Penmatsa Sambasiava Raju
-
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురేష్ బాబు
సాక్షి, అమరావతి: దివంగత సీనియర్ నాయకులు, విజయనగరం జిల్లాకు చెందిన పెన్మత్స సాంబశివరాజు తనయుడైన డా.పెన్మత్స సూర్యనారాయణరాజు (డా.సురేష్‌బాబు)ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దింపాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఈ స్థానానికి సురేష్ బాబు పేరును ఖరారు చేశారు. కాగా ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటాలోని ఒక ఎమ్మెల్సీ స్థానం భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. నామినేషన్ దాఖలుకు ఆగస్ట్ 13 చివరి తేదీ కాగా, 24న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడిస్తారు. (హామీ ఇచ్చారు... నిలబెట్టుకున్నారు) -
'రానున్న ఎన్నికల్లో బొత్స కుటుంబం భూస్థాపితం'
విజయనగరం: రానున్న ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కుటుంబాన్ని భూస్థాపితం చేయడం ద్వారా అరాచక రాజకీయాలకు స్వస్తి చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. బొబ్బిలి దర్బార్ మహాల్లో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం బుధవారం జరిగింది, ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయకృష్ణరంగారావు, జిల్లా కన్వీనర్ పెన్మత్స సాంబశివరాజు, బేబినయనలు హాజరయ్యారు. ఈ సందర్బంగా సుజయకృష్ణరంగారావు మాట్లాడుతూ.. బొబ్బిలిలో మేమిచ్చిన మెజార్టీతోనే బొత్స కుటుంబం రెండు సార్లు ఎంపీ పదవి పొందారు అని అన్నారు. ఈసారి ఎన్నికల్లో అదే మెజార్టీని వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం ద్వారా బొత్సను రాజకీయ సన్యాసం చేయిద్దాం అని పిలుపునిచ్చారు. మేం రాజకీయాల్లో ఉన్నంతకాలం రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం. భవిష్యత్ లో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే కొనసాగుతాం అని నేతలు స్పష్టం చేశారు. రానున్న బొబ్బిలి యుద్ధంలో విజయం మాదే బేబినయన ధీమా వ్యక్తం చేశారు. -
విజయనగరంలో కర్ఫ్యూ ఎత్తేయాలి: వైఎస్సార్ సీపీ
విజయనగరం: విజయనగరంలో కర్ఫ్యూ ఎత్తివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెన్మత్స సాంబశివరాజు, అవనపు విజయ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేకు వినతిపత్రం సమర్పించారు. ఆస్తుల విధ్వంసం కేసులో అమాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని వారు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతల సూచన మేరకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను రాజకీయ కక్షతో అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. సమైక్య విద్యార్థి జేఏసీ నేతలపై దాడులకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయలేదని, కనీసం కేసు కూడా పెట్టలేదని తెలిపారు. ఈ అంశంలో న్యాయం చేయమని కలెక్టర్‌ను కోరామని పెన్మత్స సాంబశివరాజు, అవనపు విజయ్ తెలిపారు.