వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 198వ రోజు సాగే వివరాలను పాదయాత్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, విశాఖ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ మంగళవారం ప్రకటించారు. షర్మిల బుధవారం పెందుర్తి నియోజకవర్గంలోని జగన్నాథపురం (పైడివాడ)లో పాదయాత్ర మొదలు పెడతారు. పెదగొల్లలపాలెం మీదుగా సాగి వెదుళ్లనరవ సమీపంలో లంచ్ చేస్తారు. గాజువాక నియోజకవర్గంలోని దువ్వాడ సెంటర్ మీదుగా శ్రీనగర్ చేరుకుంటారు. రాత్రికి గ్రామ సమీపంలో బస చేస్తారు.