని సోంపేట టీడీపీ నేత జి.కె.నాయుడు సూచించారు. ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన కింజరాపు రామ్మోహన్నాయుడు చిన్నవాడు కావడంతో పార్టీ అధిష్ఠానం వద్ద గట్టిగా వాదించలేకపోయారన్నారు. ఇచ్ఛాపురంలాంటి బలమైన నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడమేమిటని ప్రశ్నించారు. దీనివల్ల ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థికి ఇబ్బందులు తప్పవన్నారు. నరసన్నపేటను తప్పించడానికే ఈ కుట్ర నరసన్నపేటను తప్పించడానికే కుట్ర పన్ని ఇచ్ఛాపురాన్ని వదిలేశారని మరో టీడీపీ నేత జయప్రకాష్ ఆరోపించారు. పార్టీకి కంచుకోటలాంటి ఇచ్ఛాపురంలో బెందాళం అశోక్ గెలుస్తారని భావిస్తున్న సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం శ్రీకాకుళం ఎంపీతో పాటు రెండుమూడు నియోజకవర్గాల్లో తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. -
వేర్వేరు కేసుల్లో 21 మంది అరెస్టు
ఇచ్ఛాపురం రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో వేర్వేరు కేసుల్లో 21 మంది నిందితులను ఆయా ప్రాంతాల పోలీసులు అరెస్టు చేశారు. ఇచ్ఛాపురం మండలంలో వేర్వేరు కేసులకు సంబంధించి ఆరుగురిని రూరల్ ఎస్ఐ చిన్నంనాయుడు సోమవారం అరెస్టుచేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొళిగాం గ్రామానికి చెందిన జగన్నాథొ మండల్ సెప్టెంబర్ 1న తనను అసభ్యకరంగా దూషించాడని అదే గ్రామానికి చెందిన ఊర్మిల మండల్ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి జగన్నాథొ మండల్‌ను అరెస్టు చేశారు. తనను అసభ్యంగా దూషించారని బిర్లంగి పంచాయతీకి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గుజ్జు సరోజిని ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన బాకి లక్ష్మీనారాయణను అరెస్టు చేశారు. సెప్టెంబర్ 24న హరిపురం గ్రామానికి చెందిన దక్కత రామారావు, శాస్త్రి దాడి చేశారని అదే గ్రామానికి చెందిన వడ్డెన మురళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రామారావు, శాస్త్రిని అరెస్టు చేశారు. బొడ్డబడ గ్రామానికి చెందిన భీమో బెహరపై అదే గ్రామానికి చెందిన ముకుంద బెహర, దమ్మో బెహరా దాడి చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొట్లాట కేసులో నలుగురు... లావేరు : మండలంలోని ఆరంగిపేట గ్రామంలో జరిగిన కొట్లాట కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ రామారావు తెలిపారు. సెప్టెంబర్ 23న పొల్లాలో నీటి కోసం ఆరంగి సూరిబాబు, ఆరంగి కారువాడు వర్గీయుల మధ్య తలెత్తిన వాగ్వాదం కొట్లాటకు దారి తీసింది. ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరంగి కారువాడ, అతని వర్గానికి చెందిన ఆరంగి మల్లేష్, ఆరంగి కళావతి, బడగల రమణను సోమవారం అరెస్టు చేసి శ్రీకాకుళం కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఘర్షణ కేసులో 9మంది... సారవకోట రూరల్ : మండలంలోని కేళవలస గ్రామంలో చెరువు లీజుకు సంబంధించి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ శ్రీరామమూర్తి తెలిపారు. రాళ్లతో దాడి చేసి గాయపర్చారని ఆ గ్రామానికి చెందిన రెడ్డి శ్రీరాముల ఫిర్యాదు మేరకు చిన్నాల అప్పన్న, మరో ఎనిమిది మందిని అరెస్టు చేసి పాతపట్నం కోర్టుకు తరలించినట్లు తెలిపారు. వేధింపుల కేసులో భర్త.. వేధింపుల కేసులో మండలంలోని పద్మాపుర ం గ్రామానికి చెందిన చింతు భాస్కరరావును అరెస్టు చేసినట్లు ఎస్ఐ శ్రీరామమూర్తి తెలిపారు. తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని భాస్కరరావు భార్య చింతు లక్ష్మి ఫిర్యాదు చేసిందని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. గాయపర్చిన కేసులో ఒకరు.. పాతపట్నం : మండలంలోని చాకిపల్లి గ్రామంలో జరిగిన ఘర్షణకు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. జన్నిపాపారావు, మామిడి లక్ష్మీనారాయణ ఎదురెదురు ఇళ్లలో నివసిస్తున్నారు. లక్ష్మీనారాయణ ఇంటి వర్షపు నీరు పాపారావు ఇంట్లో పడుతుండడంతో అడిగాడు. దీంతో లక్ష్మీనారాయణ దాడి చేశాడని పాపారావు ఫిర్యాదుచేశాడు. నిందితుడిని సోమవారం అరెస్టు చేశారు. -
రైలు నుంచి జారిపడి ఇద్దరి మృతి
ఇచ్ఛాపురం, పలాస, న్యూస్‌లైన్: వేర్వేరు రైళ్ల నుంచి జారిపడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలు సోమవారం రాత్రి, మంగళవారం చోటు చేసుకున్నాయి. పలాసకు చెందిన తండా అరుణకుమారి(45), సోంపేటకు చెందిన రూప్‌చంద్రరావు (28) మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి..పలాసలోని కస్పా జాలరి వీధికి చెందిన తండా అరుణకుమారి మంగళవారం ఉదయం ఒడిశా బరంపురంలో ఉంటున్న తన కుమార్తె ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఇచ్ఛాపురం వచ్చేందుకు ఓ సూపర్‌ఫాస్ట్ రైలు ఎక్కింది. అయితే ఆ రైలుకు ఇచ్ఛాపురం స్టేషన్లో హాల్ట్‌లేని విషయం అమెకు తెలీదు. రైలు స్టేషన్‌కు చేరుకున్నప్పటికీ ఆగకపోవడంతో కంగారుపడి దిగే ప్రయత్నంలో జారిపడినట్టు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయలవ్వడంతో ఆమె స్పృహ కోల్పోయింది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే 108కు సమచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుడు శ్రీధర్ చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆమె మృతిచెందింది. మృతిరాలికి భర్త జగ్గారావు, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. గుర్తు తెలియని రైలు నుంచి... సోంపేట మండలం పొత్రకుండ గ్రామానికి చెందిన బి.రూప్‌చంద్రరావు తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి మృతి చెందినట్టు రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
శ్రీకాకుళంలో భారీ చోరీ!
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: శ్రీకాకుళం పట్టణంలోని విశాఖ-ఎ కాలనీలో ఉంటున్న అంధవరపు గోవిందరాజులు ఇంట్లో భారీ చోరీ జరిగింది. మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇవీ... గోవిం దరాజులు కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం తిరుపతికి, అక్కడ నుంచి బెంగళూరులో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లారు. రోజూ పనిమనిషి వచ్చి ఇంటి చుట్టూ శుభ్రం చేసి వెళ్తుంది. ఈ క్రమంలో బుధవారం ఉద యం వచ్చే సరికి కిటికీ గ్రిల్ తొలగించి ఉండడం, ఇం టితలుపు తెరిచి ఉండడాన్ని గమనించి చుట్టుపక్కల వారికి విషయం తెలిపింది. వారు వచ్చి చూసి గోవిం దరాజులకు సమాచారం అందించారు. ఆయన ఇచ్ఛాపురంలో ఉన్న తన కుమారుడు నాగేశ్వరరావు, శ్రీకాకుళంలో ఉన్న సోదరుడు శ్రీనివాసరావుకు విషయం తెలియజేశారు. వారు ఇంటి వద్దకు వచ్చి దొంగతనం జరిగిందని నిర్ధారించుకుని రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సెలవులో ఉండడంతో సీఐ వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. ఇంట్లో బీరువాలను కానీ, మరే సామాగ్రిని కానీ విరగ్గొట్టకపోగా అలమరాలన్నింటినీ తెరిచి అందులో ఉన్న వెండి, బంగారం వస్తువులను తీసుకువెళ్లారని యజమాని బంధువులు చెబుతున్నారు. దేవుడి గదిలో వెండి వస్తువులు ఉన్నా వాటిని తీసుకువెళ్లలేదు. వస్తువులు ఉన్న అలమరాలను మాత్రమే తెరవడం వల్ల ఇది తెలిసిన వారి పనేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొంగలే ఈ పని చేసి ఉంటే విలువైన వస్తువులన్నింటినీ తీసుకువెళ్లిపోయేవారని, అలా కాకుండా కొన్నింటినే తీసుకువెల్లడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. సుమారు 17 కేజీల వెండి, 12 తులాల బంగారం చోరీకి గురై ఉండవచ్చునని యజమాని బంధువులు చెబుతున్నారు. సీఐ ఎం.మహేశ్వరరావు మాత్రం దీనిని నిర్ధారించడం లేదు. దేవుడి గదిలో ఉన్న వస్తువులు కూడా పోయి ఉంటాయని భావించి వారు అలా చెప్పి ఉండవచ్చునని దేవుడి గదిలో ఏ వస్తువు పోలేదన్నారు. యజమాని వచ్చి నిర్ధారించి లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తే కానీ ఖచ్చితంగా ఎంత పోయింది చెప్పలేమన్నారు. రూరల్ హెచ్‌సీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్ స్ఫూర్తితోనే మరో ప్రజాప్రస్థానం: షర్మిల
-
మరోప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపు సభ: జనసంద్రమైన ఇచ్చాపురం
ఇచ్చాపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జరిగిన భారీ బహిరంగ సభకు జనం అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఇచ్చాపురం జనసంద్రమైంది. వీధులన్నీ జనంతో నిండిపోయాయి. సభా ప్రాంగణం అంతా జనంతో కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా జనమే జనం. మేడలు, మిద్దెలు ఎక్కి జనం షర్మిల ప్రసంగం విన్నారు. షర్మిల తన ప్రసంగంలో ఒక్క మనిషి వెళ్లిపోతే ఆంధ్రరాష్ట్రమే అతలాకుతలమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ బతికుంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరయ్యేది కాదని ప్రజల నమ్మకం అని చెప్పారు. ఇది విజయయాత్ర కాదని, నిరసన యాత్రని ఆమె తెలిపారు. ప్రభుత్వ పనితీరును, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరిని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు అన్యాయం జరుగుతున్న తీరును వివరించారు. ఉద్యోగులను కేసీఆర్ వెళ్లిపోవాలంటున్నారంటే అర్థమేంటి? అని ప్రశ్నించారు. విభజన నిర్ణయంపై చర్చలు జరగాలని డిమాండ్ చేశారు. అంతవరకు ప్రజల తరఫున వైఎస్ఆర్సిపి ప్రజల తరపున పోరాడుతుందని చెప్పారు. సీఎం, బొత్స, కేంద్రమంత్రులు ఢిల్లీలో తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని విమర్శించారు. ఈ సమయంలో ప్రజల తరఫున నిలబడింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు. ఎందరు కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు? అని ప్రశ్నించారు. ప్రజల కన్నా పదవులే ముఖ్యమని కాంగ్రెస్, టీడీపీ నాయకులు నిరూపించుకున్నారన్నారు. తెలుగు ప్రజల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా జగన్మోహన్రెడ్డి ఊరుకోరని చెప్పారు. న్యాయం చేసే సత్తా కాంగ్రెస్‌కు లేకపోతే విభజన చేసే అధికారం కూడా ఆ పార్టీకి లేదన్నారు. ఆమె ప్రసంగాన్ని ప్రజలు ఆసక్తిగా విన్నారు. 3వేల కిలో మీటర్లకు పైగా పాదయాత్ర చేసిన చరిత్ర సృష్టించిన షర్మిలను చూసేందుకు, ఆమె ప్రసంగం వినేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి, చుట్టు పక్కల గ్రామాల నుంచి అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఆమె ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఈ రోజు ఉదయం షర్మిల మరో ప్రజాప్రస్థానం 230వ రోజు పాదయాత్ర బలరాంపురం నుంచి ప్రారంభించారు. సవరదేవిపేట, అయ్యవారిపేట, లొద్దపుట్టి మీదుగా షర్మిల ఇచ్చాపురం చేరుకున్నారు. ఇచ్ఛాపురంలో వైఎస్ఆర్ ప్రజాప్రస్థాన స్థూపం వద్ద వైఎస్ఆర్కు ఘన నివాళుర్పించారు. ఆ తరువాత మరో ప్రజాప్రస్థానం విజయస్థూపంను ఆవిష్కరించారు. -
ప్రజలతో తమ అనుబంధం పెరిగింది: విజయమ్మ
-
విజయ ప్రస్థాన పైలాన్‌ను ఆవిష్కరించిన షర్మిళ, విజయమ్మ
-
రాష్ట్ర విభజనతీరుకు నిరసనగా రేపే రాజీనామా: ఎంపి మేకపాటి
-
రాష్ట్ర విభజనతీరుకు నిరసనగా రేపే రాజీనామా: ఎంపి మేకపాటి
ఇచ్చాపురం: రాష్ట్ర విభజనతీరుకు నిరసనగా తన లోక్‌సభ సభ్యత్వానికి రేపే రాజీనామా చేయనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన రెడ్డి చెప్పారు. షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపుంరలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రం విభజనకు అనుసరించే పద్దతికి నిరసన తెలుపుతూ లోక్‌సభ స్పీకర్‌కు రేపు రాజీనామా లేఖను పంపుతానని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు నిబద్ధత ఉందని చెప్పారు. ఇప్పటికే వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ హడావుడిగా నిర్ణయం తీసుకోవడం, హైదరాబాద్ విషయంలో అనుసరించే విధానానికి వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. -
మరోప్రజాప్రస్థానం ముగింపు సభ: వైఎస్సాఆర్ సీపీ నేతల ప్రసంగం
-
చరిత్ర పుటల్లో నిలిచిపోనున్న షర్మిల పాదయాత్ర: జూపూడి
శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు చెప్పారు. పాదయాత్ర నేటితో ముగియనున్న సందర్భంగా ఆ పార్టీ నేతలందరూ ఇచ్చాపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ ప్రజల కోసం షర్మిల సుదీర్ఘమైన పాదయాత్ర చేశారన్నారు. కష్టాల్లో ఉన్న జగన్‌ను ఆదరిస్తున్న ప్రజల అభిమానం చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజన చేసి కేంద్రం చారిత్రక తప్పిదం చేసిందని జూపూడి అన్నారు. వైఎస్ఆర్సీపీ మహిళ విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి మాట్లాడుతూ షర్మిల పాదయాత్రతో కాంగ్రెస్, టీడీపీల గుండెల్లో రైళ్లు పరిగెత్తుస్తున్నాయన్నారు. ఈ రోజు ఉదయం షర్మిల మరో ప్రజాప్రస్థానం 230వ రోజు పాదయాత్ర బలరాంపురం నుంచి ప్రారంభమైంది. సవరదేవిపేట, అయ్యవారిపేట, లొద్దపుట్టి మీదుగా పాదయాత్ర కొనసాగింది. ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి నేతలు కార్యకర్తలు ఇచ్చాపురం చేరుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం భారీగా తరలివస్తున్నారు. సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. షర్మిల 9 నెలల్లో 14 జిల్లాల్లో 116 నియోజకవర్గాల మీదుగా 3,112 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ రాజకీయ చరిత్రలో ఓ సంచలన రికార్డు సృష్టించారు. -
మరోప్రజాప్రస్థానం ముగింపు సభ: దాడి వీరభద్రారావు ప్రసంగం
-
మరోప్రజాప్రస్థానం ముగింపు సభ: సుజయ్ కృష్ణరంగారావు ప్రసంగం
-
మరోప్రజాప్రస్థానం ముగింపు సభ: పిల్లి సుభాష్ ప్రసంగం
-
అడుగు - ఆశీస్సులు
-
పాదయాత్రలో చూసిన అనుభవాలు మరువలేం
-
నేటితో ముగియనున్న షర్మిళ పాదయాత్ర
-
అడుగుల ఆశీస్సులు - స్పెషల్ ఎడిషన్
-
శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టిన షర్మిల
-
214వ రోజు పాదయాత్ర కొనసాగేది ఇలా
-
బొబ్బిలిలో షర్మిల ప్రసంగానికి అపూర్వ స్పందన
-
చరిత్ర సృష్టించిన షర్మిళ
-
విజయనగరంలో మరో ప్రజా ప్రస్థానం 15th july 2013
-
210వ రోజు పాదయాత్ర కొనసాగేది ఇలా
-
వీరు నాయకులా.. రాక్షసులా?:షర్మిల
-
చీపురపల్లిలో కొనసాగుతున్న పాదయాత్ర
-
ఉండవల్లిపై మండిపడ్డ షర్మిల
-
మరోప్రజాప్రస్థానం ఆడియో సిడి ఆవిష్కరణ
-
‘మీరే వేసే ప్రతీ ఓటు జగనన్న కోసమే’
-
విశాఖతీరంలో మరో ప్రజాప్రస్థానం 7th July
-
విశాఖ తీరంలో 6th july 2013
-
షర్మిల 201వ రోజు పాదయాత్ర షెడ్యూల్