
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దివంగత మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించారు. ఈరోజు(శనివారం) అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని నేరుగా సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు.
జూలై 8న దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి. ఈ నేపథ్యంలో తన అనంత పర్యటన ముగిసిన వెంటనే.. వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుని నివాళులు అర్పించారు. సీఎం జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
చదవండి: మీ స్ఫూర్తి చేయిపట్టి నడిపిస్తోంది నాన్న.. సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్