Sharmila padayatra
-
అర్ధరాత్రి వైఎస్ షర్మిల దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ దీక్షను శనివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు భగ్నం చేశారు. బలవంతంగా అపోలో ఆస్పత్రికి తరలించారు. తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ ఆమె శుక్రవారం లోటస్‌పాండ్ వద్ద దీక్షకు దిగిన విషయం తెలిసిందే. కాగా షర్మిల దీక్ష శనివారం రెండోరోజు కూడా కొనసాగింది. దీక్ష చేస్తున్న షర్మిలను వైఎస్ విజయమ్మ కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. ‘ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ పతనానికి నాంది. న్యాయస్థానమంటే ఆయనకు గౌరవం లేదు..’ అని విమర్శించారు. తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను పోలీసులు అకారణంగా అరెస్ట్ చేయడమే కాకుండా వారిపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా పార్టీ కార్యాలయం చుట్టూ బారికేడ్లు పెట్టారు. సామాన్యులను కూడా రానివ్వడం లేదు. వచి్చన వాళ్లందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు..’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ దేశమంతా రాజకీయాలు చేసుకోవచ్చు. ఆయనకు మాత్రం అన్ని పరి్మషన్లు వస్తాయి. కానీ, ప్రజల కోసం కొట్లాడే మా పార్టీపై మాత్రం దాడులా?..’అని మండిపడ్డారు. షర్మిల ప్రాణాలకు ప్రమాదం: వైద్యులు శనివారం సాయంత్రం వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. షరి్మల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని, ఆమె 30 గంటలుగా మంచినీళ్లు సైతం తీసుకోవడం లేదని డాక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. వైద్య పరీక్షలు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లాక్టేట్ లెవెల్స్ బాగా పెరిగాయని, యూరియా, బీపీ, గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె వెంటనే ఆసుపత్రిలో చేరకపోతే ప్రాణాలకు ప్రమాదమని చెప్పారు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పోలీసులు ఆమెను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. -
రణరంగంగా షర్మిల పాదయాత్ర
సాక్షి, వరంగల్/ చెన్నారావుపేట: రాష్ట్రంలో అధికార పార్టీ పనితీరును ప్రశ్నిస్తూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో రణరంగంగా మారింది. నియోజకవర్గ సమస్యలను ఎత్తిచూపుతూ, స్థానిక ఎమ్మెల్యే పనితీరును తప్పుపడుతూ షర్మిల చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు సోమవారం ఆందోళనలకు దిగాయి. ఆమెకు స్వాగతం పలుకుతూ పెట్టిన ఫ్లెక్సీలను చింపేసిన టీఆర్ఎస్ శ్రేణులు.. ఆమె బసచేసే ప్రత్యేక బస్సు (కారవాన్)పై పెట్రోల్ పోసి నిప్పంటించడం కలకలం రేపింది. తర్వాత షర్మిల సేదదీరుతున్న సమయంలో కర్రలు, పెట్రోల్ బాంబులు తేవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శాంతిభద్రతల సమస్య అంటూ పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆమె ముఖంపై గాయాలయ్యాయి. పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో దహనమవుతున్న బస్సు.. వైఎస్ షర్మిలకు తగిలిన గాయం యాత్ర మొదలైన కాసేపటికే.. నర్సంపేట మండలం రాములునాయక్ తండా సమీపంలో ఆదివారం రాత్రి వైఎస్ షర్మిల నైట్ హాల్ట్ చేశారు. సోమవారం ఉదయం 9.00 గంటల సమయంలో నర్సంపేట, మామునూరు, పరకాల ఏసీపీలు అక్కడికి వచ్చి మాట్లాడారు. ఇంటెలిజెన్స్ నివేదికల మేరకు పాదయాత్రలో శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చని చెప్పారు. దీనిపై స్పందించిన షర్మిల.. కావాలంటే టీఆర్ఎస్ శ్రేణులు ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడొచ్చని, కోర్టులో కేసు వేసుకోవచ్చని సమాధానమిచ్చారు. తర్వాత 10.00 గంటలకు 223వ రోజు షర్మిల పాదయాత్ర ప్రారంభమై.. రాజపల్లి, మగ్దుంపురం మీదుగా చెన్నారావుపేటకు చేరుకుంది. అక్కడ ఆమె ప్రసంగిస్తున్న సమయంలోనే కొంతదూరంలోని షర్మిల స్వాగత ఫ్లెక్సీలకు టీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పుపెట్టారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత శంకరంతండా వద్ద వైఎస్ షర్మిల పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి సేదతీరారు.మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో కారులో అక్కడికి వచ్చిన కొందరు బస్సుపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. అది చూసిన గ్రామస్తులు, వైఎస్సార్టీపీ నాయకులు వెంటనే మంటలను ఆర్పేశారు. దీనిని నిరసిస్తూ వైఎస్ఆర్టీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి. ప్రతిగా టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు షర్మిల విశ్రాంతి తీసుకుంటున్న బస్సు వద్దకు దూసుకొచ్చి ‘షర్మిల గో బ్యాక్’నినాదాలు చేశారు. కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు కర్రలు, పెట్రోల్ బాంబులు (పాలిథీన్ కవర్లలో పెట్రోల్ నింపినవి) పట్టుకువచ్చి దాడికి దిగారు. పలు వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో పలువురు వైఎస్సార్టీపీ కార్యకర్తలకు, సీఐకి గాయాలయ్యాయి. వైఎస్ఆర్ విగ్రహం, షర్మిల ఫ్లెక్సీకి నిప్పుపెట్టిన టీఆర్ఎస్ శ్రేణులు. అరెస్టు చేసి.. తరలించి.. శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందంటూ పోలీసులు వైఎస్ షర్మిలను అక్కడి నుంచి తరలించాలని నిర్ణయించారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవడం దారుణమని.. దీనికి పాల్పడ్డ టీఆర్ఎస్ గూండాలను కఠినంగా శిక్షించాలని షర్మిల డిమాండ్ చేశారు. అయితే పోలీసులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆమెను అరెస్టుచేసి పోలీసు వాహనంలో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. తర్వాత కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు విధ్వంసం ఆపలేదు. ప్రత్యేక బస్సు అద్దాలను పగలగొట్టారు. మరికొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులు ఆ బస్సును చెన్నారావుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు టీఆర్ఎస్ నేతలు లింగగిరిలోని వైఎస్ఆర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. వైఎస్ఆర్ అభిమానులు మంటలు ఆర్పి విగ్రహానికి పాలతో అభిషేకం చేశారు. దాడులపై ఫిర్యాదులు వైఎస్ షర్మిల పాదయాత్రపై టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల దాడి, ఫ్లెక్సీలు, బస్సు (కారవాన్), వైఎస్సార్ విగ్రహ దహనం ఘటనలపై వైఎస్సార్టీపీ నేతలు చెన్నారావుపేట పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులను స్వీకరించామని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ సంపత్‌రావు తెలిపారు. తెలంగాణ చరిత్రలో ఇదో బ్లాక్ డే: వైఎస్ షర్మిల సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చరిత్రలో సోమవారం ఒక బ్లాక్ డే అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తాను ప్రజలపక్షాన నిలబడినందుకు ప్రభుత్వం శిక్ష వేసిందని ఒక ప్రకటనలో మండిపడ్డారు. తన ప్రచార వాహనాన్ని తగలబెట్టడాన్ని, తనను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ప్రజా సమస్యల్ని ఎత్తిచూపుతున్న తన యాత్రకు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రజలు తనపై చూపిస్తున్న ఆదరణను తట్టుకోలేకే లేని శాంతిభద్రతల సమస్యలు సృష్టించి, హైదరాబాద్‌కు తీసుకువచ్చారని ఆరోపించారు. ‘‘ఒకప్పుడు టీఆర్ఎస్లో ఉద్యమకారులు పనిచేశారు. ఇప్పుడు అందరూ గూండాలుగా మారారు. ఇలా దాడులు చేసే హక్కు ఎవరు ఇచ్చారు? పొద్దున్నుంచీ పోలీసులు లాఅండ్ ఆర్డర్ సమస్య అంటూ వచ్చారు. దుండగులు మా బస్సుకు నిప్పుపెట్టారు. వాహనాలన్నీ తగలబెట్టారు. వారిని అరెస్ట్ చేయలేదు, వాళ్లను ఆపాలన్న సోయి కూడా పోలీసులకు లేదు. ప్రజల గురించి కొట్లాడితే ప్రభుత్వం నాకు ఇలా బహుమతి ఇచ్చింది. సిగ్గులేని సర్కారు.. సిగ్గులేని కేసీఆర్’’ అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తనను ఈడ్చుకెళ్లి వాహనం ఎక్కించారని.. వారు యూనిఫాం వదిలి టీఆర్ఎస్ కండువాలు కప్పుకోవాలని వ్యాఖ్యానించారు. -
జగనన్న బాణానికి పుట్టినరోజు శుభాకాంక్షలు
-
నేడు ప్రకాశం జిల్లాలో షర్మిళ శంఖారావం
-
శంషాబాద్‌లో వైఎస్ తనయకు ఆత్మీయ స్వాగతం
మిన్నంటిన ‘జై జగన్’ నినాదాలు ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా వెళ్లి జగన్‌ను కలిసిన షర్మిల సాక్షి, హైదరాబాద్: అభిమానం వెల్లువెత్తింది. జోరు వానను సైతం లెక్కచేయక.. ‘జై జగన్.. జయహో జగన్’ అన్న నినాదం శంషాబాద్ ఎయిర్‌పోర్టును హోరెత్తించింది. పద్నాలుగు జిల్లాల మీదుగా 3,112 కిలోమీటర్ల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రను ముగిం చుకుని సోమవారం ఉదయం విశాఖపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్ షర్మిల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మలకు వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నినాదాల మధ్య షర్మిల శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా చంచల్‌గూడ జైలుకు వెళ్లి తన సోదరుడు, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని ములాఖత్‌లో కలుసుకున్నారు. పాదయాత్ర సాగిన తీరును షర్మిల ఈ సందర్భంగా జగన్‌తో పంచుకున్నారు. ములాఖత్ అనంతరం షర్మిల వేల మంది అభిమానులు భారీ కాన్వాయ్‌తో వెంటరాగా తన నివాసానికి చేరుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి నర్సింగ్‌రావు, కె.శివకుమార్, బి.జనార్ధన్‌రెడ్డి, అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు, మైనారిటీ సెల్ కన్వీనర్ రహమాన్, కార్మిక విభాగం కన్వీనర్ జనక్‌ప్రసాద్, సీఈసీ సభ్యులు మతీన్ముజదాది, పి.విజయారెడ్డి, యువజన, సేవాదళం కన్వీనర్లు పుత్తా ప్రతాప్‌రెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, నగర కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్, నియోజకవర్గాల సమన్వయకర్తలు దేప భాస్కర్‌రెడ్డి, ధన్‌పాల్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, లింగాల హరిగౌడ్, సాయినాథ్‌రెడ్డి, నాయకులు సురేష్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, రాచమళ్ల సిద్ధేశ్వర్, రూపానందరెడ్డి, కొండా రాఘవరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో కార్యకర్తలు షర్మిలకు స్వాగతం పలికారు. షర్మిల పాదయాత్ర చరిత్రాత్మక ఘట్టం: బాజిరెడ్డి గోవర్ధన్ రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ‘మరో ప్రజాప్రస్థానం’ పేరుతో షర్మిల చేపట్టిన పాదయాత్ర చరిత్రాత్మక ఘట్టమని పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సోమవారం ఆయన కార్యకర్తలతో కలిసి షర్మిల వెంట చంచల్‌గూడ జైలుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ను అక్రమంగా జైల్లో నిర్బంధించినప్పటికీ షర్మిల తండ్రి బాటలో నడుస్తూ ప్రజల బాగోగుల కోసం పాదయాత్ర చేయటంతో ఆమె చరిత్ర సృష్టించారని చెప్పారు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే పార్టీ ఉద్దేశమని అన్నారు. మహానేత వైఎస్ఆర్ ఆశయాలను నెరవేర్చేందుకే వైఎస్ఆర్సీపీ స్థాపించారన్నారు. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిల ప్రపంచ చరిత్రలో నిలిచిపోతారన్నారు. పాదయాత్ర ప్రజలకు భరోసానిచ్చింది: జనక్ ప్రసాద్ కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, షర్మిల పాదయాత్ర ప్రజలకు భరోసానిచ్చిందని పార్టీ నేత జనక్ ప్రసాద్ అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎందరో నాయకులు బయటకు వెళితే మాట్లాడని వారు తమ పార్టీ నుంచి కొందరు వెళ్లిపోతే తెలంగాణ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ లేదనడం సరికాదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలోకి వచ్చిన వారే తిరిగి వెళ్లిపోయారన్నారు. తెలంగాణలో ఉన్న నాయకులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, ఆ ప్రాంతంలో పార్టీని మరింత పటిష్ట పరచాలని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షం: గట్టు వైఎస్ఆర్ సీపీ ప్రజల పక్షానే ఉందని ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. షర్మిల చేపట్టిన పాదయాత్రతో కాంగ్రెస్, టీడీపీ నేతలు భయకంపితులయ్యారన్నారు. జగన్‌ను అక్రమంగా నిర్బంధించాక ప్రాంతాలకతీతంగా, మతాలకతీతంగా, కులాలకతీతంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కసితో పని చేస్తున్నారన్నారు. వైఎస్సార్ పాలన మళ్లీ జగన్ నాయకత్వంలోనే సాధ్యమవుతుందని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారని చెప్పా రు. పదవుల కోసం వ చ్చిన వారే పార్టీని విడిచిపెట్టారని, వారు వైఎస్ఆర్పై అభిమానంతో వచ్చిన వారు కాదన్నారు. తెలంగాణ ఏర్పడినా ఆ ప్రాంతంలో పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. వైఎస్ఆర్ సీపీ జాతీయ పార్టీగా అభివృద్ధి చెందుతుందన్నారు. షర్మిల పాదయాత్రతో గర్వపడుతున్నాం: రహమాన్ రాష్ట్ర ప్రజల సాధకబాధకాలను తెలుసుకుని వారికి భరోసా ఇస్తూ షర్మిల దాదాపు 3 వేల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేయడం గర్వంగా భావిస్తున్నామని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ రహమాన్ అన్నారు. మహిళ అయినప్పటికీ వేల కిలోమీటర్ల మేర పాదయాత్రను చేయడంతో షర్మిల చరిత్రపుటల్లో నిలిచిపోతారన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఏకమై జగన్‌ను సీఎం చేయాలన్నారు. షర్మిలకు ఘన స్వాగతం సాక్షి ప్రతినిధి, బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ పాదయాత్ర ద్వారా రికార్డు సృష్టించిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి తనయ షర్మిలకు సోమవారం సాయంత్రం బెంగళూరు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆమెకు సాదర స్వాగతం పలకడానికి పెద్ద సంఖ్యలో వైఎస్ అభిమానులు విమానాశ్రయానికి తరలివచ్చారు. డాక్టర్ వైఎస్సార్ స్మారక ఫౌండేషన్ కర్ణాటక అధ్యక్షుడు వెంకట కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు భక్తవత్సల రెడ్డి, కార్యదర్శి బత్తుల అరుణాదాస్, కోశాధికారి రాకేశ్‌రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి సీహెచ్ బాలకృష్ణారెడ్డి, పదాధికారులు దామోదర రెడ్డి, రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ కుటుంబంపై వెల్లువెత్తిన అభిమానం
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో వైఎస్ఆర్ కుటుంబంపై రాష్ట్ర ప్రజలు అభిమాన వర్షం కురిపించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వెల్లువలా తరలివచ్చారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల కుఠిల, కుతంత్రాలను ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ప్రజలకు బాసటగా రాష్ట్రంలో సాగించిన మరోప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపు సభ శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆవిష్కరించిన ప్రజాప్రస్థాన జ్ఞాపిక వద్ద ఏర్పాటు చేసిన సభ జన సందోహంతో నిండిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి జనం ఇచ్ఛాపురానికి తలిరావడం ప్రారంభించారు. పాదయాత్రలో ఉన్న షర్మిల నేరుగా సాయత్రం నాలుగు గంటలకు విజయప్రస్థాన స్థూపం వద్దకు చేరుకున్నారు. తండ్రి వైఎస్ ఆవిష్కరించిన ప్రజాప్రస్థాన స్థూపం వద్ద రాజన్నకు నివాళులర్పించారు. అనంతరం వైఎస్ విగ్రహంతో ఏర్పాటు చేసిన విజయప్రస్థాన స్థూపాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి నేరుగా వేదిక మీదకు వచ్చారు. అప్పటికే వేదిక జనంతో నిండిపోయింది. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. షర్మిలతో పాటు ఇడుపులపాయ నుంచి పాదయాత్ర చేసిన వారు ఆమె వెన్నంటే ఉన్నారు. నేతల ప్రసంగాలు పూర్తయిన తరువాత కూడా జనం అలాగే నిల్చుండిపోయారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మాట్లాడిన తరువాత షర్మిల మాట్లాడారు. వైఎస్ఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు, చేపట్టిన పథకాలు, విజయవంతమైన తీరును ఒక్కొక్కటిగా షర్మిల వివరించారు. ప్రజలపై ఎటువంటి భారం పడకుండా ఐదేళ్ల కాలం వైఎస్ ప్రజల కోసం ఏమిచేశారో కళ్లకు కట్టినట్లు వివరించారు. ఆయన మరణించారనే వార్త వినగానే ప్రతి కుటుంబం తన ఇంటి పెద్దను కోల్పోయామనే బాధతో ఎంతో మంది మరణించారని షర్మిల పేర్కొన్నారు. ప్రజలకు ఏమి అవసరమో, ఎలా చేస్తే ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉంటారో ఆలోచించి పథకాలు ప్రవేశపెట్టారని, ఆ పథకాల ద్వారా ప్రతి కుటుంబం సుఖంగా జీవించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ రెక్కల కష్టంమీద వచ్చిందనే విషయాన్ని ఈపాలకులు గుర్తించకుండా ఆయన చనిపోయిన తరువాత అతని పేరును ఎఫ్ఆర్లో చేర్చి దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, ఏ తప్పూ చేయని జగనన్నను కూడా అకారణంగా జైలులో పెట్టి నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని నెలలు జైలులో ఉంచినందుకు సీబీఐని దోషిగా గుర్తించాలని, చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకొని కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న కుట్రలను ఛేదించేందుకు ప్రజలే న్యాయనిర్ణేతలు కావాలని పిలుపు నిచ్చారు. ప్రజా కోర్టులోకి వచ్చి ఢీకొనే సత్తా కాంగ్రెస్‌కు కాని, దానికి కొమ్ముకాస్తున్న టీడీపీకి కాని లేదని స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతానికి నష్టం చేకూరే విధంగా వ్యవహరించిందని, అన్ని ప్రాంతాలు సమాన స్థాయిలో అభివృద్ధి చెందిన తరువాత విడగొడితే బాగుండేద నే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీమాంధ్ర నేతలు గాజులు తొడుక్కొని కూర్చున్నారా? అంటూ అనడంతో జనం నుంచి అనూహ్య స్పందన లభించివేదిక వద్ద నుంచి జనం జేజేలు పలుకుతూ జిందాబాద్‌లు కొట్టారు. విభజన జరిగిన తరువాత హైదరాబాద్‌లో బతకడం అంటే పాకిస్థాన్‌లో బతకడమే అవుతుందన్నారు. ఓ తండ్రి అన్నదమ్ములకు భాగ పంపకాలు చేయాలంటే అందరినీ సమాన దృష్టితో చూస్తాడని, ఈ పాలకులు అలా కాకుండా వ్యత్యాసాలు చూపారన్నారు. పలు అంశాలపై సమగ్రమైన చర్చ జరగాల్సి ఉందన్నారు. చంద్రబాబు ఎప్పుడూ నిజం చెప్పడని, నిజం చెబితే ఆయన తల ముక్కలవుతుందని శాపం ఉందని షర్మిల చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేసిన ప్రసంగం జనాన్ని ఉద్వేగానికి గురిచేసింది. తన భర్త జనం గురించి నిత్యం ఆలోచించారు. ఆయన మరణానంతరం జగన్ మీ వద్దకు వచ్చారు. ఆయనను మీ నుంచి కాంగ్రెస్ వారు దూరం చేశారు. నా బిడ్డలను మీ చేతుల్లో పెట్టాను, వారిని ఆదరించి అక్కున చేర్చుకోమని చెప్పాను. షర్మిలను మీచేతుల్లో పెట్టాను. మరోప్రజా ప్రస్థానంలో నా బిడ్డ జీవితంలో ఎన్నో మలుపులు సంభవించాయి. వైఎస్ అపురూపంగా షర్మిలను పెంచుకున్నాడు. షర్మిలకు గాయమైనప్పుడు పడిన బాధను చూసినప్పుడు నాకు చాలా చాలా కష్టమనిపించింది. నా మనస్సు అప్పుడు చాలా బాధపడింది అంటూ ఉద్వేగానికి గురయ్యారు. అమ్మా ఎంత మంచి బిడ్డలను కన్నావమ్మా ఎంతైనా పులిబిడ్డ పులిబిడ్డలేనమ్మ అంటూ జనం అంటుంటే నాకు కళ్ళ నిండా నీళ్లు వచ్చినా సంతోషంగా ఉండేది. అందుకే షర్మిల జగన్ సంధించిన బాణంగా రాష్ర్టంలో పాదయాత్ర చేసిందన్నారు.షర్మిల వేదక వద్దకు మరో ఐదు నిమిషాల్లో వస్తుందనగా పావుతక్కువ నాలుగు గంటల సమయంలో పూల వర్షం కురిసింది.జనం కేరింతలు కొట్టారు. ఇచ్ఛాపురంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని విజయమ్మ వివరించారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు వంశీకృష్ణ యాదవ్, కొయ్యప్రసాదరెడ్డి, చెంగల వెంకటరావు, ఉషాకిరణ్, బలిరెడ్డి సత్యారావు, గండి బాబ్జీ, బి.సూర్యారావు, జహీర్ అహ్మద్, తిప్పలనాగిరెడ్డి, ఎస్.రవిరాజు, కోలా గురువులు, పూడి మంగపతిరావు, వంజంగి కాంతమ్మ, కిలారి సర్వేశ్వరరావు, బొడ్డేడ ప్రసాద్, కోరాడ రాజబాబు, పెట్ల ఉమాశంకర్, కొత్తపల్లి గీత, భూపతిరాజు శ్రీనివాసరాజు, సత్తిరామకృష్ణారెడ్డి, కాకర్లపూడి శ్రీకాంతరాజు, బి.పూలరెడ్డి, దాడి రత్నాకర్, గొలగాని శ్రీనివాసరావు, ఏఆర్కె రాజు, గల్ల అప్పారావు, ఎన్.శివారెడ్డి, ప్రగడ నాగేశ్వరరావు, చిక్కాల రామారావు, ప్రభాగౌడ్, రవిరెడ్డి, కంపా హనుక్, ఎం.మనోజ్‌బాబు, గంపల గిరిధర్విజయనగరం జిల్లా నేతలు పెనుమత్స సాంబశివరాజు, అవనాపు విజ య్, గురాన అయ్యలు, కడుబండి శ్రీనివాసరావు, పెనుమత్స సురేష్‌బాబు, గొర్లె వెంకటరమణ, గేదెల తిరుపతిరావు, వల్లూరి జయప్రకాష్, బోకం శ్రీనివాస్,వేచలపు చినరామునాయుడు, డాక్టర్ పెద్ది నాయుడు, ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, కాకర్ల పూడి శ్రీనివాసరాజు, మక్కువ శ్రీధర్, జమ్మాన ప్రసన్నకుమార్, శ్రీవాణి, రాయల సుందరరావు, ప్రశాంత్, తూర్పుగోదావరి జిల్లా నేతలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, చెలుబోయిన వేణుగోపాలకృష్ణ, ఏబి బుచ్చిమహేశ్వరరావు, కర్రి పాపారాయుడు, మందపాటి కిరణ్‌కుమార్,బొడ్డు వెంకట అనంత చౌదరి, టికె విశ్వేశ్వరరెడ్డి, చెలమశెట్టి సునీల్, రావూరి వెంకటేశ్వరరావు, పశ్చిమగోదావరి జిల్లా నేతలు ఆళ్ల నాని, తానేటి వనిత, మద్దాల రాజేష్, శ్రీరంగనాధరాజు, ముదునూరు ప్రసాదరాజు, చెలుమూరు అశోక్ గౌడ్, తలారి వెంకటరావు పాల్గొన్నారు. -
వైఎస్ స్ఫూర్తితోనే మరో ప్రజాప్రస్థానం: షర్మిల
-
ప్రజలతో తమ అనుబంధం పెరిగింది: విజయమ్మ
-
విజయ ప్రస్థాన పైలాన్‌ను ఆవిష్కరించిన షర్మిళ, విజయమ్మ
-
రాష్ట్ర విభజనతీరుకు నిరసనగా రేపే రాజీనామా: ఎంపి మేకపాటి
-
మరోప్రజాప్రస్థానం ముగింపు సభ: వైఎస్సాఆర్ సీపీ నేతల ప్రసంగం
-
చరిత్ర పుటల్లో నిలిచిపోనున్న షర్మిల పాదయాత్ర: జూపూడి
శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు చెప్పారు. పాదయాత్ర నేటితో ముగియనున్న సందర్భంగా ఆ పార్టీ నేతలందరూ ఇచ్చాపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ ప్రజల కోసం షర్మిల సుదీర్ఘమైన పాదయాత్ర చేశారన్నారు. కష్టాల్లో ఉన్న జగన్‌ను ఆదరిస్తున్న ప్రజల అభిమానం చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజన చేసి కేంద్రం చారిత్రక తప్పిదం చేసిందని జూపూడి అన్నారు. వైఎస్ఆర్సీపీ మహిళ విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి మాట్లాడుతూ షర్మిల పాదయాత్రతో కాంగ్రెస్, టీడీపీల గుండెల్లో రైళ్లు పరిగెత్తుస్తున్నాయన్నారు. ఈ రోజు ఉదయం షర్మిల మరో ప్రజాప్రస్థానం 230వ రోజు పాదయాత్ర బలరాంపురం నుంచి ప్రారంభమైంది. సవరదేవిపేట, అయ్యవారిపేట, లొద్దపుట్టి మీదుగా పాదయాత్ర కొనసాగింది. ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి నేతలు కార్యకర్తలు ఇచ్చాపురం చేరుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం భారీగా తరలివస్తున్నారు. సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. షర్మిల 9 నెలల్లో 14 జిల్లాల్లో 116 నియోజకవర్గాల మీదుగా 3,112 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ రాజకీయ చరిత్రలో ఓ సంచలన రికార్డు సృష్టించారు. -
మరోప్రజాప్రస్థానం ముగింపు సభ: దాడి వీరభద్రారావు ప్రసంగం
-
మరోప్రజాప్రస్థానం ముగింపు సభ: సుజయ్ కృష్ణరంగారావు ప్రసంగం
-
మరోప్రజాప్రస్థానం ముగింపు సభ: పిల్లి సుభాష్ ప్రసంగం
-
అడుగు - ఆశీస్సులు
-
పాదయాత్రలో చూసిన అనుభవాలు మరువలేం
-
చారిత్రక ప్రస్థానం
-
నేటితో ముగియనున్న షర్మిళ పాదయాత్ర
-
అడుగుల ఆశీస్సులు - స్పెషల్ ఎడిషన్
-
తుడ్డలి నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం
-
శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టిన షర్మిల
-
215వ రోజు పాదయాత్ర కొనసాగేది ఇలా
-
214వ రోజు పాదయాత్ర కొనసాగేది ఇలా
-
బొబ్బిలిలో షర్మిల ప్రసంగానికి అపూర్వ స్పందన
-
చరిత్ర సృష్టించిన షర్మిళ
-
విజయనగరంలో మరో ప్రజా ప్రస్థానం 15th july 2013
-
210వ రోజు పాదయాత్ర కొనసాగేది ఇలా
-
వీరు నాయకులా.. రాక్షసులా?:షర్మిల
-
చీపురపల్లిలో కొనసాగుతున్న పాదయాత్ర
-
ఉండవల్లిపై మండిపడ్డ షర్మిల
-
మరోప్రజాప్రస్థానం ఆడియో సిడి ఆవిష్కరణ
-
‘మీరే వేసే ప్రతీ ఓటు జగనన్న కోసమే’
-
విశాఖతీరంలో మరో ప్రజాప్రస్థానం 7th July
-
విశాఖ తీరంలో 6th july 2013
-
షర్మిల 201వ రోజు పాదయాత్ర షెడ్యూల్
-
విశాఖ తీరంలో 5th july 2013
-
షర్మిల 200వ రోజు పాదయాత్ర షెడ్యూల్
-
విశాఖ షర్మిళ పాదయాత్రలో జన కెరటాలు
-
షర్మిళగారు విశాఖ ఎంపీగా పోటీ చేయండి: అభిమానుల ఫ్లెక్సీలు
-
గాజువాక సెంటర్ నుంచి షర్మిల పాదయాత్ర
-
విశాఖ తీరంలో 4th july 2013
-
షర్మిల 199వ రోజు పాదయాత్ర షెడ్యూల్
-
పైడివాన నుంచి షర్మిల పాదయాత్ర
-
విశాఖ తీరంలో 3rd july 2013
-
షర్మిల 198వ రోజు పాదయాత్ర షెడ్యూల్
-
జగనన్నది కాంగ్రెస్ డీఎన్ఏ కానే కాదు: షర్మిల
-
వైయస్ జగన్ గట్స్ ఉన్న నాయకుడు
-
విశాఖ తీరంలో 2nd july 2013
-
అయ్యన్నపాలెం నుంచి షర్మిల పాదయాత్ర
-
"జనం మెచ్చిన జగన్" సీడీ ఆవిష్కరణ
-
ప్రభుత్వానికి రైతులంటే శ్రద్ధలేదు: షర్మిల
-
విశాఖ తీరంలో 1st july 2013
-
చోడవరంలో షర్మిళ ప్రసంగం
-
విశాఖతీరంలో 29th June 2013
-
షర్మిల 194వ రోజు పాదయాత్ర షెడ్యూల్
-
హాస్టల్ విద్యార్థులతో షర్మిళ
-
కొత్తకోటలో వైఎస్ షర్మిళ ప్రసంగం
-
విశాఖ తీరంలో 27th june 2013
-
బ్రాందేయవాదాన్ని నమ్ముకున్న కాంగ్రెస్: షర్మిల