Gowtham Reddy Punuru
-
మాచర్లను రావణకాష్టంలా మార్చేందుకు టీడీపీ కుట్ర
సాక్షి, అమరావతి: పల్నాడు ప్రాంతంలో మాచర్లలో గొడవలకు తెరలేపి ఆ ప్రాంతాన్ని రావణకాష్టంలా మార్చేందుకు టీడీపీ కుట్రలు పన్ని విజయం సాధించిందని, దీనికి ఎన్నికల సంఘంలోని కొంత మంది సహకరిస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు, ఆందోళనలు కలిగేలా చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్మిక విభాగం(వైఎస్సార్టీయూసీ) అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి చెప్పారు. అందుకే ఎన్నికల కమిషన్‌లో దొంగలు పడ్డారని అనాల్సి వస్తోందని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.చంద్రబాబు, పవన్‌లకు మరో పది రోజులే కలలు కనే అవకాశం ఉందన్నారు. పెత్తందారులకు అధికారం వస్తే ప్రమాదమని గ్రహించే ఓటింగ్ శాతం పెరిగిందని, మహిళలు ఏకంగా 89 శాతం మంది పాల్గొనడం సీఎం జగన్ విజయానికి తొలి సంకేతమని చెప్పారు. వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని, ఎక్కడా చీలిక లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ సీఎం జగన్‌కి బాసటగా నిలిచాయని తెలిపారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై గతంలో చినకాకాని సమీపంలో టీడీపీ గూండాలు దాడిచేస్తే తృటిలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, ఆయన వాహనాలు ధ్వంసమైన విషయాన్ని గుర్తు చేశారు.విజయవాడకు చెందిన బొండా ఉమా మాచర్ల వెళ్లి పిన్నెల్లి మీద కర్రలు, రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించిన విషయాన్నీ ప్రస్తావించారు. తాజాగా పిన్నెల్లికి సంబంధించిన వీడియో అంటూ ఆయనను టార్గెట్ చేస్తూ టీడీపీ నేత లోకేశ్ తన ఎక్స్‌లో పోస్టు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ వరుస ఘటనలు చూస్తే నూటికి నూరు శాతం దుర్బుద్ధితో, కుట్ర పూరితంగా పిన్నెల్లిని టీడీపీ టార్గెట్ చేస్తోందని చెప్పారు. ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయిగేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటించకుండా.. అదెలా బయటకొచ్చిందో విచారణ చేస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. లోకేశ్‌పై చర్యలేవి? సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే.. అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని, అయితే వారి మీద ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశి్నంచారు. ఘటనకు సంబంధించి ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశామని చెబుతున్న ఈసీ.. ఈ వీడియోను సంపాదించుకుని ఎక్స్‌లో పోస్టు చేసిన లోకేశ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశి్నంచారు. -
చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌నెట్‌లో అవకతవకలు: గౌతమ్‌రెడ్డి
సాక్షి, విజయవాడ: చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్ నెట్లో అవకతవకలు జరిగాయని ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బ్లాక్ లిస్ట్‌లో ఉన్న కంపెనీకి టెండర్ కట్టబెట్టారన్నారు. ఏడాది సస్పెన్షన్ ఉన్నా.. రెండు నెలల్లోనే టెండర్ కట్టబెట్టారన్నారు. టెరా సాఫ్ట్‌కు టెండర్ కేటాయించేందుకే కాల పరిమితి పొడిగించారన్నారు. చంద్రబాబు, వేమూరి హరికృష్ణ ప్రసాద్ కలిసే కుట్రకు పాల్పడ్డారని గౌతమ్‌రెడ్డి మండిపడ్డారు. వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను టెరా సాఫ్ట్‌లో రాజీనామా చేయించి ఫైబర్‌నెట్‌లో డైరెక్టర్‌గా తీసుకున్నారన్నారు. టెండర్లలో అవకతవకలపై అభ్యంతరాలను కూడా పరిశీలించలేదని గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు. 19 మందిపై సీఐడీ అనుమనితులుగా కేసులు నమోదు చేసింది. దర్యాప్తు పూర్తయ్యాక మరింత మంది పాత్ర వెలుగులోకి రావొచ్చని గౌతమ్‌రెడ్డి అన్నారు. ఇవీ చదవండి: టీడీపీలో ముసలం: తారస్థాయికి వర్గ విభేదాలు చిరంజీవిని పట్టుకుని కన్నీరు మున్నీరైన ఉత్తేజ్ -
వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్‌రెడ్డి
-
వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్‌రెడ్డి
విజయవాడ: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ లో అవకతవకలు జరిగినట్లు తమ ప్రాధమిక రిపోర్టుల్లో తేలిందని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతంరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాలను ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. దాంతో ప్రభుత్వం వెంటనే సిఐడి విచారణకు ఆదేశించిందని వెల్లడించారు. సాక్షి తో ఏసీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పూనూరి గౌతం రెడ్డి ఆదివారం మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఫైబర్ నెట్లో అవకతవలు జరిగాయని అన్నారు. ఫిబ్రవరిలోనే ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వంకు పంపించినట్లు తెలిపారు. కాంట్రాక్టర్లకు వందలాది కోట్లను దోచిపెట్టే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. కోట్లాది రూపాయల స్కాంలో ప్రజాప్రతినిధులు, అధికారుల పాత్ర ఉందన్నారు. కాంట్రాక్టుల విషయంలో ఈ అవకతవకలు జరిగాయని, వందల కోట్ల అవినీతి బయటపడింది అన్నారు. 650 కోట్ల అప్పు ఆయన చార్జి తీసుకునే సమయంలోనే ఉందని, అన్ని చోట్లా లాభాలు ఉంటే ఫైబర్‌లో మాత్రం అప్పులు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. ‘ఏసీ ఫైబర్‌లో ఇప్పుడు అప్పులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నాం. నిజం నిగ్గు తేలుతుంది. సీఐడీ విచారణలో నాయకులంతా బయటకొస్తారు. పూర్తి అధారాలు మా వద్ద ఉన్నాయి. గత ప్రభుత్వ పెద్దలు, చిన్నలు కూడా ఇందులో ఉన్నారు. సీఐడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఇందుకు బాధ్యులను గుర్తించాలి. రెండు, మూడు రోజుల్లోనే అన్ని విషయాలు బయటపెడతా.’’ అని అన్నారు. -
ఏపీలో నూతన అధ్యాయం మొదలైంది
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన అధ్యాయం మొదలైందని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి.గౌతమ్ రెడ్డి అన్నారు. ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న నమ్మకంతో అఖండ విజయాన్ని కట్టబెట్టారని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది మాటల ప్రభుత్వం, ఆర్భాటాల ప్రభుత్వం కాదని, చేతగల ప్రభుత్వమన్నారు. పేదవాడి గుండె చప్పుడిగా పెన్షన్లు పెంచారని, ఆశావర్కర్లకు రూ.10వేల వేతనం పెంచి పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ కార్మిక వర్గాలకు పెద్దపీట వేస్తున్నారని, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ తరఫున ఆయనకు కృతజ్ఞతలని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. -
'మంత్రి డైరెక్షన్లోనే భారీ అవినీతి'
విజయవాడ సెంట్రల్: కార్మికుల రక్తం పీలుస్తున్న కార్మిక శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడుని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మికశాఖలో అవినీతి అంతా మంత్రి డెరెక్షన్‌లోనే జరుగుతోందని విమర్శించారు. ఐటీఐ కళాశాలల్లో రూ.7,500లుగా ఉన్న ఫీజును ఏకంగా రూ.16,500కు పెంచేశారని మండిపడ్డారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యం నుంచి వందల కోట్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. పరికరాల కొనుగోలు, శిక్షణా తరగతుల నిర్వహణ పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారని చెప్పారు. కార్మిక, ఉపాధి శాఖ జేడీ మునివెంకటనారాయణ ఇంటిపై ఏసీబీ, విజిలెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో ఆ శాఖ అవినీతి బట్టబయలైందన్నారు. తామేమీ ఆరోపణలు చేయడం లేదని, నైపుణ్యాల శిక్షణ పేరిట తప్పుడు సంస్థలకు బిల్లుల చెల్లింపు, పరికరాల కొనుగోలులో అవినీతి, ప్రైవేటు కళాశాలల యాజమాన్యం నుంచి భారీ వసూళ్లకు పాల్పడ్డారని ఏసీబీ, విజిలెన్స్ దర్యాప్తులో బయటపడిందని గౌతంరెడ్డి చెప్పారు. మంత్రి అచ్చెన్నాయుడు కార్మికశాఖలో జరిగిన అవినీతిపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు. చీటికి మాటికి ప్రతిపక్షాలపై విమర్శలు చేసే ఆయన తన సొంత శాఖలో జరిగిన అవినీతిపై మాట్లాడకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన ‘ఆలీబాబా 40 దొంగల’ కథనుతలపిస్తోందని గౌతంరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకోవాలని చంద్రబాబు 40 మంది దొంగల్ని రాష్ట్రం మీదకు పంపారని ఎద్దేవా చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం వసూలు చేసిన సెస్‌ను చంద్రన్న చలువ పందిళ్లు, మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ, వ్యాపారవేత్తలకు సన్మానాలకు ఖర్చు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కార్మికుల బీమా ప్రీమియంను సొంత ప్రచారానికి వాడుకున్నారన్నారు. మంత్రి అచ్చెన్నాయుడుపై మహిళలను వేధించడం, హత్యానేరం కేసులు ఉన్నాయని తెలిపారు. ఇటువంటి మంత్రిని మంత్రివర్గంలో కొనసాగించడం సిగ్గుచేటని, తక్షణమే ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేశారు.