
ఫ్యాన్‌కు వేలాడుతున్న మృతదేహం రుక్మిణి మృతదేహం
ప్రకాశం, కొమరోలు (గిద్దలూరు): వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండల కేంద్రంలోని బ్యాంకు వీధిలో ఆదివారం జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. మండలంలోని కె.బొంతపల్లె గ్రామానికి చెందిన మాలపాటి వెంకటేశ్వర్లుకు రుక్మిణి(23)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరు కొమరోలులో ఎలక్ట్రికల్ షాపు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తూ బ్యాంకు వీధిలోని ఓ గృహలో నివాసం ఉంటున్నారు. భర్త వెంకటేశ్వర్లు దుకాణానికి వెళ్లి పక్కనే ఉన్న పురుషోత్తం పల్లెలో స్నేహితుల గృహంలో జరుగుతున్న శుభకార్యానికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రుక్మిణి ఫ్యాన్‌కు తాడు బిగించుకుని ఉరేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. ఆయన వచ్చి చూసేలోగానే ఆమె మృతి చెందింది. నాలుగేళ్లుగా పిల్లలు లేకపోవడంతో మనస్తాపానికి గురై మృతి చెందినట్లు బంధువులు చెప్పారని ఏఎస్‌ఐ పి.ఇమ్మానియేలు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment