'పార్టీలోకి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు' | somany mla's to join ysrcp, says sujaya krishna ranga rao | Sakshi
Sakshi News home page

'పార్టీలోకి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు'

Published Sun, Dec 22 2013 6:47 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

somany mla's to join ysrcp, says sujaya krishna ranga rao

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేత సుజయకృష్ణ రంగారావు తెలిపారు. కానీపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసి కొందరినే స్వాగతిస్తున్నారన్నారు. సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర వైఎస్సార్ సీపీలో చేరిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాజన్న దొరకు ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నందునే పార్టీలో చేర్చుకున్నారన్నారు.

 

విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే పి. రాజన్నదొర ఆదివారం కాంగ్రెస్‌ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో రాజన్నదొర తన అనుచరులతో పాటు వచ్చి పార్టీలో చేరారు. రాజన్నదొరతో పాటు సాలూరు మునిసిపాలిటీ మాజీ ఛైర్మన్ ఈశ్వరరావు, 26 మంది సర్పంచులు, ఐదుగురు మాజీ కౌన్సిలర్లు, 8 మంది మాజీ సర్పంచులు, ఇద్దరు పీఏసీఎస్ అధ్యక్షులు, ఇద్దరు మాజీ ఎంపీటీసీ సభ్యులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement