bobbili
-
వీర బొబ్బిలి కోటలో.. వీణ బొబ్బిలి పాట
సాక్షి, అమరావతి: తెలుగునాట వీణ అంటే అంతా బొబ్బిలి వైపే చూస్తారు. అక్కడ తయారయ్యే వీణల ప్రత్యేకత అలాంటిది మరి. వీణ ధ్వని, స్పష్టత ఎక్కువగా ఉండేలా తీగలు నిర్మించడం వల్ల బొబ్బిలి వీణలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. తంజావూరు లాంటి సంప్రదాయ వీణల తయారీకి మూడు రకాల చెక్కలు వినియోగిస్తే.. బొబ్బిలి వీణలను పనస చెక్కలతో రూపొందించడం మరో ప్రత్యేకత. ఇవన్నీ కలగలిపి బొబ్బిలి వీణలకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టాయి. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ మహోత్సవంలో తెలుగు వీణాగానం అలరించింది. వీణా విద్వాంసురాలు శ్రీవాణికి దక్కిన అరుదైన గౌరవంతో మరోసారి దేశవ్యాప్తంగా బొబ్బిలి వీణపై చర్చ మొదలైంది. ఇదీ ప్రస్థానం.. 17వ శతాబ్దంలో బొబ్బిలి రాజ్య వ్యవస్థాపకుడైన పెద్దరాయుడికి కళలపై ఉన్న మక్కువ బొబ్బిలిలో వీణల తయారీకి బీజం వేసిందని చెబుతారు. తన సంస్థానంలో సిద్ధహస్తులైన ఇద్దరు వడ్రంగులను మైసూరు పంపించి.. అక్కడి వీణల తయారీ నేర్చుకోవాలని పెద్దరాయుడు సూచించారు. ఆయన సూచనలతో అక్కడికి వెళ్లి వచి్చన వారితో బొబ్బిలి వీణల తయారీ మొదలైంది. నాటి మైసూరు సంస్థానంలోని తంజావూరులో ఈ వీణల తయారీ గురించి తెలుసుకున్న సర్వసిద్ధి అచ్చెన్న బొబ్బిలి తిరిగి వచ్చాక ఇక్కడ తయారుచేసిన వీణలు మంచి ఆదరణ పొందాయి. ఆ వీణల వాయిద్యం నేర్చుకుని బొబ్బిలి రాజులు ఎంతో మురిసిపోయినట్టు చెబుతారు. ఆ తర్వాత విజయనగర ఆస్థానం సహా అనేక మంది రాజులు కూడా బొబ్బిలి వీణల కొనుగోలుకు సిద్ధం కావడంతో ఆదరణ పెరిగింది. క్రమంగా బొబ్బిలి వీణలకు దేశవ్యాప్త గుర్తింపు వచి్చంది. ఈమని శంకర శాస్త్రి వంటి ఎందరో వైణిక విద్వాంసులు బొబ్బిలి వీణలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. వీణావాదన సంగీత ద్వయం వాసా కృష్ణమూర్తి, వాసా సాంబమూర్తి 1850 ప్రాంతంలో బొబ్బిలి వీణలపైనే వాయించడం ద్వారా వాటికి వన్నెతెచ్చారు. ఇప్పటికీ 40 మంది తయారీదారులు విజయనగరం జిల్లా బొబ్బిలిలోని గొల్లపల్లి వీణల కేంద్రంలో సర్వసిద్ధి వర్గానికి చెందిన దా దాపు 40 మంది కళాకారులు వీణలను తయారు చేస్తున్నారు. ఇక్కడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు పలు పుణ్యక్షేత్రాలకు వందల సంఖ్యలో వీణలు సరఫరా అవుతుంటాయి. లేపాక్షి సంస్థ వీణలు కొనుగోలు చేసి పర్యాటక కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయిస్తోంది. దాదాపు 14 రకాల ఆకారాలతో గిఫ్ట్ వీణలను కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. నూజివీడులోనూ వీణలు తయారు చేస్తున్నారు. 120 ఏళ్లుగా వంశపారం పర్యంగా నూజివీడు వీణ ఆదరణ పొందుతోంది. అధికారిక పర్యటనలకు వచ్చే ఉన్నతాధికారులు, ప్రముఖులకు, కళాకారులకు, ప్రజా ప్రతినిధులకు జ్ఞాపికగా ఇచ్చేందుకు వీణను వినియోగిస్తున్నారు. అలా 2000 సంవత్సరంలో మన రాష్ట్రానికి వచి్చన అప్పటి అమెరికా ప్రధాని బిల్ క్లింటన్ బొబ్బిలి వీణల తయారీ గురించి తెలుసుకుని అచ్చెరువొందారు. వీణల తయారీలో ఉత్తమ వృత్తి కళాకారునిగా రాష్ట్రపతి అవార్డు అందుకున్న సర్వసిద్ది వీరన్నను వైట్‌హౌస్‌కు రావలసిందిగా ఆహా్వనించారు. ఎంతో చరిత్ర కలిగిన బొబ్బిలి వీణకు 1980లో జాతీయ అవార్డు లభించగా.. 2011లో జియోగ్రాఫికల్ గుర్తింపు లభించింది.ఎన్నో ప్రత్యేకతల సమాహారం వీణ ప్రముఖంగా కర్ణాటక సంగీత కచేరీలలో వినియోగిస్తారు. దీనిని ఉత్తరాదిన రుద్రవీణగా.. దక్షిణాదిలో సరస్వతీ వీణగా.. మధ్య భారతంలో విచిత్ర వీణగా పిలుచుకుంటారు. వీణలో ముఖ్యంగా కుండ, దండి, యాళి (పౌరాణిక జంతువు మెడ ఆకారం), సొరకాయ బుర్ర అనే భాగాలుంటాయి. వీణల్లో చాలా రకాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో తయారమ్యే సరస్వతి వీణ, మయూరీ వీణ, మీరా వీణ, డ్రాగన్ వీణ, విపంచి వీణ, శంఖం వీణ, గోటు వీణ, మధుర వీణ, మశ్చ వీణ ప్రసిద్ది చెందాయి. పనస చెట్టు కర్ర వీణసారె వీణ తయారీలో ప్రధానమైన భాగం. ఇది తేలికగా ఉండటమే కాకుండా మంచి ధ్వని పలికిస్తుంది. దృఢత్వం, మన్నిక, తేమని తట్టుకోగలగడం వల్ల దీన్ని విరివిగా వాడతారు. మైసూరు, తంజావూరు వీణలను మూడు కొయ్య ముక్కలను కలిపి తయారు చేసేవారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఏకాండీ కొయ్యముక్క (ఒకే చెక్క ప్రత్యామ్నాయ బొబ్బిలి వీణ ముక్క) తోనే వీణను తయారు చేస్తారు.గిట్టుబాటు కావడం లేదు ప్రస్తుత వీణల ధరలు గిట్టుబాటు కావడం లేదు. కలప, ఇతర ముడి సరుకుల ధరలు బాగా పెరిగాయి. వీణల ధరలు పెంచేందుకు హస్తకళల అభివృద్ధి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. అక్కడి నుంచి అనుమతులు వస్తే పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. – ఎస్.రామకృష్ణ, బొబ్బిలి వీణల కేంద్రం ఇన్చార్జి కలప కొరత వేధిస్తోంది వీణల తయారీకి వాడే పనస కలపకు గిరాకీ ఎక్కువగా ఉంది. పనస కలప అయితేనే వీణలు నచి్చన ఆకృతుల్లో తయారు చేసేందుకు అనువుగా ఉంటాయి. మా కళాకారులందరికీ ప్రభుత్వం కలపను సబ్సిడీపై సరఫరా చేయాలి. – పెదపాటి కిరణ్, వీణల తయారీదారుఏడాదంతా పని దొరుకుతోంది వీణల కేంద్రంలో మాకు గౌరవప్రదమైన పని ఏడాది పొడవునా దొరుకుతోంది. విశ్వవ్యాప్తమైన బొబ్బిలి వీణల కళాకారులుగా మంచి పేరు పొందడం ఆనందంగా ఉంది. – సర్వసిద్ధి చైతన్య, వీణల తయారీదారు -
Bobbili: వాటీజ్ దిస్ ‘బేబీ’?
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మిట్ట మధ్యాహ్నం... బొబ్బిలి మెయిన్‌రోడ్డు... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మలివిడత ప్రచార సభ... వేలాది జనం పోటెత్తారు. బుధవారం ఈ ప్రభంజనాన్ని చూసినవారంతా ఆశ్చర్యపోయారు. కానీ ఒక్కరు మాత్రం ఉలిక్కిపడ్డారు. ఆయనే బొబ్బిలి టీడీపీ అభ్యర్థి ఆర్వీఎస్కేకే రంగారావు ఉరఫ్ బేబీనాయన! తమ పూర్వీకుల వీరప్రతాపం గురించి కోటకు వచ్చినవారందరికీ పూసగుచ్చినట్లు చెప్పే ఆయన... ఇప్పుడు జగన్మోహన్రెడ్డి సభ అంటే హడలిపోవడం విచిత్రంగా ఉందని బొబ్బిలి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అంతకుముందు జరిగిన వైఎస్సార్సీపీ సభలకు పోటెత్తిన జనాన్ని చూసి ముందురోజు నుంచే ‘రక్షణ’ పేరుతో చెడగొట్టే కార్యక్రమానికి తెరలేపారు.బొబ్బిలి కోట సమీపంలో సభ పెడితే తమ కుటుంబానికి భద్రత ఉండదని, తమకు రక్షణ కల్పించాలంటూ తన న్యాయవాది ద్వారా ఎన్నికల కమిషన్‌కు, అధికారులకు ఫిర్యాదులు పంపించడం గమనార్హం. కానీ రోడ్డుషోకు హాజరైన ప్రజలు కానీ, వైఎస్సార్సీపీ శ్రేణులు కానీ ఆ కోట గేటు వైపు కూడా కన్నెత్తిచూడలేదు. ఇక తన ప్రసంగంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడా బేబీనాయన గురించి కానీ, మంత్రి పదవి కోసం సంతలో పశువులా అమ్ముడుపోయి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఆయన సోదరుడు ఆర్వీఎస్కే రంగారావు (సుజయ్) గురించి కానీ ప్రస్తావన తీసుకురాలేదు. ఒకవైపు కూటమి నాయకులు తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నా జగన్మోహన్రెడ్డి మాత్రం తన ప్రత్యర్థి పారీ్టకి చెందిన బొబ్బిలి రాజుల పట్ల హుందాగా వ్యవహరించడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే కావాలని... బొబ్బిలి పట్టణంలో దశాబ్దాల సమస్యగా ఉన్న మెయిన్ రోడ్డు విస్తరణనూ చేపట్టలేక బేబీనాయన మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు, ఆయన సోదరుడు సుజయ్ టీడీపీలోకి వెళ్లి మంత్రిగా అధికారం వెలగబెట్టినప్పుడు చేతులెత్తేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.10 కోట్ల వ్యయంతో మెయిన్‌రోడ్డును విస్తరించారు. ఆ సోదరులు బొబ్బిలికి చేసిన మేలేమిటో ఒక్కటీ చెప్పలేరు.ఆ మెయిన్ రోడ్డుపైనే సభలన్నీ... ‘సైకిల్ పోవాలి’ అంటూ చంద్రబాబు నినాదం ఇచ్చిన ‘ఇదేమి ఖర్మ’ కార్యక్రమం కూడా బొబ్బిలి మెయిన్రోడ్డుపైనే 2022 డిసెంబర్ 23న బేబీనాయన సమక్షంలోనే జరిగింది. పట్టుమని రెండు వేల మంది కూడా ఆ కార్యక్రమానికి రాలేదు. ఆ తర్వాత అదే రోడ్డుపై గత ఏడాది నవంబరు 23న జరిగిన వైఎస్సార్సీపీ ‘ప్రజా సంకల్పయాత్ర’కు జనం పోటెత్తారు. కళాభారతి నుంచి బొబ్బిలి కోట వరకూ జనసంద్రమైంది. జగన్మోహన్రెడ్డి కార్యక్రమాలకు అంతకుమించి జనం వస్తారనే అంచనాతో బేబీనాయనకు బెంగపట్టుకుంది. సభాస్థలి కోటకు సమీపంలో పెట్టడం ఇష్టం లేక తన కోట ‘భద్రత’ పేరుతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏమిటీ నాయనా మీ గొప్ప... అధికారం దక్కేవరకే బేబీనాయనకు ప్రజలతో పని. ఒకసారి పీఠం దక్కిందా ఆ తర్వాత అదే ప్రజలను కోట గుమ్మం కూడా ఎక్కనివ్వని చరిత్ర ఆయన సొంతం. చివరకు అధికారులైనా దర్బార్మహల్లో రోజంతా పడిగాపులు బొబ్బిలి ప్రజలకు అనుభవమే. తొలుత 2009లో బొబ్బిలి 29వ వార్డు కౌన్సిలర్‌గా బేబీ నాయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అదీ కోటను ఆనుకొని ఉన్న వార్డు, ఆరొందలకు మించని ఓటర్లు అయినా సరే గెలుపుపై భయం పట్టుకుంది. అప్పట్లో పోటీ పడిన టీడీపీ అభ్యరి్థని నయానాభయానో ఒప్పించి తన ఏకగ్రీవ ఎన్నిక కోసం బరి నుంచి తప్పించారు. అలా బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకున్న ఆయన పదవీకాలం 2009–14లో ముచ్చటగా మూడుసార్లు మాత్రమే ఆ కురీ్చలో కూర్చున్నారు. కారణమేమిటో తెలుసా? మున్సిపల్ సాధారణ సమావేశాల్లో కౌన్సిలర్లు కొన్ని సమస్యలపై నిలదీస్తుండటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసేవారు. పదవీ అలంకారం కాదు ప్రజాసేవ కోసమనే విషయం తెలియని ఆయన ఇక ఆ తర్వాత ఎప్పుడూ కౌన్సిల్ హాలులోకి అడుగుపెట్టలేదు. వైస్ చైర్మన్ గునాన విజయలక్షి్మకి బాధ్యతలు అప్పగించేసి ప్రజలకు ముఖం చాటేశారు. అంతేకాదు మున్సిపల్ చైర్మన్ పదవిలోకి వచ్చినప్పుడు తనకోసం ప్రత్యేకంగా చేయించుకున్న కురీ్చని కూడా కోటకు తీసుకుపోయారు. -
బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)
-
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది
-
CM Jagan Election Campaign: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచారంలో జనగర్జన (ఫొటోలు)
-
‘జగన్‌ను ప్రజలే రక్షించుకుంటారు’: బొబ్బిలి రోడ్‌షోలో సీఎం జగన్
విజయనగరం, సాక్షి: కుర్చీలు లాక్కోవడం, వెన్నుపోటు పొడవడం, మోసం చేయడం, మనషుల్ని చంపేయడం.. ఇదే చంద్రబాబు రాజకీయమని, అలాంటి చంద్రబాబుకి ఓటేయమని అడిగే అర్హత ఎక్కడ ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బుధవారం ఉదయం బొబ్బిలి మెయిన్ రోడ్ సెంటర్లో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగించారు.ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటేస్తే పథకాల కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు. మళ్లీ మోసపోవడం ఖాయం. ఈ ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదు.. ఈ ఓటుతో మీ తలరాతలు మారుతాయి. రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించేవే ఈ ఎన్నికలు. పథకాల కొనసాగింపును నిర్ణయించేవి ఈ ఎన్నికలు....చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది. లంచాలు, వివక్ష లేకుండా నేరుగా సంక్షేమం అందించాం. ప్రతీ పేదవాడికి అండగా ఉంటూ వైద్యం అందించాం. రైతన్నకు చేయిపట్టుకుని సాయం అందించాం. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జరగని సామాజిక న్యాయం కళ్లెదుటే కనిపిస్తోంది. ఈ 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో రూ.2 లక్షల 70 వేల కోట్లు అందించాం. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం... ఎన్టీఆర్ కుర్చీని లాక్కుని, సొంత పార్టీ అధ్యక్షుడ్ని కుట్రలతో చంపేసిన వ్యక్తి. వంగవీటి మోహన రంగాను కుట్రలతో చంపింది ఎవరు?. ఐఎస్ అధికారి రాఘవేంద్రను కుట్రలతో చంపించింది ఎవరు?. ఇప్పడు మీ బిడ్డను ప్రజల్లో ఓడించలేనని చంద్రబాబుకి అర్థం అయ్యింది. మోసపూరిత హామీలతో.. ఎన్నెన్ని మాటలు చెబుతున్నా ప్రజలెవరూ చంద్రబాబును నమ్మడం లేరు. జనం మోసపోవడానికి సిద్ధం లేరని చంద్రబాబుకి అర్థం అయ్యింది. ఈ జగన్‌ను చంపేస్తే ఏమౌతుంది అంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే ఇది సిగ్గుచేటు పరిణామం.చంద్రబాబు మాటలు ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నాయి. అయ్యా చంద్రబాబూ.. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్, ఆ మహానేతకు వచ్చిన ప్రజాదరణను ఓర్వలేక అసెంబ్లీ సాక్షిగా ‘నువ్వు ఆ గాలిలోనే కలిసిపోతావ్’ అని అన్నమాటల్నినేను మరిచిపోలేను. నాడు నా తండ్రిని, నేడు నన్నూ.. ఈ ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనలేక నువ్వు మాట్లాడే మాటలు.. నీ నేర ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి. బాబు మెంటల్ హెల్త్ ఏ స్థాయిలో ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలి.కానీ, చంద్రబాబు అనుకుంటే జగన్ చనిపోడు.. జగన్‌ను ప్రజలే రక్షించుకుంటారు. అవ్వాతాలు, అక్కాచెల్లెమ్మల ప్రార్థనలు, దీవెనలే నాకు శ్రీరామరక్ష... ఎన్నికలయ్యాక చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారు. కానీ, మీ బిడ్డ ఈ జగన్ 58 నెలల పాలనలో 99 శాతం హామీలు అమలు చేశాడు. అయ్యా.. నువ్వు 14 ఏళ్లు సీఎంగా చేశావ్. మరి నీ పేరు చెబితే ఒక్క పేదవాడికి మంచి చేసినట్లు గుర్తుకు వస్తుందా?. 2014లో మేనిఫెస్టోతో చంద్రబాబు చేసిన మోసం గుర్తుందా?. ప్రధాన హామీల పేరుతో ఏ ఒక్క వర్గానికి చంద్రబాబు న్యాయం చేయలేదు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి, అదే మోసపూరిత హామీలతో ప్రజల ముందుకు వస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.వలంటీర్ల ద్వారా మళ్లీ సంక్షేమం కొనసాగాలన్నా, వైద్యం ఆరోగ్య సేవలు.. రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలన్నా.. ఫ్యాన్ గుర్తును రెండుసార్లు నొక్కాలి. 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు వైఎస్సార్సీపీకే రావాలి. దేశంలో ఎన్నడూ జరగని విధంగా, రాష్ట్రంలో మునుపెన్నడూ చూడని రీతిలో 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలు.. మొత్తం రెండొందల స్థానాలకు ఏకంగా 100 స్థానాలు.. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు పోటీకి దిగుతున్నారు. సామాజిక న్యాయం ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోండి.వైఎస్సార్సీపీ తరఫున బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎస్. వెంకట చిన అప్పలనాయుడు పోటీ చేస్తున్నారు. ఆయన్ని గెలిపించి సామాజిక న్యాయాన్ని గెలిపించాలి. విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌లను గెలిపించాలని ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రజలకు పిలుపు ఇచ్చారు. -
జనసంద్రమైన బొబ్బిలి
-
Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ
-
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం ఆయన విడుదల చేశారు.ఆ వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 10 గంటలకు విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని బొబ్బిలిలో ఉన్న మెయిన్ రోడ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పాయకరావుపేటలోని సూర్య మహల్ సెంటర్లో జరిగే సభలో.. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. -
కార్పొరేట్‌ను తలదన్నేలా...
ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో మొదటిది బొబ్బిలి సామాజిక ఆరోగ్య కేంద్రం పాత భవనం. పక్క ఫొటోలో కనిపిస్తున్నది అదే ఆవరణలో రూ.3.50 కోట్లతో అత్యాధునిక వసతులతో నూతనంగా నిర్మించిన సీహెచ్‌సీ నూతన భవనం. ఇది కార్పొరేట్ ఆస్పత్రిని తలదన్నేలా నిర్మించింది. ఈ ఆస్పత్రే కాదు... వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులను ఎనిమిదింటిని పూర్తి స్థాయి వసతులతో ఇలానే నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నాడు – నేడు ద్వారా ఆస్పత్రులను అధునాతనంగా మార్చింది. ఆహ్లాదకర వాతావరణం నెలకొనేలా తీర్చిదిద్దింది. వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు చేపట్టింది. రోగులకు కావాల్సినన్ని సదుపాయాలు కల్పించింది. దీంతో రోగులు కార్పొరేట్‌ను కాదని ప్రభుత్వ ఆస్పత్రుల వైపు అడుగులు వేస్తున్నారు. విజయనగరం ఫోర్ట్: రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా గాలికొదేలిసింది. ఆస్పత్రుల్లో తగినంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించక, కనీస వసతులు కల్పించక.. కావాలనే కార్పొరేట్‌ను ప్రొత్సహించేలా ఇలా వ్యహరించిందన్న విమర్శలు అప్పట్లో లేకపోలేదు. ప్రస్తుతం పరిస్థితి మారింది. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యమే పరమావధిగా ఆస్పత్రుల రూపురేఖలనే సమూలంగా మార్చివేసింది. కార్పొరేట్‌ను తలదన్నేలా తీర్చిదిద్దింది. అవసరమైనంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించి... ఆరోగ్యశ్రీ వంటి సేవలతో కార్పొరేట్‌కు దీటుగా మార్చేసింది. రూ.కోట్లు ఖర్చు పెట్టి వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులను నిర్మిస్తోంది. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల నిర్మాణం పూర్తి కాగా.. మరికొన్ని నిర్మాణ దశలో దూసుకుపోతున్నాయి. రూ.58.58 కోట్లతో 8 ఆస్పత్రుల నిర్మాణం జిల్లాలో వైద్య విధాన్ పరిషత్‌కు చెందిన 8 ఆస్పత్రులను రూ.58.58 కోట్లతో నిర్మాణం చేపట్టారు. పాత ఆస్పత్రి ఆవరణలో కొత్తగా నిర్మాణం చేపట్టారు. వీటిలో బొబ్బిలి, చీపురుపల్లి ఆస్పత్రుల నిర్మాణం పూర్తయి ఇప్పటికే ప్రారంభించారు. భోగాపురం ఆస్పత్రి నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నారు. ఎస్.కోట, బాడంగి, నెల్లిమర్ల, రాజాం, గజపతినగరం ఆస్పత్రులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి నిర్మాణాలు కూడా వేగవంతం అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆస్పత్రులు ఇలా... ప్రతి ఆస్పత్రిలోని క్యాజువాలటీ, ఓపీ విభాగం, మేల్, ఫీమేల్ వార్డులు, చేంజింగ్ రూమ్, ల్యాబొరేటరీ, అత్యా«ధునిక సౌకర్యాలతో కూడిన ఆపరేషన్ థియేటర్, ఎక్స్‌రే విభాగం, కార్యాలయ నిర్మాణాలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ఆస్పత్రులను నిర్మిస్తున్నారు. నాణ్యతలో రాజీ పడకుండా రోగులకు సేవలే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. అన్ని వసతులతో... వైద్య విధాన్ పరిషత్ పరిధిలో 8 ఆస్పత్రులను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్ని వసతులతో రూ.58.58 కోట్లతో నిర్మిస్తున్నాం. రెండు ఆస్పత్రులు నిర్మాణం పూర్తవ్వడంతో వాటిని ప్రారంభించి వినియోగంలోకి తీసుకొచ్చాం. మరో ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మిగిలిన ఆస్పత్రుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కలెక్టర్ ప్రతి నెల ఆస్పత్రుల నిర్మాణం పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. – డాక్టర్ బి.గౌరీశంకర్, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయధికారి (డీసీహెచ్ఎస్) -
ఎంత కష్టపడుతున్నా కానీ..!
విజయనగరం: పార్టీ కోసం రోజూ ఎన్నో గ్రామాలు తిరుగుతున్నాను. ఎందరినో కలిసి పార్టీ కార్యక్రమాలను వివరిస్తున్నాను. అయితే తెలుగుదేశం పార్టీకి అవేమీ చాలవట. పార్టీ యాప్ మై టీడీపీలో వాటిని నమోదుచేసి అప్లోడ్ చేయాలట. యాప్‌లో బొబ్బిలి నియోజకవర్గం అట్టడుగున ఉందట. అని బొబ్బిలి టీడీపీ ఇన్చార్జి ఆర్వీఎస్కేకే రంగారావు కారకర్తల మధ్య ఆవేదన వెళ్లగక్కారు. ఉనికి కోసం పాట్లు పడుతున్న టీడీపీ ఓ యాప్ పెట్టుకుంది. దానిని అనుసరించడంలో బొబ్బిలి నియోజకవర్గం అట్టడుగున ఉందని పార్టీ అధిష్టానం నుంచి సమాచారం వచ్చింది. ఈ విషయం సాక్షాత్తూ నియోజకవర్గ సమావేశంలో టీడీపీ కార్యకర్తలకు బేబీనాయన వెల్లడించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం పట్టణంలోని కోటలో నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. -
బొబ్బిలి వీణ.. శిఖరాగ్ర ఆదరణ
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన 20 సభ్యదేశాల శిఖరాగ్ర సమావేశాల్లో బొబ్బిలి వీణ వైభవాన్ని చాటుకోనుంది. విశాఖలో ఈ నెల 28, 29వ తేదీల్లో జరగనున్న జీ–20 సదస్సుకు వివిధ దేశాల నుంచి హాజరయ్యే అతిథులను గౌరవించేందుకు 200 బొబ్బిలి వీణలను అధికారులు ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆయన చేతుల మీదుగా వీటిని ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అతిథులకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖలో ఈ నెల 3, 4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు దేశం నలుమూలల నుంచి హాజరైన పారిశ్రామిక దిగ్గజాలు, ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బొబ్బిలి వీణలను బహూకరించారు. బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి ఇంటిపేరు గల కుటుంబీకులే దశాబ్దాలుగా బొబ్బిలి వీణలను తయారుచేస్తూ వస్తున్నారు. వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ద్వారా 1994వ సంవత్సరంలో సొసైటీని ఏర్పాటు చేసింది. 2002లో బొబ్బిలి పట్ణణ పరిధిలోని గొల్లపల్లిలో వీణల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది వీణల తయారీయే ఆధారంగా ఉన్న మా కళాకారులకు టీటీడీతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంలో 200 వీణలను తయారుచేసి అందించాం. అతిథుల కోసం మా వీణలతో కచేరీ కూడా ఏర్పాటు చేయించారు. ఈ నెలలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న మరో ప్రతిష్టాత్మక సదస్సు జీ–20 కోసం కూడా 200 వీణలకు ఆర్డర్ వచ్చింది. – సర్వసిద్ధి రామకృష్ణ, ఇన్చార్జి, బొబ్బిలి వీణల కేంద్రం -
బాబే చెప్పారు.. సంక్షేమ పాలన కావాలంటే సైకిల్ పోవాలి
సాక్షి, విజయనగరం: ‘సంక్షేమ పాలన కావాలంటే సైకిల్ పోవాలి’ అని సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబే తన పార్టీ కార్యకర్తలతో నినాదాలు చేయించారు. తరువాత తమాయించుకొని సైకిల్ రావాలని చెప్పించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో శుక్రవారం రాత్రి జరిగిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. ఈ సభలో చంద్రబాబు ప్రసంగమంతా అబద్ధాలు, తడబాట్లతో సాగింది. రాష్ట్రానికి తాను చేసిన మేలేమీ లేకపోవడంతో ఎన్.టి.రామారావు హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను, ఎన్టీఆర్ గొప్పతనాన్ని ప్రస్తావించారు. తన పాలనలో ప్రైవేటుపరం చేసిన ఎన్సీఎస్ సుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు వైఎస్సార్సీపీ పాలనలో నష్టాల పాలైందంటూ అబద్ధాలు చెప్పడంతో అంతా నిర్ఘాంతపోయారు. ప్రజలు ఒక్క ఛాన్స్ అని అడిగిన జగన్‌ను గెలిపించారని, ఆయన భష్మాసురుడై జనం నెత్తిన చేయిపెడుతున్నాడని ఆరోపించారు. జగన్ తనకే రాజకీయాలు నేర్పిస్తున్నారని వాపోయారు. చదవండి: (CM Jagan: కొత్త వ్యూహాలతో.. ప్రత్యర్థులకు సర్రున కాలేలా..) జగన్మోహన్రెడ్డిని ఓడించకపోతే ఈ రాష్ట్రానికి ఇవే చివరి ఎన్నికలని చెప్పారు. తెలుగు ప్రజల కోసం తెలంగాణలోనైనా, అమెరికాలోనైనా, ఆస్ట్రేలియాలోనైనా ఎక్కడైనా ఉంటానని అన్నారు. తనకు మళ్లీ అధికారం ఇచ్చి ఉంటే పింఛను రూ.3,000 చేసేవాడినన్నారు. రూ.3 వేలు ఇస్తానన్న జగన్మోహన్రెడ్డికన్నా తానే గొప్పంటూ చెప్పుకోవడం గమనార్హం. విశాఖ రాజధాని పేరుతో ఆస్తులను రాయించుకున్నారన్నారు. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని, దీనికి సంఘీభావం ప్రకటించాలని కార్యకర్తలను పదేపదే వేడుకొన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టును తానే ప్రారంభించా నని, తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేసిందీ, ప్రారంభించిందీ తానేనని, ఇప్పుడు అవన్నీ పడకేశాయంటూ అర్థంలేని వ్యాఖ్యలు చేయడంతో కార్యకర్తలే నిర్ఘాంతపోయారు. మహిళలకు ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు తానే అమలు చేశానన్నారు. ఇంకా ప్రసంగించాలని ఉన్నా తనకు అలర్జీ ఉందని, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తన అశక్తతను బయటపెట్టారు. -
అంబులెన్స్‌కు చోటివ్వని చంద్రబాబు కాన్వాయ్
సాక్షి, బొబ్బిలి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బొబ్బిలిలో శుక్రవారం ‘ఇదేంఖర్మరా బాబూ’ కార్యక్రమం నిర్వహించారు. అదే సమ యంలో అస్వస్థతకు గురైన తెర్లాం మండలం నందిగామ గ్రామానికి చెందిన బొద్దూరు సత్యవతి అనే మహిళను కుటుంబ సభ్యులు 108 వాహనంలో బొబ్బిలి సీహెచ్‌సీకి తీసుకెళ్తున్నారు. తెర్లాం మండలం నుంచి బయలుదేరిన వాహనం బొబ్బిలి చేరుకోగా, గొల్లపల్లి వద్ద వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్ చోటివ్వలేదు. 108 వాహనం ఎంత హారన్ కొట్టినా కాన్వాయ్‌లో వాహనాలు గానీ, చంద్రబాబునాయుడు గానీ ఏమాత్రం పట్టించుకోలేదు. చివరకు కాన్వాయ్ దాటేవరకు మహిళ పరి స్థితి ఆగమ్యగోచరంగా మారింది. వైద్యుల సూచ నల మేరకు 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందిస్తూ గంటన్నర సమయం తర్వాత సీహెచ్‌సీకి తరలించారు. చావుబతుకుల మధ్య ఉన్న మనిషిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు చోటివ్వని చంద్రబాబు... ప్రజలకు ఏమి ఉద్దరించేందుకు తిరుగుతున్నాడంటూ స్థానికులు విమర్శించారు. 40 ఏళ్ల ఇండ్రస్ట్రీ అంటూ చెప్పుకుతిరుగుతున్న బాబు సామాజిక బాధ్యత ఇదేనా అంటూ మండిపడ్డారు. చదవండి: (మరోమారు సీఎం జగన్ మానవత్వం) -
బొబ్బిలి సభలో చంద్రబాబు ఊపదంపుడు ప్రసంగం
-
Vizianagaram: భూముల రీసర్వేలో కొత్త అంకం ప్రారంభం
బొబ్బిలి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష కార్యక్రమం కింద విజయనగరం జిల్లాలో జోరుగా సాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియలో కొత్త అంకానికి జిల్లా అధికార యంత్రాంగం తెరతీసింది. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో ఈ నెలాఖరులోగా భూహక్కు పత్రాల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. పాస్ పుస్తకాలను ఇప్పటికే రెవెన్యూ డివిజనల్ కేంద్రాలకు సరఫరా చేసింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు వీటిని రైతులకు అందజేయనుంది. సర్వే ఇలా... జిల్లాలో 983 గ్రామాల్లోని భూములను రీసర్వే చేయాల్సి ఉంది. తొలుత రామభద్రపురం మండలం మర్రి వలసలో సర్వే ప్రక్రియను పాలకులు ప్రారంభించారు. అధునాతన పరికరాలతో డ్రోన్ సర్వే చేపట్టి, తరువాత క్షేత్ర స్థాయిలో రెవెన్యూ, సర్వే సిబ్బంది హద్దులు నిర్ణయిస్తున్నారు. రైతుల సమక్షంలో వివాదాలు లేకుండా సర్వే పూర్తిచేస్తున్నారు. విస్తీర్ణంను పక్కాగా నిర్ధారిస్తున్నారు. గ్రామ సభల్లో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి భూముల వివరాలను స్కానింగ్, కంప్యూటరైజ్డ్ చేస్తున్నారు. 179 గ్రామాల్లో సర్వే పూర్తి... జిల్లాలోని 4.84 లక్షల చదరపు కిమీల పరిధిలో రీసర్వే చేయాల్సి ఉంది. నేటి వరకు సర్వే, రెవెన్యూ అధికారులు 179 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశారు. అందులో దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో రీసర్వే పూర్తయింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం తదితర డివిజన్లలో ఒక్కో డివిజన్లో ఐదేసి గ్రామాల చొప్పున ముందుగా జగనన్న భూ హక్కు పత్రాలను పంపిణీ చేసేందుకు అధికారు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ మేరకు ఆయా డివిజన్లకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేసింది. వివాదాలకు తావులేకుండా... జగనన్న సంపూర్ణ భూ హక్కు పత్రాల్లో క్యూర్ కోడ్, మ్యాపుల ఫొటోలు, విస్తీర్ణం, సర్వే నంబర్లతో సహా అన్ని వివరాలూ ముద్రించారు. క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే రైతు తమ భూముల సమస్త వివరాలనూ తెలుసుకోవచ్చు. భూ యజమాని, రైతులకు సంబంధించిన అన్ని వివరాలూ ఇందులో ఉన్నాయి. రైతులు, యజమానులు ఎటువంటి ఆందోళన, సందేహాలకు గురికానవసరం లేదు. అన్ని వివరాలతో ఉన్న హక్కు పత్రాలను పొందేలా అధికారులు ఈ హక్కు పత్రాలను సిద్ధం చేశారు. విడతల వారీగా రైతులకు ఈ పత్రాలు అందజేయనున్నారు. పొరపాట్లు దొర్లితే మ్యుటేషన్‌కు అవకాశం.. అత్యధిక గ్రామాల్లో ఒకే సారి హద్దుల గుర్తింపు, విస్తీర్ణం, రీసర్వే ప్రాంతాలు ఒకే సారి చేపట్టడం వల్ల ఎక్కడైనా చిన్న తప్పులు దొర్లితే దానిని మ్యుటేషన్ ద్వారా సరిదిద్దుకోవచ్చని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. భూముల రీ సర్వేలో 480 సర్వే సిబ్బంది నిమగ్నమయ్యారు. త్వరలోనే పంపిణీ చేస్తాం రీసర్వేకు సంబంధించిన ప్రక్రియలన్నీ పూర్తి చేసుకున్న గ్రామాల భూ హక్కు పత్రాలు ముద్రించి కార్యాలయానికి వచ్చాయి. అన్ని డివిజన్ కార్యాలయాలకూ ఈ హక్కు పత్రాలు వెళ్లాయి. ఉన్నతాధికారులు తేదీ నిర్ణయిస్తే వాటిని రైతులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటాం. – పి.శేషశైలజ, ఆర్డీఓ, బొబ్బిలి -
విశాఖ పరిపాలన రాజధానే మా లక్ష్యం
బొబ్బిలి: వికేంద్రీకరణలో భాగంగా విశాఖ పరిపాలన రాజధానే తమ లక్ష్యమని బొబ్బిలి ప్రజలు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని శ్రీ కళాభారతి మునిసిపల్ ఆడిటోరియంలో ఆదివారం బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా వేదికలో పలువురు మేధావులు, విద్యా, వ్యాపార, న్యాయ, రాజకీయ వర్గాలకు చెందిన వారంతా పాల్గొని సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన వికేంద్రీకరణకు మద్దతు పలికారు. మునిసిపల్ చైర్మన్ ఎస్వీ మురళీకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంబంగి మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాల్సి ఉన్నా.. చంద్రబాబు చేసిన పొరపాట్ల కారణంగా దాన్ని కోల్పోయామని చెప్పారు. దశాబ్దాల నాటి ప్రతిపాదన విశాఖ రాజధాని అవకాశాన్ని ఇప్పుడు జారవిడుచుకోవద్దని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ నాయకులు శంబంగి వేణుగోపాలనాయుడు, డాక్టర్ బొత్స కాశినాయుడు, భాస్కరరావు, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన వివిధ వర్గాల మేధావులు, ప్రజలు పాల్గొన్నారు. -
తల్లైన తొమ్మిదో తరగతి విద్యార్థిని.. బిడ్డతో కలిపి ఆమెను..
సాక్షి, బొబ్బిలి(విజయనగరం): బొబ్బిలి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక గురువారం రాత్రి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలిసింది. దీనిపై గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాఠశాలకు శుక్రవారం వచ్చి ఆరా తీసినట్టు సమాచారం. విద్యార్థిని ప్రసవించేంత వరకూ ఆమె కదలికలు, శరీరాకృతిని సిబ్బంది గుర్తించలేకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిడ్డతో కలిపి బాలికను కొమరాడ మండలంలోని స్వగ్రామానికి ఆటోలో పంపించినట్టు భోగట్టా. ఈ విషయాన్ని ఆశ్రమ పాఠశాల పీడీ ఎస్బీఎస్ రత్నం వద్ద ప్రస్తావించగా అలాంటిదేమీ లేదని చెప్పారు. వసతి గృహంలో హాజరు పట్టీని, విద్యార్థినులను విచారించి శనివారం చెప్పగలనన్నారు. -
వివాహేతర సంబంధం: జీవితంపై విరక్తితో...
సాక్షి, బొబ్బిలి రూరల్: దాంపత్య జీవితం విఫలమైందన్న బాధతో ఓ గిరిజన మహిళ తన ఇంట్లో ఫ్యాన్‌కు చీర కొంగుతో ఉరి వేసుకొని మృతి చెందింది. ఎస్ఐ చదలవాడ సత్యనారాయణ తెలిపిన వివరాలు.. బొబ్బిలి మండలం గోపాలరాయుడిపేట పంచాయతీ అక్కేనవలస గ్రామానికి చెందిన సీదరపు లక్ష్మి (35) శనివారం మధ్యాహ్నం ఈ అఘాయిత్యానికి పాల్పడింది. లక్ష్మీకి అదే గ్రామానికి చెందిన డొంబిదొరతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి పదేళ్ల భాస్కరరావు, ఆరేళ్ల అవిత, మూడేళ్ల కిశోర్ సంతానం ఉన్నారు. దొర పదేళ్ల క్రితం రాజేశ్వరి అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని, ఆమెకు ఏడేళ్ల స్వప్న, ఐదేళ్ల బుజ్జి సంతానం ఉన్నారన్నారు. తన భర్త రెండో పెళ్లి చేసుకున్న నాటి నుంచి తన పిల్లలతో వేరుగా జీవిస్తున్న లక్ష్మి కలత చెంది, జీవితంపై విరక్తితో ఉరి వేసుకొని మృతి చెందినట్లు ఆయన తెలిపారు. గ్రామానికి చెందిన పెద్ద గెంబలి సుందరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ మలిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని ఎస్ఐ తెలిపారు. -
కళ్లు చెదిరే బంగారం, వెండి లెక్కలు.. కళ్లకు కానరావే!
వేలాది ఎకరాల భూములు, కేజీల కొద్దీ బంగారు, వెండి ఆభరణాలు.. వజ్ర వైఢూర్యాలు బొబ్బిలి వేణుగోపాల స్వామివారి సొంతం. ‘అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని’ అన్న చందంగా స్వామివారి ధూపదీప నైవేద్యాలకు దాతలు, భక్తులు సమర్పించే కానుకులపై ఆధారపడాల్సిన దుస్థితి. స్వామివారి ఆస్తుల లెక్కల గుట్టు విప్పేందుకు.. ఆలయానికి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. విచారణ కమిటీ వేసింది. ఆస్తులపై ఆరా తీయిస్తోంది. సాక్షిప్రతినిధి, విజయనగరం: అపర కుబేరుడైన బొబ్బిలి వేణుగోపాల స్వామి వారికి అలంకరించే ఆభరణాలు ఎన్నో ఉండేవని పూర్వీకులు చెబుతుండే వారు. ఎంతో డబ్బు, వేల కోట్ల రూపాయల విలువైన భూములు, వందల కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, కెంపులు, వైఢూర్యాలు, పచ్చలహారాలు ఉన్న స్వామివారికి అంతే స్థాయిలో మర్యాదలు జరిగేవి. ఆనాడు అనుభవించిన స్థాయిలో కనీసం ఒకటో వంతు కూడా ఇప్పుడు లేదంటే స్వామివారి పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లో స్వామికి 4011.16 ఎకరాల భూములుంటే.. కనీసం ధూపదీప నైవేద్యాలకు కూడా దాతలపై ఆధారపడాల్సి వస్తోందంటే దానికి ఆలయ ధర్మకర్తలే సమాధానం చెప్పాలి. ఈ లెక్కలే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తేలుస్తోంది. (చదవండి: క్లీనర్ లేని లారీ.. నడిపేవారేరీ!) ధూళి పట్టి ఉన్న దస్త్రాల మూటలు సిబ్బంది, అర్చకుల వేతనాల ఖర్చు సంవత్సరం ఆదాయం (రూపాయలలో) వేతనాలకు చేసిన ఖర్చు శాతం 2019–20 7,22,733 15.5 2020–21 6,86,659 73.6 2021–22 3,63,695 15.8 ఇక కోటలోని భాండాగారంలో ఉన్న బంగారం విషయానికి వస్తే.. 28 ప్రాపర్టీ రిజిస్టర్ ప్రకారం.. 28 బంగారు ఆభరణాలున్నాయి. అవి 45 తులాల, 82 చిన్నాల, 65 వీసాలు. (548 గ్రాముల 208 మిల్లీ గ్రాములు). 1957 అప్రై జ్మెంట్ రిజిస్టర్ ప్రకారం చూస్తే.. 22 తులాల, 103 చిన్నాల,77 వీసాలు (291 గ్రాముల, 600 మిల్లీ గ్రాములు). ఇవన్నీ రికార్డుల ప్రకారం చెబుతున్న లెక్కలు. బోలెడు బంగారం.. వేణుగోపాలస్వామి, రుక్మిణీ, సత్యభామ అమ్మవార్లకు బోలెడంత బంగారం ఉంది. ఎస్బీఐ (బాక్స్ నంబర్ 42/74–2013లో) బ్యాంకు లాకర్లో వేసిన ఆభరణాల సంఖ్య 114. ప్రాపర్టీ రిజిస్టర్ 28 ప్రకారం.. వివిధ ఆభరణాల్లో ఉన్న బంగారం 1094 తులాల 1392 చిన్నాల 621 వీసాలు (అంటే 13 కిలోల 308 గ్రాముల 624 మిల్లీ గ్రాములు). 1957 జనవరి 18న ఆమోదించిన అప్రైజ్‌మెంట్ రిజిస్టర్ ప్రకారం.. వివిధ ఆభరణాల్లో ఉన్న బంగారం 865 తులాల, 633 చిన్నాల, 291 వీసాలు (10 కిలోల 334 గ్రాముల 304 మిల్లీ గ్రాములు). కొండంత వెండి... కోటలోని భాండాగారంలో 107 వెండి ఆభరణాలున్నాయి. వీటిని 1998 అక్టోబర్ 12న భద్రపరచినట్టు రికార్డుల్లో ఉంది. 28 ప్రాపర్టీ రిజిస్టర్ ప్రకారం.. 21,332 తులాల 1102 చిన్నాల, 307 వీసాలు (249 కిలోల 248 గ్రాముల 20 మిల్లీ గ్రాములు) వెండి ఉన్నట్టు లెక్కల్లో ఉంది. 1957 అప్రైజ్‌మెంట్ రిజిస్టర్ ప్రకారం.. 21,549 తులాల, 563 చిన్నాల 9 వీసాలు (251 కిలోల 557 గ్రాముల 490 మిల్లీ గ్రాములు) వెండి ఉన్నట్టు చూపిస్తోంది. బ్యాంకు లాకర్లో భక్తుల కానుకలు.. ఈ ఆభరణాలే కాకుండా భక్తులు సమర్పించిన 328 గ్రాముల 130 మిల్లీ గ్రాముల బంగారం, 826 గ్రాముల 320 మిల్లీ గ్రాముల వెండి బొబ్బిలి ఆంధ్రా బ్యాంకులోని ఏ–52 లాకర్లో ఉన్నట్టు రికార్డులు ఉన్నాయి. రథాల శాలలో నిర్వహిస్తున్న దేవాదాయశాఖ కార్యాలయం ధూపదీపనైవేద్యాలకు దాతలే దిక్కు... ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఆభరణాలు ఉన్న తరువాత ఎవరైనా ఎలా ఉంటారు. ధూం..ధాంగా ఉంటారు. కానీ వేణుగోపాల స్వామికి ఆ భాగ్యం లేదు. ఈ ఆలయంలో 8 మంది సిబ్బంది, అర్చకులు ఉన్నారు. వీరిలో ముగ్గురు అర్చకులు కాగా ఒకరు జూనియర్ అసిస్టెంట్. మరొకరు టికెట్ సెల్లర్. ఇద్దరు వంట మనుషులు, ఒక స్వీపర్ పనిచేస్తున్నారు. వీరి జీతభత్యాల కోసం ఆలయానికి వచ్చిన ఆదాయంలో నుంచి కొంత శాతాన్ని ఖర్చు చేస్తున్నారు. ఆ ఆదాయం కూడా దాతల నుంచే వస్తోంది. వచ్చిన ఆదాయం వీరి జీతాలకే సరిపెడుతున్నారు. 2020–21లో ఏకంగా ఆదాయంలో 73.6 శాతం జీతాలకు వెచ్చించామని రికార్డుల్లో రాశారు. ఇక స్వామి వారికి ధూపదీప నైవేద్యాలకు డబ్బులెక్కడివి. ఉన్నదానితోనే సరిపెడుతున్నారు. కనీసం ఆలయాన్ని కూడా అనువంశిక ధర్మకర్తలు అభివృద్ధి చేసింది లేదు. ఆలయాన్ని చూస్తేనే ఆ విషయం అర్ధమవుతుంది. గతమెంతో వైభవం... ఆలయ భూములన్నీ స్వామి వారి అధీనంలో ఉన్నప్పుడు ఎంతో వైభవంగా ఉండేది. తమిళనాడులోని శ్రీరంగంలో ఉన్న రంగనాథస్వామి దేవాలయంలో వలే బోగభాగ్యాలు, పూజాధికాలు జరిగేవి. అదంతా ఇప్పుడో కల. ప్రస్తుతం దాతల సహాయంతోనే నెట్టుకొస్తున్నాం. – భద్రం అప్పలాచార్యులు, ప్రధానార్చకులు, వేణుగోపాలస్వామి దేవస్థానం, బొబ్బిలి స్వామి ఆస్తులు స్వామికే దక్కాలి బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన భూములు, ఆభరణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో బయట పడాలి. దోషులెవరయినా శిక్షింపబడాలి. వేల కోట్ల రూపాయలు ఆస్తులున్న స్వామివారు చివరకు ధూప దీప నైవేద్యాలకు చేయిచాచే పరిస్థితి నుంచి బయట పడాలి. దేవాలయాల ఆస్తుల పరిరక్షణ, భక్తుల మనోభావాల రక్షణకు ప్రాధాన్యమిస్తూ విచారణకు సీఎం జగన్మోహన్రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణలు ఆదేశించడం అభినందించదగ్గ విషయం. ఇక్కడి ట్రస్టీ సభ్యులు కొన్నాళ్ల పాటు అధికారంలో ఉన్నారు. కానీ ఈ వ్యవహారాలన్నీ బయటకు పొక్కలేదు. పైగా చీకటిలో ఉంచారంటే ఏదో జరుగుతోందనేది ప్రజల అనుమానం. వీటిని నివృత్తి చేసి దేవాలయాల ఆస్తులను కాపాడాలన్నదే ప్రభుత్వ ప్రయత్నం. – శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, ఎమ్మెల్యే, బొబ్బిలి -
మెడకు ఉరికంటా బిగుసుకుపోయిన తాళ్లు.. లాలించి, బుజ్జగించి
ఆమె మతి స్థిమితం లేని మహిళ... ఎవరికీ పట్టని వ్యక్తి... పట్టణంలో తిరుగుతూ రోడ్డు పక్కన దొరికిన గుడ్డ పీలికలను, తాళ్లను మెడలో వేసుకొనే ఓ మతి చలించిన మనస్తత్వం. అటువంటి వ్యక్తి ఎదురుపడితే ఎవరైనా ఏమి చేస్తారు... ఛీత్కరిస్తూ అల్లంత దూరానికి పారిపోయే వాళ్లే ఎక్కువ. కానీ ఈ హోంగార్డు అక్కున చేర్చుకుంది. ఆమెకు సేవలందించి తన మంచి మనసును చాటుకుంది. బొబ్బిలి: కుటుంబ సభ్యుల నిర్లక్ష్యమో మరే కారణమో తెలియదు కానీ.. ఓ మహిళ చిన్న సంచి పట్టుకుని పట్టణంలో తిరుగుతూ తనలో తనే ఏవో పాటలు పాడుకుంటుంది. మాటలాడిస్తే మాట కలుపుతుంది. పట్టణంలోని అన్ని బజార్లలో ఇటూ అటూ తిరుగుతూ తనలో తానే గొణుక్కుంటూ కనిపించిన తాళ్లు, దారాలన్నీ మెడలో వేసుకుంటుంది. ఆ తాళ్లు మెడకు ఉరిలా దగ్గరికంటా బిగుసుకున్నాయి. అటుగా వెళ్తున్న హోంగార్డు ఝాన్సీ రాణి కంట ఈమె పడింది. అయ్యో అనుకుంటూ కొందరి సాయంతో ఆమెను బుజ్జగిస్తూ చిన్నపాటి చాకుతో మెడలోని ఒక్కో పోగూ కత్తిరించింది. ఆ తర్వాత నువ్వేం చదువుకున్నావంటే ఆరో తరగతనీ, నీ పేరేంటంటే జయలక్ష్మి అనీ చెప్పింది. ఇలా మాటల్లో పెట్టి మొత్తం తన మెడ చుట్టూ చుట్టుకున్న తాళ్లన్నీ తొలగించింది. అనంతరం ఓ నైటీ తీసుకువచ్చి ఆమెకు ధరింపజేసింది. ఆ తరువాత కడుపునిండా భోజనం పెట్టి తన మంచి మనసును చాటుకుంది. ‘మన కుటుంబ సభ్యులైతే ఇలా సపర్యలు చేయమా ... నాకు మాత్రం ఈమె ఓ తల్లి, ఓ అత్తమ్మ’లా అనిపించిందని ఆ హోం గార్డు చెప్పడం తన పెద్ద మనసుకు నిదర్శనం. ఆమెకు సపర్యలు చేయడం పట్ల పలువురు ఝాన్సీరాణిని అభినందనల్లో ముంచెత్తారు. చదవండి: బాలల కోసం బహువిధ రక్షణ -
ఏమైందో ఏమో.. పాపం పండుటాకులు..
బొబ్బిలి: అది పార్వతీపురం నుంచి బొబ్బిలివైపు వస్తున్న ఆర్టీసీ బస్సు. అందులో ఓ వృద్ధ జంట ప్రయాణిస్తోంది. ఏమైందో ఏమో... జీవితాంతం తోడుండాల్సిన భర్త ఆ వృద్ధురాలి ఒడిలోనే అకస్మాత్తుగా కన్నుమూశాడు. అనుకోని సంఘటనతో ఆమె హతాశురాలైంది. ఏంచేయాలో తెలియక కాస్త కలవరపడింది. విషయాన్ని గుర్తించిన ఆర్టీసీ సిబ్బంది బస్సును రోడ్డుపక్క నిలిపేసి... మిగిలిన ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకూడదన్న ఉద్దేశంతో మృతదేహాన్ని దింపేశారు. దిక్కుతోచని ఆమె కన్నీరుమున్నీరైంది. మృతదేహాన్ని ఒళ్లో పెట్టుకుని రోదించింది. సాయం చేయాలంటూ దారిన పోయేవారిని అర్థించింది. ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. ఆ దారిలో వెళ్తున్న ఓ వ్యక్తి ఆమెను పలకరించి విషయం తెలుసుకున్నారు. వెంటనే తెలిసిన మిత్రులు, జర్నలిస్టులకు సమాచారం అందించారు. వారంతా కూడి కాస్తంత ఆర్థిక సాయం చేసి మృతదేహాన్ని సొంత ఊరికి తరలించేందుకు సాయ పడ్డారు. హృదయ విదారకమైన ఈ సంఘటన పార్వతీపురం, బొబ్బిలి మార్గంలో సోమవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సాలూరు బంగారమ్మ కాలనీకి చెందిన దాసరి పోలమ్మ, తన భర్త పైడయ్య(58)కు అనారోగ్యంగా ఉండటంతో వైద్యం నిమిత్తం పార్వతీపురం తీసుకువెళ్లింది. తిరుగు ప్రయాణంలో బొబ్బిలి సమీపంలో పైడయ్య మృతి చెందాడు. బొబ్బిలి చేరాక సిబ్బంది, ఇతరులు కలసి ఆ మృత దేహా న్ని బస్సునుంచి దించేశారు. అక్కడ రాయఘడ రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజ్‌కు ఆనుకుని మృత దేహాన్ని దించేయడంతో ఆమె అక్కడే మృత దేహాన్ని తన వద్దకు తీసుకుని రోదిస్తూ సాయం చేయాలని అభ్యర్థించింది. అటువైపుగా నడచుకుంటూ వెళ్తున్న తారకరామా కాలనీకి చెందిన అలజంగి స్కూల్ హెచ్ఎం కె.కృష్ణదాసు చూసి తన స్నేహితులైన స్థానిక జర్నలిస్టులకు సమాచారమిచ్చారు. వెంటనే జర్నలిస్టులు రాయఘడ జగదీ‹Ù, కొండ్రవీడి ఆచారి ఆదినారాయణ, బు జ్జి, రుంకాన రమేష్, ఫైర్ స్టేషన్ డ్రైవర్ తదితరులతో పాటు అంతర్రాష్ట్ర రహదారి కావడంతో మరికొందరు చేసిన ఆరి్ధక సహాయం పోగు చేసి ఆటోలో వారి స్వగ్రామానికి పంపించారు. ఆటో సొమ్ము కొంత పోగా మిగతా మొత్తాన్ని పోలమ్మ చేతిలో పెట్టారు. మూఢనమ్మకంతో... పైడయ్యకు చాలారోజులుగా ఒంట్లో బాగాలేదు. కుటుంబ సభ్యులు, ఇతరులు చిల్లంగి, దెయ్యం పట్టిందని వారిలో అనుమాన బీజం నాటారు. పార్వతీపురం దరి ఓ దేముడమ్మ వద్దకు తీసుకెళ్లాలని సూచించడంతో పండుటాకు లిద్దరూ అక్కడకు వెళ్లారు. ఎన్నో ఆస్పత్రులున్నా, వైద్యం అందుబాటులో కి వచ్చినా, ఇంటింటికీ వైద్య సేవలు అందుతు న్నా ఇంకా కొంత మంది ఇలా మూఢ నమ్మకాలను అనుసరిస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారనడానికి ఇదో ఉదాహరణ. చదవండి: 13 మంది దుర్గ గుడి ఉద్యోగుల సస్పెన్షన్.. ‘పంచాయతీ’ ఫలితం.. బాబుకు భయం -
ఒక గ్రామం.. ముగ్గురు ఎమ్మెల్యేలు
బొబ్బిలి రూరల్: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని పిరిడి గ్రామం రాజకీయంగా ప్రత్యేకతను సంపాదించుకుంది. ఈ గ్రామం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. గ్రామానికి చెందిన కొల్లికూర్మినాయుడు 1952 నుంచి 1955వరకు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి బొబ్బిలి ఎమ్మెల్యేగా పనిచేశారు. తిరిగి ఆయనే 1978నుంచి 1983 వరకు జనతాపార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇదే గ్రామానికి చెందిన డాక్టర్ పెద్దింటి జగన్మోహనరావు కాంగ్రెస్‌పార్టీ తరఫున 1989 నుంచి 1994 వరకు. 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. వివిధ శాఖల మంత్రిగా పనిచేశారు. డాక్టర్ జగన్మోహనరావు తండ్రి రామస్వామినాయుడు 1955నుంచి 1962 వరకు బలిజిపేట నియోజకవర్గానికి కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు. -
60 ఏళ్లుగా సైకిల్‌తో అనుబంధం..
ఆయనకు 16 ఏళ్ల వయసులో వివాహమైంది. తండ్రితో సైకిల్ కొనిపించారు. ఇప్పుడు ఆయన వయస్సు 76 ఏళ్లు. అప్పుడు కొనుగోలు చేసిన సైకిలే ఇప్పటికీ ఆయన ప్రయాణ రథం. 60 ఏళ్లుగా సైకిల్‌ను చక్కగా చూసుకుంటూ.. ప్రయాణాలకు వినియోగిస్తున్నారు. ఆయన బైస్కిల్ బంధం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆదర్శనీయంగా నిలుస్తోంది. బొబ్బిలి రూరల్ : బొబ్బిలి పట్టణం అగ్రహారం వీధికి చెందిన దామెర శ్రీరంగనాయకులు బాడంగి మండలం పాల్తేరు గ్రామానికి చెందిన వారు. తల్లిదండ్రులు వ్యవసాయదారులు కావడంతో ఆయన కూడా వ్యవసాయంపైనే దృష్టిసారించా రు. పెళ్లైన తరువాత బొబ్బిలి వచ్చి స్థిరపడ్డారు. ఆయనకు 16 ఏళ్ల వయసులో 1960 మే 12న వివాహం జరిగింది. మే 20న తండ్రితో మారాం చేసి హెర్క్యులస్ సైకిల్‌ను కొనిపించారు. అప్పట్లో సైకిల్ ధర 60 రూపాయలు. విజయనగరంలోని చెక్కా వెంకటరత్నం షాపులో కొనుగోలు చేశారు. నాటి నుంచి దానిపైనే బొబ్బిలికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాల్తేరుకు రోజూ రెండు మార్లువెళ్లి వస్తుండేవారు. ఈ సైకిల్‌పై బొబ్బిలి నుంచి పార్వతీపురం, సాలూరు, విజయనగరానికి సినిమా లకు, నాటకాలకు సైతం వెళ్లేవారు. సైకిల్‌పై 60 ఏళ్లుగా వేల కిలోమీటర్లు ప్రయాణం సాగించారు. సైకిల్ ఫ్రేమ్, హేండిల్బార్, మడ్గర్లు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈయన ఇటీవల టూవీలర్ కొనుగోలు చేశారు. దానిపై ఆసక్తి లేకపోవడంతో కొనుగోలుచేసిన కొద్దిరోజులకే అమ్మేశారు. నాకెంతో ఆనందం నా హెర్క్యులస్ సైకిల్ అంటే నాకెంతో ఇష్టం. దీనిపై అప్పట్లో రోజుకు 120 కిలోమీటర్లు తొక్కి సరదాగా సినిమాలకు వెళ్లేవాడిని. 76 ఏళ్ల వయసులో ఆరోగ్యంగా ఉండేందుకు సైకిల్ తొక్కడమే కారణం. అప్పటి నుంచి ఇప్పటివరకు సైకిల్ చెక్కుచెదరలేదు. దానిపైనే ప్రతినిత్యం ప్రయాణం సాగిస్తున్నా. – దామెర శ్రీరంగనాయకులు, బొబ్బిలి -
అపరిమిత డేటా… 30 రోజులు ఉచితం
విజయవాడ : జియో ఫైబర్ తన హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు పట్టణాలకు విస్తరించింది. తెనాలి, హిందూపూర్, బొబ్బిలి లలో ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 26 పట్టణాల్లో జియో ఫైబర్ హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అయ్యింది. ఇప్పటికే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ఏలూరు, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం తదితర పట్టణాల్లో వినియోగదారులు జియో ఫైబర్ సేవలను ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా జియో ఆంధ్రప్రదేశ్ సీఈఓ మండపల్లి మహేష్ కుమార్ మాట్లాడుతూ, ‘మొబైల్ కనెక్టివిటీ పరంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే జియో వేగంగా , విస్తృతంగా దూసుకువెళ్లి నెంబర్ వన్ ఆపరేటర్ గా నిలిచింది. ఇదే పరుగును బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ రంగంలో కూడా కొనసాగించి జియో ఫైబర్‌ను ఈ పట్టణాల్లో ప్రతీ ఇంటికి తీసుకెళ్లి, ఆ ఇంట్లో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాం’ అని అన్నారు. 'నయే ఇండియా కా నయా జోష్' పేరుతో జియో సరికొత్త ప్లాన్స్ ప్రకటించింది. ఈ ప్లాన్స్ రూ.399 నుంచి ప్రారంభమౌతాయి. అపరిమిత డేటా వాడుకోవచ్చు. అంతేకాదు... 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 30 రోజుల ఉచిత ట్రయల్ కూడా ఆఫర్ చేస్తోంది. 4కే సెట్ టాప్ బాక్స్ ఉచితం. కొత్త యూజర్లకు 10 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ ఉచితం. 30 రోజుల ఫ్రీ ట్రయల్‌లో భాగంగా 10 ఓటీటీ యాప్స్ యాక్సెస్ చేయొచ్చు. వాయిస్ కాలింగ్ ఉచితం. ఒకవేళ 30 రోజుల్లో సర్వీస్ నచ్చకపోతే కనెక్షన్ వద్దని చెప్పొచ్చు. ఎలాంటి కండీషన్స్ ఉండవు. ఈ 30 రోజుల ఫ్రీ ట్రయల్ కొత్త కస్టమర్లకు మాత్రమే. ఇప్పటికే జియోఫైబర్ కస్టమర్లుగా ఉన్నవారికి కూడా లాయల్టీ బెనిఫిట్స్ లభిస్తాయి. కొత్త టారిఫ్ ప్లాన్స్ ప్రకారం ప్రస్తుత కస్టమర్లను అప్‌గ్రేడ్ చేసి ఆయా ప్రయోజనాలను అందిస్తారు. ఆసక్తిగల కస్టమర్లు ఇక్కడ తమను తాము నమోదు చేసుకోవచ్చు. https://www.jio.com/registration కొత్తగా ప్రకటించిన జియో ఫైబర్ 4 ప్లాన్ల వివరాలు ఇవిగో... Rs 399 Plan: జియోఫైబర్ రూ.399 ప్లాన్ తీసుకుంటే 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. Rs 699 Plan: జియోఫైబర్ రూ.699 ప్లాన్ తీసుకుంటే 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. Rs 999 Plan: జియోఫైబర్ రూ.999 ప్లాన్ తీసుకుంటే 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రూ.1000 విలువైన 11 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్స్ ఉచితం. Rs 1499 Plan: జియోఫైబర్ రూ.1499 ప్లాన్ తీసుకుంటే 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రూ.1500 విలువైన 12 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్స్ ఉచితం. -
వరి నాట్లేసే పరికరం
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన పట్టభద్రుడైన ఓ యువకుడు చిన్న కమతాల్లో వరి సాగు చేసే రైతుల ఇబ్బందులు, ఖర్చులు తగ్గించే ఆవిష్కరణలు అందిస్తున్నారు. అతని పేరు యడ్ల ఉమామహేశ్వరరావు. విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని గున్నతోట వలస స్వస్థలం. దేశ విదేశాల్లో వాడుతున్న యంత్రాలను ఇంటర్నెట్ ద్వారా అధ్యయనం చేశాడు. చిన్న రైతులకు ఉపకయోగపడే వరి నాటే పరికరాన్ని తయారు చేయాలని రెండేళ్లుగా ప్రయోగాలు చేస్తున్నాడు. సాక్షి, బొబ్బిలి :ప్రయోగాలకు అవసరమైన పట్టుదల, ఆలోచన ఉన్నాయి కానీ చేతిలో డబ్బు లేదు. ఇతరు సహాయం కోసం ఉమామహేశ్వరరావు ఎదురు చూడలేదు. ఆరు నెలలు ప్రైవేటు ఉద్యోగం చేసి కూడబెట్టిన రూ. 30 వేలతో వెల్డింగ్ మెషిన్, ఇనుప సామగ్రిని కొనుగోలు చేసి, ప్రయోగాలు కొనసాగించారు. చివరికి అతని ప్రయత్నం ఫలించింది. వెల్డింగ్ పనిలో తన స్నేహితుడు మెండి సత్యనారాయణ సహాయపడ్డారన్నారు. ఒక మనిషి ఈడ్చుకుంటూ వెళ్తూ వరి నాట్లు వేసే చిన్న పరికరం సిద్ధం అయింది. దీనికి ఎటువంటి ఇంజిన్ లేదు. పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. తమ గ్రామంలోనే ఇటీవల ఓ రైతు పొలంలో తాను తయారు చేసిన పరికరంతో ఇటీవలే తొలిసారి వరి నాట్లు వేసి అందరితోనే శెభాష్ అనిపించుకున్నారు. విత్తనాలను ట్రేలో వేసి మొలక గడ్డి రీతిలో వరి నారు పెంచి, ఈ పరికరంతో నాట్లు వేసుకోవచ్చు. ఈ పరికరాన్ని నడపడానికి ఒక మనిషి చాలు. ఎకరా పొలంలో నాలుగు గంటల్లో నాట్లు పూర్తి చేశానని ఉమామహేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. వరుసల మధ్య 14 సెం.మీ. దూరం ఉంటుంది. వరుసల్లో మొక్కల మధ్య 7 సెం.మీ. దూరం పెట్టామని, దీన్ని రైతు వసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చని అన్నారు. ఈ వరుసల మధ్య పెరిగే కలుపు తీసే ఇనుప పరికరలను కూడా రూపొందించటం విశేషం. వరి నాటే పరికరం పనితీరును పరిశీలించిన బొబ్బిలి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మాల కొండయ్య సంతృప్తిని వ్యక్తం చేశారు. చిన్న కమతాల్లో వరి నాట్లు వేసే రైతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వరి నాట్లు వేసే పరికరాన్ని రైతులకు రూ.10 నుంచి 15వేల మధ్య విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇతరులెవరయినా తోడై పెట్టుబడి పెడితే స్టార్టప్ కంపెనీని నెలకొల్పి చిన్న రైతులకు ఉపయోగపడే పరికరాలను పెద్ద సంఖ్యలో తయారు చేసి రైతులకు అందించాలన్నది తన అభిమతమని ఉమామహేశ్వరరావు(93989 02285) తెలిపారు. – రేగులవలస వ్యాస్‌బాబు, సాక్షి, బొబ్బిలి -
బొబ్బిలిలో కరోనా కలకలం
బొబ్బిలి: మున్సిపాలిటీలో కరోనా కలకలం రేపుతోంది. ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్న పట్టణంలో ఒక్క సారిగా కేసు లు పెరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతు న్నారు. మొన్న చిన దేవాంగుల వీధి, నిన్న నెయ్యిల వీధిలో కేసు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందగా అధికారులు పరీక్షలు నిర్వహించారు. శనివారం రాత్రి నెయ్యిల వీధి లోని ప్రజలకు శాంపిల్స్ తీశారు. అక్కడ నలుగురికి, దావా లవీధిలో ఇద్దరికి పాజిటివ్ అని తేలడంతో వారిని నెల్లిమ ర్లలోని మిమ్స్‌కు చికిత్స కోసం తరలించారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నా బ యటి నుంచి వచ్చిన వారు అటూ ఇటూ సంచరిస్తుండటంతో ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని భావిస్తున్నారు. అలాగే గ్రోత్‌సెంటర్ క్వారంటైన్ కేంద్రం నుంచి ముగ్గురు పాజిటివ్ వ్యక్తులను ఆదివారం మిమ్స్‌కు తరలించారు. వీరు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వలసదారులు. వీరు క్వారంటైన్లో ఉండగానే జిల్లాలోకి ప్రవేశించే ముందు తీసిన శాంపిల్స్ ద్వారా ఇప్పుడు పాజిటివ్ నమోదు అయింది. అందరికీ కామన్ బాత్రూం గ్రోత్‌సెంటర్ క్వారంటైన్లో కామన్ బాత్ రూం ఉంచారని అక్కడ క్వారంటైన్ పొందుతున్న ఆర్మీ జవాను గొట్టాపు మురళీధర్, గంట సురేష్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఆశ్రయం పొందిన 12 మందిలో ముగ్గురికి పాజిటివ్ వచ్చిందనీ, అందరికీ మరుగుదొడ్లు, స్నానపు గదులు ఒక్కటేననీ, ఒకేచోట భోజనాలు పెడుతున్నారని, దీనివల్ల తమకు ఆందోళనగా ఉందని వాపోయారు. కొండవెలగాడలో ఇద్దరికి పాజిటివ్ నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండవెలగాడ గ్రామంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు పీహెచ్సీ వైద్యాధికారి ప్రశాంత్ రాజ్ ఆదివారం తెలిపారు. ఢిల్లీలో ఆర్మీ జవానుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఈ నెల 18న కొండవెలగాడకు వచ్చారని ఆ రోజే ఇద్దరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించామన్నారు. ట్రూనాట్ పరీక్షల్లో ఇద్దరికీ కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలిందని వెంటనే వారిని మిమ్స్ కోవిడ్ ఆస్పత్రికి తరలించామన్నారు. కుటుంబ సభ్యులతో పాటు వారితో కాంటాక్ట్ అయిన వ్యక్తులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపడతామన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తమై గ్రామాన్ని బ్లీచింగ్ మిశ్రమంతో శుభ్రం చేశారు. వైద్య, ఆరోగ్య, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఆరోగ్య సూత్రాలను తెలియజేశారు. ఎవరికైనా అనుమానం వస్తే పరీక్షలు చేయించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రా వాలని కోరారు. ఎస్సై అశోక్ కుమార్, ఆర్ఐ నరేష్ కుమార్ గ్రామంలో పర్యటించి ప్రజలకు అవగాహన కలి్పంచారు. -
'మూఢనమ్మకానికి 12 మందికి జీవిత ఖైదు'
సాక్షి, బొబ్బిలి: మూఢ నమ్మకంతో వారు రాక్షసంగా ప్రవర్తించారు. మూర్ఖంగా వ్యవహరించినందుకు మూల్యం చెల్లించుకున్నారు. చేతబడి ఉందన్న అనుమానంతో ఇద్దరిని అతి దారుణంగా హతమార్చారు. న్యాయమూర్తి సంచలన తీర్పుతో వారంతా ఇప్పుడు జీవిత ఖైదీలుగా మారారు. విజయనగరం జిల్లా మక్కువ మండలం ఎస్ పెద్దవలస పంచాయతీలోని కేకే వలస గ్రామానికి చెందిన 12 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ బొబ్బిలిలోని రెండో అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి బి శ్రీనివాసరావు శుక్రవారం ఇచ్చిన తీర్పు ఇక్కడ కలకలం సృష్టించింది. కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్ షణ్ముఖరావు తెలిపిన వివరాల ప్రకారం... కేకే వలసలో నివాసం ఉంటున్న జన్ని శ్రీను కాలికి దెబ్బతగిలి అనారోగ్యంపాలై 2016 జనవరి ఎనిమిదో తేదీన మృతి చెందాడు. ఆయన మృతికి గ్రామంలో ఉన్న గొల్లూరి పండు, సీతమ్మల చేతబడే కారణమని గ్రామస్తులంతా మరునాడే పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టించారు. ఆ రోజు ఏమీ తేలకపోవడంతో మరోసారి అదే నెల 12న మళ్లీ పంచాయితీ నిర్వహిద్దామని పెద్దలు చెప్పారు. దీనిని పట్టించుకోని గ్రామానికి చెందిన 13 మంది వ్యక్తులు జనవరి తొమ్మిదో తేదీ సాయంత్రం పండు, సీతమ్మలను రాళ్లతో కొడుతూ, తన్నుకుంటూ సమీపంలోని చిట్టిగెడ్డ వరకూ ఈడ్చుకుపోయారు. హత్యకు గురైన దంపతులు పండు, సీతమ్మ (ఫైల్) అక్కడ వారికి కొనప్రాణం ఉండగానే దహనం చేశారు. అదేరోజు రాత్రి భస్మాలను, మిగిలిన ఎముకలను కనిపించకుండా గెడ్డలోనే పారబోశారు. అనంతరం దంపతులను దహనం చేసిన చోట కడిగేసి సాక్ష్యాలను మిగల్చకుండా చేశారు. దంపతుల మరణంపై అనుమానం ఉన్న వారి రెండో కుమార్తె సూరమ్మ మక్కువ పోలీసు స్టేషన్లో 13న ఫిర్యాదు చేసింది. తమ తల్లిదండ్రులకు తాము ముగ్గురు కుమార్తెలమనీ, తల్లిదండ్రులను సజీవంగా దహనం చేశారనీ, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే సాలూరు సీఐ జి.రామకృష్ణ సంఘటనా స్థలానికి వెళ్లడం, ప్రాధమిక సాక్ష్యాధారాలను సేకరించడంతో పలు విషయాలను గుర్తించారు. పండు, సీతమ్మల హత్యకు కారణమైన అదే గ్రామానికి చెందిన 13మందిపై కేసు నమోదు చేసి కోర్టుకు సమర్పించారు. సంఘటన వెలుగు చూసిన తరువాత ఏఎస్పీ సిద్ధార్థ కౌశల్ కూడా చిట్టిగెడ్డకు వెళ్లి పరిశీలన చేశారు. అనంతరం పలుమార్లు పార్వతీపురం, బొబ్బిలి కోర్టులో కేసు విచారణకు వచ్చింది. గ్రామంలో ఓ వ్యక్తి ఈ హత్యోదంతాన్ని తన సెల్ఫోన్లో చిత్రీకరించారు. పోలీసులు దానినే సాక్ష్యంగా కోర్టులో ప్రవేశపెట్టారు. పార్వతీపురం, బొబ్బిలి కోర్టులలో పలుమార్లు ఈ వీడియోను న్యాయమూర్తులు స్వయంగా పరిశీలించారు. బొబ్బిలిలో తుదితీర్పు... పలుమార్లు విచారణ అనంతరం చివరగా శుక్రవారం నాడు బొబ్బిలి రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి బి.శ్రీనివాసరావు ఐపీసీ సెక్షన్ 302, 204, 506(2), 120(బి), రెడ్‌విత్ 149 ప్రకారం 12 మంది నిందితులను నేరస్తులుగా పరిగణిస్తూ బతికి ఉన్నంత కాలం కఠిన కారాగార శిక్ష అనుభవించాలని తీర్పు వెలువరించారు. అలాగే ఒక్కొక్కరికీ రూ.2,600 జరిమానా విధించారు. ఫిర్యాదు దారయిన గొల్లూరి పండు, సీతమ్మల కుమార్తెకు రూ.5లక్షల పరిహారాన్ని చెల్లించాలని జిల్లా న్యాయ సలహా సంఘానికి సిఫార్సు చేశారు. నిందితుల్లోని ఒకరయిన గొల్లూరి అర్జున ఈ నేరం చేయకూడదని మిగతా వారిని వారించినట్టు రుజువు కావడంతో అతనిని నిర్దోషిగా విడుదల చేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. ఈ సందర్భంగా నిందితులకు శిక్ష ఖరారు చేసే ముందు వారితో మీరు చేసిన ఈ నేరానికి ఉరిశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష విధించొచ్చనీ వ్యాఖ్యానించారు. దీనిపై మీ మనోగతమేంటని న్యాయమూర్తి అడగ్గా నిందితులెవరూ మాట్లాడలేకపోయారు. దీంతో న్యాయమూర్తి నిందితులకు శిక్షను ఖరారు చేశారు. నేరస్థులు వీరే! గొల్లూరి పండు, సీతమ్మల హత్యోదంతానికి కారణమయిన నేరస్తులుగా గ్రామానికి చెందిన పాలిక వెంకట రావు, జన్ని గంగరాజు, జన్ని గోవింద, పాలిక చంద్రరావు, జన్ని ధర్మారావు, పాలిక తిరుపతి, పాలిక జోగులు, జన్ని సన్యాశిరావు, జన్ని ముకుంద, పాలిక జగ్గులు అలియాస్ జగ్గు, జన్ని అప్పలస్వామి, పాలిక మల్లన్నలను నేరస్థులుగా గుర్తిస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. బొబ్బిలిలో తుది తీర్పు వెలువడనుందని తెలియడంతో కోర్టుకు పలు వాహనాల్లో 13 మంది నిందితుల కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, బంధువులు కోర్టుకు చేరుకున్నారు. న్యాయమూర్తి తీర్పు వెలువరించగానే 12 మంది నేరస్తుల కుటుంబ సభ్యులు, వారి పిల్లలు, తల్లిదండ్రులు ఒక్క సారి ఘొల్లుమన్నారు. వీరిని పోలీసులు కాసేపు నేరస్థులతో మాట్లాడించేందుకు అవకాశమిచ్చిన వెంటనే తిరిగి కోర్టు బయటకు పంపేశారు. అనంతరం జిల్లా కేంద్రం నుంచి వచ్చిన పోలీసు బలగాలతో వీరిని తరలించారు. కాగా హతులు గొల్లూరి పండు, సత్తెమ్మలకు ముగ్గురు కుమార్తెలున్నారు. వీరిలో పెద్దకుమార్తె చోడిపల్లి రాధ, రెండో కుమార్తె సూరమ్మ, మూడో కుమార్తె గొల్లూరు నరసమ్మలతో పాటు వారి బంధువులు, కుటుంబ సభ్యులు న్యాయమూర్తి తీర్పు తమ కుటుంబానికి న్యాయం చేసిందని, జడ్జి తీర్పుపై సంతోషం ప్రకటించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఎస్పీ అభినందన సాక్ష్యాలను సమయానుకూలంగా ప్రవేశపెట్టడంతో పాటు కేసును విచారించేందుకు సహకరించడం, నేరస్తులకు శిక్ష పడేలా వ్యవహరించిన అప్పటి సీఐ జి.రామకృష్ణ, కోర్టు లైజెనింగ్ అధికారి ఎస్.షణ్ముఖ రావు, కోర్టు కానిస్టేబుల్ మురళి, పీపీలు అద్దేపల్లి నారాయణ రావు, రఘురాంలను జిల్లా ఎస్పీ బి.రాజకుమారి అభినందించారు. -
పరమపవిత్రం స్ఫటిక లింగం
సాక్షి, రాజాం : రాజాం పట్టణం అనగానే అందరికంటే ముందుగా గుర్తొచ్చేది తాండ్ర పాపారాయుడు. రాజాం కేంద్రంగా బొబ్బిలి రాజుల ప్రతినిధిగా ఆయన పాలన సాగించేవారు. ఇదే సమయంలో అక్కడ ఆయన పలు ఆలయాలను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఎక్కువుగా వైష్ణవ ఆలయాలు ఉండే ఈ ప్రాంతంలో ఆయన మాత్రం సారధిలోని కూరాకుల వీధిలో ప్రత్యేకంగా స్ఫటిక శివలింగాన్ని ప్రతిష్టించారు. లోక కల్యాణార్థం అప్పట్లో ఆయన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టించారని అంటారు. ఈ శివలింగాన్ని కాశీ నుంచి తీసుకొచి్చన రాతితో నిర్మించినట్లు చెబుతారు. మరోవైపు ఈ ఆలయంలో గర్భగుడి కుడి, ఎడమ వైపునున్న గుడుల్లో గణేశుని ప్రతిమతతో పాటు పార్వతిదేవి ప్రతిమలు ఉత్తర, దక్షిణ ముఖంగా ఉంటాయి. ఇలా ఈ రెండు విగ్రహాలు ఉత్తర, దక్షిణ ముఖాలుగా ఉండడం ఇక్కడి ప్రత్యేకత. తాండ్ర పాపారాయుడు ప్రతిరోజు ఉదయం శివలింగ దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు చేసేవారని తెలుస్తోంది. ఈ శివలింగానికి నిష్టతో పూజచేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. -
చేప...వలలో కాదు.. నోట్లో పడింది
సాక్షి, బొబ్బిలి: గొంతులో పచ్చివెలక్కాయ పడిన చందాన ఓ జాలరి గొంతులో చేప పడింది. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో చోటుచేసుకుంది. పక్కి గ్రామానికి చెందిన సత్తివరపు పకీరు.. గురువారం స్థానిక కాలువలో చేపలు పడుతున్నాడు. ఈ క్రమంలో ఒక చేప అతని గొంతులోకి పడింది. దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా గొంతు లోపలికి వెళ్లిపోయింది. దీనిని గమనించిన తోటిజాలర్లు... పకీరును బొబ్బిలిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ ఆర్నిపల్లి గోపీనాథ్.. పకీరు గొంతులోని చేపను కొంత మేర కత్తిరించి ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటకు తీశారు. అనంతరం డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ.. సకాలంలో పకీరును ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని లేదంటే చేప పూర్తిగా గొంతులోకి దిగిపోయి ఉంటే శస్త్రచికిత్స చేయాల్సి వచ్చేదని చెప్పారు. పకీరు గొంతులో పడిన చేప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జాలరి పకీరు -
అయ్యో.. పాపం పసిపాప..
సాక్షి, బొబ్బిలి: పట్టణంలోని పోలవానివలస సమీపంలోని ఓ కాలువలో గురువారం తెల్లవారుజామున అప్పుడే పుట్టిన ఓ ఆడపిల్ల మృతదేహం తేలియాడుతుండడం కలకలం సృష్టించింది. ఎవరో ఇక్కడకు సంచిలో తీసుకువచ్చి బిడ్డను కాలువలో విసిరేసి సంచి పక్కన పడేసి తేలిగ్గా వెళ్లిపోయింది. దీంతో ఆ పసికందు నీటిలో కొట్టుకుంటూ ఊపిరాడక మృతి చెందింది. దీంతో స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. ఎవరికి ఏ కష్టం వచ్చిందో చిన్నారిని ఇలా కాలువలో పడేశారని వాపోయారు. ఒకటి,రెండు రోజుల్లోనే..! కాలువలో తేలియాడుతున్న ఆడబిడ్డను చూసిన వారు ఒకటి, రెండు రోజుల్లోపే జన్మించి ఉంటుందని చెబుతున్నారు. మృతదేహం ఉబ్బకపోవడాన్ని బట్టి పుట్టిన వెంటనే కాలువలో పడేసి వెళ్లిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్లిప్పు ఆధారమవుతుందా..? శిశువు బొడ్డును కత్తిరించినపుడు ఆస్పత్రుల్లో క్లిప్ పెడతారు. సెప్టిక్ కాకుండా, గాలి వెళ్లకుండా భద్రత కోసం పెట్టిన క్లిప్పుతోనే బిడ్డను నీటిలో పడేసి వెళ్లిపోయిన అగంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పుడా క్లిప్పు ఆధారంగా కేసు దర్యాప్తు చేసే అవకాశముందని తెలుస్తోంది. దీని ఆధారంగా ఆస్పత్రులను పరిశీలించి ఆ కర్కశ తల్లిదండ్రులను పట్టుకుని శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. పరిశీలించిన పోలీస్, ఐసీడీఎస్ సిబ్బంది.. బొబ్బిలి ఐసీడీఎస్ కార్యాలయాల ఎదురుగానే ఆడ శిశువును కాలువలో పడేశారని తెలుసుకున్న పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మా పరిధిలో బాలింతలు లేరని ఐసీడీఎస్ సిబ్బంది అంటుండగా.. కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. వదిలిపెట్టం.. ఇది హేయమయిన సంఘటన.. చిన్నారిని కాలువలో విసిరేసిన ఎవ్వరైనా వదిలి పెట్టేదిలేదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో విచారిస్తాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. – వి. ప్రసాదరావు, ఎస్సై, బొబ్బిలి -
పోరాట ధీరులు బొబ్బిలి వీరులు
సాక్షి, బొబ్బిలి : స్వాతంత్య్ర పోరాటంలో బొబ్బిలి వాసులు అనేక మంది పాల్గొన్నా చరిత్ర, రికార్డుల ఆధారంగా కొంతమంది పేర్లే ప్రముఖంగా వినిపించాయి. వీరిలో బొబ్బిలికి చెందిన అయ్యగారి అప్పలనరసయ్య ఒకరు. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందున ఆయనకు 1932లో రెండేళ్లు కఠిన కారాగార శిక్ష విధించారు. మద్రాసు, వెల్లూరు జైలులో శిక్ష అనుభవించి బొబ్బిలి వచ్చారు. అలాగే బొబ్బిలికి చెందిన అయ్యగారి సత్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులు, అయ్యగారి రామపాపారావు స్వాతంత్య్ర పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. అప్పట్లో వీరికి బ్రిటిష్ వారు కొరడాదెబ్బల శిక్ష విధించేవారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు కాగా వీరంతా ప్రస్తుతం కాలం చేశారు. బొబ్బిలిలో చర్చివీధిలో వీరికి ఇళ్లు ఉండేవి. వీరి కుటుంబసభ్యులు ఈ ప్రాంతంనుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయి ఆస్తులు అమ్ముకున్నారు. గాంధీజీకి ఆశ్రయమిచ్చిన సావిత్రమ్మ పట్టణానికి చెందిన పుల్లెల సావిత్రమ్మ గాంధీకి భోజన ఏర్పాట్లు చేశారు. మూడేళ్లక్రితమే కాలం చేసిన సావిత్రమ్మ 1923వ సంవత్సరంలో ఆమె తన మేనత్త, మేనమా మ ఇంట్లో ఇచ్చాపురంలో ఉండేవారు. పుల్లెల సన్యాసిరావుతో ఆమెకు వివాహం కాగా, ఆమె బావ పుల్లెల శ్యామసుందరరావు జమీందారు. గౌతులచ్చన్న గురువు అయిన శ్యామసుందరరావు అప్పట్లో స్వాతంత్య్ర సమరంలో చురుకైన పాత్రపోషించారు. 1923లో గాంధీ రాజకీయసభ కోసం బరంపురం వెళ్తూ శ్యామసుందరరావు ఇంట్లో బసచేశారు. ఆ సమయంలో గాంధీకి సావిత్రమ్మ అన్ని రకాల వంటకాలు సిద్ధం చేశారు. అయితే అవేవీ గాంధీ తీసుకోకుండా కేవలం మేకపాలు, వేరుశనగలు అడిగి తిన్నారు. అప్పుడే ఆయనతో మాట్లాడినట్టు సావిత్రమ్మ చెప్పేవారు. -
రైల్వే ప్రయాణికుడి వీరంగం
బొబ్బిలి: విశాఖ నుంచి బొబ్బిలి వైపు వస్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్ బోగీ మీదకి మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు ఎక్కి కలకలం సృష్టించాడు. శనివారం సాయంత్రం బొకారో ట్రైన్‌ను విజయనగరంలో రన్నింగ్‌లో ఎక్కిన ఒడిశా వాసి పైన ఉండే విద్యుత్ తీగలను అం దుకోబోతుండటాన్ని గొట్లాం స్టేషన్ వద్ద గమనించిన లైన్‌మన్, టోకెన్ పోర్టర్లు స్టేషన్‌కు సమాచారమందించారు. వెంటనే స్టేషన్ సిబ్బం ది ∙బొకారో ట్రైన్ డ్రైవర్లక సమాచారమందించారు. దీంతో డ్రైవర్లు గరుగుబిల్లి వద్ద ట్రైన్‌ను నిలిపివేసి కిందికి దిగమని కేకలు వేశారు. అయినా మత్తు వీడని ప్రయాణికుడు చేతులు మీదికెత్తుతూ కాసేపు హల్చల్ చేశాడు. చివరకు కొందరు మీదికి ఎక్కి మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడ్ని కిందికి నెట్టేశారు. వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని బొబిŠబ్లి స్టేషన్‌కు తరలించారు. మద్యం మత్తులో ఉండడం వల్ల వివరాలు చెప్పలేకపోతున్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. -
ఏళ్లతరబడి అక్కడే...
ప్రభుత్వం పాలనలో పారదర్శకత కోరుకుంటోంది. అన్ని విభాగాల్లోనూ ప్రక్షాళన చేపట్టాలని ఆదేశిస్తోంది. జిల్లాస్థాయి అధికారులు సైతం అక్రమాలకు అవకాశం లేకుండా పనులు చేపట్టాలని పదేపదే హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగానే కొద్దిరోజుల క్రితం సాధారణ బదిలీలు చేపట్టి కొత్తగా పాలనకు తెరతీయాలని యోచించారు. కానీ కొందరు అధికారుల చర్యలతో ఈ వ్యవహారం కాస్తా విమర్శలకు తావిస్తోంది. జలవనరులశాఖలో జరిగిన బదిలీలు అసంతృప్తులకు దారితీసింది. ఏళ్లతరబడి ఇక్కడే తిష్టవేసుకున్నా వారిని కదపకపోవడం చర్చనీయాంశమైంది. చివరకు దీనిపై స్పందనలో ఫిర్యాదులు చేసుకునే స్థాయికి చేరాయి. సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : జల వనరుల శాఖలో జరిగిన బదిలీల్లో అసంతృప్తులు బయటపడుతున్నాయి. రాష్ట్రమంతా పారదర్శకతకు పెద్ద పీటవేస్తోందని ప్రభుత్వాన్ని కొనియాడుతున్నా కొందరి అధికారుల అలసత్వంతో ఇంకా పాత వాసనలు వదలడం లేదన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. బొబ్బిలిలో ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఉంది. ఈ సర్కిల్లో ఎస్ఈగా ఇటీవలే చేరిన కె.రాంబాబు ఆధ్వర్యంలో రెండు జిల్లాల్లోని జలవనరుల శాఖ అధికారులు, సిబ్బందికి బదిలీలు జరిగా యి. శ్రీకాకుళం జిల్లా బదిలీల కు కూడా ఈయనే అడ్మినిస్ట్రేవ్ కంట్రోల్ కనుక రెండు జిల్లాల్లో బదిలీలు ఈయన ఆధ్వర్యంలోనే జరిగాయి. ఈ నెల 5 నాటికి బదిలీలు పూర్తి కావాల్సిఉన్నా మరో ఐదు రోజుల పాటు ఉన్నతాధికారులు గడువును పొడిగించారు. అయినా బదిలీల్లో నిబంధనలను పాటించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 20 ఏళ్లుగా అవే సీట్లలో ... ఇరిగేషన్ సర్కిల్లోని పలువురు అధికారులు చాలా ఏళ్లుగా అక్కడే పాతుకుపోయినా బదిలీలు జరగడం లేదు. ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన వారిని బదిలీ చేయాల్సి ఉంది. దీనికి దొరకకుండా ఉండేందుకు ఈ బదిలీలకు ముందు కొన్ని రోజుల పాటు ఇతర ప్రాంతాలకు బదిలీ చేసుకుని... తరువాత అక్కడినుంచి వచ్చేస్తూ... కొత్తచోటుగా చూపించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఆరోపణలు వీరిపైనే.. బొబ్బిలి ఇరిగేషన్ సర్కిల్లో టెక్నికల్ అధికారి శ్రీనివాసరావు, పర్యవేక్షకురాలు భాగ్యలక్ష్మితో పాటు ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు దాదాపు ఆరు నుంచి పదిహేను సంవత్సరాలుగా ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. బదిలీలకు ముందు ఇతర ప్రాంతాలకు ఎలాగోలా బదిలీచేయించుకోవడం మళ్లీ ఇక్కడకు వచ్చేస్తూ... కొత్తవారికి మాత్రం అవకాశం కల్పించడం లేదని ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. వీరికి ఎస్ఈ అడ్మినిస్ట్రేషన్ విధానంలో అవసరమున్న సిబ్బంది అంటూ డిటెన్షన్ ఇచ్చారు. ఇక్కడకు బదిలీ కోసం వచ్చేందుకు సింగిల్ ఆప్షన్ ఇచ్చినా తన భర్తకు బదిలీ అవకాశం ఇవ్వలేదని ఎ.సుధారాణి అనే టీచర్ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. చేతులు మారుతున్న కాసులు? బదిలీల కోసం భారీగానే కాసులు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్కిళ్లలో జరుగుతున్న బదిలీల్లో ఎన్నాళ్లుగానో పాతుకుపోతున్నవారిని వదిలిపెట్టడం ఈ ఆరోపణలకు బలాన్నిస్తున్నాయి. స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన సుధారాణి తన భర్తకు స్జౌజ్ ప్రాతిపదికన బొబ్బిలిలో పోస్టింగ్ ఇవ్వాల్సి ఉన్నా... ఈ మేరకు సింగిల్ ఆప్షన్ ఇచ్చినా పార్వతీపురం బదిలీ చేయడం దారుణమని పేర్కొన్నారు. బదిలీలకు చేతులు మారిన డబ్బులు తామూ ఇవ్వగలమని సాక్షాత్తూ స్పందన అధికారులవద్దే ఆమె వ్యాఖ్యానించడం విశేషం. సెక్షన్ కార్యాలయంలో ఇతరుల హవా నడవకుండా ఉండేందుకు కొందరు కావాలనే బదిలీల్లో రాజకీయ జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. -
కాదేదీ కబ్జాకు అనర్హం..!
సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : కబ్జాకు కాదేదీ అనర్హం అంటూ గట్టు, పుట్ట, శ్మశానం, ఆఖరికి చెరువులు కూడా కబ్జా చేస్తూ ఆక్రమణదారులు సొమ్ము చేసుకుంటున్నారు. వీటిలో అధికంగా పక్కపక్కనే సాగు చేస్తున్న రైతులు ఉండగా, కొన్ని చెరువులను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారు. కొందరు కబ్జా చేసి ఇతరులకు సాగుకు అందించి తమ సత్తా చాటుకుంటున్నారు. చెరువుల్లో 50 శాతం పైగా కబ్జా జరిగినట్లు అంచనాలు ఉన్నాయి. ఈ మేరకు తహసీల్దార్లు ఎప్పటికప్పుడు నోటీసులు జారీ చేస్తున్నారు. అయినా కబ్జాలు ఆగడం లేదు. ముందుగా రైతులతో కబ్జా చేస్తుండడంతో ఈ కబ్జాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ధికారుల నిర్లక్ష్యం, అలసత్వం కూడా కొంత మేర ఆక్రమణలకు కారణం అవుతుండగా, తహసీల్దార్లు ఎప్పటికప్పుడు మారిపోతుండడంతో వారికి అవగాహన లేకపోవడం, వీఆర్వోలు సరిగ్గా పట్టించుకోకపోవడం, గ్రామస్తులతో వివాదాలు లేదా గ్రామాల్లో వివాదాలతో తమకు ఎందుకు వివాదం అన్న ధోరణిలో వెళ్తుండడం కొంతమేర కబ్జాలకు కారణం అవుతున్నాయి. కబ్జా బారిన పడిన చెరువుల వివరాలు.. బొబ్బిలి మండలంలో చింతాడలో పుట్టోడి చెరు వు, నారప్పచెరువు, పిరిడిలో పోలవానిచెరువు, అలజంగిలో సీతారామ సాగరం, దాలెందర చెరువు, మెట్టవలసలో మల్లమ్మచెరువు, కృష్ణాపురంలో రంగం చెరువు, ఎర్రచెరువు, గొర్లెసీతారాంపురంలో రాయుడిచెరువు, కోమటపల్లిలో నారయ్యచెరువు ఇలా ప్రతీ గ్రామంలో చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఇలా అన్ని మండలాల్లోని గ్రామాల్లో పలు చెరువులు ఆక్రమణ బారిన పడ్డాయి. గతంలో రైతులు పంటలు వేసుకునేందుకు ఆక్రమించుకోగా ఇప్పుడు నాయకులు, రియల్ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేస్తున్నారు. కబ్జాకోరల్లో చెరువులు.. ఇదివరలో రైతులు పంటలకోసం కక్కుర్తి పడి చెరువు గర్భాలు ఆక్రమించుకునే వారు. ఇప్పుడు అలా కాకుండా దళారీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలు చేస్తున్నారు. చెరువులు, పంట కాలువలు కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కబ్జాలపై చర్యలు చేపట్టాలి. – బొమ్మి అప్పలనాయుడు, రైతు, పెంట రైతులు ఇబ్బంది పడుతున్నారు.. చెరువులు కబ్జా చేస్తుండడంతో రైతులు సాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. చెరువులను కబ్జాచేసి వీఆర్వోల సహాయంతో రికార్డులు తారుమారు చేస్తున్నారు. సీతయ్యపేటలో ఓ వీఆర్వో బినామీగా చెరువు కబ్జా చేశాడు. సుప్రీం కోర్టు ఆదేశాలు పట్టించుకోవడం లేదు. అక్రమణదారులపై చర్యలు చేపట్టాలి. – వేమిరెడ్డి లక్ష్మణ్ నాయుడు, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, బొబ్బిలి. నోటీసులు ఇస్తున్నాం.. అనేక చెరువులు కబ్జాలో ఉ న్నట్లు తెలు స్తోంది. మా వీఆర్వోలు స మాచారం తెలి పిన వెంటనే నోటీసులు ఇస్తున్నాం. ఎవరైనా ఫిర్యాదు చేసినా నోటీసులు ఇస్తున్నాం. చర్యలు చేపడుతున్నాం. అనేకమంది ఆక్రమణ దారులకు గతంలో తహసీల్దార్లు నోటీసులు ఇచ్చారు. చర్యలు తీసుకుం టున్నాం. – ఏ.సింహాచలం, తహసీల్దార్, బొబ్బిలి. నియోజకవర్గంలో చెరువుల విస్తీర్ణం, కబ్జా వివరాలు.. మండలం చెరువుల సంఖ్య సాగువిస్తీర్ణం కబ్జా(సుమారుగా) బొబ్బిలి 356 1,550 ఎకరాలు 50ఎకరాలు తెర్లాం 460 1,000ఎకరాలు 30ఎకరాలు బాడంగి 320 935ఎకరాలు 10ఎకరాలు రామభద్రపురం 266 870ఎకరాలు 12ఎకరాలు -
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం..
సాక్షి, బొబ్బిలి (విజయనగరం): తెలంగాణలోని వరంగల్‌లో ఓ తొమ్మిదినెలల పసికందుపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడి ఆమె మరణానికి కారణమయ్యాడు. ప్రకాశం జిల్లా ఒంగోలులో స్నేహితుడికోసం ఎదురు చూస్తున్న ఓ యువతిని ఐదుగురు యువకులు కొన్నాళ్లపాటు లైంగికదాడిచేసి ఆమె జీవితాన్ని సర్వనాశనం చేశారు. గుర్ల మండలం దేవుని కణపాకకు చెందిన పశువుల కాపరిగా ఉన్న ఓ యువతిని అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు పశువుల కాపర్లు లైంగిక దాడికి పాల్పడటమే గాకుండా... ఆ చిత్రాలను సెల్ఫోన్లో చిత్రీకరించి తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు. ఈ సంఘటనలు మరువక ముందే తాజాగా బొబ్బిలి మండలం పెంట గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై ఓ ఆకతాయి లైంగికదాడికి పాల్పడటమే గాకుండా దీనిపై నిలదీస్తే తాను చనిపోతానంటూ బెదిరించి ఊరు విడిచి వెళ్లిపోయాడు. గ్రామ పెద్దలు ఆ చిన్నారిపై జాలి చూపకపోగా నిందితుడిపక్షాన నిలవడానికి యత్నించి ఇప్పుడు అభాసుపాలయ్యారు. బతుకు తెరువుకోసం ఊరుగాని ఊరొచ్చి... గుట్టుగా కాపురం చేసుకుంటున్న ఆ బిడ్డ తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన దంపతులు ఏడాదిన్నర క్రితం బొబ్బిలి మండలం పెంట వచ్చి స్థిరపడ్డారు. వారికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌లోని బెర్రీ కంపెనీలో కుటుంబ పెద్ద పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గిరడ లక్ష్మణరావు అనే యువకుడు చిన్నారులందరినీ ఆటలాడిస్తుండేవాడు. గత మంగళవారం అలాగే ఆటలాడిస్తూ ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం జరగడంతో గుర్తించిన తల్లి, చిన్నారిని ప్రశ్నించేసరికి విషయం బయటపడింది. వెంటనే ఆమె భర్తకు విషయం తెలియజేయడంతో గ్రామపెద్దల వద్దకు విషయం వెళ్లింది. దీనిపై లక్ష్మణరావును నిలదీయగా భయపడి తాను చనిపోతానని బెదిరించి గ్రామం విడిచి పారిపోయాడు. నిందితుడు ఆత్మహత్యచేసుకుంటాడేమో... ఆ కేసు తమపైకి వస్తుందేమోనన్న భయంతో బాధితకుటుంబం మౌనం వహించింది. అమ్మమ్మ పెంపకంలోనే యువకుడు... నిందితుడు లక్ష్మణరావుకు చిన్నప్పుడే తల్లి చనిపోయింది. ఇటీవలే తండ్రి మరణించడంతో అమ్మమ్మ సావు సింహాచలం వద్ద పెరుగుతున్నాడు. లక్ష్మణరావుకు రామారావు అనే కవల సోదరుడు ఉన్నాడు. వీరిద్దరినీ సింహాచలం కూలీ చేసి పెంచుతోంది. లక్ష్మణరావు బొబ్బిలిలో ఓ ప్రైవేటు ఐటీఐలో చదువుతున్నాడు. ఘటన జరిగిన వెంటనే అందరినీ భయపెట్టి ముందుగా బాడంగి మండలం కోడూరు వెళ్లి తరువాత కృష్ణాజిల్లా ఉయ్యూరులో ఉంటున్న వరుసకు సోదరుడి ఇంటికి పారి పోయాడు. రంగంలోకి దిగిన పెద్దలు గ్రామపెద్దలు రంగంలోకి దిగారు. గ్రామానికి చెందిన పలువురు పెద్దలు బాధితకుటుంబం తమ గ్రామానికి చెందిన వారు కాకపోవడం, నిందితుడు తమ గ్రామస్తుడు కావడంతో పక్షపాత ధోరణితో వ్యవహరించి లక్ష్మణరావు వద్ద ఏమీ లేదని ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా తాము చర్యలు చేపడతామని, లక్ష్మణరావుకు ఏమైనా అయినా, ఆతను ఆత్మహత్యచేసుకున్నా బాధిత కుటుంబానికి సంబంధం లేదని అభయమిస్తూ రాతపూర్వకంగా పెద్దలు అంగీకార పత్రాన్ని రాశారు. ‘సాక్షి’కి సమాచారంతో ఘటన వెలుగులోకి... సంఘటనపై సాక్షికి ఓ వ్యక్తి సోమవారం సమాచారం ఇచ్చారు. వెంటనే పెంట గ్రామానికి వెళ్లగా అలాంటి సంఘటన జరగలేదని, అదంతా కట్టుకథ అని నమ్మించే యత్నం చేశారు. పోలీసులను అడిగినా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. నిందితుడిని కాపాడితే అందరూ ఇబ్బంది పడతారని సాక్షి హెచ్చరించడంతో విషయం బయటకు పొక్కిందనే భయంతో పెద్దలు బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చి బాధిత బాలికను సోమవారం రాత్రి బొబ్బిలి సీహెచ్‌సీలో చేర్పించాలని సలహా ఇచ్చారు. నిందితుడిని ఉయ్యూరునుంచి రావాలని సూచించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం రాత్రి సీహెచ్‌సీలో చేర్పించిన బాధిత బాలికకు ప్రభు త్వ వైద్యులు వైద్యపరీక్షలు చేసి జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకుని గజపతినగరం మండలం బూర్జవలస పోలీస్ స్టేషన్లో ఉంచినట్లు తెలిసింది. నిందితుడిపై పోక్సో చట్టం...? పోలీసుల అదుపులో ఉన్న నిందిడుతపై పోక్సో(ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బొబ్బిలి ఏఎస్పీ గౌతమిశాలి ఈ విషయంపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. నిందితుడు ఈ నెల 6కు మేజర్ అయినట్లు తెలుస్తోంది. నిందితుడిని బుధవారం ఉదయం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సీఐ మోహనరావు తెలిపారు. కాగా పోలీసులు గ్రామపెద్దలను విచారించారు. -
మైనార్టీలను మర్చిపోయావా ‘బాబు’
సాక్షి, బొబ్బిలి : ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు ఆరు ఎమ్మెల్యే సీట్లిచ్చారు. షబ్బీర్ అలీని మైనార్టీ శాఖ మంత్రిగా నియమించి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన చలువతో ఎంతోమంది నిరుపేద ముస్లిం పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ముస్లింలను పూర్తిగా గాలికొదిలేశారు. ఐదేళ్ల పాటు మా సంక్షేమాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి ఇప్పుడు ముస్లింల సంక్షేమానికి కోట్లు కుమ్మరిస్తామంటే ఎలా నమ్మాలి?’ అని ప్రశ్నించారు ముస్లింలు. బొబ్బిలిలో పలువురు ముస్లింలు తమ సమస్యలు, పాలకుల తీరుపై రచ్చబండ నిర్వహించుకున్నారు. సయ్యద్ అమ్ములు మాట్లాడుతూ.. ‘మా అమ్మాయి షైనాజ్ బేగం పెళ్లి నిమిత్తం దుల్హన్ పథకం కింద ఆర్థిక సాయానికి దరఖాస్తు చేశాం. రూ.50 వేలు వస్తాయి కదా పెళ్లి ఘనంగా చేద్దాం అనుకున్నాం. నేటికీ షాదీ ముబారక్ ప్రోత్సాహకం ఇవ్వలేదు. అప్పులు చేసి పెళ్లి జరిపించాం. దాదాపు ఏడాది నుంచి తిరుగుతున్నా ప్రయోజనం లేదు’ అని వాపోయింది. పూరి పాకలో ఉంటూ ఓ మెస్‌లో పని చేసుకునే ఈమె ఆర్థిక పరిస్థితి అంతంతే. ఆమె భర్త సయ్యద్ అలీ ఇటీవల ప్రమాదానికి గురి కావడంతో ఆ పని కూడా మానేసి అతనికి సపర్యలు చేస్తోంది. చుట్టుపక్కల వారు, బంధువుల సాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేస్తే.. 2013లో రూ.35 వేల రుణం తీసుకున్నానని ఆపేశారు. మీరేమైనా రుణం ఇచ్చారా? ఎప్పుడో 2013లో రుణం తీసుకుంటే నిరుద్యోగ భృతి ఆపేయడం ఏంటి. ఇది హాస్యాస్పదం కాదా. పథకాలన్నీ టీడీపీ వాళ్లకే వెళుతున్నాయి. మైనార్టీలను అసలు పట్టించుకోవడమే లేదు. – అబ్దుల్ ముజీబ్, నిరుద్యోగి అన్నిటికీ జన్మభూమి కమిటీలే మైనార్టీలు చాలా తక్కువ మంది ఉంటారు. ఏదైనా చేయాలంటే నేరుగా లబ్ధి కల్పించవచ్చు. కానీ.. అలా చేయట్లేదు. మా ప్రాంతంలో బీసీలతో జన్మభూమి కమిటీ వేశారు. మేం వెళితే వాళ్లెవరూ దొరకరు. ఏం చెబుతారో తెలియదు. కనీసం ఆ జన్మభూమి కమిటీలోనైనా మైనార్టీలకు చోటివ్వలేదు. – షేక్ నాగూర్ మమ్మల్ని బెదిరిస్తున్నారు మా సంక్షేమాన్ని పాలకులు పట్టించుకోవడం లేదు. ఇదే విషయాన్ని ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తే బెదిరిస్తున్నారు. ఇలా చేస్తే సహించేది లేదని హెచ్చరికలు చేస్తున్నారు. మాకు సంక్షేమ పథకాలు అందించకపోగా.. ఇదేమని ప్రశ్నిస్తే బెదిరింపులా? ఇంతకన్నా దారుణం ఉంటుందా? – మొహ్మద్ సాదిక్ -
ఊరించి..ఉసూరుమనిపించి..!
సాక్షి, బొబ్బిలి రూరల్: నియోజకవర్గంలో ఇంతకు ముందు చేసిన ఉపాధి పథకం కింద చేసిన అభివృద్ధి పనులకు కోట్ల రూపాయల మేర బిల్లులు చెల్లింపులు చేయాల్సి ఉంది. అధికారులు, పాలకులు అదిగో, ఇదిగో అంటూ ఊరించి చివరకు చేతులెత్తేశారు. ఒక వైపు ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపుతున్నారని, మరో వైపు సీఎఫ్ఎంఎస్ ఫ్రీజింగ్ తమను ఆర్థికంగా ముంచేశాయని పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు, 2 నెలలుగా వేతనాలు అందక వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకటనలే మిగిలాయి.. సర్వశిక్షా అభియాన్ పేరిట ప్రహరీలు నిర్మించేందుకు గానూ నిధులకు ఎలాంటి డోకా లేదని ప్రకటనలు గుప్పించారు అధికారులు, పాలకులు. తీరా పనులు చేసిన తర్వాత వాటి బిల్లులు పెండింగ్‌లో ఉంచేయడంతో కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉపాధి పథకంలో రోడ్లు పనులు చేయించి కోట్లలో బకాయిలు ఉంచేశారని వారు చెబుతున్నారు. నియోజకవర్గంలో దాదాపు రూ.2.5 కోట్ల మేర బిల్లులు చెల్లింపులు జరగాల్సి ఉంది. అంగన్వాడీ, పంచాయతీ భవనాలు, గ్రామీణ పశువైద్య కేంద్రాలు ఇలా ఏ పనులు చేపట్టినా నిబంధనల పేరిట త్వరగా పూర్తి చేయించి ఆనక చేతులెత్తేశారు. దీంతో పలువురు చేతిలో డబ్బులు లేక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నీరు–చెట్టు పనులకు కూడా పలువురుకి చెల్లింపులు చేయలేదు. రెండు నెలలుగా రాని వేతనాలు.. ఇక ఉపాధి పనులు చేసిన వేతనదారులకు 2 నెలలుగా చెల్లింపులు జరగలేదు. పని చేసినా తమకు వేతనాలు ఇవ్వకపోతే ఎలా అని వేతనదారులు అధికారులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో దాదాపు రూ.కోటి మేర వేతన బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు. రూ. 40 లక్షల వరకు బకాయి.. బొబ్బిలి మండలంలో దాదాపు రూ.40 లక్షల వరకు వేతన బకాయి ఉంది. జనవరి వరకు చెల్లింపులు జరిగాయి. మరో 10 రోజుల్లో చెల్లింపులు జరగొచ్చని భావిస్తున్నాం. – కె.కేశవరావు, ఉపాధి ఏపీఓ, బొబ్బిలి. బకాయి వాస్తవమే.. నియోజకవర్గంలో రోడ్ల బిల్లులు సుమారు రూ.2 కోట్లకు పైగా చెల్లించాల్సిన మాట వాస్తవం. నిధులు ఉన్న మాట వాస్తవమే. కానీ కొన్ని ఆటంకాలు ఉన్నాయి. వాటి వల్ల చెల్లింపులు జరగడం లేదు. సమస్యను ఉన్నతాధికారులకు నివేదించాం. వారి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం. – డబ్ల్యూవీవీఎస్ శర్మ, డీఈ, పంచాయతీ రాజ్, బొబ్బిలి. రూ.20 లక్షలు రావాల్సి ఉంది.. గ్రామంలో అనేక పనులు చేశా. వాటి బిల్లులు రూ.20 లక్షలకు పైగా రావాల్సి ఉంది. రోజూ కార్యాలయాలకు వెళ్లడం వచ్చేయడమే జరుగుతుంది. వడ్డీలు పెరిగి పోతున్నాయి. ఇలా అయితే ఎలా కష్టమే. – పాటూరు కృష్ణమూర్తి, ప్రజాప్రతినిధి, కలువరాయి. -
‘ఫిరాయింపులకు చెంప పెట్టులా ఉండాలి’
విజయనగరం: ఏప్రిల్ 11వ తేదీన జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బొబ్బిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శంబంగి వెంకట చిన అప్పల నాయుడిని గెలిపించడం ద్వారా ఫిరాయింపు రాజకీయాలకు చెంప పెట్టులా సమాధానం చెప్పాలని సినీ నటులు పృధ్వీ, కృష్ణుడు, జోగినాయుడు బృందం ప్రజలను కోరింది. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున సినీ నటులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ నటులు పృద్వీ, కృష్ణుడు ప్రసంగిస్తూ బొబ్బిలి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి అభివృద్ధి పేరుతో పార్టీ ఫిరాయించిన మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఓటు ద్వారా తగిన సమాధానం చెప్పాలని కోరారు. తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. జనసేన, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, బీఎస్పీ అన్ని పార్టీలు తెలుగు దేశం గొడుగు కిందకు చేరాయని ఆరోపించారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ని మోసం చేయడానికి కలిసికట్టుగా కొమ్ము కాస్తున్నాయని తీవ్రంగా దుయ్యబట్టారు. ఢిల్లీలో గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్టీ ఏవిధంగా క్లీన్ స్వీప్ చేసిందో అధే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా వైఎస్సార్సీసీ స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పారు. -
మంత్రి ఇలాకాలో సర్వేరాయుళ్లు..
బొబ్బిలి: నాలుగు రోజులుగా జిల్లాలో హల్చల్ చేస్తున్న సర్వేరాయుళ్లు బొబ్బిలిలో బుధవారం సంచరించారు. మంత్రి రంగారావు ఇలాకాలో సుమారు పది మందిదాకా సర్వేల కోసం ట్యాబ్‌లు పట్టుకుని తిరుగుతుండడంతో వారిలో కొంత మందిని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించారు. మీరు ఓట్లు తొలగించడానికే వచ్చారని నిలదీశారు. వారి వద్ద స్మార్ట్ మార్కెటింగ్ రీసెర్చ్ కంపెనీ పేరుతో ఐడెంటిటీ కార్డులను గుర్తించారు. హెచ్ ఎల్లప్ప, తదితరులను అసలు ఎందుకువచ్చారు? ఏం చేస్తున్నారని పదేపదే నిలదీసినా పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతో వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 27, 28, 29 వార్డుల్లో కొంతమంది యువకులు ట్యాబ్‌లు పట్టుకుని ఇంటింటికీ తిరగడంతో అనుమానం వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు వైఎస్సార్సీపీ నాయకుడు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సూచన మేరకు ప్రముఖ న్యాయవాది మజ్జి జగన్నాథంనాయుడు, మాజీ కౌన్సిలర్ పాలవలస ఉమాశంకర్, సతీష్, రియాజ్‌ఖాన్, తదితరులు వారిని పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. ఎస్సై ప్రసాద్ వారిని మీరు ఎంతమంది సర్వేకు వచ్చారు.. అందరూ కలిసి కలవాలని సూచించి పంపించేశారు. కొండవెలగాడలో... నెల్లిమర్ల/నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండవెలగాడ గ్రామంలో సర్వే చేపడుతున్న ఓ యువకుడిని జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయు డు ఆధ్వర్యంలో స్థానికులు పట్టుకుని నెల్లిమర్ల పోలీసులకు అప్పగించారు. పబ్లిక్ పాలసీ రీసెర్చ్ గ్రూప్ పేరుతో పేరూ, ఊరూ లేని గుర్తింపుకార్డు తగిలించుకున్న ఓ యువకుడు ఆ గ్రామంలో బుధవారం ఉదయం సర్వే చేపట్టేందుకు వచ్చాడు. గ్రామస్తులు సదరు యువకుడిని ఏ సంస్థ తరఫున సర్వే చేపడుతున్నావని వివరాలు అడుగగా.. సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడుకు విషయం తెలియజేయగా... ఆయన వచ్చి సదరు యువకుడిని ఎస్సై అశోక్‌కుమార్‌కు అప్పగించారు. అలాగే విషయాన్ని వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ మజ్జి శ్రీనివాసరావుకు తెలియజేశారు. ఈ సందర్భంగా సన్యాసినాయుడు మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని.. ఓటర్ల జాబితా సరిచూసుకుని పేర్లు లేకపోతే చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉంటే నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధి కొండపేటలో కూడా ఇద్దరు యువకులు సర్వే చేపట్టేందుకు రాగా స్థానికులు వారిని ప్రశ్నించగా ఎటువంటి వివరాలు చెప్పలేదు. మరింత గట్టిగా నిలదీసేసరికి యువకులు పరారయ్యారు. సర్వేకు వచ్చిన ఆ ముగ్గురు యువకుల వద్దనున్న ట్యాబ్‌ల్లో ఓటర్ల జాబితా ఉండడం విశేషం. -
ఖాళీ జాగాలో వేసెయ్ పాగా..
విజయనగరం, బొబ్బిలి: పట్టణంలోని ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అధికార పార్టీ నాయకులు అక్కడ వాలిపోతారు. ముందుగా కొయ్యిలు లేదా కంచెలు వేస్తారు.. అక్కడకు కొద్ది రోజుల తర్వాత పాకలు వేస్తారు.. మరికొద్ది రోజులకు ఆ ప్రాంతాన్ని చిన్న చిన్న ప్లాట్లుగా విభజించేందుకు రియల్టర్లను తీసుకువచ్చి ఆ స్థలాన్ని విక్రయించేస్తారు. ఇదంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నలలో జరుగుతున్నా అధికార పార్టీ నాయకులు నోరు మెదపకపోవడం విశేషం. బొబ్బిలిలోని పలు చెరువు గట్లు, గర్భాలు, ఖాళీ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. అన్ని విభాగాల్లోనూ టీడీపీ నాయకులే అధికారం చెలాయిస్తుండడంతో విలువైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. కాసింత ఇంటి జాగాకు పేద ప్రజలు దరఖాస్తు చేసుకుంటే బుట్టదాఖలా అవుతున్న ఈ రోజుల్లో లక్షల విలువ చేసే స్థలాలు కబ్జాకు గురికావడంపై ప్రజలు మండిపడుతున్నారు. పట్టణంలో ఉన్న దాదాపు మూడు చెరువులు ఇప్పటికే కప్పేసి విక్రయించేశారు. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, వసతి గృహాలు, చెరువులు కాదేదీ ఆక్రమణకనర్హమన్న రీతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారు. మున్సిపాలిటీలోని కిచిడీ బందలో ఇటీవల ఆక్రమణలను గుర్తించిన అధికారులు బోర్డులు పాతడంతో వాటిని తొలగించి మరీ చదును చేశారంటే అధికార పార్టీ నాయకుల బరితెగింపు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పట్టణంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఐటీఐ కాలనీ ఒకటి. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ వసతి గృహ సముదాయాలు, బీసీ వసతి గృహాలు, ఉద్యాన వన క్షేత్రాలున్నాయి. వీటి అంచునే కాలనీ ఉంది. ఇంటిగ్రేటెడ్ వసతి గృహం ఎదురుగా ప్రభుత్వ స్థలముంది. ఇక్కడ పలువురు పశువుల పాకలు వేసుకుని వినియోగిస్తున్నారు. అయితే స్థానిక టీడీపీ నాయకులు వారిలో కొందరిని వెళ్లగొట్టి అక్కడ ఇంటి స్థలాలకు మార్కింగ్‌లు చేశారు. కొయ్యలు పాతి, గోతులు తవ్వేసి ఇళ్ల నిర్మాణాలకు సిద్ధమైపోయారు. మరో పక్క ఇప్పటికే అక్కడ చాలా మంది ఆక్రమణలతో బినామీ పేర్లతో ఇళ్లను నిర్మించుకుని ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వసతిగృహం ఎదురుగా.... బొబ్బిలి ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహం ఎదురుగా ప్రభుత్వ స్థలం ఉంది. పట్టణంలోని 21వ వార్డులో ఉన్న ఈ ఖాళీ ప్రభుత్వ స్థలంలో స్థానిక టీడీపీ నాయకులు ఇళ్ల నిర్మాణం కోసం గోతులు తీశారు. సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ఈ స్థలానికి ప్రహరీ లేకపోవంతో గోతులు తీసి, నిర్మాణ సామగ్రి కూడా వేశారు. అంతే కాదు ఇక్కడ చాలా బిట్ల అమ్మకాలకు కొంత నగదు కూడా చేతులు మారినట్టు సమాచారం! అయితే రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రెండకరాల కబ్జా.. పట్టణ నడిబొడ్డున మేదరి బంద చెరువుంది. ఇక్కడ దాదాపు రెండకరాల స్థలం కబ్జా అయిపోయింది. విచిత్రమేమంటే ఇక్కడ మున్సిపల్ తీర్మానం చేసి మరీ కొంత స్థలం చేపల మార్కెట్‌కు కేటాయించారు. ఇక్కడ ప్రభుత్వమే కబ్జాకు పాల్పడితే ఇక స్థానికులు ఆగుతారా? బరితెగించిపోయారు. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో మేదరి బంద చెరువును మున్సిపల్ రికార్డుల్లో తొలగించాల్సింది. కేవలం ఈ రెండే కాదు. గొల్లపల్లిలో అధికారులు చొరవ తీసుకుని పరిశీలిస్తే రహదారులను కూడా ఆక్రమించేసిన సంఘటనలున్నాయి. అధికారులతో స్థానిక ప్రజాప్రతినిధులు ఆడుతున్న కబ్జాపర్వం తెగ సాగుతోంది. ఇప్పటికైనా జిల్లాస్థాయి అధికారులు స్పందించి ఆక్రమణదారుల చెర నుంచి స్థలాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
'రయ్'లు.. బస్సు
బస్సెక్కని వాడుండరు. రైలు తెలియని వారసలే ఉండరు. మరి.. రైలు బస్సు ఎక్కారా?.. అంటే.. కొత్తవారు ఆశ్చర్యపోతారు.. ఈ ప్రాంతీయులకు మాత్రమే చిరపరిచితమైన రైలు బస్సెక్కేందుకు ఇష్టపడతారు. పట్టాలపై నడిచే బస్సు లాంటి ఈ రైలు బొబ్బిలి నుంచి సాలూరుకు రోజూ వెళ్లి వస్తుంటుంది. ఈ మార్గంలో ప్రయాణించేవారు ఎక్కడ చెయ్యి ఎత్తినా బస్సులాగే ఆగిపోతుంది. ప్రయాణికుల్ని ఎక్కించుకొని తిరిగి బయల్దేరుతుంది. రైలు బస్సులోనే టిక్కెట్లు వసూలు చేస్తుంటారు. పట్టాలపై నడుస్తున్నా.. బçస్సులో వెళ్తున్నట్టు అనుభవాన్ని మిగిల్చే రైలు బస్సుపై కథనమిది. – విజయనగరం, బొబ్బిలి రూరల్ :ఈస్టు కోస్టు రైల్వేలో బొబ్బిలిలోనే ప్రప్రథమంగా రైలు బస్సును 1996 మార్చి నెలలో ప్రవేశపెట్టారు. బొబ్బిలి నుంచి సాలూరుకు 17 కిలోమీటర్ల దూరం ఇది నడుస్తుంది. ఇక్కడ బ్రిటిష్ వారి కాలంలో 1836లో మిలిటరీ, పోస్టల్ రవాణా కోసం బ్రాడ్‌గేజ్ రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు. దీంతో సాలూరులో కూడా ఒక రైల్వే స్టేషనును నిర్మించారు. ఆంగ్ల పాలన ముగియడంతో ప్రయాణికుల కోసం రెండు బోగీలున్న రైలును రోజుకు రెండుసార్లు బొబ్బిలి నుంచి సాలూరు మధ్య నడిపేవారు. రైలు సిబ్బంది, గార్డులు, సాలూరు స్టేషను సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణ ఖర్చు ఎక్కువవుతుండటంతో రైల్వేకు భారమైంది. దీంతో ఈ రైలును బస్సును ప్రవేశపెట్టి దశల వారీగా సాలూరు రైల్వే స్టేషన్‌ను ఎత్తివేసి బొబ్బిలి స్టేషన్లో విలీనం చేశారు. దీంతో ఇప్పుడు ఒక టీటీ, ఒక డ్రైవరుతో రోజుకు అయిదు పర్యాయాలు రాకపోకలను సాగిస్తోంది. బొబ్బిలి సాలూరు మధ్య సరైన రవాణా సదుపాయం లేకపోవడం, అతి తక్కువ వ్యయంతో రైలు బస్సు అందుబాటులో ఉండటంతో ప్రయాణికులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. టిక్కెట్ ఖరీదు పది రూపాయలే పది రూపాయలకు ఈ రోజుల్లో రైల్వే ప్రయాణం ఏమిటని ఆశ్యర్యపోకండి. ఇది నిజం. బొబ్బిలి నుంచి సాలూరుకు రూ.10కే రైలు బస్సులో ప్రయాణం చేయవచ్చు. బొబ్బిలి నుంచి నారాయణప్పవలస, గొల్లలపేట, రొంపిల్లి పారన్నవలస, సాలూరులకు టికెట్ కూడా అతి తక్కువే. గ్రామీణ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో నష్టాలైనా రైలు బస్సును విజయవంతంగా రైల్వే శాఖ నడుపుతోంది. బొబ్బిలిలో రైలుబస్సు ఎక్కేటప్పుడు రైల్వేస్టేషన్లో టిక్కెట్ తీసుకొని ఎక్కాలి. ఆ తరువాత తిరిగి బొబ్బిలి వచ్చే వరకూ రైలు బస్సులోనే టిక్కెట్లు ఇస్తారు. రైలు బస్సు ప్రత్యేకతలు ♦ బొబ్బిలికి వైడ్ రైలు బస్సులను రెండు కేటాయించారు. ♦ దీనిలో మొత్తం 72 సీట్లు ఉంటాయి. ♦ రోజూ 5 పర్యాయాలు ఈ బస్సు బొబ్బిలి నుంచి సాలూరు తిరుగుతుంది. ♦ రోజూ 4 వందల నుంచి 5 వందల వరకు ప్రయాణిస్తారు. ♦ ఈ మార్గంలో 170 మంత్లీ సీజనల్ టిక్కెట్లు తీసుకున్నారు. దానిలో 120 మంది విద్యార్థులే ఉంటారు. ♦ 850 లీటర్ల ఇంధన సామర్థ్యం ఉంది. ♦ రోజుకు 50 లీటర్ల ఇంధనం ఖర్చవుతుంది. ♦ ఇప్పటివరకూ ఇంధనం నింపేందుకు విజయనగరం ఫిల్లింగ్ పాయింట్‌కు వెళ్లేవారు. ఇప్పుడు దాదాపు 77 కిలోమీటర్ల దూరంలో ఉండే రాయగడ వరకూ వెళ్తున్నారు. -
బొబ్బిలిలో... తిరుగుబావుటా!
బొబ్బిలి రాజులంటే ఎంతో గౌరవం... వారు ఎదురుపడితే ఏదో తెలియని అభిమానం... వారు వస్తున్నారంటే చాలు లెక్కలేనంత ఆనందం. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు వారితీరుపై వ్యతి రేకత వ్యక్తమవుతోంది. స్వప్రయోజనా లకోసం వారు చేస్తున్న మోసాల తో ఆ గౌరవం కోల్పోతున్నారు. వారు చేసే చౌకబారు రాజకీయాలతో భయం... భక్తి కోల్పోయారు. అంతేనా ఆ స్థానంలో తిరుగుబాటు చోటు చేసుకుంటోం ది. ఇప్పటి వరకూ వారి అనుచరులపైనే ఎదురుతిరిగిన ప్రజలు ఇప్పుడు రాజులపైనే నేరుగా తిరుగుబాటు చేయడం చర్చనీయాంశమైంది. సాక్షిప్రతినిధి, విజయనగరం: ప్రజల్లో అసంతృప్తి ఒకవైపు... పార్టీ కేడర్‌లో నైరాశ్యం మరోవైపు... భారీగా పెరుగుతుండడంతో పాటు పలు సందర్భాల్లో రాజులపై అసంతృప్తి బట్టబయలవుతోంది. తాజాగా మంత్రి సుజయ్ తమ్ముడు బేబీనాయనను స్వపార్టీ వారే ఘెరావ్ చేసి, అనుచరుల ఆగడాలపై నిలదీయడంతో బొబ్బిలి రాజుల పరువు మరోసారి వీధిన పడింది. అభివృద్ధి కోసమే పార్టీ మారానని, మంత్రి పదవి రాగానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాననీ వైఎస్సార్సీపీని వీడిన బొబ్బిలి రాజులపై ప్రజా వ్యతిరేకత మొదలైంది. మంత్రి పదవి కోసం తల్లిలాంటి పార్టీని వదలి వెళ్లిన ఆర్వి సుజయ కృష్ణ రంగారావుపై ప్రజల్లోనమ్మకం సడలుతోంది. అధికార తెలుగుదేశం ప్రభుత్వం, మంత్రి సుజయ్ పరిపాలనపై వ్యతిరేకతతో పాటు జగన్మోహన్రెడ్డి ఇటీవల బొబ్బిలిలో నిర్వహించిన సభలో ప్రసంగానికి ప్రజలు ఆకర్షితులై చైతన్యం పొందారు. ఆ స్ఫూర్తితో రాజులను నిలదీస్తున్నారు. జగన్ సభతో మారుతున్న రాజకీయం వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఈ నెల 17న కళాభారతి ఎదురుగా నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన జనసందోహం అక్కడి పరిస్థితిని ప్రతిబింబింపజేసింది. బొబ్బిలి చరిత్రలో నభూతో అన్న రీతిలో వేలాది మంది యువత, కార్మికులు, మహిళలు, వృద్ధులు ఈ సభకు తరలి రావడం... జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రసంగానికి ముగ్ధులై జయజయ ధ్వానాలు చేశారు. నాటి సభలో జగన్మోహన్ రెడ్డి మంత్రి అక్రమాలను ఎండగట్టినపుడు ప్రజలు హర్షామోదాలను వ్యక్తం చేస్తూ జేజేలు పలికారు. పట్టణంలోని చెరువులను కూడా మంత్రి అనుచరులు కబ్జా చేస్తున్న వైనాన్ని, తాగునీటిని కూడా సక్రమంగా ఇవ్వడం లేదనీ, దీనికోసమేనా పార్టీ మారిందని బొబ్బిలి రాజులను విమర్శించడంతో జనానికి వైఎస్సార్సీపీపై బలమైన నమ్మకం కలిగింది. విద్యా రంగంపై తాను చేపట్టబోయే కార్యక్రమాలను, పథకాల వివరాలను చెప్పినపుడు మహిళలు చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇక మంత్రి ఆర్.వి.ఎస్.కె.రంగారావు పార్టీని వీడటం తదనంతర పరిణామాలు, ప్రజలను మోసగించిన తీరును వివరిస్తూ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రసంగాన్ని ఇప్పటికీ జనం బహిరంగంగా చర్చించుకుంటున్నారు. మాజీ కౌన్సిలర్ తీరుపై ప్రజల్లో నిరసన గొల్లపల్లిలోని మాజీ కౌన్సిలర్ కాకల వెంకటరావు మంత్రి రంగారావు, ఆయన తమ్ముడు బేబీనాయనలకు అనుచరుడు. ఆయనపై భూ ఆక్రమణలు, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారనే అపవాదులు ఉన్నప్పటికీ ఇన్నాళ్లూ తాము రాజుల మనుషులమని చెప్పుకుని పబ్బం గడుపుకుంటున్నాడు. ఎవరైనా ఎదురు మాట్లాడితే ఎస్సీ అట్రాసిటీ కేసుకు సిద్ధం కావాలంటూ బెదిరిస్తారు. అలాగే మరో కౌన్సిలర్ భర్త బొబ్బాది తవిటినాయుడు చెరువులను కప్పేస్తూ మంత్రికి చెప్పే చేస్తున్నామని పబ్లిక్‌గా చెబుతున్నారు. గతంలో రాజుల పేరు చెబితే ఊరుకునే జనం ఇప్పుడు రాజుల అనుచరులు చేస్తున్న దురాగతాలపై తిరగబడుతున్నారు. బేబీనాయన వద్ద పంచాయితీ అయినపుడు ఆయన సర్దుబాటు చేసేందుకు చేసే యత్నాన్ని కూడా అడ్డుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బొబ్బాది తవిటి నాయుడును కూడా కాకల వెంకటరావు సంఘటనపై స్థానికులు నిలదీశారు. ఇవన్నీ ప్రజల్లో వచ్చిన చైతన్యానికి తార్కారణంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష నేత చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర బొబ్బిలి ప్రజల్లో ధైర్యం నింపిందనే వ్యాఖ్యలు బొబ్బిలిలో ప్రతిధ్వనిస్తున్నాయి. -
బొబ్బిలిలో స్వైన్‌ఫ్లూ కలకలం!
విజయనగరం, బొబ్బిలి: జాతీయ స్థాయిలో స్వచ్ఛ భారత్ అవార్డులు, పాలిథిన్ కవర్ల నిషేధం, వాటర్ ప్యాకెట్ల అమ్మకాల నిషేధం వంటి అంశాల్లో ఎన్నో అవార్డులు సాధించిన బొబ్బిలిలో స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. ఇటీవలే డెంగీ వ్యాధి సోకి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మరువక ముందే మరో మహిళకు ప్రమాదకర స్వైన్‌ఫ్లూ సోకడంతో పట్టణవా సుల్లో ఆందోళన నెలకొంది. పట్టణంలోని పారిశుద్ధ్యం ఏస్థాయిలో ఉందో ఈ సంఘటనలే రుజువు చేస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని ఆరో వార్డు అగురువీధిలో నివాసముంటున్న ఓ మహిళ(38) గత పదిరోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సనిమిత్తం చేర్పించినాఎప్పటికీ తగ్గకపోవడం... రక్తంలోని ప్లేట్లెట్స్ గణనీయంగా తగ్గిపోవడంతో చికిత్స చేస్తున్న వైద్యుడు జి.శశిభూషణ రావు సూచన మేరకు విశాఖలోని గురుద్వార సమీపంలో ఉన్న వెంకటేశ్వర మెడికల్స్‌లో చేర్చారు. అక్కడి డాక్టర్లు పరీక్షిం చి ఆమెకు స్వైన్ ఫ్లూ అనుమానంతో టీబీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు స్వైన్‌ఫ్లూ ఉందని నిర్థారించారు. పేదకుటుంబానికి పెద్ద దెబ్బ బాధిత కుటుంబం అసలే పేదరికంలో ఉంది. ఆమె భర్త టైలర్ వృత్తితో కుటుం బాన్ని పోషిం చుకుంటున్నారు.అయినా నానా అవస్థలు పడు తూ ప్రస్తుతం చికిత్స చేయిస్తున్నా రు. వారు ని వాసం ఉంటున్న బొబ్బిలి వీధిలో కాలువలు ముగుతో నిండి ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సీసీ రోడ్లు నిర్మించినా వాటికి సమాంతరంగా కా లు వలు నిర్మించకుండా వదిలేశారని ఆరోపిస్తున్నారు. దీని వల్ల కాలువల్లో పురుగులు, దోమలు పెరిగి వ్యాధులకు కారణాలవుతున్నాయని స్థానికులుఆవేదన చెందుతున్నారు. అపారిశుద్ధ్యమే అసలు సమస్య స్వైన్‌ఫ్లూ సోకిన మహిళ ఇంటివద్ద ఘోరమైన దుర్వాసన వస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొట్నూరు శంకరరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ వ్యాధులన్నీ సోకుతున్నాయని, నిరుపేదలు వేలల్లో ఖర్చు చేసుకుని వైద్య చికిత్సలు ఎలా పొందగలరని ప్రశ్నిస్తున్నారు. ఎన్నో మార్లు మున్సిపల్ కమిషర్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు. అవార్డులను అందుకునేందుకు ముందుకు వెళ్లే మున్సిపల్ యంత్రాంగం ప్ర జల బాగోగులను పట్టించుకోవడం లేదన్నారు. ఫాగింగ్ కానీ, కాలువల్లో మురుగు తొలగింపు కానీ చేపట్టడం లేదన్నారు. విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో మన జిల్లాకు చెందిన మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని శంకరరావు తెలిపా రు. జిల్లాలో ఇప్పటివరకూ ముగ్గురికి స్వైన్‌ఫ్లూ సోకిందని దీనిపై ప్రభుత్వం వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆయన కోరారు. -
290వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, బొబ్బిలి(విజయనగరం జిల్లా): వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆదివారం ఉదయం బొబ్బిలి నియోజకవర్గం పారాది నుంచి ప్రారంభమైంది. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు రానున్నాడనీ..అందరీ జీవితాలకూ వెలుగులు తీసుకొచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయన వస్తే గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని గ్రామాల్లో జనం ఆరాట పడుతున్నారు. జననేత ఎప్పుడు తమ ప్రాంతానికి వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. పారాది నుంచి పాదయాత్ర గొల్లపేట క్రాస్, రోంపల్లి క్రాస్ మీదుగా రామభద్రపురం వరకు కొనసాగనుంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. -
289వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, బొబ్బిలి(విజయనగరం జిల్లా): వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శనివారం ఉదయం బొబ్బిలి నియోజకవర్గం ఇందిరమ్మ కాలనీ నుంచి ప్రారంభమైంది. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు రానున్నాడనీ..అందరీ జీవితాలకూ వెలుగులు తీసుకొచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయన వస్తే గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని గ్రామాల్లో జనం ఆరాట పడుతున్నారు. జననేత ఎప్పుడు తమ ప్రాంతానికి వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. అక్కడి నుంచి పాదయాత్ర ఇందిరమ్మ కాలనీ, పోలవాని వలస, మెట్ట వలస, భోజరాజపురం క్రాస్, సీతారాంపురం మీదుగా పారాది వరకు కొనసాగనుంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. -
బొబ్బిలి బహిరంగ సభలో వైఎస్ జగన్
-
‘నారాసురుడు అడుగుపెడితే కరువు, కాటకాలే’
సాక్షి, బొబ్బిలి: రాక్షస మహిషాసురుడు ప్రజలను పీక్కుతినేవాడని.. ఇప్పడు ఏపీలో నారాసురుడు(చంద్రబాబు నాయుడు) ప్రజలను కాల్చుక తింటున్నాడని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాక్షస మహిషాసురుడుకి, ఏపీ నారాసురుడికి ఎలాంటి పోలికలున్నాయో ప్రజలందరికీ తెలుసన్నారు. మోసం చేయడానికి ఆ రాక్షసుడు రూపాలు మార్చేవాడని..ఈ నారాసురుడు అధికారం కోసం ఏ గడ్డైనా తినడానికి వెనుకాడడని మండిపడ్డారు. నారాసురుడు అధికారంలో కరువు, కాటకాలు, ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 288వ రోజు బుధవారం ఆయన విజయనగరం జిల్లా బొబ్బిలి సభలో భారీ జనసందోహాన్నుద్దేశించి ప్రసంగించారు. ప్రజల కోసమే జీవించాలని.. వారి గుండెల్లో చిరస్థాయిగా ఉండాలని భావోద్వేగంతో చెప్పారు. ఈ సభలో జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. ధర్మం తప్పితే అంతం తప్పదని చెప్పిన నేల ఇది ‘తెలుగు నేల మీద బొబ్బిలి ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ రోజులో బొబ్బిలి కోటపై అన్యాయంగా యుద్దం చేశారని పరాయి సేనలతో చేతులు కలిపారని వంచనతో తనవారందరిని చంపేశారని, అప్పట్లో విజనగరం అధిపతి విజయరామ గజపతిని తాండ్రపాపారాయుడు అంతం చేసిన విషయం తెలిసిందే. విజయరామగజపతిని చంపబోతుంటే చివరి క్షణాల్లో తాండ్ర పాపారాయుడుని ప్రలోభాలు గురిచేశారు. అయినప్పటికీ విలువలు తప్పకుండా, ఎత్తిన కత్తి దింపకుండా రాజ్యకాంక్షతో ఎదుటివారి కోటపై కన్ను వేయరాదని, వెన్నపోటు పొడవరాదని, వంచన చేయరాదని, ధర్మం తప్పరాదని ఒక వేళ ధర్మం తప్పితే చివరికి అంతం తప్పదని చరిత్ర మనకి చెబుతోంది. ఆరోజు తాండ్రపాపారాయుడు బొబ్బిలి నేలపై చెప్పిన విషయాలు ఇవి అయితే.. అదే బొబ్బిలి నేలపై ఇవాళ జరుగుతున్న రాజకీయాలు చూడమని ప్రజలను కోరుతున్నా. బొబ్బిలి వారసులమని చెప్పుకునే వారే తప్పు చేస్తే.. ఒక పార్టీ నుంచి గెలిచారు ఇంకో పార్టీలోకి దూకారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేయకుండానే ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టారు. సాక్షాత్తు బొబ్బొలి వారసులుగా చెప్పుకునే వారికే విలువలు లేకపోతే.. విశ్వసనీయత లేకపోతే, ధర్మం లేకపోతే, న్యాయం లేకపోతే ఇక ప్రజలు ఎవరి దగ్గరికి పోవాలని ప్రశ్నిస్తున్నా. ప్రజలకు ఈ పాలకులు ఏం సందేశం ఇస్తున్నారు. అభివృద్ది కోసం పార్టీ మారమని పాలకులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చేటప్పుడు బొబ్బిలి ప్రజలు నా దగ్గరికొచ్చి అన్న మాటేంటంటే అభివృద్ది వారి కుటుంబానికి జరగవచ్చు కానీ, మాకైతే ఎలాంటి అభివృద్ది జరగలేదని వాపోయారు. (ప్రజాకోర్టులో మంత్రి సుజయ్‌కు శిక్ష తప్పదు) అక్రమ మైనింగ్.. కబ్జాలు అభివృద్ది జరగడం అనే విషయం పక్కకుపెడితే. మంత్రి పదవులు తీసుకున్నవారు చేస్తున్న పనులేంటంటే.. ఇదే జిల్లాలో మాంగనీసు తవ్వకాలు జరుగుతన్నాయి. అక్రమంగా పదహారు సంస్థలకు లైసెన్స్‌లు లేకుండా.. రెన్యువల్ కాకుండా లక్షల టన్నుల మాంగనీస్ మైనింగ్ జరుగుతుంటే ఆనాడు సాక్షాత్తు గనుల శాఖ మంత్రిగా ఉంది బొబ్బిలి ఎమ్మెల్యేనే. ఇదే పాత బొబ్బిలిలో 15 ఎకరాలు గిరిజనులకు సంబంధించిన మిగులు భూములను కబ్జా చేశారు. ఆ భూములను గిరజనుల నుంచి లాక్కొని పరిస్థితి పాత బొబ్బిలి చూశాం. ఇదే బొబ్బిలిలో వేగావతి, స్వర్ణముఖి, చంపావతి, గోస్తని, నాగావలి నదుల్లో అక్రమ ఇసుక దందా. బొబ్బిలి చెరువుల్లో కబ్జా. (వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు) విజయనగరం మీద బాబుకు చిన్న చూపు గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు విజయనగరం గురించి గానీ, తోటపల్లి ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. చంద్రబాబు వదిలేసిన తోటపల్లి ప్రాజెక్ట్ పనులను దివంగత సీఎం వైఎస్సార్ పరుగులెత్తించి 90 శాతం పనులు పూర్తి చేశారు. మరలా చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత మిగిలిన పది శాతం పనులు కూడా చేయలేని అధ్వాన్నమైన పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. లక్షా ముప్పై వేల ఎకరాల సాగుకు ఉపయోగపడే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా ఉన్నారంటే ఎలాంటి పాలన అందిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. (జగన్ చెప్పిందే నిజమైంది) షుగర్ ఫ్యాక్టరీ రైతులు, కార్మికుల దుర్భర పరిస్థితి ఇదే పాలకుల హయాంలో 2002లో ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. ఆ నిజాం షుగర్‌కు చెందిన లచ్చయ్యపేటకు చెందిన ఫ్యాక్టరీని అప్పట్లోనే టీడీపీ ప్రభుత్వం శనిక్కాయలు, బెల్లానికి అమ్మేశారు. ఆ ఫ్యాక్టరీని కొనుగోలు చేసిన యాజమాన్యం గత ఏడాదికి సంబంధించిన 12 కోట్ల బకాయిలు రైతులకు ఇప్పటివరకు ఇవ్వలేదని షుగర్ ఫ్యాక్టరీకి చెందిన రైతులు నా దృష్టికి తీసుకొచ్చారు. చక్కెరను అధిక లాభానికే సమయానికే అమ్ముకుంటున్నారు, కానీ రైతులకు మాత్రం బకాయిలు చెల్లించటం లేదు. ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు సరిగా ఇవ్వటం లేదు. సాక్షాత్తు ఓ మంత్రి ఇలాఖలో ఇంతటి దారణంగా కార్మికులు, రైతుల పరిస్థితుండటం విడ్డూరంగా ఉంది. కనీసం వారి సమస్యలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. బొబ్బిలిలోని పారిశుద్ద్యకార్మికులకు జీతాలు ఇవ్వకుండా.. తీసేస్తున్న దారుణ పరిస్థితి. రెండు నెలలుగా సమ్మె చేస్తున్నా ఏమాత్రం కనికరం లేకుండా వారిని తీసేసే పరిస్థితి ఇక్కడి బొబ్బిలి పాలకుల పనితీరుకు నిదర్శనం. బాబు హయాంలో ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి ఇదే బొబ్బిలిలో అతిపెద్దదైన లక్ష్మీశ్రీనివాస జూట్ మిల్లో సుమారు 2300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ జూట్ మిల్‌ను మూసేశారు. వరుసగా ఫ్యాక్టరీలను మూసేసిన ఘనత చంద్రబాబుదే. జూట్ మిల్లులకు కరెంట్ చార్జీలు అధికంగా పెంచేయడంతో అవి నడవలేని పరిస్థితుల్లో ఉన్నాయి. బొబ్బిలిలో వందపడకల ఆస్పత్రి కడతానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. మంత్రిగా ఉన్న బొబ్బిలి నియోజకవర్గంలో రెండురోజులకోసారి తాగునీరు రావడం హాస్యాస్పదం. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఈ నియోజకవర్గంలో 38,150 ఇళ్లులు కట్టారు. ఈ నాలుగున్నరేళ్లలో ఇక్కడి మంత్రి, ఎమ్మెల్యే కనీసం ఊరికో మూడు ఇళ్లులైనా కట్టారా అన్ని ప్రశ్నిస్తున్నా. అధికారం కోసం బాబు ఏ గడ్డైనా తింటారు రేపు దసరా మహిషాసరుడు ఎలా అంతమయ్యాడో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడికి, రాక్షస మహిషాసరుడికి ఎలాంటి పోలికలున్నాయో ప్రజలందరికీ తెలుసు. మోసం చేయడానికి మహిషాసరుడు రూపాలు మారుతూ ఉండేవాడు. చావే లేకుండా ఉండాలని వరం పోంది ప్రజలను నానాహింసలు పెడతాడు. ఇప్పుడు ఏపీలో నారాసురుడు పాలన.. మహిషాసురుడి పాలనను మించిపోయింది. అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డైనా తినడానకి సిద్దంగా ఉంటారు. ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవడానికి వెనుకాడరు. వ్యవస్థలను మేనేజ్ చేయడానికి ఆయన మొహమాటం పడరు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అబద్దాలైనా చెబుతారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదని అసెంబ్లీలోనే ప్రభుత్వం చెప్పింది. ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని లిఖితపూర్వకంగా చెప్పారు. పేదవారికి వైఎస్ జగన్ భరోసా ఇంజనీరింగ్, డాక్టర్ చదవాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి. అందుకే చాలా మంది పేదవారు చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ని లక్షల ఖర్చైనా పేద పిల్లందరిని ఉచితంగా చదివిస్తాం. హాస్టల్ ఖర్చుల కోసం ఏడాదికి రూ.20వేలు ఇస్తాం. ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లుగా చేస్తాం. చిన్న పిల్లలను స్కూల్‌కు పంపిన తల్లులకు ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. బాబు వస్తే జాబు అన్నారు.. లేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు. జాబు రావడం దేవుడెరుగు..ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు. అధికారంలోకి రాగానే అవసరమైన టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం’అంటూ వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. -
మోగిన బొబ్బిలి వీణ!
బొబ్బిలి విజయనగరం : అంతర్జాతీయంగా పేరు గాంచిన బొబ్బిలి వీణల ధరలు పెరిగాయి. ఈ నెల నుంచే పెరిగిన ధరలు అమలు చేయాలని హస్త కళల అభివృద్ధి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ హస్త కళల అభివృద్ధి సంస్థ కార్యాలయం ద్వారా బొబ్బిలి వీణల కేంద్రం ఇన్చార్జికి ఉత్తర్వులు అందాయి. పెరిగిన ధరలు తక్షణం అమలు లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బొబ్బిలిలో కొన్నేళ్లుగా వీణల తయారీ కేంద్రం ఉంది. ఇక్కడ సుమారు 20 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కేంద్రంలో ప్రొఫెషనల్ వీణలతో పాటు గిఫ్ట్ వీణలు తయారు చేస్తారు. ఇక్కడి నుంచి గిఫ్ట్ వీణలు దేశంలోని పలు ప్రాంతాలతో పాటు అమెరికా వరకూ ఆర్డర్‌పై సప్లై చేస్తుంటారు. బొబ్బిలి వీణల బహుమతి అంటే దానిని స్టేటస్‌గా భావిస్తారు. తంజావూరు కంటే మిన్నగా.. తమిళనాడులోని తంజావూరులో వీణలు తయారయినా ఇక్కడి ఆకృతులు అందరినీ ఆకర్షించేలా ఉంటాయి. కార్మికుల పనితనం, వివిధ రకాల ఆకృతులతో రూపొందించిన ఇక్కడి గిఫ్ట్ వీణలు అమెరికా మాజీ అద్యక్షుడు బిల్ క్లింటన్ తదితరుల మనసుల్ని సైతం దోచాయి. అధికారికంగా కూడా ఈ రాష్ట్రానికి వచ్చే అతిథులకు బొబ్బిలి వీణలు అందజేయడం ఓ ఆనవాయితీలా మారింది. ప్రస్తుతం ఈ వీణల ధరలు రూ.900 నుంచి రూ.4వేల వరకూ లభిస్తున్నాయి. ఏటా పలు రకాల వీణలను ఇక్కడి నుంచి ఆర్డరుపై లేపాక్షి, హస్తకళల అభివృద్ధి కేంద్రం నిర్వహించే స్టాళ్లకు ఆర్డర్‌పై విక్రయిస్తుంటారు. కార్మికులసౌకర్యార్థం.. గతంలో ఇక్కడి కార్మికులు తయారు చేసే వీణలను చూసి నేరుగా వారి వద్దే సందర్శకులు కొనుగోలు చేసే అవకాశం ఉండేది. అయితే కార్మికులు తయారు చేసిన వీణలు కొనుగోలు చేసేందుకు వచ్చే వారిపై ఆధారపడి ఉండేది. కొందరి ఉత్పత్తులు పూర్తిగా అమ్ముడైతే కొందరు వేచి చూడాల్సి వచ్చేది. కొన్ని రోజుల పాటు కొనుగోలు చేయక కార్మికులకు చేతికి సొమ్మందేది కాదు. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం హస్త కళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వీటిని నేరుగా కొనుగోలు చేసి ఏ రోజుకారోజు కార్మికులకు చెల్లించేలా హాండీ క్రాఫ్టŠస్ సంస్థ ఏర్పాట్లు చేసింది. ఇక్కడ అచ్యుత నారాయణను ఇన్చార్జిగా నియమించింది. దీనివల్ల వీణల కేంద్రంలో ఇప్పుడు ఉత్పత్తి దారులకు వెంటనే చేతికి సొమ్మందుతోంది. ప్రకటించిన ధరల 15 శాతం అదనం ప్రస్తుతం హస్తకళల సంస్థ ప్రతిపాదించిన ధరలపై 15శాతం అదనంగా తయారీ ఖర్చులుంటాయి. ధరలు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులు ఏపీహెచ్డీసీఎల్ వైస్‌చైర్మన్, ఎండీలనుంచి వెలువడ్డాయి. ఈ నెల 6న విడుదలైన కొత్త ధరలు వెంటనే అమలులోకి వచ్చాయి. – అచ్యుతనారాయణ, ఇన్చార్జి -
ఏమైందో ఏమో...!
బొబ్బిలి: ప్రమాదమో.. నిర్లక్ష్యమో తెలియదు గాని రెండు నిండు ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. రైలు పట్టాలపై ఇద్దరు యువకుల మృతదేహాలు పడి ఉన్న సంఘటన స్థానికులను కలిచివేసింది. ఈ విషయం శనివారం ఉదయం బొబ్బిలి చుట్టు పక్కల ప్రాంతాల్లో దావానంలా వ్యాపిం చింది. వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గోపాలపురం గ్రామానికి చెం దిన రౌతు ధనుంజయ (35), సాలూరు మండలం నెలిపర్తికి చెందిన బెజ్జి సిసింద్రీ(21) బొబ్బిలి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలోని పట్టాలపై విగతజీవులుగా పడి ఉన్నారు. గుర్తు తెలియని రైలు ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధనుంజయ, సిసింద్రీలిద్దరూ పెయింటర్లుగా పనిచేస్తున్నారు. సిసింద్రీ విశాఖలో పనిచేస్తుండగా... ధనుంజయ రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నాడు. ధనుంజయ కుటుంబం రంగారెడ్డి వెళ్లిపోయి అక్కడే స్థిరపడ్డారు. ధనుంజయకు తల్లి ధనలక్ష్మి ఉండగా తండ్రి సీతారాం గతంలోనే మృతి చెందాడు. ఇక నెలిపర్తికి చెందిన సిసింద్రీ రెండేళ్ల కిందటే విశాఖకు వెళ్లిపోయి పెయింటింగ్ పనులు చేసుకుంటున్నాడు. ఈ ఇద్దరికీ ఎక్కడ స్నేహం కుదిరిందో తెలియదు కాని ఇద్దరూ కలిసి పెయింటింగ్‌లు వేస్తున్నట్లు సమాచారం. రంగులు వేయడానికి వచ్చి.. కొద్ది రోజుల కిందట సిసింద్రీ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి బొబ్బిలిలోని పిన్ని ఇంటికి వచ్చానని, వారి కొత్త ఇంటికి రంగులు వేసి ఇంటికి వస్తానని తల్లిదండ్రులు జెబ్జి బుగ్గమ్మ, సన్నాసిలకు తెలిపాడు. ఈ క్రమంలో సిసింద్రీ, ధనుంజయ నూతన గృహానికి కొద్దిమేర మాత్రమే రంగులు వేశారు. సిసింద్రీ తన పిన్ని వారికి చెందిన ద్విచక్ర వాహనాన్ని శుక్రవారం ఉదయం తీసుకుని ధనుంజయతో కలసి బయటకు వెళ్లి మళ్లీ మధ్యాహ్నానికి వచ్చి వాహనాన్ని ఇంటి వద్ద పెట్టేశాడు. మళ్లీ వస్తామని చెప్పి బయటకు వెళ్లిన వీళ్లు ఇలా మృతదేహాలుగా తేలడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిసింద్రీ అమాయకుడు తన కుమారుడికి మద్యం తాగే అలావాటున్నా అమాయకుడని సిసింద్రీ తల్లి బుగ్గమ్మ చెబుతోంది. ఒక్కగానొక్క కొడుకు ఇలా అర్ధంతరంగా మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. ఇక మాకు దిక్కెవరురా భగవంతుడా అంటూ రోదిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది. ధనుంజయ మృతి వార్త తెలుసుకున్న తల్లి ధనలక్ష్మి రంగారెడ్డి నుంచి బొబ్బిలికి బయలుదేరింది. ఇదిలా ఉంటే మద్యం మత్తులో వీరు రైల్వే పట్టాలపైకి వెళ్లగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిసింద్రీ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి సిసింద్రీ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో శవపంచనామ నిర్వహించి మృతదేహానికి పోస్టుమార్టం చేపట్టి అప్పగించారు. ధనుంజయ తల్లి ధనలక్ష్మి ఆదివారం నాటికి వచ్చే అవకాశం ఉండడంతో ఆ రోజే ధనుంజయ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తామని రైల్వే పోలీసులు తెలిపారు. -
బొబ్బిలి రైల్వే ట్రాక్‌పై రెండు మృతదేహాలు
-
బొబ్బిలి టీడీపీలో యుద్ధం
బొబ్బిలి విజయనగరం : బొబ్బిలి నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు బట్టబయలైంది. మొదటినుంచీ టీడీపీలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించే తూముల భాస్కరరావుకు చెక్ పెట్టేందుకు రాజులు ప్రయత్నిస్తున్నారనే దుమారం ఇటీవల పలు సందర్భాల్లో చర్చకువచ్చింది. తాజాగా విడుదల చేసిన వార్డు దర్శిని కార్యక్రమం షెడ్యూల్ లిస్టు ఆ వివాదానికి ఆజ్యం పోసింది. మున్సిపల్ చైర్మన్ గిరీతో పాటు పట్టణంలో అధికారిక కార్యకలాపాలకు కీలకంగా వ్యవహరిస్తున్న తూముల భాస్కరరావు, ఆమె సతీమణి చైర్పర్సన్ అచ్యుతవల్లికి సంబంధం లేకుండా జన్మభూమి కమిటీ నాయకుడు అల్లాడ భాస్కరరావుకు వార్డు దర్శిని బాధ్యతలు అప్పగించడం ఈ వివాదానికి కారణమైంది. మునిసిపాలిటీ బాధ్యతలు చూస్తున్న తమకు తెలియకుండా షెడ్యూల్ ఎలా నిర్ణయిస్తారని తూముల మండిపడుతున్నారు. చిచ్చు రేపిన షెడ్యూల్ షెడ్యూల్లో రాష్ట్ర మంత్రి సుజయ కృష్ణ రంగా రావు, పార్టీ ఇన్చార్జి తెంటు లకు‡్ష్మనాయుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆర్.వి.ఎస్.కె.కె.రంగారావు పాల్గొంటారని పేర్కొన్నారు గానీ మున్సిపాలిటీలో నిర్వహించే కార్యక్రమ షెడ్యూల్లో ఎక్కడా తూముల దంపతుల పేర్లు లేకపోవడంతో రాజులపై ఆ వర్గం మండిపడుతోంది. దీనిని తీవ్రంగా పరిగణించిన భాస్కరరావు మంత్రి రంగారావుకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని తెల్సింది. చివరకు బేబీనాయనతో ఫోన్లో మాట్లాడి ఇదేం సంప్రదాయమని అడిగినట్టు భోగట్టా. గురువారం సాయంత్రం నుంచి ఈ విషయమై ఇరు వర్గాల మధ్య అంతర్యుద్ధం నడుస్తున్నట్టు సమాచారం. దీనిపై మంత్రి రంగారావు ఎదుటే శుక్రవారం తేల్చుకునేందుకు వారు సిద్ధమవుతున్నారని విశ్వసనీయ సమాచారం. ఇక తాడో పేడో... తనను ఇలా వేరు చేయడంలో రాజుల ఆంతర్యమేమిటో తెలుసుకోవాలని తూముల నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఎన్నో కార్యక్రమాలు, కష్ట సమయాల్లో పార్టీకి అండగా ఉండే తనను ఇలా అవమానించడం వెనుక ఉన్న నాయకులను గుర్తించే పనిలో ఉన్న భాస్కరరావు ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాననీ, దీనిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించాలనీ తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు బొబ్బిలి టీడీపీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. శుక్రవారం తెర్లాంలో నిర్వహించే నియోజకవర్గ సమావేశంలో ఈ విషయాలు చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. మంత్రి మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో గొల్లపల్లిలో చెరువు కప్పేసిన మాజీ కౌన్సిలర్‌ను పక్కనే కూర్చుండబెట్టుకున్న మంత్రి రంగారావు పార్టీ ఆదేశించిన ఆ కార్యక్రమానికి తనను కానీ మునిసిపల్ చైర్‌పర్సన్‌ను కానీ ఆహ్వానించకపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. కొన్ని కార్యక్రమాలకు తనను దూరంపెట్టే వ్యవహారాలు నడుపుతున్న రాజులతో తూముల ఈ వ్యవహారంపై సీరియస్‌గా పరిగణిస్తున్నట్టు ఆయన వర్గీయులు బాహాటంగా చర్చించుకుంటున్నారు. దీనిపై ఏమవుతుందో తెలియాల్సి వుంది. -
ఆంజనేయా..ఆస్తులు కాపాడుకో తండ్రీ ..!
బొబ్బిలి విజయనగరం : ఎంతో విలువైన దేవాదాయ శాఖకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లోని షాపులను వేలం వేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని ఆంజనేయస్వామి దేవస్థానం దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. ఈ ఆలయానికి చెందిన స్థలంతో పాటు మున్సిపాలిటీ స్థలంలో మున్సిపల్ అధికారులు షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఈ కాంప్లెక్స్‌కు మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరి గంగయ్య పేరు పెట్టారు. అయితే దేవాదాయ శాఖ మా స్థలంలో కట్టిన షాపులను మాకు అప్పగించాలని కోర్టుకు వెళ్లారు. చివరకు ఏళ్ల తరబడి నడచిన ఈ కేసు సుమారు ఎనిమిది నెలల కిందట కోర్టు ఆ షాపులు దేవాదాయ శాఖకు చెందుతాయని తీర్పిచ్చిందని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే నేటికీ ఆ షాపులను వేలం వేయడం లేదు. ఇదిగో అదిగో అని తాత్సారం చేస్తున్నారే తప్ప షాపులకు వేలం వేయడం లేదు. ఇదిలా ఉంటే పైరవీలు చేసుకున్న వారికే షాపులు కట్టబెట్టేందుకు ఏర్పాట్లు సాగుతున్నట్లు సమాచారం. ఇక్కడ ఒక్కో దుకాణానికి నెలసరి అద్దె రూ.4 వేల నుంచి పది వేల రూపాయల వరకు పలుకుతోంది. అలాగే డిపాజిట్లు కూడా రూ. లక్షల్లో చెల్లించాల్సి ఉంటుంది.అయితే దుకాణాల వేలాన్ని దేవాదాయ శాఖాధికారులు కావాలనే తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా మంది ఔత్సాహికులు షాపులను దక్కించుకునేందుకు ఎదురు చూస్తున్నారు. బహిరంగ వేలం అయితే ఎవరు ఎక్కువ ధరకు పాడుకుంటే వారికే షాపులు కేటాయించాలి. అయితే కౌన్సిలర్లు, కొంతమంది రాజకీయ నాయకులు బహిరంగ వేలం కాకుండా అడ్డుపడుతున్నారు. కోర్టు వేలంపాట నిర్వహించుకోవాలని చెప్పినప్పుడు దేవాదాయ శాఖాధికారులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఈఓ శ్రీనివాసరావును వివరణ కోరగా స్థలాల కొలతలను బట్టి అద్దెలుంటాయనీ, ఈనెల 27న వేలం ప్రక్రియను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందరికీ తెలిసేలా కరపత్రాలు పంచి వేలం ధరను నిర్ణయిస్తామన్నారు. ఇప్పటివరకూ కొన్ని దుకాణలకు వసూలు చేసిన అద్దెలు మున్సిపాలిటీ వద్దనే ఉండొచ్చన్నారు. -
పెళ్లికి వెళ్తుండగా...
బొబ్బిలి రూరల్: వారంతా ఉల్లిభద్రలో శనివారం రాత్రి జరగబోయే వివాహానికి ఆనందంగా బయలుదేరారు. గ్రామం దాటి కిలోమీటరున్నర దూరం వెళ్లేసరికి ట్రాక్టర్ బోల్తా çపడింది. దీంతో 20 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురిని మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి...బొబ్బిలి మండలం పిరిడి పంచాయతీ పరిధిలో కొల్లివలసకు చెందిన పూతి పైడితల్లి వివాహం ఉల్లిభద్రలో శనివారం రాత్రి జరగనుంది. ముందుగా ఆటోలో పెండ్లి కుమార్తె, కుటుంబ సభ్యులు వెళ్లిపోగా గ్రామానికి చెందిన బంధువులు ట్రాక్టర్లో శనివారం ఉదయం బయలుదేరారు. ట్రాక్టర్ పిరిడి వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పూడి అజయ్, పూడి సింహాచలం, పుట్ట రాములమ్మకు చేతులు విరిగిపోయాయి. భోగాది నారాయణమ్మ, పి.తిరుపతి, తియ్యాల అచ్చెమ్మ, తియ్యల సంధ్య, కొల్లి సత్యవతి, వెంకటలక్ష్మి, తియ్యాల లక్ష్మి, దురగాసి పార్వతి, తియ్యాల పద్మ, తదతరులు గాయపడ్డారు. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను 108 వాహనంలో బొబ్బిలి పీహెచ్‌సీకి తరలించారు. కొంతమందికి చిన్న చిన్న గాయాలు కావడంతో పిరిడి పీహెచ్సీలో వైద్యసేవలందించి పంపించివేశారు. బొబ్బిలి పీహెచ్సీ వైద్యాధికారులు శోభారాణి, రామనరేష్ క్షతగాత్రులకు వైద్యం అందించి, మెరుగైన వైద్యం కోసం ఆరుగురిని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు క్షతగాత్రుల పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన సోదరుడు బేబీనాయన ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ప్రమాదంపై ఆరా తీశారు. ట్రాక్టర్ తరలింపు... ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్‌ను తరలించేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై ప్రసాదరావు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ట్రాక్టర్ లేదు. దీంతో ఆయన స్థానికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు బైక్‌లు ఢీ..∙ఇద్దరికి గాయాలు భోగాపురం: మండలంలోని లింగాలవలస వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయాలపాలయ్యారు. స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చెందిన విజయ్, రమేష్ ద్విచక్రవాహనంపై విశాఖపట్నం బయలుదేరారు. లింగాలవలస వద్దకు వచ్చేసరికి ఒక యువకుడు ద్విచక్రవాహనంతో డివైడర్ పైనుంచి రోడ్డు దాటే ప్రయత్నంలో ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చేయడంతో విజయ్ తన ద్విచక్రవాహనంతో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో విజయ్, రమేష్ గాయపడ్డారు. ఆటో – బైక్ ఢీ.. గజపతినగరం రూరల్: మండలంలోని మధుపాడ గ్రామ సమీపంలో స్వీట్‌హోమ్ వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. మెంటాడ మండలం రాబంద గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ తవుడు ప్రయాణికులను ఎక్కించుకుని గజపతినగరం వైపు వస్తుండగా, స్వీట్‌హోమ్ వద్దకు వచ్చేసరికి గజపతినగరం నుంచి మానాపురం వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు కొర్లాపు శ్రీనుతోపాటు ఆటోలో ఓ పక్కన కూర్చున్న వ్యక్తి గాయపడ్డారు. పోలీసులు రెండు వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. -
ఇలా అయితే నిఫా వైరస్ సోకదా?
బొబ్బిలి : పర్యావరణంలో దేశానికే తలమానికం అంటూ ఇటీవల ఉన్నతాధికారుల నుం చి ఢిల్లీలో అవార్డునందుకున్న బొబ్బిలి మున్సి పాలిటీ నడిబొడ్డున గబ్బిలాల చెట్టు ఆ అవా ర్డుకే ప్రశ్నార్థకంగా మారింది. బొబ్బిలి సీహెచ్‌సీ వద్ద ఉన్న పెద్ద మర్రి చెట్టుపై పెద్ద సం ఖ్యలో గబ్బిలాలు తిష్టవేసి ఉన్నాయి. దశాబ్దా ల కాలం నుంచి ఈ చెట్టు ఇక్కడే ఉన్నా... ఇటీవల గబ్బిలాల కారణంగా నిఫా వైరస్ సోకుతుందన్న దుమారం రేగడంతో ఇక్కడివారిలో ఆందోళన మొదలైంది. చెట్టు నిండా పెద్ద సం ఖ్యలో పగలూ రాత్రి అన్న తేడా లేకుండా వేల సంఖ్యలో గబ్బిలాలు వేలాడుతునే ఉంటా యి. నిఫా వైరస్ తో దేశంలోని వివిధ ప్రాం తాల్లో పెద్ద ఎత్తున ప్రజలు మరణించిన విష యం దావానలంలా వ్యాపించడంతో ఇప్పు డు అందరి దృష్టి ఈ గబ్బిలాల చెట్టుపై పడిం ది. ఈ ఆస్పత్రికి నిత్యం 250 నుంచి 300కు పైగా ఓపీ రోగులు వస్తున్నారు. ఇవి గాకుండా 40 వరకూ ఇన్‌పేషెంట్లు విభాగానికి వస్తుం టారు. పక్కనే గబ్బిలా ల చెట్టు ఉండటంతో వా టి వ్యర్థాలు పడుతుంటాయి. అంతేగాదు. ఆస్పత్రి 50పడకలుగా విస్తరింపజేసి.. అదనపు భవనాలు నిర్మించనున్న నేపథ్యంలో ఈ చెట్టుపై ఉన్న గబ్బిలాలనుంచి వైరస్ సోకేందుకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
జిల్లాలో నిండుకున్న విటమిన్ ఏ ద్రావణం
బొబ్బిలి: రేచీకటి, అంధత్వాన్ని నివారించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కలిగించే విటమిన్ ఏ సిరప్ నిల్వల కోసం జిల్లాలోని ఆస్పత్రుల్లో చిన్నారుల తల్లిదండ్రులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఎంతో ప్రయోజనకరమైన ఈ ద్రావణం జిల్లాలోని ఆస్పత్రుల్లో నిండుకుని సుమారు రెండు నెలలు గడచింది. పుట్టిన బిడ్డలకు 9వ నెల నుంచి ప్రతీ ఆరు నెలలకూ ఓ సారి తప్పనిసరిగా వేయాల్సిన విటమిన్ ఏ ద్రావణం గతంలో నిత్యం సరఫరా చేసేవారు. అయితే ఇప్పుడా నిల్వలు కానరా వడం లేదు. గతంలో నిల్వలు నిండుకునే పరిస్థితి వచ్చేసరికి సరఫరా చేసేవారు. కానీ రెండు నెలలు అవుతున్నా గానీ అటు జిల్లా యంత్రాంగం కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో ఈ ద్రావణం లేక చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర కలత చెందుతున్నారు. ఇతర వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ ముఖ్యమైన ఈ వ్యాక్సిన్ లేకపోవడంతో తల్లి దండ్రులు తమ చిన్నారుల భవిష్యత్తుపై అల్లాడుతున్నారు. కేవలం బొబ్బిలిలోని సీహెచ్‌సీలోనే ప్రతీ ఆరు నెలలకోసారి సుమారు 200కు పైగానే చిన్నారులకు ఈ ద్రావణం వేసేవారు. ఆ తర్వాత మళ్లీ ఆరు నెలలకు ఈ ద్రావణం వేస్తారు. ఇలా ప్రతీ సారి 9 నెలలు నిండిన ప్రతిబిడ్డకూ ఈ ద్రావణాన్ని వేయడం తప్పనిసరి, చిన్నారుల్లో ఈ ద్రావణం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే ఈ ద్రావణాన్ని ఇతర మందుల షాపుల్లో కొనుగోలు చేసుకోవాలని కూడా రాయడం లేదు. బయట ఈ ద్రావణం దొరికే అవకాశం లేదు. గతంలో ఈ ద్రావణాన్ని సరఫరా చేసే సంస్థ నాణ్యతలో లోపాలతో పంపిణీ చేయడంతో అధికారులు వీటిని తిప్పి పంపారు. అయితే తిరిగి మరి ఆస్పత్రులకు ద్రావణాన్ని వేయకపోవడం విచారకరం. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ మందుల కొరత వలన చిన్నారుల దృష్టి లోపం, రోగనిరోధక శక్తి, రేచీకటి సమస్యలను ప్రభావితం చేసే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. సర్దుబాటు చేస్తున్నాం.. రెండు నెలలుగా విటమిన్ ఏ ద్రావణం సరఫరా లేకపోయినప్పటికీ తమ వద్ద ఉన్న నిల్వ లతో సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నాం. నెల రోజుల క్రితం వరకు విటమిన్ ఏ డోసులు అందించాం. ఈ విషయమై డీఐఓ కార్యాలయానికి నివేదించామని, అక్కడ నుంచి హైదరాబాద్‌కు ఇండెంటు పెట్టినట్లు వారు చెప్పారు. – డాక్టర్ విజయ్‌మోహన్, బొబ్బిలి పీపీ యూనిట్ అధికారి. పిల్లలకు ఇతర విటమిన్ ద్రావణాలు వేస్తున్న దృశ్యం -
బొబ్బిలి చేరుకున్న జన సేన అధినేత
బొబ్బిలి : జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ బస్సు యాత్ర జిల్లాలోకి ప్రవేశించింది. మంగళవారం రాత్రి ఏడున్నర గంటలకు ఆయన బృందం బొబ్బిలి చేరుకుంది. పట్టణంలోని సూర్య రెసిడెన్సీలో ఆయన రాత్రి బస చేశారు. పలువురు అభిమానులు, జనసేన కార్యకర్తలు హోటల్ వద్ద ఆయన కోసం ఎదురు చూశారు. బస్సు దిగగానే అభిమానులకు అభివాదం చేసిన పవన్ వెంటనే హోటల్ రూంలోకి వెళ్లిపోయారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో బుధవారం సమావేశం నిర్వహిస్తారని చెబుతున్నారు. రెండు రోజుల పాటు పవన్ యాత్ర జిల్లాలో ఉంటుందన్నప్పటికీ పూర్తి స్థాయి సమాచారం మాత్రం ఎవరికీ చెప్పలేదు. -
వైఎస్సార్సీపీలో చేరిన బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే
-
వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
సాక్షి, ఉండి : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు వైఎస్సార్సీపీలో చేరారు. బొబ్బిలి నియోజకవర్గానికి 1983,1985,1994 సంవత్సరాలలో టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు.1994 లో టిడిపి విప్ గా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ తరపున పోటీచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఏఐసీసీ మెంబర్‌గా కొనసాగుతున్న అప్పలనాయుడు కాంగ్రెస్ వీడి వైఎస్సార్సీపీలో చేరారు. అప్పలనాయుడికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీ వాణి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మంత్రి సాంబశివరాజు, విజయనగరం కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాస రావు, మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరదా రామారావు తదితరులు ఉన్నారు. బొబ్బిలికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సౌజన్య కూడా ఇదే సమయంలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. -
పూలదుకాణం మాటున దొంగనోట్ల వ్యాపారం
బొబ్బిలి : బొబ్బిలి పట్టణంలో కలకలం రేపిన దొంగనోట్ల వ్యాపారుల ముఠాకు రాజకీయ అండదండలున్నాయా? పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు నిందితులను వదిలేయాలని పోలీసులపై స్థానిక నాయకులు ఒత్తిళ్లు చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పట్టణంలోని మద్యం దుకాణాల్లో ఇటీవల కాలంలో దొంగనోట్ల చలామణీ జోరుగా సాగుతోంది. తరచూ మద్యం దుకాణాలు, ఇతర హోల్‌సేల్ దుకాణాల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఇటీవల దీనిపై పోలీసులు నిఘా పెంచి దొంగనోట్లను చలామణీ చేస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మద్యం దుకాణాలు, ఇతర రద్దీగా ఉన్న హోల్‌సేల్ మార్కెట్లలోనే ఈ తతంగం గుట్టుచప్పుడుగా జరుగుతున్నట్టు గుర్తించారు. బొబ్బిలిలోని తాండ్రపాపారాయ జంక్షన్లో పూల దుకాణం నిర్వహిస్తున్న తిరుపతిరావును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతనికి సహాయకుడిగా దుకాణంలో పనిచేస్తున్న షేక్‌పీర్, మరో వ్యక్తి తౌడులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. షేక్ పీర్ పట్టణంలోని పేదలుండే ఇందిరమ్మ కాలనీలో నివసిస్తూ అక్కడే దొంగనోట్లను భద్రపరచి చలామణి చేస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే వీరిని పట్టుకున్న తరువాత బొబ్బిలి దాడితల్లి అమ్మవారి పండగ జరుగడం, పోలీసులకు విశ్రాంతి లేకపోవడం వంటి కారణాలతో పట్టుకున్న నిందితులను అరెస్టు ప్రకటించలేదని సమాచారం. విచారణలో వివిధ అంశాల పరిశోధనపై కూడా మరికాస్త సమయం అవసరమున్న నేపథ్యంలో డీఎస్పీ పి.సౌమ్యలత ఆదేశాలను సీఐ మోహనరావు, ఎస్సైలు వి.ప్రసాదరావు, బి.రవీంద్రరాజులు పాటిస్తున్నట్టు భోగట్టా. కొత్త నోట్లు వచ్చిన కొత్తలోనే..? కొత్త నోట్లు చలామణీకి వచ్చి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తున్న సమయంలోనే దొంగనోట్లను సిద్ధం చేసే సిద్ధహస్తులు బొబ్బిలిలోనే ఉన్నారా? లేక వీరి వెనుక ఇంకెవరయినా ఉన్నారా అన్నది ఇప్పడు పోలీసుల ముందున్న ప్రశ్న. దీనికి సమాధానం వెతికే పనిలో పోలీసులు తలమునకలై ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు అధికంగా ఉన్న బొబ్బిలిని దొంగనోట్ల చలామణికి అక్రమార్కులు ఎంచుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయ ఒత్తిళ్లు..? పోలీసుల అదుపులో ఉన్నవారిని విడిపించేందుకు, కేసులు మాఫీ చేసేందుకు స్థానిక అధికార పార్టీ నేతలు పోలీసు అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నట్టు సమాచారం. ప్రధాన నిందితుడు తిరుపతిని కేసులోంచి బయటపడేసేందుకు ముగ్గురు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ప్రయత్నిస్తున్నట్టు భోగట్టా. అయితే, పోలీసులు ఒత్తిళ్లను ఖాతరు చేయడం లేదని, దొంగనోట్ల చలామణిని ప్రోత్సహిస్తారా అంటూ సదరు నేతలను తిరిగి ప్రశ్నించినట్టు తెలిసింది. కేసులో మూలాలను వెతకడంలో భాగంగా పొరుగు జిల్లాలైన శ్రీకాకుళంలోని రాజాం, విశాఖపట్నంలకు వెళ్లినట్టు సమాచారం. -
ఏపీఓ ఎవరో..?
బొబ్బిలి రూరల్ : బొబ్బిలి మండలంలో ఉపాధి పథకం ఏపీఓ ఎవరన్నది సందేహాస్పదంగా మారింది. ఈ నెల 9న డ్వామా పీడీ బొబ్బిలి ఏపీఓ కె.సుశీలను తెర్లాం మండలానికి, అక్కడి ఏపీఓ కె.కేశవరావును బొబ్బిలికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. ఈ నెల 12న ఎంపీడీఓ ఆర్వి.పద్మజకు ఆదేశాలు అందాయి. ఈ నెల 18న తెర్లాం ఏపీఓ కె.కేశవరావు బొబ్బిలిలో విధుల్లో చేరారు. కానీ బొబ్బిలి ఏపీఓ కె.సుశీల మాత్రం బొబ్బిలిలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం ఎప్పటిలాగే ఫీల్డుకు వెళ్లి వివరాలు విలేకరులకు తెలిపారు. తాను ఇక్కడ రిలీవ్ కాలేదని, కేశవరావు తెర్లాంలో రిలీవ్ కాలేదని ఆమె చెబుతున్నారు. అయితే కేశవరావు విధుల్లో చేరి 2, 3 రోజులలో పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరిస్తానని ఎంపీడీఓకు తెలిపినట్లు సమాచారం. రిలీవ్ కావాల్సిందే.. ఏపీఓ సుశీల రిలీవ్ కావాల్సిందేనని ఎంపీడీఓ ఆర్వి.పద్మజ తెలిపారు. పీడీ ఆదేశాలు ఇచ్చారని, ఈ మేరకు తెర్లాం ఏపీఓ కేశవరావు బొబ్బిలిలో ఈ నెల 18న విధుల్లో చేరినట్లు పేర్కొన్నారు. కె.సుశీల విధులు నిర్వర్తించినా అధికారిక కార్యక్రమాలకు ఏపీఓ కేశవరావే అని తెలిపారు. రాజకీయ ఒత్తిడులే కారణమా..? ఏపీఓల బదిలీకి రాజకీయ ఒత్తిడులే కారణమని తెలుస్తోంది. టీడీపీ నాయకులు, ముఖ్యంగా మంత్రి సోదరుడు బేబీనాయన ఈ బదిలీలకు కారకుడని సమాచారం. అయితే తాను మంత్రి సుజయ్ వద్దే విషయం తేల్చుకుంటానని ఏపీఓ సుశీల చెప్పడం గమనార్హం. నేను విధుల్లో చేరా.. నా బదిలీ ఉత్తర్వుల మేరకు నేను ఈ నెల 18న ఏపీఓగా బాధ్యతలు స్వీకరించాను. ఎంపీడీఓకు బాధ్యతలు ïస్వీకరిస్తున్నట్లుగా పత్రాలు కూడా ఇచ్చాను. – కె.కేశవరావు, ఏపీఓ, బొబ్బిలి (తెర్లాం నుంచి బదిలీ అయిన ఏపీఓ) నేనే ఏపీఓని.. నేను బొబ్బిలిలో, తెర్లాంలో కేశవరావు రిలీవ్ కాలేదు. బదిలీలు అయితే అందరికీ చేయాలి. కానీ ఇద్దరినే చేయడమేంటి..? నేనే విధులు నిర్వర్తిస్తాను. ఏపీఓ నేనే. మంత్రి వద్ద విషయం తేల్చుకుంటా. – కె.సుశీల, ఏపీఓ, బొబ్బిలి (తెర్లాం బదిలీ అయిన ఏపీఓ) వివాదం ఏమీ లేదు.. పీడీ ఆదేశాల మేరకు ఏపీఓలు బదిలీ అయ్యారు. నేను çసుశీలకు రిలీవింగ్ ఇచ్చాను. కేశవరావును విధుల్లో చేర్చుకున్నా. ఇందులో వివాదం ఏమీ లేదు. అధికారికంగా కేశవరావు ఏపీఓ. సుశీల ఉన్నా మేమేమీ అనలేం కదా. ఆమె ఇష్టం. (ఈ మేరకు బదిలీ, జాయినింగ్, రిలీవింగ్ ఉత్తర్వులు చూపారు.) – ఆర్వి.పద్మజ, ఎంపీడీఓ,బొబ్బిలి. -
ఎవరు చేసినా వైద్యమే..
ఈ చిత్రంలో కనిపిస్తున్న గర్భిణి పేరు మజ్జి శారద. తెర్లాం మండలం లింగాపురం. పురిటి నొప్పులు వస్తున్నాయని 108లో బొబ్బిలి ఆసుపత్రికి మంగళవారం వచ్చింది. అయితే ఇక్కడి నుంచి విజయనగరం వెళ్లి పురుడు పోయించుకోమని రిఫర్ లెటర్ రాసి ఈమె చేతిలో పెట్టారు. అలాగని ఇక్కడ సౌకర్యాల్లేవని అనుకోకండి! బొబ్బిలి సీహెచ్‌సీలో మతా,శిశు అత్యవసర సేవా విభాగం ప్రత్యేకంగా ఉంది. కానీ దీనిని వినియోగించే పరిస్థితులు లేవు. ఇక్కడ అధునాతన అల్ట్రా సౌండ్ స్కానింగ్ సిస్టం కూడా పక్కనపెట్టేసి ఉంది. బొబ్బిలి ఆస్పత్రిలో ఎనిమిది మంది వైద్యులున్నారు. కానీ వైద్యం అందడం మాత్రం గగనమే! ముప్పై పడకల సీహెచ్‌సీగా ఉన్న ఈ ఆసుపత్రిని వంద పడకలు చేస్తామని గత నాలుగేళ్లుగా ప్రజాప్రతినిధులు ప్రకటిస్తూనే ఉన్నారు. స్థాయి మాట దేవుడెరుగు.. కనీసం వైద్యం అందినా సంతోషమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిత్యం సుమారు 300 మంది ఓపీ వస్తున్న ఈ ఆసుపత్రిలో అప్పటి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఇచ్చిన వేడినీటిపంపిణీ విభాగం పడకేసింది. దీంతో వేడి నీరు కావాలంటే రోగులు పక్కనున్న హోటళ్లవైపు పరుగెత్తాల్సిందే. అలాగే ఏదేని రోగమొచ్చి ఆసుపత్రిలో చేరితే ఎక్స్‌రే కూడా బయటకెళ్లి తీసుకోవాల్సిందే. డెప్యూటేషన్లు షురూ.. ఇక్కడ పలు పోస్టులను ఇష్టం వచ్చిన రీతిలో డెప్యుటేషన్లు వేస్తుంటారు. రాజకీయంగా పలుకుబడి ఉంటే ఇక్కడ పోస్టింగ్‌తో వేరెక్కడయినా పనిచేయొచ్చు. రోగులకే ఇబ్బందులు తప్పవు. కానీ పూర్తి స్థాయిలో వైద్యం అందాలంటే బొబ్బిలి ఆసుపత్రిని తప్పించి ఇంకెక్కడయినా ఆశ్రయించొచ్చు. వైద్యం కోసం ఇక్కడికి వచ్చి మరింత మెరుగైన వైద్యం కోసం ఇక్కడి నుంచి ఎక్కడికయినా వెళ్లాలంటే అంబులెన్స్ ఇబ్బందులు తప్పవు. పదిన్నర గంటలకు ఒక్కరూ లేరే..? మంగళవారం ఇక్కడికి మాజీ కౌన్సిలర్ షణ్ముఖరావు తదితరులు వైద్యం కోసం వచ్చారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి పదిన్నర వరకూ వేచి చూస్తే ఇద్దరు మాత్రమే ఇక్కడకు వచ్చారు. మిగతా వారు రాలేదు. ఆయా కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక ఇతర సిబ్బంది ఒక్కొక్కరుగా వస్తున్నారు. దీంతో ఆసుపత్రిలో చెట్ల కింద రోగులు వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతో మాజీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త మువ్వల శ్రీనివాసరావు, కన్నూరు శ్రీనివాసరావు తదితరులు అక్కడి ఫార్మసిస్టు వెంకటరమణకు లేఖ ఇచ్చి వెళ్లిపోయారు. నిర్ణీత సమయానికి వైద్యులు వచ్చేలా చూడాలని వారు ఆవేదన చెందారు. వైద్య సిబ్బంది గైర్హాజరుపై ఫిర్యాదు.. ఇంతలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ పెంట మోహనరావు రావడంతో ఆయనను ఆసుపత్రి సిబ్బంది తీరుపై ప్రశ్నించారు. త్వరలో ఆసుపత్రిని ప్రక్షాళన చేయనున్నామని, ప్రధాన వైద్యులు జి శశిభూషణరావు సెలవులో ఉన్నారనీ, ఆయన వచ్చాక పరిస్థితులు చక్కదిద్దుతామని చెప్పారు. మరో ప్రధాన వైద్యుడు ఎస్వీ సత్యశేఖర్ మాట్లాడుతూ తాను విజయనగరంలో సమావేశం నిమిత్తం వచ్చాననీ, వైద్యులంతా నిర్ణీత సమయానికి వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బొబ్బిలి : ఈ చిత్రం చూడండి! ఇక్కడ ఇంజక్షన్ చేస్తున్న ఉద్యోగిని డాక్టరో లేక స్టాఫ్ నర్సో అనుకుంటే పొరపడినట్టే! ఈమె నైట్‌వాచ్‌మన్! పేరు పైడితల్లి! కానీ ఇక్కడ నిత్యం ఓపీ పెరిగిపోతుండటంతో వైద్యులు ఈమెను ఇంజక్షన్లు చేసేయమని ఆదేశాలు ఇచ్చేశారు. దీంతో ఈమె ఇక్కడ కూర్చుని వచ్చిన వారికి ఇంజక్షన్లు చేస్తుంటుంది. అలాగే బీపీ చూసేందుకు వైద్యులు, నర్సులు అందుబాటులో ఉండరు. ఈ ఆస్పత్రిని రాష్ట్ర గనుల శాఖా మంత్రి రెండు మూడు సార్లు పర్యటించి వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన ఆసుపత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ఆసుపత్రిని వంద పడకల ఆసుత్రిగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు మొన్నటి జన్మభూమి సభలో ప్రకటించేశారు. కానీ ఇక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయి. -
ప్రాణాలతో చెలగాటమా?
బొబ్బిలి : ప్రభుత్వానితో ఒప్పందం కుదుర్చుకుని బీమా ప్రీమియంలు చెల్లించకుండా.. ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకుండా ఉన్న వాహనాలిచ్చి మా ప్రాణాలు తీస్తారా? ఇదెక్కడి అన్యాయం.. మా ప్రాణాలకు విలువ లేదా? మీరు చనిపోతే మే ము రూ.50 లక్షలిస్తాం అంగీకరిస్తారా? వియ్ వాంట్ జస్టిస్.. అంటూ 104 వాహన సిబ్బంది, రాష్ట్ర స్థాయి నాయకులు నినదించారు. బొబ్బిలి ప్రభుత్వాస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోయిన ప్రాణాలకు పరిహారమివ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఉద్యోగులపై పాలకులు, యాజ మాన్యం తీరును దుయ్యబట్టారు. బలిజిపేట మండలం మిర్తివలస వద్ద 104 వాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో వాహనం డ్రైవర్ పిల్లా మోహనరావు, స్టాఫ్ నర్సు నెమలి సంతో షికుమారిలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుసుకున్న 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు, సీఐటీయూ, సీపీఎం నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆది వారం ఆందోళన చేశారు. ఆస్పత్రి నుంచి మృతదేహాలను తీసుకెళ్లబోమంటూ డ్రైవర్ భార్య శిల్లా దమయంతి, స్టాఫ్‌నర్సు భర్త గౌరీ ప్రసాద్‌లతో పాటు 104 ఉద్యోగులంతా బైఠాయించా రు. 104 వాహనాల కాంట్రాక్టర్, ఏజెన్సీ ప్రతి నిధులు వచ్చి న్యాయం చేసేవరకూ కదిలేది లేదని స్పష్టం చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న 104 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.సింహాచలం, మెడికల్ అండ్ హెల్త్ రాష్ట్ర నాయకులు పలివెల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశముందని, మీరిచ్చిన వాహనాలకు ఫిట్నెస్ లేదని ఎన్నోమార్లు ప్రభుత్వానికి నివేదించామన్నారు. అయినా పట్టించుకోలేదన్నారు. సీఎం చంద్రబాబుకు సైతం వినతిపత్రం అందజేశామన్నారు. అన్నీ ఉన్నాయని బుకాయించారు.. రాష్ట్ర స్థాయిలో ఉన్న 104 వాహనాలకు ఎటువంటి అనుమతులు లేవని చెప్పినా ఆ ఏజెన్సీ తిరిగి మాకు అన్ని అనుమతులూ ఉన్నాయని లేఖ రాసిందనీ అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని 104 ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపించారు. అంబేడ్కర్ జయంతి రోజున ముఖ్యమంత్రి పలు ప్రసంగాలు చేశారని, ఇప్పుడు చనిపోయింది దళితులేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులంటే సీఎంకు చులకనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం కోసం చర్చలు.. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేసే విషయంపై 104 సేవల ఏజెన్సీ ప్రతినిధి బేరమాడుతూ వచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వీఆర్ ఫణికుమార్, కోశాధికారి నాయుడు, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల అధ్యక్షులు త్రిమూర్తులు, బాలరాజులతో పాటు స్థానిక సీపీఎం, సీటీయూ నాయకులు టీవీ రమణ, రెడ్డి వేణు, పొట్నూరు శంకరరావులు ఆస్పత్రివద్దనే ఉన్నారు. వీరితో పాటు డీఎస్పీ పి.సౌమ్యలత, ఆర్డీఓ సుదర్శన దొర, సీఐ మోహనరావు, ప్రసాదరావులతో పాటు బేబీనాయన, పార్వతీపురం ఎమ్మెల్యే బి.చిరంజీవులు, మున్సిపల్ చైర్పర్సన్ అచ్యుతవల్లిలు పరిహారం గూర్చి యాజమాన్య ప్రతినిధులతో మాట్లాడారు. చివరకు డీఎం హెచ్ఓ వచ్చి రూ.10 లక్షలకు అంగీకరించేలా చేశారు. దీంతో పాటు మృతుల కుటుంబంలో ఒకరికి అవుట్‌సోర్సింగ్‌లో ఉద్యో గం, చంద్రన్న బీమా, 104 ఉద్యోగుల తరఫున బీమా, ఆర్టీసీ సంస్థ తరపున బీమా వచ్చే అవకాశం ఉండటంతో ఉద్యోగుల సంఘ నాయకులు అంగీకరించారు. ఈ పరిహారం ఇచ్చేందుకు రాతపూర్వకంగా ఉండాలని, ఎప్పుడిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేయడంతో రెండు వారాల్లోగా ఇస్తామని చెప్పిన యాజమాన్య ప్రతినిధి అక్కడి నాయకులు, అధికారుల ఒత్తిడితో ఎట్టకేలకు అంగీకరించారు. తక్షణ సాయం అందజేత... ప్రమాదంలో మృతి చెందిన వాహన డ్రైవర్ పిల్లా మోహనరావు, స్టాఫ్ నర్స్ నెమలి సంతోషి కుమారి కుటుంబాలకు రూ.50వేల చొప్పున కలెక్టర్ జారీ చేసిన తక్షణ సాయాన్ని ఆర్డీఓ బి. సుదర్శనదొర, ఎమ్మెల్యే బి చిరంజీవులు, బేబీ నాయన, ఎమ్మెల్సీ జగదీష్‌లు అందజేశారు. బాసటగా నిలిచిన వైఎస్సార్ సీపీ నాయకులు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్ సీపీ పార్వతీపురం నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. ఆస్పత్రికి చేరుకుని మృతులకు బాసటగా నిలిచారు. దుర్ఘటన తీరు, పరిహారం విషయంలో యాజమాన్యం అవలంభిస్తున్న వైఖరిని దుయ్యబట్టారు. బొబ్బిలి వైఎస్సార్ సీపీ నాయకులు ఇంటి గోపాలరావు సైతం ఆస్పత్రికి చేరుకుని సిబ్బంది కుటుంబాలకు న్యాయం చేయాలని, 104 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. -
రూ. 75 వేలతో అద్భుత కారు
బొబ్బిలి రూరల్: ఓ పాతకారు ఇంజిన్‌తో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి కేవలం రూ. 75 వేలతో అద్భుతమై కారును రూపొందించారు ఇంజినీరింగ్ విద్యార్థులు. విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం కోమటపల్లిలోని తాండ్రపాపారాయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ కారును తయారు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ బి.వెంకటరమణ ఆధ్వర్యంలో మెకానికల్ హెడ్ కృపారావు, వర్క్‌షాపు ఇన్చార్జి నర్సింగరావుల పర్యవేక్షణలో జీఎల్ కార్తీక్, వి.సురేష్, ఎన్ఎస్ శ్రీకాంత్, వి.మణికంఠ, బి.హరీష్‌బాబు, వెంకటరమణ తదితరులు ఈ మల్టీ పర్పస్ కారును రూపొందించారు. ఈ మల్టీపర్పస్కారును బొబ్బిలి డీఎస్పీ సౌమ్యలత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ విద్యార్థులు తలచుకుంటే ఎలాంటి అద్భుతాలైనా సాధించగలరన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ విద్యార్థులను, కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. కారు ప్రత్యేకతలివీ.. - కారుకు ఖర్చు కేవలం రూ. 75 వేలు - మైలేజీ 50-60 కిలో మీటర్ల వేగంతో 20-23 కి.మీ. నడుస్తుంది. - డ్రైవర్‌తో కలిపి ఆరుగురు ప్రయాణించవచ్చు. - అల్ట్రాసోనిక్ సెన్సార్ల సహాయంతో నడిచే ఈ కారు ఎదురుగా మీటరు దూరంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా నియంత్రించే వీలుంది. - మద్యం సేవించి వాహనం నడిపితే కారు కదలదు. ఓనర్‌కు మెసేజ్ వెళ్లి వాహనం నిలిచిపోతుంది. - వాహనాన్ని ఎవరైనా తస్కరిస్తే ఆఫ్‌లైన్‌లో కూడా ఎక్కడ ఉందో కనిపెట్టవచ్చు. -
బొబ్బిలి రాజులపై తిరుగుబాటు
టీడీపీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీని, కార్యకర్తలను కాదని వ్యక్తిపూజకే బొబ్బిలి రాజులు ప్రాధాన్యమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ పార్టీ తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు పెనుదుమారాన్నే లేపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ వేదికగా రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బహిరంగంగా ఆయన కళ్లెదుటే విమర్శలు చేయడం... రాజులపై తిరుగుబాటు చేయడం జిల్లాలో సంచలనం రేపింది సాక్షిప్రతినిధి, విజయనగరం/బొబ్బిలి: బొబ్బిలి కోట..తెలుగు దేశం పార్టీకి కంచుకోటగా మారుతుందని భావించి వైఎస్సార్సీపీ టిక్కెట్టుతో గెలిచిన ఆర్.వి.సుజయకృష్ణ రంగారావును టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీలో చేర్చుకున్నారు. కానీ ఇప్పుడు అదే బొబ్బిలిలో టీడీపీకి బీటలు వారుతున్నాయి. సుజయ్ ఆ పార్టీలోకి వెళ్లిన వెంటనే ఆయన సత్తా ఏమిటో టీడీపీ అధిష్టానానికి, కార్యకర్తలకు అర్థమయ్యింది. ఇక అప్పటి నుంచి ఆయన చేత పనిచేయించడానికి నానా తంటాలు పడుతున్నారు. మంత్రి పదవి ఇస్తే సీరియస్గాపట్టించుకుంటాడనుకుని రాష్ట్ర గనులశాఖ అప్పగించారు. అయినా సుజయ్‌లో మార్పు రాలేదు. వివాదాలకు వేదికైన ఆవిర్భావ సభ ఎన్నికల్లో గెలిపించిన పార్టీకే వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయిన ఆయనపై టీడీపీ నేతల్లో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో.. పార్టీ కోసం కష్టపడుతున్న వారికి గుర్తింపు లేదని, కొంత మంది తొత్తులు చుట్టూ చేరి పబ్బం గడుపుకుంటుంటే మాకెందుకీ కష్టాలని టీడీపీ తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు తూమురోతు వెంకట్ బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా గురువారం ఉదయం బొబ్బిలి కోటలో జరిగిన సమావేశంలో మంత్రి సుజయకృష్ణ రంగారావు ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా ఆయన అడ్డుపడ్డారు. ‘మా పరిస్థితి ఇంతేనా’ అంటూ పెద్దగా కేకలేస్తూ నెత్తీనోరూ బాదుకుంటూ తమకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. నాయకులు, కార్యకర్తల సమక్షంలో వెంకట్ ఇలా ప్రవర్తించేసరికి అవాక్కయిన మంత్రికి నోటమాటరాలేదు. మంత్రి అనుచరులు వెంకట్‌ను అడ్డుకోవాలని ప్రయత్నించడంతో కాసేపు తోపులాట జరిగింది. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం అందడం లేదని, అసలు కార్యక్రమాలే చేయడం లేదని, తమ వంటి కార్యకర్తలకు ఏం గుర్తింపు ఉందని వెంకట్ నిలదీశా రు. రాష్ట్ర ఆర్ధిక మండలి సభ్యుడు తూముల భాస్కరరావు, ఇతర నాయకులు కల్పించుకుని ఆయన్ను సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. అక్కడ ఆయనను అనునయించాలని ప్రయత్నించి నా కుదరలేదు. చాలాసేపు టీడీపీ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని వెంకట్ వెళ్లగక్కారు. తనతో పాటు చాలా మంది ఇదే ఆవేదనలో ఉన్నారన్నారు. గైర్హాజరయిన తెంటు పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి పార్టీ ఇన్‌ఛార్జి తెంటు లక్ష్ముమ్ నాయుడు గైర్హాజరయ్యారు. వాస్తవానికి ఇన్చార్జి హోదాలో కార్యక్రమం నిర్వహించాల్సి ఉన్నా ఆయన రాలేదు. ప్రతీ సమావేశానికి హాజరయ్యే ఆయన ఈసారి హాజరు కాకపోవడంతో పార్టీలో సుదీర్ఘచర్చ జరుగుతోంది. పార్టీలో నెలకొన్న విభేదాలే కారణమని తెలుస్తోంది. మంత్రి అనుయాయులంతా రాజులకే ప్రాధాన్యమివ్వడం, పార్టీ కార్యక్రమాలకు, పార్టీకి విలువనివ్వకపోవడంతో తెంటు కూడా మనస్థాపం చెందుతున్నట్టు చర్చించుకుంటున్నారు. అదే విషయాన్ని ఆయన అనుచరుడయిన తూమురోతు వెంకట్ ఒక్కసారిగా మంత్రి సమావేశంలోనే బయటపెట్టినట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్చల్ ఉదయం వివాదం ముగిసిందనుకుంటే సాయంత్రం మళ్లీ మొదలైంది. బొబ్బిలి కోట దక్షిణ దేవిడీ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెంకట్ చేరుకుని తాను భార్యాపిల్లలతో కలసి ఆత్మహత్యాయత్నం చే కుంటున్నానని హల్ చల్ చేశారు. తెంటు లక్ష్ముమ్ నాయుడు తదితరులు ఫోన్ చేసి వారించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు రాంబార్కి శర వచ్చి ఏమైందంటూ అడగ్గా తాను ఆత్మహత్య చేసుకోనున్నట్లు వెంకట్ చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అనంతరం కౌన్సిలర్ ఆర్.ఎల్.వి.ప్రసాద్ వచ్చి ఆయన్ను తీసుకెళ్లిపోవడంతో అప్పటికి కథ సుఖాంతమైంది. బొబ్బిలి టీడీపీలో భగ్గుమన్న విభేదాలపై ఇంటిలిజెన్స్ వర్గాలు పార్టీ అధిష్టానానికి, పోలీసు ఉన్నతాధికారులకూ సమాచారమందించారు. -
చెరువు గర్భంలో నిర్మించిన ఇళ్లను తొలగించాలి
బొబ్బిలి : పట్టణంలోని 8వ వార్డులోని శివాలయం వీధి వద్ద ఉన్న కూర్మయ్య బందలో ఆక్రమణలు వెంటనే తొలగించాలని రామలింగేశ్వర దేవాంగుల సంక్షేమ సంఘం ధర్నా నిర్వహించింది. సంఘ సభ్యులకు పట్టణ పౌరసంక్షేమ సంఘం సంఘీభావంగా రావడంతో మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్నూరు శంకరరావు మాట్లాడుతూ కూర్మయ్య బంద పూర్వం నుంచి స్మశాన వాటికగా ఉపయోగించుకునే వారమన్నారు. ఆ తరువాత ఇక్కడి చెరువు గట్టుపై అధికారులు ఇచ్చిన పట్టాలతో ఇళ్లను నిర్మించుకున్నారన్నారు. అధికారులు 30–10 వెడల్పుతో పట్టాలు ఇస్తే సుమారు వంద అడుగుల వరకూ ఇళ్ల నిర్మాణం చేపట్టి స్మశానం ముందుకు వచ్చేశారని సంఘం సభ్యులు ఆరోపించారు. స్మశానంగా వాడుకునే చెరువు గర్భంలోకి ఇళ్ల నిర్మాణంతో వాడుకున్నది కాక ఇప్పుడు స్మశాన నిర్మాణాన్ని అడ్డుకోవడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇళ్లను, నిర్మించుకున్న కొలతలను పరిశీలించాలని వారు డిమాండ్ చేశారు. తహసీల్దార్ పరిశీలన.. పట్టణంలోని స్మశాన వాటిక నిర్మాణానికి ఆక్రమణ దారులే అడ్డుపడుతున్నారని తహసీల్దార్‌కు వినతిపత్రం ఇవ్వడంతో తహసీల్దార్ సాయికృష్ణ తన సిబ్బందితో వచ్చి పరిశీలన చేశారు. స్థలం ఎంత వరకు ఉంది? అక్కడ ఇళ్లను ఎంత వరకు నిర్మించుకున్నారన్న విషయం పరిశీలించారు. దీనిపై పూర్తి స్థాయిలో అందరినీ విచారించి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మాకు స్మశాన వాటికను నిర్మించి ఇవ్వాలని స్థానికులు కోరారు. వి ఇందిర, జాడ గోవింద రావు, కే పార్వతీశం, ఆదెం అప్పారావు, సర్వేశ్వరరావు, బాబ్జీ, బల్ల శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎంత కష్టం... ఎంత కష్టం...
శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలు... బొబ్బిలి రైల్వే స్టేషన్... మూటాముల్లే సర్దుకుని స్టేషన్‌కు పిల్లలతో పరుగులు పెడుతున్న ప్రయాణికులు... ఇంత పెద్ద సంఖ్యలో తరలిరావడాన్ని చూసిన స్థానికులు అవాక్కయ్యారు. నిత్యం ఇక్కడినుంచి విజయవాడ పాసింజర్ రైలుకు పెద్ద సంఖ్యలో జనం తరలివెళ్లడం అందరికీ తెలిసిందే. కానీ ఇంత పెద్ద సంఖ్యలో తరలిరావడం చూసి అంతా నోరెళ్లబెట్టారు. వారంతా బతుకు తెరువుకోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే వలస కూలీలే. విజయనగరం, బొబ్బిలి: పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి, రామభద్రపురం, బలిజిపేట, బాడంగి, తెర్లాం మండలాలకు చెందిన సుమారు రెండువేల మంది వలస కూలీలు శుక్రవారం ఒక్కరోజే బొబ్బిలినుంచి పయనమయ్యారు. వీరంతా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగే అపరాల తీతలు, రబీ వ్యవసాయ పనుల కోసం జట్లుగా వెళ్తున్నారు. ఇక్కడ పనులు చేస్తే మహిళా కూలీలకు కేవలం రూ.100లు పురుషులకు రూ.250లు మాత్రమే ఇస్తున్నారని, ఆ జిల్లాల్లో అయితే పెద్ద మొత్తంలో కూలి వస్తోందని అక్కడకు తరలి వెళ్తున్నారు. శుక్రవారం వీరంతా బొబ్బిలి రైల్వే స్టేషన్‌కు చేరుకుని రాయఘడ–విజయవాడ ప్యాసింజర్ రైలును ఆశ్రయించారు. అయితే సుమారు 500కు పైగా జనం రైలెక్కలేకపోయారు. వారంతా బస్సులు, లారీలను ఆశ్రయించారు. 10 నుంచి 30 మంది జట్లుగా వెళ్తున్నవారంతా కలసి కట్టుగా అటువైపు వెళ్తున్న లారీలను మాట్లాడుకుని వెళ్లిపోగా మరికొంత మంది టాటా ఏస్‌లతో విజయనగరం వరకూ మాట్లాడుకుని అక్కడి నుంచి మరో రైలు పట్టుకుని వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. మరి కొందరు అంత దూరం బస్సుల్లో వెళ్లేందుకు చార్జీలు లేక మరునాటి వరకూ ఉండేందుకు బొబ్బిలిలోనే ఉండిపోయారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలో బస రైలెక్కలేకపోయిన జనమంతా రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఉండిపోయారు. విశాలంగా కార్యాలయం షెడ్ ఉండటంతో అక్కడే రాత్రి ఉండి మరునాడు మరో రైలెక్కివెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. మా తమ్ముడు తీసుకురమ్మన్నాడని... ఇక్కడ కన్నా అక్కడెక్కువ పనులు, కూలీ ఉంటుంది. అక్కడ మా తమ్ముడు భీమ పనిచేస్తున్నాడు. ఎంత మందినైనా తీసుకురమ్మంటే ప్రస్తుతం 20 మందిని తీసుకువెళ్తున్నాను. వీరందరినీ తీసుకెళ్లి అక్కడ పనిలో కుదురుస్తాం. ఇక్కడి కంటే అక్కడ ఒక్కొక్కరికీ రూ.200 నుంచి 250లు కూలీ అదనంగా లభిస్తుంది. – పత్తికాయల గౌరి,జట్టు మేస్త్రి సోదరుడు, రామభద్రపురం ఇక్కడ కనీస వేతనానికి గ్యారంటీ లేదు ఉపాధి పనులు చేస్తున్నా కనీస వేతనం వస్తుందన్న గ్యారంటీ లేదు. మహా అయితే వంద రూపాయలు రావడం కష్టం. అక్కడికెళ్తే రూ.300కు పైగా ఒకరికి వస్తున్నాయి. ముందుగా మాట తీసుకుని కూలీల జట్టు మేస్త్రీతో వెళ్తున్నాం. పనులు చేసుకుని నాలుగు కాసులు వెనకేసుకుని వస్తాం. – నందిబిల్లి బంగారమ్మ, నాయుడు వలస,రామభద్రపురం మండలం మినప చేలు తీసేపనికోసం.. మినప చేలు తీసే పనులు అక్క డ ఎక్కువగా దొరుకుతాయి. ఆ పనులతో పాటు రబీ పంటలకు సంబంధించి పనులు ఉంటా యి. ఇక్కడ పనులకు అంతగా గిట్టుబాటు అవదు. అందుకే కుటుంబంతో కలసి వెళ్తున్నా .– యడ్లమారి నాయుడు, పారాది, బొబ్బిలి మండలం -
హ్యాపీ జర్నీ
ప్రభాత భానుని లేలేత కిరణాలు ప్రసరించే వేళ... పచ్చని ప్రకృతి నడుమ... ఉల్లాసంగా సాగిపోయే ఆ వాహనం కేవలం ప్రజలనే కాదు... వారి మధ్య అనుబంధాలను మోసుకుపోతుంది. రైట్... రైట్... అనకపోయినా... పట్టాలపై పరిగెత్తే ఈ బస్సు ఈ ప్రాంతీయుల మనసును పెనవేసుకుపోయింది. స్కూలుకు వెళ్లే విద్యార్థి దగ్గర్నుంచి... సంతకు వెళ్లే అవ్వ వరకూ పల్లె ప్రజలంతా ఆ రైలు కోసం ఎదురుచూస్తుంటారు. ఒకే బోగీ.. ప్రతి చిన్న స్టేషన్లో ఆగి వచ్చేవారందరినీ ఎక్కించుకుని... వారంతా ఎక్కిన తర్వాతే ముందుకు కదిలే ఆ రైలుబండి కేవలం ఓ వాహనం కాదు.. ఆత్మీయతల నిలయం. బొబ్బిలి – సాలూరు పట్టణాల మధ్య కేవలం ఒకే ఒక్క భోగీతో నడుస్తూ రాష్ట్రంలోనే ఏకైక సర్వీసుగా పేరొందిన రైలుబస్సు ప్రయాణం.. ఈ వారం ‘సాక్షి’ సండే స్పెషల్. – సాక్షి ప్రతినిధి, విజయనగరం బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం: దేశంలోనే ఎక్కడా లేని రైల్ బస్ బొబ్బిలి–సాలూరు మధ్య మాత్రమే నడుస్తోంది. కేవలం ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నష్టం వస్తున్నా రైల్వే శాఖ అధికారులు దీనిని నడిపిస్తున్నారు. కటక్, పారాదీప్, కాకినాడ ప్రాంతాల్లో గతంలో నడిచే ఈ తరహా రైల్‌బస్‌లు ఇప్పుడు కేవలం బొబ్బిలి–సాలూరు ప్రాంతాలకే దక్కిన ఓ వరం. ఏళ్లతరబడి ఈ రైలు బస్సులో ప్రయాణిస్తున్నవారు ఈ గ్రామాల్లో చాలా మందే ఉన్నారు. ఇల్లు, ఆఫీసు, స్కూలు, కాలేజ్, వాణిజ్య ప్రాంతాల్లో హడావుడి జీవితం గడిపే వారంతా ఈ రైలుబస్సులోకి ఎక్కిన తర్వాత అవన్నీ మర్చిపోతారు. రైలు స్నేహితులతో కులాసాగా కబుర్లు చెప్పుకుంటుంటారు. చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ కాసేపు కలతలన్నీ మర్చిపోతారు. ఈ బస్సులేకుంటే ఇబ్బందే... దాదాపు 75 మంది కూర్చోవడానికి అవకాశం ఉన్న ఈ రైల్‌బస్ ఈ ప్రాంతంలో నడవకపోతే చాలా మంది ప్రయాణికులు బస్సులు, ఆటోల కోసం వ్యయ ప్రయాసలు పడాల్సిందే. బొబ్బిలి నుంచి నారాయణప్పవలస, గొల్లల పే ట, రొంపిల్లివలస, పారన్నవలస, సాలూరు వంటి స్టేషన్ల వద్ద ప్రయాణికులు కిక్కిరిసి ఎక్కుతారు. ఒక్కో స్టేషన్నుంచి సుమారు అక్కడి నాలుగైదు గ్రామాల ప్రజలు ఈ రైల్‌బస్‌ను ఆశ్రయిస్తారు. బోలెడు ఆదా... సాలూరు నుంచి బొబ్బిలి వెళ్లాలన్నా, అక్కడి నుంచి సాలూరు రావాలన్నా కచ్చితంగా రామభద్రపురం రావాల్సిందే. అక్కడ మరో వాహనాన్ని ఆశ్రయించాల్సిందే. 21 కిలోమీటర్ల దూరానికి ప్రయాణ చార్జీలు కూడా ఎక్కువే. బొబ్బిలి నుంచి సాలూరు వెళ్లాలంటే రూ.20 పైనే ఖర్చవుతుంది. అదే రైల్‌బస్ అయితే కేవలం రూ.10 తోనే వెళ్లొచ్చు. మిగతా రైళ్లలో ప్రయాణానికి స్టేషన్లో బుకింగ్ కౌంటర్ వద్ద టిక్కెట్ తీసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం రైలులోనే టిక్కెట్ ఇస్తారు. మరో ఆసక్తికరమయిన విశేషం ఏమంటే కొన్ని స్టేషన్లలో దిగేందుకు వీరి వద్ద టిక్కెట్లు ముద్రించి ఉండకపోతే చీఫ్ టిక్కెట్ ఇన్స్పెక్టర్ (టీటీ) ఒక చీటీ రాసి ఇస్తారు. అప్పటికి అదే టిక్కెట్. కేవలం 75 లీటర్ల డీజిల్‌తో లారీలు, బస్సుల్లో ఉపయోగించే ఇంజిన్‌తో ఈ రైల్ బస్ రోజుకు 14 కిలోమీటర్లు ఐదుసార్లు రెండు పట్టణాల మధ్య నడుస్తుంది. అదే రైలింజన్ వేస్తే ఇదే దూరానికి 1000 లీటర్ల పైనే అవుతుంది. టికెట్ కలెక్టర్‌గా దాదాపు 22 సంవత్సరాల సర్వీసు ఇందులోనే నడిచింది. దీంట్లో పనిచేయడం అదో అనుభూతి. వాస్తవానికి మామూలు రైళ్లలో అయితే ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇందుకు డీఏ అదనంగా వస్తుంది. ఈ రైల్‌బస్‌లో ఆ అవకాశం లేకపోయినా ఈ రైలంటే మాకదో ప్రత్యేకత. – వసంత రావు ఉమామహేశ్వరరావు, చీఫ్ టిక్కెట్ ఇన్స్పెక్టర్ (టీటీ). మాకెంతో ఇష్టం ఈ ప్రయాణం మాకెంతో ఇష్టం. ఈ రైల్బస్తో ఎంతో అనుబంధం పెరిగింది. ఇటీవల కొన్నాళ్లు రైల్‌బస్ నిలిచిపోయింది. ఆ సమయంలో మేమెంతో ఇబ్బంది పడ్డాం. మళ్లీ ఈమధ్య నుంచే నడిపిస్తుండటంతో సంతోషమనిపించింది. – సీహెచ్.నారాయణరావు, పారన్న వలస బస్ నిలిచిపోయాక నెలకు రూ.700 అయ్యేది: ఈ మధ్య ఈ బస్ నిలిచిపోయింది. మాలాంటి విద్యార్థులకు ఇది చాలా కష్టమనిపించింది. సమయం వృథాతో పాటు నెలకు రూ.700లు ఖర్చయ్యేది. అదే రైల్‌బస్ అయితే రూ.150తోనే సరిపోతుంది. – సీహెచ్.మౌనిక, విద్యార్థిని, బొబ్బిలి 8వ తరగతి నుంచీ ఈ బస్‌లోనే వెళ్తున్నా: మాది రొంపిల్లి వలస. నేను ప్రస్తుతం బొబ్బిలిలోని గాయత్రి కాలేజ్‌లో ఇంటర్ చదువుతున్నా. మాకు చదువుకునేందుకు పట్టణం వెళ్లాలంటే ఈ రైల్‌బస్ ఎంతో సౌకర్యం. ఈ బస్‌లో నేను 8వ తరగతి నుంచి వెళ్తున్నా. – పూడి కాంచన, ఇంటర్ విద్యార్థిని మా పిల్లల దగ్గరకు వెళ్తున్నా మాకు ఈ రైల్ బస్సు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. నేనిప్పుడు ఇందులో మా పిల్లల దగ్గరకు వెళ్తున్నా. రైలు బస్ కొన్ని నెలలు ఆగిపోతే పోరాడి మరీ తిరిగి సాధించుకున్నాం. – కిలపర్తి లక్ష్మి, చిన పారన్న వలస మాకిదే తోడు మాది మరిపిల్లి. మేం జంగమయ్యలం. నెలగంటు పెట్టిన నాటినుంచి సంక్రాంతి వరకూ చనిపోయిన పెద్దల్ని పొడుగుతుంటాం. సాధారణ రోజుల్లోనూ ఇలానే వెళ్తాం. రైల్ బస్ మాకు తోడు. దీనిలో వెళితే చాలా సరదాగా ఉంటుంది. –కటమంచి అప్పన్న, మరిపిల్లి -
యువతులపై ఆటో డ్రైవర్ దాష్టీకం
-
బొబ్బిలికి భారీ పైలట్ ప్రాజెక్టు
గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన భారీ తాగునీటి ప్రాజెక్టు ఎట్టకేలకు మంజూరైంది. దీంతో బొబ్బిలి ప్రజల తాగునీటి కష్టాలు తీరే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగి ప్రాజెక్టు పనులు ప్రారంభమై సకాలంలో పనులు పూర్తయితే రానున్న రోజుల్లో బొబ్బిలి ప్రజలకు తాగునీటి కష్టాలు తీరుతాయి. అయితే ప్రస్తుత పాలకులు, అధికారులు దీన్ని ఎంత కాలంలో పూర్తి చేస్తారోనన్న సందేహం ప్రజల్లో లేకపోలేదు. బొబ్బిలి: బొబ్బిలి మున్సిపాలిటీకి భారీ తాగునీటి పథకం మంజూరైంది. రూ.98 కోట్లతో సీతానగరం మండలంలోని సువర్ణముఖి నదిలో భారీ ఇన్‌ఫిల్టరేషన్ బావులను ఏర్పాటు చేసి అధిక సామర్ధ్యం కలిగిన మోటార్లు, పైపులతో బొబ్బిలి పట్టణానికి తాగునీటిని అందించే బృహత్తర ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదించారు. అయితే ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. పలుమార్లు ఈ పథకం గూర్చి ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంతో కృషి చేశారు. అయితే ఈ ప్రాజెక్టు మంజూరైనప్పటికీ గతంలో జీఎస్టీ లేకపోవడంతో ఇప్పుడు జీఎస్టీ పన్నులను కలిపి తాజా ప్రతిపాదనలు తయారు చేయాలని కోరారు. దీంతో గతంలోని రూ.98 కోట్ల ప్రతిపాదనలు ఇప్పుడు సుమారు 30 శాతం జీఎస్టీతో అది రూ.100 కోట్లకు పైగానే పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఈ తరహా కొత్త ప్రతిపాదనలను ఈ నెల 26లోగా పంపించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మున్సిపల్ అధికారులు ఈ ప్రతిపాదనలను తయారు చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన బృందం వచ్చి పరిశీలనలు చేసి వెళ్లింది. ప్రతిపాదనలు పంపిన తరువాత ఈఎన్సీకి పంపించి ఆ తరువాత పరిపాలన ఆమోదంతో టెండర్లను పిలుస్తారు. వెయ్యి కిలోలీటర్ల చొప్పన మూడు ఓవర్ హెడ్ ట్యాంకులతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తారు. కొత్త తరహా విధానంలో ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని మున్సిపల్ డీఈఈ మహేశ్ తెలిపారు. గెనటింగ్ విధానంలో మరమ్మతుల ప్రతిపాదనలు ప్రస్తుతం మున్సిపాలిటీకి తాగునీరు అందిస్తున్న ట్యాంకులు లీకులతో ఉండటంతో కొత్తగా వీటిని మరమ్మతులు చేసేందకు రూ.35 లక్షలకు కేటాయించనున్నారు. పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న ట్యాంకు పూర్తి లీకుల మయం కావడంతో దీనికి ఈ నిధులతో కొత్త విధానంలో మరమ్మతులు చేయనున్నారు. గెనటింగ్ అనే ఈ తరహా విధానంలో లూజ్ కాంక్రీట్‌ను తొలగించి పైపింగ్, స్ప్రేల ద్వారా కొత్త కాంక్రీటు, సిమెంట్ పేస్ట్లను లోనికి పంపిస్తారు. తద్వారా మరో పదేళ్ల పాటు ఈ ట్యాంకులు పనిచేసేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామనీ డీఈఈ మహేష్ విలేకర్లకు తెలిపారు. -
ఎన్నో ఆశలు..
రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తే అన్ని ఖర్చులూ పోను మిగిలిన రెండు లక్షలు బ్యాంకులో వేద్దామనుకున్నంతలో ఎవరో ఒత్తిడి చేశారని అగ్రిగోల్డులో డిపాజిట్ చేసిన ఓ కుటుంబం ఇప్పటివరకూ కలవరపడుతూనే ఉంది. కష్టపడి పనిచేసి... పైసా.. పైసా కూడబెట్టి పోగు చేసుకున్న సొమ్ము కాస్తా అందులో డిపాజిట్ చేసి ఇన్నాళ్లూ కన్నీటితో గడిపారు. ఇలాంటివారు జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్షా 43వేల మంది కోట్లాదిరూపాయలు డిపాజిట్ చేశారు. సంస్థ బోర్డు తిప్పేయడంతో వీరందరిలోనూ అలజడి రేగింది.తమ కష్టం ఊరికే పోదనీ... చెమటోడ్చి కూడబెట్టినది వృథా కాదనీ... ఎప్పటికైనా తమకు న్యాయం జరగకపోతుందా... అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని గడిపారు. బొబ్బిలి:పిల్లల చదువుల కోసం... వారి పెళ్లిళ్లకోసం... వృద్ధాప్యంలో వైద్యం కోసం... రిటైర్ అయ్యాక కాసింత గూడు కట్టుకుందామనీ... ఇలా ఒక్కొక్కరూ ఒక్కో లక్ష్యంతో అగ్రిగోల్డ్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. వారందరికీ శఠగోపం పెట్టి ఆ సంస్థ కాస్తా బోర్డు తిప్పేసింది. ఏళ్ల తరబడి పోరాడితే ఎట్టకేలకు సీఐడీ ద ర్యాప్తు చేపట్టి బాధితుల నుంచి ఆధారాలు సేకరించేందుకు జి ల్లాలోని పలు పోలీసు స్టేషన్ల వద్ద ఆన్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ కేంద్రాలకు బాధితులు క్యూ కడుతున్నారు. ఆయా ఆన్లైన్ కేంద్రాల వద్ద ఎవరి కష్టాలు వారు చెప్పుకుంటున్నారు. తామెంత పెట్టుబడులు ఏ విధంగా పెట్టి మోసపోయామన్నదీ తెలియజేసుకుని పరస్పరం ఓదార్చుకుంటున్నారు. తాము చెల్లించిన మొత్తానికి ఇచ్చిన రసీదులను, సొమ్ము డిపాజిట్ చేసినట్టు ఇచ్చిన బాండ్లనూ ఇన్నాళ్లూ చూసుకుంటూ గడిపినవాళ్లు కాస్తా తమ సొమ్ము తిరిగి వస్తుందన్న ఆశతో ఎక్కడి పనులక్కడ వదిలేసి కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. పెట్టుబడులు రూ. వెయ్యికోట్లకు పైమాటే... జిల్లా వ్యాప్తంగా 1.43,030 మంది వివిధ రకాల పొదుపు ఖాతాలు, చీటీలు, పెట్టుబడుల విభాగాల్లో డబ్బు దాచుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలా సుమారు వెయ్యి కోట్ల రూపాయల వరకూ పెట్టుబడి చేసినట్టు తెలుస్తోంది. ఇందులో సుమారు 25వేల మంది ఏజెంట్లే ఉన్నారు. కూలీ నాలీ చేసుకున్న వారి దగ్గర నుంచి ఆటో డ్రైవర్లు, రైతులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, దినసరి కూలీలు ఇలా అన్ని రంగాలకు చెందిన వారూ ఉన్నారు. డబ్బుల కోసం తిరిగి తిరిగి కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూశారు. జిల్లా వ్యాప్తంగా 16 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరి కోసం రూ.5కోట్లు విడుదల చేసినా నేటికీ వారి కుటుంబాలకు ఆ డబ్బు అందలేదు. సుమారు మూడు నెలలుగా ఆయా కుటుంబాలు పరిహారం వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాయి. చనిపోయిన వారికి రూ.5లక్షల చొప్పున పరిహారంగా అందజేస్తామని కుటుంబాలను వీధిన పడకుండా చూస్తామని అసెంబ్లీలో ప్రకటించినా ఆయా కుటుంబాలకు ఎదురు చూపులే మిగిలాయి. ఎప్పుడో చనిపోయిన బాధితుల పోస్ట్‌మార్టం సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్లు తెమ్మంటూ షరతులు విధిస్తున్నారు. వీటి వల్ల బాధిత కుటుంబాలు మరింత ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇలా అడుగుతారని అప్పుడు మాకు తెలియదు కదా ఇప్పుడెలా తేగలమని వారు నిస్సహాయంగా ఎదురు తెన్నులు చూస్తున్నారు. ఆశల మోసులు అగ్రిగోల్డ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారంతా ఇప్పుడు కాస్త ఆశతో ఉన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేసేందు కు ముందుకు వచ్చిన సంస్థ డిపాజిట్ చెల్లించడం, అప్పులను లెక్కించేందుకు సీబీఐ ఆధ్వర్యంలో పోలీసులు కూడా ఆన్లైన్ చే స్తుండటంతో బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం మరింత చొరవ చూపాలని కోరుకుంటున్నారు. ఆన్లైన్ మొరాయించినప్పుడల్లా నిరాశ అగ్రిగోల్డ్ కంపెనీ బాధితుల బాండ్ల గుర్తింపు, రసీదుల లెక్కిం పు వంటి కార్యక్రమాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. జిల్లాలోని దాదాపు అన్ని పోలీసుస్టేషన్లు, వివిధ కేంద్రాల వద్ద ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక్కో సారి ఆన్లైన్ మొరాయిస్తున్నప్పుడు బాధితులు నిరాశ చెందుతున్నారు. అప్పటికప్పుడే మళ్లీ పనిచేస్తుందంటూ సమాచారం వస్తుండటంతో ఊరట చెందుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ఎంత తొందరగా తేల్చేస్తే బాగుండునన్న భావన బాధితుల్లో కనిపిస్తోంది. వీటి సంగతేంటి? అగ్రిగోల్డ్ బాధితుల బాండ్లను, రసీదులను నమోదు చేస్తున్న యంత్రాంగం కొన్నింటిపై స్పష్టత లేదని వదిలేస్తోంది. కంపెనీ ఇచ్చిన బాండ్లు మెచ్యూరిటీకి వచ్చినవి రెండు నెలల ముందుగా తీసుకుంటారు. వాటికి జిరాక్స్ కాపీలిచ్చి స్టాంప్ వేసి కస్టమర్లకు ఇస్తారు. అయితే ఇప్పుడవి ఆన్లైన్లో నమోదు చేయడం లేదు. ఇటువంటివి బ్రాంచ్‌కు నెలకు రూ.కోటి వరకూ ఉంటాయి. జిల్లాలో ఆరు బ్రాంచిలున్నాయి. ఈ ఆరు బ్రాంచిల్లో కలిపి 2014 నవంబర్, డిసెంబర్ నెలల్లో కంపెనీ తీసుకున్న మెచ్యూరిటీ బాండ్ల విలువ రూ.12 కోట్లు ఉంటుంది. దీనికి సంబం ధించి 5వేల మంది బాధితులున్నారని వాటిని నమోదు చే యడం లేదని ఏజెంట్లు వాపోతున్నారు. అలాగే మెంటాడ తదితర ప్రాంతాల్లో కంపెనీ పేరిట వెంచర్లు వేసి క్యాంపులు నిర్వహించారు. ఆ క్యాంపుల్లో గజం వెయ్యి రూపాయల చొప్పున వందల్లో ప్లాట్లు విక్రయించేందుకు కొనుగోలు దారుల నుంచి రూ.50వేలు, లక్ష చొప్పున అడ్వాన్సులు తీసుకున్నారు. వాటికి రసీదులు ఉన్నాయి. కానీ వాటిని నమోదు చేయడం లేదు. వీటితో పాటు కంపెనీ మూత పడేముందు సాధారణ పెట్టుబడులకు కూడా నవంబర్, డిసెంబర్ నెలల్లో రసీదులు ఇవ్వలేదు. ఏజెంట్ల వద్ద మంత్లీ, డైలీ స్టేట్మెంట్లు ఉన్నాయి. వీటిని కూడా నమోదు చేయడం లేదు. వీటి విలువ జిల్లాలో సుమారు రూ.10 కోట్లు ఉండొచ్చని ఏజెంట్లు చెబుతున్నారు. నమ్మకమైతే ఉంది. ఏమవుతుందో చూడాలి: కంపెనీ ఇప్పటికే పలుమార్లు ఇటువంటి వివరాల సేకరణ చేసింది. అయితే ఇప్పుడు ప్రభుత్వ పరంగా చేస్తుండటంతో నమ్మకం కుదిరింది. బాధితులంతా ఆశలు పెంచుకుంటున్నారు. కానీ దీనికి సమయం ఎక్కువ పడుతుంది. ఎన్నికలు సమీపించేసరికి ఎలా మారుతుందో చూడాలి. పోలీసు స్టేషన్లకు పెద్ద ఎత్తున వస్తున్నారు. వారి బాధలు వర్ణనాతీతం, మా ఉద్యమ ఫలితంగానే కదలిక వచ్చింది. రోజూ రెండు మూడు పోలీసు స్టేషన్లు తిరుగుతున్నాం. – పి కామేశ్వరరావు, జిల్లా గౌరవాధ్యక్షుడు, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్. కొన్నింటికే పరిమితం చేస్తున్నారు జిల్లాలో చేపడుతున్న ఆన్లైన్ ప్రక్రియలో మెచ్యూరిటీ బాండ్లు, రియ ల్ వెంచర్లు, రసీదులివ్వని చెల్లింపులకు సంబంధించి ఆధారాలున్నా నమోదు చేయడం లేదు. సంబం ధిత స్టేట్మెంట్లు,మెచ్యూరిటీ బాం డ్ల జిరాక్స్‌లు, రసీదులు చూపిస్తున్నా పట్టించుకోవడం లేదు. వాటి విలువ కోట్లలో ఉంటుంది. ఆయా బాధితులు మాకో న్యాయం, మిగతా వారికో న్యాయ మా అం టున్నారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే మరింత మంది ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదముంది. – మజ్జి సూరప్పడు, జిల్లా అధ్యక్షుడు, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ -
బొబ్బిలిలో ఐటీ దాడులు
బొబ్బిలి: బొబ్బిలిలో ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేశారు. పట్టణంలోని ఫూల్‌బాగ్ కాలనీని గ్యాస్ ఏజెన్సీతో పాటు గౌడువీధి, సంస్థానం హైస్కూలు రోడ్డులో ఉండే కేడీఆర్ వ్యాపార సంస్థల్లో సోదాలు చేశారు. ఐటీ అడిషనల్ కమిషనర్ నాయక్ ఆధ్వర్యంలో అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు మొదలైన సోదాలు శనివారం వేకువజాము వరకూ కొనసాగాయి. గ్యాస్ ఏజెన్సీ వద్దకు వివరాలు సేకరణకు వెళ్లిన మీడియాను బయటకు పంపించేసి తలుపులు మూసేసారు. దాడులు చేసే సమయంలో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ నాయక్ విలేకరులతో మాట్లాడుతూ నోట్లరద్దు సమయంలో జరిగిన లావాదేవీలను «ఆధారంగా ఈ సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. -
ఏటీఎంలోంచి ‘తమాషా’ నోటు!
బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఏటీఎంలో ఫుల్ ఆఫ్ ఫన్ పేరుతో రూ.500 నోటు రావడం కలకలం సృష్టించింది. ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న లైన్‌మన్ అంపావల్లి చిన్నారావు కరూర్ వైశ్య బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలో డబ్బులు డ్రా చేశారు. దానిలోంచి నకిలీ రూ.500 నోటు వచ్చింది. ఫన్‌తో పాటు దానిపై మనోరంజన్ బ్యాంకు ఆఫ్ ఇండియా అని ఉంది. నోటు మీద ఉండే నంబర్లన్నీ సున్నాలుగానే ఉన్నాయి. నకిలీ నోట్లు, చిన్నారులు ఆడుకునే నోట్లు కూడా బ్యాంకు ఏటీఎంల నుంచి వస్తుండడంతో అందరూ విస్తుపోతున్నారు. -
అగ్నిప్రమాదంలో వృద్ధురాలు సజీవ దహనం
బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కూరాడలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ ఇల్లు తగలబడి అప్పాయమ్మ అనే వృద్ధురాలు సజీవ దహనమైంది. ఆరు పశువుల పాకలు దగ్ధం కాగా రెండు పశువులు మృతి చెందాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. -
'ఆ దేశంలో మేం పడ్డ బాధలు వర్ణనాతీతం'
బొబ్బిలి: బతుకుతెరువుకోసం విదేశాలకు వెళ్లి నానా ఇబ్బందులు పడ్డామని విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన పలువురు కార్మికులు తెలిపారు. ఇరాన్ నుంచి అతి కష్టమ్మీద స్వస్థలాలకు చేరుకున్న కార్మికులు సోమవారం విలేకరులతో మాట్లాడారు. బొబ్బిలి మండలం రంగరాయపురానికి చెందిన పి.అచ్యుతరావు, పి.తిరుపతినాయుడు, చెల్లారపువలసకు చెందిన సీహెచ్.భాస్కరరావు, పిరిడికి చెందిన జి.వేణుగోపాలనాయుడు, ఇందిరమ్మకాలనీకి చెందిన వై.శ్రీనివాసరావు, వై.భాస్కరరావు, సీహెచ్ సింహాచలం 2016 జూలైలో పని నిమిత్తం మధ్యవర్తి చేతిలో మోసపోయి టర్కీకి బదులు ఇరాన్ వెళ్లారు. ఈ వ్యవహారంలో పలాసకు చెందిన జయరాం అనే వ్యక్తి వారిని మోసం చేశాడు. ఇరాన్ చేరుకున్నాక వారి వద్ద ఉన్న పాస్‌పోర్టులు లాక్కొని అక్కడి కంపెనీ రోజుకు 12గంటలకు పైగా పనిచేయించుకుంది. కానీ, నెలకు రూ.40వేలని చెప్పి రూ.25వేలు మాత్రమే చెల్లించింది. రోజుకు ఒక్కసారే చాలీచాలని తిండి పెట్టేవారని, ఇలా తమను నానా ఇబ్బంది పెట్టిన ఆ కంపెనీ ఢిల్లీకి చెందిన అభయ్ అగర్వాల్‌దేనని వారు తెలిపారు. తమను అంతర్జాతీయ టెర్రరిస్టులుగా ముద్రవేయించి అరెస్టు చేయిస్తామని బెదిరించారని, ఇండియా తిరిగి వస్తామని అనుకోలేదని వారంతా ఆవేదన చెందారు. వాట్సాప్‌లో జిల్లా పాత్రికేయులకు సమచారం అందించడంతో వారు ఇచ్చిన కథనాలకు ప్రభుత్వం స్పందించడంతో తాము క్షేమంగా స్వగ్రామాలకు చేరుకున్నామని తెలిపారు. తమను ఈ నెల 9న ఇరాన్లో విమానం ఎక్కించారని, ఇండియానుంచి 30మంది వెళ్లామని, తొలిబ్యాచ్‌లో 23మందిని పంపి ముంబై చేరుకునేసరికి తమకు రూ.8వేలు అందించారన్నారు. తమ బకాయిలు చెల్లించేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుని మధ్యవర్తి జయరాం, కేబీ ఫెర్రోఎల్లాయిస్‌పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
బొబ్బిలిలో శాస్త్రోక్తంగా ఆయుధ పూజ
-
‘గ్రోత్’లేదు
‘గ్రోత్’ సెంటర్‌పై సర్కారు చిన్నచూపు చిన్నపాటి సమస్యలూ పరిష్కారం కాని వైనం వసూలు కాని ఆదాయ, నీటి పన్నులు వెంటాడుతున్న రిజిస్ట్రేషన్ల సమస్యలు ప్రాంతం : బొబ్బిలి గ్రోత్ సెంటర్ నిర్వహణ : ఏపీఐఐసీ మొత్తం విస్తీర్ణం : 1150 ఎకరాలు ప్లాట్ల కోసం : 868 ఎకరాలు రహదారులు : 143 ఎకరాలు రిజర్వ్డ్ స్థలం : 138 ఎకరాలు ప్లాట్లు : 515 యూనిట్లు : 324 పనిచేస్తున్నవి : 69 నిర్మాణంలో ఉన్నవి : 84 ఖాళీ ప్లాట్లు : 146 బొబ్బిలి : పారిశ్రామికాభివద్ధే ధ్యేయంగా... వేలాదిమందికి ఉపాధి కల్పించాలన్నదే లక్ష్యంగా... ఉత్తరాంధ్రకే తలమానికంగా... రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటైన గ్రోత్‌సెంటర్ ఇప్పుడు తిరోగమన దిశలో ఉంది. సర్కారు చొరవ తీసుకోకపోవడం... సాంకేతిక సమస్యలు పరిష్కరించకపోవడం... మౌలిక వసతులు కల్పించకపోవడం... వంటి సమస్యలు ఇంకా వేధిస్తూనే ఉన్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వనరులు సమకూర్చడంలో ఇంకా వెనుకబడే ఉంది. ఉత్తరాంధ్రలోనే అధిక విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. గ్రోత్ సెంటర్ ఏర్పాటు చేసి దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఏపీఐఐసీ ఉన్నతాధికారులు దష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రోత్ సెంటర్లో మౌలిక సదుపాయాలైన రహదారులు, నీరు, విద్యుత్, పరిపాలనా భవనాల నిర్మాణం కోసం ఇప్పటివరకూ రూ.40 కోట్లు వెచ్చించారు. అయినా పూర్తిస్థాయిలో పరిశ్రమలు రావడం లేదు. 20 ఏళ్ల కి ందట పరిశ్రమల స్థాపనకు వందల ఎకరాల భూమిని తీసుకున్న పారిశ్రామికవేత్తలు నేడు ముందుకు రావడం లేదు. అయితే అధికారులు వారికి నోటీసులు పంపించి గడువు పెంచుతున్నారే తప్ప వారిపై చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఈ పారిశ్రామిక వాడను నిర్వహించడానికి నెలకు సుమారు 3 లక్షల వరకూ ఖర్చు అవుతోంది. అయితే ఇప్పడున్న పరిశ్రమల నుంచి అంతగా ప్రొపర్టీ టాక్స్, నీటి పన్నులు వసూలు కావడం లేదు. మూతపడ్డ తొమ్మిది యూనిట్లు ఇక్కడ పారిశ్రామికవేత్తలంతా ఒక అసోసియేషన్‌గా ఏర్పడి మెరుగైన సేవలు అందుకోవడానికి ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ(ఐలా)ను ఏపీఐఐసీ కొన్నేళ్ల కిందట ప్రవేశపెట్టింది. దాన్ని ఇంతవరకూ అమల్లోకి తేలేదు. ప్రస్తుతం గ్రో™Œ సెంటర్లో 9 యూనిట్లు మూత పడ్డాయి. ఇప్పుడు కొనసాగుతున్న యూనిట్ల నుంచి కూడా పన్నుల రూపేణా దాదాపు కోటి 50 లక్షల రూపాయల వరకూ వసూలు కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే రెవెన్యూ శాఖ చేసిన తప్పిదం వల్ల ఈ పారిశ్రామికవాడలోని సుమారు 300 ఎకరాలు రెవెన్యూ రికార్డుల్లో ఉండిపోయింది. దీంతో ఆయా భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరగక పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడుతున్నారు. రెగ్యులర్ అధికారి లేక ఇక్కట్లు ఇంత పెద్ద పారిశ్రామికవాడకు కనీసం కమిషనర్‌ను నియమించలేదు. ఇప్పుడున్న కమిషనర్ విజయనగరం నుంచి డిప్యుటేషన్‌పై వస్తున్నారు. దీంతో ఇక్కడ రెగ్యులర్ అధికారి కావాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. హుద్‌హుద్ తుఫాన్ ధాటికి ఇక్కడి రహదారులు పాడయ్యాయి. వాటి మరమ్మతులకు రూ. 40 లక్షలు కావాలని ప్రతిపాదనలు పంపించినా ఇంతవరకు మంజూరుకాలేదు. ఏపీఐఐసీ ౖచైర్మన్ డాక్టర్ కష్ణయ్య మంగళవారం గ్రో™Œ సెంటర్‌ను సందర్శించినా అధికారులు అసలు విషయాలేవీ బయటకు చెప్పలేదు. ఇప్పటికైనా గ్రోత్ సెంటర్లో పూర్తిస్థాయిలో పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
గురుకులంలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
బొబ్బిలి : ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని బొబ్బిలి, తాడిపూడిల్లో ఉండే గురుకుల పాఠశాలల్లో 6,7 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బొబ్బిలి గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ ఎ. దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండేళ్ల పాటు గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. తల్లిదండ్రుల వార్షికాదాయం ఏడాదికి రూ. 60 వేలు మించకూడదని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 30లోగా గురుకులంలో అందజేయూలన్నారు. అర్హత గల వారికి ఆగస్టు 10న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. బొబ్బిలి గురుకులంలో ఆరో తరగతిలో ఓసీ-1, బీసీ-ఏ-1, ఎస్సీ-4, ఎస్టీ-1, ఏడో తరగతిలో ఓసీ-2, పీహెచ్సీ-2, బీసీ-బీ-1, బీసీ-ఈ-1, ఎస్సీ-1 ఖాళీలున్నాయన్నారు. తాటిపూడి బాలికల గురుకుల పాఠశాలలో ఆరో తరగతిలో ఎస్సీ-1, బీసీ-బీ-1, 7వ తరగతిలో ఓసీ-3, ఎస్సీ -2, బీసీ-బీ-1, ఎక్స్ సర్వీస్మన్ ఒక ఖాళీ ఉందన్నారు. వివరాలకు 98665 59614 నంబర్‌ను సంప్రదించాలన్నారు. -
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బొబ్బిలి : దాసరి వీధిలో నివసిస్తున్న బీటెక్ విద్యార్థి తెంటు మురళి (18) శనివారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఉరికి వేలాడుతున్న మురళిని చూసిన ఇరుగుపొరుగు వారు వెంటనే స్పందించి హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. మురళి కోమటిపల్లిలోని స్వామి వివేకానంద కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి రాంబాబు బాడంగి స్కూలులో సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్నారు. తల్లి పార్వతి, అన్నయ్య వెంకటేష్‌లున్నారు. ఏఎస్ఐ నాగేశ్వరరావు శవపంచనామా నిర్వహించి శవపరీక్షకు తరలించారు. మురళి మృతి సమాచారం తెలిసిన సహ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. -
సందిగ్ధంలో చదువులు
నిక్షేపంలా ఉన్న హాస్టళ్లను ఎత్తేయాలని సర్కారు యోచించింది. ఇందుకోసం ఉత్తర్వులు విడుదల చేయకున్నా... మౌఖికంగా ఎవరినీ చేర్చుకోవద్దని ఆదేశాలిచ్చింది. అందులో చదువుతున్న పిల్లల్ని ఏంచేయాలన్నదానిపై స్పష్టత కనిపించలేదు. ఇప్పుడు ఆ పిల్లలు ఎక్కడ చదవాలన్నదానిపై సందిగ్ధం నెలకొంది. ఇలా పేదపిల్లల చదువులతో సర్కారు ఆటల్ని అంతా ఖండిస్తున్నారు. బొబ్బిలి : జిల్లాలోని 13 సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆయా హాస్టళ్లలో ఎవరినీ చేర్చుకోవద్దంటూ మౌఖికంగా ఆదేశాలిచ్చింది. కానీ ఇప్పటికీ ఉత్తర్వులైతే అధికారికంగా విడుదల కాలేదు. ఇదే ప్రస్తుతం అక్కడి విద్యార్థుల చదువులను ప్రశ్నార్థకం చేస్తోంది. హాస్టల్ మూసేస్తే ఇప్పటివరకూ అందులో ఉన్న పిల్లల్ని ఎక్కడకు తరలించాలో తెలీక వార్డెన్లు సతమతమవుతున్నారు. ఇక్కడినుంచి తరలించాక వారికి పాఠశాలలు అందుబాటులో ఉంటాయో లేవోనని పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. క్రమేపీ హాస్టళ్ల మూసివేత ఇప్పటికే గత ఏడాది జిల్లాలో మొత్తం 11 హాస్టళ్లను మూసివేశారు. ఈ ఏడాది 13 వసతి గృహాలను ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక మిగిలిన వాటిని రెండేళ్లలో మూసేయాలని అప్పుడు సర్కారుకు ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. ఈ ఏడాది ఎత్తేవేసే వసతి గృహాలకు సంబంధించి ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఏ క్షణాన్నైనా అదేశాలు వస్తే మధ్యలో పాఠశాలలు మారినప్పుడు ఇబ్బందులు వస్తాయని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. సందిగ్ధంలో నాలుగో తరగతి ఉద్యోగులు ప్రతీ వసతి గృహంలో నలుగురు ఉద్యోగులు ఉంటారు, వారిలో మేట్రిన్, వార్డెన్లు ఉద్యోగులు కాగా, మిగిలిన ముగ్గురు ఔట్ సోర్సింగు -
వసతిగృహానికి విద్యార్థులు కావలెను!
బొబ్బిలి : జిల్లాలో ఎస్సీ కళాశాల విద్యార్థుల కోసం అధికారులు వసతి గృహాలు సిద్ధం చేసుకుని ఎదురుచూస్తున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఇదేదో తాజాగా చూసే ఎదురుచూపులు కావు. 11 ఏళ్లుగా సాగుతున్న నిరీక్షణ. జిల్లాలోని కాలేజీల్లో చదివే ఎస్సీ విద్యార్థుల కోసం 2005లో 20 వసతి గృహాలను ఏర్పాటు చేశారు. వాటిలో ఏడు వసతి గృహాలు మాత్రమే ప్రారంభమై నడుస్తున్నాయి. ప్రస్తుతం విజయనగరం జిల్లా కేంద్రంలో నాలుగు, బొబ్బిలిలో రెండు, ఎస్.కోటలో ఒక వసతి గృహం చొప్పున ఉన్నాయి. వీటిలో దాదాపు 700 మంది వరకూ విద్యార్థులున్నారు. జిల్లాలో ఎస్సీ బాలురు, బాలికల వపతి గృహాలను ఏర్పాటు చేసి వాటిలో కనీసం వంద మంది వరకూ వసతి కల్పించాలని నిర్ణయించారు. 2005లో మంజూరైన ఈ వసతి గృ హాలను ఎస్.కోటలో రెండు, కొత్తవలసలో రెండు చొప్పున ఏర్పాటు చేశారు. వాటిలో 30 మంది వరకూ విద్యార్థులు చేరి కొన్నాళ్లు ఉండి మళ్లీ మానేశారు. దాంతో ఆ నాలుగింటిని కూడా ఎత్తేశారు. అలాగే గజపతినగరం, సాలూరులలో ఒక్కొక్కటి, చీపురుపల్లిలో రెండు హాస్టళ్లు చొప్పున ఏర్పాటు చేశారు. అవి కూడా ఎన్నాళ్లూ ఉండలేదు. విద్యార్థులు చేరకపోవడం ఒక కారణమైతే.. మరో వైపు భవనాల సమస్య ఉంది. వసతి గృహాల కోసం ప్రైవేటు భవనాలు ఏవీ దొరకకపోవడంతో ఇబ్బందులు మరీ ఎక్కువవుతున్నాయి. ఇరుకైన గదుల్లో ఉండలేక విద్యార్థులు ఇంటిముఖం పడుతున్నారు. ప్రాథమిక స్థాయిలో ఉండే హాస్టల్స్‌ను ప్రభుత్వం ఎలాగూ ఎత్తివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక ఆ భవనాలనైనా వినియోగించుకుని కళాశాల వసతి గృహాలను పునరుద్ధరించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. -
అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
బొబ్బిలి: పట్టణంలోని ఎనిమిదో వార్డుకు చెందిన అంగన్వాడీ కార్యకర్త, సెక్టార్ లీడర్ నక్కాన కృష్ణవేణి శనివారం రాత్రి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఇంట్లో పురుగుమందు తాగి అచేతనంగా పడి ఉన్న ఆమెను సహచర కార్యకర్తలు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే... కృష్ణవేణి సీడీపీఓను అడ్డం పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతోందని కొందరు కార్యకర్తలు ఆర్డీడీకి ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై ఐసీడీఎస్ అధికారులు సోమవారం విచారణ జరపనున్నారు. ఇదిలా ఉంటే మూడు రోజులుగా సీడీపీఓ సుశీల ఫిర్యాదు చేసిన కార్యకర్తలను కార్యాలయానికి పిలుపించుకుని కృష్ణవేణికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని హెచ్చరిస్తోందని సమాచారం. ఇందులో భాగంగానే శనివారం సాయంత్రం కూడా కొంతమంది కార్యకర్తలను పీఓ పిలిపించుకుని విచారించింది. ఆ సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్యకర్త కృష్ణవేణిని పక్కనే కూర్చోబెట్టుకోవడం వివాదానికి దారితీసింది. కృష్ణవేణిని పక్కనే కూర్చోబెట్టుకుని తమను భయబ్రాంతులకు గురిచేయడంపై కార్యకర్తలు శ్రీదేవి, రోజా, కల్యాణి, విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకుని, కార్యకర్తలను ఎందుకు పిలిపించారని సీడీపీఓను అడగ్గా, సోమవారం నాటి విచారణకు నోటీసులు అందివ్వడానికి పిలిపించానని బదులిచ్చింది. అయితే ఈ వ్యవహారం వల్ల తన పరువు పోయిదని భావించిన కృష్ణవేణి ఒక్కసారిగా బయటకు వచ్చి ఇంటికి పరుగుతీసింది. అక్కడి వ్యవహారం బట్టి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని కొంతమంది కార్యకర్తలు వెనుక అనుసరించారు. ఇంటికి వెళ్లిన కృష్ణవేణి పురుగు మందు తాగడంతో సహచరులు ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భూముల ధరల్లో గ్రోత్
బొబ్బిలి : బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌లోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో రూ. 840లున్న స్వ్కేర్ మీటరు ధర రూ. 950లకు పెంచారు. దీనికి సంబంధించి ఏపీఐఐసీ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బొబ్బిలిలో 1996లో 1,150 ఎకరాల విస్తీర్ణంలో గ్రోత్‌సెంటర్ ప్రారంభించారు. ఫేజ్-1, ఫేజ్-2ల్లో దాదాపు 850 ఎకరాల్లో ప్లాట్లు వేసి పరిశ్ర మలకు కేటాయించారు. స్థలాలకు డిమాండ్ పెరుగుతున్నప్పుడల్లా ఏపీఐఐసీ అధికారులు ధరలు పెంచుతున్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఇక్కడ ధరలు పెంచడం ఇదే మొదటి సారి. భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌లో కూడా ధరలు పెంచాలని నిర్ణయించి నాలుగు నెలలుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని నిలిపివేశారు. భూముల ధరలను పెంచుతూ ఉత్తర్వులు వెలువడగానే ఆన్‌లైన్‌ను కూడా ఓపెన్ చేశారు. ప్రస్తుతం బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌లో 51 ప్లాట్లు పారిశ్రామికవేత్తల కోసం ఖాళీగా ఉన్నాయి. దాదాపు 76.42 ఎకరాల విస్తీర్ణంలో ఖాళీ భూములున్నాయి. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల కోసం గతంలో కేటాయించిన స్థలాలు తీసుకోవడానికి ఆయా వర్గాలు ముందుకు రాకపోవడంతో వాటిని కూడా జనరల్ కేటగిరీ మార్చారు. జిల్లాలోని కంటకాపల్లి ఏపీఐఐసీ భూముల ధర ప్రస్తుతం స్క్వేర్ మీటరు రూ. 350 లుంది. అక్కడ 19 ఎకరాల స్థలం కేటాయించేందుకు సిద్ధంగా ఉంది. నెల్లిమర్లలో స్క్వేర్ మీటరు ధర రూ. 1120లుంది. అక్కడ 1500 స్క్వేర్మీటర్ల ఏకండీ ప్లాట్ కేటాయించేందుకు సిద్ధంగా ఉంది. అలాగే విజయనగరంలోని పరిశ్రమల వాడలో స్క్వేర్ మీటరు ధర రూ. 3360లుంది. మరో రెండు పారిశ్రామికవాడలు ప్రస్తుతం జిల్లాలో ఉన్న నాలుగు పారిశ్రామికవాడలు కాకుండా మరో రెండు కొత్తగా రానున్నాయి.. గజపతినగరం సమీపంలో మరుపల్లి వద్ద 80 ఎకరాల్లో ఫుడ్ పార్కు ఏర్పాటు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబందించి స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. మరో నెల రోజుల్లో ఏపీఐఐసీ చేతికి ఆయా భూములు రానున్నాయి. రామభద్రపురం మండలం కొట్టక్కి వద్ద 187 ఎకరాల్లో ఆటోనగర్ ఏర్పాటు చేయనున్నారు.. దీని కోసం ఇప్పటికే స్థలాలను కేటాయించేశారు. బీసీలకూ రాయితీ కల్పన పరిశ్రమల కేటాయింపులో బీసీలకు కూడా రాయితీలు కల్పిస్తూ ఏపీఐఐసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఎస్సీ, ఎస్టీలకు 33 శాతం రాయితీ ఉండేది. ఇప్పుడు ఆ జాబితాలోకి బీసీలను కూడా చేర్చింది. 33 శాతం రాయితీని 50 శాతానికి పెంచింది. 50 శాతంగానీ, రెండు లక్షల రూపాయల వరకూ గానీ రాయితీని కల్పించనున్నారు. లీజుకు చెల్లుచీటీ... ఏపీఐఐసీలో ఇప్పటివరకూ లీజు పద్ధతిలోనే భూములు కేటాయించేవారు. ఇకపై డెరైక్టు అమ్మకాలకు తెర తీశారు. ఇప్పటివరకూ స్థలానికి దరఖాస్తు చేసుకున్న వారికి స్థలాన్ని కేటాయిస్తే దానిని అభివృద్ధిచేశాకతరువాత పదేళ్లకు వారి పేరు సేల్ డీడ్ జరిగేది. భూములు కేటాయించిన రెండేళ్ల వరకూ నిర్మాణాలకు అవకాశం కల్పించి, ఆ తరువాత ఎనిమిదేళ్ల పాటు దానిని నిర్వహిస్తే అప్పుడు సేల్ డీడ్ రాసేవారు. ఆ తరువాత 99 ఏళ్లకు పూర్తిగా లీజ్‌కు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు తక్షణమే సేల్ చేసే పద్దతికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ భూములుగా నమోదు బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌లోని దాదాపు మూడువందల ఎకరాల భూములు ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో నమోదవ్వడంతో రిజిష్ట్రేషన్లకు అభ్యంతరాలొస్తున్నాయి. ఇక్కడ ప్లాట్లు తీసుకున్న వ్యాపారవేత్తలు రిజిష్ట్రేషనుకు వెళ్లే సరికి సబ్ రిజిస్ట్రార్ పుస్తకాల్లో అవి ప్రభుత్వ భూములుగా రెవెన్యూ అధికారులు చూపించారు. గతంలోనూ ఇలాంటి సమస్య ఉంటే ఏపీఐఐసీ అధికారులు పరిష్కరించారు. ఇప్పుడు అదే సమస్య ఉత్పన్నమవ్వడంతో వ్యాపారవేత్తలు ఆవేదన చెందుతున్నారు. -
ప్రేమజంటకు పునర్జన్మ
పెళ్లికి అంగీకరించని పెద్దలు నిద్రమాత్రలు వేసుకుని ప్రేమజంట ఆత్మహత్యాయత్నం రక్షించిన సీఐ రవి అమ్మాయి.. అబ్బాయి. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు అడ్డుకోవడంతో కుంగిపోయారు. కలిసి బతకలేనప్పుడు కలిసి చావడమే మంచిదనుకున్నారు. లేఖ రాసి రైలు పట్టాలపై కూర్చున్నారు. కానీ ధైర్యం చాలక నిద్రమాత్రలు వేసుకున్నారు. ఇదంతా ఒక పోలీసు అధికారి గమనించారు. ప్రేమజంటను సకాలంలో ఆస్పత్రికి తరలించి ప్రాణాలను కాపాడారు.. ఇది సినిమా కథ అనుకుంటే పొరపాటే. బొబ్బిలి రైల్వేస్టేషన్లో మంగళవారం రాత్రి జరిగిందీ సంఘటన. బొబ్బిలి సీఐ రవి అందించిన వివరాలివి. బొబ్బిలి: సీతానగరం మండలం రంగంపేట గ్రామానికి చెందిన పోల రవికుమార్, అదే గ్రామానికి చెందిన పెంట శాంతిలు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రవికుమార్ రిలయన్స్‌లో పనిచేస్తుండగా, శాంతి బొబ్బిలిలో డిగ్రీ చదువుతోంది. వేర్వేరు కుటుంబాలు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో కలిసి జీవించలేనప్పుడు కలిసి మరణించాలని ప్రేమికులు నిర్ణయించుకున్నారు. తొలుత పట్టాలపై పడుకుని... ఇద్దరూ మంగళవారం రాత్రి గ్రామం నుంచి బొబ్బిలి రైల్వే స్టేషనుకు చేరుకున్నారు. రైలు పట్టాలపై పడుకొని చనిపోయేందుకు ధైర్యం చాల్లేదు. దీంతో ఒక్కొక్కరు 11 నిద్ర మాత్రలు వేసుకుని రైల్వేస్టేషన్లోనే కూర్చున్నారు. రాత్రి పహరాలో భాగంగా రైల్వే స్టేషన్ వైపు సీఐ రవి వచ్చినపుడు వీరిద్దరూ కనిపించారు. సరిగ్గా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న వారిద్దరినీ విచారించారు. వారు రాసిన లేఖను స్వాధీనం చేసుకుని హుటాహుటిన ఇద్దరినీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రంగంపేటలోని శాంతి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీస్‌స్టేషన్‌కు ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వచ్చినా రవికుమార్ కుటుంబ సభ్యులు రాలేదు. మేజర్లయిన తాము ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని.. రక్షణ కల్పించాలని ఆ యువజంట పోలీసులను వేడుకుంది. పిల్లల ఇష్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని, వారికి అడ్డుపడరాదని శాంతి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేయడంతో కథ సుఖాంతమైంది. మొత్తానికి సీఐ రవి చొరవతో ప్రేమజంటకు చావు తప్పింది. -
రాజుగారూ.. రాజీనామా చేయండి
బొబ్బిలి: వైఎస్ఆర్సీపీ గుర్తుపై గెలిచిన బొబ్బిలి ఎమ్మె ల్యే సుజయ్‌కృష్ణ చిత్తశుద్ది ఉంటే పదవికి రాజీనామా చేసి ప్రజా గౌరవం పొందాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి సవాల్ చేశారు. బొబ్బిలిలో తూముల రాంసుధీర్ ఆధ్వర్యంలో అప్పయ్యపేట రోడ్డులో పార్టీ కార్యాలయాన్ని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో కోలగట్ల మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించాక వైఎస్సార్ సీపీలో బొబ్బిలి రాజులు చేరారు తప్ప... పార్టీని వారు తీసుకురాలేదని పేర్కొన్నారు. కాబట్టి ఆ పార్టీద్వారా దక్కిన పదవిని విడచిపెట్టాల్సిందేనని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు పార్టీకి, ఎమ్మెల్సీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. రాజులు పార్టీ వీడినా పార్టీ మాత్రం చెక్కుచెదరలేదనీ, దాని బలం తగ్గలేదని స్పష్టం చేశారు. రాజులకు ఒకప్పుడు గౌరవం ఉండేదనీ, ఇప్పుడు అది పోయిందని పేర్కొన్నారు. సాలూరు, కురుపాం ఎమ్మెల్యేలు నీతికి మారుపేరు సాలూరు, కురుపాం ఎమ్మెల్యేలు రాజన్నదొర, పుష్ప శ్రీవాణిలు నీతి, నిజాయితీకి మారుపేరని కొనియాడా రు. వారిద్దరి ఆధ్వర్యంలో బొబ్బిలిలో వైఎస్సార్ సీపీ మ రింత అభివృద్ధి చెందుతుందన్నారు. బొబ్బిలి నాయకు లు, కార్యకర్తలకు జిల్లా పార్టీ అండగా ఉంటుందనీ, త్వరలో పట్టణంలో శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామనీ తెలిపారు. కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స మాట్లాడుతూ పార్టీకి ప్రజలుంటే చాలని, నాయకులు అక్కరలేదన్నారు. వైఎస్ఆర్సీపీకి ప్రజాభి మానం ఉందన్నారు. మహారాజుల కాలం పోయిందని, అశోక్ లాంటి వారినే విజయనగరంలో ఓడించి కోలగట్లకు పట్టం కట్టడాన్ని మరచిపోకూడదన్నారు. నేతల్లేకపోయినా కార్యకర్తల అండ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు మాట్లాడుతూ తాము లేకపోతే బొబ్బిలిలో పార్టీయే లేద ని రాజులు భ్రమలు కలిగించారని, కానీ పార్టీ వెంట ఉన్నామని కార్యకర్తలు నిరూపించారన్నారు. జిల్లా కార్యదర్శి డోల బాబ్జీ మాట్లాడుతూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసి పార్టీని వీడిన వారికి ఎన్నికల్లో బుద్ది చెప్పేలా కార్యకర్తలు పనిచేయాలన్నారు. తెర్లాం పార్టీ నాయకుడు మర్రాపు జగన్నాథం మాట్లాడుతూ వైఎస్సార్ సీపీని బొబ్బిలిలో ముందుకు నడిపిస్తామన్నారు. రాజన్న సేవా సమితి వ్యవస్థాపకుడు తూముల రాంసుధీర్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని అమ లు చేయలేదన్నారు. కార్యక్రమంలో విజయనగరానికి చెందిన సుంకరి బాబు, లెంక సత్యం, వినోద్ కుమార్ దుబే, ట్రేడ్ యూనియన్ నాయకుడు నాగరాజు, స్థానిక నాయకులు చంద్రంపూడి రమేష్, బొమ్మి అప్పలనాయుడు, కోల బాలాజీ తిరుపతిరావు, బర్ల వెంకటరమణ యాదవ్, పట్నాన శంకరరావు, వై.సి.హెచ్.జి.రంగారావు, గర్బాపు దాలయ్య, చోడిగంజి రాజగోపాలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నం
బొబ్బిలి : మండలంలోని జగన్నాథపురం గ్రామంలో ఓ విద్యార్థినిపై యువకుడు లైంగిక దాడికి యత్నించిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని గుడివాడ కాలనీకి చెందిన పదోతరగతి విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన కడగల సంతోష్‌కుమార్ లైంగిక దాడికి యత్నించగా ఆమె కేకలు వేయడంతో యువకుడు పరారయ్యాడు. ఈ మేరకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, బాలికను వైద్య పరీక్షలకు పంపుతున్నట్లు ఎస్ఐ ఎస్ అమ్మినాయుడు తెలిపారు. -
చెట్టును ఢీకొట్టిన స్కార్పియో: ముగ్గురి మృతి
బొబ్బిలి: స్కార్పియో చెట్టును ఢీకొనగా ముగ్గురు అక్కడికక్కడే మృత్యవాత పడ్డారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లి వద్ద బుధవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. విశాఖకు చెందిన కొందరు స్కార్పియో వాహనంలో విజయనగరం జిల్లాలో జరిగిన పెళ్లి వేడుకలో హాజరై వస్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టుకు ఢీకొంది. ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా తీవ్రంగా గాయపడిన నలుగురిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
తాగునీటికి ప్రాధాన్యం
బొబ్బిలి: పట్టణాల్లో తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని, అందుకు 14వ ఆర్థిక సంఘం నిధులను వెచ్చించాలని మున్సిపల్ ఆర్డీ ఆశాజ్యోతి ఆదేశించారు. పట్టణంలోని పార్కు అభివద్ధి పనులను ఆమె బుధవారం పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇవ్వాలన్నారు. పైపులైన్ లీకులను అరికట్టాలని సిబ్బందికి సూచించారు. 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులు ఇంకా పెండింగ్‌లో ఉంటే 14వ ఆర్థిక సంఘం నిధులతో పూర్తిచేయాలని కోరారు. బొబ్బిలి మున్సిపాలిటీలో చేపడుతున్న అభివద్ధి పనులు మిగతా మున్సిపాలిటీలకు ఆదర్శంగా ఉన్నాయన్నారు. శ్మశానాల అభివద్ధి, ప్రధాన కూడళ్లలో రహదారుల అభివద్ధి చేసి ప్రజలకు ఉపయోగ పడేలా సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు. పార్కు వద్ద వాకింగ్ ట్రాక్, బోటు షికారు, స్కేటింగ్ స్థలం ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఆహ్లాదం కలుగుతుందన్నారు. ప్రస్తుతం చేపడుతున్న అభివద్ధి పనులను చైర్ పర్సన్ తూముల అచ్యుతవల్లితో చర్చించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హెచ్ శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తి పన్ను వసూలులో ఫస్ట్
పన్నుల వసూలులో బొబ్బిలి పురపాలక సంఘం సత్తాచాటింది. రాష్ర్టస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి 98.81 శాతం పన్నులు వసూలు చేసి శెభాష్ అనిపించుకుంటున్నారు. బొబ్బిలి: పట్టణాల్లో ఆస్తి పన్ను వసూలులో బొబ్బిలి పురపాలక సంఘం ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో అన్ని పురపాలక సంఘాల్లో కంటే బొబ్బిలిలో ఈ ఏడాది 98.81 శాతం పన్నులు వసూలు చేశారు. ఏటా మార్చి నెలకు పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. కోర్టు కేసులు, ప్రభుత్వ భవనాలు వంటి కారణాలతో వసూలులో జాప్యం ఉంటుంది. అయినా బొబ్బిలిలో మాత్రం 98 శాతం దాటి పన్నులు వసూలు చేయడంతో ఉద్యోగులను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. కమిషనర్ హెచ్.శంకరరావు, ఆర్వో రమేష్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ఇలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేసి లక్ష్యాన్ని చేరుకున్నారు. లక్ష్యం రూ.4.72 కోట్లు.. సాధించింది రూ.4.66 కోట్లు పట్టణంలో 11,767 ఇళ్లు ఉన్నాయి. వాటి ద్వారా 4 కోట్ల 72 లక్షల రూపాయలు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాటిలో రూ.4 కోట్ల 66 లక్షలు వసూలు చేసి 98.81 శాతంతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచా రు. ప్రతి వార్డుకు కొన్ని బృందాలను నియమించి బకాయిలు లేకుండా పూర్తిస్థాయిలో పన్నులు వసూలు చేశా రు. మొండి బకాయిదారుల వద్దకు కమిషనర్ శంకరరావుతో పాటు అధికారులు వెళ్లి అవగాహన కల్పించి అక్కడికక్కడే వసూలు చే శారు. ప్రత్యేక వ్యాను ద్వా రా ఉద్యోగులు ఊరంతా తిరిగి మైక్ ద్వారా ప్రచారం చేసి వసూలు చే యడంలో సఫలీకృతమయ్యారు. ఏటా మార్చి నెలాఖరు న పన్ను చెల్లింపుల్లో వడ్డీ రాయితీ ఇవ్వడం ప్రభుత్వం అలవాటు చేసింది. రెండేళ్లుగా ఆ పద్ధతి లేకపోవడంతో ఆఖరి నిమిషం వరకూ బకాయిదారులకు, ఆశతో ఉండేవారికి మున్సిపల్ ఉద్యోగులు కల్పించారు. అలాగే బకాయిలు కట్టడానికి పదే పదే తిప్పుతున్న వారింటికి వెళ్లి దండోరా మంత్రం ప్రయోగించడం కూడా ఫలితమిచ్చింది. సమష్టి కృషికి ఫలితమిది... బొబ్బిలి పురపాలక సంఘ ఉద్యోగుల సమష్టి కృషికి ఫలితమిది. లక్ష్యాలను ముందు నుంచి చేరుకోవాలని ప్రణాళిక ప్రకారం వెళ్లాం. రాత్రింబవళ్లు కష్టపడ్డాం. రాజకీయ నాయకులు పన్నులు చెల్లించడానికి పూర్తిగా సహకరించారు. పట్టణ ప్రజలు కూడా పన్నుల చెల్లింపునకు ముందుకొచ్చారు. -హెచ్.శంకరరావు, కమిషనర్, బొబ్బిలి -
దేవాలయ భూముల ఆక్రమణపై ఫిర్యాదు
బొబ్బిలి : ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేవాదాయశాఖ ఆస్తుల పరిరక్షణ సెల్ పరిధిలోని దేవాలయ భూముల్లో ఆక్రమణలు చేసిన వారిపై ఆయా ఆర్డీఓలకు ఫిర్యాదులు చేస్తున్నట్లు సెల్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఎన్.సత్యనారాయణ అన్నారు. మంగళవారం బొబ్బిలి వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకూ ఈ సెల్ ఉందన్నారు. ఆక్రమణకు గురైన దేవాలయ భూములపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని రామతీర్థాలకు చెందిన 750 ఎకరాల భూమిని దన్నానపేట, తంగుడుపల్లి గ్రామస్తులు అనుభవిస్తుండంతో అక్కడ సర్వే జరిపామని పేర్కొన్నారు. దేవాదాయ భూముల్లో అనధికారికంగా సాగు చేస్తే చర్యలు తప్పవని, శిస్తులు చెల్లించాలని స్పష్టం చేశామన్నారు. బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన దాదాపు 476 ఎకరాల భూములను బలిజిపేట మండలం అజ్జాడకు చెందిన రైతులు అక్రమంగా సాగు చేస్తున్నారని చెప్పారు. వీరందరికీ నియమ నిబంధనలు చెప్పామని, బహిరంగ వేలంలో పాల్గొనమని సూచించామని పేర్కొన్నారు. అలా చేయకపోతే దేవాలయాల వద్ద ఫ్లెక్సీలు పెట్టి అనధికారికంగా సాగు చేస్తున్న రైతుల పేర్లను పెడతామని స్పష్టం చేశారు. తాజాగా జీఓల ప్రకారం దేవాలయాల భూముల వివరాలను రిజిస్ట్రేషన్ శాఖకు ఇచ్చామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కరపలో వెంకటేశ్వరస్వామికి చెందిన 25 ఎకరాల భూమి అన్యాక్రాంతమైతే అక్కడ ఆర్డీఓకు ఫిర్యాదు చేశామన్నారు. రాజధాని సమీపంలోని దేవాలయాల భూములపై కూడా దృష్టి సారించాలన్ని ఉందన్నారు. దేవాలయాల్లోని 43 రిజిస్టర్లను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈయనతో పాటు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ పుష్పనాథం తదితరులు పాల్గొన్నారు. -
బాంబు పేలి చిన్నారులకు గాయాలు
బొబ్బిలి (విజయనగరం) : ఆటవస్తువులా భావించి ఇద్దరు చిన్నారులు బాంబుతో ఆడుకుంటుండగా అది పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరావుపేటలో శనివారం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్న గౌరీ శంకర్(11), ఆరో తరగతి చదువుతున్న పెరుగు స్వామి(12)లు స్కూల్లో ఆడుకుంటున్న సమయంలో బాంబు దొరికింది. వారు దాన్ని ఆట వస్తువుగా భావించి ఇంటి వద్దకు తెచ్చుకుని ఆడుకుంటుండగా ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
ఉపాధి కోసం వెళ్లి.. విగతజీవిగా తిరిగొచ్చాడు!
బొబ్బిలి: ఉపాధి కోసం ఊరొదిలి వెళ్లాడు. చివరికి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. మూడు రోజులపాటు శిక్షణ కూడా తీసుకున్నాడు. జాయినింగ్ ఆర్డర్స్ తీసుకోవాల్సిన రోజునే మృత్యువు అతడిని కబళించింది. బొబ్బిలి పట్టణం దావాలవీధికి చెందిన కింత లి శ్రీనివాసరావు (38) హైదరాబాద్ లో మూడు రోజుల కిందట వాహనం ఢీకొని మృత్యువాత పడ్డాడు. రిటైర్డు హెచ్ఎం కింతలి భాస్కరరావు కుమారుడైన శ్రీనివాసరావు ఐటీఐ పూర్తి చేశాడు. అనంతరం డీఎస్సీకి ప్రిపేరయ్యాడు. సరిపడా ర్యాంకు రాకపోవడంతో.. వేరే ఉపాధి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ క్రమంలో హైదరాబాద్‌లోని మెగా ఇంజినీరింగ్ ఇన్ఫోస్ట్రెక్చర్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దాని కోసం ఈ నెల 17న బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నాడు. అక్కడ మూడు రోజుల పాటు శిక్షణ తీసుకున్నాడు. సోమవారం జాయినింగ్ ఆర్డర్స్ ఇస్తారని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. ఆదివారం సినిమాకు వెళ్లి తిరిగొస్తుండగా.. రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు. శ్రీనివాసరావు మృతి చెందినట్లు బొబ్బిలిలో ఉంటున్న కుటుంబ సభ్యులకు సోమవారం సమాచారం అందింది. అతని మృతదేహాన్ని బుధవారం బొబ్బిలికి తీసుకువచ్చారు. కాగా, మృతుడు శ్రీనివాసరావుకు భార్య మణి, కుమారుడు హర్షిత్ ఉన్నారు. ఉపాధి కోసం వెళ్లి విగతజీవిగా తిరిగిరావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. -
జగన్‌తో సుజయ్ భేటీ
బొబ్బిలి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు శనివారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో పార్టీ కార్యాలయంలో కలిసిన వీరు విజయనగరం జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, జిల్లాలోని టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలు, అవినీతి, అక్రమాలపై చర్చించారు. అర్హత ఉన్నా పింఛన్లు రాకపోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లున్న పంచాయతీలకు ఉపాధి పనులకు అధికారులకు అంచనాలు తయారు చేయకపోవడం వంటి అంశాలను చర్చించారు. వాటిపై పార్టీ పరంగా చేస్తున్న ఆందోళన కార్యక్రమాల గురించి జగన్‌కు సుజయ్ వివరించారు. -
స్పీడున్నోళ్లకు బ్రేక్!
జిల్లాలో ఎక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగినా అందుకు ప్రధాన కారణం మితిమీరిన వేగమే. కొందరు వాహనచోదకులు నిర్లక్ష్యంగా అతి వేగంతో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. అలాంటి వారి ఆటకట్టించేందుకు పోలీసులు నడుంబిగించారు. వాహన వేగ పరిమితిని గుర్తించేందుకు అధునాతన పరికరంతో కూడిన వాహనాన్ని జిల్లాకు తీసుకొచ్చారు. బొబ్బిలి : మితిమీరిన వాహనాల వేగానికి ఇక కళ్లెం పడనుంది. రోడ్డు భద్రతకు విఘాతం కలిగిస్తూ అనేక మంది ప్రాణాలు తీసుకుంటున్న అతి వేగాన్ని నియంత్రించేందుకు జిల్లా పోలీసు శాఖ నడుం బిగించింది.. రహదారులపై వాహన వేగం పరిమితి, దానిని అధిగమించి వస్తున్న వాహనాలను గమనించి సంబంధిత వాహనచోదకులకు ఆటోమేటిక్‌గా చలానా ఇచ్చే ఆధునిక పద్ధతిలతో కూడిన ఇంటరిసెప్టర్ వాహనాన్ని గురువారం జిల్లాలోని బొబ్బిలికి తీసుకొచ్చారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఒకే వాహనం ఉన్నా మరికొద్ది రోజుల్లో జిల్లాకు పూర్తిస్థాయి వాహనాన్ని తీసుకురానున్నారు. బొబ్బిలి గ్రోత్‌సెంటరులో ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడిన నేపథ్యంలో వాహనాన్ని ఇక్కడికి తీసుకొచ్చి వాహనాల వేగాన్ని పరీక్షించారు. దాదాపు సగం వాహనాలు నిర్ణీత వేగానికి మించి రావడం గమనార్హం. అవన్నీ ఇంటరిసెప్టర్ వాహన కెమెరాకు చిక్కాయి. అధిక వేగంతో వెళ్తున్న వారికి అక్కడికక్కడే చెలానాలు ఇచ్చి అపరాధ రుసుం వసూలు చేశారు. వేగాన్ని కొలిచే యంత్రం.. పోలీసు వాహనం లోపలే ఈ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. సుమారు అరకిలో మీటరు దూరం నుంచి వాహన వేగాన్ని ఇది పరిగణనలోకి తీసుకుంటుంది. ఆ రహదారిపై ఎంత వేగంతో ప్రయాణించవచ్చో ముందుగానే రికార్డు చేస్తారు. అది దాటి ఒక్క కిలోమీటరు స్పీడులో వెళ్తున్నా యంత్రం నుంచి బీప్ సౌండ్ ఇస్తుంది. వెంటనే పోలీసులు అప్రమత్తమై వాహనాన్ని నిలిపివేస్తారు. అప్పటికే వాహన నంబరుతో కూడిన ఓవర్ స్పీడ్ చలానా ప్రింట్ వచ్చేస్తుంది. దీని ఆధారంగా 400 రూపాయలకు తక్కువ లేకుండా అపరాధ రుసుం వసూలు చేస్తారు. వాహనంపై పీటీ కెమెరా వాహన వేగంతో పాటు ఎక్కడైనా అల్లర్లు, ఆందోళనలు, వాదనలు జరిగినా వాటిని రికార్డు చేయడానికి వాహనంపై పెన్టిల్ (పీటీ) కెమెరాను అమర్చారు. వాహన వేగాన్ని నియంత్రించిన సమయంలో అక్కడికి వచ్చిన వారు ఏదైనా అలజడి చేసినా, వాదోపవాదాలకు దిగినా వెంటనే దీనిని ఆన్ చేస్తారు. సుమారు 3 కిలోమీటర్లు దూరంలో జరిగిన సంఘటనలు దృశ్యాలు, మాటలన్నీ ఈ యంత్రంలో నమోదవుతాయి. ఈ కెమెరా నాలుగు దిక్కులా తిరుగుతూ దృశ్యాలను రికార్డు చేస్తుంది. వీటిని వాహనంలో కూర్చుని ఎల్సీడీలో ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించవచ్చు. హైదరాబాద్‌లో శిక్షణ పొందాం ఆధునిక యంత్ర పరికరాలతో వేగాన్ని నిర్ధారించడానికి సంబంధించి హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు శిక్షణ పొందాం. అనంతరం విజయనగరంలోనూ శిక్షణ తీసుకున్నాం. -సీహెచ్‌వీఎస్ నారాయణ, కానిస్టేబుల్, ఏఆర్ విభాగం -
పెళ్లి చేసుకుని వెళ్తుండగా రోడ్డుప్రమాదం
బొబ్బిలి (విజయనగరం జిల్లా) : శనివారం రాత్రి బొబ్బిలిలో పెళ్లి చేసుకుని.. ఆదివారం ఉదయం కారులో ప్రయాణమైన నవదంపతులతో సహా బంధువులు రోడ్డుప్రమాదానికి గురయ్యారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో వివాహం అనంతరం ఆదివారం తెల్లవారుజామున పెళ్లి బృందం కారులో ప్రయాణమైంది. అయితే బొబ్బిలి శివార్లలో ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొని పెళ్లి కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఎం. అప్పలనాయుడు(40) అక్కడికక్కడే మృతిచెందగా.. కారులో ఉన్న నవదంపతులతో సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు రొంపెల్లి గ్రామానికి చెందినవాడుగా గుర్తించారు. గాయపడినవారిని బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
పండు అనుకునేరు... మండుద్ది!
ఈ మొక్కకు ఉన్న కాయలు చూడండి... అచ్చం ద్రాక్షపళ్లలా లేవూ... చూడడానికి అలా ఉన్నాయి కదాని తింటే... గూబ గుయ్యిమంటుంది... ఎందుకంటే ఇవి మిరపకాయలు...ఆశ్చర్యంగా ఉందా...నిజమే. ఇవి విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం ఎం.బూర్జవలస పంచాయతీ గున్నతోటవలస గ్రామానికి చెందిన తాడ్డిరామకృష్ణ పెరట్లో పెరుగుతున్నాయి. వృత్తి రీత్యా కార్మికుడైన ఆయన మొక్కల ప్రేమికుడు. ఆయన మొక్కలను పెంచడమేగాదు... వాటిని అందరికీ పంపిణీ చేసి వారిని ప్రోత్సహిస్తుంటారు. ఎక్కడో పెరిగిన ద్రాక్షపండ్లలాంటి నల్లమిరపకాయలను తీసుకువచ్చి ఇంట ముంగిటవేశారు. విచిత్రంగా కనిపిస్తున్న ఈ మిరపకాయలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. కొందరు ఆయన దగ్గరనుంచి తీసుకెళ్లి వారి పెరట్లోనూ నాటుకున్నారు. - బొబ్బిలి రూరల్ -
'వరి రైతులకు న్యాయం చేయాలి'
బొబ్బిలి రూరల్ (విజయనగరం జిల్లా) : ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో తెరచి రైతులకు న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు డిమాండ్ చేశారు. సోమవారం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కారాడ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. రైతులు విక్రయించిన వరి ధాన్యానికి సత్వరమే చెల్లింపులు చేయాలని కోరారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నవంబర్లోనే తెరిచి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదన్నారు. వచ్చే సీజన్లో అయినా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఉపాధ్యాయుల సమస్యలపై దశలవారీ పోరు
ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సదాశివరావు బొబ్బిలి రూరల్ : విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలపై దశలవారీ పోరుకు సిద్ధం కావాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎ.సదాశివరావు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్జీవో హోంలో బుధవారం ఏపీటీఎఫ్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఏపీటీఎఫ్ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా సదాశివరావు మాట్లాడుతూ ప్రభుత్వం సర్వీస్ రూల్స్, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, ఖాళీల భర్తీ ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా నేటివరకు నెరవేర్చలేదని చెప్పారు. నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రారంభించి నాలుగేళ్లు అవుతున్నా అరకొరవసతులతో ఇబ్బంది పడుతున్నామన్నారు. పనిభారంతో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులు మొక్కలు నాటించడం, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పడం సమంజసం కాదన్నారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలపై జనవరి 5, 6, 7తేదీలలో తాలూకా కేంద్రాల వద్ద, జనవరి 28న జిల్లా కేంద్రాల్లో, ఫిబ్రవరి రెండో వారం నుంచి విజయవాడలో నిరవధిక ధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.ఈశ్వరరావు మాట్లాడుతూ పాఠశాలల్లో పనిభారం, ఒత్తిడి తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు జేసీ రాజు, డి.వెంకటనాయుడు, బీకేఎం నాయుడు, ఎన్వీ పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘అంగన్వాడీల సమస్యలపై పోరాడతాం’
బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలిలో మంగళవారం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన దీక్షలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుజయరంగారావు మద్దతు ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను తమ పార్టీ తరఫున ప్రస్తావిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బొబ్బిలిలో ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు దీక్షలు చేపట్టారు. వేతన పెంపు జీవో వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వారు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు కొనసాగిస్తున్న విషయం విదితమే. -
కౌన్సిల్లో తెలుగు తమ్ముళ్ల వాగ్వాదం
బొబ్బిలి: నాలుగు గోడల మధ్య జరగాల్సిన చర్చకు కౌన్సిల్ సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు.మున్సిపాలిటీలో ఇంజినీరింగు, కాంట్రాక్టర్ల మధ్య అంతర్గతంగా జరుగుతున్న యుద్ధం అధికార పార్టీలో చిచ్చు రేపింది. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు బాణాలు విసురుకుంటూ వారి మధ్య ఉండే అంతరాలను మ రింత దూరం పెంచారు. ఈ నెలలో మున్సిపల్ డీఈతో కాంట్రాక్టరు దిబ్బ గోపీ వాగ్వాదానికి దిగారు. చేసిన పనులకు ఇంజినీరింగు అధికారులు చెల్లింపులు చేయడం లేదని, కొంత మంది కాంట్రాక్టర్లకు పెద్దపీట వేసి వెంటనే బిల్లుల చెల్లింపులు చేస్తున్నారంటూ వాదనకు దిగారు. దీంతో ఈ వివాదాన్ని చల్లార్చడానికి అధికార పార్టీ నాయకులు, పాలకులు రంగంలోకి దిగారు. అయితే దీనికి శాశ్వత పరిష్కారం కోసం కౌన్సిల్ సభ్యులు వారి అభిప్రాయాలను చెప్పాలని, ఇప్పటివరకూ జరిగిన విషయాలను డీఈ రమేష బెహ రా వివరిస్తారని కౌన్సిల్లో చర్చకు మున్సిపల్ చైర్పర్సన్ తూముల అచ్యుతవల్లి జీరో అవ ర్లో అవకాశం ఇచ్చారు. దాంతో డీఈ ఇటీవల జరిగిన పరిణామాలను వివరించారు. డీఈ కాంట్రాక్టర్ల కోటరీని నిర్వహించడం వల్ల మిగిలిన వారికి అవకాశాలు దొరకడం లేదని, దానివల్లనే వారంతా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని, ప్రజలు, ప్రజాప్రతి నిధులు, కాంట్రాక్టర్లకు వేర్వేరుగా సమయాలను కేటాయించాలని 7వ వార్డు కౌన్సిలరు రాంబార్కి శరత్ అన్నారు. దాంతో వైస్ చైర్మన్ చోడిగంజి రమేష్‌నాయుడు సుదీర్ఘంగా మాట్లాడారు. డీఈకి జరిగిన అన్యాయాన్ని సభలో ఉంచారు, కాంట్రాక్టర్ల వివరణ కూడా వినాలని, ఎవరికి ఏది జరిగినా కౌన్సిల్‌ను సంప్రదిస్తే బాగుంటుందనడంతో ఆ సమయంలో 26వ వార్డు కౌన్సిలరు పువ్వల శ్రీనివాసరావు కలుగ జేసుకోవడంతో ఒకరితో ఒకరు వాదోపవాదాలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. అసలు ఈ విషయాన్ని కౌన్సిల్లోనే చర్చించకూడదని పువ్వల అన్నారు. అధికార పార్టీ కౌన్సిలర్లు కూడా అధికారుల తప్పులను ఎత్తి చూపుతూ ప్రతిపక్ష పా త్ర పోషించారు. కాంట్రాక్టర్ల వ్యవహార శైలి వల్ల చివరకు ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని చైర్పర్సన్ అనడంతో ఒకేసారి మిగిలిన వారంతా దానిని ఖండించారు. ఉద్యోగులకు ఆ ఆలోచన రావడం నేరమని కౌన్సిల్ అభిప్రాయపడింది. ఒకవైపు అధికార పార్టీ చైర్పర్సన్, మరో వైపు అదే పార్టీకి చెందిన ఇద్దర కౌన్సిలర్లు కాంట్రాక్టర్లు, అధికారుల వ్యవహారశైలిపై చర్చించుకోవడంతో మిగిలిన సభ్యులు ఆసక్తిగా గమనించారు. పనులను ఏ ప్రాతిపదికన కేటాయిస్తున్నారు? బొబ్బిలి పురపాలక సంఘంలో అభివృద్ధి పనుల ఎంపికను ఏ ప్రాతిపదికన నిర్ణయించారని, కౌన్సిలర్లు ఆయా వార్డుల్లో చేయమని ఇచ్చిన వినతులు ఎందుకు పరిగణనలోనికి తీసుకోలేదని వైఎస్సార్సీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడరు రౌతు రామ్మూర్తినాయుడు ప్రశ్నించారు. బుధవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ, అత్యవసర సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు చెందిన వార్డుల్లో పనులను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. 14, 24, 25, 27 వార్డుల్లో పనులు చేయాలని కౌన్సిలర్లు వినతులు ఇచ్చినా వాటిని ఎందుకు పరిగణలోనికి తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం అజెం డాలో ఆన్ లైన్ టెండర్లు అన్నీ తక్కువ శాతానికి, బాక్సు టెండరు పనులన్నీ ఎక్కువ మొత్తానికి దాఖలు చేయడంపై అనుమానాలున్నాయని, పనులన్నీ కాంట్రాక్టర్లు సర్దుకున్నారా అని 7వ వార్డు కౌన్సిలరు రాంబార్కి శరత్ ప్రశ్నించారు. -
ఉత్తరాంచల్ తీసుకెళ్తామన్నారు...
►అమర జవాను భార్య శ్రీవాణి ఆవేదన ► కూంబింగ్‌కు వెళ్లేముందు ఫోన్లో మాట్లాడారని వెల్లడి ► మృతదేహం రావడానికి రెండు రోజులు బొబ్బిలి: ‘మొన్న పుష్కరాల సమయంలో వచ్చి నెలరోజులుండి వెళ్లారు. ఏడాదిలో జమ్మూకాశ్మీర్ నుంచి ఉత్తరాంచల్ వచ్చేస్తాను.. అక్కడికి మిమ్మల్ని తీసుకువెళతానని చెప్పారు.. మొన్న కూంబింగ్‌కు వెళ్తుండగా ఫోన్ చేసి మాట్లాడారు.. తిరిగొచ్చాక మళ్లీ మాట్లాడతానని చెప్పారు.. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది..’ అని జమ్ముకాశ్నీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన ఆర్మీ జవాను బొట్ట సత్యం భార్య శ్రీవాణి విలపించారు. బాడంగి మండలం గొల్లాది గ్రామానికి చెందిన సత్యం (36) ఆదివారం రాత్రి ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించినట్టు అతని స్నేహితుడు, బొబ్బిలికి చెందిన ఆర్మీ జవాను ఈశ్వరరావు బొబ్బిలి ఎరుకుల కాలనీలో నివాసముంటున్న మృతుని భార్య శ్రీవాణి కుటుంబానికి సోమవారం చెప్పారు. దీంతో అటు గొల్లాదిలో, ఇటు బొబ్బిలి ఎరుకులకాలనీలో విషాదం నెలకొంది. సత్యానికి 2002లో ఉద్యోగం రాగా ఆర్మీలో జేసీఓగా పనిచేస్తున్న బి.శ్రీరాములు కుమార్తె శ్రీవాణితో 2005 జూన్ 1న వివాహమైంది. సత్యం గతంలో జమ్ముకాశ్మీర్, ఉత్తరాంచల్, అస్సాం, నాసిక్‌లలో పనిచేశారు. ఏడాది కిందట మళ్లీ జమ్మూకాశ్మీర్‌కు బదిలీ అయ్యారు. మరో ఏడాది పాటు అక్కడ విధులు నిర్వహించాల్సి ఉంది. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు సత్యం మరణవార్త తెలియగానే కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సత్యానికి ఎనిమిదిన్నర ఏళ్ల కొడుకు వివేకానంద, ఏడాదిన్నర కుమారుడు భువన్ ఉన్నారు. భార్య శ్రీవాణి ప్రస్తుతం బొబ్బిలి రాజా కళాశాలలో ఎంఏ (ఇంగ్లిష్) రెండో సంవత్సరం చదువుతున్నారు. పుష్కరాలకు ఇంటిల్లిపాదితో వెళ్లారు.. ఈ ఏడాది రాజమండ్రిలో నిర్వహించిన గోదావరి పుష్కరాల కోసం సత్యం స్వగ్రామానికి వచ్చాడు. దాదాపు నెల రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. కుటుంబ సభ్యులందరితో కలిసి పుష్కరస్నానం చేసి వచ్చారు. జమ్మూకాశ్మీర్‌కు ఆగస్టు 18న బయలుదేరి వెళ్లారు. ఆదమరిపించి ప్రాణాలు తీశారు.. ఆదివారం రాత్రి ఆంద్వారా ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న జవాన్లపై లష్కరేతోయిబా ఉగ్రవాదులు ఆదమరిపించి కాల్పులు జరిపారని అక్కడి వారు చెప్పారని శ్రీవాణి తండ్రి శ్రీరాములు విలేకరులకు తెలిపారు. రాత్రి ఉగ్రవాదుల జాడ కనిపించకపోవడంతో వాగును దాటే ప్రయత్నం చేస్తుండగా వెనుక నుంచి వచ్చి తుపాకులతో కాల్చారన్నారు. సత్యం మృతదేహం నీళ్లలో కొట్టుకుపోయిందన్నారు. సోమవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించారని తెలిపారు. ప్రస్తుతం శ్రీనగర్‌లోని మార్చురీలో మృతదేహం ఉందని, బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి ఇక్కడకు పంపుతారని అక్కడి వారు చెప్పారని తెలిపారు. అయితే ఇప్పటి దాకా అధికారికంగా సమాచారం రాలేదన్నారు. కొడుకును చూడాలని ఉంది.. సత్యం తల్లిదండ్రుల రోదన బాడంగి: అయ్యో.. ఎంత ఘోరం జరిగిపోయింది.. బాబూ.. మా కొడుకును చూడాలని ఉందంటూ.. కాశ్మీర్ ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన ఆర్మీ జవాను సత్యం తల్లిదండ్రులు రాములు, నారాయణమ్మ రోదిస్తున్నారు. తామేమి పాపం చేసుకున్నామో.. కొడుకు ఉగ్రవాదుల కాల్పులకు బలైపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని గొల్లాది గ్రామంలో ఉంటున్న వీరికి కుమారుడి మరణవార్త సోమవారం సాయంత్రం తెలిసింది. అప్పటినుంచి కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు ముగ్గురు కుమారులు ఉండగా రెండో కుమారుడు సత్యంతోపాటు మూడో కుమారుడు వెంకట రమణ కూడా ఆర్మీలో పనిచేస్తున్నాడని వివరించారు. ఇటీవల తనకు పక్షవాతం వస్తే రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు చేసి బతికించాడని రాములు చెప్పారు. సత్యం మరణవార్తతో గ్రామంలో విషాదం అలముకుంది. మృతదేహం రాక కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. -
ఉగ్రవాదుల కాల్పుల్లో బొబ్బిలి జవాన్ మృతి
జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఆదివారం అర్థరాత్రి జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక జవాన్ మృతి చెందాడు. విజయనగరం జిల్లా బాడంగి మండలం గొల్లాది గ్రామానికి చెందిన బొత్త సత్యం(36) సరిహద్దు భద్రతా దళంలో జవాన్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం అర్థరాత్రి ఉగ్రవాదుల దాడిలో మరణించాడని.. కుటుంబ సభ్యులకు సోమవారం మధ్యాహ్నం సమాచారం అందింది. బొత్త సత్యంకు బొబ్బిలికి చెందిన శ్రీవాణితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సత్యం మృతదేహం మూడు రోజుల తర్వాత స్వగ్రామానికి వస్తుందని అధికారులు తెలిపారు. -
ఎన్నికలు సజావుగా ‘సాగే’నా?
బొబ్బిలి : సాగునీటి సంఘ ఎన్నికలు... చాలా కాలం తరువాత జరుగుతున్న ఎన్నికల్లో తమ వారికి పదవులు కట్టబెట్టడానికి చేతులెత్తే విధానం ప్రవేశపెట్టారు. అదే ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు ఇరిగేషన్ అధికారులకు భారంగా మారబోతుంది. ఎన్నికల షెడ్యూల్ మినహా మరే దేనిలోనూ స్పష్టత లేకపోవడంతో ఇరిగేషన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. విజయనగరం జిల్లాలో 437 మైనర్ ఇరిగేషన్, 8 మీడియం ఇరిగేషన్, నాలుగు మేజరు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకూ ఎన్నికల తేదీ మినహా ఎటువంటి సలహాలూ, సూచనలు, ఆదేశాలు వంటివి వెలువడలేదు. దాంతో ఇరిగేషన్ అధికారులు ఎన్నికలకు గ్రామాల్లోకి ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు జరిగే ఎన్నికల కాల పరిమితి లేదు. దాంతో పాటు ఈ సంఘాలకే ఆయా ప్రాజెక్టులు, చెరువులు, సంఘాల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తున్నారు. సాగునీటి వనరులను బాగు చేయడానికి ఇప్పుడు అనేక రకాలైన నిధులు వస్తున్నాయి. ఇవన్నీ ఈ సంఘాల ఆధ్వర్యంలో త్వరలో జరగనుండడంతో ఈ సంఘాలను చేజిక్కించుకోవడానికి అన్ని రాజకీయ పక్షాలూ సిద్ధమవుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ నుంచి ఎవరు పేరును నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, మండల, నియోజకవర్గ నాయకులు సూచిస్తారో.. వారికే ఈ పీఠం అని అనుకుంటున్నారు. అయితే ఆ సంఘాల్లో స్థానం సంపాదించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధపడడం, అవకాశమున్నంత వరకూ కాంగ్రెస్ పార్టీ కూడా రేసులో ఉండడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటివరకూ ఎన్నికలను నీటిపారుదల శాఖ అధికారులే జరిపించాలని ఆదేశాలున్నాయి. అయితే ఓటర్లను ఎలా గుర్తించాలి, ఓటర్లుగా వచ్చిన వారికి ఆధారమేమిటి, వారిని ఎవరు గుర్తిస్తారు వంటివి ఎవరు చేయాలో ఇప్పటివరకూ స్పష్టత లేదు. ఏఈ, డీఈ స్థాయి అధికారులు ఒక్కరే వె ళ్లి ఈ ఎన్నికలు జరిపించుకోవడం సాధ్యమా అనే ప్రశ్న తలెత్తుతుంది. స్థానికంగా రైతులను తెలిసే రెవెన్యూ, పోలీసు అధికారుల సహకారం లేకుండా ఈ ఎన్నికలు జరపడం సాధ్యమా అనే ప్రశ్న వినిపిస్తోంది. అలాగే ఎన్నికల నిర్వహణకు బడ్జెట్ కేటాయింపు, భోజన, వసతి, రవాణా చార్జీలు మాటేమిటని అధికారులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రాజెక్టు కమిటీల్లో స్థానం సంపాదించాలంటే ముందు నీటి సంఘాలకు ఎన్నికల జరిపి గెలవాల్సిన పరిస్థితి ఉండడంతో రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కమిటీలో అధ్యక్షులు, ఉపాధ్యక్షుడుతో పాటు నలుగురు సభ్యులు ఎన్నుకోనున్నారు. ఏకాభిప్రాయంతో ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇవీ ప్రాజెక్టులు, సంఘాలు జిల్లాలోని మేజరు ప్రాజెక్టులు లేకపోయినా జిల్లాలోని వాటి పరిధిలో ఉండే నాలుగు సంఘాలకు ఎన్నికలు జరుపుతున్నారు. తోటపల్లి కుడి కాలువ పరిధిలోని గరుగుబిల్లి మండలంలో రెండు, జియ్యమ్మవలస మండలంలో రెండు సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అలాగే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో 8 సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. విజయనగరం డివిజన్లో ఆండ్ర, తాటిపూడి, డెంకాడ ప్రాజెక్టులుండగా, పార్వతీపురం డివిజన్లో పెద్దగెడ్డ, ఒట్టిగెడ్డ, వెంగళరాయసాగర్, పెదంకలాం, పారాది ఆనకట్టలున్నాయి. అలాగే మైనర్ ఇరిగేషన్ కింద 437 సంఘాలున్నాయి. 7వ తేదీన మొదలు పెట్టి 25వ తేదీలోగా పూర్తి చేయాలి. ముందు మైనర్ ఇరిగేషన్ ఎన్నికలు పూర్తయితేగానీ మిగిలినవి చేపట్టడానికి కుదరదు. సాగునీటి సంఘ ఎన్నికల అధికారుల నియామకం బొబ్బిలి : సాగునీటి సంఘ ఎన్నికలకు అధికారులను నియమించారు. పార్వతీపురం డివిజన్లోని మీడియం ఇరిగేషన్ కింద 12 మండలాల్లో 36 సంఘాలున్నాయి. అలాగే 17 మండలాల్లో 183 సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో తేదీ నాటికి రెవెన్యూ అధికారులు ఓటరు లిస్టులను అందించాలి. ఎన్నికల జరపడానికి వారం రోజుల ముందు ఎన్నికల అధికారులు నోటఫికేషన్ విడుదల చేస్తారు. ఎన్నికల ముందు రోజు దండోరా వేయాలి. మీడియం ఇరిగేషన్ ఎన్నికలన్నీ ఈఈ జీవీ రమణ పర్యవేక్షణలో జరుగుతాయి. ఒక్కొక్క ఎన్నిక డీఈ నేతృత్వంలో జరుగుతాయి. ఒట్టిగెడ్డ జలాశయం ఎన్నికను ఈ నెల 18న మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించనున్నారు..ఈ ప్రాజెక్టు పరిధిలో జియ్యమ్మవలస మండలంలో ఎఈ జీవి రఘు, గరుగుబిల్లి మండలంలో ఎఈఈ బి.శ్రీకాంత్‌లు ఎన్నికలను నిర్వహిస్తారు. వీటికి కురుపాం డిఈ జి.గోపాలకృష్ణ పర్యవేక్షణ చేస్తారు. పెద్దగెడ్డ రిజర్వాయరు పరిధిలో 19వ తేదీన ఉదయం పది గంటలకు ఎన్నికల జరుగుతాయి. పెద్దగెడ్డ డీఈ లక్ష్మి పరిధిలో జరిగే ఈ ఎన్నికలకు సాలూరు మండలానికి ఎఈలు కె.శశిధర్, పాచిపెంట మండలానికి కె.శంకర్, పీవీ సతీష్‌లను నియమించారు. పెదంకలాం ఆనకట్ట పరిధిలో 22వ తేదీన ఉదయం పది గంటలకు ఎన్నికలు జరుపుతారు. వీటిని డీఈ వి.బాలసూర్యం పర్యవేక్షిస్తారు. ఈ ఆనకట్ట పరిధిలో బలిజిపేట మండలంలో ఏఈ టి.వేణుగోపాలరావును ఎన్నికల అధికారిగా నియమించారు. పారాది ఆనకట్ట పరిధిలో 22వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్నికలు జరుపుతారు. ఇవి డీఈ బాలసూర్యం అధ్వర్యంలో జరుగుతాయి,. ఈ ఆనకట్ట పరిధిలో బొబ్బిలి మండలంలో ఎన్నికలకు ఏఈ పి.పురుషోత్తం దొర, బాడంగి మండలంలోని ఎన్నికలకు ఎఈ ఎన్.హరిబాబులను అధికారులుగా నియమించారు. వెంగళరాయసాగర్ జలాశయం పరిధిలో ఈ నెల 23న ఎన్నికలను ఉదయం పది గంటలకు నిర్వహిస్తున్నారు. మక్కువ మండలానికి ఎఈ ఆర్.దారప్పడు, బొబ్బిలి మండలానికి ఎఈ పి.పురుషోత్తం, సీతానగరం మండలానికి ఎఈఈ పి.శ్రీనివాసరావులు ఎన్నికలు నిర్వహించగా, మామిడిపల్లి డీఈ జీబి సుందరరావు పర్యవేక్షిస్తారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
బొబ్బిలి (విజయనగరం) : ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని తిరుగుడి వీధికి చెందిన ఓ విద్యార్థిని ఇంటర్ రెండో ఏడాది చదువుతోంది. కాగా తాను చదివే కాలేజీలోని ఓ లెక్చరర్ పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రేమ పేరుతో ఆమె వెంట తిరిగాడు. తీరా ఇప్పుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆమె ఇంట్లోని టాయిలెట్ క్లీనర్ హార్పిక్ తాగి బలవన్మరణానికి యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
బొబ్బిలి: అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని గొల్లవీధిలో జరిగింది. వివరాలు.. గొల్లవీధికి చెందిన బంగారురాజు(32) అనే వ్యక్తికి మూడేళ్ల క్రితమే వివాహమైంది. అయితే, బంగారురాజుకు గొల్లవీధికే చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కాగా, శుక్రవారం తెల్లవారుజామున ఆ మహిళ ఇంట్లోనే బంగారురాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్ధానికలు సమాచారంతో పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈపాస్‌లో ఫస్ట్‌క్లాస్
బొబ్బిలి: రాష్ట్రంలో అమలు చేస్తున్న ఈ పాస్ విధానంలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జాయింట్ కలెక్టరు బి. రామారావు తెలిపారు. గడచిన నెలలో 80 శాతం వరకూ ఈపాస్ ద్వారా నిత్యావసర సరుకులు ఇవ్వడం వల్ల రాష్ట్రంలో ముందంజ లో ఉన్నామన్నారు. గురువారం బొబ్బిలిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈపాస్ విధానం కోసం ఎంపిక చేసిన రేషన్ కార్డుల శాతం మిగతా జిల్లాల కంటే మన జిల్లాలో ఎక్కువన్నారు. ఈపోస్ కోసం మొత్తం 456 రేషన్ షాపులను ఎంపిక చేయగా వాటిలో 80 శాతానికి పైగా ఈపోస్ విధానం సక్రమంగా అమలు కావడం వలన ముందు వరుసలో నిలిచామన్నారు. ఆన్లైన్లో గత మూడు నెలలుగా జిల్లా ప్రథమంగా నిలిచిందని చెప్పారు. మరో రెండు నెలల్లో జిల్లాలోని 1374 రేషన్ షాపుల్లోనూ ఈ పోస్ విధానాన్ని అమలు చేయనున్నామన్నారు. ఇక నుంచి సిగ్నల్స్ సమస్య లేకుండా డబుల్ సిమ్ యంత్రాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. భూ సమస్యలపై ప్రస్తుతం జరుగుతున్న సదస్సులకు రైతుల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. వీటి వల్ల దాదాపు 80 శాతం భూ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. బుధవారం వరకూ జిల్లావ్యాప్తంగా 7,873 అర్జీలు వచ్చాయని, వీటిపై రెండు నెలల్లో పరిష్కారం చూపిస్తామన్నారు. భూముల వివరాలు కంప్యూటరీకరణ చేసిన దానికి, రికార్డుల్లో ఉన్న దానికి వ్యత్యాసం లేకుండా ఆన్లైన్లో ఎక్కడ నుంచైనా ఆయా భూముల వివరాలు చూసుకునే విధంగా ఈ పద్ధతిని పెట్టామన్నారు. సమావేశంలో పార్వతీపురం ఆర్డీఓ రోణంకి గోవిందరావు కూడా పాల్గొన్నారు. -
'48 పశుగ్రాస కేంద్రాల ఏర్పాటు'
బొబ్బిలి: విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 48 ఇంటిగ్రేటెడ్ లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ సెంటర్లు (సంతానోత్పత్తి, పశుగ్రాస సేవల కోసం) ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు పశుసంవర్థక శాఖ జేడీ సింహాచలం తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో పాల ఉత్పత్తిపై రైతులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో పాల ఉత్పత్తి ప్రస్తుతం 4.49 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా, దాన్ని 4.94 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిపారు. -
నెలాఖరుకు ‘తోటపల్లి’ గల గల
బొబ్బిలి రూరల్ : ఈ నెల మూడో వారం లేదా నెలాఖరుకల్లా తోటపల్లి ప్రాజెక్టు ద్వారా నీటిని వ్యవసాయానికి అందిస్తామని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం.ఎం.నాయక్ తెలిపారు. ఆయన మంగళవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహంతో కలిసి అలజంగి గ్రామం వద్ద తోటపల్లి కాలువ గట్లు, అక్విడెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను వివరించారు. కాలువల్లో మట్టి పడిపోతోందని, పనుల్లో నాణ్యత లేదని తెలిపారు. అనంతరం పనుల వివరాలను ఎస్ఈ తిరుమలరావును కలెక్టర్ నాయక్ అడిగి తెలుసుకున్నారు. కొన్నిచోట్ల పనులు జరుగుతున్నందున అనుకున్న విధంగా ఆగస్టు 15కల్లా నీరు ఇవ్వలేకపోతున్నామని ఆయన విలేకరులకు తెలిపారు. ఈ నెల మూడో వారంలో లేదా నెలాఖరుకు నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. చింతాడ, పిరిడి గ్రామాల్లో కూడా గట్ల మట్టి కాలువల్లో పడిపోతున్న విషయం విలేకరులు ఆయన దృష్టికి తీసుకురాగా చర్యలు తీసుకుంటామన్నారు. వీరివెంట తోటపల్లి ఎస్ఈ తిరుమలరావు, క్వాలిటీ కంట్రోల్ అధికారులు, నీటిపారుదల శాఖ డీఈలు, ఏఈలు ఉన్నారు. ఉభయ జిల్లాల కలెక్టర్లు తెర్లాం మండలం చిన్నయ్యపేట, బాడంగి మండలం అల్లుపాల్తేరు వద్ద తోటపల్లి అక్విడెక్ట్ పనులను కూడా పరిశీలించారు. -
సెల్ టవర్ల ఏర్పాటుపై ఆందోళన
బొబ్బిలి(విజయనగరం): విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక 14వ, 23వ వార్డుల్లో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయతలపెట్టిన సెల్ టవర్లను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై వారు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం నుంచి పోలీసులు సెక్షన్ 30 విధించారు. ప్రజలు గుంపులుగా ఉండరాదని, ఆందోళనలు చేయరాదని హెచ్చరించారు. ప్రజల ఆందోళనలతో భారీగా పోలీసులను మోహరించారు. దీంతో పట్టణంలో ఉద్రిక్తత ఏర్పడింది. -
ఏం మాయ చేశారో..!
కనిపించని తోటపల్లి ఎంబుక్‌లు సీఎం పర్యటన దగ్గర పడుతుండడంతో తలలు పట్టుకుంటున్న అధికారులు సబ్ కాంట్రాక్టర్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు బొబ్బిలి: వచ్చే నెలలో తోటపల్లి జలాశయం ద్వారా ఆయకట్టుకు ముఖ్యమంత్రితో నీరు విడుదల చేస్తామన్న దగ్గర నుంచి నీటిపారుదలశాఖాధికారులకు నిద్ర పట్టడం లేదు. పనులు జరుగుతున్నా అందుకు సంబంధించిన బిల్లులు ఇవ్వడానికి తోటపల్లి జలాశయం ప్రధాన కాలువ నిర్మాణానికి సంబంధించిన మెజర్మెంట్ పుస్తకాలు (ఎంబుక్)లు మాయమయ్యాయి. దీంతో నీటిపారుదల శాఖాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటివరకూ ఎంబుక్‌లను తన దగ్గరుంచుకున్న సబ్ కాంట్రాక్టరుపై తోటపల్లి జలాశయం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు మన్మథరావు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు రోజుల కిందట బొబ్బిలి పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. గరుగుబిల్లి మండలంలో మొదలైన తోటపల్లి కుడి ప్రధాన కాలువ శ్రీకాకుళం జిల్లా రాజాం వరకూ దాదాపు 117 కిలోమీటర్ల పొడవుంది. ఈ కాలువల పనులు చేయడానికి ప్రభుత్వం రూ.109 కోట్లతో టెండర్లు పిలిచింది. ఈ పనులను హైదరాబాద్‌కు చెందిన యుఎన్‌మాక్స్ కంపెనీ ఆన్లైన్లో దక్కించుకుంది. వారు పూర్తి స్థాయిలో పనులు చేయకముందే హైదరాబాద్‌కు చెందిన శ్రీరామా కనస్ట్రక్షను కంపెనీకి సబ్ కాంట్రాక్ట్‌కు అప్పగించారు. అప్పటి నుంచి ఆ కంపెనీ వారే పనులు చేస్తున్నారు. ఈ సబ్ కాంట్రాక్టరు కొంత కాలంగా బొబ్బిలి మునిసిపల్ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో ఓ కార్యాలయాన్ని ప్రారంభించి ఇక్కడ నుంచి నిర్మాణ పనులు పర్యవేక్షణ చేస్తున్నారు. సబ్ కాంట్రాక్టరు చేస్తున్న పనుల్లోనే గత ఏడాది హుద్‌హుద్ సమయంలో సీతానగరం మండలం లక్ష్మీపురం వద్ద సువర్ణముఖి నది వద్ద కట్టిన ఆక్విడెక్టుకు భారీ గండిపడింది. దానికి పూర్తిస్థాయిలో పనులు జరగకముందే మళ్లీ ఈ నెలలో ట్రయల్ రన్‌కు నీరు వదిలితే ఆ నీటి ప్రవాహానికి మళ్లీ భారీ గండి పడింది. అలాగే బాడంగి మండలం పాల్తేరు గ్రామం వద్ద ఆక్విడెక్టుకు కూడా లీకులు ఏర్పడ్డాయి. ఇవన్నీ ఒకవైపు ఇలా ఉంటే మరో వైపు సీఎం చంద్రబాబు ఆగస్టు 15న నీటిని విడుదల చేయడానికి ముహుర్తాన్ని నిర్ణయించేశారు. దాంతో ఇప్పుడు అసంపూర్తిగా ఉండిపొయినవి, గండ్లు పడినవి, బలహీనంగా ఉన్న కాలువలపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ సమయంలో జరిగిపోయిన పనులకు బిల్లు లు చెల్లించడానికి సిద్ధమయ్యేసరికి ఎంబుక్‌లు కనిపించకపోవడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. మొద ట ఒప్పందం చేసుకున్న సంస్థకు సమాచారం అందించారు. అయితే ఎంబుక్‌లన్నీ సబ్ కాంట్రాక్టరు వద్దే ఉన్నాయని వారు చెప్పడంతో అవి రాబట్టడానికి ప్రయత్నాలు చేశారు. అవి ఫలించకపోవడంతో పొలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఇంజినీరింగు ప్రొక్రూర్‌మెంటు కాం ట్రాక్ట్(ఈపీసీ) విధానంలో పనులు జరుగుతున్నప్పుడు కాంట్రాక్టర్ల వద్దే ఎంబుక్‌లు ఉంటాయి. కాంట్రాక్టరు ఎప్పుడు పనులు చేస్తే అప్పుడు వాటిని అధికారులు పరి శీలన జరిపి బిల్లులు ఇస్తారు. ఇప్పటివరకూ సక్రమంగా బిల్లుల చెల్లింపులు జరుగుతుంటే ఇప్పుడు ఎంబుక్‌లు మాయం అవడం వెనుక జరుగుతున్న వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది. అధికారులకు, కాంట్రాక్టర్లకు మద్య విభేదాల కారణంగా ఇలా జరిగిందా అనే సందేహం తలెత్తుతోంది. మరో 20 రోజుల్లో సీఎంతో ప్రారంభోత్సవం పెట్టుకుని ఇప్పుడు ఇంకా బిల్లులు ఇవ్వకపోవడం, ఎంబుక్‌లు కనిపించకపోవడం వంటివి జరగడంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ అంశంపై దృష్టి పెట్టి సమస్యను వెంటనే పరిష్కరించాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించడంతో చివరకు బొబ్బిలి పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు వెంటనే గొల్లపల్లిలో ఉన్న సబ్ కాంట్రాక్టరు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
‘మున్సిపల్’ ముట్టడి ఉద్రిక్తం
బొబ్బిలి : బొబ్బిలి మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సమస్యల పరిష్కారం కోసం కొద్ది రోజులుగా కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సమ్మె నేపథ్యంలో ఏర్పడిన అఖిలపక్షం ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. వర్కర్స్ యూనియన్ నాయకుడు పి. శంకరరావుతో పాటు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు రాంబర్కి శరత్, ఏగిరెడ్డి శ్రీధర్, పారి శుద్ధ్య కార్మికులు కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కార్మికులను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఏఎస్సై కిందపడిపోయారు. అయినప్పటికీ కార్మికులు పోలీసులను తోసుకుని కార్యాలయం లోపలికి వెళ్లి రెండు గేట్ల తాళాలు వేసి అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల ఆందోళనకు వైఎస్సార్సీపీ పట్టణ నాయకులు, కౌన్సిలర్లు పొట్నూరు కిరణ్‌కుమార్, మరిపి తిరుపతిరావు, పర్తాపు చంద్రశేఖర్, పిల్లా రామారావులతో పాటు సీపీఐ నాయకులు ఒమ్మి రమణ, ముల్లు వెంకటరమణ, పట్టణ పౌరసంక్షేమ సంఘ నాయకులు వెన్నెల చిన్నంనాయుడు, గ్రోత్‌సెంటర్ కార్మిక సంఘ నాయకుడు గోపాలం, రైతు సంక్షేమ సంఘ నాయకుడు లక్ష్ముంనాయుడు, ఎన్జీఓ సంఘ నాయకులు రమణ, కర్ణ, రిటైర్డు పింఛనర్ల సంఘ నాయకులు చుక్క మహందాతనాయుడు, సత్తిరాజు, తదితరులు మద్దతు తెలిపారు. పెర్మినెంటు ఉద్యోగులు కూడా ఆందోళనకు మద్దతు తెలిపి కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కార్మిక నాయకులను పోలీసులు బలవతంగా అక్కడ నుంచి లాక్కెల్లి పోలీసుస్టేషనుకు తరలించారు. డీఎస్పీ బీవీ రమణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు దాదాపు 70 మంది పారిశుద్ధ్య కార్మికులు, కార్యకర్తలు, నాయకులను పోలీసులు అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మోకాళ్లపై నిరసన పార్వతీపురం టౌన్ : ఆందోళనలో భాగంగా మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు స్థానిక పాతబస్టాండ్ వద్ద మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ, సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిద్ర పోతోందని ఎద్దేవా చేశారు. అనంతరం కార్మికులు నిరసన శిబిరం వద్దకు చేరుకుని ఆందోళన కొనసాగించారు. సీఐటీయు డివిజన్ కార్యదర్శి గొర్లి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులు, మద్దతుదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాలూరులో మానవహారం సాలూరు రూరల్ : సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు స్థానిక వైఎస్సార్ జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందుగా స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి వైఎస్సార్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ, న్యాయమైన డిమాండ్ల సాధనకు ఆందోళన చేయాల్సి రావడం సిగ్గుచేటన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కార్మికులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లిస్తే నేటి ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడం లేదని ఎద్దేవా చే శారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్న హామీని చంద్రబాబునాయుడు నిలబెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో టి.వెంకటరావు, సంతోష్ ,అశోక్, శ్రీనివాసరావు, కార్మికులు పాల్గొన్నారు. సమ్మె తీవ్రరూపం విజయనగరం మున్సిపాలిటీ : గతంలో ఇచ్చిన హమీల ప్రకారం కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు రూ. 15వేల కనీసం వేతనం ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌పై మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మె తీవ్రరూపం దాల్చనుంది. ఇప్పటికే మున్సిపల్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలను నిర్వహించి తమ నిరసను వెల్లగక్కిన కార్మికులు శుక్రవారం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, రెగ్యులర్ సిబ్బంది పాల్గోనున్నారు. 14 రోజులుగా కాంట్రాక్ట్ పారిశుద్ధ్య సిబ్బంది సమ్మె చేపట్టగా, రెగ్యులర్ సిబ్బంది అంతంతమాత్రంగానే విధులు నిర్వహిస్తున్నారు. రెండు వారాలు గడిచినా కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై ప్రభుత్వం కనీసం స్పందించకపోవడంతో సమ్మె తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రెగ్యులర్ కార్మికులను కూడా సమ్మెలో భాగస్వాములను చేయబోతున్నారు. ఈ మేరకు కార్మిక సంఘాల నాయకులు టీవీ రమణ, వి.కృష్ణంరాజులు విజయనగరం మున్సిపల్ కమిషనర్ ఎం.మల్లయ్యనాయుడుకు గురువారం సమ్మె నోటీసు అందజేశారు. దీంతో విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో 275 మంది కాంట్రాక్ట్ సిబ్బందితో పాటు 34 మంది డ్రైవర్లు సమ్మెలో ఉండగా.. రెగ్యులర్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న మరో 200 మంది సిబ్బంది కూడా విధులు బహిష్కరించనున్నారు. అదేవిధంగా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో 105 మంది కాంట్రాక్ట్ సిబ్బందితో పాటు 9 మంది వాటర్ వర్క్స్ సమ్మెలో ఉండగా.. 50 మంది రెగ్యులర్ సిబ్బంది సమ్మె బాటపట్టనున్నారు. పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో 44 మంది కాంట్రాక్ట్ సిబ్బందితో పాటు 79 మంది రెగ్యులర్ సిబ్బంది, సాలూరులో 62 మంది కాంట్రాక్ట్ సిబ్బందికి మద్దతుగా 48 మంది రెగ్యులర్ సిబ్బంది సమ్మెలోకి వెళ్లనున్నారు. రెండు రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. -
ముగ్గురు విద్యార్థులకు ఒకటే ప్రశ్నపత్రం..!
బొబ్బిలి: వరుసగా ముగ్గురు విద్యార్థులు..వారిలో ఒకరి వద్దే ప్రశ్నపత్రం.. దానినే మిగిలిన విద్యార్థులు పంచుకోవడం..ఇదీ ప్రభుత్వ ఐటీఐలో బుధవారం కనిపించిన దృశ్యం.. సాంకేతిక విద్యాశాఖ పరీక్షల నిర్వహణకు తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థికీ ప్రశ్నపత్రం అందని పరిస్థితి ఏర్పడింది. బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐలో రెండో సంవ త్సరం విద్యార్థులకు బుధవారం నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభమయ్యాయి.. ఈ ప్రాక్టికల్స్‌కు సంబంధించిన ప్రశ్నపత్రాన్ని ఆన్లైన్లో ఆ శాఖ ప్రతిరోజూ పంపుతుంది. బుధవారం ఆన్లైన్ కష్టాల వల్ల మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్లో ప్రశ్నపత్రం రాలేదు. ఆ తరువాత వచ్చాక సరిపడినన్ని జిరాక్స్‌లు తీయకపోవడంతో ఉన్నవే విద్యార్థులకు సర్దారు. దాంతో ఒక పేపరును ముగ్గురు విద్యార్థులు పంచుకోవాల్సి వచ్చింది. అలాగే ఈ పరీక్షల్లో కూడా మాస్ కాపీయింగ్‌కు విద్యార్థులు సిద్ధమయ్యారు. ఒకరు రాసుకున్న తరువాత మరొకరికి ఇచ్చే విధంగా విద్యార్థులు ప్లాన్లు వేసుకున్నారు.. ప్రశ్నపత్రాలు చేతిలో ఉన్నా జవాబు పత్రాలపై పెన్ను కదలకుండా చూచిరాతకు సిద్ధమయ్యారు. అలాగే పరీక్షా కేంద్రంలో కూడా విద్యార్థులను నేలపైనే అత్యంత సమీపంగా కూర్చోబెట్టి నిర్వాహకులు కూడా విద్యార్థులకు సహకరించారు. ఆఖరి నిమిషంలో పరీక్షకు ప్రైవేటు విద్యార్థులు బొబ్బిలి శ్రీనివాస ప్రైవేటు ఐటీఐ విద్యార్థులు ఆఖరి నిమిషంలో ప్రభుత్వం ఐటీఐలో ప్రాక్టికల్స్ చేయడానికి వచ్చారు. రాతపూర్వకంగా ఆదేశాలను ఆ శాఖ ఇవ్వకపోగా మౌళిక ఆదేశాలను జారీ చేసి వారికి ప్రాక్టికల్స్ జరపాలని సూచించారు. బుధవారం దాదాపు 250 మంది వరకూ అన్ని ట్రేడుల విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించారు. వీటి పర్యవేక్షణకు విశాఖ ఎన్ఎస్టీఎల్ ప్రిన్సిపాల్ బి అప్పారావు, గ్రోత్‌సెంటరు ఏఈ గోపీనాయుడు, విశాఖ స్టీల్‌ప్లాంటు సీనియర్ ఏజీఎం శ్రీనివాసరావు, స్వామి పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ దివ్య, స్థానిక ప్రిన్సిపాల్ ప్రకాశంలు పర్యవేక్షించారు. -
వర్షంలోనూ సడలని సంకల్పం
సీతానగరం, బొబ్బిలి: ఎన్సీఎస్ చక్కెర కర్మాగార యాజమాన్యం చెల్లించాల్సిన బకాయిల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న అన్నదాతల సంకల్పం జోరు వానలోనూ సడలలేదు. యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ శనివారం ఉదయం కర్మాగారం ముందు మహాధర్నా చేపట్టారు. ఇంతలో బొబ్బిలి డీఎస్పీ బీవీ.రమణమూర్తి యాజమాన్యంతో మాట్లాడించడంతో సంతృప్తి చెంది ఆందోళనను విరమించారు. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదీ సంగతి.. గత రెండు సీజన్లకు సంబంధించి ఎన్సీఎస్ యాజమాన్యం 18 కోట్ల రూపాయల మేర బకాయి ఉండడంతో అన్నదాతలు పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావటంతో అప్పులు చేయలేక చెరకు బకాయిల కోసం పోరాటం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం ఏపీ చెరకు రైతు సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టేందుకు పెద్దసంఖ్యలో ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. ఒకవైపు వర్షంలో తడిసి ముద్దవుతున్నా, మరో వైపు అధిక సంఖ్యలో పోలీసులు మోహరించినా వెనుకంజ వేయలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మహాధర్నా నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సమస్యపై యాజమాన్యానికి వినతి ఇవ్వాలని వారు సూచించారు. దీంతో ఏపీ చెరకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ రైతులనుద్దేశించి మాట్లాడుతూ శుక్రవారం బొబ్బిలిలో యాజమాన్యం ఏర్పాటు చేసిన సమావేశంలో కోటి రూపాయలు చె ల్లిస్తామని ప్రకటించిందని, ఇప్పుడు ధర్నాకు వచ్చినవారికి ఆ సొమ్ము చెల్లిస్తే ఆందోళన విరమిస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యేలోగా పార్వతీపురం ఏఎస్పీ సిద్ధార్థ కౌశిల్, బొబ్బిలి డీఎస్పీ బీవీ.రమణమూర్తి వచ్చి మొత్తం పరిస్థితిని రైతులకు వివరించారు. యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి ఎండీ నాగేశ్వరరావు, డైరక్టరు శ్రీనివాసులను తీసుకువచ్చారు. మహాధర్నాకు వచ్చిన రైతులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి చెల్లింపులు చేస్తామని, జూలై 15 నాటికి బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లిస్తామని వారు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. భారీ బందోబస్తు ఏర్పాటు మహాధర్నా నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ, ఎస్ఐ, ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను నియోగించారు. ఎన్సీఎస్ సుగర్స్ ఎండీ నాగేశ్వరరావు, డెరైక్టర్లకు భారీ భద్రత కల్పించారు. పోలీసులు వలయంగా ఏర్పడి నలుగురు రైతు ప్రతినిధులనే లోపలకు పంపి చర్చలు జరిపించారు. పాతబొబ్బిలి జంక్షను వద్ద కూడా భారీగా పోలీసులను ఉంచారు. -
కర్షకుల పాలిట ఖర్మాగారం !
బొబ్బిలి: లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం పరిధిలోని రైతులు మరో సారి ఆందోళనకు సిద్ధమయ్యారు. శనివారం ఫ్యాక్టరీ ఎదుట మహాధర్నా చేయనున్నారు. 16 మండలాలకు చెందిన 15 వేల మంది రైతులకు ఫ్యాక్టరీ యాజమాన్యం దాదాపు రూ 50 కోట్ల బకాయి పడింది. రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నప్పుడు హామీలు ఇచ్చి తరువాత పట్టించుకోవడం లేదు. గత ఏడాది సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ఏకబిగిన 15 రోజుల పాటు భారీ ఎత్తున ఆందోళనలు, రాస్తారోకోలు, నిరాహారదీక్షలు చేశారు. బకాయిల కోసం ఇప్పటికి 52 సార్లు రైతులు రోడ్డెక్కారు. గత ఏప్రిల్ 24న మండుటెండలో ఆందోళన చేశారు. ఇలా అందోళన చేసిన ప్రతిసారీ అధికారులు, ఫ్యాక్టరీ యాజమాన్యం హామీలు ఇస్తున్నారనే తప్ప సమస్య పరిష్కరించడంలేదు. రెండేళ్లుగా బకాయిలు చెల్లించకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం వాయిదా లు వేసుకుంటూ వస్తోంది. ఉన్నతాధికారులు కూడా స్పందించ డం లేదు. ఫ్యాక్టరీ యాజమాన్యం చెరుకు రైతుల పేరిట లచ్చయ్యపేట, పార్వతీపురం తదితర ప్రాంతాల్లోని బ్యాంకుల్లో బినామీ రుణాలు తీసుకుంది. వాటికి సం బంధించి ఇంకా 25 కోట్ల రూపాయల బకాయి ఉంది. వాటిని యాజమాన్యం చెల్లించకపోవడం వల్ల ఇప్పటికీ అప్పులు తీర్చాలని బ్యాంకులు రైతులకు నోటీసులు పంపుతున్నాయి. బినామీ అప్పుల బారిన పడిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ కూడా వర్తించని పరిస్థితి ఏర్పడింది. అలాగే 2013-14 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన చెరకును సరఫరా చేసిన రైతులకు రూ.5.50కోట్ల బకాయి పడగా, గత ఏడాదికి సంబంధించి 12.70 కోట్ల బకాయి ఉంది. ఎన్సీఎస్ యాజమాన్యం నడిపితే బిల్లులు అందడం లేదని ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రషింగు జరగాలని గత ఏడాది నిర్ణయం తీసుకున్నా ఆ బకాయిలు కూడా నేటివరకూ అందలేదు. దిగుబడి అయిన పంచదారకు ధర లేదని ఫ్యాక్టరీలోనే నిల్వలు చేశారు. ప్రభుత్వం ప్రత్యేక ఖాతాలు పెట్టి క్రషింగు చేసినా ఇంకా 12 కోట్ల వరకూ ైరె తులకు చెల్లించాల్సి ఉంది. ఇవి కాకుండా టన్నుకు మమ్ము చెరుకుకు వంద రూపాయలు, మొక్క చెరకుకు 2 వందల రూపాయలు విత్తన రాయితీ ఇవ్వాల్సి ఉంది. అయితే గత రెండేళ్లుగా ఇవి కూడా ఇవ్వకపోవడంతో దాదాపు ఆరు కోట్ల రూపాయల వరకూ బకాయి ఉంది. బకాయిలు కోసం రైతులు ఆందోళన చేయడానికి ప్రకటనలు జారీ చేస్తే అటు యాజమాన్యం, ఇటు అధికారులు స్పందించడం, వెంటనే సమావేశాలు ఏర్పాటు చేయడం, రైతులు ఆందోళన చేయకుండా కట్టడి చేయడం వంటివి చేస్తున్నారు.. ఆ సమయంలో అధికారులు హామీ ఇవ్వడం, అవి గడువు తీరినా నెరవేరకపోవడం సాధారణంగా మారింది. దీంతో విసిగిపోయిన రైతులు శనివారం ఫ్యాక్టరీ ఎదురుగా మహాధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. రైతులు ధర్నాకు సిద్ధమవుతుండడంతో ఎన్సీఎస్ యాజమాన్యం బహిరంగ ప్రకటన ద్వారా చక్కెర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించింది. అయితే దానిపై కూడా రైతు సంఘం తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తుంది. మా ఖర్మకాలి ఈఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేశామని, ఇప్పుడు పడరానిపాట్లు పడుతున్నామని, జిల్లా అధికారులు, ప్రభుత్వం ఫ్యాక్టరీ యాజమాన్యానికి కొమ్ముకాస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఏపీ చెరకు రైతు సంఘం ఆధ్వర్యంలో జరగనున్న మహాధర్నా సందర్భంగా ఫ్యాక్టరీ దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. -
నకిలీ నోట్ల పేరిట టోపీ వేయాలనుకుని..
బొబ్బిలి రూరల్: రూ.లక్షకు 3 లక్షల రూపాయల నకిలీ నోట్లు ఇస్తామంటూ మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను బొబ్బిలి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి 3 లక్షల రూపాయల నకిలీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం బొబ్బిలి పోలీసు స్టేషన్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. సీఐ టి.సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరానికి చెందిన గొర్లె హేమచందర్, చుక్క శ్యాంకుమార్‌లు బొబ్బిలికి చెందిన రవి అనే వ్యక్తి ద్వారా నకిలీ నోట్ల పేరిట మోసానికి పాల్పడేందుకు కారులో వచ్చారు. వీరు ఓ డబ్బాలో పైన నాలుగు ఒరిజినల్ నోట్లను పెట్టి డబ్బా లోపల ఉన్న నోట్ల కట్టల్లో పైన అసలు నోటు ఉంచి మధ్యలో న్యూస్‌పేపర్ ముక్కలు పెట్టి మోసం చేస్తున్నారు. లక్ష రూపాయలకు మూడు లక్షల రూపాయల నకిలీ నోట్లు ఇస్తామని చెప్పి మోసం చేస్తున్న వీరు తొలుత బొబ్బిలి గ్రోత్ సెంటర్లో బొబ్బిలికి చెందిన రవిని కలుద్దామనుకున్నారు. అయితే ఎవరికైనా అనుమానం వస్తుందనే కారణంతో రవి మానాపురంలో కలుద్దామని ఓసారి, గజపతి నగరంలో కలుద్దామని మరోసారి హేమచందర్, శ్యామ్‌కుమార్‌లకు తెలిపాడు. వీరు గ్రోత్ సెంటర్ నుంచి పరారయ్యేందుకు యత్నిస్తుండగా ఎస్ఐ నాయుడు, ఐడీ పార్టీ సిబ్బంది రమణ, మురళి, లక్ష్మణ్, వెంకటేష్‌లు వెంటాడి బొండపల్లి వద్ద పట్టుకున్నారు. వీరు గత రెండేళ్లుగా విజయనగరానికి చెందిన శివ, రాజు, గజపతినగరంకు చెందిన శ్రీనివాస్‌ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. బొబ్బిలికి చెందిన రవి ఫోన్ నంబర్ లభించిందని, అతను ఎవరనేది విచారిస్తున్నామని సీఐ తెలిపారు. విలేక రుల సమావేశంలో ఎస్ఐ నాయుడు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.25 కోట్లతో పంచాయతీరాజ్ పనులు
బొబ్బిలి రూరల్ : తమ డివిజన్ పరిధిలో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో దాదాపు రూ.25కోట్ల వ్యయంతో 780 పనులు జరుగుతున్నాయని ఆ శాఖ పార్వతీపురం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.గజేంద్ర తెలిపారు. శుక్రవారం స్థానిక పంచాయతీరాజ్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రహదారి పనులు అధికంగా జరుగుతున్నాయని చెప్పారు. సాంకేతిక సమస్య లేదని తెలిపారు. అన్ని పనులూ ప్రారంభించామని, 2016 మార్చిలోగా పూర్తి చేస్తామన్నారు. తమ పరిధిలో 202 పంచాయతీ భవనాలు నిర్మిస్తున్నామని, ఒక్కో పంచాయతీ భవనానికీ రూ.13 లక్షల చొప్పున నిధులు అందిస్తున్నామన్నారు. వీటిలో 193 నిర్మాణదశలో ఉన్నాయన్నారు. అంగన్వాడీ భవనాలు 46మంజూరయ్యాయని, ఒక్కో భవనానికి 6.5లక్షల రూపాయలు నిధులు అందిస్తున్నామన్నారు. వీటిలో 40 వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఉపాధిహామీ పథకంలో ఫేజ్-2, ఫేజ్-3 పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. సిబ్బంది కొరత వేధిస్తోందని, దీనికోసం టీఏలను నియమించాలని ప్రతిపాదనలు పంపామని, జిల్లా కలెక్టర్ అంగీకరించారని తెలిపారు. సాంకేతిక సమస్య తలెత్తితే 24గంటలలో పరిష్కరిస్తున్నామన్నారు. -
అండగా ఉండి ఆదుకోండి...
బొబ్బిలి: ‘అగ్రి గోల్డు కార్యాలయాల్లో నాలుగు నెలలుగా లావాదేవీలను నిలిపివేశారు. ఖాతాదారుల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాం. ఇప్పటికే 8 మంది గుండెపోటుతో చనిపోయారు. యాజమాన్యం పలకడం లేదు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మీరు అండగా ఉండి అదుకోవాలి’ అని అగ్రిగోల్డు ఏజెంట్లు బొబ్బిలి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్.వి.సుజయకృష్ణ రంగారావును కోరారు. పార్వతీపురం డివిజన్లోని అగ్రి గోల్డు ఏజెంట్లు సోమవారం ఆయనను బొబ్బిలి కోటలో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి నాలుగో తేదీ నుంచి లావాదేవీలను నిలిపివేశారన్నారు. గ్రామాల్లో ఖాతాదారులు ఏజెంట్లపై దాడులకు వస్తున్నారని చెప్పారు. వారి ఒత్తిడి తట్టుకోలేక చిన్న వయసులో ఉన్నవారు కూడా గుండెపోటుతో చనిపోతున్నారని తెలిపారు. ఇప్పటివరకూ అనేక ఆందోళనలు చేసినా అటు యాజమాన్యం, ఇటు ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అగ్రి గోల్డు సంస్థకు ఆర్థిక ఇబ్బందులు లేవన్నారు. ప్రభుత్వమే డబ్బు చెల్లించేటట్లు చేస్తే కాలయాపన అవుతుందన్నారు. ప్రస్తుతం తమకు ఎక్కడా పనిదొరకడం లేదని, ఇల్లు గడవని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఇటీవల పార్వతీపురం వచ్చిన సీఎం చంద్రబాబుకు విన తిపత్రం ఇచ్చినా ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేదన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి విజయనగరం వచ్చినపుడు వినతిపత్రం ఇచ్చామని, పార్టీ పరంగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావు మాట్లాడుతూ పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఏజెంట్లు, ఖాతాదారులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పోరాటం చేసి ప్రభుత్వం దృష్టిలో పడడం, ముఖ్యమంత్రిని ఎప్పటికప్పుడు కలవడం వంటివి చేయాలని సూచించారు. -
తల్లి మందలించిందని ఆత్మహత్యాయత్నం
విజయనగరం : ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చుంటోందని తల్లి మందలించటంతో కూతురు ఆత్మహత్యకు యత్నించింది. విజయనగరం జిల్లా బాడంగి మండలం అల్లుపాల్తేరు గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన అల్లు త్రివేణి(18) ఇటీవలే ఇంటర్ పూర్తి చేసింది. చెప్పిన పని చేయడం లేదని ఆమెను తల్లి మందలించింది. మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఉన్న చీమలమందు తాగింది. ఆ గ్రామానికి రవాణా సౌకర్యం లేకపోవటంతో నాలుగు గంటలు ఆలస్యంగా ఆమెను కుటుంబసభ్యులు బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈలోగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు. (బొబ్బిలి) -
ఆటో బోల్తా... ఆరుగురికి గాయాలు
బొబ్బిలి: విజయనగరం జిల్లా బాడంగి మండలం పినపంకి గ్రామం వద్ద బుధవారం ఉదయం ఓ ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. వివరాలు...మెరకముడియం మండలం, ఉత్తరాది గ్రామానికి చెందిన కొందరు మంగళవారం పిరిడి గ్రామంలో జరిగిన గ్రామ దేవత పండుగకు హాజరయ్యారు. బుధవారం తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వస్తున్న బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు క్షతగాత్రులను తన వాహనంలో కొంత దూరం తీసుకెళ్లారు. ఈ లోపు అంబులెన్స్ రావడంతో అందులోకి ఎక్కించారు. వారికి బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స ఇచ్చిన అనంతరం విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య?
బొబ్బిలి: పుట్టింది పేదరికంలోనైనా చదువులో దిట్ట..పదోతరగతి, ఇంటర్లో ప్రతిభను చూపి సాంకేతిక విద్యపై దృష్టి పెట్టాడు. ఐటీఐలో ఎలక్ట్రిషియన్ ట్రేడ్ రెండో సంవత్సరం చదువుతూ పరీక్షలు రాస్తున్న విద్యార్థి బావిలో శవమై తేలవడంతో తోటి విద్యార్థులతో పాటు కుటుంబీకులు అంతులేని విషాదంలో మునిగిపోయారు. మృతుడి స్నేహితులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాడంగి మండలం ముగడ గ్రామానికి చెందిన షేక్ ఆలీ ఖాన్(18) అనే విద్యార్థి బొబ్బిలి పట్టణంలో ఐటీఐ కాలనీ సమీపంలోని బావిలో ఆదివారం శవమై కనిపించాడు. ఆలీఖాన్ తండ్రి మదీనా సాెహ బ్ టైలరింగ్ వృతిపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తాత తవుడు, అమ్మమ్మ బంగారమ్మల వద్దే ఆలీఖాన్ ఎక్కువగా ఉంటూ పెరిగాడు. చదువులో మంచి ప్రతిభ చూపుతుండడంతో స్థానికులు కూడా ఆర్థికంగా సహాయం చేసి ప్రోత్సహించేవారు. మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు, ఆయన తండ్రి దివంగత జయప్రకాశ్‌లు ఆలీఖాన్ చదువులో ముందుకెళ్లడానికి సహకరించారు. విశాఖ జిల్లా సింహాచలంలో ఉన్న గురుకుల పాఠశాలలో అలీఖాన్ 8,9,10 తరగతులు చదువుకున్నాడు. బాడంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివాడు. ఇంటర్ పూర్తయిన తరువాత స్వయం ఉపాధితో ముందుకెళ్లాలని యోచించి బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐలో ఎలక్ట్రిషియన్ ట్రేడ్‌లో చేరాడు. ప్రస్తుతం సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రూ.1800 ఫీజు కూడా చెల్లించాడు. శుక్రవారం ఐటీఐలో నిర్వహించిన వర్క్‌షాపు కాలిక్యులేషన్ పరీక్ష రాసిన తరువాత మందులు కొనుక్కుని వస్తానని తోటి విద్యార్థులకు చెప్పి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఇంటికి చేరలేదు. దీంతో స్నేహితులతో పాటు బంధువులు ఆలీఖాన్ కోసం వెతికి చివరకు బాడంగి పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. అలీఖాన్ చదువుతున్న ఐటీఐ కళాశాలకు కొద్ది దూరంలో ఉన్న బావిలో ఆదివారం శవమై కనిపించాడు. ఆదివారం కావడంతో ఆ బావికి సమీపంలో క్రికెట్ ఆడుకుంటున్న యువకులు స్నానం కోసం బావి దగ్గరకు వెళ్లగా మృతదేహం తేలి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ఆలీఖాన్ కోసం వెతుకుతున్న స్నేహితులు వచ్చి చూసి బంధువులకు సమాచారం అందించారు. నాలుగు రోజుల నుంచి ఇంట్లో ముభావంగా ఉంటున్నాడని, తిండి కూడా సరిగ్గా తినడం లేదని ఆలీఖాన్ అమ్మమ్మ బంగారమ్మ మనవడు మృతదేహం చూసిన తరువాత అక్కడున్న వారితో చెప్పింది. ఏమైందని అడిగినా సమాధానం ఇవ్వలేదని, నేను ఐటీఐకు వెళ్లను.. పరీక్షలు రాయను భయమేస్తోందని అన్నాడని చెబుతోంది.. తెలివైన విద్యార్థి ఐటీఐ పరీక్షలు రాయడానికి వెళ్లను అనడానికి కారణాలు ఏమై ఉంటాయా? స్థానికులు అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలీఖాన్‌కు ఐటీఐలో వచ్చే కష్టాన్ని ఎప్పుడూ తమకు చెప్పలేదని స్నేహితులు అంటున్నారు. బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
గ్రామదేవత జాతరలో ఉద్రిక్తత
బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామంలో గ్రామదేవత జాతరలో రెండు వర్గాల మధ్య ఏర్పడిన విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎస్సీల కుల దైవమైన అతిరి తల్లి జాతర వచ్చే నెల 2 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. అయితే ఎస్సీలు గ్రామదేవత ఘటాలను మోసేందుకు వీల్లేదంటూ బీసీలు అడ్డుచెప్పడంతో గత 15 రోజులగా గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనిపై ఎస్సీల ఫిర్యాదు మేరకు ఎస్ఐ ప్రసాద్ శనివారం ఉదయం గ్రామంలో పర్యటించి స్థానికులను విచారించారు. సమస్యను చర్చించుకుని పరిష్కరించుకోవాలని గ్రామ పెద్దలకు సూచించారు. గ్రామంలో పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. -
మనకేదీ చెత్తశుద్ధి!
ఝాన్సీ కి వాణీ వట్టిమాటలు కట్టిపెట్టోయ్.. గట్టిమేల్ తలపెట్టవోయ్ !! వెన్నుతట్టి లేపిన చిరు పట్టణంలోని చెత్త మూటల నిర్వహణ ముందు మహానగర పెద్దరికం చిన్నబోయింది. గతవారం ఓ సినిమా షూటింగ్ కోసం బొబ్బిలిలో ఉన్నాను. విజయనగరం జిల్లాలోనే ప్రత్యేక స్థానం సంపాదించిన బొబ్బిలిలో విశేషాలన్నీ ఒక్కొక్కటిగా చూస్తున్నాను. బొబ్బిలి కోట, వేణుగోపాల స్వామి దేవాలయం, వీణల తయారీ అన్నీ చూసి చివరగా అక్కడి బెల్లం కూడా బావుంటుందని ఓ బెల్లం బట్టీలో వేడి వేడి బెల్లం కొన్నాను. మట్టి ముంతలోని మెత్తని బెల్లం ముచ్చటగా ఉంది. రాత్రికి గట్టి పడుతుందని జాగ్రత్తగా పట్టుకుని కోటలో షూటింగ్‌కు వెళ్లిపోయాను. ముంత మీద కవర్ కట్టి సీల్ చేయడానికి ఏదైనా పాలిథిన్ కవర్ ఉంటే ఇవ్వమని ఆ కోటలో పని చేస్తున్న సూపర్వైజర్ను అడిగాను. వెంటనే కోటలో హడావిడి మొదలైంది. మేడంగారు మైకా కవర్ అడిగారంటూ కోటంతా పాకిపోయింది. ఇంత చిన్న విషయానికి అంత హడావిడి ఎందుకో అర్థం కాలేదు. చివరికి అక్కడి వంట మనిషి నా దగ్గరకొచ్చి ‘ఎందుకమ్మ మైకా కవర్ కోసం అందరినీ ఇబ్బంది పెడతావు, పేపర్ తెచ్చి తాడుతో కట్టేసుకోవచ్చును కదా’ అని జ్ఞానోపదేశం చేసింది. బొబ్బిలిలో నో పాలిథిన్.. ఇంతకీ మైకా కవర్ వెనుక ఈ హడావిడి ఏంటంటే బొబ్బిలి మున్సిపాలిటీలో పాలిథిన్ నిషేధం. ఇందులో వింతేముంది. మన దగ్గర కూడా ఇంతే కదా అనుకోకండి. ఇక్కడ మనం చుట్టూ ఉన్నా కూడా పట్టించుకోం. అక్కడి ప్రజలు చట్టాన్ని వంట బట్టించుకున్నారు. తు.చ. తప్పకుండా నియమ నిబంధనలను పాటిస్తూ పాలిథిన్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు వంటి వాటిని తమ జీవితాల నుంచి తుడిచి వేసిన ఈ నవనాగరికులను చూసి ఎంతో గర్వపడ్డాను. అక్కడ పర్యావరణం కేవలం నినాదం కాదు జీవన విధానం. నేను కలసిన ఈ కోటలోని ఉద్యోగులే కాదు బయటకు వచ్చి ఎవరిని కదిపినా ఇదే సమాధానం వచ్చింది. అక్కడ పాలిథిన్ వాడినా, రోడ్డుపై చెత్త వేసినా జరిమానా కట్టాల్సిందే. ఇందులో అమలుపరుస్తున్న యంత్రాంగం పాత్ర ఎంతుందో ప్రజల భాగస్వామ్యం కూడా అంతే ఉంది. మహానగరంలో నివసిస్తున్న మహానుభావులంతా.. నాగరికతకు ఆనవాళ్లు అని చాటుకునే వారు దూరంగా విసిరేనట్టున్న మున్సిపాలిటీ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. తడిని తరిమి.. బొబ్బిలి మున్సిపాలిటీలో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించేటప్పుడే తడి చెత్తని వేరు చేసే బాధ్యతని ప్రజలే అలవరుచుకున్నారు. ఆరెంజ్, బ్లూ రెండు రంగుల బుట్టలో చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలిస్తారు. సారీ, అది డంపింగ్ యార్డ్ అంటే వారు ఒప్పుకోరు. దాని పేరు ఎస్డబ్ల్యూఎమ్ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) పార్క్. నిజంగానే అది సుందరవనంగా కనిపించింది. మన హైదరాబాద్ జవహర్‌నగర్‌లోని డంపింగ్ యార్డ్‌ని బాగుచేయడం ఆ భగవంతుడి తరం కూడా కాదేమో అని అనుమానం వస్తుంది. ఎంత ఆధునిక టెక్నాలజీ సాయం ఉందనుకున్నా.. మన చెత్త కొండలా పేరుకుపోతోంది. ప్రజల భాగస్వామ్యం పెరగనంత వరకూ హైదరాబాద్‌లోని చెత్తకు పరిష్కారం దొరకదు. స్టిక్ ఫర్ నో ప్లాస్టిక్.. ప్లాస్టిక్, పాలిథిన్ మన చెత్తలో అత్యంత పెద్ద సమస్య. దాని నియంత్రణ వినియోగం దగ్గరే జరగాలి. మైక్రాన్ల పెరుగుదల ఒక్కటే పాలిథిన్‌కు పరిష్కారం కాదు. రీసైక్లింగ్ వరకూ రాని ప్లాస్టిక్ ఎటు చూస్తే అటు పేరుకుపోతోంది. పార్కులు, చెరువులు, గుట్టలు, మైదానాలు, నాలాలు.. ఎటు చూసినా ప్లాస్టిక్ మయం. దీనికి పూర్తి విరుద్ధంగా బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో ఎక్కడా పాలిథిన్ కనబడదు. వస్తువు కొనాలన్నా, చెత్త మూట కట్టాలన్నా.. కవర్లు కావాలనుకుంటే డబ్బుకు సైతం వెనుకాడకుండా కొనేస్తాం. టీ తాగాలన్నా, పార్సిల్ చేయాలన్నా, పార్టీలైనా ప్లాస్టిక్‌ని యూజ్ అండ్ త్రోగా వాడేస్తాం. కన్వీనియన్స్ మాట అటుంచితే.. చెత్తభారం ఎంత పెచుతున్నామో కనీసం ఆలోచించం. పెరుగుతున్న క్యాన్సర్‌కి పాలిథిన్, ప్లాస్టిక్ వినియోగానికి ఉన్న సంబంధం గురించి తెలిసినా తేలిగ్గానే తీసుకుంటున్నాం. లక్షల్లో ఉన్న జనాభాకి వేలల్లోని జనాభా స్ట్రాటజీలు ఉపయోగ పడకకోవచ్చు. కాని, గ్రామీణ ప్రజలకు ఉన్న అవగాహన నగరవాసుల్లో ఎందుకు లేదు ? అన్నింట్లోనూ ఆధునికంగా జీవిస్తున్న మనం ఇందులో మాత్రమే ఎందుకు వెనుకబడి ఉన్నాం. బొబ్బిలి పరిశుభ్రతలో పది శాతం అయినా పురోగతి హైదరాబాద్ సాధించాలంటే వంద శాతం ప్రజల భాగస్వామ్యం కావాలి. లెట్స్ స్టార్ట్ టు డే! facebook.com/anchorjhansi ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్ -
చీరల దొంగలు అరెస్టు
బొబ్బిలి: పట్టణంలోని వ స్త్ర దుకాణాల్లోకి వెళ్లి చీరలు కొంటున్నట్లు నటించి, దొంగతనాలకు పాల్పడుతున్న మహిళా గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి సీఐ సీతారాం శనివారం అందించిన వివరాలు... విశాఖలోని అల్లిపురానికి చెందిన రమణమ్మ, జయ, ఆది లక్ష్మి, త్రివేణి, కొమ్మాదికి చెందిన వెంకటరత్నంల ముఠా రెండు రోజు లుగా బొబ్బిలిలోని వస్త్ర దుకాణాలకు వెళ్లి చోరీలకు పాల్పడుతోంది. శుక్రవారం నాడు వీరు బజారులోని ఓ శారీ హౌస్‌కు వెళ్లారు. అక్కడ నలుగురూ ఒకే సారి వెళ్లి ఒకరు చీర బేరమాడడం, మరొకరు చీర కొనడం, ఇంకొకరు పరిశీలన చేసి నచ్చలేదని చెప్పడం ఇలా చెబుతూ వ్యాపారుల కళ్లు కప్పి చీరలను దాచేశారు. వచ్చిన మహిళలంతా ఏమీ కొనకుండా వెళ్లిపోవడం, విలువైన చీరలు కనిపించకపోవడంతో వారికి అనుమానం వ చ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దుకాణంలోని సీసీ పుటేజీని చూసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకుని, విచారించగా అసలు విషయం బయట పడింది. ఈ ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. వీరిది విశాఖ కావడంతో వీరి గత చరిత్రపై కూ డా విచారణ చేస్తున్నామన్నారు. ఆయనతో పాటు ఎస్ఐ నాయుడు ట్రై నింగు ఎస్ఐ జీడీ బాబు, ట్రాఫిక్ ఎస్ఐ దూలి శేఖర్ ఉన్నారు. -
సీరియల్స్‌లో అవకాశాలు వస్తున్నాయి
బొబ్బిలి: తమ వంశమంతా సురభి కళాకారులమేనని, ఒకవైపు తాను నాటకాలు వేస్తూనే మరో వైపు టీవీ, సినిమాల్లో నటిస్తున్నానని నటి సురభి ప్రభావతి అన్నారు. బొబ్బిలి వచ్చిన సందర్భంగా బుధవారం రాత్రి ఆమె సాక్షితో మాట్లాడారు. తమ కుటుంబంలో పుట్టుకతోనే నటనలో ఉంటామన్నారు. అందుకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చామో, ఎన్ని అవార్డులు వచ్చాయో లెక్కలేవన్నారు. బతుకమ్మ, మహాత్మ సినిమాల్లో తాను నటించానని చెప్పారు. టీవీ సీరియల్స్‌లో కలవారి కోడలు, పూత రేకుల్లో నటించానని, ఇంకా సీరియల్స్‌లో నటించేందుకు అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. నెల్లూరులో తాను ప్రదర్శించిన బాపుబాటలో నాటకానికి, ఖమ్మంలో వేసిన విప్రనారాయణ పద్యనాటకంలో దేవదేవి పాత్రకు, గుంటూరులో వేసిన వీరపల్నాడులో నాగమ్మ పాత్రకు తనకు నంది అవార్డులు వచ్చాయని తెలిపారు. తిరుపతిలో జరిగిన పోటీల్లో గరుడ అవార్డు కూడా ఇచ్చారన్నారు. ఉదయ్ భాగవతుల రచన, దర్శకత్వంలో వేసిన బొమ్మ సముద్రం నాటకానికి మంచి పేరు వచ్చిందన్నారు. ఆ నాటకాన్ని 50 సార్లు ప్రదర్శిస్తే 40 సార్లు ఉత్తమ నటిగా గుర్తింపు వచ్చిందన్నారు. ఖాళీలు పూరించండి, కొత్త బానిసలు నాటకాలకు కూడా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. టీవీసీరియల్స్, సినిమాలకు అవకాశం వస్తున్నా నాటకానికే తాను అధిక ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పారు. -
అడుగడుగునా నిర్లక్ష్యం...
బొబ్బిలి: బొబ్బిలి పట్టణం, మండలంలో ఆర్అండ్బీ అధికారులు నిర్లక్ష్యం వల్ల వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. బొబ్బిలి నుంచి బలిజిపేటకు పిరిడి మీదుగా వెళ్లే దారి లో అడుగుకో మలుపు ఉంది. గొల్లపల్లి దాటిన తరువాత శివడ వలస వెళ్లినంతవరకూ ఎన్ని మలుపులు ఉన్నాయో లెక్కేలేదు. చివరకు పిరిడి గ్రామంలో కూడా ఈ మలుపులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇన్ని మలుపులు ఉన్నా ఎక్కడా హెచ్చరిక బోర్డు పెట్టలేదు. బొబ్బిలి నుంచి చింతాడ మీదుగా బలిజిపేట వెళ్లే రహదారికి కూడా ఇదే పరిస్థితి. బొబ్బిలి మండలం పిరిడి, కలవరాయి, కోమటిపల్లిల వద్ద కాలేజీలు అధికంగా ఉన్నాయి. కానీ బస్సులు పెద్దగా లేకపోవడంతో ఉన్న బస్సుల్లోనే వీరు వేలాడుతూ ప్రయాణించాల్సి వస్తోంది. స్పీడ్ బ్రేకర్లేవీ..? రామభద్రపురం: విశాఖ నుంచి రాయగడ, శ్రీకాకుళంనుంచి జ యపూర్ వెళ్లే వాహనాలు రామభద్రపురం జంక్షన్‌పై నుంచి వెళ్తాయి. అయితే ఇక్కడ జాగ్రత్త చర్యలేవీ తీసుకోలేదు. ఆరికతోట వద్ద ప్రమాదకర మలుపు ఉన్నప్పటికీ ప్రభుత్వం సిగ్నల్ బోర్డులు పెట్టలేదు. ఇటీవల రోడ్డు పక్కన ఉన్న మండల కార్యాలయం వద్ద శ్రావణి అనే మహిళ కారు ఢీకొని చనిపోయింది. అక్కడ స్పీడ్ బ్రేకర్, సిగ్నల్ బోర్డు లేకపోవడమే దీనికి కారణమని స్థానికులంటున్నారు. జాతీయ రహదారి పక్కనే స్కూళ్లు, హాస్టళ్లు ఉన్నా స్కూల్ జోన్ బోర్డులేవీ కనిపించవు. దినదిన గండం బాడంగి: మండలంలో ప్రధాన రోడ్లు, కల్వర్టులు అధ్వానంగా ఉన్నాయి. వీటిపై ప్ర యాణం దినదిన గండంగా మారుతోంది. పాల్తేరు -వాడాడకు బస్సు సౌకర్యం ఉన్నా రోడ్డు మట్టిరోడ్డును తలపిస్తుంది. కోడూ రు -షికారుగంజి రోడ్డు కూడా అక్కడక్కడా పాడైపోవడంతో బస్సుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఆకులకట్ట గ్రామం శివారులో గల చెరువు గట్టుపై మలుపు మరింతప్రమాదకరంగా మారింది. కానీ ఇక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. భీమవరం-ముగడ మధ్యలో చినమంతపొలం వద్ద రోడ్డు కల్వర్టు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఆదమరిస్తే అంతే... తెర్లాం రూరల్: మండలంలో పలు గ్రామాల వద్ద ఉన్న కల్వర్టులు ప్రయాణికులను భయపెడుతున్నాయి. ఇక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తెర్లాం-బొబ్బిలి ఆర్ అండ్ బీ రోడ్డులో తెర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దాటిన తరువాత ఉన్న మంగళి గెడ్డ కాలువపై గతంలో నిర్మించిన కాజ్‌వేకు రెండు వైపులా రక్షణ గోడలు లేవు. రాజాం-రామభద్రపురం రాష్ట్రీయ రహదారిని ఆనుకొని టెక్కలివలస, పెరుమాళి, నెమలాం జంక్షన్, డి.గదబవలస, పణుకువలస జంక్షన్, వెలగవలస, రంగప్పవలస, తెర్లాం జంక్షన్, ఎంఆర్ అగ్రహారం, కూనాయవలస గ్రామాలు ఉన్నా యి. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో వాహనాల రాకపోకలు ఉంటాయి. కానీ ప్రమాదాల నివారణకు అధికారులు తీసుకున్న చర్యలు శూన్యం. -
ఎస్సీ,ఎస్టీలకు ‘ఉచిత’షాక్ !
బొబ్బిలి : ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్తు ఇస్తాం.. ఎవరూ బిల్లులు చెల్లించక్కరలేదని గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఇచ్చిన హామీ ఇప్పుడు లబ్ధిదారుల కొంపముంచుతోంది. అప్పటి సీఎం హామీతో బిల్లులు చెల్లించని వారికి ఇప్పుడు వేలాది రూపాయల బిల్లులు అందుతున్నాయి. వాటిని చూసిన వినియోగదారులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇంత డబ్బు ఇప్పుడు ఎలా కట్టాలా అని వారు ఆందోళన చెందుతున్నారు. బొబ్బిలి డివిజన్లోని పది మండలాల్లో ఎస్సీ వినియోగదారులు 11,814 మంది ఉండగా, ఎస్టీ వినియోగదారులు 5,141 మంది ఉన్నారు. జిల్లా వాప్తంగా వీరి సంఖ్య భారీగా ఉంది. వీరిలో చాలా మందికి ఇప్పుడు ఉచిత విద్యుత్ షాక్ ఇస్తోంది. ఎస్సీ, ఎస్టీలు నెలకు 50 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా వినియోగించుకోవచ్చని కిరణ్‌కుమార్ రెడ్డి ప్రకటించడంతో రంగంలోకి దిగిన ట్రాన్స్‌కో అధికారులు గ్రామాల్లోని ఎస్సీ,ఎస్టీ కాలనీలపై దృష్టి సారించి, వినియోగదారులను గుర్తించారు. వారందరికీ ‘ఉచితం’ పథకంలోకి తీసుకువచ్చారు. కుల ధ్రువీకరణపత్రాన్ని అందజేసిన వారికి ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తామని ప్రకటించడంతో తహశీల్దార్ల చుట్టూ తిరిగి సర్టిపికేట్లు చేయించుకున్నారు. ధ్రువీకరణ పత్రాలు పొందిన వారి పేర్లను మొదటి లిస్టుల్లో నమోదు చేశారు. పత్రాలు లేనివారిని పక్కన పెట్టి రెండో లిస్టుకు సిద్ధం చేశారు. అయితే వీటిని ఈ ఏడాది ఫ్రిబవరి నుంచి పూర్తి స్థాయిలో అమలులోనికి తెచ్చారు. 50 యూనిట్ల లోపు వినియోగించిన వారి నుంచి విద్యుత్ అధికారులు డబ్బులు కట్టించుకోవడం లేదు గానీ, బిల్లులు మాత్రం పంపుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఈ రాయితీకి సంబంధించిన డబ్బులు ఇప్పటివరకూ పైసా కూడా ట్రాన్స్‌కోకు జమ కాాలేదు. దీంతో ట్రాన్స్‌కో అధికారులు ఆ సొమ్మును వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు చర్యలు చేపట్టారు. వినియోగదారులకు పంపుతున్న బిల్లుల్లోనే ఉచిత విద్యుత్ బిల్లుల మొత్తాలను కూడా వేసి చూపిస్తున్నారు. బిల్లులు చెల్లించమని ఒత్తిడి తెస్తున్నారు. బిల్లులు చెల్లించని వారి కనెక్షన్లను తొలగిస్తుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో చాలా మంది అప్పులు చేసి వేలాది రూపాయలను కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. బొబ్బిలి మండలంలోని పణుకువలస గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఇప్పుడు వేలాది రూపాయలు బిల్లులు అందుతుండడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. రూ. 1,314 బిల్లు వచ్చింది మేము, మా కొడుకులం కలిసి ఉంటున్నాం. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా కరంటు ఇస్తారంటే మేమెవ్వరమూ బిల్లులు కట్టలేదు. ఇప్పుడు 1,314 రూపాయలు వచ్చింది. పేదోళ్లం ఇంత డబ్బు ఇప్పుడు ఎలా కడతాం. - జలుమూరు వెంకన్నదొర, చిన్నమ్మి, ఎం పణుకువలస -
ప్రేక్షకుల మదిలో స్థానమే లక్ష్యం
బొబ్బిలి: నటించిన సినిమా లేదా సీరియల్ పేరునే ఇంటిపేరుగా మలుచుకున్న వారు చాలా కొద్ది మందే ఉంటారు. అలాంటి కొద్ది మందిలో ఒకరు ‘కల్కి’ రాజ్. టీవీ సీరియళ్లతో జనాలకు చేరువైన ఆయన ఇప్పుడు సినిమాల్లోనూ రాణిస్తున్నారు. విశాఖకు చెందిన తెలగారెడ్డి రాజా ఇప్పుడు కల్కి రాజ్‌గా ప్రేక్షకులను అలరిస్తున్నారు. గురువారం బొబ్బిలి వచ్చిన ఆయన సాక్షితో ఇలా ముచ్చటించారు. మీ నేపథ్యం ఏంటి? నాది విశాఖ పట్నం. ఎంబీఏ వరకూ చదువుకొని ఐసీఐసీఐలో ఉద్యోగం చేశాను. మరి టీవీ అవకాశాలు ఎలా వచ్చాయి? నా మిత్రుడు ద్వారా టీవీలో నటించే అవకాశం వచ్చింది. ఇంతకీ మీ పేరు ముందు కల్కి ఎలా వచ్చింది? నేను నాలుగేళ్ల కిందట కల్కి సీరియల్లో ప్రధాన పాత్ర వే శాను. అది బాగా పాపులర్ అయ్యి ఇప్పుడు అందరూ కల్కిరాజ్ అని పిలుస్తున్నారు. ఇప్పటివరకూ మీరు చేసిన సీరియల్స్ ఏమిటి? ఇప్పటి వరకూ ఏడు సీరియల్స్ చేశాను. అన్నింటిలోనూ హీరో పాత్రలే చేశాను. క్రాంతి, అడగక ఇచ్చిన హామీలు, చిన్న కొడుకు, ఆడదే ఆధారం, మమతల కోవెల, పుత్తడి బొమ్మ, ముద్దుబిడ్డలో నటించాను. సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? టీవీ సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు వేస్తుండడంతో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. శ్రీకాంత్ హీరోగా వచ్చిన మల్లిగాడు మ్యారేజ్ బ్యూరోలో ప్రధాన పాత్ర పోషించాను. ఇప్పుడు రెండో సినిమా చేస్తున్నాను. బ్యాంకు ఉద్యోగంలో ఉండగా అవకాశాలు వచ్చాయి. నటనలో ఏమైనా శిక్షణ తీసుకున్నారా? అవును ఒకే సారి ఉద్యోగం నుంచి నటుడిని అయ్యాను. ఇది ఊహించలేనిది. ఈ ఫీల్డు అంటే ఆసక్తి ఉంది కానీ అప్పటికి ఏ ప్రయత్నాలూ చేయలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దీనిలో రాణించడానికి దేవదాసు కనకాల ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో రెండు నెలల శిక్షణ తీసుకున్నాను. మీ లక్ష్యం ఏమిటి? ప్రేక్షకులు ఆదరించే పాత్రలు వేసి, మంచినటుడుగా వారి మనసులో స్థానం సంపాదించడమే లక్ష్యం. అందుకు నిరంతరం శ్రమిస్తాను. -
బొబ్బిలిలో ‘టైగర్’!
బొబ్బిలి: సందీప్ కిషన్ హీరోగా, సీరత్ కపూర్ హీరోయిన్గా తెరకెక్కుతున్న ‘టైగర్’ సినిమా క్లైమాక్స్‌ను చారిత్రక బొబ్బిలి రాజుల గెస్టుహౌస్‌లో చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మురుగదాసు వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఎ న్వీఆర్ సినీ పిక్చర్ బ్యానర్‌పై ఠాగూర్ మధు, ప్రసాద్‌లు చిత్రా న్ని నిర్మిస్తున్నారు. సినిమాలో విలన్‌గా నటిస్తున్న దొర్తె, ముం బైకి చెందిన బాబీలపై సన్నివేశాలను సినిమాటోగ్రాఫర్ చోటా.కె.నాయుడు గురువారం తీశారు. సినిమాలో టీవీ నటుడు కల్కి రాజ్ ప్రధాన పాత్ర పోషిస్తుండడం విశేషం. మరో ఐదు రోజులు ఇక్కడే షూటింగ్ నిర్వహిస్తారు. సినిమా నిర్మాణానికి, లోకేషన్ పరంగా బొబ్బిలి చాలా బాగుందని, ఇక్కడ తీసిన ప్రతి సినిమా విజయవంతం అవుతుందని వారు తెలిపారు. -
ప్రజా వ్యతిరేకులు మోదీ, బాబు
బొబ్బిలి : ప్రజలను మాయ చేయాలని చూసే వాడే అందంగా మాట్లాడతాడని, ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం. కృష్ణమూర్తి అన్నారు. పట్టణంలోని అంజనీ కల్యాణ మండపంలో బుధవారం సీపీఎం డివి జన్ స్థాయి మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చెప్పిన ఏ మాటా నమ్మడానికి లేదన్నారు. పైకి చెప్పేదొకటి, చేస్తున్నదొకటిగా ఉంటుందన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్‌గా మారుస్తామన్న చంద్రబాబు, అక్కడ సంతలా ఉం టుందని, వ్యవసాయం, పరిశ్రమలు ఉండదని, ఈ రాష్ట్రాన్ని కూడా అలాగే చేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. క్లస్టర్ విధా నం పెట్టి విద్యను దూరం చేస్తున్నారన్నారు. మొన్నటి వరకూ 3 కిలోమీటర్ల దూరం వరకేనని పరిమితి విధించి ఇప్పుడు పది కిలోమీటర్లు పెంచారని, రాష్ట్రంలో అసలు ప్రభుత్వ బడులు ఉండకూడదన్నదే చంద్రబాబు ఉద్దేశమన్నారు. లచ్చయ్యపేట చక్కెర కర్మాగారాన్ని ఆనాడు అతి తక్కువగా ప్రైవేటుకు అమ్మేసిన చంద్రబాబు, ఇప్పుడు రైతులకు రావలసిన బకాయి కోసం యాజ మాన్యాన్ని అరెస్టు చేస్తే ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి కౌంటర్ దాఖలు చేయాలని, అలా కాకుండా యాజమాన్యానికి వత్తాసు పలికిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకులని విమర్శించారు. సామాన్య ప్రజల గొంతు కోసే విధంగా నిర్ణ యాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కార్మిక చట్టాలను సవరించి సంఘాలే లేకుండా చేయాలని మోదీ, బాబు చూస్తున్నార న్నారు. దోపీడీ వర్గాలకు ప్రయోజనం చేకూర్చడానికి, వారి ఆటలు సాగడానికి మోదీ ప్రభుత్వాన్ని తీసుకువచ్చారన్నారు. ఇందు కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రూ. 50 వేల కోట్ల పెట్టుబడుదారులు ఖర్చు పెట్టారని ఆరోపించారు. అంతకుముం దు ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, స్తూపం వద్ద నివాళులు అర్పించారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి రెడ్డి వేణు అధ్యక్షతన జరిగిన ఈ సభలో చెరకు రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ, సీఐటీయూ నాయకుడు పి. శంకరరావు, రామారావు, తదితరులు పాల్గొన్నారు. -
రుణమాఫీ అమలులో విఫలం
బొబ్బిలి :ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులను నిర్వీర్యం చేసేలా టీడీపీ ప్రభుత్వం కమిటీలు వేసి ఎస్సీ, బీసీ రుణాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తుందని, వాటిని రద్దు చేసేలా ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని బొబ్బిలి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. మంగళవారం ఆయన బొబ్బిలి కోటలో విలేకరులతో మాట్లాడారు. ఎటువంటి స్థాయి, స్థోమత లేనివారితో కమిటీలు వేసి పబ్బం గడిపేస్తున్నారన్నారు. పచ్చచొక్కాలకే పథకాలు ఇవ్వడానికి ఇటువంటివి చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి కమిటీల వల్ల ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు విలువ లేకుండాపొతుందన్నారు. ఎన్నికల హామీగా ఇచ్చిన రుణమాఫీని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వ్యవసా య రుణాలను మాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు పంట రుణాలు మాఫీ చేసే ప్రక్రియను ప్రారంభించారన్నారు. గ్రామాల్లో సదస్సులు పెట్టి పత్రాలు ఇ స్తున్నా.. రైతుల ఖాతాల్లోకి రూపాయి కూడా జమ కావడం లేదని చెప్పారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే విధంగా ప్రశ్నిస్తామని తెలిపారు. జిల్లాల్లో అనేక పరిశ్రమలు రకరకాల కారణాల వల్ల మూతపడుతున్నాయని, దీని వల్ల రోజు రోజుకు నిరుద్యోగ సమస్య పెరుగుతుందన్నారు. పరిశ్ర మలను తెరిపించడంలో ప్రభుత్వం చొరవ చూపక పోవడంతో ఈ దుస్థితి నెలకొందన్నారు. నిరుపేదలకు ఇచ్చే పింఛన్లలో కోత విధించి అర్హులకు అన్యా యం చేశారన్నారు. ఐదు రెట్లు పింఛన్లు పెంచామని గొప్పగా చెబుతూ వేలాది మందికి పింఛన్లు లేకుండా చేశారని ఆరోపించారు. అర్హత ఉన్నవారం దరికీ మళ్లీ పింఛన్లు మంజూరు చేయాలని, తప్పుడుగా తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హుద్‌హుద్ తుపాను వచ్చి రెండు నెలలైనా ఎవరికీ సాయం అందలేదన్నారు. గృహాలు కోల్పోయి నిరుపేదలు రోడ్డున పడ్డారని, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో మత్య్సకా రులకు అపార నష్టం కలిగిందన్నారు. బోట్లు, వలలు, ఇళ్లు పాడైనా...వారికి ఎటువంటి సహాయం అందలేదన్నారు. రైతులకు ఒక్క అరటి పంటకు మాత్రమే పరిహారం ఇచ్చి వరి, చెరుకు రైతులకు అన్యాయం చేశారని తెలిపారు. గతంలో లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం సమస్యపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నించామని, కానీ ఇప్పటికీ పరిస్థితి మారలేదన్నారు. కొత్త సీజన్ కష్టాలు, పాత బకాయిలు తీర్చకపోవడం వంటివి ఇంకా వెంటాడుతున్నాయ న్నారు. వీటిన్నింటి గురించి అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు. ఒప్పందాలు అమలయ్యేలా చూడండి పట్టణంలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస మిల్లు యాజమాన్యం, కార్మిక సంఘ నాయకుల మధ్య జరిగిన ఒప్పందాలు అమలయ్యేలా చూడాలని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావును కార్మిక సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం సీఐటీయూ, ఇఫ్టూ సంఘాల నాయకులు కోటలో ఎ మ్మెల్యేను కలిశారు. ఇటీవల రెండు నెలల పాటు మిల్లును మూసేసిన సమయంలో కార్మికులు చేసిన పోరాటాలకు సంఘీభావం తెలిపి వారి వెన్కంటి ఉన్నందుకు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల యాజమాన్యంతో జరిగిన చర్చలు.. ఆ తరువాత విధుల్లోకి వెళ్లడం వాటిని కూలానుకూషం గా వివరించారు. మిల్లు ప్రస్తుతం తిరుగుతున్నా ఇంకా బదిలీ కార్మికులకు సరైన పని కల్పించడం లేదని, దీని వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బందులకు గురవు తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు వి. శేషగిరిరావు, ఎ. సింహాచలం, డి. శ్రీనివాసరావు, మోహన్, తదితరులు పాల్గొన్నారు. -
జూట్ కార్మికుల రాస్తారోకో
బొబ్బిలి: స్థానిక శ్రీ లక్ష్మీ శ్రీనివాస జూట్ మిల్లు మూతపడిందని, దానిని తెరిపించడానికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద బుధవారం రాస్తారోకో నిర్వహించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా మొండి వైఖరి వహిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. బొబ్బిలి పర్యటనకు వచ్చిన మంత్రి మృణాళినికి వినతిపత్రం ఇవ్వాలని చూసినా జూట్ కార్మికులు రాస్తారోకో చేసి వాహనాన్ని అడ్డుకుని మంత్రిని ఘెరావ్ చేసే అవకాశం ఉందని తెలుసుకున్న పోలీసులు మంత్రిని వేరే దారిలో విజయనగరం సాగనంపారు. అనంతరం రాస్తారోకో చేస్తున్న స్థలం వద్దకు సీఐ వీరకుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసలు తరలివచ్చారు. ఒకానొక దశలో జూట్ కార్మికులను బలవంతంగా అక్కడ నుంచి పోలీస్ స్టేషనుకు తరలించాలన్న ఆలోచనకు పోలీసులు వచ్చారు. కార్మికులు, నాయకులు కూడా అందుకు సిద్ధమయ్యారు. ఈలోగా సీఐ చొరవ తీసుకుని రెండు రోజుల సమయం ఇవ్వాలని కోరారు. దాంతో కార్మికులు ఆందోళన విరమించారు. ఆదివారానికి సమస్య పరిష్కారం కాకపోతే సోమవారం రహదారులను దిగ్బంధిస్తామని కార్మిక నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో పి శంకరరావు, ఎ సింహాచలం, వి శేషగిరి, బి శ్రీను తదితరులు పాల్గొన్నారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట జూట్కార్మికుల ధర్నా బొబ్బిలి రూరల్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ,ఇఫ్టూల ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీశ్రీనివాసా జూట్ కార్మికులు బుధవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికుల హక్కులు కాలరాస్తున్న యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని, కార్మికులకు న్యాయం చేసి మిల్లు తెరవాలని, బోనస్,ఈఎస్ఐ, గ్రాట్యుటీలు చెల్లించాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ కార్యదర్శి పొట్నూరు శంకరరావు మాట్లాడుతూ హుద్‌హుద్ తుపాను సమయంనుంచి కరెంటు కోత పేరిట కార్మికులకు యాజమాన్యం అన్యాయం చేసిందని, దసరా బోనస్ చెల్లించలేదని, అలాగే కార్మికులకు చెందిన ఈఎస్ఐ,పీఎఫ్, గ్రాట్యుటీ బకాయిలు రూ.కోట్లలో ఉందని వీటిని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. చర్చలపేరిట యాజమాన్యం తాత్సారం చే స్తోందని, కార్మికుల ఆకలికేకలు ప్రభుత్వానికి, అధికారులకు పట్టడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇఫ్టూ నాయకుడు సన్యాసిరావు మాట్లాడుతూ కార్మికులకు మూడునెలలుగా యాజమాన్యం అన్యాయం చేస్తోందని, ఉద్యోగ విరమణచేసిన ఉద్యోగుల బకాయిలు చెల్లింపుల విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకె ళ్లినా ఎవరూపట్టించుకోవడంలేదని ఆందోళన వెలిబుచ్చారు. అనంతరం తహశీల్దార్ బి.మాసిలామణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ,ఇఫ్టూ నాయకులు వి.శేషగిరిరావు, జుత్తాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పట్టణం నిద్రపోతున్న వేళ
ఆకాశంలో నుంచి మేఘాలు కిందికి దిగుతున్నట్లు తెరలు తెరలుగా కమ్ముకుంటున్న మంచు. గాలులు బద్దకంగా కదులుతున్న సమయం. గువ్వలు కూడా గూటి బయటకు రాలేని వేళ. నిశ్శబ్దం రాజ్యమేలుతున్నప్పుడు కొందరు విధులు నిర్వహిస్తున్నారు. అన్ని కాలాల్లోనూ రాత్రి విధులు నిర్వహించినా... శీతాకాలపు రాత్రులు మాత్రం చాలా కష్టంగా గడుస్తాయని వీరు చెబుతున్నారు. పట్టణమంతా నిద్రపోతున్న వేళ అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు బొబ్బిలిలో విధులు నిర్వహిస్తున్న వారి గురించి తెలుసుకోవడానికి సాక్షి చేసిన ప్రయత్నం... సమయం: 12.10 రాత్రి స్థలం : కోర్టు, పెట్రోలు బంకు జంక్షన్ వీధి లైట్ల వెలుతురులో పోలీస్ కానిస్టేబుళ్లు నాగేశ్వరావు, మురళీకృష్ణలు విధులు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ హై పవర్ లైట్ల నుంచి ఎంత వెలుగు వస్తుందో అంతే స్పీడుగా మంచు కూడా కురుస్తోంది. చేతిలో కర్ర, బీటు పుస్తకం పట్టుకొని వారు అదే మంచులో నించుని పరిశీలన చేస్తున్నారు. మధ్య మధ్యలో వాసిరెడ్డి సర్కిల్, రైల్వే స్టేషన్లవైపు వెళ్లి వస్తున్నారు. సమయం: 1.15స్థలం : ప్రభుత్వ వైద్యశాల అర్ధరాత్రి సమయంలో ఒక సాధారణ ప్రసవం అవ్వగా, ఐదు శస్త్ర చికిత్సలు జరిగాయి. ఆపరేషన్లు ముగించుకొని వైద్యుల బృందం ఇంటికి వెళ్లగా అక్కడ సిబ్బంది ప్రసవం అయిన వారికి సపర్యలు చేస్తున్నారు. వార్డుల్లో ఉండే వారికి ఏఎన్ఎం ఇంజెక్షన్లు చేస్తూ విధి నిర్వహణలో ఉండగా స్టాప్‌నర్సు రికార్డులు రాయడంలో ఔట్ సోర్సింగు సిబ్బంది థియేటరు శుభ్రపరచడంలో నిమగ్నమై ఉన్నారు. సమయం: 12:25స్థలం : ఆర్టీసీ కాంప్లెక్సు నిర్మానుష్యంగా ఉన్న ఆర్టీసీ కాంప్లెక్సులో ఓ మూలన సంచార జీవులు నిండా ముసుగేసుకొని చలిని తట్టుకుంటూ ఓ మూలన పడుకుని ఉన్నారు. బస్సులు తప్పిపోయిన కొందరు వ్య క్తులు అక్కడే ఆదమరిచి నిద్రపోతున్నారు. గాలులు వణికిస్తుంటే అక్కడే వారు ముసుగులు కప్పుకుని కాలక్షేపం చేస్తున్నారు. సిబ్బంది కనిపించలేదు. సమయం : 1.30స్థలం : దక్షిణ దేవిడి పోలీస్ స్టేషనులో క్రైం పార్టీగా ఉండే కానిస్టేబుళ్లు వై.మురళీకృష్ణ, ఎస్.రమణలు విజిల్స్ వేస్తూ టార్చ్‌లైట్ కొడుతూ దుకాణాల వద్ద పరిశీలన చేస్తున్నారు. ఆ సమయంలో చెన్నై నుంచి బొబ్బిలి వచ్చిన చిత్రకోటబొడ్డవలస గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అటుగా వస్తుండగా వారిని నిలిపివేసి విచారణ చేశారు. వారి వద్ద వస్తువులను తనిఖీలు చేస్తుండగా పట్టణంలోని అమ్మిగారి చెరువు గట్టుకు చెందిన ఓ తాపీ మేస్త్రీ కూడా రావడంతో అతనికి సంబంధించిన బ్యాగులు పరిశీలన చేశారు. వారికి సంబంధించిన చిరునామాలు తీసుకొని ఇక ఎప్పుడు బయటకు వచ్చిన గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలని సూచించి పంపిచేశారు. సమయం 2.00స్థలం: ఎస్బీఐ జంక్షన్ ఇది కూడా వ్యాపార సముదాయమే. స్టేట్‌బ్యాంకు, గ్రామీణ బ్యాంకుతో పాటు నాలుగైదు ఏటీఎంలు ఈ కూడలిలో ఉన్నాయి. ఆంధ్రా బ్యాంకు ఏటీఎం వద్ద ఆరుబయటే సెక్యూరిటీ గార్డు విధులు నిర్వహిస్తున్నారు. చలిని తట్టుకుంటూ విధి నిర్వహణలో ఉండగా పోలీస్ స్టేషనుకు చెందిన కానిస్టేబుల్ వై.నాయుడు, హోంగార్డు శ్రీనులు అక్కడకు వచ్చారు. అప్పటికే అక్కడ నుంచి గుర్కా వాళ్లు విజిల్స్ వేసుకొని వెళ్లిపోయారు. స్టేట్‌బ్యాంకు వద్ద ఉండే బీటు పుస్తకాన్ని టార్చ్‌లైటు వెలుగులో వీరు పరిశీలన చేశారు. ఆ తర్వాత అటుగా వెళుతున్న ఆటోను నిలిపివేసి వివరా లు అడిగి తెలుసుకున్నారు.. ఇలా రాత్రంతా మంచులో తిరుగుతూ వీరు విధులు నిర్వహించారు. సమయం: 12.45స్థలం: రైల్వే స్టేషను విశాఖ నుంచి రాయిపూర్ వెళ్లే పాసింజరు మరి కొద్ది సేపట్లో వచ్చే సమయం. పాసింజర్లు వస్తారేమోనన్న ఆశతో రిక్షా డ్రైవర్లతో పాటు ఆటో డ్రైవర్లు ఎదురుచూస్తున్నారు. అర్ధరాత్రి దాటాక వస్తున్న ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చి నాలుగు రాళ్లు సంపాదించి తెల్లారి ఇంటికి ఇద్దామని వారి తాపత్రయం. రిక్షా డ్రైవర్ డి.వెంకటరమణతో పాటు మరో ఇద్దరు రిక్షా డ్రైవర్లు నిండా ముసుగేసుకొని మంచులో ప్రయాణికుల కోసం ఎదురుచూస్తున్నారు. పెట్రోల్ బంకు జంక్షన్లో ఆటో డ్రైవరు రామకృష్ణతో పాటు రామభద్రపురానికి చెందిన ఓ ఆటో డ్రైవరు ఉన్నారు. అప్పటికే రైల్వే స్టేషను ఆరుబయట కొంత మంది యాచకులు చలికి తట్టుకుంటూనే నిద్రిస్తున్నారు. సమయం: 1.45స్థలం: మెయిన్ రోడ్డు అప్పటికే ట్రాఫిక్ జీపులో హెచ్‌సీ నారాయణరావు డ్రైవరు రాంబాబుతో పాటు మెయిన్‌రోడ్డులో పహారా కాస్తున్నారు. అర్ధరాత్రి దాటాక అటువైపుగా వస్తున్న వాహనాలను నిలిపివేసి పరిశీలన చేస్తున్నారు. మండలంలోని పక్కి నుంచి మండపేటకు తరలివెళ్తున్న ధాన్యం లారీని నిలిపివేసి ప్రశ్నించారు. అనుమతులు అన్నీ ఉండడంతో అక్కడ నుంచి పంపించేశారు. మెయిన్‌రోడ్డులోనే బంగారు దుకాణాలు, వ్యాపార సముదాయాలు అన్నీ ఉండడంతో రాత్రంతా ఆ రోడ్డులో పోలీసులు గస్తీని ఏర్పాటు చేశారు. -
ధర్నాకు భారీగా తరలిరండి: సుజయకృష్ణ
బొబ్బిలి: ఆంధ్రప్రదేశ్ సీఎం ఇచ్చిన హామీల వైఫల్యాలపై నిరసన తెలియజేయాలని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సుజయకృష్ణ రంగారావు అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో శుక్రవారం జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డిసెంబర్ 5న జరిగే ధర్నాకు భారీగా తరలిరావాలని ఆయనీ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైవుండి జాబితాలో పేర్లు తొలగించిన బాధితులను కలుపుకుని పోరాటం చేద్దామని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. పార్టీకి సంబంధించిన మండల, గ్రామ కమిటీల ఏర్పాటుపై కూడా సమావేశంలో చర్చించారు. -
ఎందుకీ నిర్లక్ష్యం!
పండించిన పంట సిద్ధంగా ఉంటే ఎవరైనా ఏమి చేస్తారు. ఆయా ఉత్పత్తులకు సంబంధించి ఎవరు ఎక్కడ ఉన్నారో వెతికి మరీ వారి వద్దకు తీసుకు వెళ్లి విక్రయిస్తారు. నష్టమైనా, లాభమైనా సరుకు బయటకు వెళ్లిపోయేలా చూస్తారు. కానీ బొబ్బిలిలోని జూట్ కార్పొరేషన్ అధికారులు ఇందుకు విరు ద్ధంగా వ్యవహరిస్తున్నారు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన జూట్‌ను ఏడాదిగా అమ్మకాలు చేయకుండా గోదాంలో ముగ్గ పెడుతున్నారు. దీంతో అసలే అంతంతమాత్రంగా ఉన్న ఈ శాఖలో ఉన్న కొద్ది మంది ఉద్యోగులు ఆ జూట్ గోదాంల్లో పదిలంగా ఉందా? ఏమైనా జరిగిందా అంటూ రోజూ వాకబు చే సుకోవలసిన దుస్థితి నెలకొంది. బొబ్బిలి : రాష్ర్టంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనే ఎక్కువగా జనపనార మిల్లులు ఉండడంతో ఈ రెండు జిల్లాల్లోని రైతులు ఎక్కువగా జనుము సాగు చేస్తున్నారు. అయితే కొన్నేళ్లుగా విస్తీర్ణం బాగా తగ్గుముఖం పడుతోంది. గత ఏడాది సుమారు 2 వేల క్వింటాళ్ల వరకూ గోగును జేసీఐ ద్వారా కొనుగోలు చేసింది. జేసీఐ కొనుగోలు చేసిన జూట్‌ను ఎప్పటికప్పుడు మిల్లుకు పంపడం చేస్తుండాలి. అయితే జేసీఐ దగ్గరే కొనుగోలు చేయాలన్న నిబంధనలు కచ్చితంగా లేకపోవడంతో మిల్లుల యాజమాన్యం కూడా ప్రైవేటు వర్తకుల మీదే ఆధారపడుతున్నారు. గతేడాదికి సంబంధించి ఇంకా 327 బేళ్లు జూట్‌మిల్లు కొనుగోలు చేయక బొబ్బిలిలోని గోదాంల్లో మూలుగుతున్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఉన్న గోదాంల్లో వీటిని నిల్వ చేశారు. దాదాపు 4 వందల క్వింటాళ్లు వరకూ ఇది ఉంటుంది. ఈ ఏడాది పొడవునా జేసీఐ అధికారులు దీన్ని విక్రయించడానికి అసలు ప్రయత్నాలు చేసిన దాఖ లాలు లేవు. దీంతో ఇక్కడ గోదాంలో ఉండే జూట్ ఏడాది కిందట బరువుకు, ఇప్పటికి చాలా వ్యత్యాసమే వచ్చి ఉంటుంది. ఇందంతా ఇప్పుడు జేసీఐకి న ష్టమే. ప్రభుత్వ నియమ నిబంధనలు కూడా కచ్చితంగా లేకపోవడం, మిల్లుల యజమాన్యాలకు సరైన దిక్సూచీ ఇవ్వకపోవడంతో ఇలాంటి సంఘటన లు చోటు చేసుకుంటున్నాయి. ప్రైవేటు ధర 200 రూపాయల అధికం ఈ ఏడాది జేసీఐ ప్రకటించిన మద్దతు ధర కంటే ప్రైవేటు ధర రెండు వందల రూపాయలు అధికంగా ఉండడంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లా లో ఉన్న 11 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకూ అసలు బోణీయే పడ లేదు. శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస, పొందూరు, రాజాం, కోటబొమ్మాళి లో, విజయనగరం జిల్లాలోని విజయనగరం, డొంకినవలస, బలిజిపేట, బొబ్బిలి, మక్కువ, గజపతినగరం, పార్వతీపురంల్లో కొనుగోలు కేంద్రాలున్నా యి. అటువైపు రైతులు ఈ ఏడాది కన్నెత్తి చూడని పరిస్థితి ఎదురైంది. దీంతో జేసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద పనిముట్లు, బేళ్లు కట్టిన యంత్రాలన్నీ మూలకు చేరుకున్నాయి. కాగా ఈ విషయమై రీజనల్ మేనేజర్ రమణ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా బొబ్బిలిలోని గోదాంలోగత ఏడాది జూట్ నిల్వ ఉండడం వాస్తవమేనని చెప్పారు. వాటిని కొనుగోలు చేయడానికి ఏపీ ఫైబర్, విజయగనరంలోని రెండు జూట్ మిల్లులు ముందుకు వచ్చాయని తెలిపారు. త్వరలోనే వాటిని ఆయా మిల్లులకు తరలిస్తామన్నారు. మద్దతు ధర జేసీఐది తక్కువగా ఉండడం వల్ల రైతులు ఆసక్తి చూపడం లేదన్నారు. -
కష్టాలు వింటూ...
పౌరుషానికి పుట్టినిల్లు, చరిత్రాత్మక బొబ్బిలి పట్టణ శివారున 35 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇందిరమ్మ కాలనీ. 2004లో ఆర్వీ సుజయకృష్ణ రంగారావు ఎమ్మెల్యేగా మొదటి సారి ఎన్నికైన తరువాత పట్టణంలో ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి ఇక్కడ మూడు విడతల్లో ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. రెండు విడతల్లో 20 వార్డులకు చెందిన నిరుపేదలకు ఇక్కడ పట్టాలు ఇచ్చారు. 2006లో వారు ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్నారు. ప్రస్తుతం 18 వందల మంది వరకూ ఇక్కడ నివాసముంటున్నారు.. కాలనీ ఏర్పడి ఎనిమిదేళ్లవుతున్నా ఇక్కడ సరైన రహదారులు, వీధి లైట్లు, తాగునీటి వంటి కనీస సదుపాయాలు లేవు. చీకటి పడితే ఒకవైపు పాములు, మరో వైపు దొంగల భయంతో కాలనీవాసులు అల్లాడిపోతున్నారు. నిత్యావసర సరుకుల కోసం చాలా దూరం వెళ్లవలసిన పరిస్థితి. ఈ కాలనీ వాసుల సమస్యలు తెలుసుకునేందుకు బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయకృష్ణ రంగారావు ‘సాక్షి’ తరఫున వీఐపీ విలేకరిగా మారారు. కాలనీ ప్రజలతో మాట్లాడి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ కాలనీని మోడల్ కాలనీగా చేయడానికి ఎంతో ప్రయత్నించాను కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఇక్కడ నీటి సమస్య తీర్చడానికి రక్షిత పథకం నిర్మించాలని ప్రతిపాదించినా ప్రభుత్వం ముందుకు రాలేదు. పర్యటనలో నా దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు పరిష్కరిస్తాను. ఇక్కడ కాలనీ వాసుల కోసం ప్రత్యేక రేషన్ డిపో ఏర్పాటు చేస్తాను. మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తాను. రహదారులు, వీధిలైట్లు, కాలువల నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తాను. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో కూడా ఈ సమస్యను ఫ్లోర్‌లీడరు, కౌన్సిలర్లు ద్వారా తెలియపరిచి కాలనీవాసులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తాను. ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు సుజయ్: నేను సుజయ్ కృష్ణ రంగారావు, బొబ్బిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాను.. మీ కాలనీ సమస్యలు తెలుసుకోవడానికి మీ దగ్గరికి విలేకరిగా వచ్చాను.. ఏం బాబూ బాగున్నావా... నీ పేరేంటి.. ఏమిటీ నీ ఇబ్బంది? నా పేరు పాపారావు బాబు.. నాకు రెండు కాళ్లు రావు.. సైకిల్ అయితే ఉంది గానీ ప్రభుత్వం నుంచి ఏ సాయం అందడం లేదు.. సుజయ్: ఎన్ని ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నావు పాపారావు: అయిదేళ్లుగా ఉంటున్నాను బాబు.. ఉండడానికి స్థలం లేదు.. ఇద్దరు పిల్లలున్నారు. సుజయ్: నీకు రేషను కార్డు ఉందా? పాపారావు: ఉందండీ సుజయ్: సరే నీకు ఇంటి స్థలం వచ్చేలా చేస్తాను.. సుజయ్: ఏమ్మా! నీ పేరేంటి. ఏమిటీ సమస్య లక్ష్మి : నాపేరు లక్ష్మి నాయన.. మాది పక్క ఊరు గున్నతోటవలస. మా ఇళ్లు కాలిపోయింది. అయినా ఇప్పటివరకూ ఇల్లు లేదు బాబు సుజయ్: ఎన్నాళ్లు అయ్యింది కాలిపోయి? లక్ష్మి: రెండు సంవత్సరాలు అయ్యింది.. ఎన్ని కాగితాలు పెట్టినా ఎవరు పట్టించుకోవడం లేదు. సుజయ్: నేను అధికారులతో మాట్లాడతాను.. నీకు ఇళ్లు ఇచ్చేలా చేస్తాను... సుజయ్: మీ పేరేమిటి... కాలనీలో సమస్యలు ఏమిటో చెప్పు? శ్రీరాములు: నా పేరు శ్రీరాములు సార్.. తమరు మాకు కాలనీ ఇచ్చారు, కానీ సమస్యలు మాత్రం వదలడం లేదు.. సుజయ్: ఏమేమి సమస్యలున్నాయి.? శ్రీరాములు: ఈ కాలనీకి బొబ్బిలి నుంచి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కోడి చెరువు పక్కనుంచి మధ్యాహ్నం రాలేకపోతున్నాం.. అసాంఘిక కార్యక్రమాలన్నీ ఆ రోడ్డులోనే జరుగుతున్నాయి సార్ సుజయ్: పోలీసులు ఎవరూ రారా అటువైపు..? ఎల్లంనాయుడు: ఎప్పుడో ఫిర్యాదు ఇస్తే ఒకసారి అలా వచ్చి వెళ్లిపోతారు.. అంతే మళ్లీ మామూలే. సుజయ్: కాలనీలో వీధిలైట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? బొంతు శ్రీరాములునాయుడు: లైట్లు ఇలా వేస్తే వారం రోజుల్లోనే అవి పోతున్నాయి.. ఎన్ని సార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు.. సుజయ్: నీ పేరేంటింటి తాతా? చిన్నంనాయుడు: నా పేరు చిన్నంనాయుడు బాబు.. మీరు దయ ఉంచి కాలనీలో వీధిలైట్లు వెలిగేటట్టు చేయండి సుజయ్: ఎక్కడా లైట్లు వెలగడం లేదా..అసలు వేయలేదా?.. చిన్నంనాయుడు: మెయిన్ రోడ్డు తప్పించి ఎక్కడా లైట్లు లేవు.. చీకటి పడితే పాములు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. అల్లు సింగమ్మ: పాములే కాదు బాబు.. దొంగల భయం కూడా ఉంది.. బళ్లు, బక్కలు ఏవీ వీధిలో ఉంచుకోలేక పోతున్నాం సుజయ్: నీ పేరేంటమ్మ.. రత్నం: నా పేరు రెడ్డి రత్నం నాయన.. సుజయ్: ఎంత కాలం నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు.. రత్నం: కాలనీ కట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం బాబు.. కుళాయిలు లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది సుజయ్: మరి మీకు నీరు ఎలా? రత్నం: ట్యాంకరు వస్తుంది. అది కూడా రెండు రోజులకొకసారి. ఆ నీటినే జాగ్రత్తగా వాడుకోవాలి సుజయ్: కాలనీలో బోర్లు ఉన్నాయి కదా. బాగోవా? రత్నం: ఆ నీరు మట్టివాసన కొడుతున్నాయి బాబు.. సుజయ్: నీపేరేమిటి పాప (అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో) స్రవంతి: నా పేరు స్రవంతి సుజయ్: ఏం నేర్చుకుంటున్నావు.. పాటలు పాడడం వచ్చా.. ఏమైందీ ఈ పాపకు ? కార్యకర్త: పుట్టిన దగ్గర నుంచి ఈ పాపకు రెండు కాళ్లు, చేతులు ఇలాగే ఉన్నాయి. సుజయ్: ఈ పాప పేరు ఏమిటి? కార్యకర్త: అలేఖ్య.. ఈయనే తండ్రి తాతారావు తాతారావు: పుట్టినప్పటి నుంచి కాళ్లు చేతులు ఇలాగే ఉండిపోయాయి. ఏమి చేయాలో అర్థం కావడం లేదు.. సుజయ్: పాప ఏ పనీ చేసుకోలేదా? తాతారావు: ఏ పనీ చేయలేదు..దేనికీ సహకరించవు కూడా... సుజయ్: వయసు ఎంత ఉంటుంది? తాతారావు: అయిదేళ్లు సార్ సుజయ్: ఈ పాపకు సరైన న్యాయం చేస్తాను.. సరేనా.. సుజయ్ : నీ పేరేంటమ్మ..? శారద: నా పేరు శారద బాబు.. ఈ ఇంటి పక్కనే నలుగురు నడిచిన రోడ్డు ఉంది..అక్కడ విద్యుత్తు వైర్లు ఎలాడుతున్నాయి. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.. సుజయ్: ఎన్నాళ్లు నుంచి ఉంది ఇది? శారద: చాలా కాలం నుంచి ఉంది మధ్యలో స్తంభాలు వేసి వైర్లను మీదకు పెట్టాలి బాబు సుజయ్: ఇక్కడ ఇళ్లన్నీ పునాదులు వేసి వదిలేశారు ఎవరూ కట్టరా..? శారద: కట్టడానికి రెడీ అవుతున్న టైంలో ఇసుక ధరలు పెరిగిపోవడం వల్ల ఎవ్వరూ కట్టడానికి ముందుకు రావడం లేదు.. షేక్ షకీలా: బాబు..మేం కాలనీలో మొదటి విడతలో ఇళ్లు వచ్చిన వాళ్లం... మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.. సుజయ్: ఏమిటీ మీ సమస్య? షకీలా: ఎవరు ఏ పని చేసినా మొదట్లోనే చేస్తున్నారు గానీ ఇటువైపు ఎవరూ రావడం లేదు. నీళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నాం సుజయ్: మీకు బోరింగు లేదా.. ట్యాంకరు రావడం లేదా? షకీలా: బోరింగు ఆరు వీధుల తరువాత ఉంది.. ట్యాంకరు ఒక సారి వస్తే మరో సారి రాదు.. సుజయ్: నీ సమస్య ఏంటమ్మా? రామలక్ష్మి: నా పేరు రామలక్ష్మి.. బాడంగి గూడేపువలస మాది. ఇక్కడకు వచ్చి ఉంటున్నాం. మా ఆయన మూగోడు, కొడుకు పరిస్థితి కూడా అంతే, అయినా పింఛను ఇవ్వడం లేదు.. సుజయ్: వికలాంగుల ధ్రువీకరణ పత్రం ఉంటే పింఛను ఇస్తారు కదా..? రామలక్ష్మి: ఉన్నా ఇవ్వడం లేదు.. అద్దె ఇంట్లో ఉంటున్నాం.. చాలా ఇబ్బందిగా ఉంది. సుజయ్: ఏం బాబు.. ఏం పేరు.. ఏం చేస్తున్నావు..? శ్రీనివాసరావు: నా పేరు శ్రీనివాసరావు సార్.. నేను వృత్తివిద్యాకోర్సు చేస్తున్నాను. బొబ్బిలి పట్టణంలో తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సుజయ్: ఏమైంది..సమస్యేంటి? శ్రీనివాసరావు: ఎప్పుడో వేసిన పాత రోడ్లే ఇంకా ఉన్నాయి. వాటిని విస్తరించకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. సుజయ్: అవును.. వాటి వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. రోడ్ల విస్తరణ కోసం మా ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. బబ్బులు: సార్ నా పేరు బబ్బులు.. ఇక్కడ మైయిన్ రోడ్డు తప్పించి మిగతా రోడ్లన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయి. పాములు తిరుగుతున్నాయి. సుజయ్ : అవును.. అదే చూస్తున్నాను.. బబ్బులు: మొదట వేసిన రోడ్లును అలాగే వదిలేశారు. మున్సిపాలిటీ అసలు పట్టించుకోవడం లేదు..చైర్‌పర్సన్‌ను చూడడానికి రమ్మంటే ఈ చివరకు అసలు రానేలేదు.. సుజయ్: నీ సమస్య ఏంటమ్మా? రామలక్ష్మి: నా సమస్య కాదు సార్.. ఈ కు ర్రోడు వికలాంగుడు..ఎవరూ లేరు. సర్టిఫికెట్ ఉన్నా ఫించను ఇవ్వడం లేదు సార్ సుజయ్: ఎన్నాళ్లుగా రావడం లేదు.. రామలక్ష్మి: అయిదేళ్లుగా రావడం లేదు. సుజయ్ : సరే చూస్తాను... ఏమండీ సర్పంచ్ గారు, మీ సమస్యేంటి? ఈశ్వరరావు: మా గున్నతోటవలస గ్రామానికి చెందిన 25 ఇళ్లు ఈ కాలనీ శివారున ఉన్నాయి సార్.. వాటికి విద్యుత్ సమస్య, రోడ్డు ఇబ్బంది ఉంది.. సుజయ్: విద్యుత్ సమస్య ఏంటి? ఈశ్వరరావు: ఊర్లోంచి వచ్చే మెయిన్ విద్యుత్ వైరుకు ఎక్కడా స్తంభాలు వేయలేదు. దాంతో మధ్యలో ఇళ్ల మీద నుంచి వైర్లు రావడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. సుజయ్: సరే...మధ్యలో స్తంభాలు వేసేలా చూస్తా.. నీ పేరు ఏంటి మామ్మా? శాంత: నా పేరు పిట్ల శాంత బాబు.. సుజయ్: చెప్పు నీ సమస్యేంటో? శాంత: ఈ మధ్యను నాకు రెండు నెలల పింఛ ను ఇచ్చారు బాబు.. దానిలో 5 వందలు ఇరుపుకొంటున్నారు.. ఇలాగైతే మేం ఎలా బతకాలి సుజయ్: ఎవరు తీసుకుంటున్నారు... ఎందుకు తీసుకుంటున్నారో అడగలేదా..? శాంత: పెన్సన్ ఇచ్చిన రామారావే ఇరిపేశారు.. ఎందుకో చెప్పడం లేదు.. సుజయ్: పింఛను తీసుకుంటున్నవారు ఎవరికి డబ్బులు ఇవ్వక్కరలేదు.. అలా అడిగితే మీ కౌన్సిలర్లకు చెప్పండి.. వెయ్యి ఇస్తేగాని వేలి ముద్ర వేయకండి ఇందిర: సార్.. నా పేరు ఇందిర..నేను ఐద్వా జిల్లా నాయకురాలిగా పనిచేస్తున్నాను.. సుజయ్: చెప్పండమ్మా.... ఇందిర : ఈ కాలనీ ఉన్న వాళ్లకు టౌన్లో రేషను సరుకులు ఇస్తున్నారు.. అవి విడిపించడానికంటే వాటికి కాలనీకి తీసుకురావడానికే ఎక్కువ ఖర్చు అవుతోంది. సుజయ్: సరుకుల కోసం ఎక్కడెక్కడకు వెళతారు ? ఇందిర: గతంలో ఈ కాలనీకి రాకముందు ఎక్కడున్నారో ఆ వీధుల్లోకే వెళ్లి తెచ్చుకోవాలి సార్, వీళ్లు వెళ్లేసరికి డిపో తీయకపోతే తిరుగుతుండడమే పని. ఈ కాలనీకి ప్రత్యేకమైన డిపోను ఏర్పాటు చేయించాలి సార్. సుజయ్: తప్పకుండా అలాగే ఏర్పాటు చేయిస్తాను. నీ పేరేంటమ్మా? భారతి: వియ్యపు భారతి సార్.. నా భర్త చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చినా పింఛను మంజూరు చేయలేదు.. సార్ అప్పారావు: సార్ .. నాకు భూములున్నాయని పింఛను తీసేశార్ సార్. సుజయ్: ఎన్నాళ్లు నుంచి పింఛను తీసుకుంటన్నారు. ? అప్పారావు: 20 ఏళ్లుగా పింఛను తీసుకుంటున్నాను. సెంటు భూమి లేదు..ఎవరు చెప్పారో తీసేశారు. సార్.. సుజయ్: ఏమైందయ్యా నీకు..ఏం పేరు నీ పేరు? సత్యారావు: కోట సత్యారావు సార్.నేను ఒకటో వార్డుకు చెందిన వాడిని. నాకు వికలాంగుడి ధ్రువీకరణ పత్రం ఉన్నా ఫించను మాత్రం ఇవ్వడం లేదు.. సుజయ్: ఏమంటున్నారు..ఎందుకు ఇవ్వడం లేదు.? సత్యారావు: ఏమీ చెప్పడం లేదు.. ఈ సర్టిఫికెట్ చేయించుకోవడానికే నాలుగు వేలు ఖర్చు పెట్టాను.. సుజయ్: సరే నేను చూస్తాను. అక్కడ నుంచి కొత్తగా పెట్టిన పాఠశాలకు వెళ్లారు.. మాస్టారు ఇక్కడ ఎంత మంది చదువుతున్నారు? సత్యనారాయణ: ఇక్కడ ప్రస్తుతం 25 మంది ఉన్నారండీ.. కానీ ఈ కాలనీలో సుమారు 50 మందికి పైగా పిల్లలున్నారు.. సుజయ్: ఇక్కడకు ఎప్పుడు వచ్చారు.. మీరు డెప్యుటేషన్‌పై వచ్చారా.? సంతోష్‌కుమార్: ఆగస్టు నెలలో ఇక్కడ స్కూలు పెట్టారు సార్.. టౌన్లో రెండు స్కూళ్లు మూసేసి ఇక్కడ పెట్టారు. మమ్మల్ని బదిలీపై వేశారు.. సుజయ్: అదేంటి ఇక్కడ గతంలో స్కూలు లేకుండా బదిలీపై ఎలా వేశారు? సత్యనారాయణ: ఏమో సార్ ఆర్డర్ అలా ఇచ్చారు.. సునీత: నమస్తే సార్, నేను ఇక్కడ మధ్యాహ్న భోజనాన్ని నడుపుతున్నాను.. సుజయ్: చెప్పమ్మా! నీ సమస్య ఏంటో..? సునీత: స్కూలు ఇక్కడ పెట్టినా వంటకు ఇక్కడ స్టవ్, గ్యాస్, వంట పాత్రలు వంటివి ఇవ్వలేదు. రోజూ ఇంటి దగ్గర వండి తెస్తున్నాను. సుజయ్: బిల్లులు ఇచ్చేస్తున్నారా..? సునీత : రెండు మాసాలుగా అదీ లేదండీ ధనలక్ష్మి: సార్ నమస్తే సార్.. నా పేరు ధనలక్ష్మి.. నేను ఇందిరా గాంధీ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాను. సుజయ్: నమస్తే చెప్పమ్మా! ఏం చదువుతున్నావు ధన లక్ష్మి: బీకాం ఫస్ట్ ఇయర్ సార్..మాకు ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. సుజయ్: నీ పేరేంటమ్మా తులసి: నా పేరు తులసి., మేం నక్కలోల్లం సార్.. మమ్మల్ని ఎస్టీలో కలపాలని ఎన్ని సార్లు కోరుతున్నా అది జరగడం లేదు. సార్ సుజయ్: గతంలో ఎక్కడైనా ఎస్టీలో చేర్చినట్లు ఇచ్చారా? తులసి: చోడవరంలో ఇచ్చారు సార్.. అది చూపించినా ఇక్కడ ఇవ్వడం లేదు.. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.. సుజయ్: దీనిని గవర్నమెంటు దృష్టికి తీసుకెళ్తాను.. ఏమ్మా: పిల్లల్ని బడికి పంపుతున్నారా.. మర్రి ఉమ: లేదండీ... సుజయ్: పంపకుండా ఏమి చేస్తున్నారు..? ఉమ: వాళ్లు పనికి వెళితే మా కడుపులు ఎలా నిండుతాయి. బాబు.. సుజయ్: మీ కడుపులు నిండడానికి, వాళ్లని పనిలో పెడతారా... ఇక్కడే ఉన్న స్కూలుకు పంపండి అక్కడ భోజనాలు పెడతారు..చదువులు చెబుతారు సరేనా.. నారాయణమ్మ: బాబూ ఇక్కడ ఉన్న బావి ప్రమాదకరంగా ఉంది. సుజయ్: దీని గురించి అధికారులకు చెప్పలేదా..? నారాయణమ్మ: చెబుతున్నా పట్టించుకోవడం లేదు.. ఈ బావి నీరు తోడేసి రాతికట్టు కట్టి గట్టు ఎత్తు చేయాలి. అలాగే ప్లాట్‌పారం కట్టాలి బాబు.. సుజయ్: సరే చూద్దాం.. మీకు రుణమాఫీ అందుతుందా? నారాయణమ్మ: ఏం అందడం సార్.. చంద్రబాబు అసలు కట్టవద్దంటే మానేశాం. ఇపుపడు వడ్డీల కింద బ్యాంకులో ఉన్న డబ్బుల్ని ఇరుపుకుంటున్నారు. సుజయ్: ఇప్పటివరకూ ఎంత జమచేశారు? నారాయణమ్మ: 5 లక్షలు తెచ్చాం సార్... నెలకు పది వేలు చొప్పున ఆరుమాసాలకు 60 వేలు ఇరిపేశారు. సుజయ్: మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు..? నారాయణమ్మ: రుణమాఫీ సంగతి దేవుడెరుగు వడ్డీలు పడకుండా ప్రతీ నెలా కట్టేస్తున్నాం. సరే వస్తానమ్మా... -
అమ్మానుషం
బొబ్బిలి: ఆకాశంలో సగం..అవకాశాల్లో సగం..అంటూ వేదికలెక్కి ఉపన్యాసాలిచ్చినా..కలం పట్టి అక్షర రూపం ఇచ్చినా..అవి అంతవరకే పరిమితమవుతున్నాయి. తెలిసీ తెలియక చేసిన తప్పు ఫలితమో? ఆడపిల్లగా పుట్టడం శాపమో గానీ, ఆరునెలల పసికందును కర్కశంగా వేగావతి పాల్జేసింది ఓ మాతృమూర్తి. ఏ తల్లి కన్నబిడ్డో గానీ ఆరునెలలకే గంగమ్మ ఒడిలో కలిసి పోయిందా పసిగుడ్డు. బిడ్డ ఉన్న ప్లాస్టిక్ కవరు బాడంగి మండలం పినపెంకి గ్రామం వద్ద ఉండే వంతెన దగ్గర ఆదివారం తేలుతూ వెళ్తుండడంతో కొంత మంది కంట పడింది. ఆ కవరులో ఉన్నది మృత శిశువు అని తెలియక నదిలో ఆడుకుంటున్న యువత బంతాటకు ఉపయోగించుకున్నారు. చివరకు అనుమానం వచ్చి తెరిచి చూడగా కవర్లో ఆడశిశువు మృతదేహం ఉండడంతో వెంటనే ఒడ్డుకు చేర్చారు. అక్కడున్న నేచర్ చైల్ ్డ కేర్ సంస్థ ప్రతినిధులు వరలక్ష్మి, రాజశేఖర్‌లు ఐసీడీఎస్, పోలీసులకు సమాచారాన్ని అందించారు. బొబ్బిలి రూరల్ సీడీపీఓ వరలక్ష్మి, బాడంగి మండలం పినపెంకి గ్రామంలోని ఒకటి, రెండు కేంద్రాల అంగన్వాడీ కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని సమీక్షించిన అనంతరం పిరిడి, పినపెంకి, పాల్తేరు గ్రామాలకు చెందిన యువత అక్కడకు చేరుకుని ఐసీడీఎస్ అధికారుల సహ కారంతో మృతశిశువును అక్కడే ఖననం చేశారు. సమాచారం అందుకున్న బొబ్బిలి ఎస్సై నాయుడు వేగావతి నది వద్దకు వచ్చి సంఘటనా స్థలం బాడంగి మండల పరిధిలోకి రావడంతో అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆడపిల్ల అని తెలియడంతో గర్భం వద్దనుకుని ఆరో నెలలో బయటకు తీయించి ఈ దారు ణానికి పాల్పడి ఉంటారని సీడీపీఓ వరలక్ష్మి అనుమానం వెలిబుచ్చారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. -
సినిమా చూపిస్తా...
‘పవన్ కల్యాణ్ సినిమా మన ఏరియాలో ఎన్ని థియేటర్లకు ఇచ్చాడ్రా..?’ అంటూ ఓ అభిమాని ఉత్సాహం. ‘మహేష్ సినిమా ఎలా ఉందో.. ఏంటో..?’ అని మరో అభిమాని ఆరాటం. ‘చరణ్ సినిమా పక్క ఊళ్లో ఎన్ని థియేటర్లలో ఆడుతోంది..?’ అంటూ మరో ఫ్యాన్ ప్రశ్న. వీటన్నింటికీ ఒకే సమాధానం ‘నేటి తెలుగు సినిమా డాట్ కామ్’. బొబ్బిలిలోని ఓ ఉపాధ్యాయుడు రూపొందించిన ఈ వెబ్సైట్ ఇప్పుడు జిల్లాలోని సినీ ప్రియులకు మంచి సమాచారం అందిస్తోంది. వారానికి రెండు వేల మంది ఈ సైట్‌ను సందర్శిస్తున్నారు కూడా. బొబ్బిలి: ఏ ఊర్లో ఏ సినిమా ఆడుతోంది. ఏ థియేటర్లో ఎన్నింటికి సినిమా వేస్తారు. ఆ థియేటర్ల ఫోన్ నంబర్లు ఏంటి..? తాజాగా విడుదలైన సినిమా రివ్యూలు.. ఇలా అన్ని ఒకే చోట కనిపించే వెబ్ సైట్‌ను రూపొందించారు పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు వీరగంట అప్పారావు. దీని కోసం ‘సాక్షి’ దిన పత్రికలోని సినిమా పేజీ సాయం తీసుకున్నారు. బొబ్బిలి మండలం చింతాడ గ్రామానికి చెందిన అప్పారావు ప్రస్తుతం సీతానగరం మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూలులో ఇంగ్లీషు స్కూలు అసిస్టెంటుగా పని చేస్తున్నారు. పట్టణంలోని ఆళ్వారువీధిలో నివాసముం టున్న అప్పారావుకు చిన్న తనం నుంచి సినిమా అంటే చాలా ఇష్టం. స్వతహాగా ఆయన ఏఎన్ఆర్ అభిమాని. ఆ రోజుల్లో విడుదలైన సినిమాల గురించి పక్క జిల్లాల్లో టాక్ ఎలా ఉంది, కలెక్షన్లు, రికార్డుల గురించి పోస్టుకార్డుల ద్వారా వివరాలు తెప్పించునేవారు. ఇప్పుడు ఆధునిక ప్ర పంచంలో అన్ని స మాచారాలూ గుప్పిట్లోనే దొరికేస్తున్నా యి. అలా ఆధునికతను వినియోగించుకుని సినీ ప్రియుల కోసం ‘నేటి తెలుగుసినిమా డాట్ కామ్’ను రూపొందించారు. ‘సాక్షి’ దినపత్రికల్లోని ప్రతీ జిల్లా ఎడిషన్‌లోని ఆయా జిల్లాల సిని మా విశేషాలను, థియేటర్ల వివరాలను ఇందులో ప్రచురిస్తున్నారు. వాటిని ఆధారంగా చేసుకొని అన్ని జి ల్లాల సినిమా పేజీ లన్నీ ఒకే దగ్గర వచ్చినట్లు వెబ్‌సైట్‌ను రూపొందించారు. 2012లో ఆయన డొమైన్ కొనుగోలు చేసి వెబ్సైట్ రూపకల్పన ప్రారంభించారు. ఈ వెబ్సైట్ ద్వారా సినిమాలు, థియేటర్ల వివరాలతో పాటు టాక్, కలెక్షన్ల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఇప్పటికే పలువురు సినీ పెద్దలు వెబ్‌సైట్‌ను చూసి అభినందించారని టీచర్ చెబుతున్నారు. వెబ్సైట్ రూపకల్పనను అప్పారావు ఆన్లైన్లోనే నేర్చుకున్నారు. ప్రస్తుతం వారానికి దాదాపు రెండు వేల మంది ఈ వెబ్‌సైట్‌ను సందర్శిస్తున్నారు. విదేశాల్లోని ప్రవాసాంధ్రులు కూడా సైట్‌ను సందర్శిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. -
‘స్వచ్ఛ భారత్’ నిర్మాణానికి కృషి
బొబ్బిలి : ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ నిర్మాణానికి కృషి చేయాలని కేంద్రమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు పిలుపునిచ్చారు. ఆదివారం కోట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన స్వచ్ఛభారత్ సభలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ 150వ జయంతి నాటికి దేశంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు.విద్యార్థు లు, యువత దీనిపై దృష్టిసారిస్తే స్వచ్ఛభారత్ నిర్మాణం సాధ్యమని చెప్పారు. ఫొటోలు, పబ్లిసిటీ కోసం కాకుండా సమాజాభివృద్ధికి కృషి చేయాల ని చెప్పారు. మంత్రి మృణాళిని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛభారత్ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. జెడ్పీ చైర్పర్సన్ స్వాతిరాణి మాట్లాడుతూ స్వచ్ఛ భార త్ అందరి బాధ్యత అని తెలిపారు. అనంతరం అంతా స్వచ్ఛ భారత్‌పై ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు టీటీడీ కల్యాణ మండపం వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం వేణుగోపాలస్వామి ఆల యం నుంచి చీపర్లు పట్టి చెత్తాచెదారాన్ని ఊడ్చి కోట జంక్షన్ వద్దకు ర్యాలీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా అభ్యదయ, పద్మాలయ నృత్య సంస్థ విద్యా ర్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అలాగే స్థానిక టీడీపీ కార్యాలయంలో తుపా ను బాధితులకు దుస్తులు, ఆహార సామగ్రిని కేంద్రమం త్రి చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుమ్మడి సంధ్యారాణి, ఆర్పీ భంజ్‌దేవ్, ఎమ్మెల్యే మీసాల గీత,ఐవీపీ రాజు,తెంటు లక్ష్మునాయుడు, తూముల భాస్కరరావు, తూముల అచ్యుతవల్లి, తదితరులు పాల్గొన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందాలి భారతదేశం పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందాలని, అప్పుడే విమానరంగం అభివృద్ధి చెందుతుందని కేంద్ర విమానయానశాఖామంత్రి అశోక్‌గజపతిరాజు తెలిపా రు. ఆదివారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడా రు. దేశంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి 400 విమానాశ్రయాలు ఉన్నాయని, వాటిలో 120 వరకు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయని తెలిపారు. 70 వరకు విమానాశ్రయాలు బాగా రద్దీగా ఉన్నాయని, కొత్త విమానాశ్రయా లు ఏర్పాటు చేయడమంటే అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. రవాణా విమానాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. జీరో బేస్డ్ ఖాతాలు బాగా ప్రజలు తెరిచారన్నారు. విశాఖ రైల్వేజోన్ విషయంపై విలేకరు లు ప్రశ్నించగా విజయవాడ, విశాఖలో ఏర్పాటు చేయాలని, రాష్ట్ర విభజన సమయంలో దీనిపై నిర్ణయం తీసుకోకపోవడం అన్యాయమన్నారు. ఏపీ అంతా ఒకే జోన్ చేయడానికి యత్నిస్తున్నామన్నారు. బాడంగి విమానాశ్రయంపై ప్రశ్నించగా దీని వల్ల ఉపయోగం లేదన్నారు. స్విస్‌బ్యాంకు ఖాతాలలో వివరాలు తీసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్నేహభావంతో ఉండడంతో అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కొత్తపెంటలో పంట నష్టం పరిశీలన బొబ్బిలి రూరల్ : కొత్తపెంటలో తుపానుకు పాడైన పం టలను కేంద్రమంత్రి పరిశీలించారు. రైతులను పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ ప్రాంతంలో పంట ఎక్కువగా పోయిందో తహశీల్దార్ బి. మాసిలామణి మంత్రికి వివరించారు. వెంటనే మంత్రి .. జేసీ రామారావును పిలిచి ఈ ప్రాంతంలో పంట నష్టాలను గుర్తించి తక్షణమే వివరాలు పంపాలని ఆదేశించారు. గత ప్రభుత్వం సారా వ్యాపారంతోనే పాలించింది పార్వతీపురం : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా సారా వ్యాపారానికే ప్రాధాన్యత ఇచ్చి ందని కేంద్రమంత్రి అశోక్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 11, 12 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన జన్మభూమి సభలో ఆయ న మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన బా గుందన్నారు. ఈ సందర్భంగా తుపాను బాధితులకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు రూ.50 వేలు చెక్కు ఇచ్చిన డా. వివేక్, డా. పద్మజలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే జనార్థన్ థాట్రాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బెలగాం జయప్రకాష్ నారాయణ, డిసీఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షు డు కళింగ మల్లిబాబు, పాల్గొన్నారు. -
కార్మికులకు ‘షాక్’
బొబ్బిలి: హుదూద్ తుపాను ప్రభావం నుంచి కార్మికులు ఇంకా తేరుకోలేదు... విద్యుత్తు వ్యవస్థ ఛిన్నాభిన్నం అవ్వడం, ఇప్పటివరకూ పరిశ్రమలకు పుష్కలంగా సరఫరా రాకపోవడంతో వేలాది మంది కార్మికులు గత 15 రోజులుగా పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రభుత్వం కనీసం కార్మికుల గురించి ఆలోచన చేయకపోవడంతో ఏం చేయాలో వారికి ఏమీ పాలుపోవడం లేదు.. ప్రస్తుతం జిల్లాలో దాదాపుగా అన్ని పరిశ్రమలూ మూతపడ్డాయి. విద్యుత్తు సరఫరా లేకపోవడమే ప్రధాన కారణంగా ఉన్నా, యాజమాన్యం కార్మికుడిని ఆదుకోవడానికి జనరేటర్ సాయంతో అయినా మిల్లును నడిపే పరిస్థితి కూడా లేదు.. ప్రధానంగా ఈ ఎఫెక్టు జనపనార మిల్లులపై పడింది. ఈ నెల 12 నుంచి జిల్లాలో ఉండే 9 జూట్ మిల్లులు కూడా మూత పడడంతో దాదాపు 25 వేల మంది కార్మికులు ఆకలితో అలమటించాల్సిన దుస్థితి దాపురించింది. బొబ్బిలిలో ఎస్ఎల్ఎస్, నవ్యా, జ్యోతి జూట్‌మిల్లులు ఉండగా, విజయనగరంలో అరుణా, ఈస్టుకోస్టు, నెల్లిమర్ల, సాలూరులో, జీగిరాం, కొత్తవలసలో ఉమా, చెన్నాపురాల్లో ఉండే మిల్లులు మూతపడ్డాయి. ప్రకృతి వైపరీత్యం వల్ల మిల్లులు మూత పడ్డాయి కాబట్టి ఏదో రకంగా మిల్లు తిప్పితే పనిచేస్తాం, లేకపోతే లే ఆఫ్ ఇవ్వాలని కార్మికులంతా డిమాండ్ చేస్తున్నారు. తుపాను వల్ల పంటలు పోతే పరిశీలన చేసి పరిహారం ఇస్తున్నారు, ఇళ్లు కోల్పోయిన వారిని ఆదుకుంటున్నారు. తుపాను ప్రాంతాల్లో చెట్లు పడిపోతే అధికారులు స్పందిస్తున్నారు. మరి వేలాది మంది కార్మికులు పనిలేకుండా పస్తులుంటున్నా ఏ ప్రజాప్రతినిధి గానీ, అధికారి గారీ ఎందుకు స్పందించడం లేదని వారంతా ప్రశ్నిస్తున్నారు. యాజమాన్యాలతో మాట్లాడి కార్మికుల ఆకలిని తీర్చాలని కోరుతున్నారు. అలాగే బొబ్బిలి, పూసపాటిరేగ, కొత్తవలసల్లో ఉండే వందలాది పరిశ్రమలు కూడా విద్యుత్తు లేకపోవడం వల్ల మూతపడ్డాయి. గ్రోత్‌సెంటరులో ఉండే ఫెర్రోఅల్లాయిస్ ఫ్యాక్టరీలతో పాటు అనేక ఫ్యాక్టరీలు మూతపడడంతో కార్మికులకు పని లేకుండా పోయింది. ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల పునరుద్ధరణ కార్యక్రమం ఇంకా కొనసాగుతుండడంతో విద్యుత్తు పూర్తి స్థాయిలో అందడం లేదు. ప్రస్తుతం శుక్రవారానికి 11కేవీలైనుపై ఉండే పరిశ్రమలకు విద్యుత్తు సరఫరా చేస్తున్నామని డీఈ మసిలామణి చెప్పారు. 33కేవీపై ఆధారపడే వారికి మాత్రం సరఫరా చేయలేదు..కార్మికుల పోరాటానికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. -
తుఫాన్ ధాటికి విలవిల
బొబ్బిలి: పట్టణంలో హుదూద్ ధాటికి పలు భారీ వృక్షాలు నేలకూలాయి. టీటీడీ కళ్యాణ మండపం, ఆర్అండ్ బీ అతిథిగృహం, పెట్రోల్ బంకు వద్ద, మార్కెట్‌యార్డు వృక్షాలు కూలిపోయాయి. వీటిని తక్షణమే తొలగించినట్లు ఆర్అండ్బీ జేఈ తిరుపతిరావు తెలిపారు. కాగా పట్టణంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ట్రాన్స్‌కో డీఈ మసీలామణి తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు దాదాపు 100 వరకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు ప్రాథమిక సమాచారం. 6 ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయి. పెందుర్తిలో విద్యుత్ సరఫరా కేంద్రం మరమ్మత్తులకు గురికావడంతో 2,3రోజుల వరకు బొబ్బిలిలో విద్యుత్ సరఫరా ఉండకపోవచ్చని ఆయన తెలిపారు. రామభద్రపురం: మండలంలోని ఆదివారం తెల్లవారుజాము నుంచి విద్యుత్ సరఫరా లేక పలు గ్రామాలు అం ధకారంలో ఉన్నాయి. భారీ వర్షంతో పలువురు ఇబ్బం దులు పడుతున్నారు. తుఫాన్ ప్రభావంతో మండలంలోని ఎడతెరపి లేని వర్షం కురిసింది. 38 మిల్లీ మీటర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారీవర్షాల కు వరి,చెరకు, పత్తి ,జొన్న పంటలు నేలమట్టమయ్యాయి. తహశీల్దార్ కార్యాలయంపై కూలిన చెట్లు బొబ్బిలిరూరల్: స్థానిక తహశీల్దార్ ఆవరణలో పెద్ద చెట్లు ఆదివారం కార్యాలయంపై కూలిపోయాయి. దీం తో కార్యాలయ సిబ్బందితో పాటు అధికారులు పరుగులు తీశారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. చెట్టు పైభాగం కొంతమేర తహశీల్దార్ కార్యాలయంపై పడగా, ఓ కొమ్మకొంత భాగంగా కారిడార్‌పై ఉండే పైకప్పులోకి చొచ్చుకుపోయింది. కొంతభాగం కార్యాలయం పాక్షికంగా దెబ్బతింది. చెట్టుకూలిన సమయంలో హెల్ప్‌డెస్క్ నిర్వహిస్తున్న డీటీ కేబీ ఆచారి, ఆర్ఐ సాయికృష్ణ, సీనియర్ అసిస్టెంట్ స్వర్ణలత, వీఆర్వోలు,సిబ్బంది ఉన్నారు. శిథిలావస్థలో ఉన్న కార్యాలయం కూలిపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. మరో అరగంటలో మరోచెట్టు కార్యాలయం మరోవైపు కూలిపోయింది. కొన్నికొమ్మలు తొలగించారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వాసిరెడ్డి విగ్రహం వద్ద ఉన్న ఓ హోట్‌ల్ వద్ద చెట్టుకొమ్మ పడింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. నీట మునిగిన పొలాలు మండలంలో పలు గ్రామాల్లో హుదూద్ తుఫాన్‌కు పొలాలు ముంపునకు గురయ్యాయి. ఆదివారం కురిసిన వర్షాలకు పంటలకు పెద్దగా నష్టం లేకపోయినా సోమవారం నాటి పరిస్థితిని బట్టి నష్టం అంచనా వేయాల్సి ఉంది. ఇప్పటికే వరి, చోడి పంటలు నేలకొరిగిపోయాయి. కోమటిపల్లి, పారాది, గొర్లెసీతారాంపురం గ్రామాల్లో పంట నీట మునిగింది. విద్యుత్ అంతరాయంతో అవస్థలు గుమ్మలక్ష్మీపురం: హుదూద్ తుఫాన్ కారణంగా ఆదివారం తెల్లవారుజాము నుంచి గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో విద్యుత్ సరఫరాలేని కారణంగా అంధకారం నెలకొంది. ఏజెన్సీలో బీఎస్ఎన్ఎల్ సేవలు కూడా పనిచేయలేదు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో తాగునీటి సమస్య నెలకొంది. విస్తారంగా వర్షాలు గరుగుబిల్లి: హుదూద్ తుఫాన్ కారణంగా మండలంలోని పలు గ్రామాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి ఈదురుగాలులుతో పాటు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దని అధికారులు గ్రామాల్లో దండోరా వేశారు. మండలంలోని పెద్దూరు, రావుపల్లి, బివి పురం, రావివలస, నాగూరు, చినగుడబ, ఉల్లిబద్ర, లఖనాపురం గ్రామాల్లో వరి పైర్లు నేలకొరిగాయి. అరటి, చెరుకు, మొక్కజొన్న పంటలు కూడా నేలవాలడంతో నష్టం ఏర్పడిందని పలువురు రైతులంటున్నారు. తుఫాన్ కారణంగా ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా వీఆర్ఓలను అప్రమత్తం చేసినట్లు తహశీల్ధార్ కె.సూర్యనారాయణ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల నుంచి ఇంతవరకూ ఎటువంటి ఫిర్యాదులు రానప్పటికీ స్థానికంగా ఉండే వీఆర్ఓలను అప్రమత్తంచేసినట్లు తెలిపారు. తుఫాన్ కారణంగా ఇళ్లు కూలిపోయినా,పంటలకు నష్టం వాటిల్లినా,చెరువులకు గండ్లుపడినా తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు చేపడతామన్నారు. నిరాశ్రయులకు తోటపల్లిలోని జట్టు ఆశ్రమంలో పునరావాస కేంద్రంను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎంపీడీ ఓ పార్వతి,హెచ్‌డీటీ రాధాకృష్ణ తదితరులున్నారు. ఈదురుగాలిలో కూడిన భారీవర్షం కొమరాడ: మండలంలోని ఆదివారం తెల్లవారుజాము 4గంటలనుంచి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసిం ది. ఇళ్లలో నుంచి ఎవరూకూడా బయటకు రాలేదు. అధికారులు ముందస్తుగా దుగ్గి, గుణానపురం, కళ్లికోటలో నిర్వాసిత కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లే కుండా సదుపాయాలు చేశారు. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఆదివారం రాత్రి నాగావళినదిలోకి నీరు అధికంగా చేరే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. ముందస్తుగా అన్ని ఏర్పాట్లు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎస్ఐ జె. ధర్మేంద్ర ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. కూలిన నాలుగు విద్యుత్ స్తంభాలు మండలంలోని నాగావళి నది ఆవలివైపువున్న మాదలింగి సమీపంలో నాలుగు విద్యుత్‌స్తంభాలు ఈదురుగాలులకు ఆదివారం కూలిపోయాయి. విద్యుత్ అధికారులు పనుల ను పునరుద్దరిస్తున్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న చెట్టు కూలిపోయింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. -
రుణమాఫీపై గందరగోళం
బొబ్బిలి/బొబ్బిలి రూరల్: ప్రభుత్వం రైతు కూలీలకు మేలు చేసే విధంగా భూ సంస్కరణల అమలుకు కృషి చేయాలని వ్యవ సాయ శాస్త్రవేత్త, ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసరు కేఆర్ చౌదరి అన్నారు. సోమవారం నుంచి పాత కోటలో రైతు కూలీ సంఘం జిల్లా మహాసభలు ప్రారంభమయ్యూయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్లు రూపాయలు మాఫీ చేసే ప్రభుత్వం రైతు ల రుణమాఫీ పై మల్లగుల్లాలు పడుతోందన్నారు. లేనిపోని నిబంధనలు విధించి రైతులను గందరగో ళానికి గురి చేస్తోందని ఆరోపించారు. పేద ల భూములన్నీ ధనికుల చేతిలో ఉన్నాయని, గిరిజనుల 1-70 చట్టం అమలు కావడం లేదని చెప్పారు. దీని వల్ల పేదలకు అన్యాయం జరుగుతోందన్నారు. జిల్లాలో ప్రాజె క్టులకు పెద్దగా చేసిందేమీలేదని, వెంగళరాయసాగర్, వట్టిగెడ్డ, తారకరామాసాగర్ ఇవన్నీ ఎలా ఉన్నవి అ లానే ఉన్నాయన్నారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్. ఝాన్సీ మాట్లాడుతూ రైతుల సమస్యల పై రైతు కూలీ సంఘం పోరాడాల్సి ఉందన్నారు. వ్యవసాయ వ్యతిరేక విధానాలు అమలు చేసే చంద్రబాబు పాలనలో రైతులకు మరింత దయనీయ స్థితి రానుం దని చెప్పారు. రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు దంతులూరి వర్మ మాట్లాడుతూ వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతులకు ఏం చేస్తారని ప్రశ్నించా రు. ఎన్సీఎస్ యాజమాన్యం రైతులకు రూ.26 కోట్ల బకాయి ఉండి, రైతుల పేరిట రూ.23 కోట్ల బినామీ రుణాలు వాడితే యాజమాన్యాన్ని కాపాడడానికి పో లీసులను పెట్టి రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం విధానాలు మార్చుకోవాలన్నారు. అంతకుముందు నా యకులు రైతు కూలీ సంఘం జెండాను ఆవిష్కరించి, ఇటీవల మృతి చెందిన పలువురు రైతు కూలీ సం ఘం నాయకులు, గంటి్ర పసాదం, తదితర విప్లవకారుల మృతి కి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి గణేష్ పండా, గిరిజన, గిరిజనేతర పేదల హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఇల్లా రామిరెడ్డి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పి. అంజయ్య, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఊయక ముత్యాలు, ఏఐఎఫ్టీయూ నాయకులు మెరిగాని గోపాలం, రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు తాండ్ర అరుణ, స్త్రీ విముక్తి సంఘటన రాష్ట్ర కమిటీ సభ్యులు గంటా అమ్మాజీ, పాల్గొన్నారు. పాలకుల విధానాలే రైతులకు శాపం ప్రస్తుత పాలకుల విధానాలు రైతులకు శాపంగా మా రుతున్నాయని రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఝాన్సీ అన్నారు. సోమవారం ఆమె ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న చంద్రబాబునాయుడు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ప్రజాకర్షక పథకాలు ప్రకటిస్తున్నారన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్య పక్కనపెట్టి ముంపు గ్రామాలు ఏ రాష్ట్రంలోకి వస్తాయోనని రాజకీ యం చేశారని ఆరోపించారు. పేదరికాన్ని పోగొట్టే చర్యలు చేపట్టకుండా పాలకులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారన్నారు. విత్తనాలు, ఎరువులు రాయితీపై అందించాలని కోరారు. రిటైర్డ్ ప్రొఫెసర్ కేఆర్ చౌదరి మాట్లాడుతూ రైతు విముక్తి చర్యలు చేపట్టి, కేరళలో ఉన్నట్టు డెట్ రిలీఫ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలన్నారు. పేదలకు భూపంపిణీ చేయాలన్నారు. వ్యవసాయం లాభదాయకం గా ఎలా చేయాలో రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. -
క్రషింగ్‌కు సిద్ధమవుతున్న ఎన్సీఎస్
బొబ్బిలి : చెరకు రైతుల అనుమానాలకు అధికారులు తెరదించారు. లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం పరిధిలో ఉన్న వేలాది ఎకరాల చెరకును అదే ఫ్యాక్టరీలో క్రషింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల కష్ట, నష్టాలు, ఇబ్బందులను గుర్తించిన అధికారులు స్వీయ పర్యవేక్షణలో ఈ ఏడాది క్రషింగ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు చెరకు అభివృద్ధి మండలి అధికారులు, ఉద్యోగులు దగ్గరుండి మిల్లు అయిలింగ్ పనులను చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ యాజ మాన్యం మూడేళ్లగా బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం, ఈ ఏడాది జనవరి నుంచి బిల్లులు చెల్లింపు పూర్తిగా నిలిపి చేయడంతో ఏపీ చెరకు రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన సంగతి విధితమే. రైతులతో పాటు, బ్యాంకులు, కార్మికులు, కూలీలకు దాదాపు రూ.50 కోట్ల వరకూ యాజమాన్యం చెల్లించవలసి ఉంది. ఆర్ఆర్ యాక్టు ప్రకారం ఎన్సీఎస్ ఆస్తులను వేలంవేయడానికి కూడా రెవెన్యూ శాఖ సిద్ధమైంది. ఫ్యాక్టరీ ఎండీ., డైరక్టర్లును పోలీసులు అరె స్టు చేశారు. దాదాపు 20రోజుల తరువాత వారు బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈఫ్యాక్టరీలో క్రషింగ్ జరిగే పరిస్థితి కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. వేలాది ఎకరాల్లో చెరుకు పండించామని ఇప్పుడు తమగతేంకానని వా పోరారు. దీంతో అధికారులు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు వైపు దృష్టి సారించారు. జిల్లాలో బీమసింగి వద్ద సహకార రంగంలో నడుస్తున్న చక్కెర కర్మాగారంలో లచ్చయ్యపేట పరిధిలోని రైతులు సంబంధించిన చెరకును రోజుకు రెండు వందల టన్నులు ఆడేవిధంగా ఏర్పాట్లు చేశారు. అయితే దీనివల్ల రవాణా ఖర్చు పెరగడంతో పాటు చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులు మరీ అధికమవుతాయని భావించిన అధికారులు లచ్చయ్యపేట ఫ్యాక్టరీ ద్వారా ఈ ఏడాది చెరుకును క్రషింగ్ చేయించాలని నిర్ణయించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ఈ ఏడాది చెరుకును క్రషింగ్ చేయడానికి సుముఖత వ్యక్తంచేస్తూ ఈ నెల 3న అధికారులకు లేఖ పంపింది. దీంతో చెరకు అభివృద్ధి మండలి అధికారులు దగ్గరుండి ఆయిలింగ్ పనులు చేయిస్తున్నారు. ఫ్యాక్టరీలో కొన్ని ప్రధానమైన భాగాలు పాడైతే వాటిని ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. ఈ ఆయిలింగ్ పనులకు దాదాపు కోటీ 25 లక్షల రూపాయల వరకూ ఖర్చు కానుంది. ఎండీ, డైరక్టర్లు బెయిల్‌పై బయటకు వచ్చేశారు కాబట్టి ఫ్యాక్టరీని క్రషింగు చేయడానికి, ఇతర విషయాలపై ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఈఏడాది క్రషింగ్‌కు చెరుకు తీసుకువచ్చిన వారికి బిల్లులు వెంట వెంటనే చెల్లించే విధంగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ పరిధిలో 17 మండలాలకు చెందిన దాదాపు 16 వేల మంది రైతులు 6వేల 900 హెక్టార్లలో చెరకు పంటను వేశారు. దాని ద్వారా సుమారు 3 లక్షల 61 వేల టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం రోజుకు 4 వేల నుంచి 4200 టన్నుల వరకూ క్రషింగును చేస్తుంది. -
రైల్వేట్రాక్‌పై నిలిచిన బస్సు... దూకేసిన ప్రయాణికులు
విజయనగరం: విజయనగరం జిల్లా బొబ్బిలి రైల్వేట్రాక్‌పై ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆకస్మాత్తుగా ఆగిపోయింది. దాంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళలకు గురైయారు. ఏ నిముషాన ఎటువైపు నుంచి రైలు వస్తుందోనని బస్సులోని ప్రయాణికులు ఆందోళన చెందారు. దీంతో అద్దాలు పగులకొట్టి ప్రయాణీకులు బస్సులో నుంచి బయటకు దూకేశారు. ట్రాక్‌పై బస్సు అగిపోయిన విషయాన్ని స్టేషన్ సిబ్బందికి తెలిపారు. దాంతో ఆ ట్రాక్‌పై నడిచే రైళ్ల రాకపోకలకు స్టేషన్ అధికారులు నిలువరించారు. అంతలో స్థానికలు సహాయంతో ప్రయాణికులు బస్సును రైల్వే ట్రాక్‌పై నుంచి పక్కకు తప్పించారు. ఆ విషయాన్ని స్టేషన్ అధికారులకు తెలిపారు. ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి వారివారి గమ్యస్థానాలకు తరలించారు. -
టీడీపీలో అంతర్గత పోరు!
బొబ్బిలి:బొబ్బిలి పురపాలక సంఘంలోని కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక టీడీపీలో చిచ్చు రగిలి స్తుంది. రాష్ర్టంలో అధికారంలో ఉన్నా ఇక్కడ మునిసిపాలిటీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆ పార్టీలో ఇప్పుడు కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక చిచ్చు రగులుస్తుంది. ఆ పార్టీలోని నాయకుల మధ్యే సమన్వయం లేకపోవడంతో సభ్యుని ఎన్నికకు ఆ పార్టీ కౌన్సిలర్ల మద్దతే కరువైంది. పురపాలక సంఘంలో ఒక జనరల్ స్థానంతో పాటు క్రిష్టియన్ మైనార్టీ, ముస్లిం మైనార్టీలకు ఒక్కొక్కటి చొప్పున కో ఆప్షన్ స్థానాలున్నాయి. ముందుగా జనరల్ స్థానానికి ఎన్నిక జరిపిన అనంతరం మిగిలిన రెండు మెజార్టీ సభ్యుల ఆమోదంతో భర్తీ చేపట్టాల్సి ఉంది. జనరల్ స్థానానికి మున్సిపాలిటీ ఇచ్చిన నోటిఫికేషన్లో 12 మంది కౌన్సిలర్లు దరఖాస్తు చేసుకున్నారు. బీసపు వైపే టీడీపీ మొగ్గు.. వైఎస్ఆర్సీపీ బి ఫారంపై గెలిచి ఇటీవల చైర్పర్సన్ ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇచ్చిన 15వ వార్డు కౌన్సిలర్ బీసపు పార్వతి భర్త, మాజీ కౌన్సిలరు బీసపు చిన్నారావుకు కో ఆప్షన్‌గా నియమించడానికి టీడీపీలోని ఓ వర్గం సుముఖంగా ఉండడంతో అదే పార్టీలోని మిగిలిన వారు వ్యతిరేకిస్తున్నారు. చిన్నారావు పేరు సూచించకుండా ఎవరిని సూచించినా మద్దతు ఉంటుందంటూ 8, 16 వార్డుల కౌన్సిలర్లు ఈ నెల 8న జరిగిన కౌన్సిల్ సమావేశానికి వెళ్లకుండా ఉండిపోయారు. దాంతో ఆనాటి సమావేశం కోరం లేక వాయిదా పడింది. 8, 16 వార్డుల కౌన్సిలర్లు ఇద్దరిని కౌన్సిల్ హాలుకు పంపించడానికి జరిపిన మంతనాల్లో నాయకులు, కౌన్సిలర్లు మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగినట్టు సమాచారం. పట్టుబడుతున్న కాంగ్రెస్ చైర్పర్సన్ ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి హామీ ఇచ్చిన విధంగా కో ఆప్షన్ స్థానం ఇవ్వాలని ఆ పార్టీ వారు పట్టుబడుతున్నారు. చైర్పర్సన్ ఎన్నికకు టీడీపీకి బలం చాలకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12, 28 వార్డుల కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. ఆ సమయంలో టీడీపీ నాయకులు కో ఆప్షన్ స్థానం కాంగ్రెస్ పార్టీకి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో ఇప్పుడు దానిని ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీనికి టీడీపీ చేతులెత్తేయడంతో ఆ సభ్యులు కూడా కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేదు. మెజార్టీ సభ్యుల ఆమోదంతో ఎన్నికకు సన్నాహాలు కో ఆప్షన్ ఎన్నికను టీడీపీ నాయకులు అనుకున్న వారికి ఇప్పించడానికి ఓటింగు ద్వారా కాకుండా మెజార్టీ సభ్యుల అభిప్రాయంతో భర్తీ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండుసార్లు కౌన్సిల్ సమావేశం వాయిదాపడితే మూడో సమావేశంలో చైర్పర్సన్ తన అధికారంతో మెజార్టీ సభ్యుల ఆమోదంతో సభ్యుని ఎన్నిక జరుపుకొనే అవకాశం ఉంది. ఈ నెల 16న రెండోసారి సమావేశాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశం కూడా కోరం చాలక వాయిదా పడేటట్లు చేయడానికి అధికార పార్టీ ప్రణాళికలు వేస్తుంది. అప్పుడు మూడోసారి సమావేశం ఏర్పాటు చేసి మెజార్టీ సభ్యుల అభిప్రాయంతో కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక జరపడానికి తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. -
సాగర్ అదనపు జలాలు ప్రశ్నార్థకం
రైతుల పట్ల పాలకుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో వెంగళరాయసాగర్ అదనపు జలాల విషయం గమనిస్తే ఇట్టే అర్ధమవుతుంది. పాలకులెవరైనా... తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పడమే తప్ప... చేసింది అంతంతమాత్రంగానే ఉంది. సాగర్ అదనపు జలాలు ఐదు వేల ఎకరాలకు అందించాలని ఎనిమిదేళ్ల కిందట శంకుస్థాపన చేశారు. అయితే నేటికీ అదనపు జలాలు మాత్రం సాగుకు అందడం లేదు. దీంతో బొబ్బిలి, సీతానగరం మండలాల్లోని ఐదు వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. బొబ్బిలి : వెంగళరాయసాగర్ అదనపు జలాలు వచ్చే ఏడాది ఖరీఫ్ సాగుకు కూడా అందే పరిస్థితులు కానరావడం లేదు. భూసేకరణ నత్తనడకగా సాగడం, భూసేకరణ కోసం అవసరమైన డబ్బులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పాటు కాంట్రాక్టర్ల మధ్య సమన్వయలోపం అన్నదాతకు శాపంగా మారాయి. బొబ్బిలి, సీతానగరం మండలాలకు వెంగళరాయసాగర్ జలాశయం ద్వారా అదనంగా ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించే సదుద్దేశంతో 2006 ఏప్రిల్‌లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ రూ.5 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారు. తరువాత ఆ పనులకు విఘాతం ఏర్పడడంతో ఏడేళ్ల వరకు ప్రతిపాదనలు, అంచనాలు, టెండ ర్లు దశ అంటూ నాన్చి చివరకు అంచనాలను రూ.11 కోట్లకు తీసుకువచ్చారు. చివరకు గత ఏడాది నిధులు మంజూరై విడుదలయ్యూయి. దాంతో ఈ ఏడాది ఖరీఫ్‌కు సాగునీరు వస్తుంద ని ఆశపడిన రైతులకు నిరాశే ఎదురైంది. ఈ అదనపు జలాలను హైలెవల్ కెనాల్ ద్వారా మూడు వేల 600 ఎకరాలకు, గొల్లపల్లి లింకు ఛానల్ ద్వారా 700 ఎకరాలకు, 5ఏఆర్ మైనర్ కాలువ ద్వారా 677 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం సుమా రు 40.35 ఎకరాల స్థలం కావాలని గుర్తించా రు. ఇప్పటికే 20.29 ఎకరాలను సాగునీటి అధికారులకు అప్పగించారు. వాటికి సంబంధించి చెల్లింపులు కూడా రైతులకు చేశారు. ఇంకా 20.06 ఎకరాలకు భూసేకరణ జరగాల్సి ఉంది. వీటి చెల్లింపులకుగాను రూ.28 లక్షలు కావాలని భూసేకరణ విభాగం నీటి పారుదల శాఖకు అడిగింది. దీనికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వా ల్సి ఉంది. ఇప్పటి వరకు బొబ్బిలి పట్టణ శివారున ఉండే భైరవసాగరం గట్టు ఎత్తు, వెడల్పు చేయడం, రెండు కల్వర్టులను ఏర్పాటు చేశారు. వాకాడ గ్రామం వద్ద కిలోమీటరు కాలువను తవ్వి వదిలేశారు. వాస్తవానికి హైలెవల్ కెనాల్ ద్వారా 13 కిలోమీటర్ల పొడవునా కాలువలు తవ్వాల్సి ఉంది. సీతానగరం మం డలం లచ్చయ్యపేట, వెన్నెల బుచ్చంపేట, కోటసీతారాం పురం, బొబ్బిలి మండలం కింతలివానిపేట, కలవరాయి, వాకాడవలస, చింతాడ, రాముడువలసకు సాగునీరు అందాలి. గొల్లపల్లి లింక్ ఛానల్ ద్వారా భైరవసాగరం, గొల్లపల్లి వెంగళరాయగారి చెరువుల కింద ఉన్న 700 ఎకరాల ఆయకట్టుకు నీరందాలి. 5ఏఆర్ మైనర్ కాలువల ద్వారా సుమారు రెండు కిలోమీటర్ల పొడవునా కాలువలు తవ్వాలి. దీని వల్ల గున్నతోట వలస, రంగరాయపురం, మెట్టవలసకు 677 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. ప్రస్తు తం భైరవసాగరం వద్ద మొదలు పెట్టిన పనిని అసలు కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్‌కు ఇవ్వడం వల్ల చెల్లింపులు సరిగా జరగక వివాదం నెలకొ ని పనులు మధ్యలోనే నిలిచిపోయిన పరిస్థితి. అదనపు ఆయకట్టులో రెండు స్లూయిస్ కల్వర్టులు, పది రోడ్డు కల్వర్టులు, కిలోమీటరు పొడవునా వయూడక్ట్ వంటివి ఇంకా నిర్మించాల్సి ఉంది. ఇప్పటికి ఈ పనులేవి సగభాగం కూడా పూర్తి కాలేదు. కిలోమీటరు కాలువ తప్పించి ప్రగతి లేకపోవడంతో వచ్చే ఖరీఫ్‌కు కూడా సాగునీరు అందే పరిస్థితి లేదు. రూ.11 కోట్లకుఇప్పటికి రూ.28 లక్షలే ఖర్చయినట్టు అధికారు లు చెబుతున్నారు. నిధులున్నా పనులు జరగక పోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. -
సబ్‌జైలుకు ఎన్సీఎస్ డెరైక్టర్లు
ఎన్సీఎస్ సుగర్స్ కర్మాగారం కథ కీలక మలుపు తిరిగింది. చెరుకు బిల్లుల బకారుులు చెల్లించాలని కొన్నాళ్లుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులు గడిచిన వారంలో ఉద్యమాన్ని వేడెక్కించారు. ఫలితంగా పోలీసుల లాఠీచార్జిలో రైతులు గాయపడడం, రైతు సంఘాల నేతల అరెస్ట్‌లు, రహదారుల దిగ్బంధంతో ఒక్కసారిగా ఉద్యమ స్వరూపం మారిపోయింది. ఈ క్రమంలో సుగర్స్ యూజమాన్యం భూములను స్వాధీనం చేసుకుని బిల్లులు చెల్లిస్తామని కలెక్టర్ స్వయంగా ప్రకటించి ఆందోళనకు దూరంగా ఉండాలని రైతులను కోరినా... రైతులు తమ పంథా వీడలేదు. ఈ క్రమంలో సుగర్స్ డెరైక్టర్లు ఇద్దరిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు బొబ్బిలి సబ్‌జైలుకు తరలించారు. అయినా తమ బిల్లులు చెల్లించే వరకు విశ్రమించేది లేదని రైతులు చెబుతున్నారు. అదే సమయంలో ఆదివా రం సమావేశమైన రైతు సంఘం నాయకులు మంగళవారం సుగర్స్ పరిధిలోని తహశీల్దార్ కార్యాలయూల ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బొబ్బిలి : లచ్చయ్యపేటలోని ఎన్సీఎస్ సుగర్స్ కర్మాగారం చెరుకు రైతులకు రూ.24 కోట్ల బిల్లులు చెల్లించని కేసులో అరెస్ట్ అరుున కర్మాగార డెరైక్టర్లు నారాయణం మురళి, నారాయ ణం శ్రీనివాస్‌లకు ఇన్చార్జి ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ వరలక్ష్మి ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దీంతో వీరిద్దరిని బొబ్బిలి సబ్‌జైలుకు పోలీసులు తరలించారు. ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో వారిని మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరుపరిచారు. శనివారం అదుపులోకి తీసుకున్న డెరైక్టర్లను జిల్లా కేంద్రంలో ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ ఆదివారం మీడియూ ముందు జిల్లా కేం ద్రం విజయనగరంలో ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి బొబ్బిలి మెజిస్ట్రేట్ ఇంటి వద్దకు తరువాత సబ్‌జైలుకు తరలించే సమయంలో బొబ్బిలి డీఎస్పీ ఇషాక్ మహ్మద్ ఆధ్వర్యంలో సీఐ తిరుమలరావు బందోబస్తు ఏర్పాటు చేశా రు. ఇదిలా ఉండగా డెరైక్టర్లు ఇద్దరిపై పార్వతీ పురం సబ్ కలెక్టర్ శ్వేతా మహంతి పోలీసుల కు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు బిల్లులు సకాలంలో చెల్లించలేదని, పూర్తిగా బిల్లులు ఇవ్వలేదని ఇద్దరు రైతులు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో వీరిపై మూడు కేసులను నమోదు చేశారు. మోసం చేసినందుకు 420 సెక్షన్‌ను, స్థిరాస్తులను దుర్వినియో గం చేసినందుకు 403 సెక్షన్‌ను, విశ్వాస ఘాతకానికి పాల్పడినందుకు 406 సెక్షన్‌ను, వ్యాపారిగా నమ్మించి మోసం చేసినందుకు 409 సెక్షన్‌ను, ఆర్థిక నేరాలకు కుట్ర పూర్వకంగా పాల్పడినందుకు 120 బి సెక్షన్‌ను నమోదు చేశారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన సమయంలో డెరైక్టర్లకు బెరుుల్ ఇవ్వాలని వారి తరఫున న్యాయవాదులు చేసిన దరఖాస్తును తిరస్కరించారు. సుగర్స్‌కు సంబంధించిన వ్యవహారంలో విచారించేందుకు డెరైక్టర్లను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు అభ్యర్థించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే డెరైక్టర్ల తండ్రి, మేనేజింగ్ డెరైక్టర్ అయిన నారాయణం నాగేశ్వరరావును ఇప్పటికే జాతీయ స్థాయిలో జరిగిన ఓ కుంభకోణం కేసులో ముంబాయి పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఎస్పీ గ్రేవల్ విజయనగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. త్వరలోనే ఇక్కడకు రప్పిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా డెరైక్టర్లను అరెస్ట్ చేశారన్న వార్త తెలియడంతో కోర్టు, సబ్ జైలు వద్దకు ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఉద్యోగులు వచ్చి వారిని కలుస్తున్నారు. -
ఆగ్రహానికి ఆజ్యం పోసిన అరెస్ట్‌లు
బొబ్బిలి: లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం పరిధిలో ఉన్న చెరుకు రైతులు ఆందోళన ఉద్ధృతం చేశారు... జోరువానలోనూ రోడ్డెక్కి నినదించారు. పార్వతీపురం డివిజన్లోని లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం పరిధిలో దాదాపుగా అన్ని మండలాల్లో రైతులు పెద్ద ఎత్తున శనివారం రహదారుల దిగ్బంధంలో పాల్గొన్నారు. రైతు సంఘ నాయకులు బయట ఉంటే ఉద్యమం మరింత ఉద్ధృతమవుతుందన్న ఉద్దేశ్యంతో శుక్రవారం అర్థరాత్రి నలుగురు చెరకు రైతు సంఘ నాయకులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. పార్వతీపురంలో రెడ్డి శ్రీరాంమూర్తిని, సాలూరులో గేదెల సత్యనారాయణను, సీతానగరంలో రెడ్డి ఈశ్వరరావును, రెడ్డియ్యవలసలో రెడ్డి లక్ష్ముంనాయుడులను ఇళ్ల వద్ద నుంచి తీసుకు వెళ్లి అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా తడుస్తూనే పోరాటాన్ని కొనసాగించారు. ఆరు గంటల నుంచే ఆందోళన డివిజన్లోని బొబ్బిలి, బలిజిపేట, సీతానగరం, మక్కువ, బాడంగి, తెర్లాం తదితర మండలాల్లో రైతులంతా ఏపీ చెరకు రైతు సంఘం ఇచ్చిన పిలుపుమేరకు శనివారం ఉదయమే నాటుబళ్ల, టైరు బళ్లతో రహదారులపైకి రావడం మొదలుపెట్టారు. పక్కి, చింతాడ, కోమటిపల్లి, కారాడ, అలజంగి, పణుకుపేట, అంటిపేట, కాశయ్యపేట, పిరిడి, లక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో నాటుబళ్లనురోడ్డుకు అడ్డంగా పెట్టి ఆందోళనలు చేశారు. బొబ్బిలి మండలం రంగరాయపురం గ్రామానికి చెందిన రైతులు టైరుబళ్లను తీసుకొని బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్సు వద్దకు చేరుకున్నారు. ఇక్కడ ఏపీచెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ, సీఐటియు నాయకుడు రెడ్డి వేణు,పి శంకరరావు తదితరుల ఆధ్వర్యంలో పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆ సమయంలో అటుగా వచ్చిన పార్వతీపురం న్యాయమూర్తి కారును అడ్డుకున్నారు. న్యాయమూర్తి వాహనానికి దారి ఇవ్వాలని పోలీసులు కోరినా మాకే న్యాయం లేదని మేం రోడ్డుమీదకు వస్తే మీకు దారికావాలా అంటూ ఆ వాహనం ముందుకు వెళ్లి నినాదాలు చేశారు..దీంతో ఉద్రిక్త పరిస్థితి అక్కడ నుంచి మొదలైంది.. నాయకుల అరెస్టు... పోలీసులతో వాగ్వాదం బొబ్బిలి కాంప్లెక్స్ జంక్షనులో ఆందోళన చేస్తున్న రైతు సంఘం నాయకులనుడీఎస్పీ ఇషాక్ ఆధ్వర్యంలో పోలీసులు అకస్మాత్తుగా అరెస్టు చేశారు.. అప్పటివరకూ మీడియాతో మాట్లాడుతున్న నాయకులను ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టారు. రైతు సంఘ నాయకుడు మర్రాపు సూర్యనారాయణతో పాటు సీఐటీయూ నాయకుడు రెడ్డి నాయకుడు, రైతు సంఘ నాయకులు ఉడుముల భూషణరావు, తాళ్లపూడి వెంకటరమణలను అరెస్టు చేసి రామభద్రపురం పోలీస్ స్టేషనుకు తరలించారు. దీంతో అక్కడ పోలీసులకు, రైతులకు మధ్య తీవ్రస్తాయిలో వాగ్వాదం జరిగింది. ‘‘మాకు రావలసిన బిల్లులు అడగడం కోసం ఆందోళన చేస్తే మమ్మల్ని అరెస్టు చేస్తున్నారని, అదే మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టిన వారి ఆస్తులకు కాపాలా కాసి, వారికి రాచమర్యాదలు చేస్తున్నారంటూ’’ దుయ్యబట్టారు. రోడ్డుపై బైఠాయించి మేం అందోళనను విరమించము. ఎంతమందిని పట్టుకెళ్తారో పట్టుకెళ్లండంటూ ఎదురుతిరిగారు.. ఒకానొక దశలో పరిస్థితి అదుపు తప్పుతుందనుకున్నారు. అయితే పోలీసులే ఒక అడుగు వెనక్కి వేసి గంట కాలం ఆందోళన చేసుకోమని అనుమతి ఇచ్చి అక్కడ నుంచి వెళ్లి పోయారు. మధ్యాహ్నం రెండు గంటల వరకూ రైతులు ఆందోళనను చేశారు. అప్పటివరకూ వాహనాలు ఎక్కడవక్కడే నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితులపై ఆస్పత్త్రి వెళ్లే వారి వాహనాలను రైతులు విడిచిపెట్టారు. ఇక్కడ బందోబస్తు నిర్వహించేందుక ఆరు వందల మందికి అదనంగా మరికొంత మంది పోలీసులను విశాఖ జిల్ల నుంచి రప్పించారు. -
ప్రభుత్వమే బిల్లులు చెల్లించాలి
బొబ్బిలి: ఎన్సీఎస్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేసి, వారి ఆస్తులను విక్రయించి రైతుల బకాయిలు తీర్చాలని, ఆ బాధ్యతను ప్రభుత్వమే తీసుకొని రెండు రోజుల్లో చెల్లించాలని ఏపీ చెరుకు రైతు సంఘం రాష్ర్ట అధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. బొబ్బిలిలో ధర్నాలో పాల్గొనడానికి వచ్చిన ఆయన, పోలీసులు అరె స్టు చేయడానికి ముందు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం మొబలైజేషన్ నిధులను కాంట్రాక్టర్లకు ఇచ్చిన విధంగానే ఫ్యాక్టరీ ఆస్తులను తనవద్ద ఉంచుకొని అడ్వాన్స్‌గా డబ్బులు ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. 1965 సుగర్ కంట్రోలు యాక్టు ప్రకారం ప్రభుత్వం అలా చేయడానికి అవకాశం ఉందన్నారు. ఈ నెల 2న మహాధర్నా చేసినపుడు 5 నుంచి చెల్లింపులు చేస్తామని స్వయంగా సబ్ కలెక్టరే ప్రకటించి మూడో తేదీ నుంచే 144వ సెక్షను అమలులోనికి తెచ్చారంటే చెల్లింపులు జరగవన్న సంగతి అధికారులకు ముందే తెలిసి రైతులను మోసం చేశారా అని ప్రశ్నించారు. సబ్ కలెక్టరు స్థాయి అధికారి రైతులను ఉద్దేశపూర్వకంగానే మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం చేతకానితనానికి ఇది నిదర్శనమన్నారు. నిత్యం రైతులను మోసం చేస్తున్న యాజమాన్యం వద్ద ఏ హామీ తీసుకొని రైతులకు హామీ ఇచ్చారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఇళ్లున్నాయి, నెల్లూరులో ఫ్యాక్టరీలున్నాయని అంటున్న అధికారులు వాటి స్వరూపం ఏమిటో, వాటిమీద ఎంత రుణం తీసుకున్నారో పరిశీలన చేశారా ? అని ప్రశ్నించారు. బిల్లుల కోసం 15 సార్లు ఆందోళన చేశామని, సబ్ కలెక్టరు వద్దే అంగీకరించి నాలుగు సార్లు వాయిదా వేశారని చెప్పారు. అధికారుల్లాగా అరుకు ఎంపీ కొత్తపల్లి గీత కూడా యాజమాన్యంతో మాట్లాడి 5న బిల్లులు చెల్లిస్తారని భరోసా ఇచ్చారని, అలా కాకపోతే ఆరున ఉద్యమంలో పాల్గొంటామని చెప్పారని అన్నారు. మరి బిల్లులు అందక రైతులు రోడ్డెక్కడంతో ఎంపీ ఏ రూపంలో ఉద్యమంలో పాల్గొంటారోనని నిరీక్షిస్తున్నామన్నారు. -
గురువులకు.. వందనం
సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవమైనది. వృత్తి పట్ల నిబద్ధత, మంచి వ్యక్తిత్వం, సహన శీలత, స్వీయ శిక్షణ, నైతిక విలువల పట్ల క్రమ శిక్షణ, విద్యార్థుల తెలివి తేటల్ని గుర్తించి పదును పెట్టగలిగే సామర్థ్యం ఉన్న వారే ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందారు. అటువంటి వారు విద్యార్థుల మదిలో చిరకాలం గుర్తుండిపోతాడు. అయితే ప్రస్తుత రోజుల్లో అలాంటి వారు నూటి కో కోటికో కనిపిస్తారు. అవార్డుల కోసమో, ఎవరి మెప్పు కోసమో కాకుండా విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్న కాంక్షతో పని చేసే వారు చాలా అరుదు. బొబ్బిలి, పార్వతీపురం, ఎస్. కోట పట్టణాల్లో పని చేస్తున్న కొందరు ఉపాధ్యాయులు ఇదే బాటలో నడుస్తున్నారు. నాలుగు గోడల మధ్య విద్యా బోధనే కాదు...నలుగురూ మెచ్చుకొనే మంచి పనులు చేస్తూ.. సమాజాభివృద్ధిలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు సమాజాన్ని సరైన మార్గంలో నడపడంతో మార్గదర్శులుగా నిలుస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారిపై ‘సాక్షి’ కథనం. బొబ్బిలి: నాలుగు గోడల మధ్య విద్యా బోధనే కాదు... నలుగురూ మెచ్చుకొనే మంచి పనులు చేయడంలోనూ మేం సిద్ధహస్తులమేనని నిరూపిస్తున్నారు బొబ్బిలి పట్టణానికి చెందిన కొందరు ఉపాధ్యాయులు. పట్టణానికి చెందిన టీచర్లంతా యంగ్ మేన్ హ్యాపీ క్లబ్ ఏర్పాటు చేసి అందరూ నవ్వు తూ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ దిశగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాత బొబ్బిలికి చెందిన టీచరు మింది విజయ్‌మోహన్ సీతానగరం మండలం నిడగళ్లులో పని చేస్తున్నా రు. ఆయన ఆధ్వర్యంలో సుమారు 15 మంది టీచర్లు ఒకటై నేడు నవ్వుల లోకాన్ని సృష్టిస్తున్నారు. వారే స్వయంగా నాటికలు తయారు చేసుకొని ప్రదర్శనలు ఇస్తున్నారు. బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, తెర్లాం, సీతానగరం, బలిజిపేట మండలాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఇప్పటికి దాదాపు 25 వరకూ హాస్య ప్రదర్శనలు ఇచ్చి వారిలో ఉన్న ప్రతిభను బయట ప్రపంచానికి చాటారు. దీనిలో మీసాల గౌరునాయుడు, రెడ్డి బెనర్జీ, బొత్స రత్నకిశోర్, మోజేస్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే జిల్లా స్థాయి ఇంగ్లిష్ లాంగ్వేజ్ అసోసియేషన్ (డెల్టా)ను కూడా స్థాపించి ఆంగ్లంను నేర్పే విధానంతో పాటు సులభతర బోధనపై దృష్టి సారించారు. మొక్కల ప్రేమికుడు... బాడంగి మండలం వాడాడలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు ఎస్వీ రమణమూర్తి పర్యావరణ ప్రేమికుడుగా పేరు గడించారు. పర్యావరణాన్ని ప్రేమించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ఆయన ప్రజల్లో అవగాహన కల్పించడం, వేలాది మొక్కలను సొంత నిధులతో తెప్పించి పంపిణీ చేసి నాటించడానికి నడుం కట్టుకున్నారు. వీటి కోసం గ్రీన్ బెల్టు సొసైటీని ఏర్పాటు చేసి అందులో మరికొందరు టీచర్లను భాగస్వాము లను చేశారు. దీని వల్ల ఒకవైపు మొక్కలు పెంపకంపై అవగాహన పెంచడంతో పాటు పాఠశాలలు, ఖాళీ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహ దారులకు ఇరువైపులా మొక్కలు నాటిస్తూ వాటి సంరక్షణ బాధ్యత తీసుకున్నారు. ఇప్పటికి వేలాది మొక్కలు నాటి వృక్ష ప్రేమికుడిగా మారారు. రమణమూర్తి చేస్తున్న కృషికి బొబ్బిలి రాజులు కూడా తనదైన సహకారాన్ని అందిస్తూ మొక్కలు రవాణాకు సొంత వాహనాలను సమకూరుస్తున్నారు. కళారాధనలో శ్రీదేవి... సీతానగరం మండలం జానుమల్లవలసలో టీచరుగా పని చేస్తున్న చుక్క శ్రీదేవి కళాసేవలో తనదైన ముద్ర వేశారు. కళలను, సంసృ్కతీ, సాంప్ర దాయాలను పెంపొందించడానికి సాయి చంద్రిక ఏకంగా కళా సేవా సంఘాన్ని ఏర్పాటు చేసి నృత్య, పౌరాణిక, సాంఘిక నాటకాల ప్రదర్శనలు ఏ ర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర స్థాయి నృత్య, నాటక పోటీలు నిర్వహించి మూడు జిల్లాలో ఉన్న నృత్య కళాకారులు, సాంఘిక కళలను పెంపొందిస్తున్నారు. ఇటీవల పర్యావరణాన్ని పరిరక్షించడానికి మట్టి వినాయకులను పంపిణీకి ఈ సంస్థ శ్రీకారం చుట్టింది. ఆయనే నాలో స్ఫూర్తి కలిగించారు నేను నాగార్జునసాగర్‌లోని ఏపీఆర్జేసీలో చదువుతున్నప్పుడు పౌరశాస్త్ర విభాగాధిపతి విజయరాఘవాచారి ఉండేవారు. ఆయన పాఠాలు విద్యార్థు లను ఎంతో ప్రభావితం చేసేవి. ముఖ్యంగా నాకు ఆయన ప్రసంగమన్నా..బోధనన్నా ఎంతో ఇష్టం. ఆయన సబ్జెక్టు చెప్పే తీరు అద్భుతం. జీవితా నికి వెలుగునిచ్చే ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరూ రుణపడాల్సిందే! బి. రామారావు, జాయింట్ కలెక్టర్ ‘ఉపాధ్యాయ’ కుటుంబం విజయనగరం అర్బన్: ఆ ఇల్లు ఉపాధ్యాయులకు పుట్టినిళ్లు. ఐదుగురు అన్నదమ్ములు, వాళ్లలోని ఇద్దరు భార్యలు ఉపాధ్యాయ వృత్తిలోనే స్థిరపడి ఆదర్శంగా నిలిచారు. జిల్లా సరిహద్దుల్లోని విశాఖ జిల్లా పద్మనాభం మండలం రెడ్డిపల్లి అగ్రహారం గ్రామానికి చెందిన రెడ్డిపల్లి సన్యాసిరావు, ఆది లక్ష్మి దంపతులకు ఐదుగురు కుమారులు. నిరాక్షరాస్యులైన వారు ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న గౌరవంతో పిల్లందర్నీ ఉపాధ్యాయ కోర్సులు చదివిం చారు. ప్రస్తుతం వారంతా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విజయనగరం, విశాఖ జిల్లాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్నారు. వీరిలో ఇద్దరి భార్యలు కూడా ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీనివాసరావు బొబ్బాదిపేట ప్రాథమికోన్నత పాఠశాలలోను, (డీఎస్సీ-1998), త్రినాథరావు డెంకాడ మండలం గొడిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలోను (డీఎస్సీ-1998), ప్రసాదరావు విశాఖ జిల్లా రావికమ తం మండలం కన్నంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో (డీఎస్సీ-2008), అప్పలరాజు విశాఖ జిల్లా భీమిలి ప్రాథమికోన్నత ఫిషర్ మేన్ స్కూల్లో (డీఎస్సీ-2008), రమేష్ భోగాపురం మండలం దిబ్బలపాలెం ప్రాథమిక పాఠశాలలోనూ (డీఎస్సీ-2008) పని చేస్తున్నారు. అలాగే త్రినాథరావు భా ర్య బి. సుజాత గంట్యాడ మండలం రామవరం ఉన్నత పాఠశాలలో, అప్పలరాజు భార్య సంతోషికుమారి పద్మనాభం మండలం పొట్నూరు ప్రాథ మికోన్నత పాఠశాలలోనూ పని చేస్తున్నారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ప్రాధాన్యతను గుర్తెరిన వీరంతా ఉపాధ్యాయ నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ.. విద్యా సేవ చేస్తున్నారు. -
పారిశ్రామిక వాడల్లో భూములపై సర్కార్ కన్ను
బొబ్బిలి:రాష్ట్రంలోని భూముల ధరలకు రెక్కలు రావడంతో ప్రభుత్వం కన్ను పారిశ్రామిక వాడల్లో ఖాళీగా ఉన్న భూములపై పడింది. అతి తక్కువ ధరకు వందలాది ఎకరాలు కొనుగోలు చేసి పరిశ్రమలు పెట్టకుండా ఏళ్ల తరబడి వృథాగా ఉంచేసిన భూములపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఏపీఐఐసీ ఆధ్వర్యంలో నడుస్తున్న పారిశ్రామికవాడల్లో ఎక్కడెక్కడ ఎంతెంత భూములున్నాయో నివేదిక లు కోరుతోంది. రాష్ట్రంలో కొత్తగా పారిశ్రామిక విధానం వస్తున్న తరుణంలో ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకోనుంది. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న స్థలాల యజమానులకు నోటీసులు ఇచ్చి వాటిని వెనక్కి తీసుకోవడమా? లేక ఇప్పటి ధరలకు అనుగుణంగా లెక్క కట్టి మిగిలిన సొమ్మును రాబట్టుకుని ఆదాయాన్ని పెంచుకోవడమా అనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. గ్రోత్ సెంటర్లో ఖాళీగా 700 ఎకరాలు బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌లో దాదాపు 700ఎకరాలు ఖాళీగా ఉ న్నాయి. ప్రధానంగా మూడు జిల్లాల అధికారులు ఇటువం టి భూములపైనే దృష్టిసారించారు. బొబ్బిలిలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడానికి 1995లో భూసేకరణ చేశారు. పట్టణంతో పాటు సమీపంలోని ఎనిమిది గ్రామాల నుంచి దాదాపు 1150 ఎకరాలను సేకరించారు. అప్పట్లో పరిశ్రమ లు స్థాపించడానికి ముందుకు వచ్చిన వారికి స్వ్కేర్ మీటరు రూ.200కు ఇస్తామని ప్రకటించి అందుకు అవసరమైన రహదారు లు, విద్యుత్తు, పరిపాలనాభవ నాల వంటివి నిర్మాణం చేశారు. గ్రోత్‌సెంటర్‌లో గ్రీన్‌బెల్టు, రిజర్వు సైటు, భవనాల కోసం 300 ఎకరాల వరకూ విడిచి పెట్టగా మిగిలిన 850 ఎకరాల్లో పరిశ్రమలకు దాదాపు 475 ప్లాట్లను వేశారు. అయితే పారి శ్రామికవేత్తలు ముందుకు రాకపోవడంతో స్క్వేర్ మీటర్ ధర రూ.50 తగ్గించారు. అప్పటికీ ఎవ్వరూ రాకపోవడంతో ఒక రూపాయికి ఇచ్చేం దుకు ప్రకటించినప్పటికీ పారిశ్రామికవేత్తలు ముందుకు రా లేదు. అయితే 2004లో వైఎస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పించడంతో బొ బ్బిలి గ్రోత్సెంటర్పై అందరి దృష్టి పడింది. 2006 నుంచి ఇక్కడ స్థలాల కొనుగోలుకు పారిశ్రామికవేత్తలు క్యూ కట్టా రు. అప్పటికి స్క్వేర్ మీటరు ధర రూ.75ఉంది. దాంతో ప్ర ధానంగా స్టీల్‌ప్లాంటు నిర్మాణం కోసం బీకే స్టీల్స్ కంపెనీ 244 ఎకరాలు తీసుకుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం, విశాఖ స్టీల్‌ప్లాంటు సంయుక్తంగా 112 ఎకరాలను మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ (మోయిల్) అనే పరిశ్రమను పెట్టడానికి భూములు తీసుకున్నారు. వైజాగ్ స్టీల్ ఎక్సేంజ్ మినీ స్టీల్‌ప్లాంటుకు 88 ఎకరాలు తీసుకున్నారు. ఈ మూడు కంపెనీలే 444 ఎకరాల వరకూ తీసుకున్నాయి. అవి ఏర్పాటైతే వాటికి సంబంధించి అనుబంధ ఫ్యాక్టరీలు నెలకొల్పడానికి పారిశ్రామిక వేత్తలు సిద్ధంగా ఉన్నా...ఫలితం లేక పోయింది. వాటితో పాటు దాదాపు 150 ప్లాంట్లలో సుమారు 2వందల ఎకరాల వరకూ పరిశ్రమలు స్థాపించకుండా ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం గ్రోత్ సెంటర్లో 130 వరకూ వివిధ స్థాయిల్లో నిర్మాణాలు ఉండగా, 80 వరకూ పనిచేస్తున్నాయి. పరిశ్రమల కోసం స్థలాలు తీసుకుని ప్రారంభించని వారికి ఏపీఐఐసీ అధికారులు నోటీసులు ఇస్తున్నా, వాటికి ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చి ఎంచక్కా స్థలాలు వదలకుండా ఉంటున్నారు. ప్రస్తుతం గ్రోత్‌సెంటర్‌లో స్థలాల ధరలు స్క్వేర్ మీటరు రూ.750 వరకూ ఉంది. ఇంత విలువైన స్థలంలో వందలాది ఎకరాలు వృథాగా ఉండకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచి స్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల రాష్ర్టస్థాయిలో జరిగిన సమావేశంలో వీటిపై సుదీర్ఘంగా చర్చించినట్లు భోగట్టా. ముందుగా వాటి రద్దుకు నోటీసులు ఇవ్వడం, దానికి స్పందించి పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తే ఇప్పుడున్న ధర ప్రకారం లెక్కకట్టి వ్యత్యాసాన్ని తీసుకోవడం ఒకటే మార్గమని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో రానున్న నూతన పారిశ్రామిక విధానంలో దీనిని అమలుచేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 2006లో కేవలం రూ.75కే స్వ్కేర్మీటరును తీసుకుని ఇప్పుడు దానికి రూ.750 వసూలు చేసి ఆదాయ మార్గాలను పెంచుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.