గుంటూరు: గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కేసును నీరుకార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ కేసు నుంచి టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుని రక్షించడానికి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోందని గురజాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కాసు మహేశ్ రెడ్డి ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ..హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఈ కేసు విచారణ జరుగుతోందని వ్యాఖ్యానించారు. కోర్టు ఏమని ఆదేశాలు జారీ చేసింది.. మైనింగ్ అధికారులు అక్కడ ఎవరిని విచారిస్తున్నారని ప్రశ్నించారు.
అక్రమ మైనింగ్ చేసిన వారిని వదిలేసి సంబంధం లేని వారికి నోటీసులు ఇచ్చి అధికారులు ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఈ కేసుకు సంబంధం లేని పల్వరైజింగ్ మిల్లర్లకు నోటీసులు ఇస్తున్నారు..ఇది చాలా అన్యాయం, దారుణమని అన్నారు. పల్వరైజింగ్ మిల్లర్లు భయపడవద్దు..మీకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే యరపతినేని స్థానికుల్ని రెచ్చగొట్టి కేసు పక్కద్రోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో సున్నపురాయిని దోచేసిన వారికి శిక్షపడేంతవరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేశారు.
యరపతినేనిని రక్షించడానికి ప్రయత్నాలు :కాసు
Published Sun, Aug 12 2018 1:25 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment