
సాక్షి, అమరావతి: దివంగత సీనియర్ నాయకులు, విజయనగరం జిల్లాకు చెందిన పెన్మత్స సాంబశివరాజు తనయుడైన డా.పెన్మత్స సూర్యనారాయణరాజు (డా.సురేష్‌బాబు)ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దింపాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయించారు. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఈ స్థానానికి సురేష్ బాబు పేరును ఖరారు చేశారు. కాగా ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటాలోని ఒక ఎమ్మెల్సీ స్థానం భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. నామినేషన్ దాఖలుకు ఆగస్ట్ 13 చివరి తేదీ కాగా, 24న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడిస్తారు. (హామీ ఇచ్చారు... నిలబెట్టుకున్నారు)