పిల్లలు పుట్టలేదన్న మనస్తాపంతో ఓ వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
రామభద్రపురం: పిల్లలు పుట్టలేదన్న మనస్తాపంతో ఓ వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రామభద్రపురంలోని కూరాకుల వీధికి చెందిన కోట బంగారమ్మ(24)కు నాలుగేళ్ల క్రితం కోట శంకరరావుతో వివాహమైంది. నాలుగేళ్లయినా పిల్లలు పుట్టలేదన్న మనస్తాపంతో ఈ నెల 23న బంగారమ్మ పురుగు మందు తాగారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను 108 వాహనంలో తొలుత బాడంగి సీహెచ్‌సీకి, అక్కడ నుంచి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. పిల్లలు పుట్టలేదన్న మనస్తాపంతో తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి తూముల లక్ష్మి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని ఎస్‌ఐ షణ్ముఖరావు తెలిపారు.