maro praja prasthanam
-
వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు ఏడేళ్లు పూర్తి
-
అడుగుజాడ
-
షర్మిళతో సాక్షి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
-
చారిత్రక ప్రస్థానం.
-
సోదరుడికి ప్రజల కష్టాలు వివరించిన షర్మిల
-
సిక్కోలు గడ్డపై గర్జించిన షర్మిల
-
మీ ఆప్యాయత మరువలేం
‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం (4-08-2013) శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. ముగింపు సభకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ‘మరో ప్రజాప్రస్థానం’ ముగింపు సభకు హాజరైన జనసందోహంలో ప్రసంగిస్తున్న షర్మిల, చిత్రంలో విజయమ్మ. ‘మరో ప్రజాప్రస్థానం’ ముగింపు సభకు హాజరైన జనసందోహంలో ప్రసంగిస్తున్న షర్మిల, చిత్రంలో విజయమ్మ.షర్మిలకు కిరీటం బహూకరిస్తున్న ధర్మాన పద్మప్రియ ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు షర్మిల పాదయాత్రలో పాల్గొన్న వైఎస్ రాయలరెడ్డి, కాపు భారతి, వాసిరెడ్డి పద్మ, ఆళ్ల రామకృష్ణారెడ్డి, డాక్టర్ హరికృష్ణ, కాపు రామచంద్రారెడ్డి అభిమానుల మధ్య... పాదయాత్రలో ఓ వృద్ధుడి యోగ క్షేమాలు విచారిస్తున్న దృశ్యం ముగింపు సభకు హాజరైన జనవాహినిలో ఒక భాగం ‘విజయవాటిక’ వద్ద మహానేతను స్మరిస్తూ... నవధాన్యాలతో తయారుచేసిన వైఎస్ చిత్రాన్ని బహూకరిస్తున్న సత్తుపల్లి నియోజకవర్గ నేత రామలింగేశ్వరరావు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతున్న చిన్నారులు -
వైఎస్ స్ఫూర్తితోనే మరో ప్రజాప్రస్థానం: షర్మిల
-
ప్రజలతో తమ అనుబంధం పెరిగింది: విజయమ్మ
-
విజయ ప్రస్థాన పైలాన్‌ను ఆవిష్కరించిన షర్మిళ, విజయమ్మ
-
రాష్ట్ర విభజనతీరుకు నిరసనగా రేపే రాజీనామా: ఎంపి మేకపాటి
-
మరోప్రజాప్రస్థానం ముగింపు సభ: వైఎస్సాఆర్ సీపీ నేతల ప్రసంగం
-
చంద్రబాబు పాదయాత్ర.. పాతాళ యాత్ర
శ్రీకాకుళం:టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన పాదయాత్ర పాతాళయాత్రగా మారిపోయిందని పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. త్వరలోనే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి భంగపాటు తప్పదన్నారు. సోనియా గాంధీ ఓడిపోయి జగన్ కాళ్లు పట్టుకునే పరిస్థితి వస్తుందన్నారు. కాగా, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు మాట్లాడుతూ.. షర్మిల పాదయాత్ర రికార్డు సాధించడం కోసం కాదని.. ప్రజల ఇబ్బందులను తెలుసుకునేందుకు ఆమె పాదయాత్ర చేపట్టిందని తెలిపారు. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని పాలకపక్షం, ప్రజల తరపున నిలబడాల్సిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కైయాయని ఆయన చురకలంటించారు. టీడీపీ ప్రజల పక్షం నిలబడటం మాని..అధికార పార్టీకి కొమ్ము కాస్తోందని ఆయన విమర్శించారు. -
మరోప్రజాప్రస్థానం ముగింపు సభ: దాడి వీరభద్రారావు ప్రసంగం
-
మరోప్రజాప్రస్థానం ముగింపు సభ: సుజయ్ కృష్ణరంగారావు ప్రసంగం
-
మరోప్రజాప్రస్థానం ముగింపు సభ: పిల్లి సుభాష్ ప్రసంగం
-
అడుగు - ఆశీస్సులు
-
పాదయాత్రలో చూసిన అనుభవాలు మరువలేం
-
చారిత్రక ప్రస్థానం
-
నేటితో ముగియనున్న షర్మిళ పాదయాత్ర
-
దారులన్నీ ఇచ్ఛాపురం వైపే...
సాక్షి, శ్రీకాకుళం: ఓ మహోజ్వల ఘట్టం సిక్కోలు ఒడిలో రూపుదాల్చుకోబోతోంది. పాదయాత్రలో ఓ అరుదైన రికార్డు ఆదివారం పురుడు పోసుకోనుంది. ప్రజా సంక్షేమం కోసం లక్షలాది మంది అభిమాల నడుమ మహానేత రాజన్న బిడ్డ షర్మిల చేపట్టిన పాదయూత్ర లక్ష్యానికి అతిచేరువులో ఉంది. మరికొన్ని గంటల్లో పాదయూత్ర పూర్తైరికార్డుల్లోకి ఎక్కనుంది. అలుపెరుగని యోధుడు, మహానేత వైఎస్ ఒకనాడు తన ప్రజాప్రస్థాన పాదయాత్ర ముగించిన చోటే ఇప్పుడు ఆయన తనయ రికార్డుస్థాయి పాదయాత్రకు ముగింపు పలకబోతున్నారు. దీనికి ఇచ్ఛాపురం వేదిక కానుంది. జిల్లాలో ఈనెల 21న ప్రారంభమైన యాత్ర శనివారం నాటికి మొత్తం 14 రోజులు పూర్తిచేసుకుంది. చివరిరోజు (15వరోజు) 6.3 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసి పాదయాత్రకు ముగింపు పలకను న్నారు. ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 230 రోజుల సుదీర్ఘమైన పాదయాత్రకు గుర్తుగా ఇచ్ఛాపురంలో నిర్మించిన భారీ విజయప్రస్థానం స్తూపాన్ని ఆవిష్కరిస్తారు. వైఎస్ ప్రజాప్రస్థానం విజయ వాటికకు ఎదురుగా నిర్మించిన ఈ స్థూపాన్ని ఆకర్షిణీయంగా తీర్చిదిద్దారు. అనంతరం ఆశేష జనవాహిని హాజరయ్యే బహిరంగ సభలో షర్మిల ప్రసంగించనున్నారు. మరోవైపు ఈ సభలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీకార్యకర్తలు శనివారం సాయంత్రానికే శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు. మరి కొందరు విశాఖలో మకాం వేశారు. వీరంతా ఉదయూన్నే ఇచ్ఛాపురం చేరుకుని బహిరంగసభలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వేలాదిమందితో ముఖాముఖి సుధీర్ఘ పాదయూత్రలో షర్మిల వేలాదిమందిని కలిశారు. కష్టసుఖాలు తెలుసుకున్నారు. మంచిరోజులు వస్తాయని, జగనన్నను ఆశీర్వదించాలంటూ పిలుపునిచ్చారు. జగనన్న.. రాజన్న రాజ్యం తెస్తాడని భరోసానిస్తూ ముందుకు సాగారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలో యూత్రసాగిన పాల కొండ, ఆమదాలవలస, శ్రీకాకుళం, నరసన్నపేట, పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో 106 పెద్ద, వందలాది చిన్నగ్రామాలకు చెందిన వేలాది మంది ప్రజలను పలకరిస్తూ షర్మిల పాదయూత్ర సాగించారు. ఆమెకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పట్టారు. వీరంతా ఇచ్ఛాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని, షర్మిలకు వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నారు. అభిమానమే అడుగులు వేరుుంచింది సోంపేట/కవిటి/ఇచ్ఛాపురం/ఇచ్ఛాపురం రూరల్, న్యూస్‌లైన్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల చేపట్టిన పాదయూత్రలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఆమెకు అండగా నిలిచారు. అరుుతే, పాదయూత్ర ఆరంభం నుంచి 230 రోజుల పాటు 3,112 కిలోమీటర్లు మేర సాగిన పాదయాత్రలో రాజన్న బిడ్డతో కొందరు అడుగు కలిపారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఆమెతో పాటు పాదయూత్ర చేస్తూ అభిమానం చాటుకున్నారు. ఆదివారంతో ముగియనున్న పాదయూత్ర సందర్భంగా బహుదూరపు బాటసారుల అభిప్రాయాలు వారిమాటల్లోనే... అభిమానంతోనే... దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబం అంటే చాలా ఇష్టం. 2003 సంవత్సరంలో వైఎస్సార్‌తో పాదయూత్రలో పాల్గొన్నాను. జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్రలో ఆయన వెంటే ఉన్నా. అదే స్ఫూర్తితో ఆ ఇంటి ఆడబిడ్డ షర్మిలతో నడుస్తున్నాను. ఇడుపులపాయ నుంచి ఆమెతో కలిసి పాదయాత్రలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. - కంది అంజిరెడ్డి, చింతగుంట పాలేం, పర్చూరుమండలం, ప్రకాశం జిల్లా ఫీజు రీరుుంబర్స్మెంట్తో డాక్టర్‌నయ్యా... వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఫీజు రీరుుంబర్స్‌మెంట్ పథకంతో చదువు సాగించి డాక్టర్‌ను అయ్యూను. ఆయన చేసిన మేలు జన్మజన్మలకి మరచిపోలేను. ఏ సీఎం కూడా ఇలాంటి బృహత్తరపథకాన్ని ప్రవేశపెట్టలేదు. ఆయనపై ఉన్న అభిమానంతోనే షర్మిల పాదయూత్రలో పాల్గొన్నాను. ఎంత దూరం నడిచినా కష్టమనిపించలేదు. - ఎం.గురుమూర్తి, తిరుపతి వృద్ధాప్యం మీదపడినా.. వృద్ధాప్యం మీద పడినా వైఎస్సార్ కుటుంబంపై ఉన్న అభిమానం పాదయూత్రలో పాల్గొనేలా చేసింది. ఇడుపుల పాయలో బయలుదేరి ఇంతవరకు నడచి వస్తానని మొదట్లో అనుకోలేదు. మహానేత కుటుంబంపై ఉన్న అభిమానం, నమ్మకమే ఇంతదూరం నడిపించారుు. ఆ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. - గోపిరెడ్డి సుబ్బారెడ్డి, కనికెల్ల మెట్ల, ప్రకాశం జిల్లా ప్రజా స్పందన అపూర్వం ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు షర్మిల పాదయాత్రకు ప్రజాస్పందన అపూర్వం. 2003 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టి 2014లో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు షర్మిల పాదయూత్రతో 2014 సంవత్సరంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని ఆశిస్తున్నాను. మరికొద్ది రోజుల్లో ప్రజలకు మంచిరోజులు రానున్నాయి. - నూనెదశరథ రామిరెడ్డి, పెద్దపలుకులూరు, గుంటూరు జిల్లా చేదోడు వాదోడుగా ఉండాలని.. ఆడ బిడ్డకు చేదోడు వాదోడుగా ఉండాలని, రాజన్నపై అభిమానంతో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు షర్మిలతో కలిసి నడిచి వచ్చాను. జగన్మోహన్రెడ్డిని అక్రమంగా జైల్లో పెట్టారు. త్వరలోనే బయటకు వస్తారు. అధికారం చేపట్టి రాజన్నరాజ్యాన్ని తెస్తారు. నాలాంటి పేదలను ఆదుకుంటారు. - సన్నపరెడ్డి రమణమ్మ, నేలటూరు, ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలం రాజన్న రాజ్యం రావాలనే... రాజన్నరాజ్యం రావాలనే ఆకాంక్షతో రాజన్న కూతురు వెంట ఇడుపుల పాయనుంచి ఇచ్ఛాపురం వరకు నడిచి వచ్చాను. వైఎస్ కుటుంబానికి ప్రజల ఆదరణ అపూర్వం. దీనిని చూసి కాంగ్రెస్, టీడీపీ నాయకుల గుండెలు వణుకుతున్నారుు. జగన్‌ను అక్రమంగా జైల్లో బంధించారు. త్వరలోనే మంచిరోజులు వస్తాయన్న నమ్మకం ఉంది. -హిమ ప్రమీలమ్మ, గుద్దెళ్ల గ్రామం, అనంతపురం జిల్లా -
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 230వ రోజు(జిల్లాలో 15వ రోజు) కార్యక్రమ వివరాలను ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలు శనివారం ప్రకటించారు. ఆదివారం ఉదయం గుడ్డిభద్ర గ్రామ సమీపంలోని బస నుంచి ప్రారంభమయ్యే షర్మిల పాదయాత్ర.. బలరాంపురం, సవరదేవిపేట, అయ్యవారిపేట, లొద్దపుట్టి గ్రామాల మీదుగా సాగుతుంది. భోజన విరామం తర్వాత షర్మిల.. ఇచ్ఛాపురం పట్టణానికి చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. జిల్లాలో 15వ రోజు పర్యటించే ప్రాంతాలు బలరాంపురం, సవరదేవిపేట, అయ్యవారిపేట, లొద్దపుట్టి, ఇచ్ఛాపురం -
గమ్యం దిశగా ‘మరో ప్రజాప్రస్థానం’
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గమ్యస్థానానికి చేరబోతోంది. విజయ ప్రస్థానం స్థూపం వైపు దూసుకెళ్తోంది. కనుచూపు మేరలో లక్ష్యం నిలబడింది. దాన్ని నేడు అధిగమించబోతోంది. అలుపెరగని బాటసారి వడివడిగా అడుగులేసి ముందుకు సాగుతున్నారు. మరికొన్ని గంటల్లో విజయ వాకిట్లోకి చేరుకుంటారు. చారిత్రాత్మక పాదయాత్రకు ముగింపు పలికి.. చరిత్రలో తనదైన ముద్ర వేసుకోనున్నారు మహానేత వైఎస్ తనయ షర్మిల. సాక్షి, శ్రీకాకుళం: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, అధికార పార్టీతో అంటు కాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వాకాన్ని ఎండగడుతూ ప్రియతమ నేత ముద్దుబిడ్డ షర్మిల చేపడుతున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర రాష్ట్ర సరిహద్దు పట్టణం ఇచ్ఛాపురం శివారుకు చేరింది. శనివారం ఉదయం 9 గంటలకు 229వ రోజు పాదయాత్ర జలంత్ర కోటలో ప్రారంభమైంది. అప్పటికే ఆ ప్రాంతానికి చేరుకున్న మహిళలు, యువకులు జగనన్న సోదరిని చూడగానే జై జగన్ అంటూ హోరెత్తించారు.‘ వస్తున్నాయ్ వస్తున్నాయ్ అదిగో జగన్నాథ రథచక్రాలు’ అనే పాటకు యువత చిందులేస్తూ పాదయాత్రలో కొనసాగారు. అశేష జనవాహిని మధ్య జాతీయ రహదారిపై ముందుకు కదిలారు. మరోవైపు అభిమానులు వైఎస్సార్ పతాకాలను పట్టుకుని ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించి జయహో జగన్ అంటూ నినదించారు. ఇక్కడ పశ్చిమ గోదావరికి చెందిన వృద్ధుడు పిల్లి సత్యనారాయణను రాజన్న తనయ ఆప్యాయంగా పలకరించగా.. ఇడుపులపాయ నుంచి షర్మిలతో కలిసి వస్తున్న ఆయన ఆనందం చెందాడు. ఇక్కడి నుంచి కంచిలి జాతీయ రహదారిపైకొచ్చేసరికి మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరారు. హారతులిచ్చి, పూల వర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. మహానేత గారాలపట్టితో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. జీడి కార్మికులు తమ సమస్యల గోడును వివరించారు. కంచిలి జంక్షన్లో జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు బారులు తీరి డ్రిల్ మార్క్ చప్పట్లతో అపూర్వ స్వాగతం పలకగా.. షర్మిల కూడా పిల్లందరితో కరచాలనం చేసి అభినందనలు అందించారు. ఇక్కడ కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం అందజేశారు. అక్కడి నుంచి బైరి మీదుగా పాదయాత్ర కొనసాగింది. షర్మిలమ్మ వస్తుందని తెలిసి అటు ఒడిశా, ఇటు ఆంధ్రా ప్రయాణఇకులు బస్సులు ఆపి మరి జగనన్న సోదరిని ఆప్యాయంగా పలకరించారు. దారిపొడవునా యువతీయువకులు పాదయాత్రను చిత్రీకరించేందుకు, సెల్ఫోన్లో ఫొటోలు తీసేందుకు పరుగులు తీశారు. సంత గ్రామ సమీపంలో 104 శ్రీకాకుళం జిల్లా ప్రతినిధులు రఘు, చంద్రశేఖర్,కృష్ణ తదితరులు షర్మిలను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. సానుకూలంగా స్పందించిన రాజన్న బిడ్డ జగనన్న సీఎం కాగానే సంచార సంజీవినికి ఊపిరిపోస్తారన్నారు. మధ్యాహ్న భోజనం విరామం తర్వాత పాదయాత్ర ప్రారంభమవుతుంని తెలిసి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. జాడుపూడి, గొర్లెపాడు మీదుగా అభిమానుల కోలహాలంతో ముందుకు సాగింది. మార్గమధ్యలో ఖజూడు వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి షర్మిల నివాళులర్పించారు. ఆర్.కరపాడు మీదుగా కవిటి కూడలికి పాదయాత్ర చేరేసరికి స్థానికులు పెద్ద ఎత్తున హైవే మధ్య డివైడర్‌పై బారులు తీరి అఖండ స్వాగతం పలికారు. అక్కడి నుంచి గుడ్డిబద్ర మీదుగా రాత్రి బస ప్రాంతానికి షర్మిల చేరుకున్నారు. దారి పొడవునా అభిమానులు నీరాజనాలు పట్టారు. పాదయాత్రలో వైఎస్ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి, ఎం.వి.కృష్ణారావు, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, తాజా మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, చిత్తూరు నియోజకవర్గ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఐటీ విభాగం రాష్ట్ర కన్వీనర్ చల్లా మదుసూధన్‌రెడ్డి, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ నేత చలమశెట్టి సునీల్, సమన్వయకర్తలు బొడ్డేపల్లి మాధురి, జిల్లా యువజన విభాగం కన్వీనర్ హనుమంతు కిరణ్‌కుమార్, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ బొడ్డేపల్లి పద్మజ, జిల్లా అధికార ప్రతినిధి దుప్పల రవీంద్ర, పార్టీ నేతలు కొయ్య ప్రసాదరెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, పీవీఎస్ఎన్ రాజు, శివాజీరాజు, అంధవరపు సూరిబాబు, కోత మురళి, ధర్మాన ఉదయ భాస్కర్, పిరియా విజయ, వజ్జా గంగాభవానీ, పలికిల భాస్కరరావు, కారంగి మోహనరావు, బెందాళం హరిబాబు, ఎస్.జయప్రకాష్, డాక్టర్ జీవితేశ్వరరావు, ప్రధాన రాజేంద్రప్రసాద్, రావాడ లక్ష్మీనారాయణనాయుడు, కొత్తకోట శేఖర్, గులివిల్లి ప్రకాష్, బగాది రామకృష్ణ, బగాది నర్సింగరావు, ఎం.రాజారావు, కె.వెంకటేశ్వరరావు, పి.కామేష్, పిన్నింటి ఈశ్వరరావు, గొలివి నర్సునాయుడు పాల్గొన్నారు. -
అడుగుల ఆశీస్సులు - స్పెషల్ ఎడిషన్
-
సిక్కోలులో మరో ప్రజా పస్థానం
-
విజయనగరంలో మరో ప్రజా ప్రస్థానం 27th july 2013
-
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా
-
శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టిన షర్మిల
-
215వ రోజు పాదయాత్ర కొనసాగేది ఇలా
-
214వ రోజు పాదయాత్ర కొనసాగేది ఇలా
-
బొబ్బిలిలో షర్మిల ప్రసంగానికి అపూర్వ స్పందన
-
చరిత్ర సృష్టించిన షర్మిళ
-
విజయనగరంలో మరో ప్రజా ప్రస్థానం 15th july 2013
-
210వ రోజు పాదయాత్ర కొనసాగేది ఇలా
-
వీరు నాయకులా.. రాక్షసులా?:షర్మిల
-
చీపురపల్లిలో కొనసాగుతున్న పాదయాత్ర
-
ఉండవల్లిపై మండిపడ్డ షర్మిల
-
మరోప్రజాప్రస్థానం ఆడియో సిడి ఆవిష్కరణ
-
‘మీరే వేసే ప్రతీ ఓటు జగనన్న కోసమే’
-
విశాఖతీరంలో మరో ప్రజాప్రస్థానం 7th July
-
విశాఖ తీరంలో 6th july 2013
-
షర్మిల 201వ రోజు పాదయాత్ర షెడ్యూల్
-
విశాఖ తీరంలో 5th july 2013
-
షర్మిల 200వ రోజు పాదయాత్ర షెడ్యూల్
-
విశాఖ షర్మిళ పాదయాత్రలో జన కెరటాలు
-
షర్మిళగారు విశాఖ ఎంపీగా పోటీ చేయండి: అభిమానుల ఫ్లెక్సీలు
-
గాజువాక సెంటర్ నుంచి షర్మిల పాదయాత్ర
-
విశాఖ తీరంలో 4th july 2013
-
షర్మిల 199వ రోజు పాదయాత్ర షెడ్యూల్
-
పైడివాన నుంచి షర్మిల పాదయాత్ర
-
విశాఖ తీరంలో 3rd july 2013
-
షర్మిల 198వ రోజు పాదయాత్ర షెడ్యూల్
-
జగనన్నది కాంగ్రెస్ డీఎన్ఏ కానే కాదు: షర్మిల
-
వైయస్ జగన్ గట్స్ ఉన్న నాయకుడు
-
విశాఖ తీరంలో 2nd july 2013
-
అయ్యన్నపాలెం నుంచి షర్మిల పాదయాత్ర
-
"జనం మెచ్చిన జగన్" సీడీ ఆవిష్కరణ
-
ప్రభుత్వానికి రైతులంటే శ్రద్ధలేదు: షర్మిల
-
విశాఖ తీరంలో 1st july 2013
-
చోడవరంలో షర్మిళ ప్రసంగం
-
విశాఖతీరంలో 29th June 2013
-
షర్మిల 194వ రోజు పాదయాత్ర షెడ్యూల్
-
హాస్టల్ విద్యార్థులతో షర్మిళ
-
కొత్తకోటలో వైఎస్ షర్మిళ ప్రసంగం
-
విశాఖ తీరంలో 27th june 2013
-
బ్రాందేయవాదాన్ని నమ్ముకున్న కాంగ్రెస్: షర్మిల