సాక్షి, వైఎస్సార్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్సార్ ఘాట్‌పై పూల మాల ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, వైఎస్ ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ గంగులా ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.00 గంటలకు సీఎం వైఎస్ జగన్ రాయచోటికి వెళతారు. రాయచోటి జూనియర్ కళాశాల మైదానం సమీపంలో పలు అభివృద్ది పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి, సోదరి వైఎస్ షర్మిల ఇతర కుటుంబ సభ్యులు కూడా వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.
వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన విజయమ్మ..
అంతకుముందు వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అలాగే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment