బాధితుల తరఫున పోరాటం
రామభద్రపురం : ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు ఆదేశించారు. శు క్ర వారం ఆయన మండల పరిషత్ కార్యాలయం లో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసా యానికి అనుసంధానం చేసినట్లుయితే పార్వతీపురం డివిజన్‌లో వేలాది మంది రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇప్పటివరకు మండలంలో ఎందుకు ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయలేదని ఏపీఓ సత్యవతిని ప్రశ్నించారు. అలాగే ఇటీవల వచ్చిన తుపానుకు చాలాచోట్ల విద్యుత్ స్తంభా లు నేలకొరిగినా.. ఇప్పటికీ వాటిని సరి చేయకపోవడంతో ఎలక్ట్రికల్ సబ్ ఇంజినీర్ సతీష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వీడాలని సూ చించారు. ఎంఈఓ పెంటయ్య పర్యవేక్షణ లోపం వల్ల చాలా పాఠశాలల్లో వసతుల లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఇళ్లకు నిధులు ఎప్పుడు మంజూరవుతాయని హౌసిం గ్ ఏఈ వేణును ప్రశ్నించారు. అలాగే తుపానుకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారంపై ప్రభుత్వానికి నివేదికలు అందించాలని ఏఓ ప్రసాద్‌ను ఆదేశించారు. పట్టాదారు పాసు పుస్తకాల జారీలో జాప్యం లేకుండా చూడాలని తహశీల్దార్ అప్పారావుకు సూచించారు. ఈ సమావేశంలో ఎంపీపీ అప్పికొండ శ్రీరాములునాయు డు, జెడ్పీటీసీ సభ్యుడు బోయిన లూర్దమ్మ, ఎంపీడీఓ చంద్రమ్మ, తదితరులు పాల్గొన్నారు.
వికలాంగుల ఎస్కార్ట్ కోసం అసెంబ్లీలో పోరాడుతాం
ప్రత్యేక అవసరాల పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్కార్ట్ అలవెన్సు ఆపడం సరికాదని, దీనిపై అసెంబ్లీలో పోరాటం చేస్తామని ఎమ్మెల్యే సుజ య్ తెలిపారు. శుక్రవారం భవిత భవనంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు ప్రభుత్వం ప్రతి నెలా వికలాంగులకు వంద రుపాయలు ఎస్కార్ట్ అల వెన్సు మంజూరు చేసేదన్నారు. కానీ ఈ ఏడాది నుంచి ప్రభుత్వం ఎస్కార్ట్ అలవెన్సు ఇవ్వడం లేదన్నారు. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నట్టు చెప్పారు. అలాగే తమ పార్టీ ద్వారా వికలాంగులకు ఆర్థిక సా యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలి పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు బోయిన లూర్దమ్మ, ఎంపీటీసీ మడక తిరుపతినాయుడు, తదితరులు పాల్గొన్నారు.