వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ రోజు జిల్లాలోని కొత్తవలస గ్రామంలో అడుగుపెట్టిన షర్మిల పాదయాత్రకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. ‘రాబోయే ఎన్నికల్లో మీరు వేసే ప్రతీ ఓటు జగనన్న బయటకు రావడం కోసమేనని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్జీతో గెలిపించాలన్నారు. వైఎస్సార్ అనే పదం పేదలకు అన్నం పెట్టిందని, పేదలకు సంజీవిని అయ్యిందని’ ఆమె అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాలనకు పెద్దగా తేడా ఏమీ లేదని షర్మిల విమర్శించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే రాష్ర్టంలో పాలన సాగుతుందన్నారు.