టీడీపీ అసమర్థత వల్లే బొత్స అవినీతి
బొబ్బిలి, న్యూస్‌లైన్ :టీడీపీ అసమర్థత వల్లే జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయ ణ అవినీతి, అక్రమాలు పెరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్‌వీ సుజయకృష్ణ రంగారావు అన్నారు. అక్రమాలపై బొత్సను నిలదీయడంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. అందువల్లే బొత్స అవినీ తి, అక్రమాలకు అడ్డూ అదుపులేకుండాపోరుుందని చెప్పారు. గురువారం ఆయన బొబ్బి లి కోటలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు వచ్చిన చంద్రబాబు బొత్స అవినీతిపై అనేక వాస్తవాలు మాట్లాడారని, అయితే ఆయన అవి నీతి పెరగడానికి టీడీపీ వైఖరే కారణ మన్నారు. 2004లో బొత్స మంత్రి అయిన దగ్గర నుంచి జరుగుతున్న తప్పిదాలను, అక్రమాలను ప్రజల తరఫున టీడీపీ ఎంతవరకూ పోరాటం చేసిందని ప్రశ్నించారు.
బొత్సకు బుద్ధి చెప్పడానికి జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అందుకు కారణమైన టీడీపీని కూడా క్షమించరని చెప్పారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు పారిశ్రామికంగా వెనుకబడ్డాయన్నారు. బొబ్బిలి గ్రోత్‌సెంటరులో చంద్రబాబు హయాంలోని ఏ ఒక్క పరిశ్రమ కూడా స్థాపించలేదని తెలిపారు. విజయనగరం జిల్లాను మోడల్ జిల్లాగా తీర్చిదిద్దుతామంటున్న బాబు తొమ్మిదేళ్లలో ఏమి చేశారని ప్రశ్నించారు. తోటపల్లి, జంఝావతి, పెద్దగెడ్డ, తారకరామతీర్థసాగర్ జలాశయాలు గురించి ఆయన ఏనాడూ పట్టించుకోలేదన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత పరిశ్రమలు సంఖ్య పెరిగిందన్నారు. వైఎస్ తన హయాంలో జలయజ్ఙం పేరుతో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి, రైతులకు సాగునీరు అందించారన్నారు. ప్రజలంతా వైఎస్సార్ సీపీ వెంటే ఉన్నారని చెప్పారు. ఆయనతో పాటు రిటైర్డు ఉద్యోగుల సంఘం నాయకుడు రౌతు రామ్మూర్తి , తదితరులు ఉన్నారు.