Married Woman Suicide
-
భర్త వివాహేత సంబంధం.. భార్య అనుమానాస్పద మృతి
సంగెం: అనుమానాస్పదస్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటన సంగెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. మండలంలోని నర్సానగర్ శివా రు జాటోత్ తండాకు చెందిన జాటోత్ రవీందర్ రెండో కూతురు దివ్య(22)ను అదే తండా పరిధిలోని సాంక్రియ తండాకు చెందిన గుగులోత్ పవన్‌కు ఇచ్చి 2021లో వివాహం జరిపించారు. కొంతకాలం వరకు సజావుగా సాగిన కాపురంలో అశ్విత జన్మించింది. ఈ క్రమంలో పవన్ కొంత కాలంగా వివాహేత సంబంధం పెట్టుకుని దివ్యను ఇబ్బందులకు గురిచేసేవాడు. దీంతో దివ్య తల్లిగా రింటి వద్ద ఉంటోంది. గత సెప్టెంబర్ 6న పవన్ పెద్దమనుషులను తీసుకుని వచ్చి ఇకనుంచి ఇబ్బందులకు గురిచేయనని చెప్పి భార్యను కాపురానికి తీసుకెళ్లాడు. అయినా అతడి తీరులో మార్పు రాలేదని దివ్య తన తల్లితండ్రులకు చెప్పేది. ఈక్రమంలో సోమవారం ఉదయం పవన్ తన మామ రవీందర్‌కు ఫోన్ చేసి దివ్య ఆరోగ్యం బాగాలేదని ఎంజీఎంకు తీసుకెళ్తున్నానని సమాచారం ఇచ్చాడు. దీంతో తల్లిదండ్రులు ఎంజీఎం వెళ్లి చూడగా దివ్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన కూతురు దివ్యను అల్లుడు పవన్, అతడి కుటుంబీకులు చంపినట్లు రవీందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. హగ్ ఇస్తేనే పాస్‌పోర్టు ఇస్తా: కానిస్టేబుల్ వేధింపులు -
ప్రియుడి వేధింపులే కారణం..
హైదరాబాద్: శివాలి అనే వివాహిత ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచి్చంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి శివాని(32) అనే మహిళ ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండేళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్న శివాని ప్రియుడు ముస్తఫా అలియాస్ ఖాలీద్‌తో సహజీవనం చేస్తోంది. కొంతకాలంగా ఖాలీద్ తన కుమార్తె(12)తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయమై పలుమార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. అయినా ముస్తఫా ప్రవర్తనలో మార్పు రాలేదు. తన కుమార్తెను ప్రియుడు లైంగికంగా వేధిస్తుండటాన్ని జీర్ణించుకోలేక మనస్తాపానికి లోనైన శివాని శనివారం రాత్రి తన ఇద్దరు పిల్లలను తన సోదరి ఇంటికి పంపి ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం ఆమె ప్రియుడు ముస్తఫాను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అడ్మిన్ ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు. -
కొత్త బట్టలు పెట్టినప్పుడు మర్యాద ఇవ్వలేదని..
కర్నూలు : కల్లూరు ఎస్టేట్‌లోని జీఎస్ఎస్ కాలనీలో నివాసముంటున్న రహంతుల్లా భార్య షేక్ రేష్మా (22) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నంద్యాల జిల్లా డోన్ పట్టణం శ్రీనివాసనగర్‌కు చెందిన నూర్ అహ్మద్, మున్ని దంపతులకు ముగ్గురు కూతుర్లు సంతానం. పెద్ద కూతురు షేక్ రేష్మాను కల్లూరు ఎస్టేట్‌లో నివాసముంటున్న రహంతుల్లాకు ఇచ్చి గత ఏడాది అక్టోబర్‌లో వివాహం జరిపించారు. పెళ్లి సందర్భంగా రూ.4 లక్షలు కట్నం, 20 తులాల బంగారం, ఇతర వస్తువులు కానుకలుగా ఇచ్చారు. భర్త రహంతుల్లా హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజినీర్. భార్యను తల్లి దగ్గర ఉంచి వారానికి ఒకసారి కల్లూరుకు వచ్చి వెళ్లేవాడు. కొన్నాళ్లు సంసారం సాఫీగా సాగింది. చిన్నచిన్న కారణాలు చూపి అత్త ఫాతిమా, ఆడపడుచు ముస్కాన్, ఆమె భర్త జావెద్ వేధింపులకు గురిచేస్తున్నారని తల్లిదండ్రులకు చెప్పుకుని రేష్మ బాధ పడేది. ఇటీవల బట్టలు పెట్టినప్పుడు మర్యాద ఇవ్వలేదని భర్త వేధిస్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పుకోవడంతో వారు పంచాయితీ పెట్టి పెద్ద మనుషుల సమక్షంలో సర్దిచెప్పారు. అయినప్పటికీ వేధింపులు తగ్గకపోవడంతో సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు కనుగొని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. భర్తతో పాటు అత్త, ఆడపడుచు, ఆమె భర్త జావిద్‌ల వేధింపులు తట్టుకోలేకనే తన కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి నూర్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీస్ ఉద్యోగం వద్దన్నందుకు వివాహిత ఆత్మహత్య
నంగునూరు(సిద్దిపేట): ఉద్యోగం చేయొద్దన్నారని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం రాత్రి గట్లమల్యాలలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, రాజగోపాల్‌పేట ఎస్ఐ మోహన్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన మార్త రాజయ్య కూతురు కల్యాణి(24)తో గట్లమల్యాలకు చెందిన కారు హరీష్‌తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. ఎంబీఏ పూర్తి చేసిన కల్యాణి వివిధ పోటీ పరీక్షలు రాయగా కానిస్టేబుల్ ఉద్యోగానికి అర్హత సాధించింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూరైంది. పోలీస్ ఉద్యోగం వద్దని భర్త హరీష్, అత్త రమణ, మరిది శ్రీహరి కొన్ని రోజులుగా వేధిస్తున్నారు. దీంతో మనస్తాపం చెందిన కల్యాణి శుక్రవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మోహన్‌రెడ్డి తెలిపారు. కాగా కల్యాణి రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
పెళ్లయిన ఏడాదిన్నరకే వివాహిత ఆత్మహత్య
కర్ణాటక: అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలమంగల తాలూకా తిరుమలెగౌడనపాళ్య గ్రామంలో చోటుచేసుకుంది. భవ్య (27) మృతురాలు. తిరుమలెగౌడనపాళ్య గ్రామానికి చెందిన కిరణ్‌తో ఏడాదిన్నర క్రితం రూ.30 లక్షల కట్నం ఇచ్చి ఎంతో వైభవంగా వివాహం జరిపించారు భవ్య తల్లితండ్రులు. సంతానం కలగలేదని, అదనపు కట్నం తీసుకురావాలని అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి. భవ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇరువర్గాలనూ పిలిచి రాజీ చేశారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో భవ్య లక్కప్పనహళ్లి గ్రామంలోని పుట్టింటికి వచ్చేసింది. జీవితం ఇలా అయిపోయిందని విరక్తి చెంది శనివారం సాయంత్రం వాదకుంట గ్రామం వద్ద రైలుకింద తలపెట్టి ఆత్మహత్య చేసుకుంది. భవ్య తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెలమంగల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
భర్తతో విభేదాలు.. మరో వ్యక్తితో సహజీవనం.. వివాహిత అనూహ్య నిర్ణయం
ముత్తుకూరు : ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ముత్తుకూరులో జరిగింది. ఎస్సై శివకృష్ణారెడ్డి కథనం మేరకు.. పంటపాళెం పంచాయతీలోని కోళ్లమిట్టకు చెందిన నాసిన శ్రీలేఖ (28) అనే వివాహిత భర్తతో విభేదించి ముత్తుకూరు బీసీ కాలనీలో నివాసం ఉంటోంది. కొద్ది నెలలుగా దుర్గాప్రసాద్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే, ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. గొడవలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరిగాయి. దుర్గాప్రసాద్ వెలుపలకు వెళ్లగానే శ్రీలేఖ ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని మృతి చెందింది. కొద్దిసేపటికి వచ్చిన దుర్గాప్రసాద్ ఇంటి తలుపులు వేసి ఉండడంతో గట్టిగా కేకలు వేసినా తలుపులు తెరవలేదు. చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు పగులగ్గొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ శ్రీలేఖ కనిపించింది. సమాచారం అందుకున్న ఎస్సై తన సిబ్బందితో మృతదేహాన్ని కిందకు దించి, పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త చాక్లెట్ తేలేదని ఆత్మహత్య
కృష్ణరాజపురం: సమాజంలో మహిళలు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఆత్మస్థైర్యంతో జీవనం సాగిస్తున్నారు. ఇందుకు భిన్నంగా ఇద్దరు పిల్లలున్న ఓ మహిళ చిన్న కారణానికి క్షణికావేశంలో చేజేతులా జీవితాన్ని అంతం చేసుకుంది. భర్త చాక్లెట్ తేలేదని ఉరి వేసుకుంది. ఈ ఘటన నగరంలో హెణ్ణూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హెణ్ణూరులో నందిని (30) అనే మహిళ తన భర్తతో కలిసి నివాసం ఉంటోంది. వీరికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త సెలూన్ నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం భర్త సెలూన్‌కు వెళ్లే సమయంలో తనకు చాక్లెట్ తేవాలని కోరింది. అతను ఎంతసేపటికీ ఇంటికి రాలేదు. దీంతో నందిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త మధ్యాహ్న సమయంలో ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. ఇంటికి వచ్చి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. హెణ్ణూరు పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఏం జరిగిందో ఏమో.. పెళ్లైన ఏడు నెలలకే షాకింగ్ నిర్ణయం..
సీతానగరం(తూర్పుగోదావరి): ఏమి జరిగిందో ఏమో పెళ్లైన ఏడు నెలలకే ఆమె తన జీవితాన్ని చాలించింది. మండలంలోని సింగవరానికి చెందిన సుంకర ధరణి (19) ఆదివారం తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై కె.శుభశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు తండ్రి గతంలో మరణించగా, తల్లి వేరే వ్యక్తితో పెళ్లి చేసుకుని వెళ్లింది. మృతురాలు ధరణి అమ్మమ్మ పోకల వెంకటలక్ష్మి వద్ద తన అన్న దుర్గాప్రసాద్‌తో ఉంటోంది. చదవండి: రెండున్నరేళ్ల క్రితం పెళ్లి.. మహిళ దారుణహత్య.. ఆ ఇంట్లో ఏం జరిగింది? ఈ ఏడాది మార్చిలో రాపాకకు చెందిన మైలవరపు అంజనేయులతో వివాహం అయింది. రెండు నెలల క్రితం భర్త ఆంజనేయులు కువైట్ వెళ్లాడు. అన్నయ్య దుర్గాప్రసాద్ తాపీ పనిలోకి వెళ్లగా, ఉదయం 11 గంటలకు కార్తిక ఉపవాసం ఉన్న ధరణి తనకు కడుపునొప్పి వస్తోందని అమ్మమ్మకు చెప్పగా పడుకోమని చెప్పింది. అమ్మమ్మ కొంత సమయం తరువాత గదిలోకి వెళ్లగా చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉంది. ఆత్మహత్య చేసుకున్న మనుమరాలను చూసి ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మృతదేహాన్ని కిందకు దించారు. సమాచారం అందుకున్న ఎస్సై వెళ్లి పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శుభశేఖర్ తెలిపారు. -
భర్త సంసారానికి పనికి రాడని చెప్పి.. జాతరకు వెళ్లి..
సాక్షి, హస్తినాపురం (హైదరాబాద్): భర్త వేధింపులతో తన కూతురు మృతి చెందిందని తల్లిదండ్రులు, బంధువులు సోమవారం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. మృతురాలి భర్త దేవిరెడ్డి, మామ జంగారెడ్డి పోలీస్ స్టేషన్లో తలదాచుకోవడం ఏంటని బంధువులు పెద్దఎత్తున తరలివచ్చి స్టేషన్ ముందు బైఠాయించారు. వివరాలు ఇలా.. మాడ్గుల మండలం అర్కపల్లికి చెందిన మానసను వనస్థలిపురం క్రిష్టియన్‌కాలనీకి చెందిన దేవిరెడ్డితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. దేవిరెడ్డి మెడికల్ కంపెనీలో పని చేస్తుండగా మానస ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. అయితే... దేవిరెడ్డి సంసార జీవితానికి పనికిరాడని మానస తల్లిదండ్రులకు చెప్పగా కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కోసం పెంచుకున్న దేవిరెడ్డి మానసను పలుమార్లు కొట్టడంతో పెద్దల సమక్షంలో ఇరువురికి నచ్చజెప్పారు. ఈ విషయమై 2021లో దేవిరెడ్డిపై మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చదవండి: (నవమి వేడుకల్లో ఘర్షణలు) నాటి నుంచి తల్లిదండ్రుల వద్ద ఉంటున్న మానస ఈ నెల 9న మెదక్ జిల్లాలోని ఏడుపాయల జాతరకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. అక్కడ మానస అపస్మారక స్థితిలో వెళ్లడంతో వెంటనే అక్కడి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు నగరంలోని గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా మానస అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. గత మూడ్రోజులుగా మానసిక క్షోభతో మృతి చెందిన మానస మృతదేహానికి భర్త దేవిరెడ్డి అంత్యక్రియలు జరపాలని డిమాండ్ చేయడంతో ఇంటికి తాళం వేసి వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఉండడంతో మృతురాలి బంధువులు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. -
20 నిమిషాల పాటు ఫోన్లో.. రైలుకు ఎదురెళ్లి..
చెన్నై: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరువళ్లూరులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పుట్లూరుకు చెందిన దివ్య(30) బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో మనస్పర్థలు రావడంతో రెండు వారాల నుంచి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 9 గంటలకు పార్లర్‌ను మూసివేసి పుట్లూరులోని ఇంటికి బయలుదేరింది. రైల్వేట్రాక్ వద్ద సుమారు 20 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడింది. ఎక్స్‌ప్రెస్ రైలు వస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై ఎదురుగా వెళ్లింది. రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (చిన్నారిపై ఉపాధ్యాయుడి ఆత్యాచారాయత్నం.. బాలిక వీపుపై..) -
నాలుగేళ్ల క్రితం వివాహం.. పురుగులమందు తాగిన వివాహిత
సాక్షి, బెజ్జంకి(మెదక్): పురుగులమందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వివాహిత మృతిచెందింది. పోలీసుల వివరాల ప్రకారం మండలంలోని గుండారం గ్రామానికి చెందిన ఎలుకంటి గురువారెడ్డి, లక్ష్మీల కూతురు శిరిషను నాలుగేళ్ల క్రితం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌కు చెందిన నాగెల్లి రజనీకాంత్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి కూతురు వినీక్ష ఉంది. ఆరు నెలల క్రితం రజనీకాంత్‌కు ఆస్ట్రేలియాలో ఉద్యోగం రావడంతో శిరీషను గుండారంలోని తల్లిగారింట్లో వదిలి వెళ్లాడు. పెళ్లికి ముందు నుంచి ఫిట్స్‌తో బాధపడుతున్న శిరీష తరచూ అనారోగ్యానికి గురవుతుండడంతో మనస్తాపం చెంది ఈనెల 6న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. చదవండి: Hyderabad: సెల్‌ఫోన్ చోరుల కొత్త పంథా -
మరో వ్యక్తితో వివాహం.. ప్రియునితో కలిసి వివాహిత ఆత్మహత్య
సాక్షి, దొడ్డబళ్లాపురం: వివాహిత ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కనకపుర తాలూకా కబ్బాళు పుణ్యక్షేత్రంలో చోటుచేసుకుంది. తమిళనాడు కృష్ణగిరి జిల్లా ఉరుగ్యం గ్రామానికి చెందిన చందన (20), సతీష్ (24) పరస్పరం ప్రేమించుకున్నారు. అయితే చందన తల్లిదండ్రులు వీరి వివాహానికి అంగీకరించలేదు. కనకపుర తాలూకా దొడ్డమరళ్లికి చెందిన గణేశ్ అనే వ్యక్తితో వివాహం జరిపించారు. ఈ క్రమంలో చందన, సతీష్ కనకపురలోని కబ్బాళు పుణ్యక్షేత్రంలో కొండమీద విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. చందన నాలుగు రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించి సాతనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: (సీఐ గారి రైస్‌మిల్ కథ!.. సుప్రియ పేరుతో) -
రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో..
దొడ్డబళ్లాపురం: ఇంట్లో ఉరివేసుకుని వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దొడ్డ గ్రామీణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పుష్పలత (35)ఆత్మహత్య చేసుకున్న వివాహిత మహిళ. తాలూకాలోని మజరాహొసహళ్లి గ్రామం నివాసి పుట్టరాజు భార్య పుష్పలత సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. కన్నడ భాషా సంఘాల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండే ఆమె ప్రాణాలు తీసుకోవడం ప్రశ్నార్థకంగా మారింది. భర్త పుట్టరాజు పారిశ్రామికవాడలోని ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. తను అభిమానించే స్థానిక ప్రముఖ వ్యక్తి ఆదివారం మృతి చెందడంతో కలత చెందిన పుష్పలత ఆత్మహత్య చేసుకుందని కొందరు చెబుతున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
ప్రకాశం, కొమరోలు (గిద్దలూరు): వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండల కేంద్రంలోని బ్యాంకు వీధిలో ఆదివారం జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. మండలంలోని కె.బొంతపల్లె గ్రామానికి చెందిన మాలపాటి వెంకటేశ్వర్లుకు రుక్మిణి(23)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరు కొమరోలులో ఎలక్ట్రికల్ షాపు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తూ బ్యాంకు వీధిలోని ఓ గృహలో నివాసం ఉంటున్నారు. భర్త వెంకటేశ్వర్లు దుకాణానికి వెళ్లి పక్కనే ఉన్న పురుషోత్తం పల్లెలో స్నేహితుల గృహంలో జరుగుతున్న శుభకార్యానికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రుక్మిణి ఫ్యాన్‌కు తాడు బిగించుకుని ఉరేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. ఆయన వచ్చి చూసేలోగానే ఆమె మృతి చెందింది. నాలుగేళ్లుగా పిల్లలు లేకపోవడంతో మనస్తాపానికి గురై మృతి చెందినట్లు బంధువులు చెప్పారని ఏఎస్ఐ పి.ఇమ్మానియేలు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
విశాఖపట్నం, నర్సీపట్నం: భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. పట్టణానికి చెందిన దుర్గాప్రసాద్ ఇదే గ్రామానికి చెందిన వసుంధర అనే యువతి ఏడేళ్లుగా ప్రేమించుకుని, ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. వీరి వివాహాన్ని దుర్గాప్రసాద్ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వీరిద్దురూ పట్టణంలోనే వేరుగా కాపురం ఉంటున్నారు. కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో దుర్గా ప్రసాద్...భార్య వసుంధరను వేధింపులకు గురి చేస్తున్నాడు. భర్త వేధింపులు భరించలేక బుధవారం ఉదయం భర్త ఇంటి ముందే వసుంధర బ్లేడ్‌తో చేయికోసుకుంది. తీవ్రంగా రక్తస్రావం కావడంతో అపస్మారిక స్థితికి చేరుకుంది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు సంఘన స్థలానికి వెళ్లి వసుంధరను ఏరియా ఆస్పత్రికి తరలించారు. వసుంధర మాట్లాడుతూ దుర్గాప్రసాద్‌తో తనకు ఆరు నెలల క్రితం వివాహం జరిగిందని తెలిపింది. మూడు నెలల గర్భాన్ని తన భర్త తీయించేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. కట్నం తీసుకురమ్మని భర్త నిత్యం వేధిస్తున్నానడని తెలిపింది. గర్భం పోవడంతో పాటు భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నం చేశానని తెలిపింది. తనను వేధిస్తున్న భర్త దుర్గాప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. తన భర్తపై గతంలో ఫిర్యాదు చేశానని అయినా పోలీసులు పట్టించుకోలేదని వసుంధర తెలిపింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని సీఐ సింహాద్రినాయుడు తెలిపారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
చిత్తూరు, ములకలచెరువు: అనుమానాస్పద స్థితిలో ఒక వివాహిత బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం..మండలంలోని కొండకింద వడ్డిపల్లెకు చెందిన పూజారి సురేంద్రకు కర్నాటక రాష్ట్రం లక్ష్మీపురం పంచాయతీ గౌడతాతగడ్డకు చెందిన మేకల తిమ్మప్ప కుమార్తె గంగోత్రి (20)కి గత ఏడాది నవంబరులో వివాహం చేశారు. సురేంద్ర కోలారులో ఎలక్రీషియన్‌గా పని చేస్తూ నెలలో రెండు, మూడు రోజులు కొండకింద వడ్డిపల్లెకు వచ్చి వెళ్లేవాడు. తానూ కోలారులో ఉంటానని ఎన్నోసార్లు గంగోత్రి కోరినా సురేంద్ర తిరస్కరించాడు. గ్రామంలో తన తల్లిదండ్రుల వద్దే ఉండాలని చెప్పాడు. ఈ నేపథ్యంలో, మనస్తాపానికి గురై మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు గమనించి తలుపులు పగలగొట్టి గంగోత్రిని కిందికి దించారు. సమాచారమివ్వడంతో 108తో సిబ్బంది అక్కడి చేరుకున్నారు. అప్పటికే గంగోత్రి మృతి చెందిందని ధ్రువీకరించారు. పోలీసులకు సమాచారం అందడంతో సీఐ శ్రీనివాసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతికి గల కారణాలపై కుటుంబ సభ్యులను ఆరా తీశారు. భర్త దూరంగా ఉన్నాడనే మనస్తాపమా? వేధింపులేమైనా ఉన్నాయా? ఇతర కారణాలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నువ్ అందంగా లేవు.. నీ చెల్లితో పెళ్లి చెయ్..!!
ఆదోని టౌన్: అందంగా లేవని భర్త నిత్యం వేధిస్తుండటంతో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన శనివారం కోసిగిలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు.. కోసిగికి చెందిన లక్ష్మి, కిష్టప్ప దంపతుల కూతురు లింగమ్మను ఏడు నెలల క్రితం పల్లెపాడు గ్రామానికి చెందిన మల్లేష్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లైన కొంతకాలానికే అందంగా లేవని, నీ చెల్లిని తనకు ఇచ్చి వివాహం చేసేలా తల్లిదండ్రులను ఒప్పించాలని, లేకపోతే పుట్టింటికి వెళ్లిపోవాలని వేధించేవాడు. వేధింపులు తట్టుకోలేక దీపావళికి పుట్టింటికి వచ్చింది. తల్లిదండ్రులు నచ్చచెప్పి ఆదివారం అత్తగారింటికి పంపేందుకు సిద్ధమయ్యారు. అయితే అత్తగారింటికి వెళ్లేందుకు ఇష్టంలేక శనివారమే పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆదోని ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కోసిగి పోలీసులకు సమాచారం ఇచ్చామని ఔట్‌పోస్ట్ కానిస్టేబుల్ చింతలయ్య తెలిపారు. -
చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు..
నెల్లూరు , విడవలూరు: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని ఊటుకూరులో శుక్రవారం జరిగింది. వివాహిత బంధువులు, పోలీసుల కథనం మేరకు.. ఊటుకూరుకు చెందిన డి వెంకటేశ్వర్లు బేల్దారీగా పనులు చేసుకుంటున్నాడు. అతనికి ప్రకాశం జిల్లా తెట్టు గ్రామానికి చెందిన సుభాషిణి (25)తో నాలుగేళ్ల కిత్రం రెండో వివాహాన్ని జరిపించారు. ఆ సమయంలో అన్ని లాంచనాలు అందజేశారు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. కొంత కాలం అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో ఇటీవల కలతలు మొదలయ్యా యి. దీంతో మనస్థాపానికి గురైన సుభాషిణి తన ఇంట్లో మరో గదికిలో ఉదయం 5 గంటలకు వెళ్లి తలుపు వేసుకుంది. అయితే ఎంత సేపటికి భార్య బయటకు రాకపోవడంతో వెంకటేశ్వర్లు ఆ గదిలోకి వెళ్లి చూడగా సుభాషిణి తన చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులతో పాటు సుభాషిణి తల్లిదండ్రులకు తెలియజేశాడు. సుభాషిణి తల్లిదండ్రులు ఊటుకూరు గ్రామానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై వెంకట్రావు, తహసీల్దార్ బాలమురళీకృష్ణ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే సుభాషిణి తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లు ఆరోపించారు. -
మాయని మచ్చ!
ఊరంతా మహిళా దినోత్సవం జరుపుకుంటుంటే.. ఓ వివాహిత మాత్రం అర్ధంతరంగా తనువు చాలించింది. మహిళల భద్రత, గృహ హింస, చట్టాలు అంటూ వేదికలెక్కి గొప్పగా చెబుతున్నా.. మరోవైపు వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న మహిళలు సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. కేవలం అదనపు కట్నం కోసం అత్తింటి వారు తరచూ భౌతిక దాడులు, మానసిక వేధింపులు చేస్తుండడంతో భరించలేని గర్భిణి బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మకూరు: అదనపు కట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అయితే అది హత్య అని పోలీసులకు మృతురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామానికి చెందిన నరసింహులు ఇద్దరు సంతానం. తన కుమార్తె నాగేంద్రమ్మ(22)ను తొమ్మిది నెలల క్రితం అదే గ్రామానికి చెందిన శివకు ఇచ్చి వివాహం జరిపించారు. ఐదు నెలల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. వేధిస్తున్నారు.. నాన్న ఈ నేపథ్యంలోనే నాగేంద్రమ్మ గర్భం దాల్చింది. మూడు నెలలుగా అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త శివతో పాటు అతని అన్న పోతులయ్య, తల్లి (నాగేంద్రమ్మ అత్త) లింగమ్మ వేధింపులు మొదలు పెట్టారు. ఇదే విషయమై పలుమార్లు తండ్రి వద్ద నాగేంద్రమ్మ వాపోయింది. ‘నాన్న.. డబ్బు కావాలంటూ మా ఆయనతో పాటు అత్త, బావ రోజు నన్ను మాటలతో కాల్చుకు తింటున్నారు’ అంటూ కన్న తండ్రి ఎదుట ఆమె బోరుమంది. గర్భణి అని కూడా చూడకుండా భౌతిక దాడులకు సైతం తెగబడుతున్నారంటూ కన్నీటి పర్యంతమైంది. ఉరి వేసుకుని.. వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో నాగేంద్రమ్మ తాళలేకపోయింది. చివరకు ఆత్మహత్య ఒక్కటే మార్గంగా ఆమె భావించింది. ఈ నెల 6న కూడేరులోని ఆస్పత్రిలో వైద్య చికిత్సల కోసం నాగేంద్రమ్మను పిలుచుకెళ్లారు. గురువారం ఉదయం ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఫోన్ చేయడంతో నరసింహులు అక్కడకు చేరుకుని పరిశీలించాడు. హతమార్చారు.. తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత బలహీనురాలు కాదంటూ ఈ సందర్భంగా నరసింహులు కన్నీటి పర్యంతమయ్యాడు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ తరచూ తన వద్ద బాధపడుతుండేదని తెలిపారు. పరిస్థితి అనుకూలంగా లేదని కొంత కాలం ఆగితే కొద్దోగొప్పో డబ్బు సర్దుతానంటూ చెప్పుకొచ్చినట్లు వివరించారు. ఇంతలో అత్తింటి వారు ఇంతటి దురాగతానికి పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రైలు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
తిరువొత్తియూరు: భర్త వివాహేతర సంబంధం గురించి ప్రశ్నించిన సమయంలో వరకట్నం కోసం వేధించడంతో సోమవారం సాయంత్రం రైలు నుంచి కిందకి దూకి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన దిగ్భ్రాంతిని కలుగచేసింది. చెన్నై జార్జ్‌టౌన్ ప్రాంతానికి చెందిన జీవిత వానగరం అపోలో ఆసుపత్రిలో వైద్య సహాయకురాలిగా పని చేస్తున్నారు. ఈమెకు చెన్నై ఆవడికి చెందిన మురళి కుమారుడు రోస్తో 2016 సంవత్సరంలో వివాహమైంది. ఈ దంపతులకు ఒక ఆడ బిడ్డ ఉంది. ఈ క్రమంలో భర్తకు మరో యువతితో వివాహేతర సంబంధం ఏర్పడిన సంగతి తెలుసుకున్న జీవిత దిగ్భ్రాంతి చెందింది. దీని గురించి తన భర్తను ప్రశ్నించింది. అయితే రోస్ తండ్రి, తల్లి వరకట్నం తీసుకురమ్మని జీవితను వేధించేవారని తెలిసింది. దీని గురించి జీవిత తన బంధువులకు తెలపగా వారు ఆమె సర్దిజెప్పి పంపినట్టు తెలిసింది. దీనిపై భార్య, భర్తకు సోమవారం గొడవ ఏర్పడింది. దీంతో విరక్తి చెందిన జీవిత తల్లిదండ్రుల ఇంటికి రావడానికి తాంబరం నుంచి బీచ్ రైల్వేస్టేషన్‌కు రైలు ఎక్కింది. రైలులో వెళుతున్న సమయంలో అడయారు వంతెనపై కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంది. -
ప్రేమించి..ప్రాణం తీసుకున్నారు!
చీరాల: వారు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యువతికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా కలి సి ఉండాలన్న ఆ ప్రేమికుల కోరికను పెద్దలు అంగీకరించలేదు. వివాహ బంధం వారి కలయికకు అడ్డుగా మారింది. పెద్దలను ఒప్పించే ధైర్యం లేక సమాజం చిన్నచూపు చూస్తోం దని భావించి ప్రేమికుల దినోత్సవం రోజే యువకుడు, వివాహిత రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి సమయంలో వేటపాలెం మండలం రామన్నపేట రైల్వేగేటు సమీపంలో జరగగా గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన వారిలో వివా హితది చీరాల మండలం దేవాంగపురి గ్రామం కాగా యువకుడిది చీరాల మండలం గాంధీనగర్ పంచాయతీలోని ఎంజీసీ కాలనీ. మృతులు ఒకే సామాజిక వర్గం వారు. ఏం జరిగిందంటే.. మండలంలోని గాంధీనగర్ పంచా యతీ ఎంజీసీ కాలనీకి చెందిన యువకుడు చితిరాయిలా సాయిరాం (24), జాండ్రపేట పోస్టాఫీసు ప్రాంతానికి చెందిన వివాహిత పొట్టి రమ్య (24)లు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రమ్యకు భర్త రవికుమార్, 5 ఐదేళ్ల కుమారుడు, 3 ఏళ్ల కుమార్తె ఉన్నారు. వివాహిత, అవివాహితుడు ఇద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. తమ నిర్ణయాన్ని పెద్దలకు చెబితే ఒప్పుకోరని భావించడం.. కలిసి ఉండలేమని బాధ.. వెరసి అర్ధాంతరంగా తనువు చాలించాలని నిర్ణయించుకుని రైలు కిందపడి కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. కొంపముంచిన క్షణికావేశం కుటుంబానికి అండగా ఉంటాడని భావించిన తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేసిన యువకుడు.. తాను జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన రమ్య క్షణికావేశానికిలోనై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అనుమానాస్పద మృతి కేసునమోదు సంఘటన స్థలాన్ని చీరాల జీఆర్పీ ఎస్ఐ జి.రామిరెడ్డి పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమానాస్పద రైల్వే ప్రమాద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమ్య, సాయిరాం మృతదేహాలను చీరాల ఏరియా వైద్యశాల మార్చురీకి తరలించారు. శవ పరీక్ష నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందించారు. -
ప్రాణం తీసుకున్నారు...
రోజూ మద్యం తాగి వచ్చి మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న భర్త వేధింపులు తాళలేక విజయనగరంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోగా...బలిజిపేట మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు దుర్వ్యసనాలకు బానిసై తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డా డు. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం, బొబ్బిలి: బలిజిపేట మండల కేంద్రానికి చెందిన పి.శ్రీకాంత్(20) అనే యువకుడు క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం రాత్రి క్రిమి సంహారక మందు తాగడంతో స్థానికులు అక్కడి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి విజయనగరం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఏ పనులు చేయకుండా ఉండటంతో పాటు దుర్వ్యసనాలకు అలవాటు పడటంతో ఇంటి వద్ద తల్లిదండ్రులు మందలించారన్న ఉక్రోషంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు సూర్యనారాయణ, సత్యవతి బోరున విలపిస్తున్నారు. బలిజిపేట ఎస్ఐ సింహాచలం కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాంత్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. భర్త వేధింపులు తాళలేక... విజయనగరం టౌన్: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని ఉడాకాలనీలో గురువారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి వన్‌టౌన్ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు... స్థానిక ఉడాకాలనీ ఫేజ్–3 ఆంజనేయ స్వామి గుడి వద్ద నివాసముంటున్న అద్దెపల్లి రమాదేవి (27) భర్త ఎవిఎస్.రాజుతో కలిసి జీవనం సాగిస్తున్నారు. వీరికి వెంకట్ చరణ్ అనే బాబు ఉన్నాడు. స్థానిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. నాలుగేళ్లుగా రాజు నిత్యం మద్యం సేవించి, ఇంటికి వచ్చి భార్య రమాదేవిని దుర్భాషలాడడం, కొట్టడం, తిట్టడం వంటివి చేస్తూ ఇబ్బందులు పెడుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం భార్యను వేధించసాగాడు. అనంతరం కొడుకును పాఠశాలకు తీసుకెళ్లి, ఇంటికి వచ్చి చూడగా ఆమె ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కి ఉరి వేసుకుందని గ్రహించాడు. రాజు సమీపంలో ఉన్న వారి సాయంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు మృతి చెందిందని నిర్ధారించారని పోలీసులకు తెలిపాడు. గతంలో రాజుకు ఇద్దరు భార్యలుండేవారు. వారు సహజ మరణం చెందడంతో పెద్దల సమక్షంలోనే మూడో భార్యగా రమాదేవిని చేసుకున్నాడు. వన్‌టౌన్ సీఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. -
క్షణికావేశంలో లోకం విడిచింది..
ప్రకాశం, గుడ్లూరు: భర్తతో గొడవపడి క్షణికావేశంలో ఉరివేసుకొని వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని తెట్టు గ్రామంలో సోమవారం రాత్రి 11గంటల సమయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గుంటూరు జిల్లా నకిరేకల్లు మండలం చల్లగుండ్ల గ్రామానికి చెందిన దావులూరి వెంకటేశ్వర్లు అదే జిల్లా ఈపూరు మండలం బొగ్గారం గ్రామానికి చెందిన భూ లక్ష్మీని వివాహం చేసున్నాడు. వారికి 5 సంవత్సరాల కుమార్తె సుస్మిత 2 సంవత్సరాల షణ్ముఖ సాయిలున్నారు. వెంకటేశ్వర్లు నాలుగు సంవత్సరాల నుంచి తెట్టు వద్ద ఉన్న హెచ్‌పీ పెట్రోలు బంకులో మేనేజరుగా పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి తెట్టులోనే బాబురావు అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇటీవల నుంచి వెంకటేశ్వర్లు తరచు మద్యం సేవిస్తూ వస్తుండటంతో భార్య భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. సోమవారం రాత్రి కూడా ఇదే విషయంలో ఇద్దరూ వాగ్వాదం చేసుకున్నారు. తరువాత వెంకటేశ్వర్లు స్నానం చేయడానికి వెళ్లగా భూ లక్ష్మి(28) ఇంట్లో ఉరివేసుకొంది. స్నానపు గదిలో నుంచి బయటకు వచ్చిన వెంకటేశ్వర్లు తాడుకు వేళ్లాడుతున్న భూలక్ష్మీని కిందకు దించాడు. అప్పటికే ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్సై వేమన సంఘటనా స్థలంకు చేరుకున్నారు. మృతదేహాన్ని సీఐ నరసింహారావు మంగళవారం పరిశీలించారు. తహసీల్దార్ ఇందిరాదేవి శవ పంచనామా నిర్వహించారు. మృతురాలు తండ్రి వెంకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వేమన తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. -
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
అద్దంకి రూరల్: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన అద్దంకి పట్టణంలోని కొత్త దామావారిపాలెంలో మంగళవారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు పట్టణంలోని కొత్తదామావారిపాలెంలో నివాసం ఉంటున్న కటికల సుజాత (25) స్థానిక పెట్రోలు బంకులో పనిచేస్తున్న వీరాంజనేయులుని ప్రేమించి వివాహం చేసుకుంది. ఇటీవల భర్తపై అనుమానం పెంచుకుంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. స్థానికులు గమనించి వైద్యశాలకు తరలించగా, మార్గమధ్యంలోనే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
ఏలూరు అర్బన్ : భర్త వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని మనస్తాపానికి గురైన భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబం««ధించి మృతురాలి తండ్రి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ నగరంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న కులుకుర్తి సత్యనారాయణ కుమార్తె దుర్గాభవానీకి ఏలూరు నగరానికి చెందిన దిమిలి శివకుమార్ అనే వ్యక్తితో 2013లో వివాహం జరిగింది. నాటి నుంచి దుర్గాభవానీ, శివకుమార్‌లు స్థానిక గ్జేవియర్‌నగర్ ఏటిగట్టు సమీపంలో నివాసం ఉంటున్నారు. అయితే శివకుమార్ కొంతకాలంగా పొరుగింట్లో ఉంటున్న మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఇది గమనించిన దుర్గాభవానీ, శివకుమార్‌ను నిలదీసింది. దాంతో వారిద్దరూ తగవులు పడుతున్న నేపథ్యంలో కుమార్తె ద్వారా విషయం తెలుసుకున్న తండ్రి సత్యనారాయణ ఈ నెల 17న ఏలూరు వచ్చి అల్లుడిని అక్రమసంబంధం విషయంలో నిలదీశాడు. దాంతో అల్లుడు శివకుమార్ దుర్గాభవానీ గొడ్రాలని, పిల్లలు పుట్టలేదని ప్రియురాలిని విడిచి పెట్టేదిలేదని తెగేసి చెప్పాడు. ఈ క్రమంలో శనివారం తన కూతురు దుర్గాభవానీ ఉరివేసుకుని మరణించిందని వార్త తెలియడంతో ఏలూరు వచ్చానని సత్యనారాయణ తెలిపారు. తన కూతురు మరణానికి భర్త వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో పాటు ఇటీవలే ఆమెను వివాహం చేసుకున్నాడని తెలిసిందని ఈ కారణంతో మనస్తాపానికి గురైన తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆయన పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. తన కుమార్తె మరణానికి పరోక్షంగా కారణమైన అల్లుడు శివకుమార్‌తో పాటు అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశాడు.