Sujaya Krishna Ranga Rao
-
టీడీపీలో ‘రాజ’ముద్ర
వారంతా రాజులే. అలాగని ప్రజాసంక్షేమమేధ్యేయంగా పాటుపడే పాలకులు కాదు. నిస్వార్థంగా జనానికి సేవ చేసే జవాబుదారీలు కాదు. తమను నిత్యం అంటిపెట్టుకునేవారి సంక్షేమమే వారి లక్ష్యం. స్వార్థ ప్రయోజనం... ఆశ్రిత పక్షపాతం... బంధుప్రీతి... వారి నైజం. అధికారం వారి చేతుల్లోనే ఉండాలి. పదవులు వారే అనుభవించాలి. మిగతా జనమంతా వారి కనుసన్నల్లోనే బతకాలి. అందుకే అత్యధిక బీసీలున్న ఈ జిల్లాలో టీడీపీ హయాంలో వారి ఎదుగుదల నామమాత్రమే. పథకాలన్నీ పెద్దలకే అందుతున్నాయి. బీసీలకు కనీస సౌకర్యాలు కొరవడుతున్నాయి. తెలుగుదేశం పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై అప్పుడే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసంతృప్తి రాజుకుంటోంది. సాక్షిప్రతినిధి విజయనగరం: రాజంటే... తన రాజ్యంలో సుస్థిర పాలనను అందించడం... తరతమ భేదాలు లేకుండా ప్రజలందరినీ సమానంగా చూడటం... ఎలాంటి పక్షపాతాలకు, రాగద్వేషాలకు తావివ్వకుండా నిరంతరం ప్రజల యోగక్షేమాల గురించే ఆలోచించడం చేయాలి. కానీ అలాంటి రాజవంశ ముద్ర వేసుకున్న మన జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల్లో ఈ లక్షణాలు మచ్చుకైనా కనిపించడం లేదు. దీనిని ఆ పార్టీవారే బాహాటంగా అంగీకరిస్తారు. జిల్లాలో అత్యధికంగాఉన్న బీసీ సామాజిక వర్గాన్ని అధికారపార్టీ నేతలు పూర్తిగా విస్మరించారు. కేవలం రాజ సామాజిక వర్గానికి, వారి అనుచర గణానికి మాత్రమే పదవులు, కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. దీనిపై ఆ పార్టీ వర్గాల్లోనే తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గాలిలో కలసిన బీసీలకిచ్చిన హామీలు గత ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు చాలా హామీలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 లక్షల మంది వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలు ఆ హామీలను నమ్మి ఓట్లేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకపోగా, బీసీలపై సవతితల్లి ప్రేమ చూపించడం మొదలుపెట్టారు. దానిలో భాగంగానే కేంద్ర మాజీ మంత్రి, విజయనగరం ఎంపీ అశోక్‌గజపతిరాజు అనుచరులకు విజయనగరం ఏఎంసీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులను ఇచ్చారు. బొబ్బిలి రాజు, రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడాన్ని సుతరామూ అంగీకరించని అక్కడి పార్టీ ఇన్చార్జి తెంటు లకు‡్ష్మనాయుడికి ఆర్టీసీ సంస్థ రీజనల్ చైర్మన్ పదవినిచ్చి కేవలం బుజ్జగించారు. ఈ మూడింటితోనే బీసీలకు ఎంతో చేసేశామని చెప్పుకుంటున్నారు. కానీ ఇవన్నీ నియోజకవర్గ, జిల్లా, రీజనల్ స్థాయి పదవులే కావడం విశేషం. రాష్ట్రస్థాయి పదవులకు నోచనీ బీసీలు ఇక రాష్ట్ర స్థాయి పదవులను మాత్రం బీసీలకు దక్కనివ్వడం లేదు. సుజయ్‌కు ప్రధాన అనుచరుడు, సొంత సామాజిక వర్గానికి చెందిన తూముల భాస్కరరావును రాష్ట్ర ఆర్థిక మండలి సభ్యుడిగా నియమించుకున్నారు. రాష్ట్ర బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్‌గా భోగపురపు వాయునందన శర్మను వేసుకున్నారు. తాజాగా అశోక్ ప్రధాన అనుచరుడు, సొంత సామాజిక వర్గానికి చెందిన ఐ.వి.పి.రాజును రాష్ట్ర ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు వైస్ చైర్మన్‌గా నియమించుకున్నారు. విజయనగరంలో అశోక్‌గజపతిరాజు, సాలూరులో ఆర్పి భంజ్‌దేవ్, కురుపాంలో శత్రుచర్ల విజయరామరాజు, బొబ్బిలిలో ఆర్వి సుజయకృష్ణ రంగారావు రాజుల సామాజిక వర్గం నుంచి టీడీపీలో పెత్తనం చెలాయిస్తుండగా త్వరలోనే వీరికి మరోరాజు కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ తోడవ్వనున్నారు. ఇలా విజయనగరం జిల్లా టీడీపీ మొత్తం రాజుల మయంగా మారుతోంది. పోనీ వీరు జనానిమైనా చేస్తున్నారా అంటే..అదీ లేదు. శత్రుచర్ల విజయరామరాజు, ఆర్పి భంజ్‌దేవ్, వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఇప్పటికే కులనిర్థారణ వివాదాల్లో నిత్యం కొట్టుమిట్టాడుతున్నారు. పదవి కోసం శత్రుచర్ల విజయరామరాజు సొంత నియోజకవర్గాన్ని వదిలి పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాకు వెళ్లి ఎమ్మెల్సీ అయ్యారు. అశోక్ గజపతి, సుజయకృష్ణ రంగారావు, భంజ్‌దేవ్‌లు తమ ఆస్తులను కాపాడుకోవడంపై పెడుతున్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై పెట్టడం లేదు. విజయనగరానికి కేంద్ర పథకాలు, విభజన హామీలు తెప్పించుకోవడంలో అశోక్ పూర్తిగా విఫలమవ్వగా, గనుల శాఖలో ఉండి వాటిలో అక్రమాలను నిలువరించడంలో, జిల్లాకు రాష్ట్ర ప్రాజెక్టులు రప్పించడంలో సుజయ్ ఫెయిలయ్యారు. ఇక భంజ్‌దేవ్ పదవిలో ఉన్నప్పుడూ లేనప్పుడు కూడా తనపై వస్తున్న ఆరోపణల నుంచి తనను తాను కాపాడుకోవడంతోనే సరిపెడుతున్నారు. ఇక ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీలో ఉండి, జిల్లా ప్రజలకు కనీసం దర్శన భాగ్యం కూడా కల్పించని కిశోర్‌చంద్రదేవ్ ఇప్పుడు సడన్‌గా ప్రత్యక్షమై పదవి కోసం వీరి పంచన చేరుతున్నారు. వీరివల్ల జిల్లా ప్రజలు ఏ విధమైన ప్రయోజనం పొందలేకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. -
ఎమ్మెల్యే ప్రొగ్రెస్ రిపోర్ట్ - సుజయకృష్ణ రంగారావు
-
వెనక్కు తగ్గిన మంత్రి?
♦ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సాక్షి కథనాలపై వివరణ ఇచ్చుకున్న సుజయ్‌కృష్ణ రంగారావు ♦ పార్టీ తలదించుకునే పరిస్థితి రానీయనంటూ వ్యాఖ్యలు సాక్షి ప్రతినిధి, విజయనగరం: బొబ్బిలి రాజవంశీయుడు, రాష్ట్ర గనుల శాఖా మంత్రి ఆర్వీ సుజయ కృష్ణ రంగారావు గిరిజనులకిచ్చిన భూములను లాక్కునే యత్నాలపై ఆలోచనలో పడ్డారు. బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని నిరుపేద గిరిజనులకు పూర్వీకులు పంపిణీ చేసిన భూములను మంత్రి సుజయ్ వెనక్కు లాక్కోవడానికి చేస్తున్న కుట్రలను ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వరుస కథనాల ఆధారంగా విపక్షాలు సైతం మంత్రి చర్యలపై మండిపడ్డాయి. స్వపక్షంలోనూ మంత్రికి మద్దతుగా నిలిచేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. పై పెచ్చు కొత్తగా పార్టీలోకి వచ్చి మంత్రి పదవి సైతం దక్కించుకున్న సుజయ కృష్ణ రంగారావు టీడీపీకి జిల్లాలో చెడ్డపేరు తీసుకువస్తున్నారనే విషయాన్ని ఆ పార్టీ జిల్లా నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. భూముల దందాపై ఇంటా బయటా అభాసుపాలయిన మంత్రి ఆలోచనలో పడ్డారు. దీనిపై తెలుగు దేశం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలు జిల్లాలో మరోసారి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తను తప్పు చేయనని, పార్టీకి తలవంపులు తెచ్చే పని చేయనంటూ ‘సాక్షి’ కథనాలపై ఆయనిచ్చిన వివరణ గిరిజన రైతుల భూముల జోలికి వెళ్లనని పరోక్షంగా ప్రకటించినట్టయింది. కుటుంబ సభ్యుల్లాంటి నాయకులు, కార్యకర్తలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం తనకు ఉందంటూ, బొబ్బలిలో గిరిజనుల భూములు లాక్కుంటున్నానని ‘సాక్షి’ వారం రోజుల పాటు వార్తలు రాశారన్నారు. నాకు మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ముచేయనని చెప్పుకున్నారు. నా వల్ల పార్టీకి, ప్రభుత్వానికీ తలదించుకునే పరిస్థితి రాదన్నారు. సాక్షి కథనాలు ప్రస్తావిస్తూ నీళ్లు తాగిన మంత్రి! మంత్రి రంగారావు వైఖరిని ఎండగడుతూ ‘సాక్షి’ ప్రచురించిన కథనాలపై వారం రోజులుగా నోరు మెదపని ఆయన ఆదివారం ఆ కథనాలపై వివరణ ఇచ్చేందుకు సైతం తడబడ్డారు. సాక్షి పేరును, కథనాలను ప్రస్తావిస్తున్నప్పుడు ఆయన గద్గద స్వరంతో మాట్లాడుతుండటాన్ని గమనించిన పార్టీ నాయకులు వెంటనే మంచినీళ్ల బాటిల్‌ను అందించారు. నీళ్లు తాగిన అనంతరం మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు. మొత్తానికి ‘సాక్షి’ కథనంపై తెలుగు దేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సుజయ్ ప్రస్తావించడాన్ని కేంద్రమంత్రి, ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ‘సాక్షి’ పుణ్యాన మంత్రి వివరణ ఇచ్చారని, గిరిజనులకు న్యాయం జరుగుతుందన్న చర్చ టీడీపీ క్యాడర్‌తో పాటు జిల్లా ప్రజల్లో జోరందుకుంది. -
మాపై సుజయకృష్ణా రంగారావు విమర్శలా?
విజయనగరం: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జిల్లాలో తోటపల్లి, పెద్దగెడ్డ సహా ముఖ్యమైన ప్రాజెక్టులు అన్నీ పూర్తయ్యాయని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ బొబ్బిలిలో మూతపడ్డ పరిశ్రమలనే సుజయకృష్ణ రంగారావు తెరిపించలేకపోయారన్నారు. పైగా వైఎస్ఆర్ సీపీపై విమర్శలు చేస్తున్నారని కోలగట్ల ధ్వజమెత్తారు. అంతేకాకుండా విజయనగరంలో జూనియర్ కాలేజీని తీసుకు వచ్చింది కూడా తామేనని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ తన భూములను కాపాడుకునేందుకే సుజయకృష్ణా రంగారావు పార్టీ మారారని విమర్శించారు. షుగర్ ఫ్యాక్టరీ రైతులకు బకాయిలు ఇవ్వలేక కోట నుంచి పారిపోయిన చరిత్ర ఆయనదని ఎద్దేవా చేశారు. తమపై విమర్శలు చేసే అర్హత సుజయకృష్ణా రంగారావుకు లేదని అన్నారు. -
'ప్రాణమున్నంతవరకూ వైఎస్ జగన్‌తోనే'
►పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవం ►కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు ►జిల్లాలోని ఎమ్మెల్యేలెవరూ పార్టీ మారరు ► స్వార్థం, వ్యక్తిగత ప్రయోజనం కోసమే కొందరు పార్టీ మారారు ► పార్టీ వీడినవారు పదవులకు రాజీనామా చేసి గెలివాలి ► ఫిరాంయిపుల చట్టంలో మార్పులు చేయాలి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బొబ్బిలి: గత ఎన్నికల్లో వైఎస్ బొమ్మతో విజయం సాధించామని, ప్రాణమున్నంతవరకూ తాము వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే కలసి నడుస్తామని పార్టీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, రాజన్నదొర, శ్రీవాణి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ నాయకులు ధర్మాన కృష్ణదాస్, బేబినాయిన తదితరులతో కలసి వారు మంగళవారం ఉదయం బొబ్బిలి కోటలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో టీడీపీ పూర్తిగా ఉనికి కోల్పోవడంతో... సీఎం చంద్రబాబు ఏపీలో వైఎస్సార్సీపీ విషయంలో అలా చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. వైఎస్ జగన్ నాయకత్వంలో తామంతా పనిచేస్తామని స్పష్టం చేశారు. వివరణ తీసుకుని కూడా ఎలక్ట్రానిక్ మీడియా అసత్య ప్రచారం చేసిందని, మరోసారి అసత్య ప్రచారం చేస్తే... చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమన్నారు. టీడీపీకి చెందిన వారు తిరిగి తమ గూటికి చేరుకున్నారే తప్ప కొత్తవారెవరరూ వైఎస్సార్సీపీని వీడలేదన్నారు. పార్టీలు మారినప్పడు రాజీనామా చేసి నైతిక విలువలు కాపాడుకోవాలని, ప్రస్తుతం పార్టీ ఫిరాయించినవారు అలా చేయకపోవడం దురదృష్టకరమన్నారు. పార్టీ ఫిరాయింపు చట్టంలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపుదారులపై చర్యలకు కాలపరిమతి లేకపోబట్టే చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. -
అండగా ఉండి ఆదుకోండి...
బొబ్బిలి: ‘అగ్రి గోల్డు కార్యాలయాల్లో నాలుగు నెలలుగా లావాదేవీలను నిలిపివేశారు. ఖాతాదారుల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాం. ఇప్పటికే 8 మంది గుండెపోటుతో చనిపోయారు. యాజమాన్యం పలకడం లేదు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మీరు అండగా ఉండి అదుకోవాలి’ అని అగ్రిగోల్డు ఏజెంట్లు బొబ్బిలి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్.వి.సుజయకృష్ణ రంగారావును కోరారు. పార్వతీపురం డివిజన్లోని అగ్రి గోల్డు ఏజెంట్లు సోమవారం ఆయనను బొబ్బిలి కోటలో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి నాలుగో తేదీ నుంచి లావాదేవీలను నిలిపివేశారన్నారు. గ్రామాల్లో ఖాతాదారులు ఏజెంట్లపై దాడులకు వస్తున్నారని చెప్పారు. వారి ఒత్తిడి తట్టుకోలేక చిన్న వయసులో ఉన్నవారు కూడా గుండెపోటుతో చనిపోతున్నారని తెలిపారు. ఇప్పటివరకూ అనేక ఆందోళనలు చేసినా అటు యాజమాన్యం, ఇటు ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అగ్రి గోల్డు సంస్థకు ఆర్థిక ఇబ్బందులు లేవన్నారు. ప్రభుత్వమే డబ్బు చెల్లించేటట్లు చేస్తే కాలయాపన అవుతుందన్నారు. ప్రస్తుతం తమకు ఎక్కడా పనిదొరకడం లేదని, ఇల్లు గడవని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఇటీవల పార్వతీపురం వచ్చిన సీఎం చంద్రబాబుకు విన తిపత్రం ఇచ్చినా ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేదన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి విజయనగరం వచ్చినపుడు వినతిపత్రం ఇచ్చామని, పార్టీ పరంగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావు మాట్లాడుతూ పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఏజెంట్లు, ఖాతాదారులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పోరాటం చేసి ప్రభుత్వం దృష్టిలో పడడం, ముఖ్యమంత్రిని ఎప్పటికప్పుడు కలవడం వంటివి చేయాలని సూచించారు. -
'ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు ధర్నా'
విజయనగరం: రాష్ట్రంలోని చెరుకు రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా సీతా నగరంలోని ఎన్సీఎస్ షుగర్ ఫ్యాకర్టీ వద్ద చెరుకు రైతులు చేపట్టిన మహాధర్నాకు ఆయన మద్దతు ప్రకటించారు. ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. చెరుకు రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రభుత్వం హామీ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు ధర్నా కొనసాగిస్తామని సుజయ్ కృష్ణరంగారావు స్పష్టం చేశారు. -
ప్రజల చేతిలో పాశుపతాస్త్రం వైఎస్ఆర్సీపీ
విజయనగరం మున్సిపాలిటీ : ప్రజల చేతిలో పాశుపతాస్త్రం వైఎస్ఆర్ సీపీ అని, వారి తరఫున పోరాటమే పార్టీ ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావు అన్నారు. సార్వత్రిక ఎన్నికల తరువాత ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ప్రతిపక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నామని, వారి తరఫున ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బుధవారం జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి స్వగృహంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఇతర ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి త్వరలోనే జిల్లా కమిటీలను నియమిస్తామని, మరో నెల రోజుల వ్యవధిలో మండల, గ్రామ స్థాయి కమిటీలను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ మండల, గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడంలో భాగంగా జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించినట్లు ప్రకటించారు. వీరు స్థానిక శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మండల పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలతో చర్చించి గ్రామ స్థాయి కమిటీలను నియమిస్తారన్నారు. ఇంతకుమందు నిర్వహించిన సమావేశంలో అందరి సూచనలు, సలహాలతో జిల్లా పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీల జాబితాలను రూపొందించినట్టు చెప్పారు. రాష్ట్ర పార్టీ ఆమోదం తరువాత వాటిని ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పోరాటం చేసి ప్రజలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలు అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడితెస్తామన్నారు. అనంతరం సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర మాట్లాడుతూ పింఛన్లు, ఎస్సీ,బీసీ కార్పొరేషన్ రుణాల లబ్ధిదారుల పరిశీలనకు... నిబంధనలకు నీళ్లొదలి, చట్టవ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా కమిటీలను నియమించిన ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషన ర్లపై 2వ తేదీన కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తప్పుడు నివేదికలు ఇచ్చి, కమిటీలు నియామకం చేపట్టిన అధికారులను బాధ్యులు చేసి క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నట్లు చెప్పారు. స్థానికంగా అన్నీ తెలిసిన సామాజిక కార్యకర్తలను ఈ కమిటీల్లో నియమించాలని జీఓలు చెబుతుంటే, అధికారులు మాత్రం టీడీపీ నాయకులు, కార్యకర్తల పేర్లను సూచించి కమిటీలు వేయడం ఎంత వరకు సమంజసమన్నారు. కమిటీల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలు ప్రజలను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసిస్తూ పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. కమిటీల నియామక విషయంపై అసెంబ్లీలో చర్చించిన సందర్భంలో సీనియర్ నాయకులు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ‘ మా పార్టీ ప్రభుత్వంలో ఉంది , మా ఇష్టం’ అని సమాధానం చెప్పటం బాధాకరమన్నారు. పలు అంశాలపై అసెంబ్లీలో మాట్లాడవలసి ఉంటుందని, అవసరమైతే పోట్లాటకు సిద్ధమని చెప్పారు. జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభా సమావేశాల్లో ప్రకటించారని, ఆ నిర్ణయానికి వారు కట్టుబడకుంటే శాసనసభను కించపరిచినట్లేనని విలేకరుల అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. సమావేశంలో కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలకు సంక్షేమ పథకాల కమిటీల్లో స్థానం కల్పించడం వల్ల సామాన్య ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. పేదలకు జరుగుతున్న అన్యాయంపై బాధ్యత వహించేది పార్టీ నాయకులా.. ప్రభుత్వమా అన్ని ప్రశ్నించారు. తమ పార్టీ మండల గ్రామ స్థాయి కమిటీలు నియమించటం ద్వారా ప్రజలకు మరింత చేరవవుతామన్నారు. ఈ సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, పార్టీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్, ఎస్‌కోట నియోజకవర్గ ఇన్చార్జ్ నెక్కల.నాయుడుబాబు, పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జ్ జమ్మాన.ప్రసన్నకుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ అంబళ్ల.శ్రీరాములనాయుడు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గుల్లిపిల్లి సుదర్శనరావు, వేచలపు చినరామునాయుడు, మామిడి అప్పలనాయుడు, పతివాడ అప్పలనాయుడు , వల్లిరెడ్డి శ్రీను, జరజాపు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిశీలకులు వీరే.... కురుపాం - పువ్వల మాధవరావు పార్వతీపురం- ఎస్.పరీక్షిత్‌రాజు బొబ్బిలి - జరజాపు ఈశ్వరరావు సాలూరు- అవనాపు విజయ్ గజపతినగరం - మామిడి అప్పలనాయుడు ఎస్‌కోట- పీరుబండి జైహింద్‌కుమార్ విజయనగరం- అంబళ్ల శ్రీరాములనాయుడు నెల్లిమర్ల - జి.ఎస్‌రాజు, కడియాల రామకృష్ణ చీపురుపల్లి- గొర్లె వెంకటరమణ -
బాధితుల తరఫున పోరాటం
రామభద్రపురం : ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు ఆదేశించారు. శు క్ర వారం ఆయన మండల పరిషత్ కార్యాలయం లో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసా యానికి అనుసంధానం చేసినట్లుయితే పార్వతీపురం డివిజన్లో వేలాది మంది రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇప్పటివరకు మండలంలో ఎందుకు ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయలేదని ఏపీఓ సత్యవతిని ప్రశ్నించారు. అలాగే ఇటీవల వచ్చిన తుపానుకు చాలాచోట్ల విద్యుత్ స్తంభా లు నేలకొరిగినా.. ఇప్పటికీ వాటిని సరి చేయకపోవడంతో ఎలక్ట్రికల్ సబ్ ఇంజినీర్ సతీష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వీడాలని సూ చించారు. ఎంఈఓ పెంటయ్య పర్యవేక్షణ లోపం వల్ల చాలా పాఠశాలల్లో వసతుల లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఇళ్లకు నిధులు ఎప్పుడు మంజూరవుతాయని హౌసిం గ్ ఏఈ వేణును ప్రశ్నించారు. అలాగే తుపానుకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారంపై ప్రభుత్వానికి నివేదికలు అందించాలని ఏఓ ప్రసాద్‌ను ఆదేశించారు. పట్టాదారు పాసు పుస్తకాల జారీలో జాప్యం లేకుండా చూడాలని తహశీల్దార్ అప్పారావుకు సూచించారు. ఈ సమావేశంలో ఎంపీపీ అప్పికొండ శ్రీరాములునాయు డు, జెడ్పీటీసీ సభ్యుడు బోయిన లూర్దమ్మ, ఎంపీడీఓ చంద్రమ్మ, తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల ఎస్కార్ట్ కోసం అసెంబ్లీలో పోరాడుతాం ప్రత్యేక అవసరాల పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్కార్ట్ అలవెన్సు ఆపడం సరికాదని, దీనిపై అసెంబ్లీలో పోరాటం చేస్తామని ఎమ్మెల్యే సుజ య్ తెలిపారు. శుక్రవారం భవిత భవనంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు ప్రభుత్వం ప్రతి నెలా వికలాంగులకు వంద రుపాయలు ఎస్కార్ట్ అల వెన్సు మంజూరు చేసేదన్నారు. కానీ ఈ ఏడాది నుంచి ప్రభుత్వం ఎస్కార్ట్ అలవెన్సు ఇవ్వడం లేదన్నారు. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నట్టు చెప్పారు. అలాగే తమ పార్టీ ద్వారా వికలాంగులకు ఆర్థిక సా యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలి పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు బోయిన లూర్దమ్మ, ఎంపీటీసీ మడక తిరుపతినాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
బలపడదాం.. పోరాడదాం
శ్రీకాకుళం: సంస్థాగతంగా బలపడితేనే ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సమర్థవంతంగా పోరాడగలుగుతామని వైఎస్సార్సీపీ జిల్లా ఇన్చార్జి, బొబ్బిలి శాసనసభ్యుడు సుజయకృష్ణ రంగారావు అన్నారు. స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. పార్టీకి జనాభిమానం మెండుగా ఉన్నా సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి కారణం సంస్థాగతంగా బలహీనంగా ఉండడమేనని చెప్పా రు. దానికి తోడు ధీమా కూడా ఓ కారణమన్నారు. సమిష్టిగా పనిచేసి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు, అభిమానులకు అండగా ఉండి వారికి ఆత్మస్థైర్యం కలిగించాలని నాయకులను కోరారు. కమిటీలను నాలుగు గోడల మధ్య నియమించకుండా మండలస్థాయికి వెళ్లి సమవేశాన్ని ఏర్పాటు చేయాలని జగన్మోహనరెడ్డి ఆదేశించారని, ఆ విధంగానే కమిటీల నియామకం ఉంటుందన్నారు. నాయకులు, కార్యకర్తలు జిల్లా అధ్యక్షురాలికి సహకరించాలని సూచించారు. ప్రతిపక్ష పాత్రే కీలకం:ధర్మాన మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం అనే రెండు పక్షాలు ఉంటాయని.. ప్రతిపక్ష పాత్ర నిర్వహణే కష్టమైన పని అని అన్నారు. ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహిస్తే ఆ తర్వాత అధికారం మనదేనన్నారు. ఎప్పుడైనా ప్రతిపక్షం పైకి వెళ్తుంటే అధికార పక్షం కిందకు దిగుతుందని వివరించారు. ప్రభుత్వం చేసేవన్నీ అక్రమాలేనని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టి ప్రజల పక్షాన పోరాడుతూ అందరికీ అర్ధమయ్యేలా పనిచేయాలని సూచించారు. జిల్లా ప్రజాప్రతినిధులు ప్రతిపక్షంపై విమర్శలు మానుకొని జిల్లా అభివృద్ధిపై.. పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులపై దృష్టి సారించాలన్నారు. కమిటీల నియామకం విషయంలో స్థానిక నాయకులంతా ఓ చోట చేరి ఏకగ్రీవంగా కమిటీలను ఎన్నుకుని అధ్యక్షురాలికి సహకరించాలన్నారు. అబద్ధాలు చెప్పలేకే ప్రతిపక్షంలో..: సీతారాం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీమంత్రి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ప్రతిపక్షం సమర్థవంతంగా పని చేయకుంటే ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తారని హెచ్చరిం చారు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేకే జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చిం దని.. నిజాయితీ అంటే ఇదేనన్నారు. పలువురు మంత్రులు జయలలితపై ఇచ్చిన తీర్పును ఉదహరిస్తూ దీనికి పదిరెట్లు ఎక్కువ శిక్ష జగన్‌కు పడుతుందని వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యం ఉంటే చంద్రబాబుపై ఉన్న పలు కేసులకు సంబంధించి తెచ్చుకున్న స్టేలను తొలగించుకుని విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. అప్పుడు ఎవరికి ఏ శిక్ష ఎంత పడుతుందో తెలుస్తుందన్నారు. చంద్రబాబు పరాన్నభుక్కు:కృష్ణదాస్ పార్టీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ అందరం కలిసి పార్టీని బలోపేతం చేద్దామని అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ స్వతహాగా అధికారంలోకి రాలేదని, తొలుత మామకు వెన్నుపోటు పొడిచి, రెండోసారి వాజ్‌పేయిని చూపించి అధికారంలోకి వచ్చారన్నారు. ఇప్పుడు మోడీ బొమ్మను చూపించి, అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. ప్రజల పక్షాన పోరాడదాం:రెడ్డి శాంతి పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి సూచనలు, సలహాలు చేయాలని కోరారు. పేదల పక్షాన పోరుడుతూ ప్రజల మధ్యన ఉందామని, మండలస్థాయికి వచ్చినప్పుడు తనకు సహకరించాలని కోరారు. ఈ నెలాఖరులోగా మండల కమిటీల నియామకం పూర్తి చేస్తామని చెబుతూ సభ్యులు ఎంతమంది ఉండాలన్నది నిర్దేశించారు. పార్టీని పటిష్టం చేసి జగన్మోహన్రెడ్డికి అండగా ఉండి, 2019 ఎన్నికల్లో ఆయన్ను ముఖ్యమంత్రిని చేద్దామన్నారు. త్యాగాలకు సిద్ధం కావాలి:పాలవలస పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం మాట్లాడుతూ త్యాగాలు చేయడానికి సిద్ధం కావాలన్నారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ హామీలకు విరుద్ధంగా చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. పాలకొండ శాసన సభ్యురాలు విశ్వసరాయి కళావతి మాట్లాడుతూ ప్రజల తరపున శాసనసభలో పోరాటం చేస్తామన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మట్లాడుతూ చంద్రబాబు సంతకానికి విలువ లేదని ఆయన పెట్టిన సంతకాలన్నీ కమిటీల నియామకాలపైనేనని ఎద్దేవా చేశారు. సమావేశానికి ముందు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమావేశంలో ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్షి, పార్టీ సమ్వయకర్తలు నర్తు రామారావు, జుత్తు జగన్నాయకులు, దువ్వాడ శ్రీనివాస్, గొర్లె కిరణ్‌కుమార్, ఇతర ముఖ్య నాయకులు పిరియా సాయిరాజ్, మీసాల నీలకంఠంనాయుడు, ధర్మాన పద్మప్రియ, వరుదు కల్యాణి, విజయనగరం జిల్లా నాయకులు బెల్లాన చంద్రశేఖర్, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి బి.ప్రసాద్ తదితరులుగా ప్రసంగించగా.. పాలవలస విక్రాంత్, అంధవరపు సూరిబాబు, ఎంవీ పద్మావతి, అంధవరపు వరహానర్సింహం, పాలవలస ఇందుమతి, దువ్వాడ శ్రీధర్, దువ్వాడ శ్రీకాంత్, చిట్టి జనార్ధన్, చల్లా అలివేలు మంగ, శిమ్మ రాజశేఖర్, కెఎల్ ప్రసాద్, మండవిల్లి రవి, కోణార్క్ శ్రీను, పేరాడ తిలక్, మూకళ్ల సుగుణ, మామిడి శ్రీకాంత్, గొండు కృష్ణ, రొక్కం సూర్యప్రకాశరావు, టి. కామేశ్వరి, బిడ్డిక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత ఇవ్వండి: సుజయకృష్ణ
వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు సుజయకృష్ణ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విష యం తక్షణమే తేల్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు సుజయకృష్ణ రంగారావు డిమాండ్ చేశారు. శాసనసభలో శుక్రవారం బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయించిన పద్దులపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఫీజు ఎవరు చెల్లిస్తారో తెలియక, తాము చెల్లించుకోలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని, మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. పాత బకాయిలతో కలిపి ఈ ఏడాది రూ.3900 కోట్లు అవసరమైతే రూ.2100 కోట్లే బడ్జెట్లో కేటాయించారని, దీంతో ఎవరికి రీయింబర్స్ చేస్తారో చెప్పాలని కోరారు. హైదరాబాద్‌లో చదువుతున్న 21 బీసీ కులాల విద్యార్థులను గుర్తించలేమంటూ టీ సర్కార్ జీవో నెం.3 జారీ చేసిందని, వీరిలో తూర్పు కాపులు, కొప్పుల వెలమలు ఉన్నారని, వీరికి ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ స్కూళ్ల టీచర్లకు సర్వీస్ రూల్స్ లేక జీపీఎఫ్ కూడా వర్తించడం లేదన్నారు. కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అంటున్న సర్కారు ప్రైవేటు స్కూళ్ల విద్యార్థుల ఫీజులపైనా స్పష్టత ఇవ్వాలన్నారు. అంగన్వాడీలకు వేతనం పెంచాలన్నారు. -
జలయజ్ఞం అక్రమాలపై విచారణ జరుపుతాం
హైదరాబాద్: రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. అలాగే జలయజ్ఞం అక్రమాలపై విచారణ జరుపుతామన్నారు. జలయజ్ఞంలో అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు విజయనగరం జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్‌లతోపాటు తోటపల్లి బ్యారేజ్ ఆయకట్టుపై సదరు మంత్రిని ప్రశ్నించారు. ఈ సందర్బంగా దేవినేని ఉమాపై విధంగా స్పందించారు. -
పరామర్శను రాజకీయం చేస్తారా?
విజయనగరం: చెన్నై భవన ప్రమాద భాదితులను వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించడాన్ని టీడీపీ రాజకీయం చేయడం శోచనీయమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణరంగారావు, రాజన్నదొర, పుష్పశ్రీవాణి అన్నారు. క్షతగాత్రులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సుశీల అనే బాధితురాలికి కేజీహెచ్‌లో వైద్యం నిరాకరించారని తెలిపారు. పార్టీ తరపును బాధితురాలికి వైద్యసాయం అందిస్తామని చెప్పారు. చెన్నై భవన ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురు కుటుంబాలకు ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా ఆర్థికసాయం అందించారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. -
టీడీపీ తీరు దారుణం
బొబ్బిలి:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బి ఫారం మీద గెలిచిన వారిని రకరకాల ప్రలోభాలకు గురి చేసి, వారిని తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు దురదృష్టకరమని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. బుధవారం ఆయన బొబ్బిలి కోటలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ సెంట్రల్ కార్యాల యం నుంచి అధికార ప్రతినిధులే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. వైఎస్సార్ సీపీకి విప్ జారీ చేసే అర్హత లేదని, ఎవరైనా పార్టీలోకి వచ్చేయవచ్చని బహిరంగంగా ప్రకటనలు ఇస్తున్నారన్నారు. తమ పార్టీలో ఉన్నవారంతా క్రమశిక్షణతో ఉండేవారని, ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. పార్టీని వదిలి వెళ్లరన్న నమ్మకం ఉందన్నారు. వైఎస్సార్ సీపీకి బలం ఉండ డం వల్లే మున్సిపల్ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్షు ల పదవులు దక్కించుకోవడానికి ప్రణాళికలు వేస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో విప్ జారీ చేస్తున్నామని తెలి పారు. సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ పార్టీ బలంగా లేకపోయినా టీడీపీ తామే అధికారంలో కి వచ్చేస్తామని చెప్పి, ప్రలోభాలకు గురి చేయడం ప్ర జాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. స్వ తంత్ర అభ్యర్థులు మద్దతు పలికితే వారిపై కోర్టుకు వెళ్తతామని చెప్పారు. పాచిపెంట, మక్కువ మండలాల్లో టీడీపీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరో పించారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వారు చేస్తున్న తీరు బాధాకరంగా ఉందన్నారు. సాలూరు మున్సిపాలిటీలో తాము అధికారంలో కి వచ్చేంత బలం లేకపోవడంతో స్తబ్ధతగా ఉన్నామని చెప్పారు. గురువారం జరిగే ఎన్నికల్లో తమ కౌన్సిలర్లు తట స్టతంగా ఉండేందుకు విప్ జారీ చేస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడు తూ వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో విప్ జారీ చేస్తున్నామన్నా రు. మండలాలకు సంబంధించి ఒక ఎంపీటీసీకి, జెడ్పీ కి సంబంధించి ఒక జెడ్పీటీసీకి విప్ జారీ చేసే అధికారాన్ని ఇస్తున్నామని తెలిపారు. తక్కువ మంది సభ్యులున్న దగ్గర క్రమశిక్షణ అమలయ్యేలా చూస్తామన్నా రు. జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ వైఎస్సార్ సీపీకి విప్ జారీ చేసే అవకాశం ఉందని ప్రకటిస్తుంటే టీడీపీ మాత్రం విప్ లేదంటూ అసత్య ప్రచారం చేస్తుందన్నారు. విప్ ను ధిక్కరిస్తే అనర్హత వేటు పడుతుందన్న విషయాన్ని పార్టీ గుర్తుపై ఎన్నికైన వారు గుర్తించాలని సూచిం చా రు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జి జమ్మాన ప్రసన్నకుమార్, విజ యనగరం మాజీ కౌన్సిలర్ ఆశపు వేణు ఉన్నారు. -
మృతదేహాలను త్వరగా తరలించాలి:ఎమ్మెల్యే రంగారావు
విజయనగరం: చెన్నైలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణరంగారావు పరామర్శించారు. ఈ ఘటనలో విజయనగరం జిల్లా కార్మికులే ఎక్కువ మంది మృతి చెందారు. దర్టీరాజేరు మండలం కృష్ణాపురం గ్రామం, మక్కువ మండలం సూరిమామిడి గ్రామాల్లో మృతుల కుటుంబాల వారు ఉన్నారు. వారిని పరామర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మృతదేహాలను త్వరగా సొంత గ్రామాలకు చేర్చాలని కోరారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించాలని రంగారావు కోరారు. ఇదిలా ఉండగా, మృతుల కుటుంబాలను మంత్రి మృణాళిని కూడా పరామర్శించారు. మృతులు ఒక్కొక్కరికి ప్రభుత్వం 5లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. -
వీరబొబ్బిలి ప్రత్యేకతను నిలిపిన సోదరులు
బొబ్బిలి అంటేనే పౌరుషానికి ప్రతీక. పరువు కోసం, తమ వారి కోసం బొబ్బలిరాజులు ప్రాణాలు కూడా లెక్క చేయరు. బొబ్బలి రాజులకు ప్రజలంటే ప్రాణం. వారి కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఆ తెగింపే వారిని ఉత్తరాంధ్రలో కింగ్‌లుగా నిలబెట్టింది. ప్రజలకు సేవ చేయడమే బొబ్బలి రాజులు పరమ ప్రసాదంగా భావిస్తారు. అందుకే ప్రజలు కూడా వారంటే ప్రాణంగా ఉంటారు. ప్రస్తుతం ఈ బొబ్బిలి వారసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయే ఘట్టాలను, తర తరాలకు గుర్తుండిపోయే సంఘటనలను అందించిన ఘనకీర్తి బొబ్బిలిది. సంస్ధానాల కాలం నుంచే ఈ ప్రాంతం ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచింది. బొబ్బిలి సంస్ధానంలో 13 మంది సంస్ధానాధీశులు పట్టాభిషికేం ద్వారా పాలించారు. ఆర్‌ఎస్‌ఆర్‌కే రంగారావు పట్టాభిషేకం సమయానికి సంస్ధానాలు పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో ఈ సంస్ధాన వారసుడు రంగారావు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి చిన్న వయస్సులోనే ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ రాజకీయ వారసత్వంతో పాటు సేవాభావాన్ని అలవర్చుకున్న రంగారావు మనమళ్లు ఉత్తరాంధ్రాలో వైఎస్ఆర్ సిపిలో కీలక నేతలుగా ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచారు. ఆ పార్టీ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు బొబ్బిలి శాసనసభ స్థానం నుంచి, ఆయన సోదరుడు బేబీ నాయన విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ప్రజలతో మమేకమై ప్రచారంలో దూసుకుపోయారు. ప్రజాసేవ కోసం రాజకీయాలే వేదిక కానవసరం లేదని దశాబ్దం క్రితమే తమ సంస్ధానం పరిధిలో సేవకార్యక్రమాల ద్వారా నిరూపించి గొప్ప మానవతావాదులుగా రంగారావు సోదరులు పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందించిన స్ఫూర్తితో రాజకీయ రంగప్రవేశం చేసి సుజయ కృష్ణ రంగారావు బొబ్బిలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక ఆయన సోదరుడు బేబీనాయన బొబ్బిలి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికవడంతో పాటు తన సేవాకార్యక్రమాలు మరింతగా విస్తరించారు. రాజకీయాలకు, బొబ్బిలికి విడదీయరాని బంధం ఉంది. ఐదువందల పైచిలుకు స్వతంత్ర భారత సంస్ధానాల్లో వీర బొబ్బిలికి ప్రత్యేక స్ధానం ఉంది. పౌరుషాల పురిటిగడ్డగా విజయనగరం జిల్లా ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింపజేసిన బొబ్బిలి సంస్ధానం వారసులు రాచరికాలు పోయిన తర్వాత, ప్రజా ప్రభుత్వాల్లోనూ భాగస్వామ్యులవుతూ ప్రజాస్వామ్యాన్ని రాజమందిరాల నుంచి పేద లోగిళల్లోకి తీసుకెళ్లడం ద్వారా బొబ్బిలి రాజు మనవాడు అనిపించుకున్న నిజమైన జన నేతలుగా ఎదిగారు. కష్టంలో ఉన్నవారికెవరికైనా అడక్కుండానే సాయం చేసే గొప్ప మనస్సుతో దాతృత్వంలోనూ తమకు తామే సాటి అనిపించుకున్నారు. అర్ధరాత్రైనా ఆపదలో ఉన్నవారెవరైనా తమ గడప తొక్కితే వెంటనే స్పందించే గుణం వారిది. ప్రజలకు ఇరవై నాలుగు గంటలూ మూతపడని కోట తలుపులు సాదరంగా ఆహ్వానిస్తూనే ఉంటాయి. తమ సంస్ధానంలో ప్రజలు మంచినీటి కోసం అలమటిస్తున్నారన్న వాస్తవాన్ని గ్రహించిన బొబ్బిలి రాజులు వారికి ఏ పదవీ లేకపోయినా, వారు రాజకీయాల్లో లేకున్నా దశాబ్ధం క్రితమే వందలాది గ్రామాల్లో బోర్లు తవ్వించారు. ప్రజల దాహార్తిని తీర్చారు. సుజయ్ కృష్ణ రంగారావు, బేబీనాయన సోదరులు సేవాగుణంలో మారాజులనిపించుకున్న ఉదార స్వభావులు. 2004లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన స్ఫూర్తితో సుజయ్ కృష్ణరంగారావు రాజకీయ ఆరంగ్రేటం చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో తాము చేపట్టిన కార్యక్రమాలను నియోజకవర్గం అంతటికీ విస్తరించారు. మరోవైపు ఆయన సోదరుడు బేబీనాయన సైతం అన్న బాటలోనే బొబ్బిలి మునిసిపల్ చైర్మన్‌గా ఎన్నికవడంతో పాటు పట్టణానికి కొత్త దిశను తీసుకొచ్చారు. అయితే ఆ మహానేత మరణం తర్వాత దివంగత నేత పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడాన్ని తీవ్రంగా నిరసించిన సుజయ్ కృష్ణ రంగారావు తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు సోదరుడు బేబీనాయన, బొబ్బిలి నియోజకర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పూర్తిగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జగన్మోహన్ రెడ్డితో కలిసి రాజన్న రాజ్యం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే జరిగిన పంచాయితీ, సహకార సంఘాల ఎన్నికల్లోనూ పార్టీ బలపరిచిన మెజార్టీ స్ధానాల్లో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కూడా గెలుపు తమదేనని రంగారావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీదే విజయం
పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్ బొబ్బిలి, రానున్న సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఘన విజయం సాధిస్తుందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని, అందుకు అనుగుణంగా మున్సిపల్ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు అన్నారు. ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బొబ్బిలి 26వ వార్డులోని తాండ్ర పాపారాయ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూలులో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో అధిక శాతం స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. విజయనగరం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను చేజిక్కించుకుంటామన్నారు. -
టీడీపీ అసమర్థత వల్లే బొత్స అవినీతి
బొబ్బిలి, న్యూస్‌లైన్ :టీడీపీ అసమర్థత వల్లే జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయ ణ అవినీతి, అక్రమాలు పెరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు అన్నారు. అక్రమాలపై బొత్సను నిలదీయడంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. అందువల్లే బొత్స అవినీ తి, అక్రమాలకు అడ్డూ అదుపులేకుండాపోరుుందని చెప్పారు. గురువారం ఆయన బొబ్బి లి కోటలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు వచ్చిన చంద్రబాబు బొత్స అవినీతిపై అనేక వాస్తవాలు మాట్లాడారని, అయితే ఆయన అవి నీతి పెరగడానికి టీడీపీ వైఖరే కారణ మన్నారు. 2004లో బొత్స మంత్రి అయిన దగ్గర నుంచి జరుగుతున్న తప్పిదాలను, అక్రమాలను ప్రజల తరఫున టీడీపీ ఎంతవరకూ పోరాటం చేసిందని ప్రశ్నించారు. బొత్సకు బుద్ధి చెప్పడానికి జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అందుకు కారణమైన టీడీపీని కూడా క్షమించరని చెప్పారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు పారిశ్రామికంగా వెనుకబడ్డాయన్నారు. బొబ్బిలి గ్రోత్‌సెంటరులో చంద్రబాబు హయాంలోని ఏ ఒక్క పరిశ్రమ కూడా స్థాపించలేదని తెలిపారు. విజయనగరం జిల్లాను మోడల్ జిల్లాగా తీర్చిదిద్దుతామంటున్న బాబు తొమ్మిదేళ్లలో ఏమి చేశారని ప్రశ్నించారు. తోటపల్లి, జంఝావతి, పెద్దగెడ్డ, తారకరామతీర్థసాగర్ జలాశయాలు గురించి ఆయన ఏనాడూ పట్టించుకోలేదన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత పరిశ్రమలు సంఖ్య పెరిగిందన్నారు. వైఎస్ తన హయాంలో జలయజ్ఙం పేరుతో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి, రైతులకు సాగునీరు అందించారన్నారు. ప్రజలంతా వైఎస్సార్ సీపీ వెంటే ఉన్నారని చెప్పారు. ఆయనతో పాటు రిటైర్డు ఉద్యోగుల సంఘం నాయకుడు రౌతు రామ్మూర్తి , తదితరులు ఉన్నారు. -
'రానున్న ఎన్నికల్లో బొత్స కుటుంబం భూస్థాపితం'
విజయనగరం: రానున్న ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కుటుంబాన్ని భూస్థాపితం చేయడం ద్వారా అరాచక రాజకీయాలకు స్వస్తి చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. బొబ్బిలి దర్బార్ మహాల్లో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం బుధవారం జరిగింది, ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయకృష్ణరంగారావు, జిల్లా కన్వీనర్ పెన్మత్స సాంబశివరాజు, బేబినయనలు హాజరయ్యారు. ఈ సందర్బంగా సుజయకృష్ణరంగారావు మాట్లాడుతూ.. బొబ్బిలిలో మేమిచ్చిన మెజార్టీతోనే బొత్స కుటుంబం రెండు సార్లు ఎంపీ పదవి పొందారు అని అన్నారు. ఈసారి ఎన్నికల్లో అదే మెజార్టీని వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం ద్వారా బొత్సను రాజకీయ సన్యాసం చేయిద్దాం అని పిలుపునిచ్చారు. మేం రాజకీయాల్లో ఉన్నంతకాలం రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం. భవిష్యత్ లో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే కొనసాగుతాం అని నేతలు స్పష్టం చేశారు. రానున్న బొబ్బిలి యుద్ధంలో విజయం మాదే బేబినయన ధీమా వ్యక్తం చేశారు. -
ప్రణాళిక ప్రకారమే దుష్ర్పచారం
బొబ్బిలి, న్యూస్‌లైన్: దేశంలో మొట్టమొదటి సారిగా తక్కువ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదిగిందని, ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుని తిరుగులేని శక్తిగా మారుతోందని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు అన్నారు. మరో పార్టీని బలపరి చే విధంగా, ప్రజల్లో ఆయోమయాన్ని సృష్టించడానికి ఆంధ్రజ్యోతి పత్రిక ప్రణాళిక ప్రకారం తప్పుడు కథనాలను ప్రచురిస్తోం దని చెప్పారు. తనపై తప్పుడు వార్తలను ప్రచురిస్తుండడాన్ని ఆయన ఖండించారు. బొబ్బిలి కోటలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గడచిన అయిదారు రోజులుగా ముఖ్యనేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీని వీడుతున్నట్లు ఆ పత్రిక ప్రచారం చేస్తుండ డం దురదృష్టకరమన్నారు. ప్రచారం చేసే ముందు ఆ నాయకుల అనుమతి, ఆలోచన తెలుసుకుని కథనాలు రాయాల్సి ఉన్నా సంబంధం లేని అంశాలతో మరో పార్టీకి లబ్ధి చేకూర్చడానికే ఇటువంటివి చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ కొంత మందిని ప్రణాళిక ప్రకారం వైఎస్ఆర్సీపీలోకి పంపించి కీలక సమయాల్లో వాళ్లచేత పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేయిస్తోందని ఆరోపించారు. అటువంటి వారిని పార్టీ ఏరివేసి త్వరలో బయటకు పంపించడం ఖాయమన్నారు. ఇటీవల రాష్ట్రంలో పలువురు నాయకులపై ఆంధ్రజ్యోతి వ్యతిరేకకథనాలు రాయడం, వారు వాటిని ఖండిస్తున్నా ఇంకా అటువంటివి రాస్తుండడం దురదృష్టకరమన్నారు. తాను ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ముఖ్యమైన పనులు నిర్వహిస్తున్నానన్నారు. పార్టీలో జరిగే అనేక అంశాలపై అధినేత జగన్మోహన్రెడ్డి తన సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారన్నారు. ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో జగన్మోహనరెడ్డికి తెలుసని చెప్పారు. జగన్మోహన్రెడ్డిపై అచంచల విశ్వాసం ఉన్నందునే ఆయన జైలులో ఉన్నా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరారన్నారు. గత ఉప ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించి ప్రజల విశ్వాసాన్ని సంపాదించామన్నారు. అంతకంటే మెరుగైన ఫలితాలు రానున్న రోజుల్లో వస్తాయన్నారు. ప్రజలు కోరుకునే నాయకులనే అభ్యర్థులుగా పెట్టి రాష్ర్టంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అధిక సంఖ్యలో ఎంపీ స్థానాలు కూడా గెలుచుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేస్తామన్నారు. రాజకీయ నాటకాలు మానాలి జగన్మోహన్రెడ్డి తీసుకున్న సమైక్య నిర్ణయం వల్ల తెలంగాణలోని కొంత మంది పార్టీ అభిమానులు మనస్తాపం చెందినా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడే చివరకు ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ సీమాంధ్రలో వైఎస్ఆర్సీపీ నిర్ణయానికి మద్దతు ఇవ్వడం, తెలంగాణలో చర్చను అడ్డుకోవడం వంటి రెండు కళ్ల సిద్ధాంతాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. విభజన అంశంపై వైఎస్ఆర్సీపీకి చాలా స్పష్టత ఉందన్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పటినుంచి పార్టీ వ్యవహరిస్తున్న తీరును అందరూ తప్పుబట్టారని, చివరకు వైఎస్ఆర్సీపీ బాటలోనే సీఎం కూడా నడిచారన్నారు. అసెంబ్లీలో ఓటింగ్ జరగకుండా కాంగ్రెస్ పార్టీ వ్యూహాం పన్నిందన్నారు. రాజకీయ నాటకాలు మానకపోతే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
'బాబుకు.. ప్రజలే ఎన్నికల్లో బుద్ధి చెబుతారు'
విజయనగరం: రెండు కళ్ల సిద్దాంతాన్ని నమ్ముకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వైఎస్ఆర్ సీపీ నేత సుజయ్‌కృష్ణరంగారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయనగరం జిల్లాలోని మక్కువలో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య శంఖారావం సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెన్మత్స, సుజయకృష్ణరంగారావు, రాజన్నదొరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నేత సుజయ్‌కృష్ణరంగారావు మాట్లాడుతూ.. ఓట్లు, సీట్ల కోసం రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలని కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు. ఈ సమైక్య శంఖారావం కార్యక్రమానికి గిరిజనులు భారీగా తరలివచ్చారు. -
సమైక్యాంధ్రే లక్ష్యం
చుక్కవలస (తెర్లాం రూరల్), న్యూస్‌లైన్ : రాష్ట్రంలో సమైక్యాంధ్ర కోసం మొదటి నుంచీ పోరాటం చేస్తున్నది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని సమైక్య ంగా ఉంచే వరకూ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన తెర్లాంలోని చుక్కవలస గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. సమైక్యాంధ్రపై కాంగ్రెస్, టీడీపీలకు చిత్తశుద్ధి లేదన్నారు. విభజనపై టీడీపీ రెండు ప్రాంతాల్లో రెండు రకాలుగా మా ట్లాడుతుందని, ఆ పార్టీకి విభజనపై స్పష్టమైన వైఖరి లేదని విమర్శించారు. విభజనకు కారణం కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పార్లమెంట్లో బిల్లు ఓటమి చెందడం ఖాయమన్నారు. పార్లమెం ట్, అసెంబ్లీలో విభజన బిల్లుపై తీర్మానం చేసినా, తమ పార్టీ కోర్టు ద్వారానైనా అడ్డుకుంటుందన్నారు. అసెంబ్లీలో విభజనపై చర్చ జరగకుండా, కేవలం విభజనను ఆపేందుకు తీర్మానం చేయాలని, అందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. సీమాంధ్ర జిల్లాల్లోని చాలా పార్టీల నాయకులు వైఎస్సార్ సీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అరుుతే ప్రజల్లో మంచిపేరు, గుర్తింపు ఉన్న నాయకులనే పార్టీలో చేర్చుకుంటామన్నారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా మని తెలిపారు. ఆయనతో పాటు లోచర్ల మా జీ సర్పంచ్ మర్రాపు జగన్నాథం, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తెంటు సత్యంనాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు నర్సుపల్లి వెంకటేశ్వరరావు ఉన్నారు. -
'పార్టీలోకి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు'
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేత సుజయకృష్ణ రంగారావు తెలిపారు. కానీపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసి కొందరినే స్వాగతిస్తున్నారన్నారు. సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర వైఎస్సార్ సీపీలో చేరిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాజన్న దొరకు ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నందునే పార్టీలో చేర్చుకున్నారన్నారు. విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే పి. రాజన్నదొర ఆదివారం కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో రాజన్నదొర తన అనుచరులతో పాటు వచ్చి పార్టీలో చేరారు. రాజన్నదొరతో పాటు సాలూరు మునిసిపాలిటీ మాజీ ఛైర్మన్ ఈశ్వరరావు, 26 మంది సర్పంచులు, ఐదుగురు మాజీ కౌన్సిలర్లు, 8 మంది మాజీ సర్పంచులు, ఇద్దరు పీఏసీఎస్ అధ్యక్షులు, ఇద్దరు మాజీ ఎంపీటీసీ సభ్యులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
'విభజనకు బొత్సనే కారణమని నమ్ముతున్నారు'
విజయనగరం : విజయనగరంలో న్యాయవాదుల అరెస్ట్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సుజయకృష్ణ రంగారావు ఖండించారు. ఓ వైపు పట్టణంలో 30 యాక్ట్‌ను అమలు చేస్తూ... ఇంకా కర్ఫ్యూ వాతావరణం కొనసాగించటం సరికాదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణే కారణమని నమ్మటం వల్లే విజయనగరంలో ఆందోళనలు జరిగాయన్నారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్ఆర్ సీపీ పోరాటం చేస్తోందని సుజయకృష్ణ రంగారావు అన్నారు. నల్గొండ జిల్లాలో విజయమ్మ పర్యటనను అడ్డుకోవటాన్ని ఆయన ఖండించారు. కాగా సమైక్యాంధ్రకు మద్దతుగా విజయనగరంలో న్యాయవాదులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అయితే పట్టణంలో 30 యాక్ట్ అమలులో ఉందని, ఆ నేపథ్యంలో అనుమతి లేదంటూ పోలీసులు న్యాయవాదుల ర్యాలీని అడ్డుకున్నారు. దాంతో న్యాయవాదులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో న్యాయవాదులను అదుపులోకి తీసుకున్నారు. -
సీఎం కిరణ్ వ్యాఖ్యలు దురదృష్టకరం: సుజయకృష్ణ రంగారావు
విజయనగరం: తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతాల్లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. సీమాంధ్ర ప్రాంతాల్లో నిరసనలు, ధర్మాలు, ర్యాలీలతో సమైక్య పోరు రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తెలంగాణ విభజనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కారణమంటూ సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలు దురదృషకరమని వైఎస్ఆర్సీపీ నేత సుజయకృష్ణ రంగారావు చెప్పారు. ప్రజాందోళనకు భయపడి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారని ఆయన దుయ్యపట్టారు. మన మధ్యలో లేని వ్యక్తిపై ఆరోపణలు చేయడం సరికాదని సుజయకృష్ణ రంగారావు చెప్పారు. ఈ విభజనకు ప్రధాన ప్రతిపక్ష నేతే కారణమన్నారు. చిత్తశుద్ది ఉంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ రాజీనామాలు స్పీకర్‌కు సమర్పించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీని ప్రజల నుంచి దూరం చేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే వైఎస్‌పై ఆరోపణలని చెప్పారు. ఆంటోని కమిటీ సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికి ఏర్పాటు చేసిన కంటి తుడుపు చర్య మాత్రమేనని సుజయకృష్ణ రంగారావు పేర్కొన్నారు.