విజయనగరంలో కర్ఫ్యూ ఎత్తివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెన్మత్స సాంబశివరాజు, అవనపు విజయ్ విజ్ఞప్తి చేశారు.
విజయనగరం: విజయనగరంలో కర్ఫ్యూ ఎత్తివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెన్మత్స సాంబశివరాజు, అవనపు విజయ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేకు వినతిపత్రం సమర్పించారు. ఆస్తుల విధ్వంసం కేసులో అమాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని వారు ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ నేతల సూచన మేరకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను రాజకీయ కక్షతో అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. సమైక్య విద్యార్థి జేఏసీ నేతలపై దాడులకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయలేదని, కనీసం కేసు కూడా పెట్టలేదని తెలిపారు. ఈ అంశంలో న్యాయం చేయమని కలెక్టర్‌ను కోరామని పెన్మత్స సాంబశివరాజు, అవనపు విజయ్ తెలిపారు.