'రానున్న ఎన్నికల్లో బొత్స కుటుంబం భూస్థాపితం'
'రానున్న ఎన్నికల్లో బొత్స కుటుంబం భూస్థాపితం'
Published Wed, Feb 19 2014 11:05 PM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM
విజయనగరం: రానున్న ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కుటుంబాన్ని భూస్థాపితం చేయడం ద్వారా అరాచక రాజకీయాలకు స్వస్తి చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు.
బొబ్బిలి దర్బార్ మహాల్‌లో వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం బుధవారం జరిగింది, ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయకృష్ణరంగారావు, జిల్లా కన్వీనర్ పెన్మత్స సాంబశివరాజు, బేబినయనలు హాజరయ్యారు.
ఈ సందర్బంగా సుజయకృష్ణరంగారావు మాట్లాడుతూ.. బొబ్బిలిలో మేమిచ్చిన మెజార్టీతోనే బొత్స కుటుంబం రెండు సార్లు ఎంపీ పదవి పొందారు అని అన్నారు. ఈసారి ఎన్నికల్లో అదే మెజార్టీని వైఎస్‌ఆర్‌సీపీకి ఇవ్వడం ద్వారా బొత్సను రాజకీయ సన్యాసం చేయిద్దాం అని పిలుపునిచ్చారు.
మేం రాజకీయాల్లో ఉన్నంతకాలం రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం. భవిష్యత్ లో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే కొనసాగుతాం అని నేతలు స్పష్టం చేశారు. రానున్న బొబ్బిలి యుద్ధంలో విజయం మాదే బేబినయన ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement