సుజయ కృష్ణ రంగారావు-బేబీ నాయన
బొబ్బిలి అంటేనే పౌరుషానికి ప్రతీక. పరువు కోసం, తమ వారి కోసం బొబ్బలిరాజులు ప్రాణాలు కూడా లెక్క చేయరు. బొబ్బలి రాజులకు ప్రజలంటే ప్రాణం. వారి కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఆ తెగింపే వారిని ఉత్తరాంధ్రలో కింగ్‌లుగా నిలబెట్టింది. ప్రజలకు సేవ చేయడమే బొబ్బలి రాజులు పరమ ప్రసాదంగా భావిస్తారు. అందుకే ప్రజలు కూడా వారంటే ప్రాణంగా ఉంటారు. ప్రస్తుతం ఈ బొబ్బిలి వారసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.
చరిత్రలో నిలిచిపోయే ఘట్టాలను, తర తరాలకు గుర్తుండిపోయే సంఘటనలను అందించిన ఘనకీర్తి బొబ్బిలిది. సంస్ధానాల కాలం నుంచే ఈ ప్రాంతం ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచింది. బొబ్బిలి సంస్ధానంలో 13 మంది సంస్ధానాధీశులు పట్టాభిషికేం ద్వారా పాలించారు. ఆర్ఎస్ఆర్కే రంగారావు పట్టాభిషేకం సమయానికి సంస్ధానాలు పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో ఈ సంస్ధాన వారసుడు రంగారావు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి చిన్న వయస్సులోనే ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ రాజకీయ వారసత్వంతో పాటు సేవాభావాన్ని అలవర్చుకున్న రంగారావు మనమళ్లు ఉత్తరాంధ్రాలో వైఎస్ఆర్ సిపిలో కీలక నేతలుగా ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచారు. ఆ పార్టీ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు బొబ్బిలి శాసనసభ స్థానం నుంచి, ఆయన సోదరుడు బేబీ నాయన విజయనగరం లోక్సభ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ప్రజలతో మమేకమై ప్రచారంలో దూసుకుపోయారు.
ప్రజాసేవ కోసం రాజకీయాలే వేదిక కానవసరం లేదని దశాబ్దం క్రితమే తమ సంస్ధానం పరిధిలో సేవకార్యక్రమాల ద్వారా నిరూపించి గొప్ప మానవతావాదులుగా రంగారావు సోదరులు పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందించిన స్ఫూర్తితో రాజకీయ రంగప్రవేశం చేసి సుజయ కృష్ణ రంగారావు బొబ్బిలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక ఆయన సోదరుడు బేబీనాయన బొబ్బిలి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికవడంతో పాటు తన సేవాకార్యక్రమాలు మరింతగా విస్తరించారు.
రాజకీయాలకు, బొబ్బిలికి విడదీయరాని బంధం ఉంది. ఐదువందల పైచిలుకు స్వతంత్ర భారత సంస్ధానాల్లో వీర బొబ్బిలికి ప్రత్యేక స్ధానం ఉంది. పౌరుషాల పురిటిగడ్డగా విజయనగరం జిల్లా ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింపజేసిన బొబ్బిలి సంస్ధానం వారసులు రాచరికాలు పోయిన తర్వాత, ప్రజా ప్రభుత్వాల్లోనూ భాగస్వామ్యులవుతూ ప్రజాస్వామ్యాన్ని రాజమందిరాల నుంచి పేద లోగిళల్లోకి తీసుకెళ్లడం ద్వారా బొబ్బిలి రాజు మనవాడు అనిపించుకున్న నిజమైన జన నేతలుగా ఎదిగారు.
కష్టంలో ఉన్నవారికెవరికైనా అడక్కుండానే సాయం చేసే గొప్ప మనస్సుతో దాతృత్వంలోనూ తమకు తామే సాటి అనిపించుకున్నారు. అర్ధరాత్రైనా ఆపదలో ఉన్నవారెవరైనా తమ గడప తొక్కితే వెంటనే స్పందించే గుణం వారిది. ప్రజలకు ఇరవై నాలుగు గంటలూ మూతపడని కోట తలుపులు సాదరంగా ఆహ్వానిస్తూనే ఉంటాయి. తమ సంస్ధానంలో ప్రజలు మంచినీటి కోసం అలమటిస్తున్నారన్న వాస్తవాన్ని గ్రహించిన బొబ్బిలి రాజులు వారికి ఏ పదవీ లేకపోయినా, వారు రాజకీయాల్లో లేకున్నా దశాబ్ధం క్రితమే వందలాది గ్రామాల్లో బోర్లు తవ్వించారు. ప్రజల దాహార్తిని తీర్చారు. సుజయ్ కృష్ణ రంగారావు, బేబీనాయన సోదరులు సేవాగుణంలో మారాజులనిపించుకున్న ఉదార స్వభావులు.
2004లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన స్ఫూర్తితో సుజయ్ కృష్ణరంగారావు రాజకీయ ఆరంగ్రేటం చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో తాము చేపట్టిన కార్యక్రమాలను నియోజకవర్గం అంతటికీ విస్తరించారు. మరోవైపు ఆయన సోదరుడు బేబీనాయన సైతం అన్న బాటలోనే బొబ్బిలి మునిసిపల్ చైర్మన్గా ఎన్నికవడంతో పాటు పట్టణానికి కొత్త దిశను తీసుకొచ్చారు. అయితే ఆ మహానేత మరణం తర్వాత దివంగత నేత పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడాన్ని తీవ్రంగా నిరసించిన సుజయ్ కృష్ణ రంగారావు తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు సోదరుడు బేబీనాయన, బొబ్బిలి నియోజకర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పూర్తిగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జగన్మోహన్ రెడ్డితో కలిసి రాజన్న రాజ్యం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే జరిగిన పంచాయితీ, సహకార సంఘాల ఎన్నికల్లోనూ పార్టీ బలపరిచిన మెజార్టీ స్ధానాల్లో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కూడా గెలుపు తమదేనని రంగారావు ధీమా వ్యక్తం చేస్తున్నారు.