ధర్నాకు భారీగా తరలిరండి: సుజయకృష్ణ | sujay krishna ranga rao call for ysrcp workers | Sakshi
Sakshi News home page

ధర్నాకు భారీగా తరలిరండి: సుజయకృష్ణ

Published Fri, Nov 28 2014 8:32 PM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

ధర్నాకు భారీగా తరలిరండి: సుజయకృష్ణ

ధర్నాకు భారీగా తరలిరండి: సుజయకృష్ణ

బొబ్బిలి: ఆంధ్రప్రదేశ్ సీఎం ఇచ్చిన హామీల వైఫల్యాలపై నిరసన తెలియజేయాలని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సుజయకృష్ణ రంగారావు అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో శుక్రవారం జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

డిసెంబర్ 5న జరిగే ధర్నాకు భారీగా తరలిరావాలని ఆయనీ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైవుండి జాబితాలో పేర్లు తొలగించిన బాధితులను కలుపుకుని పోరాటం చేద్దామని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. పార్టీకి సంబంధించిన మండల, గ్రామ కమిటీల ఏర్పాటుపై కూడా సమావేశంలో చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement