రైల్వేట్రాక్పై నిలిచిన బస్సు... దూకేసిన ప్రయాణికులు | Bus stuck on Railway track at Bobbili in Vizianagaram District | Sakshi
Sakshi News home page

రైల్వేట్రాక్పై నిలిచిన బస్సు... దూకేసిన ప్రయాణికులు

Published Wed, Sep 17 2014 1:09 PM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM

రైల్వేట్రాక్పై నిలిచిన బస్సు... దూకేసిన ప్రయాణికులు

రైల్వేట్రాక్పై నిలిచిన బస్సు... దూకేసిన ప్రయాణికులు

విజయనగరం: విజయనగరం జిల్లా బొబ్బిలి రైల్వేట్రాక్పై ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆకస్మాత్తుగా ఆగిపోయింది. దాంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళలకు గురైయారు. ఏ నిముషాన ఎటువైపు నుంచి రైలు వస్తుందోనని బస్సులోని ప్రయాణికులు ఆందోళన చెందారు. దీంతో అద్దాలు పగులకొట్టి ప్రయాణీకులు బస్సులో నుంచి బయటకు దూకేశారు.

ట్రాక్పై బస్సు అగిపోయిన విషయాన్ని స్టేషన్ సిబ్బందికి తెలిపారు. దాంతో ఆ ట్రాక్పై నడిచే రైళ్ల రాకపోకలకు స్టేషన్ అధికారులు నిలువరించారు. అంతలో స్థానికలు సహాయంతో ప్రయాణికులు బస్సును రైల్వే ట్రాక్పై నుంచి పక్కకు తప్పించారు. ఆ విషయాన్ని స్టేషన్ అధికారులకు తెలిపారు. ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి వారివారి గమ్యస్థానాలకు తరలించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement