విజయనగరం జిల్లాలో సోమవారం ఉదయం అవినీతి నిరోధక శాఖాధికారులు(ఏసీబీ) మెరుపు దాడులకు దిగారు. రామభద్రపురం హౌసింగ్ డీఈ సత్యనారాయణ నివాసంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు.
విజయనగరం: విజయనగరం జిల్లాలో సోమవారం ఉదయం అవినీతి నిరోధక శాఖాధికారులు(ఏసీబీ) మెరుపు దాడి చేశారు. రామభద్రపురం హౌసింగ్ డీఈ సత్యనారాయణ నివాసంపై ఏసీబీ అధికారులు దాడులకు దిగారు.
అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడని సత్యనారాయణపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నాయుడువలసలోని ఆయన ఇంటిపై అధికారులు ఆకస్మికంగా దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో భారీగా ఆస్తులు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.