సాంక్రియ తండాలో ఘటన
భర్త, బంధువులు చంపారని పోలీసులకు తండ్రి ఫిర్యాదు
సంగెం: అనుమానాస్పదస్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటన సంగెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. మండలంలోని నర్సానగర్ శివా రు జాటోత్ తండాకు చెందిన జాటోత్ రవీందర్ రెండో కూతురు దివ్య(22)ను అదే తండా పరిధిలోని సాంక్రియ తండాకు చెందిన గుగులోత్ పవన్‌కు ఇచ్చి 2021లో వివాహం జరిపించారు.
కొంతకాలం వరకు సజావుగా సాగిన కాపురంలో అశ్విత జన్మించింది. ఈ క్రమంలో పవన్ కొంత కాలంగా వివాహేత సంబంధం పెట్టుకుని దివ్యను ఇబ్బందులకు గురిచేసేవాడు. దీంతో దివ్య తల్లిగా రింటి వద్ద ఉంటోంది. గత సెప్టెంబర్ 6న పవన్ పెద్దమనుషులను తీసుకుని వచ్చి ఇకనుంచి ఇబ్బందులకు గురిచేయనని చెప్పి భార్యను కాపురానికి తీసుకెళ్లాడు. అయినా అతడి తీరులో మార్పు రాలేదని దివ్య తన తల్లితండ్రులకు చెప్పేది.
ఈక్రమంలో సోమవారం ఉదయం పవన్ తన మామ రవీందర్‌కు ఫోన్ చేసి దివ్య ఆరోగ్యం బాగాలేదని ఎంజీఎంకు తీసుకెళ్తున్నానని సమాచారం ఇచ్చాడు. దీంతో తల్లిదండ్రులు ఎంజీఎం వెళ్లి చూడగా దివ్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన కూతురు దివ్యను అల్లుడు పవన్, అతడి కుటుంబీకులు చంపినట్లు రవీందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.
హగ్ ఇస్తేనే పాస్‌పోర్టు ఇస్తా: కానిస్టేబుల్ వేధింపులు
Comments
Please login to add a commentAdd a comment