మరో ప్రజాప్రస్థానంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల చేపట్టిన పాదయాత్ర గురువారం గాజువాక సెంటర్ నుంచి ప్రారంభమైంది. నటయ్యపాలెం, షీలానగర్, ఎయిర్పోర్ట్, ఎన్ఏడీ కొత్తరోడ్డు జంక్షన్, బుచ్చిరాజుపాలెం, మర్రిపాలెం,ఐటీ జంక్షన్, కంచరపాలెం మెట్టమీదగా ఆమె పాదయాత్ర సాగుతోంది. షర్మిల చేపట్టిన పాదయాత్ర నేటికి 199వ రోజుకు చేరుకుంది. మహానేత తనయకు మద్దతుగా పాదయాత్రలో వైఎస్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.