
సాక్షి, ఇచ్ఛాపురం (శ్రీకాకుళం): ఏం కష్టం వచ్చిందోగాని వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మున్సిపాలిటీ పరిధి రత్తకన్న గ్రామం సంతోషం వీధిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకోగా.. ఈది జయలక్ష్మి (21) ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. జయలక్ష్మికి గత ఏడాది మే నెలలో ఒడిశా రాష్ట్రంలోని కోటిలింగి గ్రామానికి చెందిన మంచాల పితాంబర్‌తో వివాహమైంది.
ఈమె తల్లిదండ్రులు చంద్రమ్మ, మోహనరావులు కొన్నేళ్ల క్రితం వివిధ ప్రమాదాల్లో మృతి చెందడంతో సోదరి, సోదరులు ఈది నాగమ్మ, రామయ్యలవద్ద పెరిగింది. ఈమె ఆదివారం సాయంత్రం అత్తవారింటి నుంచి కన్నవారిల్‌లైన సోదరింటికి వచ్చింది. అయితే ఏం జరిగిందోగాని.. సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో వంటగదిలో సీలింగ్ హుక్‌కి ఉరివేసుకొని మృతి చెందింది.
చదవండి: (యువతిపై అత్యాచారం, హత్య.. కట్టెల కోసమని అడవిలోకి వెళ్లగా..)
ఇంటికి వచ్చిన సోదరి హుక్‌కి వేలాడుతున్న జయలక్ష్మిని చూసి కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవారు అక్కడకు చేరుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సోదరి నాగమ్మ ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ వి.సత్యనారాయణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment