
విజయనగరం: పార్టీ కోసం రోజూ ఎన్నో గ్రామాలు తిరుగుతున్నాను. ఎందరినో కలిసి పార్టీ కార్యక్రమాలను వివరిస్తున్నాను. అయితే తెలుగుదేశం పార్టీకి అవేమీ చాలవట. పార్టీ యాప్ మై టీడీపీలో వాటిని నమోదుచేసి అప్‌లోడ్ చేయాలట. యాప్‌లో బొబ్బిలి నియోజకవర్గం అట్టడుగున ఉందట. అని బొబ్బిలి టీడీపీ ఇన్‌చార్జి ఆర్‌వీఎస్‌కేకే రంగారావు కారకర్తల మధ్య ఆవేదన వెళ్లగక్కారు.
ఉనికి కోసం పాట్లు పడుతున్న టీడీపీ ఓ యాప్ పెట్టుకుంది. దానిని అనుసరించడంలో బొబ్బిలి నియోజకవర్గం అట్టడుగున ఉందని పార్టీ అధిష్టానం నుంచి సమాచారం వచ్చింది. ఈ విషయం సాక్షాత్తూ నియోజకవర్గ సమావేశంలో టీడీపీ కార్యకర్తలకు బేబీనాయన వెల్లడించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం పట్టణంలోని కోటలో నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు.