praja prasthanam
-
విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం
-
అనంతపురంలో ప్రజా ప్రస్థానం కార్యక్రమం
-
జగన్ హయంలో ప్రభుత్వ ఉద్యోగాలు...ప్రజల ప్రశ్నలు
-
టీఆర్ఎస్ నేతలు మనుషులేనా? మానవత్వం లేదా?: షర్మిల
-
టీఆర్ఎస్ పాలనలో 8 వేలమంది ఆత్మహత్య
మెదక్‌జోన్: టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో 8 వేలమంది ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విచారం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు పోయేకాలం దగ్గర పడిందని, వినతిపత్రాన్ని వీఆర్ఏల మొహం మీదికి విసిరేసి అవమానించిన కేసీఆర్‌ను రాజకీయంగా పాతర పెట్టాలని అన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆదివారం మెదక్ జిల్లాకేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో రూ.లక్షల కోట్ల అవినీతి చేసి, ఇప్పుడు దేశంలో కొత్తపార్టీ పెట్టి ప్రజలను ఉద్దరిస్తాడట అని కేసీఆర్‌నుద్దేశించి ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్ రూ.100 కోట్లు పెట్టి జెట్ విమానాలు, హెలికాప్టర్ కొంటారట, ఇది ప్రజల సొమ్ముకాదా’అని ఆమె నిలదీశారు. కేసీఆర్ అన్ని వర్గాలవారిని మోసం చేశారని, రైతులకు రుణమాఫీ అంటూ ఏళ్ల తరబడి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ.4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పారీ్టలు పేరుకే ఉన్నాయని, కేసీఆర్ అవినీతి పాలనను ప్రశ్నించిన పాపాన పోవడంలేదని మండిపడ్డారు. ‘వైఎస్సార్ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. రాష్ట్రంలో పూర్వవైభవం తీసుకొస్తాను. నేను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఊపిరిని. నన్ను ఆశీర్వదిస్తే నాన్నగారి పాలనను మళ్లీ మీ కళ్ల ముందు ఉంచుతాను’అని తెలిపారు. ఆమె వెంట పార్టీ నేతలు ఏపూరి సోమన్న, సంజీవరావు, జిల్లా అధ్యక్షులు వనపర్తి వెంకటేశం తదితరులు ఉన్నారు. చదవండి: బీజేపీకి కొత్త పేరు చెప్పిన కేటీఆర్ -
నియంత పాలన అంతమొందించాలి
పెన్‌పహాడ్(సూర్యాపేట): రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్న నియంత పాలనను అంతమొందించాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపుని చ్చారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్ర శనివారం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం తంగెళ్లగూడెం, చీదెళ్ల, గాజుల మల్కాపురం, అనిరెడ్డిగూడెం, నూర్జహాన్‌పేట గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన తెలంగాణలో సామాన్యులకు కష్టాలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలపై దృష్టిసారించకుండా మాటలతో మభ్యపెట్టి కాలం గడిపేస్తున్నారని ధ్వజమెత్తారు. మిగులు బడ్జెట్ కలిగిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని, రాష్ట్రంలో బడులు, దేవాలయాల కన్నా బార్లు, మద్యం షాపులే ఎక్కువగా దర్శనమిస్తున్నాయని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు, మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టడం లేదో ప్రజలే అర్థం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి, పాలేరు నియోజకవర్గ పరిశీలకుడు బీరవోలు శ్రీనివాస్‌రెడ్డి, కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిపాల వేణుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ 8 ఏళ్ళ పాలనలో 8 వేల మంది రైతులు బలి
-
93వ రోజు ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర
-
ఇంటికో ఉద్యోగం.. దళితులకు మూడెకరాలు ఏవి?
నాగారం: ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ భృతి అంటూ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సీఎం కేసీఆర్‌ను వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నిలదీశారు. రాష్ట్రంలో నియంత పాలన పోవాలంటే కేసీఆర్‌ను గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్ టీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా బుధవారం నాగారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మాట ముచ్చట కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు. మిగులు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ పేరుతో రూ. 4 లక్షల కోట్ల అప్పులు చేసి, బార్ల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని విమర్శించారు. పేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్, పేదలకు కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి ప్రాంత వాసి ఏపూరి సోమన్నను దీవించి ఆదరించాలన్నారు. కాగా, మాటముచ్చట కార్యక్రమాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డు కునే ప్రయత్నం చేశారు. షర్మిల మాట్లాడుతున్న క్రమంలో వైఎస్సార్టీపీ కార్యకర్తలు జై వైఎస్సార్ అంటూ నినాదాలు చేయగా అక్కడే ఉన్న కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు జై కేసీఆర్ అంటూ పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
‘ధరల పెరుగుదలతో దిక్కు తోచని స్థితిలో ప్రజలు’
తిరుమలగిరి (తుంగతుర్తి): కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, రిజిస్ట్రేషన్, బస్ చార్జీలు, ఇంటి పన్నులు పెంచడంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయని, పేద మధ్య తరగతి ప్రజలు ఏ వస్తువు కొనలేని దిక్కు తోచనిస్థితిలో ఉన్నారని వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం యాత్ర 39వ రోజు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని రూప్లా తండా, చౌళ్ల తండా, గుండెపురి గ్రామాల్లో సాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర ధరలకు నిరసనగా గుండెపురిలో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచి ప్రజల రక్తం తాగుతున్నాయని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్లకు బుద్ధి చెప్పకుంటే మన బతుకులు బుగ్గిపాలవుతాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న పాల్గొన్నారు. -
అడుగడుగునా ప్రజల నీరాజనం
-
యాదాద్రి జిల్లాలో 30వ రోజు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర
-
వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పునఃప్రారంభం
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ టూటౌన్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల శుక్రవారం తన ప్రజాప్రస్థానం పాదయాత్రను నల్లగొండ జిల్లా కొండపాక గూడెం నుంచి తిరిగి మొదలు పెట్టనున్నారు. గతేడాది అక్టోబర్ 20న చేవెళ్లలో ప్రారంభించిన పాదయాత్ర కొండపాకగూడెం వరకు సాగి వాయిదాపడిన విషయం తెలిసిందే. 21 రోజులపాటు కొనసాగిన పాదయాత్ర మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడం, కరోనా ఉధృతి పెరగడంతో 2021 నవంబర్ 9న వాయిదా వేశారు. నేటి పాదయాత్ర షెడ్యూల్..: హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయం నుంచి షర్మిల బయలుదేరి మధ్యాహ్నం 3.30 గంటలకు కొండపాక గూడెం చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు చిన్న నారాయణపురం, 5.00 గంటలకు నార్కెట్‌పల్లి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే బహిరంగసభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 6.15 గంటలకు ఎడవెల్లికి, తర్వాత 6.45 గంటలకు పోతినేనిపల్లి క్రాస్‌రోడ్డుకు చేరుకుని ప్రజలతో మాట్లాడతారంటూ పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. -
11 నుంచి షర్మిల ప్రజా ప్రస్థానం పునఃప్రారంభం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈనెల 11 నుంచి పునః ప్రారంభమవుతుందని ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన లోటస్‌పాండ్ లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గతేడాది అక్టోబర్ 20న ప్రారంభించిన షర్మిల పాదయాత్రకు ఎమ్మెల్సీ కోడ్‌తోపాటు కరోనా మూడో వేవ్ కారణంగా తాత్కాలిక విరామం ఏర్పడిందన్నారు. పాద యాత్రను ప్రారంభించకుండా ప్రభుత్వం పలు ఆంక్షలతో అడ్డుకుందని ఆరోపించారు. గత పాదయాత్రలో 21 రోజుల్లోనే 231 కిలోమీటర్లు, 5 మున్సిపాలిటీలు, 15 నియోజకవర్గాలు, 150 గ్రామాల్లో షర్మిల పాదయాత్ర చేశారని తెలిపారు. 11న నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలోని కొండపాకగూడెం నుంచి పాదయాత్ర పున:ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ, నియోజకవర్గంలోని సగానికిపైగా మండలాల్లో పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ప్రతీ మంగళవారం నిరుద్యోగదీక్ష కొనసాగుతుందని దేవేందర్‌రెడ్డి వెల్లడించారు. -
నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల పాదయాత్ర
-
మహేశ్వరంలో షర్మిల పాదయాత్ర
-
అక్టోబర్ 20 నుంచి ప్రజాప్రస్థాన పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ పాలనలో దగాపడ్డ తెలంగాణ జనానికి గుండె ధైర్యం కల్పిస్తూ అక్టోబర్ 20 నుంచి ప్రజాప్రస్థాన పాదయాత్ర చేయనున్నట్లు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన బాటలో చేవెళ్ల నుంచే తన యాత్ర మొదలవుతుందని, అక్కడే ముగుస్తుందని ఆమె వెల్లడించారు. లోటస్‌పాండ్‌లో ప్రజా ప్రస్థానం పోస్టర్‌ను విడుదల చేస్తున్న వైఎస్ షర్మిల హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో సోమవారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ, పాదయాత్ర స్వరూపాన్ని, ఉద్దేశాన్ని వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం మినహా.. 90 నియోజకవర్గాల్లో ప్రతీ పల్లెను, గడపనూ తాకుతూ ఏడాదికిపైగా పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. పాదయాత్ర మొత్తం తాను రోడ్డు పక్కే ఆవాసం ఏర్పాటు చేసుకుంటానని, ప్రజలతోనే మమేకమవుతానని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లు ఆలకించేందుకే సమయం కేటాయిస్తానని చెప్పారు. పాదయాత్రలో భాగంగా బహిరంగ సభలూ నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి, 36 లక్షల మందికి ఎగ్గొట్టారని, దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, 16 లక్షల మంది కౌలు రైతులు దిక్కులేని స్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ వచ్చాక దళితులపై 800 శాతం, మహిళలపై 300 శాతం దాడులు పెరిగాయని తెలిపారు. నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదన్నారు. పాదయాత్రలకు వైఎస్సార్ కుటుంబమే పెట్టింది పేరని, వైఎస్సార్ పాదయాత్రలోంచే ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పుట్టాయని చెప్పిన షర్మిల.. వైఎస్సార్ సంక్షేమ పాలనను ప్రజలకు గుర్తు చేస్తామన్నారు. ప్రభుత్వం ఉద్యోగ నియామక నోటిఫికేషన్ ఇచ్చే దాకా.. పాదయాత్రలోనూ మంగళవారం దీక్షలు కొనసాగుతాయని షర్మిల చెప్పారు. -
ప్రజాప్రస్థానం@ 16 Years
-
ప్రజాప్రస్థానం.. 16 ఏళ్లుగా ప్రజల గుండెల్లో పదిలం
అభివృద్ధికి నిర్వచనం చెప్పినవాడు, సంక్షేమానికి తానే సంతకమైన వాడు... అధికారం చేపట్టడానికి ముందు ప్రజాక్షేత్రాన్నే ప్రయోగశాల చేసుకొని, జనహితమే మూల సూత్రంగా పాలనా విధానాన్ని రచించుకున్న నాయకుడు డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి. తెలుగునేలపై రాజకీయ చిత్రాన్నే సమూలంగా మార్చిన ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రను నేటికి సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదే రోజు... ఏప్రిల్ 9న (2003) డాక్టర్ వైఎస్సార్ చేవెళ్ల (రంగారెడ్డి జిల్లా) నుంచి ప్రారంభించారు. 68వ రోజున ఇచ్ఛాపురం (శ్రీకాకుళం జిల్లా)లో ముగించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేపట్టేనాటికి రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితులు, నిబద్ధతతో చేసిన యాత్ర ఆయనను ఆవిష్కరించిన తీరు, అధికారం చేపట్టిన తొలి నిమిషాల నుంచి పదవిలోనే మరణించిన ఆఖరి క్షణాల వరకు ఆయన సాగించిన పాలనా పద్ధతులు, రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చేసిన పరిస్థితి... ఇవన్నీ తెలుగునాట మరుపునకు రాని ఓ చరిత్ర! ప్రజాస్వామ్య పాలనకు ఓ సువర్ణాధ్యాయం. ఇతర పాలకులంతా లంకె కుదరటం కష్టమనుకునే అభివృద్ధి–సంక్షేమం జోడు గుర్రాల స్వారీ సాగిన స్వర్ణయుగమది! రాష్ట్రమేదైనా.. తదుపరి పాలకులకు వైఎస్ పరిపాలనే ఓ ‘బెంచ్‌మార్క్’ అన్న భావన స్థిరపడింది. అర్ధంతరంగా ఆయన తనువు చాలించి దాదాపు పదేళ్లవుతున్నా, మధ్యలో పలువురు పాలకులు మారినా.. ఈనాటికీ ఆయన చేసిన పనులే జనం మనోఫలకంపై చెరగని ముద్రలు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘వైఎస్సార్’ ఓ శాశ్వత జ్ఞాపకం. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, రైతుకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఫీజు రీయింబర్స్మెంట్... ఇలా ఏ పథకం తీసుకున్నా అది ఓ ప్రయోగం, అంతకు మించి ఓ ప్రామాణికం. అన్ని వయసుల వారికీ బతుకుపై ఓ భరోసా! అన్ని విధాలుగా అలమటించిన రైతన్నకు ఓ ఊరట, నిశ్చింత! విభిన్న వర్గాల ప్రజాజీవితంలో వెలుగులు పంచుతూ గ్రామీణ–పట్టణ ఆర్థిక వ్యవస్థను పరుగులెత్తించారు వైఎస్. రాష్ట్రాన్ని అన్ని విధాలా ప్రగతి పథంలో నడిపారు. రెండంశాలే కీలకం! చరిత్ర కలిగిన ఎందరో నాయకులకన్నా వైఎస్ రాజశేఖరరెడ్డిని భిన్నంగా నిలబెట్టే అంశాలు రెండు! ఒకటి, ఆయనకు ప్రజల పట్ల ఉండే అవ్యాజమైన ప్రేమ–నిబద్ధత. రెండు.. ఆయన మాటలు, చేతలు, మొత్తం నడతపై ఉన్న అపార నమ్మకం–విశ్వసనీయత! ఈ రెండే వైఎస్ రాజశేఖరరెడ్డిని చరిత్ర మరవని జననేతగా మలిచాయి. ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందు రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దుర్భరం. రైతు కన్నీళ్లతో వ్యవసాయం అడుగంటింది. పనుల్లేక చేతి వృత్తులు కునారిల్లాయి. ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లేక యువత నిస్తేజమైంది. తప్పు దారిన సాగిన ఆర్థిక సరళీకరణ విధానాలు, ఉరుముతున్న ప్రపంచీకరణ, రాష్ట్రాన్ని నాటి సీఎం చంద్రబాబు ప్రపంచబ్యాంకు ప్రయోగశాల చేసిన తీరు.. వెరసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైంది. రాజకీయ నాయకులు ప్రజలకు ఏ భరోసా ఇవ్వలేకపోతున్నారు. సరిగ్గా అదే సమయంలో వైఎస్సార్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. నేరుగా ప్రజల్నే కలవడం, విభిన్న సమాజాల వారి ఇబ్బందుల్ని, కష్ట–నష్టాల్ని స్వయంగా చూడటం, వారి కష్టాల్లో పాలుపంచుకోవడం, సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించడం, జనానికి అండగా ఉంటానని భరోసా కల్పించడం... ఇవే తన పాదయాత్ర ఉద్దేశాలు, లక్ష్యాలని స్వయంగా ఆయనే వెల్లడించారు. పాదయాత్ర మొదలైన ఆరంభ క్షణాల నుంచే ఆయనలోని మానవత పెల్లుబికింది. ఏప్రిల్ 9, మిట్టమధ్యాహ్నం ఎర్రటి ఎండ కాస్తోంది. చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభానికి ముందు జరిగిన సభా వేదికపైన నీడ కోసం టార్ఫాలిన్ కప్పు వేశారు. వేదిక ముందు పోగైన జనంలో అక్కడక్కడ మహిళలు చీర కొంగులతో, మగవాళ్లు తుండు గుడ్డలతో ఎండ నుంచి తలదాచుకునే యత్నం చేస్తున్నారు. ఏ జనం కష్టాల్లో పాలు పంచుకుంటానని వైఎస్ తన యాత్ర ప్రారంభిస్తున్నారో ఆ జనాన్ని పరిశీలిస్తున్న ఆయన కార్యాచరణ అక్కడ్నుంచే మొదలైంది. చురుకైన కార్యకర్తల్ని దగ్గరికి పిలిచి, వేదికపై నాయకులకు నీడగా ఉన్న టార్ఫాలిన్ తీసేయించారు. ఎండలోనే సభా కార్యక్రమం సాగింది. అందుకే ఆయన.. ఇచ్ఛాపురం యాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ ఓ మాటన్నారు. ‘నా ప్రజలకంటే నేను భిన్నమని నేననుకోవటం లేదు. రాజకీయ లబ్ధి కోసం రాలేదు. ప్రజల కష్టాల్లో పాలుపంచుకుందామని యాత్ర చేశా. పేదల సమస్యలపై పోరాటం సాగించడంలో ఆత్మ బలిదానానికైనా సిద్ధం’ అన్నారు. ఆ మాట అలా రావడం కాకతాళీయమే కావచ్చు! కానీ కడకు అదే జరిగింది. ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమలు ఎలా ఉంది? కడపటి లబ్ధిదారునికి ప్రయోజనాలు అందుతున్నాయా? స్వయంగా పరిశీలిస్తానని రచ్చబండకు ఆకాశమార్గాన బయలుదేరిన జననేత ఇక తిరిగి రాలేదు. పదేళ్లు కావస్తున్నా, ఆయనే గుర్తుకు వస్తున్నారు. తదనంతర కాలంలో ప్రగతి నిలిచిపోయింది. సంక్షేమం పడకెక్కింది. నేటికి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో దుర్భర పరిస్థితులు తారాడుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. కుత్సితమైన రాజకీయాల్ని పాలనతో మిళితం చేసిన దాష్టీకానికి జనం తీవ్రంగా అలమటిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి సగటు మనిషీ.. ‘వైఎస్ అందించిన పాలన మళ్లీ వస్తే ఎంత బావుండు’ అనుకుంటున్నారు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ భరోసాను వెతుక్కుంటున్నారు. జనం పట్ల నాయకుడి నిబద్ధత, నాయకుడి పట్ల ప్రజల విశ్వాసమే కొత్త వెలుగు చూపాలి. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం దాకా.. 2003 ఏప్రిల్ 9న చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభం మొత్తం 11 జిల్లాల్లోని 56 నియోజకవర్గాల్లో యాత్ర 690 గ్రామాల్లో పర్యటన 68 రోజుల పాటు సాగిన ప్రజా ప్రస్థానం 1,475 కిలోమీటర్ల పాటు పాదయాత్ర జూన్ 15న ఇచ్ఛాపురంలో ముగింపు -
జ్ఞాపకాలు పదిలం
చేవెళ్ల: దివంగతనేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేవెళ్ల నుంచి చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర నేటితో 15ఏళ్లు పూర్తి చేసుకుంది. స్వర్గీయ రాజశేఖరరెడ్డి పాదయాత్ర అనంతరం కాం గ్రెస్ పార్టీ 10ఏళ్లు అధికారంలో కొనసాగిన విషయం తెలిసిందే. 2003 ఏప్రిల్ 9వ తేదీన చేవెళ్ల మండలకేంద్రంలోని మార్కెట్ యార్డు నుంచి ప్రతిపక్షనేత హో దాలో ఆయన చేపట్టిన పాదయాత్రకు అన్నివర్గాల నుంచి విశేష ఆదరణ లభించింది. పాదయత్రతో వైఎస్సార్ పల్లె ప్రజల కష్టాలను, కన్నీటిని దగ్గర నుం చి చూసి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. అండ గా ఉండి కష్టాలు తీర్చి.. కన్నీళ్లను తూడుస్తానని హా మీ ఇచ్చారు. అనంతరం అధికారంలోకి వచ్చిన ఆ యన పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధిఫలాలు ప్రతిఇంటికి చేరుకునేలా చర్యలు తీసుకున్నా రు. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ రైతులను పూ ర్తిగా విస్మరించి వారికి అన్యాయం చేసింది. ఈనేపథ్యంలో రైతులకు అండగా నిలిచారు. మొట్టమొదటి సారిగా ఉచిత విద్యుత్ అమలుపై సంతకం చేసి రైతు బాంధవుడిగా పేరుతెచ్చుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాదయాత్రలో ఇ చ్చిన హామీలన్నీ నెరవేర్చారు. పాదయాత్రతో అధికారంలోకి వచ్చిన ఆయన చేవెళ్లను తన సెంటిమెం ట్‌గా ప్రకటించారు. పలు కార్యక్రమాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు. చేవెళ్ల సెంటిమెంట్ రుణం తీర్చుకునేందుకు ఈ ప్రాంత ప్రజలకు శాశ్వతంగా మేలు చేకూర్చేవిధంగా చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టుకు నవంబర్ 19, 2008లో శంకుస్థాపన చేశారు. నేటికి వైస్సార్ చేపట్టిన పాదయాత్ర 15 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఇక్కడి ప్రజలు ఆయనను స్మరించుకుంటున్నారు. ఆయన స్మృతులను ప్రజలు తమ గుండెల్లో పదిలంగా దాచుకున్నారు. వైఎస్సార్ పాదయాత్రకు విశేషమైన స్పందన రావడంతో ఇప్పటికీ కాంగ్రెస్‌పార్టీ నాటి రాజశేఖరరెడ్డి సెంటిమెంట్‌ను కొనసాగిస్తోంది. ఫిబ్రవరి 26న చేవెళ్లనుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాచైతన్య యాత్రను ప్రారంభించింది. -
పదమూడేళ్ల ప్రజా ప్రస్థానం
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో సాహసోపేతమైన పాదయాత్రకు శ్రీకారం చుట్టి శనివారం నాటికి సరిగ్గా పదమూడేళ్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరవు, కాటకాలతో ప్రజలు అల్లాడుతున్నప్పుడు... నిరాశ, నిస్పృహలతో రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పుడు... తమను ఆదుకునే వారేరని ప్రజలు ఎదురుచూస్తున్న దయనీయ పరిస్థితుల్లో నేనున్నానంటూ ప్రతిపక్ష నేతగా రాజశేఖరరెడ్డి 2003 ఏప్రిల్ 9న సాహసోపేతమైన పాదయాత్రకు నడుం బిగించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించి జూన్ 15 న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు అప్రతిహతంగా కొనసాగించారు. నడి వేసవిలో 40 డిగ్రీల ఎండను సైతం లెక్కచేయకుండా 68 రోజుల పాటు 11 జిల్లాల్లో 56 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకొచ్చే 690 గ్రామాల ప్రజలను పలకరిస్తూ ఇచ్చాపురం వరకు 1475 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ఈ యాత్రకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైఎస్ఆర్ స్వల్ప అస్వస్థతకు గురైనా వెంటనే కోలుకుని పాదయాత్రను కొనసాగించారు. ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సులు, డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీకి రుణాలు, జలయజ్ఞం, రాజీవ్ ఉద్యోగశ్రీ తదితర పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. -
ప్రజాప్రస్థానానికి 12ఏండ్లు!
-
''ప్రజాప్రస్థానం పేరుతో మాస పత్రిక''
-
ప్రయాణమే ప్రమాణం..
-
ప్రయాణమే ప్రమాణంగా...
-
ప్రయాణమే ప్రమాణం
-
చారిత్రక 'ప్రజా ప్రస్థానం'
-
ప్రజా ప్రస్థానానికి పదకొండేళ్లు
-
ప్రజా ప్రస్థానానికి పదకొండేళ్లు
* 2003 ఏప్రిల్ 9న పాదయాత్రకు వైఎస్ శ్రీకారం * నాడు తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో దీనావస్థలోకి ప్రజలు * ఆ సమయంలో వారికి బతుకుపై భరోసానిస్తూ సాగిన పాదయాత్ర * 68 రోజులపాటు 1,475 కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టాలను దగ్గరగా చూసిన వైఎస్ * ఆ కష్టాలను తీర్చే దిశగానే సంక్షేమ పథకాల రూపకల్పన సాక్షి, హైదరాబాద్: కరువు కాటకాలతో ప్రజలు అల్లాడుతున్న సమయం.. నిరుద్యోగుల నిరసన గళాలు, నేతన్నల ఆక్రందనలు.. నిలువ నీడలేక నిర్భాగ్యుల్లో నైరాశ్యం.. ఆర్చేవారు లేక, తీర్చేవారు లేక రైతన్నల ఆత్మహత్యలు.. తమను ఆదుకునే నాథుడే లేడా అని ప్రజలు ఎదురుచూస్తున్న తరుణంలో.. ‘మీకు నేనున్నా’ అంటూ వారికి బతుకుపై భరోసా కలిగించేందుకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారు. ఒక్క అడుగుతో మొదలైన ఆ పాదయాత్ర.. ప్రజల బతుకుల్లో కొత్త వెలుగులు తెచ్చింది.. రాష్ట్ర రాజకీయ చరిత్రను ఓ మలుపు తిప్పింది.. భారత దేశ చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. రాష్ట్రంలో ఐదేళ్ల సువర్ణయుగానికి నాంది పలికింది. ఆంధ్రప్రదేశ్ పేరును దేశమంతటా చాటింది. ఆ సాహసోపేతమైన ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర 2003లో సరిగ్గా ఇదే రోజున-ఏప్రిల్ 9న మొదలైంది.. ఆ యాత్ర మొదలుపెట్టి నేటికి సరిగ్గా పదకొండేళ్లవుతోంది. చేవెళ్ల నుంచి శ్రీకాకుళం దాకా.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు 40 డిగ్రీల తీవ్రస్థాయి ఎండను సైతం లెక్కచేయకుండా వైఎస్ చేసిన ఆ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. అప్పటికే కుదేలైన కాంగ్రెస్‌కు ఈ పాదయాత్రే మళ్లీ ప్రాణం పోసింది. వైఎస్ పాదయాత్రను ప్రారంభించే నాటికి రాష్ట్రంలో ప్రజలు అనేక బాధలతో అల్లాడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్న పరిస్థితుల్లో వ్యవసాయదారులు, చేతి పనుల వారు నిరాశా నిస్పృహల్లో కొట్టు మిట్టాడుతున్నారు. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రజల బాగోగులను పట్టించుకునే స్థితిలో లేకపోవడంతో రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు అధికమయ్యాయి. దీన స్థితిలో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పి భరోసా ఇవ్వడానికి మండుటెండల్లో వైఎస్ చేసిన ఈ సాహసోపేతమైన పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన రీతిలో స్పందన లభించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి చేవెళ్ల నుంచి మొదలుపెట్టి 11 జిల్లాల్లోని 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 690 గ్రామాల ప్రజలను కలుసుకుంటూ మొత్తం 1,475 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. కరువుతో అలమటిస్తున్న ప్రజలను కలుసుకుని, వారి బాధలు తెలుసుకుని, వారిని ఓదార్చడానికే తప్ప ఓటు కోసం కాదని ప్రకటించి మరీ ఈ సాహసోపేతమైన పాదయాత్రకు ఆయన నడుం బిగించారు. తెలంగాణ, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా సాగిన ఈ యాత్ర దారి పొడవునా ప్రజల ఆప్యాయత, ఆత్మీయతలను అందుకుంటూ ముందుకుసాగిన వైఎస్ వారి జీవన స్థితిగతులను లోతుగా పరిశీలించారు. కరువుకాటకాలతో అప్పటికే అతలాకుతలమవుతున్న రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తే వారి సమస్యలు తీరతాయో గ్రహించడానికి ఈ పాదయాత్ర వైఎస్‌కు దోహదపడింది. 68 రోజుల పాటు ఏక ధాటిగా, అప్రతిహతంగా సాగిన పాదయాత్ర జూన్ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. ఎన్ని కష్టనష్టాలొచ్చినావెరవకుండా తన సంకల్పాన్ని పూర్తి చేశారు. ఆ యాత్రలోనే రైతులకు తక్షణం ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకున్న వైఎస్ వారికి ఉచిత విద్యుత్ ఇచ్చే ఫైలుపై తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. ప్రజలకు ఆరోగ్యం, విద్య, నీడ ఎంత అవసరమో పాదయాత్ర సందర్భంగా తెలుసుకున్న వైఎస్ ఈ మూడు అవసరాలను తీర్చడానికి సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి అమలు చేశారు. అలాగే రాష్ట్రంలోని ఒక కోటి ఎకరాలకు సాగునీటిని కల్పించాలనే బృహత్తరమైన ఆశయంతో జలయజ్ఞం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
2న వైఎస్సార్ కాంగ్రెస్ ప్లీనరీ
ఇడుపులపాయలో ‘ప్రజాప్రస్థానా’నికి ఏర్పాట్లు ఫిబ్రవరి 1న సీజీసీ భేటీ.. 2న అధ్యక్ష ఎన్నిక, విస్తృత సమావేశం: ఉమ్మారెడ్డి, పీఎన్వీ ప్రసాద్ సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో ప్లీనరీని (ప్రజాప్రస్థానం) ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహించనున్నారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ఈ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి ఎన్నికతో పాటు ఇతర సంస్థాగత కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. ఫిబ్రవరి ఒకటిన పార్టీ పాలక మండలి (సీజీసీ) సమావేశమై అధ్యక్ష ఎన్నికల షెడ్యూలును ప్రకటిస్తుంది. రెండో తేదీన ఫలితాల ప్రకటనతో పాటు ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు పార్టీ సంస్థాగత ఎన్నికల కన్వీనర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సంస్థాగత వ్యవహారాల రాష్ట్ర కో-ఆర్డినేటర్ పి.ఎన్.వి.ప్రసాద్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్లీనరీ వివరాలను వెల్లడించారు. రాష్ట్ర స్థాయి విసృ్తత సమావేశం ఓ వైపు జరుగుతుండగానే అవసరమైతే మరోవైపు అధ్యక్ష ఎన్నిక పోలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. సంస్థాగత ఎన్నికల కన్వీనర్‌గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నియమించారని ప్రసాద్ వివరించారు. ప్రతి ఏటా వైఎస్సార్ జయంతి రోజున ప్లీనరీ జరపాలని భావించినప్పటికీ ఈ దఫా మాత్రం సంస్థాగత ఎన్నికల రీత్యా ఫిబ్రవరి 1, 2 తేదీల్లోనే నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్లీనరీ రెండో రోజున విస్తృత సమావేశం ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతున్నందున ప్రతినిధులు ఉదయం 8.30 గంటలకే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. కాగా, రాజ్యసభ సభ్యత్వానికి పార్టీ అభ్యర్థి ఎన్నిక కావటానికి అవసరమైన 40 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం తమ పార్టీకి లేదు కనుకనే పోటీ చేయటం లేదని ఉమ్మారెడ్డి చెప్పారు. ప్లీనరీ వివరాలివీ... ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 2.30 నుంచి 3 గంటల వరకు సీజీసీ సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికకు షెడ్యూలును విడుదల చేస్తారు. 3 నుంచి 4 గంటల వరకు అధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. 5 గంటలకు నామినేషన్ల వివరాలను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 2వ తేదీన ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. 11.30 నుంచి 12.30 వరకు ఓట్ల లెక్కింపు పూర్తిచేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నిక ఫలితాన్ని ప్రకటిస్తారు. ప్లీనరీ ఎజెండా ఇదీ..: మొదట దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డికి, పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి మృతి చెందిన నేతలకు సంతాప ప్రకటన. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రారంభోపన్యాసం. తర్వాత సుదీర్ఘ పాదయాత్ర చేసిన షర్మిల ప్రసంగం. ప్లీనరీ ముగింపుగా పార్టీ అధ్యక్షుడి సందేశం. ప్లీనరీకి ఆహ్వానితులు వీరు..: ఫిబ్రవరి 2న ప్లీనరీలో జరిగే విసృ్తత స్థాయి సమావేశానికి పార్టీలో 27 రకాల హోదాలున్న వారిని ఆహ్వానించారు. పార్టీ సలహాదారులు, సీజీసీ, సీఈసీ సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకులు, శాసనసభా నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు, వివిధ విభాగాల రాష్ట్ర స్థాయి కమిటీల కన్వీనర్లు, కో-ఆర్డినేటర్లు, వివిధ విభాగాల రాష్ట్ర స్థాయి కమిటీల సభ్యులు, జిల్లా, సిటీల పార్టీ కన్వీనర్లు, రాష్ట్ర అనుబంధ కమిటీల కన్వీనర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, మాజీ డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, జిల్లాల పరిశీలకులు, జిల్లాల అధికార ప్రతినిధులు, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు, మునిసిపల్ పరిశీలకులు, కార్పొరేషన్ మాజీ మేయర్లు, పార్టీ సంస్థాగత ఎన్నికల జిల్లాల అధికారులు, జిల్లాల స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల, మునిసిపల్, నగర డివిజన్ కన్వీనర్లు, రాష్ట్ర అనుబంధ కమిటీల సభ్యులు, మునిసిపల్ మాజీ చైర్మన్లు, మాజీ జడ్పీటీసీ, ఎంపీటీసీలు, జిల్లాల అనుబంధ విభాగాల కన్వీనర్లను ఆహ్వానించారు. -
వైఎస్ఆర్ సీపీ తొలి ప్లీనరీ
-
చారిత్రక ప్రస్థానం.
-
వైఎస్ స్ఫూర్తితోనే మరో ప్రజాప్రస్థానం: షర్మిల
-
ప్రజలతో తమ అనుబంధం పెరిగింది: విజయమ్మ
-
విజయ ప్రస్థాన పైలాన్‌ను ఆవిష్కరించిన షర్మిళ, విజయమ్మ
-
రాష్ట్ర విభజనతీరుకు నిరసనగా రేపే రాజీనామా: ఎంపి మేకపాటి
-
మరోప్రజాప్రస్థానం ముగింపు సభ: వైఎస్సాఆర్ సీపీ నేతల ప్రసంగం
-
మరోప్రజాప్రస్థానం ముగింపు సభ: దాడి వీరభద్రారావు ప్రసంగం
-
మరోప్రజాప్రస్థానం ముగింపు సభ: సుజయ్ కృష్ణరంగారావు ప్రసంగం
-
మరోప్రజాప్రస్థానం ముగింపు సభ: పిల్లి సుభాష్ ప్రసంగం
-
అడుగు - ఆశీస్సులు
-
పాదయాత్రలో చూసిన అనుభవాలు మరువలేం
-
చారిత్రక ప్రస్థానం
-
నేటితో ముగియనున్న షర్మిళ పాదయాత్ర
-
అడుగుల ఆశీస్సులు - స్పెషల్ ఎడిషన్
-
శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టిన షర్మిల
-
215వ రోజు పాదయాత్ర కొనసాగేది ఇలా
-
214వ రోజు పాదయాత్ర కొనసాగేది ఇలా
-
బొబ్బిలిలో షర్మిల ప్రసంగానికి అపూర్వ స్పందన
-
చరిత్ర సృష్టించిన షర్మిళ
-
విజయనగరంలో మరో ప్రజా ప్రస్థానం 15th july 2013
-
210వ రోజు పాదయాత్ర కొనసాగేది ఇలా
-
వీరు నాయకులా.. రాక్షసులా?:షర్మిల
-
చీపురపల్లిలో కొనసాగుతున్న పాదయాత్ర
-
ఉండవల్లిపై మండిపడ్డ షర్మిల
-
మరోప్రజాప్రస్థానం ఆడియో సిడి ఆవిష్కరణ
-
‘మీరే వేసే ప్రతీ ఓటు జగనన్న కోసమే’
-
విశాఖతీరంలో మరో ప్రజాప్రస్థానం 7th July
-
విశాఖ తీరంలో 6th july 2013
-
షర్మిల 201వ రోజు పాదయాత్ర షెడ్యూల్
-
విశాఖ తీరంలో 5th july 2013
-
షర్మిల 200వ రోజు పాదయాత్ర షెడ్యూల్
-
విశాఖ షర్మిళ పాదయాత్రలో జన కెరటాలు
-
షర్మిళగారు విశాఖ ఎంపీగా పోటీ చేయండి: అభిమానుల ఫ్లెక్సీలు
-
గాజువాక సెంటర్ నుంచి షర్మిల పాదయాత్ర
-
విశాఖ తీరంలో 4th july 2013
-
షర్మిల 199వ రోజు పాదయాత్ర షెడ్యూల్
-
పైడివాన నుంచి షర్మిల పాదయాత్ర
-
విశాఖ తీరంలో 3rd july 2013
-
షర్మిల 198వ రోజు పాదయాత్ర షెడ్యూల్
-
జగనన్నది కాంగ్రెస్ డీఎన్ఏ కానే కాదు: షర్మిల
-
వైయస్ జగన్ గట్స్ ఉన్న నాయకుడు
-
విశాఖ తీరంలో 2nd july 2013
-
అయ్యన్నపాలెం నుంచి షర్మిల పాదయాత్ర
-
"జనం మెచ్చిన జగన్" సీడీ ఆవిష్కరణ
-
ప్రభుత్వానికి రైతులంటే శ్రద్ధలేదు: షర్మిల
-
విశాఖ తీరంలో 1st july 2013
-
చోడవరంలో షర్మిళ ప్రసంగం
-
విశాఖతీరంలో 29th June 2013
-
షర్మిల 194వ రోజు పాదయాత్ర షెడ్యూల్