
వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న విజయమ్మ, జగన్, షర్మిల
మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులర్పించారు. ఆదివారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆ మహానేత సమాధికి జననేత జగన్ తో పాటు ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిల తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మరికాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండవ ప్లీనరీ సమావేశం ప్రారంభం కానుంది. తొలుత వైఎస్ రాజశేఖరరెడ్డి, మృతి చెందిన పార్టీ నేతలకు సంతాప ప్రకటన చేయనున్నారు. ఆపై వైఎస్ విజయమ్మ ప్రారంభోపన్యాసం చేస్తారు. అనంతరం షర్మిల ప్రసంగించనున్నారు.