Ramabhadrapuram
-
ఇద్దరితో వివాహేతర సంబంధం.. ఫోన్ చేస్తే స్విచాఫ్..
రామభద్రపురం: మండలంలోని ముచ్చర్లవలసలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన వివాహిత దాలి రమణమ్మ కేసులో వివాహేతర సంబంధం కారణంగా ఆమె హత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నెల 10 వ తేదీన అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆమె తల వెనుక భాగంలో బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో కింద పడి ఉంది. దీంతో కుటుంబసభ్యులు బాడంగి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. హతురాలి తల్లి బంటు చిన్నమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ శోభన్‌బాబు ఆధ్వర్యంలో ఎస్సై కృష్ణమూర్తి బృందం దర్యాప్తు చేసి అన్నికోణాల్లో విచారణ చేసింది. ఈ విచారణలో వివాహేతర సంబంధమే రమణమ్మ హత్యకు కారణమని తేల్చారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ శోభన్‌బాబు మాట్లాడుతూ దాలి రమణమ్మ(35)కు అదే గ్రామానికి చెందిన నడగాన రమణతో కొన్నేళ్ల నుంచి వివాహేతర సంబంధంఉంది. అలాగే అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంది. మొదటి ప్రియుడు రమణ సారా వ్యాపారి. నిందితుడి అరెస్టు చూపించి వివరాలు వెల్లడిస్తున్న సీఐ శోభన్‌బాబు చదవండి: (తనకెవ్వరూ సాటిరారని నిరూపించాడు.. దానిని తట్టుకోలేకే చంపేశారా?) ఈ నెల 10వ తేదీన రాత్రి ప్రియురాలు రమణమ్మకు రాత్రి 9 గంటల తర్వాత ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. దీంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆమె ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. ఆ సమయంలో టీవీ ఆన్‌చేసి పెద్ద సౌండ్‌లో ఉంది. ఇంటి పక్కన నుంచి ఎవరో వ్యక్తి పారిపోయినట్లు అనుమానం వచ్చి ఎవరు వెళ్లిపోతున్నారు? ఎందుకు మరో వ్యక్తిని ఇంట్లోకి రానిచ్చావంటూ రమ్మణమ్మతో గొడవ పడి గట్టిగా కొట్టి కాలితో బలంగా తన్నాడు. దీంతో ఆమె తల తలుపు, ద్వారం మధ్యలో ఉన్న కోనును తగిలి కింద పడిపోయింది. 11వ తేదీన బంధువులు ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందింది. రమణమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న నిందితుడు పరారయ్యాడు. వీఆర్ఓ ఎదుట లొంగిపోయిన నిందితుడు డాగ్స్వాడ్, క్లూస్‌టీంతో పరిశీలించగా డాగ్ సరిగ్గా నిందితుడు రమణ ఇంటి దగ్గరకు వెళ్లి ఆగింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తుండగా ఆ గ్రామ వీఆర్వో ఆనందరావు వద్ద మంగళవారం లొంగిపోయాడు. దీంతో నిందితుడిని పోలీసులకు వీఆర్వో అప్పగించగా అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఈ సందర్భంగా రమణమ్మను తానే హత్యచేసినట్లు నిందితుడు రమణ అంగీకరించాడు. అనంతరం నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు సాలూరు తరలించారు. మూడు రోజుల్లో కేసును ఛేదించిన సీఐ, ఎస్సై, పోలీసులను ఆ శాఖ ఉన్నతాధికారులు అభినందించారు. -
రామభద్రపురం.. వేలాది కుటుంబాలకు వరం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర కేంద్రంగా అంతర్ రాష్ట్ర అతిపెద్ద కూరగాయల మార్కెట్‌గా విరాజిల్లుతోంది రామభద్రపురం వెజిటబుల్ మార్కెట్. విజయనగరం జిల్లా రామభద్రపురంలో గల ఈ మార్కెట్ వేలాది మంది చిరు వ్యాపారులను అమ్మలా ఆదుకుంటోంది. ఈ ప్రాంతంలో పండించిన కూరగాయలు, పండ్లను నిత్యం వీరభద్రపురం మార్కెట్ నుంచి ఉత్తరాంధ్రతోపాటు ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్రలకు ఎగుమతి చేస్తున్నారు. కూరగాయలు పండించే కూరాకుల కులస్తులు దాదాపు 600 కుటుంబాల వరకు ఇక్కడ ఉండటంతో ఈ మార్కెట్‌కు ప్రాచుర్యం వచ్చింది. రామభద్రపురంతో పాటు, ఆరికతోట, కొత్తరేగ, బాడంగి మండలం ముగడ, కోడూరు తదితర ప్రాంతాల్లో కూరాకుల కులస్తులు ఉన్నారు. ప్రతి కుటుంబం 25 సెంట్ల విస్తీర్ణంలోనే వివిధ రకాల కూరగాయలు పండిస్తూ జీవనోపాధి పొందుతోంది. వీరితో పాటు రామభద్రపురం, బాడంగి, దత్తిరాజేరు, గజపతి నగరం, మెంటాడ, సాలూరు, బొబ్బిలి మండలాల నుంచి రోజూ 3 వేల మంది వరకు రైతులు కూరగాయలు, పండ్లను ఈ మార్కెట్‌కు తెస్తుంటారు. పండ్లకూ కొదవ లేదు ఇక్కడ మామిడి, బొప్పాయి, జామ, పనస, అనాస, బత్తాయి, సపోటా, దానిమ్మ, ద్రాక్ష, అరటి తదితర పండ్లు కూడా లభ్యమవుతాయి. వీటిని దాదాపు 150 మంది వరకూ విక్రయిస్తుంటారు. స్థానికంగా పండేవే కాకుండా తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి అరటి గెలలు, మహారాష్ట్ర, ఒడిశా నుంచి టమాటా రామభద్రపురం వస్తుంటాయి. అనాస, పనస పండ్లు శ్రీకాకుళం జిల్లా పాలకొండ, సీతంపేట నుంచి తీసుకువచ్చి ఈ మార్కెట్లో విక్రయిస్తుంటారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లా కేంద్రాల్లోని అన్ని హోటళ్లకు ఇక్కడి నుంచే కాయగూరలు రోజూ ప్రత్యేక వ్యాన్లలో వెళ్తుంటాయి. ఈ మార్కెట్ వల్ల ఏటా సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు గ్రామ పంచాయతీకి ఆశీళ్ల ఆదాయం వస్తోంది. విపత్తు వేళా ఠీవీగా.. కరోనా ప్రభావంతో అనేక రంగాలు కుదేలయ్యాయి. ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ రామభద్రపురం అంతర్ రాష్ట్ర కూరగాయల మార్కెట్ తట్టుకుని నిలబడగలిగింది. కూరగాయ రైతులు యథావిధిగా సాగును కొనసాగించడం ఇందుకు ఎంతో దోహదపడింది. రైతు భరోసా పథకం ద్వారా కూరగాయ రైతులకు సైతం ఏటా రూ.13,500 సాయం అందించడంతో మరింత ఉత్సాహంతో పంటల సాగు చేపడుతున్నామని రైతులు చెబుతున్నారు. ఈ మార్కెట్టే ఆధారం మా తాతల కాలం నుంచి కూరగాయల సాగే మా వృత్తి. అప్పటి నుంచి ఈ మార్కెట్‌కే కూరగాయలను తెస్తున్నాం. ఈ ఏడాది రెండెకరాల్లో కూరగాయలు వేశాను. దిగుబడి బాగా వచ్చింది. వాటిని రామభద్రపురం మార్కెట్లోనే విక్రయిస్తున్నా. – కర్రి అప్పారావు, మెట్టవలస, బొబ్బిలి మండలం ఎందరో కార్మికులకు ఉపాధి రామభద్రపురం కూరగాయల మార్కెట్ మా లాంటి ఎందరో కార్మికులకు ఉపాధినిస్తోంది. నేను పదేళ్ల నుంచి కళాసీగా పనిచేస్తున్నాను. రోజూ రూ.300 నుంచి రూ.400 వరకు కూలీ రావడంతో జీవితం సాఫీగా వెళ్తోంది. – ఎరుసు రామకృష్ణ, కళాసీ, రామభద్రపురం 40 ఏళ్లుగా వ్యాపారం ఈ మార్కెట్లో సుమారు 40 ఏళ్ల నుంచి కూరగాయల వ్యాపారం చేస్తున్నాను. ఇక్కడ పండిన కాయగూరలు, పండ్లను ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తాను. అక్కడ పండే టమాటా, మునగకాడలు, దుంపలు, క్యారెట్, బీట్రూట్ను ఇక్కడికి తెస్తుంటాను. – మామిడి చిన్న, వ్యాపారి, రామభద్రపురం -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితుల మృతి
సాక్షి, రామభద్రపురం(విజయనగరం) : ఆదుకోవాల్సిన కొడుకులు అర్ధంతరంగా కన్నుమూయడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బిడ్డల బంగారు భవిష్యత్ కోసం తాము వలసపోయి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతుంటూ... బిడ్డల మృతి వార్త విని స్వగ్రామానికి రావాల్సి వచ్చిందిరా భగవంతుడా.. అని రోదిస్తుంటూ చూపురుల కళ్లు సైతం చెమ్మగిల్లాయి. విద్యా ర్థుల మృతితో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. మండలంలోని ఆరికతోట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుణుపూరు హరిశ్చంద్రప్రసాద్ అలియాస్ సంతోష్, దత్తి ఈశ్వరరావు మృతి చెందిన విషయం తెలిసిందే. టిఫిన్ చేయడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న హరిశ్చంద్రప్రసాద్, ఈశ్వరరావు రామభద్రాపురం వైపు వెళ్తుండగా మరో మిత్రుడు ఈదుబిల్లి లోకేష్ ఎదురయ్యాడు. దీంతో వారు వాహనం ఆపి లోకేష్‌తో మాట్లాడుతుండగా.. విజయనగరం నుంచి ఛత్తీస్‌గఢ్ వెళ్తున్న ట్యాంకర్ వీరిని ఢీ కొట్టడంతో హరిశ్చంద్రప్రసాద్, ఈశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా.. లోకేష్ తీవ్రంగా గాయపడ్డాడు. కుమారుడి మృతి వార్త తెలుసుకున్న హరిశ్చంద్రప్రసాద్ తల్లిదండ్రులు లక్ష్మణరావు, కృష్ణవేణి అదేరోజు సాయంత్రానికి గ్రామానికి చేరుకోగా... వేరే ప్రాంతంలో ఉన్న ఈశ్వరరావు తల్లిదండ్రులు కూడా ఆదివారం రాత్రికే గ్రామానికి చేరుకుని కుమారుల మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉన్నత చదువులు చదివి..మమ్మల్ని పోషిస్తావనుకుంటే.. అర్ధంతరంగా వెళ్లిపోయావా.. నాయినా.. అంటూ మృతుల తల్లిదండ్రులు విలపిస్తుంటే అక్కడున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. దసరా పండగ మా జీవితాల్లో చీకటి నింపిందంటూ భోరుమన్నారు. ఇద్దరు స్నేహితుల మృతదేహాలకూ పక్కపక్కనే చితి పేర్చి సోమవారం దహనసంస్కారాలు చేపట్టారు. గంట తర్వాత పయనం.. చెన్నైలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు ఆదివారమే ఈశ్వరరావు బయలుదేరాల్సి ఉంది. శనివారం రాత్రే దుస్తులు, ఇతర సరంజామా సర్దుకున్నాడు. అయితే ఆదివారం ఉదయాన్నే అతడి బంధువొకరు రేషన్ సరుకులు తీసుకురావాలంటూ పురమాయించారు. ఇంతలో హరిశ్చంద్రప్రసాద్ వచ్చి టిఫిన్‌కు వెళ్దామని రమ్మని కోరడంతో ద్విచక్ర వాహనంపై ఇద్దరూ రామభద్రాపురం వైపు బయలుదేరారు. జాతీయ రహదారి మీదుగా వెళ్తుండగా... ట్యాంకర్ ఢీకొని ఇద్దరూ మృత్యువాత పడ్డారు. గంట ఆగితే తమ బిడ్డ తమ వద్దకు వచ్చేవాడని.. కాని విధి కన్నెర్ర చేయడంతో తామే కుమారుడి మృత దేహం చూడడానికి రావాల్సి వచ్చిందని ఈశ్వరరావు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఒకేసారి ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
తెల్లారిన బతుకులు
సాక్షి, రామభద్రపురం(విజయనగరం) : కొద్ది రోజులుగా ఎండలు ఎక్కువగా ఉండడంతో తెల్లవారు జామునే పనులు చేసుకుందామనుకున్నారు. ఇందులో భాగంగానే తెల్లవారే పనులకు వెళ్లారు. అయితే విధి వక్రీకరించడంతో రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఇంటి యజమానులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు లబోది బోమంటున్నారు. మండలంలోని బూశాయవలస వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. రామభద్రపురం గ్రామానికి చెందిన రుద్రాక్షుల సత్యనారాయణ (దుర్గ), ఎస్. చింతలవలసకు చెందిన తలచుట్ల లక్ష్మున్నాయుడు ఇటుక ట్రాక్టర్లో రవాణా కార్మికులుగా పనిచేస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో శనివారం వేకువజామున ఇటుకల రవాణాకు బయలుదేరారు. రామభద్రపురం మీదుగా మామిడివలస వెళ్తుండగా.. బూశాయవలస మలుపు వద్ద ట్రాక్టర్ నిలిపివేశారు. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ బలంగా ఢీకొనడంతో ట్రాక్టర్ తిరగబడింది. ఈ ప్రమాదంలో ట్రాలీ మీద పడడంతో లక్ష్మున్నాయుడు, ఇంజిన్ మీద పడడంతో సత్యనారాయణ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. తెల్లవారుజాము సమయంలో ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో హాహాకారాలు మిన్నంటాయి. రెండు గ్రామాల్లో విషాద ఛాయలు... మండలంలోని ఎస్. చింతలవలస, రామభద్రపురం గ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. బొబ్బిలి గ్రోత్ సెంటర్లో శుక్రవారం జరిగిన ఓ ప్రమాదంలో ఎస్.చింతలవలసకు చెందిన ఇద్దరు కార్మికులు గాయపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మరువక ముందే మళ్లీ అదే గ్రామానికి చెందిన లకు‡్ష్మనాయుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భర్త చనిపోవడంతో ఇక తనకు దిక్కెవరంటూ భార్య రాములమ్మ రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మృతుడికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు.రామభద్రపురం కర్ణివీధికి చెందిన రుద్రాక్షుల సత్యనారాయణ (దుర్గ) మృతి చెందడంతో కుటుంబం రోడ్డున పడింది. కూలి చేస్తే గాని ఇల్లు గడవని పరిస్థితి వారిది. ప్రమాదంలో సత్యనారాయణ మృతి చెందడంతో అతని భార్య సింహాచలం, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
విధి వంచన
గంటల వ్యవధిలో తల్లి కొడుకుల మృతి అనాథలైన కుటుంబం గ్రామంలో విషాద ఛాయలు రామభద్రపురం(బొబ్బిలి): ఆ తల్లి నవ మాసాలు మోసి కన్న కొడుకు విఘత జీవుడై ఉండడాన్ని చూసి తట్టుకోలేక పోయింది. కొడుకు లేని లోకంలో ఇంక ఉండలేను అనుకుంది. కన్న కొడుకు నిర్జీవంగా కళ్లదుటే పడి ఉండడాన్ని తట్టుకోలేక పోయింది. కుమారుడు మృతదేహంపై గుక్కపట్టి ఏడుస్తూ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. అంతే గంటల వ్యవధిలో ఓ కుటుంబం రోడ్డున పడింది. గంటల వ్యవధిలో తల్లిబిడ్డలు ఇద్దరూ ఒకరి వెంట ఒకరు మృత్యు ఒడిలోకి జారుకున్నారు. ఇది చూసిన స్థానికులు, బంధువుల కళ్లలో కన్నీళ్లు చెమర్చాయి. తండ్రి, నానమ్మ లేడని పిల్లలు, భర్త, అత్త ఇక కనిపించరని ఆ ఇల్లాలు రోదిస్తున్న తీరును చూసి అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. రామభద్రపురం మిర్తివలస గ్రామానికి చెందిన కోట ఈశ్వరరావు(42) తాపీ పని చేస్తుంటారు. రోజులాగే పని చేసుకుని ఆదివారం కూడా ఇంటి కి చేరుకున్నారు. భా ర్య పిల్లలతో సరదాగా గyì పి రాత్రికి వారితో కలిసి మేడపై పడుకున్నారు. ఎప్పు డూ వేకువ జాము 5 గంట లకే అందరి కంటే ముందు లేచి మిగిలిన వారి లేపి కిందకి దించే ఆయన ఎప్పటికీ లేవకపోవడంతో పిల్లలు, ఇల్లాలు వెళ్లి లేపి చూశారు. ఎప్పటికీ లేవకపోవడంతో చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు. చుట్టుపక్కల వారిని పిలిచి ఆయన మృతదేహాన్ని మేడపై నుంచి కిందికి దించారు. కొడుకుతో పాటే తల్లి కూడా.. ఈశ్వరరావు శవాన్ని కిందికి దించిన తర్వాత ఆయన తల్లి గంగమ్మ విషయం తెలుసుకుని కొడుకు మృతదేహంపై పడి బోరున ఏడవడం మొదలుపెట్టింది. కాసేపు అయ్యాక హఠాత్తుగా కుమారునిపై కుప్పకూలిపోయింది. స్థానికులు వెంటనే సాలూరు సీహెచ్‌సీకి అంబులెన్స్‌లో తరలించారు. అక్కడి వైద్యులు ఆక్సిజన్ పెట్టి మెరుగైన వైద్యం కోసం విజయనగరానికి రెఫర్ చేశారు. అక్కడ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గంగమ్మ (65) చనిపోయారు. ఈశ్వరరావుకు భార్య సత్యవతి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారంతా ఇద్దరి మృతితో అనాథలు అయ్యారు. -
టమాటా @ 80
రామభద్రపురం(బొబ్బిలి): కొద్ది రోజులుగా టమాటా ధర పైపైకి చేరుతోంది. పంటలు సరిగ్గా పండకపోవడంతో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో వినియోగదారులు కూరగాయల వైపు చూడడానికే భయపడుతున్నారు. రామభద్రపురం కూరగాయల మార్కెట్లో ప్రస్తుతం టమాటా ధర 80 రూపాయలు పలుకుతోంది. అలాగే వంగ, చిక్కుడు, బెండ, ఆనప, పచ్చిమిరప ధరలు కూడా పెరిగాయి. వేసవిలో చాలామంది రైతులు వివిధ రకాల కూరగాయలు సాగు చేసినప్పటికీ ఆశించిన దిగుబడి రాలేదని, అందుకే ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కూరగాయల సాగు చేపడుతున్నప్పటికీ, అవి అందుబాటులో వచ్చేసరికి సమయం పట్టే అవకాశం ఉందని, దీంతో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రామభద్రపురం మార్కెట్ నుంచి కూరగాయలను బెంగళూరు, బరంపురం, కొరాపుట్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. అయితే టమాటా ధర ఎక్కువ కావడంతో ఇతర ప్రాంతాల వ్యా పారులు కూడా కొనుగోలుకు ముందుకు రావడం లేదు. రెతులకు నష్టమే.. టమాటా ధర బాగా పెరిగింది కాబట్టి రైతులు ఏమైనా లాభపడుతున్నారా అంటే అదీ లేదు. మార్కెట్‌కు సరుకు తీసుకురాగానే దళారులు రంగప్రవేశం చేసి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దళారులకు ఇవ్వకుండా సరుకు ఉంచుదామంటే, పచ్చి సరుకు కావడంతో ఎక్కడ పాడవుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు విక్రయించాల్సివస్తోంది. కూరగాయల ధరలు బాగా పెరిగిపోవుడంతో కిలోకు బదులు అరకిలోతో సర్దుకోవాల్సి వస్తోందని వినియోగదారులు చెబుతున్నారు. కూరగాయలు ప్రస్తుతం పది రోజుల కిందట ( కిలో. రూ.) (కిలో.రూ.) దొండ 20 15 చిక్కుడు 60 40 బెండ 30 20 వంగ 40 20 బీర 30 22 ఆనప 15 10 టమాటా 80 30 మునగ 60 30 పచ్చిమిర్చి 60 30 -
కావాలనే అడ్డు తొలగించుకున్నాం..
రామభద్రపురం(బొబ్బిలి): వివాహేతర బందానికి అడ్డుగా ఉన్నాడన్న ఉద్దేశంతోనే ఓ పథకం ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేశానని ఇటీవల హత్యకు గురైన కొయ్యాన ధనుంజయ్ (29) భార్య రామలక్ష్మి పోలీసుల విచారణలో తెలిపింది. ఈ మేరకు మంగళవారం సీఐ సంజీవరావు కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. రామలక్ష్మికి ధనుంజయ్‌తో పెళ్లి అయిన కొద్ది రోజులకే వాడాడ గ్రామానికి చెందిన బోగాది గణపతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ధనుంజయ్ గొర్రెల కాపరి కావడంతో రోజూ రాత్రిళ్లు ఇంట్లో లేకపోవడంతో అంతా వారి ఇష్ట ప్రకారం సాగింది. కానీ కొద్ది రోజుల తర్వాత భర్తకు విషయం తెలసిపోవడంతో వారిద్దరి మధ్య తగాదాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కాలంలో ఆ గొడవ గ్రామ పెద్దల వద్దకు పంచాయతీకి వెళ్లింది. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకుని వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని రామలక్ష్మి నిర్ణయించుకుని ప్రియుడితో కలిసి పథకం వేసింది. ప్లాన్ ప్రకారమే హత్య.. ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారం ధనుంజయ్ జూన్ 21న శంబరలో ఉన్న మేనత్త ఇంటికి వెళుతున్న విషయాన్ని ప్రియుడు గణపతికి రామలక్ష్మి ముందుగానే చేరవేసింది. గణపతి ముందు వేసుకున్న పధకం ప్రకారం ధనుంజయ్‌ను వెంబడించాడు. తొలుత ధనుంజయ్ కంటే ముందుగానే సాలూరు వెళ్లాడు. అక్కడకు రాకపోవడంతో తిరిగి రామభద్రపురం వచ్చేసి కాపు కాశాడు. ధనుంజయ్ రావడంతోనే గణపతి వెళ్లి మాటలు కలిపి రామభద్రపురం – రాజాం రోడ్డు పక్కనే ఉన్న టేకు చెట్ల తోటలోకి తీసుకెళ్లి రాత్రి 11 గంటల సమయంలో చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని కర్రివానిబందలో ఉన్న తుప్పల్లో పడేశాడు. వెంటనే రామలక్ష్మికి ఫోన్ చేసి పని అయిపోయింది. ఇక్కడే దగ్గరలోని తుప్పల్లో పడేశానని చెప్పాడు. అది జరిగిన రెండు రోజులకు ధనుంజయ్ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో భయపడి గణపతి ఉరివేసుకుని చనిపోయాడు. అనుమానం వచ్చిన పోలీసులు రామలక్ష్మిని ఆ కోణంలో విచారించడంతో అసలు నిజాలు బయటకు వచ్చినట్లు సీఐ పేర్కొన్నారు. ఏ1 నిందితుడు గణపతి ఆత్మహత్య చేసుకోవడంతో ఏ2 నిందుతురాలైన రామలక్ష్మిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. -
మేమేం పాపం చేశాం..
♦ నాన్నను చంపేశారు.. ♦ అమ్మను అరెస్ట్ చేశారు.. ♦ బిక్కుబిక్కుమంటున్న చిన్నారులు రామభద్రపురం: ఏం జరుగుతుందో ఆ చిన్నారులకు తెలియడం లేదు.. ఇంటికి పోలీసులెందుకు వస్తున్నారో..తల్లిని ఎందుకు తీసుకెళ్తున్నారో అర్థం కాక బిత్తర చూపులు చూస్తున్నారు. నాన్న కనిపించడు.. అమ్మ పోలీస్‌స్టేషన్‌లో ఉంది.. ఈ పరిస్థితుల్లో చిన్నారుల బేల చూపులు బంధువులు, స్థానికులను కలిచివేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే... బాడంగి మండలం కోటిపల్లికి చెందిన కొయ్యాన ధనుంజయను (29)ను అతని భార్య రామలక్ష్మి, ఆమె ప్రియుడు బోగాది గణపతి హత్య చేసిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గణపతి కూడా కొద్ది రోజుల కిందట ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు ఉన్న ఒక్క నిందితురాలు రామలక్ష్మిని విచారణ నిమిత్తం సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అమ్మ వెంటే.. ధనుంజయ, రామలక్ష్మి దంపతులకు హరి (7), ఉమ (3) పిల్లలున్నారు. ధనుంజయ హత్యకు గురికావడం.. తల్లిని పోలీసులు తీసుకెళ్లడంతో చిన్నారులు అనాథలుగా మారారు. ఇదిలా ఉంటే కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇంటికి వస్తుండడంతో హరి భయపడతాడని భావించిన బంధువులు అతడ్ని తాత గారింటికి పంపించి వేశారు. కుమార్తె ఉమ మాత్రం తల్లితోనే ఉంది. తల్లిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తున్న సమయంలో కూడా ఏమీ తెలియని చిన్నారి ఆమె వెంటే స్టేషన్‌కు వెళ్లింది. ఏం జరుగుతుందో తెలియని ఆ చిన్నారి అక్కడే ఆడుకోవడం చూసి స్థానికులు, బంధువులు కంటతడి పెట్టారు. తల్లిదండ్రులకు దూరమైన ఆ చిన్నారి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. కొంపముంచుతున్న అక్రమ సంబంధాలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతున్న అక్రమ సంబంధాల వల్ల పచ్చని సంసారాలు కూలిపోతున్నాయని పలువురు తెలిపారు. తల్లి చేతిలో తండ్రి బలయ్యాడు.. తల్లి పోలీసుల అదుపులో ఉంది.. ఇటువంటి సమయంలో పిల్లలను ఎలా ఊరడించాలో తెలియక బంధువులు తల్లడిల్లుతున్నారు -
ఏకరూప దుస్తులు అందేనా?
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను రూపొందించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెబుతున్న పాలకులు ఆ దిశగా అమలు చేసేది శూన్యంగానే కనిపిస్తుంది. పాఠశాలల పునఃప్రారంభం నాటికే ప్రైవేటు పాఠశాలలకు పోటీగా పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందిస్తామని ఏటా చెప్పే పాలకులు దాన్ని అమలు చేయడంలో శ్రద్ధ చూపడం లేదు. దీంతో ఏటా విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. రామభద్రపురం(బొబ్బిలి): పాఠశాలలకు మౌలిక వసతుల సంగతి పక్కన పెడితే కనీసం విద్యార్థులు ధరించే యూనిఫారాలు, చదివేందుకు పాఠ్య పుస్తకాలైనా సకాలంలో అందించాల్సి ఉంది. కానీ ఆ పని కూడా పాలకులు చేయడం లేదు. దీంతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. చివరకు వచ్చేసరికి ఆ నెపాన్ని వేరే రూపంలో ఉపాధ్యాయులపై నెడుతూ పాలకులు పబ్బం గడుపుతున్నారు. మరో పది రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలుగాని, ఏకరూప దుస్తులుగాని మండల విద్యాశాఖ కార్యాలయాలకు చేరుకోలేదు. దీంతో అగమ్యగోచర పరిస్థితి నెలకొంది. ఏకరూప దుస్తుల విషయానికొస్తే గత విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా సంవత్సరం ఆఖరిలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో విద్యార్థులకు పంపిణీ చేశారు. ఇదే పరిస్థితి ఈ ఏడాది కూడా తప్పేలా లేదు. జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలు 2199, ప్రాథమికోన్నత పాటశాలలు 240, ఉన్నత పాఠశాలలు 378 ఉన్నాయి. వీటిలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు రెండు లక్షల 17వేల మంది ఉన్నారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న పిల్లలకు మాత్రమే ఏకరూప దుస్తులు ప్రభుత్వం అందిస్తుంది. వీరు లక్షా 61 వేల ఉన్నారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున మూడు లక్షల 22 వేల దుస్తులు అవసరం ఉంది. పాఠశాలలు తెరిచే సరికే వీటిని పంపిణీ చేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఆప్కో ద్వారా దుస్తులకు అవసరమైన క్లాత్ సరఫరా చేసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు అప్పగించి వారి ద్వారానే స్థానికంగా ఉన్న దర్జీలతో దుస్తులు కుట్టించాలి. కానీ ప్రభుత్వం అలా చేయకుండా ప్రైవేటు సంస్థలకు ఆ బాధ్యత అప్పగించడంతో సకాలంలో ఏకరూప దుస్తులు అందడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఈ కారణంగానే విద్యార్థులకు దుస్తులు విద్యా సంవత్సరం ఆఖరిలో అందుతున్నాయని పేర్కొంటున్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు
రామభద్రపురంలో బోల్తా పడిన ఆటో.. మ్మలక్ష్మీపురంలో ఢీకొన్న ద్విచక్ర వాహనాలు రామభద్రపురం/గుమ్మలక్ష్మీపురం : జిల్లాలోని రెండు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. రామభద్రాపురం మండలం ఆరికతోట పెట్రోల్ బంక్ వద్ద శనివారం ఆటో బోల్తా పడిన సంఘటనలో నలుగురు గాయపడ్డారు. గజపతినగరంనకు చెందిన వరద సరోజిని, వరద కోటి (డ్రైవర్) , పిన్నింటి అన్నపూర్ణ, వేట్ల అజయ్‌కుమార్ శంబర అమ్మవారి దర్శనం చేసుకుని ఆటోలో తిరిగి వస్తున్నారు. సరిగ్గా ఆరికతోట పెట్రోల్‌బంక్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమదంలో సరోజిని, కోటికి తీవ్రగాయాలు కాగా, అన్నపూర్ణ, అజయ్‌కుమార్‌కు స్వల్పగాయాలయ్యాయి.ఈ నలుగురినీ ప్రథమ చికిత్స కోసం బాడంగి సీహెచ్‌సీకి తలించగా, అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హెచ్‌సీ రమణ కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. అలాగే గుమ్మలక్ష్మీపురం నుంచి పార్వతీపురం వైపు వెళ్లే ప్రధాన రహదారిలోని మ«ధర్ పబ్లిక్ స్కూల్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. లక్కగూడ గ్రామానికి చెందిన మధుబాబు పార్వతీపురం వైపు వెళ్తుంగా, నేరేడుమానుగూడకు వెళ్లేందుకు ఎదురుగా వస్తున్న రాజేష్ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడడంతో స్థానికులు భద్రగిరి ఆస్పత్రికి తరలించారు. -
మనసంతా పనస
రామభద్రపురం : పనస పండ్ల పరిమళంతో రామభద్రపురం మార్కెట్ గుబాళిస్తోంది. ఎక్కడ చూసినా పండ్ల రాశులతో కనువిందు చేస్తోంది. ఒడిశాలోని కుందిలి, సుంకి ప్రాంతాల నుంచి ఇవి వస్తున్నాయి. ఒక్కొక్కటి రూ.60 నుంచి రూ.120 వరకు విక్రయిస్తున్నారు. రామభద్రపురం మీదుగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు వెళ్తుండటంతో మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, ఒడిశా రాష్ట్రాల ప్రయాణికులు అధికంగా పనన పండ్లను కొనుగోలు చేస్తున్నారు. -
200 ఇయర్స్ ఇండస్‘ట్రీ’
రెండు శతాబ్దాల మర్రి చెట్టు గబ్బిలం చెట్టుగా పేరు రామభద్రపురం: ఈ చెట్టును చూశారా.. 50 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న మర్రి చెట్టు ఇది. దీని వయసు దాదాపు 200 సంవత్సరాలు. రామభద్రపురం మండల కేంద్రంలోని మార్కెట్ దగ్గరలోని చింతలవాని కోనేరు గట్టుపై ఉంది. ఈ చెట్టును దాదాపు పది వేల గబ్బిలాలు స్థావరంగా మార్చుకున్నాయి. దీంతో దీన్ని గబ్బిలాల చెట్టని కూడా పిలుస్తుంటారు. -
‘ఫైన్’యాపిల్
రామభద్రపురం, పార్వతీపురం : ఉత్తరాంధ్రకు ప్రత్యేకమైన రామభద్రపురం మార్కెట్లో పైనాపిల్ పండ్లకు గిరాకీ ఏర్పడింది. ఏ దుకాణం వద్ద చూసినా పండ్లను రాశులుగా పోసి విక్రయాల చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట, పాలకొండ, కుసుమ ప్రాంతాల నుంచి వీటిని తీసుకొస్తున్నారు. పండు పరిమాణం బట్టి రూ.10 నుంచి రూ.25 వరకు విక్రయిస్తున్నారు. అంతర్రాష్ట్ర మార్కెట్ కావడంతో చత్తీస్ఘడ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు కూడా వీటిని కొనుగోలు చేసి పట్టుకెళ్తున్నారు. పార్వతీపురం మార్కెట్లో ఒక్కొక్క పండు రూ.30 పలుకుతోంది. గత ఏడాది కన్నా ఈ ఏడాది ఎక్కువ ధర పలుకుతోందని వినియోగదారులంటున్నారు. -
హౌసింగ్ ఏఈ ఇంటిపై ఏసీబీ దాడులు
విజయనగరం: విజయనగరం జిల్లాలో సోమవారం ఉదయం అవినీతి నిరోధక శాఖాధికారులు(ఏసీబీ) మెరుపు దాడి చేశారు. రామభద్రపురం హౌసింగ్ డీఈ సత్యనారాయణ నివాసంపై ఏసీబీ అధికారులు దాడులకు దిగారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడని సత్యనారాయణపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నాయుడువలసలోని ఆయన ఇంటిపై అధికారులు ఆకస్మికంగా దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో భారీగా ఆస్తులు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
భవిత కేంద్రం ఆకస్మిక తనిఖీ
రామభద్రపురం(తెర్లాం రూరల్): రామభద్రపురంలోని ఐఈఆర్సీ (భవిత) కేంద్రాన్ని రాష్ట్ర సహిత విద్య కన్సల్టెంట్ డాక్టర్ ఎన్ఎస్ఆర్ కృష్ణారావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల వికలాంగ పిల్లలకు ఏ విధంగా విద్యను బోధిస్తున్నారు? ప్రతి వారం ఫిజియోథెరపీ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారా, లేదా? తదితర అంశాలపై మండల ఐఈఆర్టీ కొల్లి ఈశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. భవిత కేంద్రానికి సంబంధించిన అన్ని రికార్డులనూ పరిశీలించారు. భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలు గల వికలాంగ పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలూ అందించాలని సూచించారు. రామభద్రపురంలోని భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల వికలాంగ పిల్లలకు ఐఈఆర్టీలు అందిస్తున్న సేవలను ఆయన ప్రశ ంసించారు. ఆయనతోపాటు సహిత విద్య జిల్లా సమన్వయకర్త ఆర్సీహెచ్ సత్యనారాయణ ఉన్నారు. -
ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
విజయనగరం (రామభద్రాపురం) : విజయనగరంలో జిల్లాలో ఆరుగురు పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని రామభద్రాపురం మండల కేంద్రంలోని శివాలయం వీధిలో శుక్రవారం ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతుండగా ఎస్సై నారాయణ రావు దాడి చేసి వారిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.16, 200 స్వాధీనం చేసుకున్నారు. -
కన్నపేగును కాపాడబోయి..
నక్కపల్లి(విశాఖ)/రామభద్రపురం : విశాఖ జిల్లాలో రైలు నుంచి జారిపడి తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు. మృతులు స్వగ్రామం విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొండకెంగువ. వీరు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని జొన్నాడలో ఇటుకల తయారీ పరిశ్రమలో పనికి రెండు నెలల క్రితం వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి తిరిగివస్తుండగా రైలు నుంచి జారిపడి దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొండకెంగువ గ్రామానికి చెందిన అగతాని వెంకటరావు అలియాస్ వెంకటి(47) ముగ్గురు పిల్లలు, భార్యతోకలసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని జొన్నాడలోని ఇటుకల తయారీ పరిశ్రమలో పనికి వెళ్లారు. అక్కడ రెండు నెలలపాటు పని చేశారు. పనులు ముగిశాక స్వగ్రామానికి బయల్దేరారు. బుధవారం రాత్రి రాజమండ్రిలో రెలైక్కారు. రద్దీగా ఉండడంతో భార్య, ఇద్దరు పిల్లల్ని కంపార్టుమెంట్ మధ్యలో కూర్చోబెట్టి వెంకటరావు, పెద్ద కొడుకు నవీన్(17) గేటు వద్ద కూర్చున్నారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలోని గుల్లిపాడు రైల్వేస్టేషన్ సమీపానికి వచ్చేసరికి తెల్లవారుజాము అయింది. ఆ సమయంలో నిద్రమత్తులో వెంకటరావు కుమారుడు నవీన్(17) జారిపడ్డాడు. కుమారుడిని రక్షించే ప్రయత్నంలో వెంకటరావు కూడా పడిపోయాడు. ఈ ఘటనలో ఇరువురి శరీరాలు రైలు కిందకు పడిపోవడంతో తునాతునకలయ్యాయి. రైలులోని వారు ఈ విషయం భార్య బంగారమ్మకు చెప్పడంతో ఆమె తనవద్ద ఉన్న ఇద్దరు చిన్నపిల్లలతో నర్సీపట్నం రోడ్డు రైల్వేస్టేషన్లో దిగి తుని రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. నాలుగు గంటల్లో సొంతూరికి చేరుకుంటారనగా.. పొట్టకూటికోసం వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తూ మరో నాలుగు గంటల్లో సొంతూరికి చేరుకునే సమయంలో వెంకటరావు, కొడుకు నవీన్ రైలు నుంచి జారిపడి దుర్మరణం చెందడం అందరినీ కలచివేసింది. కళ్లముందే భర,్త అందివచ్చిన కొడుకు చనిపోవడాన్ని భార్య బంగారమ్మ తట్టుకోలేకపోతోంది. మతి స్థిమితం కోల్పోయిన దానిలా మాట్లాడుతూ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఫోన్లో బంధువులకు వివరాలు చెప్పడానికి కూడా ఆమె నోటి మాట రాలేదు. ఇది అక్కడి వారినందరినీ కంటతడి పెట్టించింది. గుల్లిపాడు స్టేషన్ సిబ్బంది ఈ ఘటనపై తుని రైల్వేపోలీసులకు సమాచారం ఇచ్చారు. జీఆర్పీ ఎస్ఐ వై.రాంబాబు సంఘటన స్థలానికి చేరుకుని తెగిపడిన తండ్రీకొడుకుల మృతదేహాలను పరిశీలించారు. వాటిని పోస్టుమార్టానికి తుని ఆస్పత్రికి తరలించారు. మృతుల వద్ద సెల్‌ఫోన్, రాజమండ్రి నుంచి విజయనగరానికి తీసుకున్న రైలు టికెట్టు ఉన్నాయి. సెల్‌ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాంబాబు తెలిపారు. స్వగ్రామంలో విషాదఛాయలు సంఘటన విషయం తెలిసి మృతుల స్వగ్రామం కొండకెంగువ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొండకెంగువ గ్రామంలో హరిజన కాలనీలో ఉంటున్న మృతుడు వెంకటరావు సోదరులు చిన్నయ్య, సింహాచలం, పోలయ్యలు భోరున విలపించారు. మృతుడు వెంకటరావుకు భార్య బంగారమ్మతోపాటు, కుమారులు నవీన్, ప్రేమ్‌కుమార్, కుమార్తె దీవెన ఉన్నారు. ప్రమాద ఘటనలో వెంకటరావుతోపాటు కుమారుడు నవీన్ మృతి చెందారు. -
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
రామభద్రపురం: పిల్లలు పుట్టలేదన్న మనస్తాపంతో ఓ వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రామభద్రపురంలోని కూరాకుల వీధికి చెందిన కోట బంగారమ్మ(24)కు నాలుగేళ్ల క్రితం కోట శంకరరావుతో వివాహమైంది. నాలుగేళ్లయినా పిల్లలు పుట్టలేదన్న మనస్తాపంతో ఈ నెల 23న బంగారమ్మ పురుగు మందు తాగారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను 108 వాహనంలో తొలుత బాడంగి సీహెచ్‌సీకి, అక్కడ నుంచి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. పిల్లలు పుట్టలేదన్న మనస్తాపంతో తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి తూముల లక్ష్మి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని ఎస్ఐ షణ్ముఖరావు తెలిపారు. -
మృత్యుపంజా !
రామభద్రపురంః చెల్లెలి కూతురుకు పెళ్లి అవుతుందని సంబరపడి వలస వెళ్లిన వారంతా సొంత ఊరికి చేరుకున్నారు.. రెండు రోజులుగా చుట్టాలు, బంధువులతో సంతోషాలను పంచుకున్నారు....పెళ్లికి వెళ్లి... నిండు నూరేళ్లూ సుఖసంతోషాలతో ఉండాలని నవ దంపతులను దీవించి ఇంటి ముఖం పట్టారు. కొద్ది సేపట్లో గ్రామానికి చేరుతారనగా ముగ్గురు మహిళలను మృత్యువు కాటేసింది. మండలంలోని తారాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కు టుంబానికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలవడంతో కొట్టక్కి గ్రామంలో విషాదం అలముకుంది. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి బతుకుతున్న వారు పెళ్లికి వచ్చి పరలోకాలకు వెళ్లిపోయారు. మండలంలోని కొట్టక్కి గ్రామానికి చెందిన కల్లూరి పైడితల్లి కుమార్తె వెంకటలక్ష్మి వివాహానికి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నివాసముంటున్న పైడితల్లి అక్కయ్య తవుడమ్మతో పాటు బంధువులంతా రెండు రోజుల కిందట వచ్చారు. కొట్టక్కి గ్రామం నుంచి బుధవారం రాత్రి వీరం తా ఆడపిల్ల వారి తరఫునబయలుదేరి... వివాహం జరిగిన బాడంగి మండలం రామచంద్రాపురం గ్రామానికి వెళ్లారు. అక్కడ వివాహం అంతా పూర్తయ్యాక కూతురు చుక్కల సింహాచలం (35) కోడలు గార కృష్ణవేణి(34)తో పాటు త వుడమ్మ, ఆమె భర్త కురమయ్య, మనుమలు, మనుమరా ళ్లు, బంధువులు కొట్టక్కి రావడానికి అదే గ్రామానికి చెందిన గార రాముకు చెందిన ఆటోలో బయలుదేరారు. మరో పది నిమిషాల్లో గ్రామానికి చేరుతారనగా లారీని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించిన సాలూరు నుంచి రామభద్రపురం వైపు వెళ్తున్న వ్యాన్, ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆ టో రోడ్డు పక్కనున్న చెట్టుకు బలంగా ఢీకొ ఢీకొని నుజ్జునుజ్జయింది. ఆటోలో ఉన్న తవుడమ్మ, ఆమె కూతురు సిం హాచలం సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కృష్ణవేణి సాలూరు ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ మృతి చెందింది. గాయపడిన వారిలో ఆటో డ్రైవరు రాము, వ్యాన్ డ్రైవరు సుమన్‌లతో పాటు మృతురాలు తవుడమ్మ భర్త కురమయ్య, మనుమరాలు చుక్కల దీపిక, కూతురు శాంతి, మనుమడు తీల జగదీష్, మనుమరాలు గార దుర్గలున్నారు. క్షతగాత్రులను స్థానిక పోలీసులు 108 పై సాలూరు ,బాడంగి ఆస్పత్రులకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం విజయనగరానికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. మృత్యవాత పడిన కుటుంబం గత 25 ఏళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి వలస వెళ్లిపోయింది. కొట్టక్కి గ్రామంలో తవుడమ్మ చెల్లెళ్లు సీతమ్మ , పైడితల్లిలున్నారు. పైడితల్లి కూతు రు వెంకట లక్ష్మి పెళ్లి నిమిత్తం వారు కొట్టక్కి వచ్చారు. ప్ర మాదంలో మృతి చెందిన సింహాచలంకు భర్త వెంకటరావు, కొడుకు, కూతురు ఉన్నారు. కృష్ణవేణికి భర్త వెంకటరావు,ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెళ్లికి వచ్చి మృత్యువాతకు గురి కావడంతో కొట్టక్కిలో విషాద ఛాయలు అలముకున్నాయి. తవుడమ్మ బం ధువుల ఇళ్లల్లో ఉన్న వారంతా కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. మృతదేహాలకు సాలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్ఐ సంతోష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి మృణాళిని విజయనగరం క్రైం : తారాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను రాష్ట్ర మంత్రి మృణాళిని గురువారం పరామర్శించారు. వ్యాన్, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, కొందరు గాయపడ్డారు. వీరిలో నలుగురిని పట్టణంలోని తిరుమల ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి తిరుమల ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మె రుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి అధినేత డాక్టర్ కె. తిరుమల ప్రసాద్‌కు సూచించారు. -
కోల్డ్‌స్టోరేజిలో భారీ చోరీ
విజయనగరం : విజయనగరం జిల్లా రామభద్రాపురం మండల కేంద్రంలోని నారాయణ కోల్డ్ స్టోరేజిలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. గురువారం ఉదయం గుర్తించిన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాదాపు రూ. 4లక్షల మేర చోరీ జరిగినట్టు సమాచారం. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, జాగిలాలతో గాలింపు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. (రామభద్రాపురం) -
బాధితుల తరఫున పోరాటం
రామభద్రపురం : ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు ఆదేశించారు. శు క్ర వారం ఆయన మండల పరిషత్ కార్యాలయం లో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసా యానికి అనుసంధానం చేసినట్లుయితే పార్వతీపురం డివిజన్లో వేలాది మంది రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇప్పటివరకు మండలంలో ఎందుకు ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయలేదని ఏపీఓ సత్యవతిని ప్రశ్నించారు. అలాగే ఇటీవల వచ్చిన తుపానుకు చాలాచోట్ల విద్యుత్ స్తంభా లు నేలకొరిగినా.. ఇప్పటికీ వాటిని సరి చేయకపోవడంతో ఎలక్ట్రికల్ సబ్ ఇంజినీర్ సతీష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వీడాలని సూ చించారు. ఎంఈఓ పెంటయ్య పర్యవేక్షణ లోపం వల్ల చాలా పాఠశాలల్లో వసతుల లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఇళ్లకు నిధులు ఎప్పుడు మంజూరవుతాయని హౌసిం గ్ ఏఈ వేణును ప్రశ్నించారు. అలాగే తుపానుకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారంపై ప్రభుత్వానికి నివేదికలు అందించాలని ఏఓ ప్రసాద్‌ను ఆదేశించారు. పట్టాదారు పాసు పుస్తకాల జారీలో జాప్యం లేకుండా చూడాలని తహశీల్దార్ అప్పారావుకు సూచించారు. ఈ సమావేశంలో ఎంపీపీ అప్పికొండ శ్రీరాములునాయు డు, జెడ్పీటీసీ సభ్యుడు బోయిన లూర్దమ్మ, ఎంపీడీఓ చంద్రమ్మ, తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల ఎస్కార్ట్ కోసం అసెంబ్లీలో పోరాడుతాం ప్రత్యేక అవసరాల పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్కార్ట్ అలవెన్సు ఆపడం సరికాదని, దీనిపై అసెంబ్లీలో పోరాటం చేస్తామని ఎమ్మెల్యే సుజ య్ తెలిపారు. శుక్రవారం భవిత భవనంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు ప్రభుత్వం ప్రతి నెలా వికలాంగులకు వంద రుపాయలు ఎస్కార్ట్ అల వెన్సు మంజూరు చేసేదన్నారు. కానీ ఈ ఏడాది నుంచి ప్రభుత్వం ఎస్కార్ట్ అలవెన్సు ఇవ్వడం లేదన్నారు. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నట్టు చెప్పారు. అలాగే తమ పార్టీ ద్వారా వికలాంగులకు ఆర్థిక సా యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలి పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు బోయిన లూర్దమ్మ, ఎంపీటీసీ మడక తిరుపతినాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
ఘర్షణ నివారించబోతే హత్య చేశారు!
విశాఖపట్నం: పుణ్యానికిపోతే పాపం ఎదురైనట్లు, మంచికి పోతే చెడు ఎదురైనట్లు రెండు వర్గాల మధ్య ఘర్షణను నివారించబోయి ఓ ఆటో డ్రైవర్ తన ప్రాణాలు కోల్పోయాడు. ఆ కిరాతకులు సర్ధిచెప్పడానికి వచ్చిన వ్యక్తినే హత్య చేశారు. పాయకరావుపేట మండలం రామభద్రపురంలో ఈ దారుణం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం రామభద్రపురంలో రెండు వర్గాలకు చెందిన వారు ఘర్షణపడుతున్నారు. ఆ ఘర్షణ నివారించేందుకు ఆటోడ్రైవర్ సత్తిబాబు ప్రయత్నించాడు. వారికి సర్ధిచెప్పబోయాడు. వారు అతనిని కత్తులతో పొడిచి హత్య చేశారు. ** -
అధికారుల తీరుపై మండిపడిన కోటశిర్లాం గ్రామస్తులు
రామభద్రపురం, న్యూస్‌లైన్:మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోమవారం ఉపాధి పనులపై జరిగిన ప్రజా వేదిక రసాభాసగా మారింది. గ్రామాల్లో జరిగిన ఉపాధి పనులతో పాటు, పింఛన్ల పంపిణీపై ప్రజాప్రతి నిధులు... అధికారులను నిలదీశారు. చనిపోయిన వారికి కూడా పింఛన్లు మంజూరు చేయడంపై మండిపడ్డారు. మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన ఏడో విడత ఉపాధి పనులపై మండల పరిషత్ కార్యాల య ఆవరణలో సామాజిక తనిఖీ బృందాలు ప్రజావేదిక నిర్వహించాయి. ఈ సందర్భంగా కోటశిర్లాం గ్రామానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు తమ గ్రామంలో చనిపోయిన వారి పేరున ఇప్పటికీ పింఛన్లు ఇస్తున్నారని తెలిపారు. గ్రామంలో చాలామంది అర్హులు ఉన్నప్పటికీ అధికారులు పింఛన్లు మంజూరు చేయడం లేదన్నారు. దీన్ని సామాజిక తనిఖీ బృందం అధికారులు కూడా ధ్రువీకరించారు. కొండకెంగువ గ్రామానికి చెందిన రైతులు ఉపాధి హామీ ద్వారా హార్టీకల్చర్‌లో కొందరికి మామిడి మొక్కలు ఇవ్వలేదని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సోంపురంలో ఫీల్డ్ అసిస్టెంట్ బినామీలకు బిల్లులు చెల్లిస్తున్నారని, విధులు కూడా సక్రమంగా నిర్వహించడం లేదని సామాజిక తనిఖీ బృందాలు తెలిపారుు. నర్సాపురంలో రూ. 9 వేల సోషల్ ఫారెస్టులో నర్సరీ మొక్కలు పనుల బిల్లులను సిబ్బంది కాజేశారన్నారు. రామభద్రపురంలో నివాసం ఉంటున్నవారికి పింఛన్లు మంజూరు చేస్తున్నారన్నారు. బూసాయవలసలో వర్క్ డిమాండ్ ఉన్నా.. వేతనదారులకు పనులు కల్పించడం లేదని చెప్పారు. ఇట్లామామిడిపల్లిలో రూ. 3,300 పింఛన్లు లబ్ధిదారులకు ఇవ్వలేదన్నారు. పింఛన్ల పంపిణీలో జరిగిన అక్రమాలపై ఉపాధి అధికారులు ఎంపీడీఓ చంద్రమ్మను వివరణ అడిగారు. సం బంధిత కార్యదర్శులకు నోటీసులు జారీ చేసి, వారి నుం చి రికవరీ చేయూలని ఆదేశించారు. అలాగే ఉపాధి పనుల్లో జరిగిన అక్రమాలపై ఏపీఓ ఆదిలక్ష్మిని వివరణ అడిగారు. ఈ కార్యక్రమంలో డ్వామా అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి ఆదినారాయణ, డీఆర్డీఏ డీపీఎం రాజ్యలక్ష్మి, డ్వామా ఏపీడీ శ్రీహరిబాబు, తదితరులు పాల్గొన్నారు.