
గౌతమ్ రెడ్డి
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన అధ్యాయం మొదలైందని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి.గౌతమ్ రెడ్డి అన్నారు. ప్రజలు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఉన్న నమ్మకంతో అఖండ విజయాన్ని కట్టబెట్టారని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది మాటల ప్రభుత్వం, ఆర్భాటాల ప్రభుత్వం కాదని, చేతగల ప్రభుత్వమన్నారు. పేదవాడి గుండె చప్పుడిగా పెన్షన్లు పెంచారని, ఆశావర్కర్లకు రూ.10వేల వేతనం పెంచి పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ కార్మిక వర్గాలకు పెద్దపీట వేస్తున్నారని, వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ తరఫున ఆయనకు కృతజ్ఞతలని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment