సిక్కోలు గడ్డపై గర్జించిన షర్మిల | Maro Praja Prasthanam conclusion Meeting: Sharmila fire on Congress | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 5 2013 7:47 AM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజనంటూ జరిగితే తెలుగువాళ్లందరికీ న్యాయం జరిగేలా ఉండాలని ఆమె డిమాండ్ చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీని సూటిగా ఒకటే మాట అడుగుతున్నాం. మీరు న్యాయం(తెలుగువాళ్లందరికీ) చేయలేకపోతే, ఆ(విభజన) బాధ్యతనుకానీ, ఆ అధికారాన్ని కానీ ఎందుకు తీసుకున్నారు? అని అడుగుతున్నాం. మీపాటికి మీరు ఒక నిర్ణయం తీసేసుకొని ఇక ‘మీ ప్రాప్తం ఇంతే, మీ ఖర్మ ఇంతే’ అని మీ నిర్ణయాన్ని కోట్ల మంది ప్రజల మీద రుద్దితే అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా?’’ అని ఆమె నిలదీశారు. ‘‘వైఎస్సార్ రాష్ట్రాన్నంతా సమానంగా ప్రేమించారు. ‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజనంటూ జరిగితే తెలుగువాళ్లందరికీ న్యాయం జరిగేలా ఉండాలని ఆమె డిమాండ్ చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీని సూటిగా ఒకటే మాట అడుగుతున్నాం. మీరు న్యాయం(తెలుగువాళ్లందరికీ) చేయలేకపోతే, ఆ(విభజన) బాధ్యతనుకానీ, ఆ అధికారాన్ని కానీ ఎందుకు తీసుకున్నారు? అని అడుగుతున్నాం. మీపాటికి మీరు ఒక నిర్ణయం తీసేసుకొని ఇక ‘మీ ప్రాప్తం ఇంతే, మీ ఖర్మ ఇంతే’ అని మీ నిర్ణయాన్ని కోట్ల మంది ప్రజల మీద రుద్దితే అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా?’’ అని ఆమె నిలదీశారు. ‘‘వైఎస్సార్ రాష్ట్రాన్నంతా సమానంగా ప్రేమించారు. ప్రతి తెలుగు కుటుంబం సంతోషంగా ఉండాలని తపించారు. రాజశేఖరరెడ్డి పేరు మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన జగన్‌మోహన్‌రెడ్డి కూడా తెలుగు ప్రజలంతా తన కుటుంబమేనని ఎన్నోసార్లు చెప్పారు. తెలుగు ప్రజల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకునే వ్యక్తి కాదు జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన ఉద్దేశం ఒకటే ఒకటి.. తెలుగువాడు అనే ప్రతివాడూ సంతోషంగా ఉండాలి. తెలుగువాళ్లందరికీ సమాన న్యాయం ఉండాలి. తెలుగువాళ్లందరికీ సమాన హక్కులు ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి మళ్లీ చెప్తున్నాం.. తెలుగువాళ్లందరికీ న్యాయం చేసే సత్తా మీకు లేకపోతే, ఆ బాధ్యతను, ఆ అధికారాన్ని తీసుకునే హక్కు మీకు ముమ్మాటికీ లేదు’’ అని ఆమె ఉద్ఘాటించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. ముగింపు సభకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే.. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ఎత్తుగడ.. ‘‘కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్ల రాజకీయ లబ్ధి కోసం మన రాష్ట్రాన్ని తలకాయ ఒకరికి, మొండెం ఒకరికి అని విడగొట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇలా పైభాగం ఒకరికి, కింది భాగం ఒకరికి అని ఇస్తే, కిందిభాగం వారికి సాగునీరు కాదు కదా.. కనీసం తాగునీరు కూడా దిక్కుండదని తెలిసి కూడా ఈ పాపానికి పూనుకుంది. ఇప్పటికే మహారాష్ట్రలో వాళ్ల అవసరాలు తీరాక, కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం నిండితే తప్ప కింద ఉన్న మన రాష్ట్రానికి నీళ్లు ఇవ్వని తీరును చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏమార్పులూ చేయకుండానే మధ్యలో ఇంకొక రాష్ట్రాన్ని సృష్టిస్తే ఇక శ్రీశైలం పాజెక్టుకు, నాగార్జున సాగర్‌కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పిస్తామని అంటున్నారు. కానీ ఆ పోలవరానికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పడం లేదు. శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా సముద్రం నీళ్లు తప్ప మంచి నీళ్లు ఎక్కడున్నాయి? ఇలా సీమాంధ్రను విడగొడితే ఈప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందో, అసలు ఈ ప్రాంతం ఒక మహా ఎడారిగా అయిపోతుందనే కనీస ఇంగితం ఈ నాయకులకు లేదు అనుకోవాలా? లేకపోతే సీమాంధ్ర ఎడారి అయిపోయినా ఫర్వాలేదు, తమకు తెలంగాణలో 15 సీట్లు వస్తే చాలు అనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు అనుకోవాలా?

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement