శ్రీకాకుళం జిల్లా ప్లీనరీలో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ
శ్రీకాకుళం రూరల్/సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం, కోనసీమ, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల ప్లీనరీ ఆదివారం ఉత్సాహకర వాతావరణంలో నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన ప్లీనరీలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించనున్న రాష్ట్ర ప్లీనరీని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ, పార్టీ నేతలు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా ప్లీనరీ రామచంద్రపురంలో, తూర్పుగోదావరి జిల్లా ప్లీనరీ కొవ్వూరులో ఆయా జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు పొన్నాడ వెంకటసతీష్‌కుమార్, జక్కంపూడి రాజాల అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్లమెంటు సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్లీనరీ.. చరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతుందని వారు చెప్పారు.
ఇప్పుడు అమలు చేస్తున్న వాటికంటే మెరుగైన అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, పినిపే విశ్వరూప్, ఎంపీలు మార్గాని భరత్‌రామ్, చింతా అనురాధ, జెడ్పీ చైర్మన్లు విప్పర్తి వేణుగోపాలరావు, కవురు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ప్లీనరీలో ముఖ్య అతిథిగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు.
చంద్రబాబు ఎన్ని జన్మలెత్తినా ఇక ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదని ఎద్దేవా చేశారు. రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ హెనీక్రిస్టినా, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్యవరప్రసాద్, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరిధర్, కిలారి రోశయ్య, అన్నాబత్తుని శివకుమార్, ఉండవల్లి శ్రీదేవి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు, మిర్చియార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment