Baby nayana
-
Bobbili: వాటీజ్ దిస్ ‘బేబీ’?
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మిట్ట మధ్యాహ్నం... బొబ్బిలి మెయిన్‌రోడ్డు... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మలివిడత ప్రచార సభ... వేలాది జనం పోటెత్తారు. బుధవారం ఈ ప్రభంజనాన్ని చూసినవారంతా ఆశ్చర్యపోయారు. కానీ ఒక్కరు మాత్రం ఉలిక్కిపడ్డారు. ఆయనే బొబ్బిలి టీడీపీ అభ్యర్థి ఆర్వీఎస్కేకే రంగారావు ఉరఫ్ బేబీనాయన! తమ పూర్వీకుల వీరప్రతాపం గురించి కోటకు వచ్చినవారందరికీ పూసగుచ్చినట్లు చెప్పే ఆయన... ఇప్పుడు జగన్మోహన్రెడ్డి సభ అంటే హడలిపోవడం విచిత్రంగా ఉందని బొబ్బిలి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అంతకుముందు జరిగిన వైఎస్సార్సీపీ సభలకు పోటెత్తిన జనాన్ని చూసి ముందురోజు నుంచే ‘రక్షణ’ పేరుతో చెడగొట్టే కార్యక్రమానికి తెరలేపారు.బొబ్బిలి కోట సమీపంలో సభ పెడితే తమ కుటుంబానికి భద్రత ఉండదని, తమకు రక్షణ కల్పించాలంటూ తన న్యాయవాది ద్వారా ఎన్నికల కమిషన్‌కు, అధికారులకు ఫిర్యాదులు పంపించడం గమనార్హం. కానీ రోడ్డుషోకు హాజరైన ప్రజలు కానీ, వైఎస్సార్సీపీ శ్రేణులు కానీ ఆ కోట గేటు వైపు కూడా కన్నెత్తిచూడలేదు. ఇక తన ప్రసంగంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడా బేబీనాయన గురించి కానీ, మంత్రి పదవి కోసం సంతలో పశువులా అమ్ముడుపోయి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఆయన సోదరుడు ఆర్వీఎస్కే రంగారావు (సుజయ్) గురించి కానీ ప్రస్తావన తీసుకురాలేదు. ఒకవైపు కూటమి నాయకులు తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నా జగన్మోహన్రెడ్డి మాత్రం తన ప్రత్యర్థి పారీ్టకి చెందిన బొబ్బిలి రాజుల పట్ల హుందాగా వ్యవహరించడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే కావాలని... బొబ్బిలి పట్టణంలో దశాబ్దాల సమస్యగా ఉన్న మెయిన్ రోడ్డు విస్తరణనూ చేపట్టలేక బేబీనాయన మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు, ఆయన సోదరుడు సుజయ్ టీడీపీలోకి వెళ్లి మంత్రిగా అధికారం వెలగబెట్టినప్పుడు చేతులెత్తేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.10 కోట్ల వ్యయంతో మెయిన్‌రోడ్డును విస్తరించారు. ఆ సోదరులు బొబ్బిలికి చేసిన మేలేమిటో ఒక్కటీ చెప్పలేరు.ఆ మెయిన్ రోడ్డుపైనే సభలన్నీ... ‘సైకిల్ పోవాలి’ అంటూ చంద్రబాబు నినాదం ఇచ్చిన ‘ఇదేమి ఖర్మ’ కార్యక్రమం కూడా బొబ్బిలి మెయిన్రోడ్డుపైనే 2022 డిసెంబర్ 23న బేబీనాయన సమక్షంలోనే జరిగింది. పట్టుమని రెండు వేల మంది కూడా ఆ కార్యక్రమానికి రాలేదు. ఆ తర్వాత అదే రోడ్డుపై గత ఏడాది నవంబరు 23న జరిగిన వైఎస్సార్సీపీ ‘ప్రజా సంకల్పయాత్ర’కు జనం పోటెత్తారు. కళాభారతి నుంచి బొబ్బిలి కోట వరకూ జనసంద్రమైంది. జగన్మోహన్రెడ్డి కార్యక్రమాలకు అంతకుమించి జనం వస్తారనే అంచనాతో బేబీనాయనకు బెంగపట్టుకుంది. సభాస్థలి కోటకు సమీపంలో పెట్టడం ఇష్టం లేక తన కోట ‘భద్రత’ పేరుతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏమిటీ నాయనా మీ గొప్ప... అధికారం దక్కేవరకే బేబీనాయనకు ప్రజలతో పని. ఒకసారి పీఠం దక్కిందా ఆ తర్వాత అదే ప్రజలను కోట గుమ్మం కూడా ఎక్కనివ్వని చరిత్ర ఆయన సొంతం. చివరకు అధికారులైనా దర్బార్మహల్లో రోజంతా పడిగాపులు బొబ్బిలి ప్రజలకు అనుభవమే. తొలుత 2009లో బొబ్బిలి 29వ వార్డు కౌన్సిలర్‌గా బేబీ నాయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అదీ కోటను ఆనుకొని ఉన్న వార్డు, ఆరొందలకు మించని ఓటర్లు అయినా సరే గెలుపుపై భయం పట్టుకుంది. అప్పట్లో పోటీ పడిన టీడీపీ అభ్యరి్థని నయానాభయానో ఒప్పించి తన ఏకగ్రీవ ఎన్నిక కోసం బరి నుంచి తప్పించారు. అలా బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకున్న ఆయన పదవీకాలం 2009–14లో ముచ్చటగా మూడుసార్లు మాత్రమే ఆ కురీ్చలో కూర్చున్నారు. కారణమేమిటో తెలుసా? మున్సిపల్ సాధారణ సమావేశాల్లో కౌన్సిలర్లు కొన్ని సమస్యలపై నిలదీస్తుండటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసేవారు. పదవీ అలంకారం కాదు ప్రజాసేవ కోసమనే విషయం తెలియని ఆయన ఇక ఆ తర్వాత ఎప్పుడూ కౌన్సిల్ హాలులోకి అడుగుపెట్టలేదు. వైస్ చైర్మన్ గునాన విజయలక్షి్మకి బాధ్యతలు అప్పగించేసి ప్రజలకు ముఖం చాటేశారు. అంతేకాదు మున్సిపల్ చైర్మన్ పదవిలోకి వచ్చినప్పుడు తనకోసం ప్రత్యేకంగా చేయించుకున్న కురీ్చని కూడా కోటకు తీసుకుపోయారు. -
ఎంత కష్టపడుతున్నా కానీ..!
విజయనగరం: పార్టీ కోసం రోజూ ఎన్నో గ్రామాలు తిరుగుతున్నాను. ఎందరినో కలిసి పార్టీ కార్యక్రమాలను వివరిస్తున్నాను. అయితే తెలుగుదేశం పార్టీకి అవేమీ చాలవట. పార్టీ యాప్ మై టీడీపీలో వాటిని నమోదుచేసి అప్లోడ్ చేయాలట. యాప్‌లో బొబ్బిలి నియోజకవర్గం అట్టడుగున ఉందట. అని బొబ్బిలి టీడీపీ ఇన్చార్జి ఆర్వీఎస్కేకే రంగారావు కారకర్తల మధ్య ఆవేదన వెళ్లగక్కారు. ఉనికి కోసం పాట్లు పడుతున్న టీడీపీ ఓ యాప్ పెట్టుకుంది. దానిని అనుసరించడంలో బొబ్బిలి నియోజకవర్గం అట్టడుగున ఉందని పార్టీ అధిష్టానం నుంచి సమాచారం వచ్చింది. ఈ విషయం సాక్షాత్తూ నియోజకవర్గ సమావేశంలో టీడీపీ కార్యకర్తలకు బేబీనాయన వెల్లడించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం పట్టణంలోని కోటలో నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. -
వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకులు వీరే
హైదరాబాద్: రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులను నియమించింది. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలు జరిగినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకులు వీరే శ్రీకాకుళం- బేబీ నయిన విజయనగరం- బి.చంద్రశేఖర్ అరకు- బి. ప్రసాద్ విశాఖ- దాడిశెట్టి రాజా అనకాపల్లి- ఆదిరెడ్డి అప్పారావు కాకినాడ- ముత్యాలనాయుడు రాజమండ్రి- పేర్ని నాని అమలాపురం- కరణం ధర్మశ్రీ నరసాపురం- వేణుగోపాల్ ఏలూరు- పిల్లి సుభాష్ చంద్రబోస్ విజయవాడ- ఆదిశేషగిరిరావు మచిలిపట్నం- ఉమ్మారెడ్డి రమణ తిరుపతి- ఎల్లసిరి గోపాల్ రెడ్డి చిత్తూరు-పి. రవీంద్రనాథ్ రెడ్డి అనంతపురం- డీసీ గోవిందరెడ్డి హిందూపూర్- మిథున్‌రెడ్డి కర్నూలు- సురేష్‌బాబు నంద్యాల- గుర్నాథరెడ్డి కడప- వైఎస్ అవినాశ్‌రెడ్డి రాజంపేట- దేవగుడి నారాయణరెడ్డి -
బొత్స రాజకీయ జీవితం వైఎస్ పుణ్యమే
వెఎస్సార్ సీపీ విజయనగరం ఎంపీ అభ్యర్థి బేబీనాయన కాబోయే సీఎం జగన్ : పెనుమత్స చీపురుపల్లి, న్యూస్‌లైన్: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయ ఎదుగుదలకు మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి కారణమని, అటువంటి నాయకుడ్ని బొత్స విమర్శించడం ఆయన నీచ బుద్ధికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం ఎంపీ అభ్యర్థి బేబీనాయన అన్నారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం సాయంత్రం గరివిడి పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. బొత్సకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ దయతో తాను రాజకీయంగా ఎదగలేదని, గత ఎన్నికల్లో ఆయన ఫొటో లేకుండానే గెలిచానని అంగీకరించగలరా అని ప్రశ్నిం చారు. 2004, 2009 ఎన్నికల్లో వైఎస్సార్ ఫొటో పెట్టుకుంటేనే ఈ నియోజకవర్గ ప్రజలు బొత్సను గెలిపించారని తెలిపారు. వైఎస్సార్ దయ తో రాష్ట్రస్థాయి రాజకీయాలను నెరిపిన బొత్స ఆయన్నే విమర్శించే స్థాయి కి వచ్చారన్నారు. ఇలాంటి వ్యక్తులకు ప్రజలే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడి పదవిలో ఉండి కూడా ఆయన తోటపల్లి కాలువ పనులను పూర్తి చేయించలేకపోయారని, అంటే ఇక్కడి ప్రజలపై బొత్సకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు. పా ర్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బడుగు, బలహీన వర్గాలు అభ్యున్నతి సాధించారని తెలిపారు. చీపురుపల్లి అసెంబ్లీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తోటపల్లి కాలువ పనులు పూర్తి చేయించి సాగునీరు అం దిస్తామని, గరివిడిలో ఫేకర్ సమస్య పరిష్కరించి, కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జగన్ సీఎం కావడం ఖాయం నెల్లిమర్ల రూరల్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబ శివరాజు అన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిర్వహించిన రోడ్‌షోలో భాగంగా ఒమ్మి, సతివాడ గ్రామాల్లో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే ప్రతి ఒక్కరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. వైఎస్ సంక్షేమ పథకాల అమలు జగన్మోహన్రెడ్డి పాలనతోనే సాధ్యమని చెప్పారు. అంతకుముందు పార్టీ విజయనగ రం ఎంపీ అభ్యర్థి బేబీనాయన మాట్లాడుతూ రాష్ట్ర రాజ కీయాల్లో జగన్మోహన్రెడ్డి మడమ తిప్పని నేత అని అన్నారు. పార్టీకి ఎనలేని ప్రజాదరణ ఉందని, వారే తమ ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. నెల్లిమర్ల అసెంబ్లీ అభ్యర్థి సురేష్‌బాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానన్నారు. చంద్రబాబు మాటలు నమ్మొద్దు విజయనగరం మున్సిపాలిటీ/టౌన్: టీడీపీ అధినేత చం ద్రబాబు ఇస్తున్న హామీలను ప్రజలు నమ్మవద్దని వైఎ స్సార్ సీపీ విజయనగరం ఎంపీ బేబీనాయన కోరారు. విజయనగరం పట్టణంలోని గంట స్తంభం వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతులకు రుణమాఫీ అంటూ అనేక టక్కుటమారా, గజకర్ణ, గోకర్ణ విద్యలతో ముందుకు వస్తున్న బాబును, ఆ పార్టీ అభ్యర్థులను నమ్మొద్దని కోరారు. జగన్ సీఎం కావడం చారిత్రాత్మక అవసరమన్నారు. విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థ్ధిగా పోటీ చేసిన తాను కాంగ్రెస్ నాయకుల వెన్నుపోట్లు వల్లే నాలుగుసార్లు ఓటమి పాలయ్యాయని, చివరికి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిపొందానని చెప్పా రు. ఎన్నికల్లో తనను, ఎంపీ అభ్యర్థి బేబీనాయనను ఫ్యా న్ గుర్తుపై ఓటేసి, గెలిపించాలని కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తాగునీరు, రోడ్లు, ఇళ్లు వంటి మౌలి క సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. -
రాజుగా కాదు..రైతుగా వచ్చా..
గంట్యాడ,న్యూస్‌లైన్: ‘నేను మీముందుకు రాజుగా రాలేదు. రైతుగా వచ్చాను. నన్ను ఆశీర్వదించండి’. అని విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి బేబీనాయన విజ్ఞప్తి చేశారు. గంట్యాడ మండలంలో శుక్రవారం రాత్రి పొల్లంకి,పెంటశ్రీరామపురం గ్రామాలలో గజపతినగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజులుపోయారు,రాచరికాలుపోయాయి ప్రజ లకు సేవచేసినవాడే నిజమయిన నాయకుడని అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్ మోహన్ రెడ్డి మాటపై నిలబడే వాడని ప్రజలకోసం చేస్తానన్నది చేసి చూపెడతారన్నారు. రాష్ర్టంలో వైఎస్సార్సీపీకి ఆదరణ పెరిగిందన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అవడం ఖాయమని ప్రజల కష్టాలు తీరే రోజులు దగ్గరలో ఉన్నాయ న్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే రైతన్న కష్టాలు తీర్చడానికి వరి, చెరుకు, అపరాలు ప్రతి పంటకు గిట్టుబాటు ధరకల్పిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అభిమానం ఉండడంతో ఇంతరాత్రయినా ఆడపడుచులు,వృద్ధులు తమ కోసం వేచి ఉన్నారన్నారు. తమ పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని, మీ అందరి కన్నీరు తుడుస్తానన్నారు. మీలోఒకడిగా ఉంటానని అందలమెక్కాక మరిచిపోయే వాడిని కాదన్నారు. మహానేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రామన్న రాజ్యం ఉండేదని,జగనన్నను ముఖ్యమంత్రిని చేస్తే రాజన్న రాజ్యం వస్తుందన్నారు.కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఎం.కృష్ణబాబు,మాజీ ఎంపీపీ వర్రి నరశింహమూర్తి, ఎం.సన్యాసినాయుడు,బూడి సత్యారావు,జాగరపు సత్యారావు,బొబ్బాదినారాయణ,కోడెల ముత్యాలునాయుడు,జె.దేముడు,ఆయాగ్రామాలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. -
చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు
చీపురుపల్లి, న్యూస్‌లైన్ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని జైల్లో పెట్టేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని వైఎస్సార్సీపీపీ విజయనగరం ఎంపీ అభ్యర్థి బేబీ నాయన ఆరోపించారు. గజపతినగరంలో ఆదివారం జరిగిన జనభేరి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓట్లు అడిగేందుకు వస్తున్న టీడీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబునాయుడుతో జై సమైక్యాంధ్ర అనిపించాలని సవాల్ విసిరారు. టీడీపీ, కాంగ్రెస్‌లు ఎన్ని కుట్రలు పన్నినా జగన్మోహన్రెడ్డిని ప్రజల నుంచి వేరు చేయలేరన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
'రానున్న ఎన్నికల్లో బొత్స కుటుంబం భూస్థాపితం'
విజయనగరం: రానున్న ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కుటుంబాన్ని భూస్థాపితం చేయడం ద్వారా అరాచక రాజకీయాలకు స్వస్తి చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. బొబ్బిలి దర్బార్ మహాల్లో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం బుధవారం జరిగింది, ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయకృష్ణరంగారావు, జిల్లా కన్వీనర్ పెన్మత్స సాంబశివరాజు, బేబినయనలు హాజరయ్యారు. ఈ సందర్బంగా సుజయకృష్ణరంగారావు మాట్లాడుతూ.. బొబ్బిలిలో మేమిచ్చిన మెజార్టీతోనే బొత్స కుటుంబం రెండు సార్లు ఎంపీ పదవి పొందారు అని అన్నారు. ఈసారి ఎన్నికల్లో అదే మెజార్టీని వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం ద్వారా బొత్సను రాజకీయ సన్యాసం చేయిద్దాం అని పిలుపునిచ్చారు. మేం రాజకీయాల్లో ఉన్నంతకాలం రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం. భవిష్యత్ లో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే కొనసాగుతాం అని నేతలు స్పష్టం చేశారు. రానున్న బొబ్బిలి యుద్ధంలో విజయం మాదే బేబినయన ధీమా వ్యక్తం చేశారు.