Social audit teams
-
అక్రమార్కులకు ‘ఉపాధి’
రూ.792.23 కోట్ల పనుల్లో రూ.75.35 కోట్లు దుర్వినియోగం తేల్చిన సోషల్ ఆడిట్ బృందాలు సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం.. అక్రమార్కులకు ఉపాధినిస్తోంది. గత ఏడాది జరిగిన ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ బృందాలు తనిఖీ చేయగా కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి చేరినట్లు వెల్లడైంది. తాము అక్రమాలకు పాల్పడినట్లు ఉపాధి హామీ సిబ్బంది అంగీకరించినప్పటికీ, వారి వద్ద నుంచి సొమ్ము రికవరీ చేసేందుకు ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తుండడం గమనార్హం. సిబ్బంది నొక్కేసిన సొమ్ములో పైస్థాయి అధికారులకు కూడా వాటాలు ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. గత ఏడాది రాష్ట్రంలో ఉపాధిహామీ పథకం కింద సుమారు రూ.1,800 కోట్ల విలువైన పనులు జరిగాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఉపాధి హామీ అక్రమార్కులకు వరంగా మారిందని ఆరోపణలు వెల్లువెత్తడంతో గత ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 30 వరకు అధికారులు సామాజిక తనిఖీలు నిర్వహించారు. ఏడు నెలల్లో రూ.792.23 కోట్ల విలువైన పనులను సోషల్ ఆడిట్ బృందాలు తనిఖీ చేయగా రూ.75.35 కోట్ల(9.51శాతం) సొమ్ము దుర్వినియోగమైనట్లు తేలింది. ఇందులో రూ.60.11 కోట్ల (80 శాతం) సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లినట్లు ఆడిట్ అధికారులు తేల్చారు. కాగా, ఇప్పటి వరకు రికవరీ చేసినది రూ.3 లక్షలే కావడం గమనార్హం. ఆదిలాబాద్‌లో అత్యధికంగా అక్రమాలు ఉపాధి హామీ పనుల్లో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో రూ.19 కోట్లు దుర్వినియోగమైనట్లు తనిఖీల్లో తేలింది. నల్లగొండ జిల్లాలో 14.38 కోట్లు, మహబూబ్‌నగర్ 9.50 కోట్లు, నిజామాబాద్ 7.30 కోట్లు, మెదక్ రూ.7.01 కోట్లు, వరంగల్ రూ.6.85 కోట్లు, కరీంనగర్ 6.13 కోట్లు, రంగారెడ్డి 2.67 కోట్లు, ఖమ్మం రూ. 2.50 కోట్లు దుర్వినియోగమైనట్లు సమాచారం. వరంగల్ జిల్లాలో వెలుగు చూసిన కొన్ని అక్రమాలు చిట్యాల మండలం కుమ్మరిపల్లిలో జరిగిన పనిని ఒక గ్రూపునకు చెందిన 14 మంది కూలీలు పనిచేశారు. అయితే.. అక్కడ పనిచేసే ఉద్యోగి(మేట్) నర్సయ్య 9 మంది కుటుంబ సభ్యులు, బంధువులు అదే పని చేసినట్లు అదనంగా లెక్కలు చూపారు. అదే గ్రామంలో ఒక నర్సరీలో కూలీలు గోడిశాల విజయ, ఆమె కుమారుడు రాజేందర్ 84 రోజులు పనిచేసినట్లు స్థానిక ఉద్యోగి ఫీల్డ్ అసిస్టెంట్(ఎఫ్ఏ) సతీష్ లెక్కల్లో చూపారు. గ్రామసభలో విచారించగా తాము పనిచేయలేదని, మస్టర్లో సంతకాలు తమవి కావని వారు పేర్కొన్నారు. భావ్సింగ్పల్లిలో 200 మామిడి మొక్కల పెంపకానికి రూ.25,229 ఖర్చు చేసినట్లు ఉపాధి సిబ్బంది లెక్కలు చూపారు. సోషల్ ఆడిట్ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఒక్క మొక్క కూడా కనిపించలేదు. చిట్యాలలో రోడ్ ఫార్మేషన్ నిమిత్తం 874 క్యూబిక్ మీటర్ల పని కోసం రూ.1.07 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో పేర్కొనగా, సోషల్ ఆడిట్లో 589 క్యూబిక్ మీటర్ల మేరకే పని జరిగినట్లు తేలింది. -
‘ఆసరా’.. అక్రమార్కుల పరం!
కొత్తగూడెంలో సోషల్ ఆడిట్ బృందాల తనిఖీ వెలుగుచూసిన అక్రమాలు సాక్షి, హైదరాబాద్: అక్రమార్కులకు ‘ఆసరా’ అవుతోంది. ప్రజాధనం పక్కదారి పడుతోం ది. అనర్హులకు లబ్ధి చేకూరుతోంది. అర్హుల్లో చాలామంది ‘ఆసరా’ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇదీ సామాజిక భద్రతా పింఛన్ల పథకం‘ఆసరా’ పథకం అమలవుతున్న తీరు. ఆసరా పథకం అమలులో అధికారుల లీలలెన్నో! ఆసరా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 32.46 లక్షల మందికి ప్రతినెలా సుమారు రూ.400 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. పింఛను పొందుతున్నవారిలో మూడింట ఒకవంతు మంది అక్రమార్కులు ఉన్నారని, సుమారు రూ.వందకోట్లు అనర్హులకు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నా యి. ఆసరా పింఛన్లపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఆధ్వర్యంలోని సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్ఫరెన్సీ(శాట్) బృందాలు తాజాగా ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపాలిటీలో తనిఖీ చేశాయి. ఈ మున్సిపాల్టీలో మంజూరైన పింఛన్లలో 37.15 శాతం అక్రమమేనని సోషల్ ఆడిట్ బృందాలు తేల్చాయి. కొత్తగూడెం మున్సిపాలిటీలో జరిగిన‘ఆసరా’ అక్రమాలపై సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాయి. ఈ నేపథ్యంలో దశలవారీగా అన్ని జిల్లాల్లోనూ సోషల్ ఆడిట్ చేయించాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. కొత్తగూడెం మున్సిపాల్టీల్లో.. మొదటి భర్త నుంచి విడాకులు తీసుకొని రెండో భర్తతో ఉంటున్న పలువురు మహిళలు వితంతు పింఛన్లు పొందుతున్నారు. 40 శాతం కన్నా తక్కువ వైకల్యమున్నవారు, సింగరేణి కాలరీస్‌లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు, వారి కుటుంబ సభ్యులకు ఆసరా పింఛన్లు లభిస్తున్నాయి. మూడంతస్తుల భవనాలు, స్విఫ్ట్ డిజైర్ కార్లున్న కుటుంబాల సభ్యులకు కూడా పింఛన్లు మంజూరయ్యాయి. స్థానికంగా ఎటువంటి గుర్తింపు కార్డులేని ఇతర ప్రాంతాలవారికి కూడా పింఛన్లు వస్తున్నాయి. జ్యువలరీ, మిఠాయి, కిరాణ దుకాణాలు నిర్వహిస్తున్నవారి కుటుంబాల్లోనూ ఆసరా పెన్షనర్లు ఉన్నారు. కొన్ని వార్డుల్లో అర్హత కలిగినవారి పింఛను సొమ్మును డ్రా చేసిన కొందరు అధికారులు ఆ సొమ్మును లబ్ధిదారులకు అందజేయలేదని తేలింది. అర్హత కలిగిన ఎంతోమంది తమకు పింఛను ఇవ్వలేదంటూ సోషల్ ఆడిట్ బృందాలకు ఫిర్యాదు చేశారు. కేవలం దరఖాస్తులు, వాటికి జత చేసిన పత్రాలతోనే సిబ్బంది విచారణ పూర్తి చేసి, క్షేత్రస్థాయి పరిశీలనను విస్మరించారనే విష యం వెల్లడైంది. లబ్ధిదారుల వివరాలను డేటా ఎంట్రీ చేసే ప్రక్రియను ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించడం కూడా ఈ అక్రమాలకు మరో కారణమని తేలింది. వెరిఫికేషన్ జరిగింది ఇలా.. మొత్తం పింఛన్లు 8,311 వెరిఫికేషన్ చేసినది 7,868 (94.67శాతం) వెల్లడైన అక్రమ పింఛన్లు 2,923 అక్రమార్కుల పాలైన సొమ్ము 87,35,500 -
అధికారుల తీరుపై మండిపడిన కోటశిర్లాం గ్రామస్తులు
రామభద్రపురం, న్యూస్‌లైన్:మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోమవారం ఉపాధి పనులపై జరిగిన ప్రజా వేదిక రసాభాసగా మారింది. గ్రామాల్లో జరిగిన ఉపాధి పనులతో పాటు, పింఛన్ల పంపిణీపై ప్రజాప్రతి నిధులు... అధికారులను నిలదీశారు. చనిపోయిన వారికి కూడా పింఛన్లు మంజూరు చేయడంపై మండిపడ్డారు. మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన ఏడో విడత ఉపాధి పనులపై మండల పరిషత్ కార్యాల య ఆవరణలో సామాజిక తనిఖీ బృందాలు ప్రజావేదిక నిర్వహించాయి. ఈ సందర్భంగా కోటశిర్లాం గ్రామానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు తమ గ్రామంలో చనిపోయిన వారి పేరున ఇప్పటికీ పింఛన్లు ఇస్తున్నారని తెలిపారు. గ్రామంలో చాలామంది అర్హులు ఉన్నప్పటికీ అధికారులు పింఛన్లు మంజూరు చేయడం లేదన్నారు. దీన్ని సామాజిక తనిఖీ బృందం అధికారులు కూడా ధ్రువీకరించారు. కొండకెంగువ గ్రామానికి చెందిన రైతులు ఉపాధి హామీ ద్వారా హార్టీకల్చర్‌లో కొందరికి మామిడి మొక్కలు ఇవ్వలేదని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సోంపురంలో ఫీల్డ్ అసిస్టెంట్ బినామీలకు బిల్లులు చెల్లిస్తున్నారని, విధులు కూడా సక్రమంగా నిర్వహించడం లేదని సామాజిక తనిఖీ బృందాలు తెలిపారుు. నర్సాపురంలో రూ. 9 వేల సోషల్ ఫారెస్టులో నర్సరీ మొక్కలు పనుల బిల్లులను సిబ్బంది కాజేశారన్నారు. రామభద్రపురంలో నివాసం ఉంటున్నవారికి పింఛన్లు మంజూరు చేస్తున్నారన్నారు. బూసాయవలసలో వర్క్ డిమాండ్ ఉన్నా.. వేతనదారులకు పనులు కల్పించడం లేదని చెప్పారు. ఇట్లామామిడిపల్లిలో రూ. 3,300 పింఛన్లు లబ్ధిదారులకు ఇవ్వలేదన్నారు. పింఛన్ల పంపిణీలో జరిగిన అక్రమాలపై ఉపాధి అధికారులు ఎంపీడీఓ చంద్రమ్మను వివరణ అడిగారు. సం బంధిత కార్యదర్శులకు నోటీసులు జారీ చేసి, వారి నుం చి రికవరీ చేయూలని ఆదేశించారు. అలాగే ఉపాధి పనుల్లో జరిగిన అక్రమాలపై ఏపీఓ ఆదిలక్ష్మిని వివరణ అడిగారు. ఈ కార్యక్రమంలో డ్వామా అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి ఆదినారాయణ, డీఆర్డీఏ డీపీఎం రాజ్యలక్ష్మి, డ్వామా ఏపీడీ శ్రీహరిబాబు, తదితరులు పాల్గొన్నారు.