రామభద్రపురం, న్యూస్‌లైన్:మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోమవారం ఉపాధి పనులపై జరిగిన ప్రజా వేదిక రసాభాసగా మారింది. గ్రామాల్లో జరిగిన ఉపాధి పనులతో పాటు, పింఛన్ల పంపిణీపై ప్రజాప్రతి నిధులు... అధికారులను నిలదీశారు. చనిపోయిన వారికి కూడా పింఛన్లు మంజూరు చేయడంపై మండిపడ్డారు. మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన ఏడో విడత ఉపాధి పనులపై మండల పరిషత్ కార్యాల య ఆవరణలో సామాజిక తనిఖీ బృందాలు ప్రజావేదిక నిర్వహించాయి. ఈ సందర్భంగా కోటశిర్లాం గ్రామానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు తమ గ్రామంలో చనిపోయిన వారి పేరున ఇప్పటికీ పింఛన్లు ఇస్తున్నారని తెలిపారు.
గ్రామంలో చాలామంది అర్హులు ఉన్నప్పటికీ అధికారులు పింఛన్లు మంజూరు చేయడం లేదన్నారు. దీన్ని సామాజిక తనిఖీ బృందం అధికారులు కూడా ధ్రువీకరించారు. కొండకెంగువ గ్రామానికి చెందిన రైతులు ఉపాధి హామీ ద్వారా హార్టీకల్చర్‌లో కొందరికి మామిడి మొక్కలు ఇవ్వలేదని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సోంపురంలో ఫీల్డ్ అసిస్టెంట్ బినామీలకు బిల్లులు చెల్లిస్తున్నారని, విధులు కూడా సక్రమంగా నిర్వహించడం లేదని సామాజిక తనిఖీ బృందాలు తెలిపారుు. నర్సాపురంలో రూ. 9 వేల సోషల్ ఫారెస్టులో నర్సరీ మొక్కలు పనుల బిల్లులను సిబ్బంది కాజేశారన్నారు. రామభద్రపురంలో నివాసం ఉంటున్నవారికి పింఛన్లు మంజూరు చేస్తున్నారన్నారు.
బూసాయవలసలో వర్క్ డిమాండ్ ఉన్నా.. వేతనదారులకు పనులు కల్పించడం లేదని చెప్పారు. ఇట్లామామిడిపల్లిలో రూ. 3,300 పింఛన్లు లబ్ధిదారులకు ఇవ్వలేదన్నారు. పింఛన్ల పంపిణీలో జరిగిన అక్రమాలపై ఉపాధి అధికారులు ఎంపీడీఓ చంద్రమ్మను వివరణ అడిగారు. సం బంధిత కార్యదర్శులకు నోటీసులు జారీ చేసి, వారి నుం చి రికవరీ చేయూలని ఆదేశించారు. అలాగే ఉపాధి పనుల్లో జరిగిన అక్రమాలపై ఏపీఓ ఆదిలక్ష్మిని వివరణ అడిగారు. ఈ కార్యక్రమంలో డ్వామా అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి ఆదినారాయణ, డీఆర్‌డీఏ డీపీఎం రాజ్యలక్ష్మి, డ్వామా ఏపీడీ శ్రీహరిబాబు, తదితరులు పాల్గొన్నారు.
అధికారుల తీరుపై మండిపడిన కోటశిర్లాం గ్రామస్తులు
Published Tue, Nov 19 2013 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM
Advertisement