పండు అనుకునేరు... మండుద్ది!
ఈ మొక్కకు ఉన్న కాయలు చూడండి... అచ్చం ద్రాక్షపళ్లలా లేవూ... చూడడానికి అలా ఉన్నాయి కదాని తింటే... గూబ గుయ్యిమంటుంది... ఎందుకంటే ఇవి మిరపకాయలు...ఆశ్చర్యంగా ఉందా...నిజమే. ఇవి విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం ఎం.బూర్జవలస పంచాయతీ గున్నతోటవలస గ్రామానికి చెందిన తాడ్డిరామకృష్ణ పెరట్లో పెరుగుతున్నాయి.
వృత్తి రీత్యా కార్మికుడైన ఆయన మొక్కల ప్రేమికుడు. ఆయన మొక్కలను పెంచడమేగాదు... వాటిని అందరికీ పంపిణీ చేసి వారిని ప్రోత్సహిస్తుంటారు. ఎక్కడో పెరిగిన ద్రాక్షపండ్లలాంటి నల్లమిరపకాయలను తీసుకువచ్చి ఇంట ముంగిటవేశారు. విచిత్రంగా కనిపిస్తున్న ఈ మిరపకాయలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. కొందరు ఆయన దగ్గరనుంచి తీసుకెళ్లి వారి పెరట్లోనూ నాటుకున్నారు.
- బొబ్బిలి రూరల్