వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ప్రసంగానికి బొబ్బిలిలో అపూర్వ స్పందన లభించింది. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా ఈ సాయంత్రం ఆమె ఇక్కడకు వచ్చారు. ఆమె వస్తున్నారని తెలిసి చుట్టుపక్కల గ్రామాల నుంచి అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. బొబ్బిలి జనసంద్రమైంది. జగన్ జై అన్న నినాదాలతో పట్టణం మార్మోగింది. జనంతో బొబ్బిలి వీధులన్నీ నిండిపోయాయి. సభా ప్రాంగణం వద్ద జనం కిక్కిరిసిపోయారు. మేడలు, మిద్దెలు, గోడలు ఎక్కి జనం ఆమె ప్రసంగం ఆసక్తిగా విన్నారు. షర్మిత తన ప్రసంగంలో ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు రాజకీయాలను వివరించారు. మహిళలతో సహా జనం మొత్తం ఆమె ప్రసంగానికి చప్పట్లు కొడుతూ, చేతులు ఊపుతూ తమ స్పందన తెలిపారు.