
వైఎస్సార్, సాక్షి: సంక్షేమ ప్రదాత.. అభివృద్ధి విధాత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 15వ వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్సార్ సతీమణి విజయమ్మ, తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు.

ఈ ప్రార్థనా కార్యక్రమంలో ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధ, మాజీ డిప్యూటీ సిఎం ఆంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు కోరుముట్ల శ్రీనివాస్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments
Please login to add a commentAdd a comment