వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 222వ రోజు (జిల్లాలో ఏడో రోజు) కార్యక్రమ వివరాలను ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలు శుక్రవారం ప్రకటించారు. శనివారం ఉదయం గుండుమల్లిపేట సమీపం లోని బస నుంచి ప్రారంభమయ్యే షర్మిల పాదయాత్ర.. నరసన్నపేట, జాతీయ రహదారిలోని జమ్ము జంక్షన్ మీదుగా రావాడపేట చేరుకుంటుంది. భోజన విరామం తర్వాత తిలారు, నారాయణవలస, లింగాలవలస, చల్లవానిపేట, గంగాధరపేట, జోనంకి మీదుగా అంగూరు చేరుకుంటుంది. అనంతరం అక్కడికి సమీపంలో షర్మిల రాత్రి బస చేస్తారు. జిల్లాలో ఏడో రోజు పర్యటించే ప్రాంతాలు నరసన్నపేట, జాతీయ రహదారి, రావాడపేట, తిలారు, నారాయణవలస, లింగాలవలస, చల్లవానిపేట, గంగాధరపేట, జోనంకి, అంగూరు