YSR Congress plenary
-
YSRCP Plenary 2022: పార్టీ పండుగ ‘ప్లీనరీ’
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్లీనరీ పార్టీకి పండుగతో సమానమని, ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు స్వచ్ఛందంగా, సమన్వయంతో పని చేయాలని శ్రేణులకు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి సూచించారు. ఈనెల 8, 9వ తేదీలలో రెండు రోజులపాటు జరుగనున్న ప్లీనరీ సమావేశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయని తెలిపారు. కార్యకర్తల ఉత్సాహానికి అనుగుణంగా వ్యవహరించాలని నేతలను కోరారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, బీసీ, జనరల్ కార్పొరేషన్ చైర్ పర్సన్ల సమావేశంలో ప్లీనరీకి సంబంధించిన అంశాలపై ఆయన సమీక్షించారు. సమావేశానికి పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. కులమతాలు, రాజకీయాలకతీతంగా అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాలకు సంతృప్త స్థాయిలో సీఎం జగన్ మేలు చేస్తున్నారని సాయిరెడ్డి తెలిపారు. మహిళలకు అన్ని రంగాలలో సమాన వాటా కల్పిస్తున్నామని చెప్పారు. దేశ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో మంత్రివర్గంలో 70 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు స్థానం కల్పించిన ఘనత సీఎం జగన్‌దేనని గుర్తు చేశారు. చిరస్థాయిగా వైఎస్సార్సీపీ: సజ్జల వైఎస్సార్సీపీని ప్రజలు తమ హృదయాలలో చిరస్థాయిగా పదిలపరుచుకున్నారని ప్లీనరీ ప్రజా ప్రతినిధుల సమన్వయ కమిటీ కన్వీనర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అందుకే సాధారణ ఎన్నికలలో కనీవినీ ఎరుగని రీతిలో మెజారిటీ ఇచ్చారన్నారు. స్థానిక సంస్ధల ఎన్నికలలో సైతం 80 శాతం మంది ప్రజాప్రతినిధులు పార్టీ నుంచే ఎన్నికయ్యారని గుర్తు చేశారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇలా జరగలేదన్నారు. ప్రజలు ఇంతగా ఆదరాభిమానాలు చూపుతున్న వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలను అంచనాలకు మించి విజయవంతం చేయాలని సూచించారు. ప్లీనరీకి సంబంధించిన పలు అంశాలను ఆయన పూర్తిస్థాయిలో సమీక్షించారు. అత్యంత ప్రతిష్టాత్మకం: వైవీ సుబ్బారెడ్డి ప్లీనరీ సమావేశాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని ఆహ్వాన కమిటీ కన్వీనర్ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన పట్ల ప్రజలు ఎంతో భరోసాగా ఉన్నారని గుర్తు చేస్తూ వారి అంచనాలకు అనుగుణంగా ప్లీనరీ నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్లీనరీ ఆహ్వాన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ప్రతిష్టను ఇనుమడించేలా ప్లీనరీ సమావేశాలు జరగాలన్న ముఖ్యమంత్రి జగన్ సంకల్పానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. సమావేశంలో విజయసాయిరెడ్డితోపాటు పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్, పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ మేరుగ నాగార్జున, మంత్రి విడదల రజని, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చరిత్రాత్మకం: గడికోట అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న ఈ ప్లీనరీ చరిత్రాత్మకమైందని ప్లీనరీ వాలంటీర్స్ కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. పార్టీని కన్నతల్లిగా భావించే ప్రతి ఒక్కరికీ ప్లీనరీ అపురూపమైన పండుగలా నిలుస్తుందన్నారు. గత ప్లీనరీలో పార్టీ అజెండాను వివరించామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఏం చేశాం? భవిష్యత్‌లో ఏం చేయబోతున్నామనేది ఈ ప్లీనరీ ద్వారా వివరిస్తామన్నారు. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ప్లీనరీ నిర్వహించే ప్రాంతాన్ని పార్టీ నేతలతో కలసి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. -
YSRCP Plenary 2022: ప్రజాభ్యుదయమే అజెండా
సాక్షి, అమరావతి: గతాన్ని మననం చేసుకుని.. వర్తమానాన్ని విశ్లేషించుకుని.. భవిష్యత్తులో మరింత మెరుగ్గా ప్రజలకు సేవ చేయడమే అజెండాగా ప్లీనరీ నిర్వహించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇతర పార్టీలకు భిన్నంగా ప్రజాభ్యుదయమే అజెండాగా ప్లీనరీలు నిర్వహించడం వైఎస్సార్సీపీ విధానం. పార్టీ ఆవిర్భవించాక 2011, జూలై 8, 9న ఇడుపులపాయలో నిర్వహించిన తొలి ప్లీనరీ.. 2017, జూలై 8, 9న నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో నిర్వహించిన రెండో ప్లీనరీలోనూ ప్రజాభ్యుదయమే అజెండాగా చేసుకుంది. ఇక అధికారంలోకి వచ్చాక నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో ఈనెల 8, 9న నిర్వహించే మూడో ప్లీనరీలోనూ ప్రజల సంక్షేమమే ప్రధాన ఎజెండా. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం చెందినప్పటి నుంచి అధికారంలోకి వచ్చేవరకూ సుమారు పదేళ్లపాటు దేశ చరిత్రలో ఏ పార్టీ ఎదుర్కోనన్ని సవాళ్లు, అటుపోట్లు, దాడులను వైఎస్సార్సీపీ ధీటుగా ఎదుర్కొంది. ప్రజల తరఫున నిలబడి పోరాడింది. ప్రజల హృదయాలను గెలుచుకుని 2019 ఎన్నికల్లో ఆఖండ విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే పదేళ్ల పోరాటంలో ప్రజలకు చేసిన వాగ్దానాల్లో 95 శాతం అమలుచేసింది. ప్రజాభ్యుదయం.. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అలాగే, అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ప్రజాసంక్షేమం, అభివృద్ధికి నిబద్ధతతో కృషిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వచ్చే ప్లీనరీలో ప్రజాభ్యుదయం, రాష్ట్ర సమగ్రాభివృద్ధితో ముడిపడిన విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం–సామాజిక సాధికారత, మహిళా సాధికారత–రక్షణ, నవరత్నాలు–డీబీటీలు, పారిశ్రామికాభివృద్ధి–ఉద్యోగాల కల్పనపై చర్చించి.. వాటిని మరింత మెరుగ్గా అమలుచేయడంపై తీర్మానాలు చేయనున్నారు. జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా.. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటును అందించి పేదరికం నుంచి ప్రజలను గటెక్కించడం.. మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, పారిశ్రామికాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళా సాధికార, సామాజిక సాధికారత సాధించడం ద్వారా రాష్ట్రాన్ని అన్నింటా అగ్రగామిగా నిలపడానికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు. ఈ క్రమంలో గడచిన మూడేళ్లలో పలు రంగాల్లో కీలక సంస్కరణలను తీసుకొచ్చారు. ముఖ్యంగా.. విద్యారంగం.. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఆధునీకరించారు. పిల్లల చదువులకు పేదరికం అడ్డుకాకూడదన్న లక్ష్యంతో జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, వసతి దీవెన, గోరుముద్ద, నాడు–నేడు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ తదితర పథకాల కింద విద్యారంగంలో రూ.52,676.98 కోట్లను ఖర్చుచేశారు. ప్రపంచ విద్యార్థులతో రాష్ట్ర విద్యార్థులు పోటీపడేలా వారిని తీర్చిదిద్దేందుకు బైజూస్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో ఏటా రూ.24 వేల వరకు ఖర్చయ్యే.. శ్రీమంతుల పిల్లలకు మాత్రమే లభిస్తున్న బైజూస్ స్డడీ మెటీరియల్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగానే అందజేయనుంది. వైద్యరంగం.. ప్రజలకు వైద్య సేవలను మెరుగ్గా అందించడానికి ప్రభుత్వాస్పత్రులను కూడా నాడు–నేడు కింద సీఎం వైఎస్ జగన్ ఆధునీకరిస్తున్నారు. వీటిల్లో 40,180 ఉద్యోగాలను భర్తీచేసి.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలుచేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గానికి ఓ వైద్య కళాశాల ఏర్పాటుచేయాలనే లక్ష్యంలో భాగంగా కొత్తగా 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయం.. విత్తు నుంచి విక్రయం వరకూ రైతులకు తోడునీడగా నిలవడం ద్వారా వ్యవసాయాన్ని పండగగా మార్చేందుకు సీఎం వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. వైఎస్సార్ రైతుభరోసా ద్వారా ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సహాయం అందిస్తున్నారు. ఉచితంగా పంటల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా తక్కువ ధరలకే నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందిస్తున్నారు. వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు సలహాలు అందిస్తూ.. అధిక దిగుబడులు సాధించడానికి బాటలు వేస్తున్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలవల్ల పంటలు నష్టపోతే అదే సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ అందించి రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. పంటల బీమా కింద రైతులకు పరిహారం అందిస్తూ పంట పండినా.. ఎండినా.. తడిసినా రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టారు. సామాజిక న్యాయం–సాధికారత.. పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు భాగస్వామ్యం కల్పించి సామాజిక న్యాయం చేయడం ద్వారా ఆ వర్గాలు సాధికారత సాధించడానికి సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు. తొలిసారి ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో 56 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చారు. ఆ తర్వాత పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏకంగా 70 శాతం పదవులు ఆ వర్గాలకే ఇచ్చి, సామాజిక మహావిప్లవాన్ని ఆవిష్కరించారు. అలాగే, దేశ చరిత్రలో ఎక్కడాలేని రీతిలో నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలకు రిజర్వు చేసేలా చట్టం తెచ్చి మరీ అమలుచేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన వ్యక్తికే అవకాశమిచ్చారు. శాసనమండలి చైర్మన్‌గా తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తికి.. డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ మహిళకు ఇచ్చారు. మరోవైపు.. ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవుల్లోనూ ఆ వర్గాలకే పెద్దపీట వేశారు. స్థానిక సంస్థల్లోనూ ఆ వర్గాలకే సింహభాగం అవకాశమిచ్చి.. సామాజిక న్యాయం, సాధికారతలో వైఎస్ జగన్ దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచారు. మహిళా సాధికారత–రక్షణ.. మహిళా సాధికారతతో కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని.. తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ విశ్వాసం. అందుకే మహిళలు ఆర్థిక సాధికారత సాధించడానికి వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, సున్నావడ్డీ ద్వారా ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారు. తొలి కేబినెట్లో ముగ్గురు మహిళలకు అవకాశం కల్పిస్తే.. పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో నలుగురికి అవకాశమిచ్చారు. దేశ చరిత్రలో తొలిసారిగా హోంశాఖ మంత్రిగా ఎస్సీ మహిళకు అవకాశం కల్పించారు. ఇక 30.56 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను, ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలను మహిళల పేర్లతోనే ఇచ్చారు. పారిశ్రామికాభివృద్ధి–ఉద్యోగాల కల్పన.. పారిశ్రామికరంగ ప్రోత్సాహకానికి సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలతో మిట్టల్, బిర్లా, అదానీ, సంఘ్వీ, భజాంకా, బంగర్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమలకు కావాల్సిన మౌలిక వసతులు, పర్యావరణ హిత గ్రీన్ఎనర్జీని పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో వారు రాష్ట్రం వైపు అడుగులు వేస్తున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కోవిడ్ సమయంలో రిస్టార్ట్ ప్యాకేజీ ద్వారా పరిశ్రమలను ఆదుకోవడంతో ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు భరోసా కలిగింది. గత ప్రభుత్వం బకాయిపెట్టిన రూ.1,588 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహక బకాయిలతో కలిపి రూ.2,086 కోట్లు వరుసగా రెండేళ్లు చెల్లించడమే కాకుండా ఈ ఏడాది కూడా ఆగస్టులో చెల్లించనున్నట్లు సర్కారు ముందుగానే ప్రకటించింది. దీంతో.. పారిశ్రామికవేత్తల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన సులభతర వాణిజ్య (ఈఓడీబీ) ర్యాంకుల్లో ఏపీ వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. గడిచిన మూడేళ్ల కాలంలో 28,343 యూనిట్లు ఉత్పత్తి ప్రాంరంభించడం ద్వారా 2,48,122 మందికి ఉపాధి లభించింది. ప్రస్తుతం రూ.1,51,372 కోట్ల విలువైన 64 యూనిట్లకు సంబంధించిన నిర్మాణ పనులు వివిధ దశలో ఉండగా, మరో రూ.2,19,766 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దావోస్ పర్యటనలో రూ.126 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు జరగడమే కాకుండా త్వరలో విశాఖ వేదికగా భారీ పెట్టుబడుల సదస్సుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ఉద్యోగాల విప్లవాన్ని తీసుకొచ్చింది. చరిత్ర మెచ్చేలా మూడేళ్ల కాలంలోనే రికార్డు స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 6,03,756 ఉద్యోగాలను భర్తీచేసి నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చింది. ఇందులో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఒకేసారి 1,21,518 మందికి ప్రభుత్వ కొలువులిచ్చి సొంత ఊరిలో ప్రజలకు సేవచేసే భాగ్యం కల్పించింది. నవరత్నాలు–డీబీటీ.. పేదరికం నుంచి ప్రజలను గట్టెక్కించడానికి నవరత్నాల కింద డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా మూడేళ్లలో రూ.1,41,247.94 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ జమచేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.43,682.65 కోట్లను పేదల కోసం ఖర్చుచేశారు. దుష్టచుతుష్టంపై సమరభేరి ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ అత్యంత పారదర్శకంగా.. సుపరిపాలన అందిస్తుండటంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 2019 ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాలు సాధించడం.. తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో 2019 ఎన్నికల కంటే అధిక మెజార్టీ వైఎస్సార్సీపీకి రావడమే అందుకు తార్కాణం. ఇది చూసి ఓర్వలేని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 మూకుమ్మడిగా అవాస్తవాలను ప్రచారంచేస్తూ ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయి. ఈ దుష్టచతుష్టయంపై యుద్ధంచేసి.. దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ ప్లీనరీ వేదికగా పిలుపునివ్వనున్నారు. -
YSRCP Plenary 2022: ప్లీనరీ పండుగకు ముస్తాబు
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీని వైఎస్సార్సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ ఆవిర్భవించాక 2011 జూలై 8, 9వ తేదీల్లో తొలి ప్లీనరీ జరగగా 2017 జూలై 8, 9వ తేదీల్లో రెండో ప్లీనరీని నిర్వహించారు. అంతకంటే మిన్నగా ఈ దఫా మూడో ప్లీనరీని జూలై 8, 9వ తేదీల్లో నిర్వహించేలా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇతర పార్టీలకు భిన్నంగా ప్రజాభ్యుదయమే అజెండాగా ప్లీనరీలు నిర్వహించడం వైఎస్సార్సీపీ విధానం. ఈ మేరకు ప్లీనరీల్లో తీసుకున్న నిర్ణయాలను, హామీలను అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 95 శాతం అమలు చేశారు. రానున్న రెండేళ్లలో ప్రజలకు మరింత సేవ చేయడం, బాసటగా నిలిచి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే అజెండాగా మూడో ప్లీనరీని వైఎస్సార్సీపీ నిర్వహిస్తోంది. ప్రజాభ్యుదయమే లక్ష్యంగా.. ప్లీనరీకి విస్తృత స్థాయిలో ఆహ్వానాలు పంపుతున్నారు. గ్రామ, వార్డు సభ్యుల నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారి వరకూ పేరుపేరునా ప్లీనరీకి ఆహ్వానిస్తూ సీఎం జగన్ లేఖలు రాశారు. వాటిని నాయకులకు అందచేసి ప్లీనరీకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ఆహ్వానిస్తున్నారు. తొలిరోజు ప్లీనరీకి పార్టీ నాయకులు హాజరుకానున్నారు. రెండో రోజు మరింత విస్తృత స్థాయిలో పార్టీ శ్రేణులు పాల్గొంటాయి. వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ ప్రారంభ ఉపన్యాసంతో ఆరంభమయ్యే ప్లీనరీ ఆయన ముగింపు ప్రసంగంతో ముగుస్తుంది. ప్రజాభ్యుదయమే లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. భారీ వేదిక.. భోజన శాలలు రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే విజయవాడ–గుంటూరు రహదారి పక్కనే నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానంలో మూడో ప్లీనరీని వైఎస్సార్సీపీ నిర్వహిస్తోంది. జాతీయ రహదారి నుంచి స్పష్టంగా కనిపించేలా 100 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు, 6.5 అడుగుల ఎత్తుతో భారీ వేదిక నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారీ వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా 40 ఎకరాల విస్తీర్ణంలో భారీ టెంట్ నిర్మాణ పనులు ఇప్పటికే కొలిక్కి వచ్చాయి. ప్లీనరీకి హాజరయ్యే శ్రేణులకు వేడివేడిగా టిఫిన్లు, టీ, కాఫీలు, భోజనాల తయారీకి రెండు భారీ వంటశాలలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒక వంటశాల పనులు కొలిక్కిరాగా రెండో వంటశాల పనులను సోమవారం ప్రారంభించనున్నారు. అక్కడకు సమీపంలోనే భారీ భోజన శాలలు సిద్ధమవుతున్నాయి. ప్లీనరీకి విస్తృత స్థాయిలో శ్రేణులు హాజరుకానున్న నేపథ్యంలో భారీ ఎత్తున వాహనాలు రానున్నాయి. ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గుంటూరు–విజయవాడ ప్రధాన రహదారితో అనుసంధానిస్తూ ప్లీనరీకి రోడ్లు నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమాలను సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. -
ఉత్సాహంగా వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీలు
శ్రీకాకుళం రూరల్/సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం, కోనసీమ, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల ప్లీనరీ ఆదివారం ఉత్సాహకర వాతావరణంలో నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన ప్లీనరీలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించనున్న రాష్ట్ర ప్లీనరీని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, పార్టీ నేతలు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా ప్లీనరీ రామచంద్రపురంలో, తూర్పుగోదావరి జిల్లా ప్లీనరీ కొవ్వూరులో ఆయా జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు పొన్నాడ వెంకటసతీష్‌కుమార్, జక్కంపూడి రాజాల అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్లమెంటు సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్లీనరీ.. చరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతుందని వారు చెప్పారు. ఇప్పుడు అమలు చేస్తున్న వాటికంటే మెరుగైన అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, పినిపే విశ్వరూప్, ఎంపీలు మార్గాని భరత్‌రామ్, చింతా అనురాధ, జెడ్పీ చైర్మన్లు విప్పర్తి వేణుగోపాలరావు, కవురు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ప్లీనరీలో ముఖ్య అతిథిగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. చంద్రబాబు ఎన్ని జన్మలెత్తినా ఇక ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదని ఎద్దేవా చేశారు. రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ హెనీక్రిస్టినా, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్యవరప్రసాద్, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరిధర్, కిలారి రోశయ్య, అన్నాబత్తుని శివకుమార్, ఉండవల్లి శ్రీదేవి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు, మిర్చియార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం పాల్గొన్నారు. -
పండుగలా వైఎస్సార్, కృష్ణా జిల్లాల ప్లీనరీలు
కడప కార్పొరేషన్/సాక్షి, మచిలీపట్నం: వైఎస్సార్ జిల్లా, కృష్ణా జిల్లా ప్లీనరీలు శనివారం పండుగలా జరిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు, పార్టీ నేతలు తరలివచ్చారు. వైఎస్సార్ జిల్లా కడపలోని మునిసిపల్ మైదానంలో జరిగిన ప్లీనరీకి జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, రమేష్ యాదవ్‌లు హాజరయ్యారు. ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఈనాడు, ఏబీఎన్ చానళ్లు, వారి పత్రికలను తాము వెలి వేశామని.. ఆ మీడియాకు చెందినవారు తమ సమావేశాలకు వచ్చి కవరేజ్ చేయాల్సిన అవసరం లేదని వారు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు తీర్మానం చేశారు. అలాగే మచిలీపట్నం సమీపంలోని సుమ కన్వెన్షన్ హాల్లో జరిగిన కృష్ణా జిల్లా ప్లీనరీకి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పేర్ని నాని అధ్యక్షత వహించారు. వైఎస్సార్ జిల్లా ప్లీనరీలో మాట్లాడుతున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి రోజా, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్, జిల్లా ప్లీనరీ పరిశీలకుడు గౌతంరెడ్డి, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు కొడాలి నాని, పార్థసారథి, అనిల్‌కుమార్, సింహాద్రి రమేష్, జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, నియోజకవర్గ ప్లీనరీ పరిశీలకుడు వీరన్న తదితరులతో పాటు జిల్లా నలుమూలల నుంచి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంను చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వైఎస్సార్సీపీ నేతలు చెప్పారు. చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియాపై వారు నిప్పులు చెరిగారు. -
ఘనంగా జిల్లాల్లో వైఎస్సార్సీపీ ప్లీనరీలు
నంద్యాల/సాక్షి విశాఖపట్నం/సాక్షి చిత్తూరు/పార్వతీపురం టౌన్: నంద్యాల, చిత్తూరు జిల్లా పలమనేరు, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో గురువారం వైఎస్సార్సీపీ ప్లీనరీలు ఘనంగా జరిగాయి. నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశం నంద్యాలలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, ప్లీనరీ పరిశీలకుడు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల బిజేంద్రారెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, తొగూరు ఆర్థర్, శిల్పా చక్రపాణిరెడ్డిలు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో కూడా అదే ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నం గురజాడ కళాక్షేత్రంలో జరిగిన జిల్లా ప్లీనరీలో వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజని హాజరయ్యారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని తొలి తీర్మానం ప్రవేశపెట్టారు. అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ప్లీనరీ సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రానున్న ఎన్నికల్లో కుప్పం నుంచి భరత్ పోటీ చేస్తారని, ఆ స్థానాన్ని గెలిచి తీరతామని ఆయన స్పష్టం చేశారు. కుప్పం అభ్యర్థి విషయంలో తమిళ నటుడితో మంతనాలంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్, పరిశీలకుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు వెంకటే గౌడ, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, ఆరణి శ్రీనివాసులు, ఎంఎస్ బాబు, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురంలో మన్యం జిల్లా పార్టీ అధ్యక్షురాలు పాముల పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో జరిగిన పార్టీ జిల్లాస్థాయి ప్లీనరీలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు డిప్యూటీ సీఎం రాజన్నదొర, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, ఇ.రఘురాజు, ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు. -
పండుగలా వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీలు
సాక్షి, అనకాపల్లి/సాక్షి ప్రతినిధి ఒంగోలు/సాక్షి రాయచోటి: వైఎస్సార్సీపీ జిల్లా స్థాయి ప్లీనరీలు బుధవారం అనకాపల్లి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తల ఉత్సాహం నడుమ పండుగ వాతావరణంలో ప్లీనరీలు జరిగాయి. వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో పెందుర్తిలో నిర్వహించిన ప్లీనరీలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి విశాఖ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, ప్లీనరీ పరిశీలకుడు చొక్కాకుల వెంకట్రావ్, పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలు పేర్నమిట్టలో నిర్వహించిన ప్లీనరీకి టీటీడీ బోర్డు సభ్యుడు, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్ అధ్యక్షత వహించగా.. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ ప్లీనరీ పరిశీలకుడు తూమాటి మాధవరావు, ఎమ్మెల్యేలు కేపీ నాగార్జునరెడ్డి, అన్నా వెంకటరాంబాబు, మద్దిశెట్టి వేణుగోపాల్, టీజేఆర్ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో నిర్వహించిన ప్లీనరీలో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నవాజ్‌బాషా, ప్లీనరీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియాఖానమ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిష్టాత్మకంగా ప్లీనరీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ మూడో ప్లీనరీ సమావేశాలను ఆ పార్టీ నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విజయవాడ–గుంటూరు మధ్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాలమైన మైదానంలో ప్లీనరీ నిర్వహించడానికి ఏర్పాట్లు వేగవంతం చేశారు. 2017 జూలై 8, 9వ తేదీల్లో రెండవ ప్లీనరీని ఇక్కడే నిర్వహించిన విషయం తెలిసిందే. బుధవారం ప్లీనరీ ఏర్పాట్లను వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డిలు పరిశీలించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, ముస్తఫా తదితరులు వారి వెంట ఉన్నారు. సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం.. ఏర్పాట్లను వి.విజయసాయిరెడ్డి, సజ్జల తదితరులకు వివరించారు. ప్లీనరీకి విస్తృత స్థాయిలో పార్టీ శ్రేణులు హాజరు కానున్న నేపథ్యంలో ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని వారు తలశిల రఘురాం, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలకు సూచించారు. అనంతరం ప్లీనరీ ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు. ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులకు ప్లీనరీ ఏర్పాట్లను వివరిస్తున్న సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ ముఖ్యమైన అంశాలపై ప్లీనరీ ఆమోదం కోరతాం వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలను ఇదే మైదానంలో నిర్వహించాం. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో 151 స్థానాలను చేజిక్కించుకుని, అఖండ విజయంతో అధికారంలోకి వచ్చింది. ఐదేళ్ల తర్వాత ప్రస్తుతం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8, 9న ప్లీనరీ నిర్వహిస్తున్నాం. మళ్లీ ఐదేళ్ల తర్వాత 2027లో కూడా అధికారంలో ఉండే పార్టీగా ప్లీనరీ సమావేశాలను ఘనంగా నిర్వహించుకుంటాం. పార్టీ నాయకులంతా ఏకతాటిపై నడిచి విజయం సాధించడమే మా సిద్ధాంతం. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ ప్లీనరీ సమావేశాలు మంగళవారంతో పూర్తి చేసుకున్నాం. బుధ, గురు, శుక్రవారాల్లో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు మిగతా పార్టీల ప్లీనరీ సమావేశాలకు భిన్నంగా ఉంటాయి. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా ఉన్న కార్యకర్తల నుంచి నామినేటెడ్ పదవులు పొందిన నేతలు, ప్రజా ప్రతినిధులు అందరూ ఈ సమావేశాలకు హాజరవుతారు. మొదటి రోజు పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభ ఉపన్యాసంతో ప్లీనరీ ప్రారంభమై రెండవ రోజు చివర ఆయన ఉపన్యాసంతోనే ముగుస్తుంది. ప్లీనరీలో వివిధ అంశాలపై చర్చించి ముఖ్యమైన అంశాలపై తీర్మానాలు చేస్తాం. పార్టీ నియమావళిలో కొన్ని సవరణలు ప్రతిపాదించి, వాటికి ప్లీనరీ ఆమోదం కోరుతాం. ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్న నాయకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సమన్వయంతో సమష్టిగా పని చేసి ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేస్తాం. ‘కిక్ బాబు.. గెట్ ద పవర్.. సర్వ్ ది పీపుల్’అనే నినాదంతో 2024లో జరిగే ఎన్నికలకు వెళతాం. 175 సీట్లకు 175 సీట్లు కైవసం చేసుకుంటాం. – వి.విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత భవిష్యత్ చిత్రపటాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ఐదేళ్ల క్రితం ఇదే మైదానంలో వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు చారిత్రకంగా, విభిన్న రీతిలో జరిగాయి. నవరత్నాల పేరుతో పార్టీ అజెండాను పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్ విడుదల చేశారు. నవరత్నాలే.. మాకు వేద మంత్రాలయ్యాయి. వాటినే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. దేశ చరిత్రలో అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే మేనిఫెస్టోలో పెట్టిన హామీలలో 95 శాతం అమలు చేసిన ఘనత వైఎస్సార్సీపీకి, సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుంది. ఆచరణలో కూడా ఇంతటి నిబద్ధత కలిగిన నాయకుడితో ప్రయాణం చేస్తున్నందుకు పార్టీ శ్రేణుల నుంచి నాయకుల వరకు అందరం గర్వపడుతున్నాం. ఇదే ప్రాంగణంలో మరోసారి ప్లీనరీ నిర్వహించడం సంతోషకరం. మరింత మెరుగైన రీతిలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు వారి భవిష్యత్ చిత్రపటాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ప్లీనరీ సమావేశాల్లో చేస్తాం. రాష్ట్ర భవిష్యత్, చరిత్ర ఇకముందు వైఎస్సార్సీపీతో ముడిపడి ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించి మరోసారి అధికారంలోకి రాబోతున్నాం. పేదలు, ప్రజల ఆకాంక్షలను వైఎస్సార్సీపీ నెరవేరుస్తోంది. కోట్లాది మంది ప్రజలు సీఎం వైఎస్ జగన్‌ను తమ హృదయాల్లో పెట్టుకున్నారు కాబట్టే వైఎస్సార్సీపీ ప్రయాణం, ప్రస్థానం ఇలా నడుస్తూనే ఉంటుంది. ఇది కేవలం పార్టీ ప్లీనరీ కాదు. ప్రజల అజెండాపై చర్చించి నిర్ణయాలు తీసుకునే వేదిక. అధికారంలోకి వచ్చాక జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగిస్తోంది. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై 80 నుంచి 90 శాతం పైగా వైఎస్సార్సీపీ గుర్తు ఉండిపోయింది. ఇంత ఘనత కలిగిన పార్టీ కాబట్టే జూలై 8, 9న జరిగే ప్లీనరీకి వార్డు స్థాయిలో పోటీ చేసిన వారి నుంచి.. అందరినీ తన సంతకంతో కూడిన లేఖ ద్వారా పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆహ్వానించడం చరిత్రాత్మకం. ఒకవేళ ఎవరికైనా ఆహ్వానం అందకపోతే.. స్థానిక నాయకులు చొరవ తీసుకుని ఆహ్వానాలు ఇవ్వడంతో పాటు కార్యకర్తలంతా ఈ ప్లీనరీకి హాజరయ్యేలా చూడాలి. – సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) -
తిరుపతిలో ఘనంగా జిల్లా ప్లీనరీ
తిరుపతి రూరల్: తిరుమల శ్రీ వేంకటేశ్వరుని పాదల చెంత వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీ మంగళవారం ఘనంగా జరిగింది. వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఎస్వీ యూనివర్శిటీ స్టేడియంలో ఈ ప్లీనరీ నిర్వహించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి 15 వేల మందికి పైగా కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లి, జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలే రానున్న ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు 80 వేలకు పైగా మెజార్టీని అందిస్తాయని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, సంజీవయ్య, వరప్రసాదరావు, బియ్యపు మధుసూదనరెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. ఘనంగా అనంత, సత్యసాయి జిల్లా ప్లీనరీలు అనంతపురం: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వైఎస్సార్సీపీ ప్లీనరీలు ఘనంగా జరిగాయి. మంగళవారం అనంతపురం జిల్లాస్థాయి ప్లీనరీ అనంతపురంలోని శిల్పారామం, శ్రీ సత్యసాయి జిల్లా స్థాయి ప్లీనరీ పుట్టపర్తిలోని ప్రశాంతిగ్రాంలో నిర్వహించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా స్థాయి ప్లీనరీలకు పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచిందని ఆయన అన్నారు. మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, శాసన మండలి విప్ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, వై.వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ప్లీనరీల ఇన్చార్జి ఎస్వీ మోహన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. శ్రీసత్యసాయి జిల్లా స్థాయి ప్లీనరీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు డాక్టర్ తిప్పేస్వామి, పీవీ సిద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలందరికీ మేలు చేస్తున్న ప్రభుత్వం ఇది
సాక్షి, అమరావతి: కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నా ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను విస్మరించకుండా సీఎం జగన్ కొనసాగిస్తున్నారని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసనసభ్యులు, సమన్వయకర్తలు, జిల్లాస్థాయి ప్లీనరీ అబ్జర్వర్లు, నియోజకవర్గస్థాయి ప్లీనరీ అబ్జర్వర్లతో మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతోపాటు మేనిఫెస్టోలో చెప్పనివి కూడా ఎన్నో చేశారని తెలిపారు. అయినా దీన్ని మనం చంద్రబాబులా ప్రచారం చేసుకోవడం లేదన్నారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజు నుంచే ప్రజల్లో సీఎం జగన్ నాయకత్వం పట్ల నమ్మకం, విశ్వాసం రెట్టింపయ్యాయని తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్లీనరీ సమావేశాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని చెప్పారు. మరోపక్క జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలకు అందరూ నూతనోత్సాహంతో సమాయత్తమవుతున్న వాతావరణం సర్వత్రా నెలకొని ఉందన్నారు. వచ్చే నెలలో రాష్ట్రస్థాయి ప్లీనరీ జూలై 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్న విషయాన్ని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రస్థాయి ప్లీనరీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు, నామినేటెడ్ పదవులు పొందిన వారు, పార్టీ గ్రామ, మండల, నగర, రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాలలో పని చేస్తున్న నాయకులందరినీ వ్యక్తిగతంగా ఆహ్వానించాలన్నది సీఎం జగన్ ఆలోచన, ఆదేశం అని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న వివిధ కమిటీల నాయకుల పేర్లు, నామినేటెడ్ పదవులు పొందిన వారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల జాబితాలను స్థానిక బాధ్యులకు పంపించడం జరిగిందన్నారు. ఆ జాబితాను పరిశీలించి, ఎవరైనా మృతి చెందిన లేదా పార్టీ నుంచి సస్పెండ్ అయినా లేక పార్టీ మారినా వారి పేర్లు తొలగించి, మార్పులు చేర్పులతో కూడిన జాబితాను వెంటనే వాట్సాప్ నంబర్ (93929–18001)కు గాని, మెయిల్ ద్వారా కానీ పంపాలని ఆయన చెప్పారు. ప్రతి ఊరిలో రెండు అన్న క్యాంటీన్లు పెట్టి చేసిన పాపాలకు చంద్రబాబు ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. హుద్‌హుద్ తుపాను తర్వాత ఒడిశాకు 10 వేల కరెంటు స్తంభాలు, వెయ్యి ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు పంపిస్తున్నట్టు బాబు జాతీయ నాయకుడి రేంజిలో చెప్పుకున్నారన్నారు. అవి తమకు అందనే లేదని ఒడిశా ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. దొంగ బిల్లులు రాసి పంచుకున్న దాంట్లో గంజాయి పాత్రుడే కింగ్‌పిన్ అని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. -
వైఎస్సార్సీపీ ప్లీనరీకి చకచకా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ మూడో ప్లీనరీకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారికి పక్కనే నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానంలో ప్లీనరీ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీని వైఎస్సార్సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2011 జూలై 8న ఇడుపులపాయలో జరిగిన మొదటి ప్లీనరీ, 2017 జూలై 8, 9న నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించిన రెండో ప్లీనరీకంటే మూడో ప్లీనరీని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీకీ ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహదారికి పశ్చిమాన, తూర్పునకు అభిముఖంగా 100 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు, 6.5 అడుగుల ఎత్తుతో భారీ వేదిక నిర్మిస్తున్నారు. వేదికపై కూర్చున్నవారు, ప్రసంగించే వారు జాతీయ రహదారిపై నిలబడిన వారికి కూడా కనబడేలా నిర్మాణం జరుగుతోంది. వేదికకు ఎదురుగా లక్షలాది మంది కూర్చొనేందుకు అనువైన ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసినా ఒక్కరూ తడవకుండా భారీ టెంట్ ఏర్పాటు చేస్తున్నారు. ప్లీనరీకి వేలాది వాహనాల్లో శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లీనరీ జరిగే రెండు రోజులూ ముఖ్యమంత్రి అధికారిక విధులు నిర్వర్తించడానికి వేదిక వెనుకవైపు తాత్కాలిక కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. సంప్రదాయ వంటకాలతో విందు ప్లీనరీకి హాజరయ్యే లక్షలాది పార్టీ నేతలు, కార్యకర్తలకు రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర సంప్రదాయ వంటకాలతో జూలై 8, 9న టిఫిన్, విందు ఇవ్వనున్నారు. ఇందుకోసం భారీ వంటశాలలు ఏర్పాటు చేస్తున్నారు. వంటల బాధ్యతను దేశంలోనే ప్రసిద్ధి చెందిన కృష్ణా జిల్లాఇందుపల్లి వాసులకు అప్పగించారు. దీనికి సమీపంలోనే విశాలమైన భోజనశాలలు నిర్మిస్తున్నారు. ఇక్కడ వేడి వేడిగా ఫలహారాలు, కాఫీలు, భోజనాలు వడ్డిస్తారు. ప్లీనరీ ఏర్పాట్లను సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జూలై 7 నాటికి ప్లీనరీ ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తామని రఘురాం చెప్పారు. -
మీరు అధికారంలో ఉంటే బీసీలకు జడ్పీ చైర్మన్ వచ్చుండేదా?: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: పనికిమాలిన 420లు అంతా అమ్మఒడి పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్పొరేట్స్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్‌ను తీర్చిదిద్దుతున్నారు. పాఠశాలల అభివృద్ధికి మూడేళ్లలోనే రూ.20 వేల కోట్లు ఖర్చు చేసిన సీఎం దేశంలో ఎవరైనా ఉన్నారా? అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. మంగళవారం కృష్ణా జిల్లా గుడివాడలో ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో కొడాలి నాని మాట్లాడుతూ.. స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్స్ నిర్వహణకోసం రూ.2 వేలు తీసుకుంటున్నాం. 75% హాజరు ఉన్న ప్రతి విద్యార్ధికి అమ్మ ఒడి అందించాం. చంద్రబాబుకి సిగ్గూ శరం లేదు. చంద్రబాబు నీ జీవితంలో రూ.18 లక్షలైనా ఖర్చు చేశావా. రామోజీరావు, బీఆర్ నాయుడు, దత్తపుత్రుడికి కళ్లు కనిపించడం లేదా?. చంద్రబాబు 14 ఏళ్లలో ఏడాదికి ఒకటి మెడికల్ కాలేజీ చొప్పున కట్టినా జిల్లాకొకటి ఉండేది. జగన్ సీఎం అయిన తర్వాత 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రూ.20 వేల కోట్లు పిల్లలకు ఖర్చు చేస్తుంటే.. దీన్నే మంటారు మీ పిండాకూడా అంటూ మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మంచి చేస్తుంటే ఈ 420లు అంతా కలిసి వెనుక గోతులు తవ్వుతున్నారు. సామాజిక న్యాయం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు స్థానం కల్పించారు. తెలుగుదేశం అధికారంలో ఉంటే బీసీలకు జడ్పీ చైర్ పర్సన్ వచ్చుండేదా. టీడీపీ ఏనాడూ సీఎం జగన్ ప్రభుత్వం మాదిరి సంక్షేమాన్ని అందించలేదు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చదవండి: (YSRCP Plenary 2022: కొడాలి ఒక బ్రాండ్.. దెబ్బకు బాబుకు నిద్ర పట్టడం లేదు) చంద్రబాబును కుప్పంలోనూ ఓడించి తీరుతాం ఎన్టీఆర్ వారసుడిగా జగన్ బీసీ, వెనుకబడిన వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చాడు. ఇచ్చామంటే ఇచ్చాం అని కాకుండా కీలక శాఖలను వెనుకబడిన వర్గాలకు ఇచ్చారు. జగన్‌ను ఎదిరించలేక టీడీపీ మీడియా డిబేట్లు పెడుతుంది . డిబేట్లు పెట్టేవాడు.. మాట్లాడేవాడు హైదరాబాద్‌లోనే ఉంటారు. దమ్ముంటే టీడీపీ ఆత్మకూరులో ఎందుకు పోటీ చేయలేదు?. చంద్రబాబు చవట దద్దమ్మ. మమ్మల్ని చంద్రబాబు ఓడిస్తాడట. 2019లో నీ దత్త పుత్రుడిని రెండు చోట్ల తుక్కు తుక్కుగా ఓడించాం. నీ సొంత కుమారుడిని మంగళగిరిలో ఓడించాం. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలోనూ ఓడించి తీరుతాం. 2024లో నేను మళ్ళీ గెలుస్తాను అని కొడాలి నాని అన్నారు. ఆ పార్టీని కూకటి వేళ్లతో పీకి పడేస్తా ఎన్టీఆర్ మా ఆస్తి.. మాకోసం పార్టీ పెట్టిన దేవుడు ఎన్టీఆర్. నువ్వెవడివిరా.. చంద్రబాబు. అన్నగారికి వెన్నుపోటు పొడిచి.. పార్టీలాక్కున్న నీచుడు, 420 చంద్రబాబు. చంద్రబాబును, ఆ పార్టీని కూకటి వేళ్లతో పీకి పడేస్తా. చంద్రబాబు, రామోజీరావు, బీఆర్ నాయుడు, రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. వైఎస్సార్ బ్రతికి ఉంటే ఈ రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడేవాడు. వైఎస్ వారసుడిగా మనకు మంచి చేస్తున్న జగన్ మోహన్ రెడ్డికి మనం అండగా నిలవాలి. చావైనా.. బ్రతుకైనా జగన్ వెంటే ఉంటానని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. -
15 వేల మందితో నేడే వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా ప్లీనరీ
తిరుపతి తుడా: వైఎస్సార్సీపీ తిరుపతి ప్లీనరీ నిర్వహణకు ప్రత్యేక కమిటీలను నియమించామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు. ఈ ప్లీనరీకి 15 వేల మంది వస్తున్నట్టు తెలిపారు. వర్షం పడినా ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉండేందుకు జర్మన్ షెడ్లను నిర్మించామన్నారు. తిరుపతి నగరం ఎస్వీయూ స్టేడియంలో మంగళవారం జరగనున్న ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లను సోమవారం ఆయన పర్యవేక్షించారు. అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు, సూచనల మేరకు జిల్లా ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. 26 జిల్లాల్లో తొలి జిల్లా సమావేశం తిరుపతిలోనే నిర్వహిస్తున్నందున భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, చైర్మన్లు, పార్టీ నియోజకవర్గ, మండల ఇన్‌చార్జ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొంటున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఘుమఘుమలాడే వంటకాలను సభా వేదిక వద్ద సిద్ధం చేసినట్టు తెలిపారు. ప్లీనరీకి వచ్చే ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలకు స్వాగతం పలికేందుకు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా మామిడి తోరణాలు, అరటి గెలలు, పూల అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెవిరెడ్డి వివరించారు. -
ప్లీనరీ ఏర్పాట్లపై వైఎస్సార్సీపీ ముమ్మర కసరత్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక తొలిసారిగా జూలై 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ప్లీనరీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్లీనరీని అత్యంత ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం మేరకు.. ప్లీనరీ నిర్వహణకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు.. బొత్స, పెద్దిరెడ్డి, టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గురువారం పలు స్థలాలను పరిశీలించారు. గుంటూరు–విజయవాడ ప్రధాన రహదారికి సమీపంలోని నాగార్జున వర్సిటీ పరిసర ప్రాంతాల్లో సువిశాలమైన రెండు ప్రదేశాలను ఎంపిక చేశారు. వాటి గురించి సీఎం వైఎస్ జగన్‌కు తెలిపి.. ఆయన ఆదేశాల మేరకు ప్లీనరీ నిర్వహించే ప్రదేశాన్ని ఖరారు చేయనున్నారు. ఎన్నికలకు సమాయత్తం చేసే దిశగా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతాన్ని సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ దేశంలో ఎక్కడా లేని రీతిలో మూడేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా రూ.1.41 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకే తీసుకెళ్లారు. నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలను సమూలంగా మార్చేశారు. ఈ అంశాలను ప్రజలకు వివరించడానికి గత నెల నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. తమ ఇళ్ల వద్దకు వస్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ.. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ప్లీనరీని వేదికగా చేసుకోవాలని సీఎం నిర్ణయించారు. 2024 ఎన్నికల్లో మరోసారి అఖండ విజయం సాధించడమే లక్ష్యంగా సమర శంఖం పూరించనున్నారు. వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2017 జూలై 8, 9న నాగార్జున వర్సిటీకి ఎదురుగా ఉన్న సువిశాలమైన మైదానంలో ప్లీనరీని నిర్వహించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేశారు. అదే ఏడాది నవంబర్ 6న ఇడుపులపాయలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ప్రార్థనలు చేసి నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ‘ప్రజాసంకల్ప యాత్ర’ పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. అశేష ప్రజాదరణ మధ్య 341 రోజులపాటు 3,648 కి.మీ. చేసిన పాదయాత్రను 2019 జనవరి 9న ఇచ్ఛాపురం వద్ద ముగించారు. -
జూలై 8, 9న వైఎస్సార్సీపీ ప్లీనరీ
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని జూలై 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు వైఎస్సార్సీపీ ప్లీనరీని నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహించే పార్టీ ప్లీనరీని గుంటూరు – విజయవాడ రహదారిపై నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో విశాలమైన ప్రాంగణంలో నిర్వహించనున్నారు. 2017 జూలై 8, 9న జరిపిన ప్రదేశంలోనే ఇప్పుడు కూడా ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతిష్టాత్మకంగా ప్లీనరీ : విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన బుధవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. జూలై 8వ తేదీన ప్రారంభమై 9వ తేదీ సాయంత్రం వరకు ప్లీనరీ జరుగుతుందన్నారు. పార్టీ నేతలందరూ ప్లీనరీకి సమాయత్తం కావాలని కోరారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అతిథులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్లీనరీ నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అందరూ సమష్టిగా పనిచేయాలనేది సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష అని చెప్పారు. ఐకమత్యానికి పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని, వర్గాలను ప్రోత్సహించే పరిస్థితి ఉండదని స్పష్టంచేశారు. దీనిని గుర్తించి నేతలందరూ ఐకమత్యంతో ముందుకు నడవాలని చెప్పారు. పార్టీ కమిటీలకు పేర్లు సూచించండి పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కమిటీలకు పేర్లు సూచించాలని చెప్పారు. పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా అంకితభావంతో పనిచేసే వారికి స్ధానం లభిస్తుందని అన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాతినిధ్యం ఉంటుందని తెలిపారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పార్టీ శాసన సభ్యులు, నియోజకవర్గాల ఇన్చార్జిలు పార్టీ పటిష్టత కోసం పాటు పడే వారిని సూచించాలనేది సీఎం జగన్ ఆకాంక్ష అని వివరించారు. ఈ పేర్లను జూన్ పదో తేదీ నాటికి జిల్లా అధ్యక్షుల ద్వారా పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలన్నారు. జిల్లా అధ్యక్షులు కూడా పార్టీ కమిటీలపై ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలను సమావేశపరిచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవాలని తెలిపారు. అనంతరం కమిటీల నిర్మాణం చూడాలన్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు కూడా వారి పరిధిలోని జిల్లా అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. నూతన కమిటీలను ప్లీనరీలో ప్రకటిస్తారని వివరించారు. సచివాలయాల సందర్శన కార్యక్రమం అనంతరం బూత్ కమిటీలకు కూడా పేర్లను పంపాలని కోరారు. జగన్ పాలన పట్ల ప్రజల్లో అచంచల విశ్వాసం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అద్భుతమైన ప్రజా స్పందన లభిస్తోందని తెలిపారు. సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారనే విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అర్థమెందన్నారు. సీఎం జగన్ నాయకత్వం పట్ల ప్రజలు అచంచలమైన విశ్వాసంతో ఉన్నారనేది కూడా స్పష్టమైందన్నారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యిందని తెలిపారు. ప్రజల్లో సీఎం జగన్, వైఎస్సార్సీపీకి ఉన్న ఆదరణను ఈ బస్సు యాత్ర కళ్లకు కట్టిందని తెలిపారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌కు పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. -
మేకపాటి ఆత్మీయ పరిచయం
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ ఆత్మకూరు నియోజకవర్గ నేతగా మేకపాటి విక్రమ్‌రెడ్డి శనివారం నుంచి ఆత్మీయ పరిచయ కార్యక్రమం చేపట్టనున్నారు. 14 రోజుల పాటు నియోజకవర్గంలో మండలాల వారీగా విస్తృతంగా పర్యటించి ప్రజలతో పాటు పార్టీ నేతలతో మమేకం కానున్నారు. తొలుత మేకపాటి సొంత మండలం మర్రిపాడు నుంచే ఈ పరిచయ కార్యక్రమం కొనసాగించనున్నారు. శనివారం సాయంత్రం మర్రిపాడు మండల కేంద్రంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు, నేతలు, మేకపాటి అభిమానులను ఆయన తండ్రి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దగ్గరుండీ పరిచయం చేయనున్నారు. ఆదివారం ఆత్మకూరు మున్సిపాలిటీ, సోమవారం అనంతసాగరం మండలం, మంగళవారం ఆత్మకూరు రూరల్ మండలాల్లో స్థానిక నాయకులు పరిచయం చేసుకోనున్నారు. ఆ తర్వాత ఏఎస్‌పేట, సంగం, చేజర్ల మండలాల్లో పరిచయ కార్యక్రమంతో పాటు గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమం చేపట్టనున్నారు. 14 రోజుల పాటు ఆత్మకూరు నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేసి ప్రజలతో మమేకం కానున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా ఈ కార్యక్రమం చేపట్టాలని పార్టీ నేతలకు తెలిపారు. గౌతమ్‌రెడ్డి వారసుడిగా.. ఆత్మకూరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఫిబ్రవరి 21న గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన రాజకీయ వారసుడిగా సోద రుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి తెరపైకి వస్తున్నారు. బీటెక్ సివిల్ ఐఐటీ చెన్నైలో పూర్తి చేసి, స్పెషలైజ్డ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో ఎంఎంస్ను ఆస్ట్రేలియాలో పూర్తి చేసిన విక్రమ్‌రెడ్డి కేఎంసీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. సోదరుడు గౌతమ్‌రెడ్డి అకాల మరణంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. మేకపాటి కుటుంబానికి ఆత్మకూరు నియోజకవర్గంలో అపారమైన ఆదరణ ఉంది. 2014, 2019 ఎన్నికల్లో మేకపాటి గౌతమ్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో ఘనవిజయం సాధించారు. నిరంతరం ప్రజలతో మమేకమయ్యేందుకు విక్రమ్‌రెడ్డి దీర్ఘకాలిక ప్రణాళిక రచించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ముందస్తుగా పరిచయ కార్యక్రమం చేపట్టుతున్నట్లు వైఎస్సార్సీపీ శ్రేణులు వివరిస్తున్నాయి. -
పదండి.. ప్రతి గడపకు
రెండు మూడు నెలల్లో మూడేళ్లు గడిచి పోతాయి. రాబోయే రెండేళ్లు పరీక్షా సమయం. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోతే అది మీ వ్యక్తిగత తప్పిదమే అవుతుంది. ఈ విషయాన్ని ఎవరూ తేలిగ్గా తీసుకోకూడదు. ఎవరి పనితీరు సరిగా లేకున్నా ఉపేక్షించేది లేదు. పనితీరు సరిగ్గా లేకపోతే.. సర్వేల్లో పేర్లు రాక పోతే కచ్చితంగా మార్పులుంటాయి. ఆ పరిస్థితి కల్పించకూడదని కోరుతున్నా. మీకు తగిన సమయం ఇస్తున్నా. ఇప్పటివరకూ ఎలా ఉన్నా.. ఇకపై ముందుకు కదలాలి. అది మీరు కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది. ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోండి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో కూర్చోవాలంటే గడప గడపకూ వెళ్లి ప్రజల ఆశీర్వాదం తీసుకోవడం కంటే ప్రభావవంతమైన కార్యక్రమం మరొకటి లేదు. నా అనుభవంతో చెబు తున్నా. నియోజకవర్గంలోని ప్రతి గడపకూ మూడు సార్లు వెళ్లండి. కనీసం రెండుసార్లయినా వెళ్లండి. అప్పుడే సత్ఫలితం వస్తుంది. లేదంటే ఎంత మంచి ఎమ్యెల్యే అయినా గెలవడం అన్నది ప్రశ్నార్థకమవు తుంది’ అని వైఎస్సార్సీపీ శాసన సభ్యులకు సీఎం వైఎస్ జగన్ మార్గనిర్దేశం చేశారు. మంగళవారం అసెంబ్లీ వాయిదా పడ్డాక కాన్ఫరెన్స్ హాల్లో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ శాసన సభాపక్ష సమావేశం జరిగింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించి సమావేశాన్ని సీఎం ప్రారంభించారు. సమావేశం ప్రారంభంలోనే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి వైఎస్సార్ఎల్పీ ఘనంగా నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఇంట్లో కాదు... ఎమ్మెల్యేలంతా ప్రజల్లోనే ఉండాలి ప్రభుత్వం ఏర్పాటై మరో రెండు మూడు నెలల్లో మూడేళ్లు పూర్తి కావస్తోంది. ఇక నుంచి పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. ఆ దిశగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది. అధికారం చేపట్టిన మొట్టమొదటి రోజు నేను చెప్పిన కొన్ని అంశాలను మళ్లీ గుర్తు చేస్తున్నా. ఎమ్మెల్యేలు అంతా ప్రజల్లోకి వెళ్లాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఇవాళ ఈ ఎల్పీ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. మన ఇళ్ల దగ్గర మనం కూర్చోవడం.. ప్రజలు మన ఇళ్ల దగ్గరికి వచ్చి మనల్ని కలవడం అన్నదానికి ఇకపై స్వస్తి పలకాలి. గ్రామాల్లోకి వెళ్లాల్సిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. వలంటీర్లకు సన్మానాల్లో పాల్గొనాలి ఏప్రిల్‌లో ఉగాది నుంచి వలంటీర్లకు సన్మానాలు చేస్తున్నాం. బాగా పనిచేసిన వలంటీర్లకు సేవావజ్ర, సేవామిత్ర, సేవారత్న అవార్డులు ఇస్తున్నాం. ప్రభుత్వం వైపు నుంచి పారితోషికం, మెడల్ కూడా అందజేస్తున్నాం. గతేడాది కూడా మనం నిర్వహించాం. ఏప్రిల్ 2న ఉగాది నాడు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం నెల రోజులపాటు సాగుతుంది. కచ్చితంగా ప్రతి ఊరికీ వెళ్లి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. రోజూ మూడు నాలుగు గ్రామాలకు వెళ్లి వలంటీర్లను సన్మానించే కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇది చాలా ముఖ్యం. మే నుంచి గడప గడపకూ... మే నుంచి నెలకు 10 సచివాలయాల వద్దకు నెలలో 20 రోజులపాటు గ్రామాల్లో ఎమ్మెల్యేలు తిరగాలి. ఒక్కో గ్రామ సచివాలయానికి రెండు రోజులు వెళ్లాలి. ఆ సచివాలయం పరిధిలో ప్రతి ఇంటివద్దకూ వెళ్లాలి. ఆ కుటుంబానికి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల ఫలాలను వివరించాలి. ఆ ఇంటికి ఏం మేలు చేశామనే అంశంపై నేను రాసిన లేఖను అందించాలి. మీరే స్వయంగా ఆ లేఖను ఇచ్చి ఆ మేలును గుర్తు చేయాలి. వారి ఆశీస్సులను పొందాలి. క్యాడర్‌తో కలసి మెలసి.. గ్రామాల్లో మీరు పర్యటించినప్పుడు క్యాడర్‌తో మమేకమవ్వండి. వారిని ప్రజలకు చేరువ చేయండి. మళ్లీ మూలాల్లోకి వెళ్లి బూత్ కమిటీల ఏర్పాటు కూడా జరగాలి. ఈ కమిటీల్లో సగం మంది మహిళలు ఉండాలి. ఈ మూడు పనులు ఏకకాలంలో జరగాలి. ఆ తర్వాత వేరే సచివాలయానికి వెళ్లే ముందు.. ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టాలి. నెలకు పది సచివాలయాలు మాత్రమే కేటాయించాం. మిగిలిన 10 రోజులు ఇతర కార్యక్రమాలు చేపట్టవచ్చు. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 80 సచివాలయాలు ఉంటాయి అనుకుంటే గడప గడపకూ కార్యక్రమం పూర్తి కావడానికి కనీసం 8 నెలలు పడుతుంది. 8 నెలలు పూర్తయ్యే సరికి ప్రతి ఇంటికీ ఎమ్మెల్యే వెళ్లి ఆ కుటుంబాల ఆశీర్వాదాలు తీసుకుంటారు. జిల్లా, మండల, గ్రామ కమిటీలు.. మే నెలలో సచివాలయాల సందర్శన ప్రారంభమయ్యేసరికి జిల్లా, మండల, గ్రామ పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి. ఇందులో రీజనల్ కో–ఆర్డినేటర్లు చురుగ్గా వ్యవహరిస్తారు. కొత్తగా 26 జిల్లాల నేపథ్యంలో 3–4 జిల్లాలకు ఒక రీజనల్ కో–ఆర్డినేటర్ ఉంటారు. రీజనల్ కో–ఆర్డినేటర్లు సుమారు 8 మంది వరకు పెరుగుతారు. జిల్లా కమిటీలు పూర్తి చేసుకుని జూలై 8న వైఎస్సార్ సీపీ ప్లీనరీ నిర్వహిస్తాం. భవిష్యత్తు తరాలు చెప్పుకునేలా పనులు కాలర్ ఎగరేసి మనం ఇది చేశాం అని చెప్పుకునే పరిస్థితి ఉంది. పారదర్శకంగా, సోషల్ ఆడిట్ ద్వారా సచివాలయంలో జాబితా ప్రదర్శించి అర్హత ఉన్న ఏ ఒక్కరికీ మిస్ కాకుండా సంతృప్త స్థాయిలో పథకాలు అందించాం. ఇదీ వాస్తవం. చిరునవ్వుతో, ఆనందంగా ప్రజల దగ్గరకు వెళదాం. ఇంతమంది ప్రజల జీవితాలను మార్చగలిగామనే తృప్తి మనకు ఉంది. భవిష్యత్ తరాలు మన గురించి కచ్చితంగా చెప్పుకునేలా పని చేశాం. రాజకీయ నాయకులుగా మనకు కావాల్సింది ఇలాంటి తృప్తే. సంతృప్తికర స్థాయిలో ప్రజలకు మేలు చేయడంలో నాన్న ఒక అడుగు ముందుకేస్తే.. మనం నాలుగు అడుగులు ముందుకేశాం. కులమతాలు, పార్టీలను చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలను అందించాం. 31 లక్షల ఇళ్లు జగనన్న కాలనీల పేరుతో ప్రతి గ్రామంలో కనిపిస్తున్నాయి. గర్వంగా ప్రజల దగ్గరకు వెళ్లి ఇవే విషయాలను చెప్పాలి. సర్వేలలో పేరు లేకుంటే టికెట్ రాదు.. ఒకమాట స్పష్టంగా చెబుతున్నా. గడప గడపకూ కార్యక్రమాన్ని సక్రమంగా చేయకపోతే సర్వేల్లో మీ పేర్లు రావు. సర్వేలలో మీ పేరు లేకపోతే మొహమాటం లేకుండా టికెట్లు నిరాకరిస్తా. మనం గెలవాలి.. అది మరిచిపోవద్దు. ఎందుకంటే... జుత్తు ఉంటేనే ముడి వేసుకోవచ్చు.. అదే లేకపోతే.. ఎలా? గెలవదగ్గ పరిస్థితుల్లోకి ప్రతి ఒక్కరూ రావాలి. ఇన్నాళ్లూ కోవిడ్ వల్ల ప్రజలకు కాస్త దూరంగా గడిపి ఉండవచ్చు. ఇప్పుడు ఆ ప్రభావం తగ్గిన నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లాలి. సలహాలు, సూచనలపై ప్రత్యేక వ్యవస్థ సచివాలయాలు మరింత మెరుగ్గా పనిచేసేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు అందితే మీ దగ్గర నుంచి నా వరకు తీసుకురావడానికి ఒక వ్యవస్థను కూడా రూపొందిస్తాం. మీరు వెళ్లేటప్పటికి ఆ వ్యవస్ధ కూడా తయారవుతుంది. జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లగా బాధ్యతలు తీసుకునే వారంతా బూత్ కమిటీలు, గడప గడపకూ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తారు. సీఎం ప్రత్యేక నిధితో ప్రతి ఎమ్మెల్యేకూ రూ.2 కోట్లు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి కింద ప్రతి ఎమ్మెల్యేకూ రూ.2 కోట్లు అందజేస్తాం. ఈ నిధితో ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించండి. ఏప్రిల్ 1 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. -
సీఎంఆర్ఎఫ్కు రూ.కోటి విరాళం
సాక్షి, అమరావతి: కోవిడ్–19 నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు రూ.కోటి విరాళం ఇచ్చారు. బుధవారం విరాళానికి సంబంధించిన చెక్కును క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, అన్నె చిట్టిబాబు, రాజులపాటి రామచంద్రరావు, దోనేపూడి కిరణ్, హనుమంతరావు పాల్గొన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేలకు ఆర్కే రోజా సవాల్
సాక్షి, చిత్తూరు: దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని ఎమ్మెల్యే రోజా సవాలు విసిరారు. శనివారం ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తన స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు దురాలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. భావితరాల భవిష్యత్ కోసం సీఎం జగన్ ఆలోచిస్తున్నారని రోజా పేర్కొన్నారు. -
లక్ష్మీదేవిని లాకర్లో పెడితే ఎలా?
సాక్షి, మచిలీపట్నం(కృష్ణా) : ‘రాష్ట్రంలో జనరంజక పాలన సాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన వరుణుడు రాష్ట్రంపై చల్లని చూపు చూస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులు, రిజర్వాయర్లన్నీ జలకళతో తొణికిసలాడుతున్నాయి. బీడు వారిన పొలాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విరివిగా రుణాలు ఇవ్వాల్సిన బ్యాంకర్లు లక్ష్మీదేవిని లాకర్లో పెడితే ఎలా’ అని జిల్లా ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. సకాలంలో రుణాలు ఇవ్వగలిగితే రైతుకు మేలు జరుగుతుంది. అంతే కానీ మీకు నచ్చిన వారికి, మీకు ఇష్టమైన వారికి రుణాలు ఇచ్చి లక్ష్యం మేరకు రుణాలు ఇచ్చినట్టుగా లెక్కలు చూపితే ప్రయోజనం ఏమిటని నిలదీశారు. కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అధ్యక్షతన డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం గురువారం సాయంత్రం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, బందరు ఎంపీ వల్లభనేని బాల శౌరిలతో పాటు టీటీడీ బోర్డు సభ్యుడు, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలా అనిల్‌కుమార్, వసంత కృçష్ణ ప్రసాద్, మోకా వెంకట ప్రతాప్ అప్పారావు, జోగి రమేష్ పాల్గొన్నారు. సమావేశంలో తొలుత ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ మనసున్న మారాజు పాలిస్తే ప్రకృతి కూడా సహకరిస్తుందనడానికి రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలే నిదర్శమన్నారు. అదే మంచి మనసు అధికారుల్లో కూడా ఉండాలని అన్నదాతలనే కాదు.. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. నిర్ధేశించిన లక్ష్యం మేరకు రుణాలు సకాలంలో ఇవ్వక పోతే ప్రయోజనమేమిటని ప్రశ్నించారు. ఎలాంటి కొలాట్రల్ సెక్యురిటీ లేకుండా ఇవ్వాల్సిన ముద్ర రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్లు నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఏ బ్యాంకు పరిధిలో ఏ బ్రాంచి ఎంత మేర ముద్ర రుణాలు మంజూరు చేసింది? ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదో సమగ్ర నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2022 నాటికి రైతుల ఆదాయం డబుల్ చేయాలని సంకల్పంతో ప్రధానమంత్రి ప్రకటించిన పథకం అమలుపై మీ వద్ద ప్రణాళికలేమిటో చెప్పాలని డిమాండ్ కోరారు. మరో రెండు నెలల్లో బందరులో మీటింగ్ పెడతా ఈలోగా మీ లక్ష్యాలు. మీ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ కౌలురైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లాలో పంట విస్తీర్ణంలో నూటికి 60 శాతం మంది కౌలురైతులే సాగు చేస్తున్నారని, వార్ని ఆదుకునేందుకే పంట సాగు చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. రుణాల రికవరీ బాగున్న రైతులకు రుణాల మంజూరులో మరింత ఉదారతను చూపాలన్నారు. రూ.1500 కోట్లకు రూ.101 కోట్లు ఇస్తారా? కౌలుదారులకు రూ.1500కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, కేవలంరూ.101 కోట్లు మాత్రమే ఇవ్వడమేమిటని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. జిల్లాలో పాడి, డెయిరీ రంగాలను ప్రోత్సహించే విధంగా విరివిగా రుణాలివ్వాలన్నారు. సంక్షేమ శాఖల ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన మేరకు రుణాలు మంజూరు చేయడమే కాదు.. యూనిట్లు గ్రౌండ్ అయ్యేలా చూడాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. విజయవాడలో 7400 గ్రూపుల ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకై నగర శివారులో ఏర్పాటు చేసిన మైక్రోసాఫ్ట్ బ్యాంకు నగరంలోకి తీసుకురావాలని సూచించారు. అక్టోబర్ 3న మెగా రుణగ్రౌండ్ మేళాలు.. జిల్లాలో 49,220 డ్వాక్రా గ్రూపులకు రూ.1,316కోట్ల రుణాలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 16,309 సంఘాలకు రూ.362 కోట్ల రుణాలు మంజూరు చేశారని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. అక్టోబర్ 3వ తేదీన గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో మెగా రుణ గ్రౌండింగ్ మేళాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అందులో రూ.360కోట్ల రుణాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల కింద మంజూరైన యూనిట్ల వివరాలు ఇవ్వాలని పలువురు ఎమ్మెల్యేలు కోరగా, 2016–19 మధ్య గ్రౌండ్ కానీ యూనిట్లను రద్దు చేశామని, అయితే గతంలో దరఖాస్తు చేసిన వాటిని ప్రస్తుతం పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. స మావేశంలో జేసీ డాక్టర్ కే మాధవీలత, డీసీసీ కన్వీనర్, ఇండియన్ డీజీఎం మణిమాల, ఎల్డీఎం ఆర్. రామ్మోహనరావు పాల్గొన్నారు. -
‘పార్టీలోని పచ్చ పుష్పాలతో తస్మాత్ జాగ్రత్త..’
సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరదల్లో ఇల్లు మునిగి పోతుందని తెలిసే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారని అన్నారు. నాగార్జునసాగర్ గేట్లు మూసేసిన తర్వాతనే విజయవాడకు తిరిగొచ్చారని ఎద్దేవా చేశారు. బాబు ధోరణి చూస్తుంటే వరదలతోనూ సానుభూతి పొందాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో అంబటి బుధవారం ప్రెస్మీట్లో మాట్లాడారు. ‘చేయి నొప్పి వల్లే ఆయన హైదరాబాద్ వెళ్లినట్టు చెప్తున్నారు. ఇక్కడ డాక్టర్లు లేరా. చేయినొప్పికే అక్కడిదాకా వెళ్లాలా. బాబు హైదరాబాద్ వెళితే మరి లోకేష్ ఎక్కడికి వెళ్లారు. నదీగర్భంలో ఉంటూ ఇల్లు ముంచేశారంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. పేపర్లలో రాయించుకుంటున్నారు. కృష్ణా నదికి వరదలు సృష్టించడం మానవులకు సాధ్యమవుతుందా. అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని టీడీపీ హయాంలో దేవినేని ఉమా ప్రకటించారు కదా. మరేమైంది. ఎన్ని కూల్చేశారు. ఏ అక్రమ కట్టడానికైతే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నోటీసులు ఇస్తామన్నారో.. ఇప్పుడు అదే ఇంట్లో చంద్రబాబు ఉన్నారు. అమెరికాలో జ్యోతి ప్రజ్వలన చేయలేదని సీఎం జగన్మోహన్రెడ్డిని హిందూ వ్యతిరేకి అంటూన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్యాలు మాట్లాడ్డం నేరం. అక్కడ ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా జ్యోతిని వెలిగిస్తారు. ఆయనా అదే చేశారు. కమల వనంలో చేరిన పచ్చ పుష్పాలు సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. సీఎం రమేష్ బీజేపీలో ఉన్న పచ్చ కోవర్ట్. విజయవాడ నడిబొడ్డున దేవాలయాలను చంద్రబాబు కూలగొట్టించినపుడు బీజేపీ నేత మాణిక్యాలరావు ఏమయ్యారు. సదావర్తి భూములను అన్యాయంగా వేలం పాట వేస్తే మాణిక్యాలరావు గుడ్లగూబలా చూస్తూ ఉండిపోయారు. పచ్చ రక్తంతో బీజేపీ తన సహజత్వం కోల్పోతుంది. ఆంద్రప్రదేశ్‌లో కమల వనం కాస్తా పచ్చ వనంగా మారుతుంది. బీజేపీ నేతలు జాగ్రత్తగా ఉండాలి. సమయం వచ్చినప్పుడు వాళ్లంతా తిరిగి చంద్రబాబు పక్కనే చేరతారు.’అన్నారు. -
ఏపీలో నూతన అధ్యాయం మొదలైంది
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన అధ్యాయం మొదలైందని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి.గౌతమ్ రెడ్డి అన్నారు. ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న నమ్మకంతో అఖండ విజయాన్ని కట్టబెట్టారని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది మాటల ప్రభుత్వం, ఆర్భాటాల ప్రభుత్వం కాదని, చేతగల ప్రభుత్వమన్నారు. పేదవాడి గుండె చప్పుడిగా పెన్షన్లు పెంచారని, ఆశావర్కర్లకు రూ.10వేల వేతనం పెంచి పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ కార్మిక వర్గాలకు పెద్దపీట వేస్తున్నారని, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ తరఫున ఆయనకు కృతజ్ఞతలని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. -
జమ్మలమడుగులో ఉద్రిక్తత : మహేషేరెడ్డి వాహనం ద్వంసం
-
‘ఆ మంత్రి వల్ల టీడీపీ పది స్థానాలు ఓడిపోతుంది’
-
‘ఆ మంత్రి వల్ల టీడీపీ పది స్థానాలు ఓడిపోతుంది’
సాక్షి, నెల్లూరు: తొలిసారి తాను 1999లో టీడీపీ అభ్యర్థిగా అల్లూరు నుంచి గెలిచి మంత్రి అయినప్పటి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నామీద కడుపు మంటని వైఎస్సార్సీపీ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమిరెడ్డిని ఈ జిల్లాలో నాలుగు సార్లు వరసగా ప్రజలు ఓడించినా.. చంద్రబాబు నాయుడు ఆయనను మంత్రిని చేశారని అన్నారు. తాను టీడీపీలో ఉండడం, పదవులు చేపట్టడం సోమిరెడ్డికి ఇష్టం లేదని పేర్కొన్నారు. కాగా టీడీపీ ఎమ్మెల్యే జాబితాలో ప్రభాకర్ రెడ్డికి స్థానం కల్పించినా.. ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. నెల్లూరు వైఎస్సార్సీపీ లోక్‌సభ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకత్వంలో ఉన్న రాజకీయ దిగజారుడు అంశాలను ఆయన వివరించారు. సోమిరెడ్డి నిత్యం చంద్రబాబు చెవిలో తనపై ఉన్నవి లేనివి చెప్పి అబద్ధాలు సృష్టించేవారిని ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. వైఎస్సార్సీపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా ఇదే..! ‘‘టీడీపీలో ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి, అవమానాలకు గురిచేసి నన్ను మోసం చేశారు. నేను పార్లమెంట్, లేకపోతే కోవూరు అసెంబ్లీ అడిగాను, కానీ కావాలని నెల్లూరు రూరల్ టికెట్ ఇచ్చారు. అయినా పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసం పని చేస్తుంటే అడుగడుగనా అడ్డుకున్నారు. ఈ విషయాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని వెళ్తే సోమిరెడ్డి అడ్డువేసి నన్ను గంట వెయిటింగ్ చేయించారు. నన్ను పార్టీ నుంచి బయటకి పంపించాలని సోమిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జిల్లాలో ముఖ్య నాయకులను పార్టీ నుంచి పంపించడంలో సోమిరెడ్డి కీలక పాత్ర పోషించారు. నేను రూరల్‌లో టీడీపీ నుంచి గెలిచే పరిస్థితుల్లో నన్ను ఓడించేందుకు ప్రయత్నించడం సహించలేకపోయా. నేను బిల్లులు తీసుకుని పార్టీ మారారని ప్రచారం చేస్తున్నారు. బిల్లులు తీసుకున్నానని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా, రుజువు చేయకపోతే నువ్వు తప్పుకుంటావా. సోమిరెడ్డి వల్ల జిల్లాలో పది నియోజకవర్గాల్లో టీడీపీ ఓడిపోనుంది. నాకు ప్రభుత్వం నుంచి రూ.50 కోట్ల బిల్లులు రావాలి, అవసరం అయితే కోర్టుకు వెళ్తా. నేను వచ్చాక ఆత్మకూరు, నెల్లూరు రూరల్ లో పార్టీని బలోపేతం చేశా, అనవసర ఆరోపణలు చేయడం తగదు. నన్ను కేసీఆర్ బెదిరించాడని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అసత్యాలు‘‘ అని అన్నారు.