ప్లీనరీకి హాజరైన పార్టీ శ్రేణులు, పక్కన మాట్లాడుతున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
తిరుపతి రూరల్: తిరుమల శ్రీ వేంకటేశ్వరుని పాదల చెంత వైఎస్సార్‌సీపీ జిల్లా ప్లీనరీ మంగళవారం ఘనంగా జరిగింది. వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఎస్వీ యూనివర్శిటీ స్టేడియంలో ఈ ప్లీనరీ నిర్వహించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి 15 వేల మందికి పైగా కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లి, జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలే రానున్న ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు 80 వేలకు పైగా మెజార్టీని అందిస్తాయని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, సంజీవయ్య, వరప్రసాదరావు, బియ్యపు మధుసూదనరెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా అనంత, సత్యసాయి జిల్లా ప్లీనరీలు
అనంతపురం: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వైఎస్సార్‌సీపీ ప్లీనరీలు ఘనంగా జరిగాయి. మంగళవారం అనంతపురం జిల్లాస్థాయి ప్లీనరీ అనంతపురంలోని శిల్పారామం, శ్రీ సత్యసాయి జిల్లా స్థాయి ప్లీనరీ పుట్టపర్తిలోని ప్రశాంతిగ్రాంలో నిర్వహించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా స్థాయి ప్లీనరీలకు పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచిందని ఆయన అన్నారు.
మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి
ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, శాసన మండలి విప్ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, వై.వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ప్లీనరీల ఇన్‌చార్జి ఎస్వీ మోహన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
శ్రీసత్యసాయి జిల్లా స్థాయి ప్లీనరీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు డాక్టర్ తిప్పేస్వామి, పీవీ సిద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment