రామభద్రపురం(తెర్లాం రూరల్): రామభద్రపురంలోని ఐఈఆర్‌సీ (భవిత) కేంద్రాన్ని రాష్ట్ర సహిత విద్య కన్సల్టెంట్ డాక్టర్ ఎన్‌ఎస్‌ఆర్ కృష్ణారావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల వికలాంగ పిల్లలకు ఏ విధంగా విద్యను బోధిస్తున్నారు? ప్రతి వారం ఫిజియోథెరపీ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారా, లేదా? తదితర అంశాలపై మండల ఐఈఆర్‌టీ కొల్లి ఈశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. భవిత కేంద్రానికి సంబంధించిన అన్ని రికార్డులనూ పరిశీలించారు. భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలు గల వికలాంగ పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలూ అందించాలని సూచించారు. రామభద్రపురంలోని భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల వికలాంగ పిల్లలకు ఐఈఆర్‌టీలు అందిస్తున్న సేవలను ఆయన ప్రశ ంసించారు. ఆయనతోపాటు సహిత విద్య జిల్లా సమన్వయకర్త ఆర్‌సీహెచ్ సత్యనారాయణ ఉన్నారు.
భవిత కేంద్రం ఆకస్మిక తనిఖీ
Published Thu, Jan 7 2016 11:43 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM
Advertisement
Advertisement