Marital relationship
-
భర్త వివాహేత సంబంధం.. భార్య అనుమానాస్పద మృతి
సంగెం: అనుమానాస్పదస్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటన సంగెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. మండలంలోని నర్సానగర్ శివా రు జాటోత్ తండాకు చెందిన జాటోత్ రవీందర్ రెండో కూతురు దివ్య(22)ను అదే తండా పరిధిలోని సాంక్రియ తండాకు చెందిన గుగులోత్ పవన్‌కు ఇచ్చి 2021లో వివాహం జరిపించారు. కొంతకాలం వరకు సజావుగా సాగిన కాపురంలో అశ్విత జన్మించింది. ఈ క్రమంలో పవన్ కొంత కాలంగా వివాహేత సంబంధం పెట్టుకుని దివ్యను ఇబ్బందులకు గురిచేసేవాడు. దీంతో దివ్య తల్లిగా రింటి వద్ద ఉంటోంది. గత సెప్టెంబర్ 6న పవన్ పెద్దమనుషులను తీసుకుని వచ్చి ఇకనుంచి ఇబ్బందులకు గురిచేయనని చెప్పి భార్యను కాపురానికి తీసుకెళ్లాడు. అయినా అతడి తీరులో మార్పు రాలేదని దివ్య తన తల్లితండ్రులకు చెప్పేది. ఈక్రమంలో సోమవారం ఉదయం పవన్ తన మామ రవీందర్‌కు ఫోన్ చేసి దివ్య ఆరోగ్యం బాగాలేదని ఎంజీఎంకు తీసుకెళ్తున్నానని సమాచారం ఇచ్చాడు. దీంతో తల్లిదండ్రులు ఎంజీఎం వెళ్లి చూడగా దివ్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన కూతురు దివ్యను అల్లుడు పవన్, అతడి కుటుంబీకులు చంపినట్లు రవీందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. హగ్ ఇస్తేనే పాస్‌పోర్టు ఇస్తా: కానిస్టేబుల్ వేధింపులు -
సంసారం.. ఆర్ధిక చదరంగం!
హైదరాబాద్‌కు చెందిన మనీషా (30) పెళ్లయి ఏడాది కూడా కాలేదు. అప్పుడే భర్తతో ఆమెకు వాదోపవాదాలు నిత్య కృత్యంగా మారాయి. అది కూడా ఆర్ధిక అంశాలపైనే. పెళ్లికి రెండేళ్ల ముందు నుంచే మనీషా దంపతులు ఒకరికొకరు పరిచయస్థులు. ఎన్నో అంశాలపై గంటల తరబడి మాట్లాడుకున్న వారే. ‘‘అతడి గురించి నాకు అంతా తెలుసనుకున్నా. కానీ, ఆర్థిక అంశాల నిర్వహణ గురించి ఎప్పుడూ మాట్లాడుకున్నది లేదు. అక్కడే మేము తప్పటడుగు వేశామని అనిపిస్తోంది’’ అన్నది మనీషా అంతరంగం. వైవాహిక బంధం చిరకాలం వర్ధిల్లాలంటే దంపతుల మధ్య చక్కని అవగాహన, పరస్పర గౌరవం, అభిమానం ఉంటే సరిపోతుందని అనుకుంటాం. కానీ, ఆర్థిక అవగాహన కూడా ఉండాలన్నది నిపుణుల సూచన. తమకు ఏ ఆహారం అంటే ఇష్టం, తమకు నచ్చే సినిమాలు, మెచ్చే పర్యాటక ప్రాంతాలు.. ఇలా మూడు ముళ్లకు ముందే ముచ్చట్లు ఎన్నో చెప్పుకోవడం, పరస్పర ఇష్టాలు పంచుకోవడం చేస్తుంటారు. కానీ, ఆర్థిక అంశాలు, భవిష్యత్ ఆర్ధిక లక్ష్యాల గురించి చర్చించుకునే వారు బహుశా చాలా తక్కువగా ఉంటారు. ఇలా చేయకపోవడం వల్ల ఎలాంటి ప్రతికూలతలు ఎదురవుతాయో మనీషా ఉదంతం చెబుతోంది. అందుకే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టడానికి ముందే భవిష్యత్ ఆర్ధిక పథంపై మనసు విప్పి చర్చించుకోవడం ఎంతో అవసరం. దీని ప్రాధాన్యతను తెలియజెప్పే కథనమే ఇది... మారుతున్న పరిస్థితులు.. ఆర్ధిక విభేదాలు వైవాహిక బంధంలో చిచ్చుపెట్టే ప్రమాదం లేకపోలేదు. ఆర్థికంగా అప్పుల పాలై, బయట పడే మార్గం తోచక సామూహిక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అమెరికాకు చెందిన ‘జిమెనెజ్ లా ఫర్మ్’ చేసిన అధ్యయనంలో.. ఆ దేశంలో 29% విడాకులకు ఆర్ధిక విభేదాలే కారణం అవుతున్నట్టు తెలిసింది. అమెరికా స్థాయిలో ప్రస్తుతం మన దేశంలో బంధాల విచ్ఛిన్నానికి ఆర్ధిక అంశాలు కారణం కాకపోవచ్చు. కానీ, ఇటీవలి కాలంలో మనదేశంలోనూ మహిళల ఆర్ధిక సాధికారత మెరుగుపడుతూ వస్తోంది. పెళ్లయిన తర్వాత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొనసాగేందుకు యువతరం మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్థిక అంశాల్లో వారు పురుషులకు ఏ మాత్రం తక్కువ కాదు. కనుక ఆర్ధిక అంశాలపైనా దంపతుల మధ్య ఏకాభిప్రాయం, పరస్పర అంగీకారాలు ముఖ్యమే. చర్చించుకోవడమే మెరుగైన మార్గం వివాహం తర్వాత ఆర్ధిక విభేదాలు పొడచూపకూడదని అనుకుంటే, అందుకు ఎలాంటి జంకు లేకుండా ‘మనీ’ గురించి సౌకర్యంగా మాట్లాడుకోవడమే మంచి పరిష్కారం. ‘‘దంపతుల్లో చాలా మంది ఆర్ధిక అంశాల గురించి మాట్లాడుకోవడానికి సంకోచిస్తుంటారు. డబ్బు మనిషనో లేదా ఆధిపత్యం చెలాయిస్తున్నారనో పొరపడతారన్నది వారి ఆందోళన. కానీ విడాకులకు ఆర్ధిక అంశాలు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. కనుక ఈ అంశాలపై చర్చించుకోవడం ఎంతో ముఖ్యం’’ అని ఫిన్‌సేఫ్ ఎండీ మృణ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఆర్ధిక నిర్ణయాలను అప్పటి వరకు కలిగి ఉన్న ఆర్ధిక అవగాహనే నిర్ణయిస్తుంది. తమ నిర్ణయాలను గౌరవించే, ఏకీభవించే భాగస్వామిని గుర్తించడం వైవాహిక బంధం విజయవంతానికి కీలకమని నిపుణుల సూచన. విల్లా, కారు తదితర ఆకాంక్షలు ఏవైనా ఉన్నాయా? ఎప్పటిలోపు వాటిని సాధించాలని అనుకుంటున్నారు? వివాహం తర్వాత తొలి ప్రాధాన్యం ఏ లక్ష్యానికి? వినోదం, విహారానికి ఎక్కువ ఖర్చు చేయాలని అనుకుంటున్నారా? డబ్బు విషయంలో బాధ్యతగా ఆలోచిస్తున్నారా? చక్కదిద్దుకోవాల్సిన ఆర్ధిక ప్రతికూలతలు ఏవైనా ఉన్నాయా? ఇలాంటి అంశాలన్నింటిపై స్పష్టత అవసరం. ‘‘ఆర్థిక అలవాట్లలో ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంటుంది. ఒకరు ఎంతో పొదుపరి అయి ఉంటారు. మరొకరు ఖర్చు చేయడంలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఇది వివాదానికి దారితీస్తుంది. కొన్ని విభేదాలను సులభంగానే పరిష్కరించుకోవచ్చు. కానీ, కొన్ని ఓ పట్టాన పరిష్కారం కావు. అందుకని ఒకరినొకరు ఆర్థిక అంశాలపై చర్చించుకొని, నిర్ణయాలను ఉమ్మడిగా తీసుకోవాలి’’ అని ఆనంద్ రాఠి వెల్త్ డిప్యూటీ సీఈవో ఫెరోజ్ అజీజ్ సూచించారు.ప్రణాళిక ప్రకారం దంపతుల మధ్య వచ్చే కలతలకు ఎవరో ఒకరు అధికంగా ఖర్చు చేయడం ప్రధాన కారణం. ఒకరు ఎంతో పొదుపుగా రూపాయి, రూపాయి కూడబెడుతుంటే, మరొకరు ఖర్చు చేయడాన్ని ఆనందిస్తుంటే వారి మధ్య ప్రశాంతత కష్టం. విభేదాలు రాక మానవు. ఖర్చు చేసే అలవాట్లు అన్నవి ఒకరి మానసిక తీరుపైనే ఆధారపడి ఉంటాయి. కొందరు షాపింగ్‌లో ఆనందాన్ని వెతుక్కుంటారు. సంపదతో గౌరవం వస్తుందని భావిస్తుంటారు. బ్యాంక్ ఖాతాలో సరిపడా నిధులు లేకపోయినా గొప్ప కోసం ఖరీదైన ఉత్పత్తులు కొనుగోలుకు మొగ్గు చూపిస్తుంటారు. ఒక భాగస్వామి పొదుపు, మదుపు (పెట్టుబడి)కు ప్రాధాన్యం ఇస్తుండొచ్చు. ఆర్ధిక వెసులుబాటు పరిమితంగా ఉండడం ఇందుకు నేపథ్యం కావొచ్చు. అందుకే ఆర్ధిక భద్రత దృష్ట్యా పొదుపు చేస్తుండొచ్చు. దీనికి విరుద్ధమైన ధోరణి కలిగిన భాగస్వామి తోడైనప్పుడు అది స్పర్థకు దారితీస్తుంది. ‘‘భాగస్వాములు ఇద్దరూ స్వేచ్ఛను గౌరవించుకోవాలి. అదే సమయంలో చర్చించుకుని, పరస్పర అంగీకారానికి వచ్చే పరిణతి కూడా అవసరం’’ అనేది జీవైఆర్ ఫైనాన్షియల్ ప్లానర్స్ సీఈవో రోహిత్ షా సూచన. ఏ తరహా ఆర్ధిక వ్యక్తిత్వాన్ని మీరు నచ్చుతారన్న స్పష్టత ఉండాలి. అప్పుడు కాబోయే జీవిత భాగస్వామితో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించుకోవాలి. ఆర్ధిక అంశాల నిర్వహణపై మాట్లాడుకోవాలి. బడ్జెట్ ఏర్పాటు, ఆర్ధిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని, వాటికి కట్టుబడి ఉండేలా అంగీకారానికి రావాలి. కేవలం పొదుపు అనే కాదు, జీవనశైలి అలవాట్లు, ఆనందాల కోసం భాగస్వాములు ఇద్దరూ ఆదాయంలో 10% బడ్జెట్ కేటాయించుకోవడంలో తప్పు లేదన్నది నిపుణుల సూచన. కేటాయింపులు అన్నీ పోను మిగులు ఉంటే, ఆ మొత్తాన్ని తమ అభిరుచుల కోసం ఖర్చు చేసుకోవచ్చు. ఆధిపత్యం పనికిరాదు.. మనీ విషయాల్లో ఆధిపత్య ధోరణి పనికిరాదు. డబ్బుకు సంబంధించి నిర్ణయాలు అన్నింటినీ తానే తీసుకోవాలన్న ధోరణి సరికాదు. ఈ విషయాల్లో జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. ‘‘ఆర్ధిక అంశాల నిర్వహణ గురించి తనకు ఎంత మాత్రం తెలియదన్నది నా భర్త సమాధానం. కానీ, ఖర్చుల గురించి నేను ఎప్పుడు చెప్పాలనుకున్నా.. ఆయన కొట్టిపారేస్తుంటారు’’ అని ఢిల్లీకి చెందిన మార్కెటింగ్ నిపుణురాలు అంజలి వర్మ వాపోయారు. కేవలం పురుషులే ఆర్జనా పరులుగా ఉన్న కుటుంబాల్లో ఈ తరహా ధోరణి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. భార్య విద్యావంతురాలై, గృహిణిగా కొనసాగుతున్నా, ఆమెకు ఆర్ధిక అంశాలపై అవగాహన ఉన్నా కానీ, కుటుంబ నిర్ణయాల్లో సమాన భాగస్వామ్యం కలి్పంచే తీరు అన్ని చోట్లా కనిపించదు. రాణించే మహిళలు ఉన్న చోట పురుషులు అభద్రతా భావానికి లోనవుతుంటారని, అది కలహాలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కనుక ఆర్ధిక అంశాల్లో తమ భాగస్వామ్యం ఏ మేరకు అన్న దానిపై పెళ్లికి ముందే యువతీ, యువకులు తప్పకుండా ప్రశి్నంచుకోవాలని సూచిస్తున్నారు. ఆర్ధిక బాధ్యతలను ఎలా పంచుకుంటారని కూడా ప్రశ్నించుకోవాలి. ఇరువురి మధ్య సరైన అవగాహన కుదిరినప్పుడే ఏడడుగులు వేయడం సరైన నిర్ణయం అవుతుంది. పెట్టుబడుల ఎంపికలు పెట్టుబడుల విషయంలోనూ దంపతుల మధ్య అవగాహన, పరస్పర అంగీకారం అవసరమే. ఒకరు అధికంగా రిస్క్ తీసుకుంటే, మరొకరు పరిమిత రిస్క్ ఉన్న పెట్టుబడులకే పరిమితం కావొచ్చు. ఇందులో ఎలాంటి తప్పులేదు. ఇద్దరూ భిన్న మార్గాలను అనుసరించడం మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. దీనివల్ల మెరుగైన రాబడులకు, రక్షణ తోడవుతుంది. ఒక విధంగా ఇది ఈక్విటీ, డెట్ కలయికగా భావించొచ్చు. అయితే ఆయా అంశాలపై కాబోయే దంపతులు ఇద్దరూ చర్చించుకోవాలి. ఏఏ సాధనాలు ఎలా పనిచేస్తాయి, అందులో ఉండే రిస్‌్కలు, వచ్చే రాబడుల గురించి పూ ర్తి అవగాహన తెచ్చుకోవాలి. అప్పుడు సమష్టి నిర్ణయాలు తీసుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకోకపోతే దీర్ఘకాల ఆర్ధిక లక్ష్యాలకు అవరోధాలు ఏర్పడొచ్చు. అవసరం అనుకుంటే ఈ విషయంలో ఆర్ధిక సలహాదారుల సాయం తీసుకోవాలి.గోప్యత ప్రమాదకరం రుణాలు తీసుకోవడం, అప్పులతో కొనుగోళ్లు చేసే విషయాలను జీవిత భాగస్వామికి తెలియకుండా కొన్ని సందర్భాల్లో దాచి పెడుతుంటారు. ఇది విశ్వాసలేమికి దారితీస్తుంది. ఇదే మాదిరి ఎన్నో విషయాలు తనకు తెలియకుండా చేస్తుండొచ్చని భాగస్వామి సందేహించడానికి అవకాశం కలి్పస్తుంది. అందుకే ఇలాంటివి భాగస్వామికి చెప్పి చేయాలి.ధన సాయం తమ బంధువులు, స్నేహితులు, సహచర ఉద్యోగుల్లో ఎవరికైనా ఆర్ధిక సాయం చేసే ముందు, తమ ఆర్థిక అవసరాలకే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. ఇతరులకు సాయం చేయడానికి ముందు తమ ఆర్ధిక భవిష్యత్‌కు భరోసా కలి్పంచుకోవడం అవసరమని జీవైఆర్ ఫైనాన్షియల్ ప్లానర్స్ సీఈవో రోహిత్ షా పేర్కొన్నారు. డబ్బు సాయం తీసుకున్న వారు తిరిగి చెల్లించడంలో విఫలమైతే? పరిస్థితి ఏంటన్నది ప్రశి్నంచుకోవాలి. మరీ ముఖ్యంగా భాగస్వామికి తెలియకుండా ఇలాంటి ధన సాయాలు చేస్తే, అవి కాపురంలో కలహాలకు దారితీసే ప్రమాదం కచ్చితంగా ఉంటుంది. రుణ భారం తమకు కావాల్సిన ప్రతిదీ ఈఎంఐపై సమకూర్చుకోవడం కొందరికి అలవాటు. ఇందుకోసం క్రెడిట్‌కార్డు రుణాలనూ వాడేస్తుంటారు. అధిక వడ్డీలతో కూడిన రుణాలు ఊబిలోకి నెట్టేస్తాయి. ఆర్ధిక సమస్యలు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. ఈ తరహా అలవాట్ల గురించి పెళ్లికి ముందే కాబోయే భాగస్వామికి చెప్పడం ఎంతో అవసరం. ఆదాయం, వ్యయాలు, పెట్టుబడుల ప్రణాళికలు, ఖర్చు చేసే అలవాట్లు, రుణాలు తదితర అంశాల గురించి సమగ్రంగా చర్చించుకోవడం, ఆర్ధిక సలహాదారుల సాయం తీసుకోవడం, పరస్పర అంగీకారం, గౌరవం, పారదర్శకత ఇవన్నీ.. వైవాహిక బంధంలో ఆర్ధిక సంక్షోభాలు రాకుండా నివారిస్తాయి. – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
ఆకాశంలో సగానికి అన్యాయమా!
దేశం మొత్తాన్ని కుదిపేసిన ‘నిర్భయ’ ఉదంతం తర్వాత నాటి కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ వైవాహిక బంధంలో జరిగే అత్యాచారం (మారిటల్ రేప్) గురించి ప్రస్తావించి దాన్ని నేరంగా గుర్తించాలని సిఫార్సు చేసినప్పుడు ‘మర్యాదస్తులు’ నొచ్చుకున్నారు. ఆ చర్య వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేయదా... వారి పిల్లల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చదా అని చాలామంది ప్రశ్నించారు. ఈ అంశంపై అంతకు చాన్నాళ్ల ముందే వివిధ స్థాయిల్లో చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఆ విషయమై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్ మళ్లీ దాన్ని ఎజెండాలో తెచ్చింది. దాంపత్య జీవితంలో ఉండే లైంగిక సంబంధం పరస్పర అన్యోన్యత ఆధారంగా ఏర్పడుతుందనీ, దాన్ని కేవలం ‘సమ్మతి’ అనే పదంలో కుదించటం అసాధ్యమనీ అఫిడవిట్ అంటున్నది. గతంలోని భారత శిక్షాస్మృతి (ఐపీసీ) అయినా, దాని స్థానంలో అమల్లోకొచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) అయినా దాంపత్య జీవితంలో జరిగే అత్యాచారానికి మినహాయింపునిచ్చాయి. అత్యాచారానికి ఎలాంటి శిక్ష విధించాలో ఐపీసీ సెక్షన్ 375 నిర్దేశిస్తూ ఈ నేరానికి పాల్పడే భర్తకు మినహాయింపునిచ్చింది. బీఎన్ఎస్ఎస్లో ఈ సెక్షన్ 63గా మారింది. మినహాయింపు కూడా యధాతథంగా కొనసాగింది. భార్య వయస్సు 18 యేళ్లు దాటిన పక్షంలో భర్త జరిపే అత్యాచారానికి మినహాయింపు ఉంటుందని చట్టం చెబుతోంది. ఈ మినహాయింపును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తే మొత్తం వివాహ వ్యవస్థపైనే అది తీవ్ర ప్రభావం చూపగలదని కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్ హెచ్చరిస్తోంది. చట్టంలో ఉన్న మినహాయింపు అత్యాచారం చేయటానికి భర్తకిచ్చే లైసెన్సు కాదంటూనే ఆ అంశాన్ని చట్టంవైపుగా కాక సామాజిక కోణం నుంచి చూడాలని అభిప్రాయపడింది. సంబంధిత పక్షాలన్నిటితో, రాష్ట్రాలతో చర్చించాక చట్టసభ తీసుకోవాల్సిన నిర్ణయం గనుక న్యాయస్థానం జోక్యం చేసుకోరాదని తెలిపింది. భార్య సమ్మతికి రక్షణ కల్పించేందుకు ఇప్పుడున్న చట్టాల్లో ఏర్పాట్లున్నాయనీ, గృహ హింస చట్టంవంటివి రక్షణగా నిలుస్తాయనీ చెప్పింది. నేరం ఒకటే అయినప్పుడు దాన్ని వేర్వేరు చోట్ల వేర్వేరు రకాలుగా ఎలా పరిగణిస్తారు? హత్య జరిగితే అది చోటుచేసుకున్న ప్రాంతాన్ని బట్టి దాన్ని హత్యాయత్నంగా అనుకోగలమా? పరిచితుడో, అపరిచితుడో మహిళపై అత్యాచారం చేస్తే దానికి శిక్ష ఉన్నప్పుడు... భర్త అదే పనిచేసినప్పుడు మినహాయింపు ఇవ్వటం ఏ రకంగా న్యాయం? 2022లో ఢిల్లీ హైకోర్టులో మారిటల్ రేప్‌పై పిటిషన్ దాఖలైనప్పుడు ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో ఒకరు మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాలని అభిప్రాయపడితే, అది సరికాదని మరో న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అనంతరం కర్ణాటక, గుజరాత్ హైకోర్టులు రెండూ మారిటల్ రేప్‌ను నేరంగా గుర్తించాల్సిందేనని తీర్పులు వెలువరించాయి. మన పౌరులైనా, విదేశీ పౌరులైనా చట్టం ముందు అందరూ సమానులనీ, అందరికీ సమానమైన రక్షణ లభిస్తుందనీ రాజ్యాంగంలోని 14వ అధికరణ చెబుతోంది. భర్త చేసే అత్యాచారం నేరంగా పరిగణించకూడదని మినహాయింపునివ్వటం వివాహ బంధంలోని మహిళకు ఈ అధికరణ వర్తించబోదని చెప్పటం కాదా? కానీ కేంద్రం అలా అనుకోవటం లేదు. ఇది పెళ్లయితే స్త్రీ తన హక్కును కోల్పోతుందని పరోక్షంగా చెప్పటం కాదా? మన దేశంలో వివాహ వ్యవస్థను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారన్న అఫిడవిట్ అభిప్రాయంతో విభేదించనవసరం లేదు. అలాగే వివాహ వ్యవస్థకుండే బహుముఖ పార్శా్వల్లో భార్యాభర్తల లైంగిక సంబంధం ఒకటి మాత్రమేనని చేసిన వాదననూ తప్పుబట్టనవసరం లేదు. కానీ సామాజిక విశ్వాసాలకూ, రాజ్యాంగ విలువలకూ మధ్య వైరుద్ధ్యం ఏర్పడినప్పుడు ఒక గణతంత్ర రాజ్యం రాజ్యాంగ విలువలకు మాత్రమే ప్రాధా న్యమివ్వాలి. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. దాదాపు అన్ని సమాజాల్లోనూ భిన్న ఆధిపత్య ధోరణులు అల్లుకుపోయి వుంటాయి. పితృస్వామిక సమాజాల్లో స్త్రీలపై ఆధిపత్యం సాధించటానికి పురుషుడి చేతిలో అత్యాచారం ఒక ఆయుధం. దీన్ని చాలా ముందుగా గుర్తించబట్టే సోవియెట్ యూనియన్ 1926లో మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తూ చట్టం తీసుకొచ్చింది. ఆ తర్వాత 1950లో జెకోస్లోవేకియా, 1969లో పోలెండ్ ఈ మాదిరి చట్టాలు చేశాయి. ఇవన్నీ అప్పటికి సోషలిస్టు రాజ్యాలు. ప్రస్తుతం దాదాపు 150 దేశాలు మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తున్నాయి. భార్య లైంగిక స్వయంప్రతిపత్తిని భర్త అయినా సరే దెబ్బతీయరాదనీ, అది నేరపూరిత చర్య అవుతుందనీ ఈ చట్టాలు భావిస్తున్నాయి. సకల ప్రజాస్వామ్య దేశాలకూ భారత్ తల్లిలాంటిదని చెప్పుకుంటున్న మనం మాత్రం మారిటల్ రేప్ విషయంలో ఇంకా తడబాటు ప్రదర్శించటం సబబేనా?దాంపత్య జీవనంలో భర్తలు సాగించే హింసను మన దగ్గర మహిళలు మౌనంగా భరిస్తున్నారు. భరించ శక్యం కాని స్థితి ఏర్పడినప్పుడు మాత్రమే బయటికొస్తున్నారు. భర్త లైంగిక నేరానికి పాల్పడుతున్నాడని వారిలో అతి కొద్దిమంది మాత్రమే వెల్లడిస్తున్నారు. స్నేహ అనే స్వచ్ఛంద సంస్థ డేటా ప్రకారం ముంబైలోని ధారవిలో ఈ సంస్థ ముందు 3,878 ఫిర్యాదులు దాఖలుకాగా అందులో 52.11 శాతం లైంగిక హింసకు సంబంధించినవే. 19.33 శాతంమంది తమ భర్త తమపై పదే పదే అత్యాచారానికి పాల్పడుతున్నాడని తెలిపారని ఆ సంస్థ అంటున్నది. భార్య అభీష్టాన్ని బేఖాతరు చేయటం నేరమన్న స్పృహ పురుషుడిలో కలగాలంటే మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించటం ఒక్కటే మార్గం. ఇందుకు భిన్నంగా ఆలోచించటం జనాభాలో సగానికి అన్యాయం చేయటమే. -
వివాహేతర సంబంధమే ప్రాణాలు బలిగొంది
గార్లదిన్నె: వివాహేతర సంబంధం కారణంగానే గార్లదిన్నె మండలం కేశవాపురానికి చెందిన రాజేష్ (23) హతమయ్యాడంటూ పోలీసులు నిగ్గు తేల్చారు. ఈ నెల 20న రాజేష్ హత్య వైనం వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను బుధవారం గార్లదిన్నె పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను ఎస్ఐ కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. గార్లదిన్నెలోని భారత్ గ్యాస్ ఏజెన్సీలో హెల్పర్‌గా పనిచేస్తున్న రాజేష్.... కేశవాపురానికి చెందిన వీరాంజనేయులు భార్య సౌజన్యతో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. ఈ విషయంగా పద్ధతి మార్చుకోవాలని రాజేష్‌ను వీరాంజనేయులు పలుమార్లు హెచ్చరించాడు. అయినా అతనిలో మార్పు రాలేదు. దీంతో రాజేష్ హత్యకు పథకం రచించాడు. ఈ నెల 18 నుంచి రాజేష్ కనిపించకుండా పోయాడు. ఘటనపై శనివారం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే వీరాంజనేయులును అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ నెల 18న విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరిన రాజేష్‌ను రామదాస్‌పేట సమీపంలో అడ్డుకుని కనంపల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి రాళ్లతో దాడి చేసి, అక్కడే పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసుల విచారణలో వీరాంజనేయులు అంగీకరించాడు. ఈ కేసులో వీరాంజనేయులతో పాటు సహకరించిన కదరకుంటకు చెందిన మల్లెల మధు, పామిడి నివాసి మధు, సౌజన్యను మంగళవారం సాయంత్రం పెనకచెర్ల డ్యాం మార్గంలోని శివాలయం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన రాళ్లు, పార, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. (చదవండి: అనంతలో టీడీపీ నేతల దౌర్జన్య కాండ) -
ఔను.. వారిద్దరు మళ్లీ కలిశారు..
ఔను.. వారిద్దరు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో ఏకమయ్యారు. వీరి పదేళ్ల దాంపత్య జీవితంలో ఇద్దరు కూతుర్లు జన్మించారు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య అనుమానాలు తలెత్తాయి. దీంతో భార్యకు సంబంధించిన తప్పులు భర్త, భర్తకు సంబంధించిన తప్పులతో భార్య స్థానిక మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇక ఇద్దరం కలిసి ఉండలేమని నిర్ణయం తీసుకొని విడాకులు కావాలనుకున్నారు. పోలీస్ సిబ్బంది ఇరువురి కుటుంబ సభ్యులు, పెద్దల సమక్షంలో మూడు దఫాలుగా వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం తిరిగి వారి తప్పులను తెలుసుకున్నారు. దీంతో వారు మళ్లీ కలిశారు. ఇలా జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి మే 15 వరకు 197 ఫిర్యాదులు రాగా అందులో 144 కేసులను కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించారు. సాక్షి, మంచిర్యాలక్రైం: సర్దుకుపోతే సంస్కారం ఒక స్వర్గసీమ. కానీ ప్రస్తుతం పలువురు దంపతులు చిన్నచిన్న సమస్యలనే పెద్దగా చూస్తూ గొడవలు పడుతున్నారు. అనంతరం పెద్దల సమక్షంలో పంచాయితీలు, ఆ తరువాత పోలీస్స్టేషన్ల వరకు చేరి విడిపోతున్నారు. పచ్చటి సంస్కారాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. వారికి పుట్టిన సంతానానికి తల్లిదండ్రుల ప్రేమను దూరం చేస్తూ వారిలో మానసిక ఆందోళనకు కారణమవుతున్నారు. ఇలాంటి సంఘటనలకు కారణాలు ఏమైనా ఉమ్మడి కుటుంబంలో సర్ధిచెప్పేవారు ఉండేవారు. కానీ ప్రస్తుతం చిన్న చిన్న కుటుంబాల్లో చెప్పేవారు లేక భార్యాభర్తలు చిన్నచిన్న గొడవలకే పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లి పచ్చని సంసారాన్ని విచ్ఛినం చేసుకుంటున్నారు. కౌన్సెలింగ్‌తో ఏకమవుతున్నారు... క్షణికావేశంతో చిన్నచిన్న సమస్యలకే దంపతులు సమన్వయం కోల్పోతున్నారు. ఉమ్మడి కుటుంబాలు ఉంటే పెద్దలు ఇద్దరిని సమన్వయం చేసేవారు. దీంతో కుటుంబంలో తగాదాలు రోడ్డున పడేవి కాదు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబం అనే ఊసే లేదు. కొందరు ఉద్యోగ రీత్యా, మరికొందరు వ్యాపారం ని మి త్తం, ఇంకొందరు అత్తమామ, కుటుంబ సభ్యులతో పడకపోవడం, కారణం ఏదైనా ఉమ్మడి కుటుంబా లు కానరావడం లేదు. ఈ నేపథ్యంలో కుటుంబా ల్లో చిన్నచిన్న సమస్యలు తలెత్తినప్పుడు ఇద్దరికి చె ప్పె వారు లేక కుటుంబాలు పోలీస్‌స్టేషన్ వరకు వస్తున్నాయి. ఎందుకీ పరిస్థితి... గతంలో పెళ్లైన కొంతకాలం పాటు ఉమ్మడి కుటుంబంతో కలిసిఉండే వారు. ఇంటి యజమాని చెప్పిందే వేదం అన్నట్లుగా కుటుంబమంత నడుచుకునేవారు. ఇది కాస్త రానురాను ఉమ్మడి కుటుంబం కాస్త ఒంటరి కుటుంబంగా తయారైంది. దీంతో చిన్న చిన్న సమస్యలతో భార్యాభర్తలు పంతాలకు పోయి కాపురాన్ని కూల్చుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్‌కు రోజుకు సుమారు 25నుంచి 30మంది వరకు కుటుంబ సమస్యలతో పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించడం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, పది మంది ముందు చులకన చేసుకోవడంతో పాటు వారి గౌరవాన్ని కించపరుచుకుంటున్నారు. సర్దుకుపోతేనే సమస్యకు పరిష్కారం గతంలో ఉమ్మడి కుటుంబాలుగా ఉండే వారు దీంతో ఎలాంటి గొడవలు వచ్చేవి కావు. ఒక వేల వచ్చిన ఇరుకుటుంబాల పెద్దలు ఇద్దరిని సమన్వయం చేసి పంపించేవారు. అప్పుడు కుటుంబాల్లో విలువలు, మర్యాద, గౌరవం, భయం భక్తి ఉండేది. అవి ప్రస్తుతం లేకపోవడంతో కుటుంబాల్లో చిన్నచిన్న గొడువలకు, పంతాలకు వెళ్లి పెద్దగా చేసుకుంటున్నారు. మొదట క్షణికావేశంతోనే ఏవెవో మాట్లాడుతారు. కౌన్సెలింగ్ ద్వారా 80శాతం కుటుంబాలు కలిసి పోతున్నారు. – బి.శ్రీనివాస్, సీఐ, మహిళా పోలీస్‌స్టేషన్, మంచిర్యాల -
న్యూయార్క్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని.. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నానని చెప్పి..
ఒంగోలు: పెళ్లి సంబంధం పేరుతో యువతి, ఆమె తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి రూ.17 లక్షలకు పైగా గుంజేసిన వ్యక్తిని ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ మలికాగర్గ్ శనివారం మీడియాకు చె ప్పారు. తూర్పుగోదావరి జిల్లాకి చెందిన పొట్లూరి శ్రీబాలవంశీకృష్ణ అలియాస్ ప్రతాపనేని రాజేష్ కుమార్ (35) తెలంగాణలోని ఖమ్మం జిల్లా బుర్హాంపురం మండలం వెంకటేశ్వర నగర్లో ఉంటున్నాడు. ఇతనికి విజయవాడలో కూడా నివాసముం ది. 2008లో కాకినాడలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో రాజేష్ బీ ఫార్మశీ పూర్తి చేశాడు. 2011లో వి వాహం చేసుకుని భార్యతో కలిసి బెంగళూరులో నివాసమున్నాడు. అక్కడ వ్యసనాలకు బానిసై అప్పులు చేయడంతో భార్య విడాకులిచ్చింది. కొంతకాలం ఏటీఎం నేరాలకు పాల్పడి డబ్బులు సంపాదించిన రాజేష్ బ్యాంకర్లు వన్‌టైం పాస్వర్ట్ సిస్టం ప్రారంభించడంతో ఆ నేరాలు చేయడం కుదరక మేట్రిమోనియల్ చీటింగ్‌కు తెరలేపాడు. మోసం చేసిన తీరు ఇదీ... 2021 ఆగస్ట్‌లో ఓ మేట్రిమోనియల్ వెబ్సైట్లో ప్రతాపనేని రాజేష్‌కుమార్ పేరుతో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఓ యువతి తల్లిదండ్రులు రాజేష్ వివరా లను అందులో పరిశీలించి అతడిని ఫోన్లో సంప్రదించారు. తాను న్యూయార్క్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగినని, కరోనా పరిస్థితుల కారణంగా హైదరాబాద్‌కు బదిలీ అయి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నట్లు రాజేష్ వారిని నమ్మించాడు. తాను మళ్లీ ఈ ఏడాది మే లో న్యూయార్క్ వెళ్లాల్సి ఉంటుందని, ఈ లోగా ఆమె సిబిల్ స్కోర్ పెరగాలని వారిని నమ్మించాడు. అనంతరం యువతి క్రెడిట్ కార్డు, వివిధ మార్గాల ద్వారా రూ.17.49 లక్షలను రాజేష్ తన బ్యాంక్ ఖాతాలో జమ చేసుకున్నాడు. స్పందన ఫిర్యాదుతో రంగంలోకి... తన క్రెడిట్ కార్డుల ద్వారా ఇష్టం వచ్చినట్లుగా రాజేష్ రుణాలు తీసుకుంటుండటంతో యువతికి అనుమానం వచ్చింది.దీంతో ఆమె తన రుణాల ప్రాసెస్ మొత్తం రద్దు చేయాలని అడగ్గా అందుకు వారం రోజులు గడువు పడుతుందంటూ రాజేష్ చెప్పాడు. దీంతో ఆమె స్పందనలో ఫిర్యాదు చేసింది. ఎస్పీ మలికాగర్గ్ ఆదేశాల మేరకు రూరల్ సీఐ రాంబాబు, మద్దిపాడు ఎస్ఐ శ్రీరాం విచారించి నిందితుడిని సీతారామపురం కొష్టాలు వద్ద అరెస్ట్ చేశారు. విచారణలో అతనిపై తెలుగు రాష్ట్రాల్లో 16 కేసులు నమోదైనట్లు గుర్తించారు. అతడి నుంచి రూ.8 లక్షలు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. స్వల్ప కాలంలోనే నిందితుడిని అరెస్ట్ చేసినందుకుగాను పోలీసులను ఎస్పీ మలికాగర్గ్ అభినందించి నగదు రివార్డులను అందజేశారు. -
నోట్లో గుడ్డలు కుక్కి.. పీక నులిమి హత్య! ఏం ఎరగనట్టు నాటకం..
నక్కపల్లి: మండలంలో నీలకుండీల నర్సాపురంలో ఈ నెల 1వ తేదీన అనుమానాస్పదంగా మరణించిన గుబ్బల నాగమణిది హత్యేనని సీఐ నారాయణరావు, ఎస్ఐ డి.వెంకన్నలు తెలిపారు. బుధవారం వారు నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించాడు. కోటవురట్ల మండలం రామచంద్రపాలెంకు చెందిన గుబ్బల నాగమణి, తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన లక్ష్మణరావులు నర్సాపురంలో సహజీవనం చేస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. వీరు గ్రామంలో ఒక భూస్వామికి చెందిన తోటలో కాపలాదారులుగా ఉంటూ జీవిస్తున్నారు. అంతేకాకుండా వ్యసనాలకు బానిసయ్యాడు. తరచూ మద్యం సేవించి వచ్చి, నాగమణిని వేధిస్తుండేవాడు. గత నెల31న కూలిపనికి వెళ్లి వెయ్యి రూపాయలు సంపాదించాడు. ఒకటో తేదీన నాగమణి కూలి డబ్బుల విషయమై ఆరా తీసింది. అతను సరైన సమాధానం చెప్పక పోగా మద్యం సేవించి వచ్చి ఆమెను హింసించాడు. తన వ్యసనాలకు అడ్డంకిగా మారిందని ఎలాగైనా ఆమె అడ్డుతొలగించుకోవాలని భావించాడు. పీక నులిమి, నోటిలో గుడ్డలు కుక్కి నాగమణిని హత్యచేశాడు. నాగమణి చనిపోయినట్టు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ విచారణలో నాగమణిని హత్య చేసింది లక్ష్మణరావేనని తేలిందని, అతను నేరాన్ని అంగీకరించాడని సీఐ, ఎస్ఐలు తెలిపారు. లక్ష్మణరావును అరెస్టుచేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టు చెప్పారు. చదవండి: కన్న తండ్రి పైశాచికత్వం! కూతురిపై లైంగికదాడి.. అడ్డొచ్చినవారిని సైతం -
ప్రియుడితో కలసి మామను...
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని ఓ కోడలు తన ప్రియుడిని ఉసిగొల్పి తన మామను హత్య చేయించింది. సదాశివపేట సీఐ కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది డిసెంబర్ 30న సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లారెడ్డిపేట్ గ్రామానికి చెందిన బుడ్డోల రాములు(60)తన ఇంటికి ప్లాస్టింగ్ చేయించడానికి మేస్త్రీ కొరకు వెళ్లి మూడు రోజుల తర్వాత సదాశివపేట మండలంలోని బొబ్బిలిగామ శివారులో శవమై కనిపించాడు. దీంతో ఈనెల 1న అతడి భార్య దేవమ్మ తన భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది. పోలీసుల పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయీ. మృతుడి పెద్దకొడుకు భాగయ్య సుమారుగా ఒకటిన్నర సంవత్సరం నుంచి బొబ్బిలిగామ గ్రామానికి చెందిన పెద్దగొల్ల మల్లేశం దగ్గర ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తుండడంతో అప్పుడప్పుడూ పెద్దగొల్ల మల్లేశం మల్లారెడ్డిపేట్ గ్రామానికి వస్తూ వెళ్తుండేవాడు ఈ క్రమంలో భాగయ్య భార్య నవీనతో మల్లేశంకు పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసిన మృతుడు రాములు, అతని భార్య దేవమ్మ పెద్దగొల్ల మల్లేశంను, కోడలు నవీనను పలుమార్లు వారించారు. దీంతో నవీన తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న మామను చంపాలి, లేదంటే నేనే నీ పేరుమీద చనిపోతా అని మల్లేశంను ఫోనులో బెదిరించగా.. మల్లేశం నవీన మామ రాములును ఎలాగైనా చంపాలని పథకం వేసుకున్నాడు. పథకంలో భాగంగా గతేడాది డిసెంబర్ 30న తన మామ మేస్త్రీ కొరకు మల్లారెడ్డిపేటలో తిరుగుతున్నాడని మల్లేశంకు చెప్పగా.. మేస్త్రీ గురించి తమ గ్రామానికి పోదామని తన మోటార్ సైకిల్‌పై బొబ్బిలిగామ గ్రామానికి తీసుకెళ్లాడు. అనంతరం మేస్త్రీ లేకపోవడంతో తాను అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి ఇద్దరు కలిసి కల్లు తాగారు. రాములు మత్తులోకి వెళ్లగా తనకు సాయం చేయాలని మొగులయ్య, చాంద్‌పాషా, దశరథ్‌గౌడ్, అంజయ్యలను కోరగా వారు నిరాకరించారు. దీంతో అదేరోజు రాత్రి ఇంటికి వెళ్దామని చెప్పి మోటార్ సైకిల్ పై తీసుకెళ్లి బొబ్బిలిగామ నుంచి మల్లారెడ్డిపేట్ వెళ్లే రోడ్డుకు ఎడమ వైపు తీసుకెళ్లి ఇనుప కర్రతో రాములు తలపై, ఇతర శరీర భాగాలపై కోట్టి రుమాల్తో గొంతుకు బిగించి చంపివేసినట్లు నిందితుడు తెలిపాడని సీఐ పేర్కొన్నారు. చాంద్ పాషా మాత్రం పరారీలో ఉన్నాడు. సిబ్బందికి అభినందనలు.. ఈ కేసులో మొదటినుంచి కష్టపడి కేసు చేధించడానికి పూర్తిగా సహకరించిన సిబ్బంది ఏఎస్ఐ కిష్టయ్య, సిబ్బంది జగన్, వెంకటేశం, శ్రీనివాస్, రమేష్, వీరేశంలను సీఐ ప్రత్యేకంగా అభినందించారు. -
భార్య, ఆమె ప్రియుడు సజీవ దహనం
ముత్తుకూరు: ఇంట్లో తన భార్య ప్రియుడితో కలిసి ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయిన భర్త ఇంటిపై పెట్రోలు పోసి నిప్పు పెట్టి, ఇద్దరినీ సజీవ దహనం చేశాడు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాళెం పంచాయతీ కోళ్లమిట్టలో మడపాక కవిత (34), హరిబాబు దంపతులు నివాసం ఉంటున్నారు. పంటపాళెం దళితవాడకు చెందిన నన్నం శ్రీనివాసులు (36) కవితతో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. కాగా, బుధవారం భార్య, ఆమె ప్రియుడు లోపల ఉన్న విషయం తెలుసుకున్న హరిబాబు పూరింటి తలుపుకి గడియపెట్టి, ఇంటిపై పెట్రోలు పోసి నిప్పు అంటించాడు. ఇంటి లోపల ఉన్న ఇద్దరు ఆర్తనాదాలు చేస్తుంటే హరిబాబు కర్ర చేత పట్టి ఎవరూ వారిని రక్షించకుండా భయపెట్టాడు. స్థానికులు చూస్తుండగానే ఇంట్లోని సామగ్రితోపాటు కవిత, శ్రీనివాసులు పూర్తిగా సజీవదహనమయ్యారు. ఇంతలో స్థానికులు కొందరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి హరిబాబును పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించుకుని పారిపోయాడు. -
గర్భిణి హత్య కేసులో అమర్, వికాస్ అరెస్ట్
హైదరాబాద్: గర్భిణి హత్య కేసులో నిందితుడు అమర్‌కాంత్‌ను బిహార్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ కోర్టులో హాజరు పరిచిన అనంతరం ట్రాన్సిస్ట్ వారెంట్ పై ఇక్కడి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మంగళవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇదే హత్య కేసులో ప్రధాన నిందితుడు వికాస్‌ను కూడా మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మాదాపూర్‌లో తలదాచుకున్న వికాస్‌ను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. గర్భిణి బింగీ అలియాస్ పింకీ హత్యపై వివిధ కోణాల్లో వీరిని విచారిస్తున్నారు. గర్భిణిని హతమార్చిన అనంతరం శరీర భాగాలను కోసేందుకు స్టోన్ కటింగ్ మిషన్‌ను అమర్‌కాంత్ కొనుగోలు చేశాడు. మమత ఝా బాల్కనీలో కాపలా ఉండగా బాత్రూమ్లో అమర్‌కాంత్, వికాస్ మిషన్‌తో గర్భిణి తల, కాళ్లు, చేతులు వేరు చేసి బస్తాల్లో మూట కట్టినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో మమత ఝా, అనిల్ ఝాను రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. వికాస్, అమర్‌కాంత్‌ను గురువారం రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. -
గొడవ చేసి.. గోడకేసి కొట్టి
సాక్షి, హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన 8 నెలల గర్భిణి బింగి హత్య ఆర్థిక పరిస్థితులు.. వివాహేతర సంబంధానికి అడ్డువస్తోందనే కోణంలోనే జరిగిందని సైబరాబాద్ పోలీసులు తేల్చారు. ఈ కేసులో నిందితులు మమతాఝా(37), ఆమె భర్త అనిల్‌ఝా(75), కుమారుడు అమర్‌కాంత్‌ఝా(21)ను అరెస్టు చేశామని, బింగి గర్భానికి కారకుడైన వికాస్ కాశ్యప్(35) పరారీలో ఉన్నాడని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా వెల్లడించారు. నిందితుల నుంచి ఎలక్ట్రానిక్ కట్టింగ్ మెషీన్, కాషాయ రంగు పైజమా, చున్నీ, స్కా ర్ఫ్, ఫాస్ట్‌ట్రాక్ హ్యాండ్‌బ్యాగ్, ప్లాస్టిక్ హ్యాండ్ గ్లవ్స్, పాలిథీన్ బ్యాగ్, రెండు సెల్ఫోన్లు, ధ్వంసమైన ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో మంగళవారం ఆయన మీడియాకు పూర్తి వివరాలు తెలిపారు. వివాహేతర సంబంధాలే కారణం.. బిహార్‌లోని బాంకా జిల్లా మోహన్ మల్టీ గ్రామానికి చెందిన బింగి అలియాస్ పింకి (32)ది నిరుపేద కుటుంబం. రాజస్తాన్ లోని ఓ ఇటుకల తయారీ పరిశ్రమలో పనిచేసే ఆమె తండ్రి దబ్బోలెయ్యా ఏడాదికోసారి సొంతూరు వచ్చి వెళతాడు. మృతురాలికి తల్లి, ఇద్దరు అక్కాచెల్లెళ్లు, ఒక సోదరుడు ఉన్నాడు. 13 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని సన్బల్ జిల్లాలోని చాందూసి టౌన్‌కు చెందిన దినేశ్‌ను బింగి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు దేవ్(10), జతిన్(8), కుమార్తె నందిని(5) ఉన్నారు. వీరి దాంపత్యంలో విబేధాలు తలెత్తాయి. అదే సమయంలో చాందూసికే చెందిన వికాస్‌తో బింగికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వికాస్, కుమారుడు జతిన్‌తో కలసి 2017 జనవరిలో బింగి సొంతూరు మోహనమల్టీకి వెళ్లింది. అక్కడ వికాస్‌కు మమతాఝాతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందులతో మమతా ఝా కుటుంబానికి ఉన్న 3 ఎకరాలు తనఖా పెట్టి.. అప్పులను తీర్చాలని హైదరాబాద్ వచ్చారు. నెలన్నర క్రితం బింగి రాక.. మమతాఝా కుమారుడు అమర్‌కాంత్ అప్పటికే హైదరాబాద్‌లోని దలాల్ స్ట్రీట్ బార్లో వెయిటర్‌గా చేస్తుండటంతో వికాస్‌ను గతేడాది జూన్‌లో అతడితో పంపింది. తర్వాత మమత, అనిల్‌ఝా హైదరాబాద్ వచ్చారు. వారు సిద్ధిఖీనగర్‌లోని ప్లాట్ నంబర్ 895 ఇంట్లో నివాసముంటున్నారు. వికాస్, మమత సిద్ధిఖీనగర్‌లోనే చాట్‌బండార్ నిర్వహిస్తూ రోజుకు రూ.500 నుంచి రూ.1,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో వికాస్ చిరునామా తెలుసుకున్న బింగి నెలన్నర క్రితం కుమారుడు జతిన్‌తో హైదరాబాద్ వచ్చింది. అప్పటి నుంచి వికాస్, మమత మధ్య గొడవలు మొదలయ్యాయి. బింగి 8నెలల గర్భిణి కావడంతో ఆస్పత్రికి తీసుకెళితే ఫీజులు, ఆ తర్వాత శిశువు పుడితే వికాస్ డబ్బులన్నీ ఆమెకే పెట్టాలని భావించిన మమత.. బింగి హత్యకు ప్రణాళిక రచించింది. నిందితులతో మాట్లాడినా ఈ నెల 11న తెల్లవారుజామున సిద్ధిఖీనగర్ లో ఇంటింటికీ వెళ్లి పోలీసులు సోదాలు చేసినా ఆధారాలు లభించలేదు. నిందితులు మమతాఝా, అనిల్ఝాతో పోలీసులు మాట్లాడినా వివరాలు రాబట్టలేక పోయారు. హత్య చేశాక కూడా పదో తేదీ వరకు చాట్‌బండార్ నిర్వహించిన వికాస్ పోలీసు నిఘా ఎక్కువై పారిపోయాడు. ఈ నెల 3నే అమర్‌కాంత్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బిహార్ వెళ్లినట్టు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. కాగా, మోహనా మల్టీ గ్రామానికి వెళ్లిన పోలీసులు బింగి కుటుంబ స్థితి దారుణంగా ఉన్నాయని గుర్తించారు. బింగి ఫొటో కూడా దొరకలేదు. ఆమె తమ్ముడు పింటూ సోదరి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో దహనసంస్కారాలు చేసేందుకు సిద్ధమవుతున్నామని అధికారులు చెబుతున్నారు. జతిన్(8)ను పిల్లల పునరావాస కేంద్రానికి తరలించి.. తండ్రి దినేశ్‌కు సమాచారం అందించారు. గొడవ చేసి.. గోడకేసి కొట్టి జనవరి 27 రాత్రి 12 గంటల ప్రాంతంలో మమత, వికాస్.. బింగితో గొడవపడ్డారు. ఈ క్రమంలో మమత.. బింగి మెడ పట్టుకుని బలంగా గోడవైపు తోసేసింది. దీంతో బింగి కుప్పకూలిపోగా మమత, వికాస్ ఆమె నోరు, కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకున్నారు. మిగతా ఇద్దరూ ఆమె శరీరంపై ఇష్టమొచ్చినట్టు పిడిగుద్దులు కురిపించడంతో ఆమె చనిపోయింది. ఆమె మృతదేహాన్ని ఒకరోజు బాత్రూమ్లోనే ఉంచారు. సాక్ష్యాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో మరుసటి రోజు అమర్‌కాంత్ బయటకు వెళ్లి ఎలక్ట్రికల్ కటింగ్ మెషీన్, రెండు గోనె సంచులు తీసుకొచ్చాడు. మెషీన్‌తో బింగి తల, మొండెం, కాళ్లు, చేతులు ముక్కలుగా చేసి ప్లాస్టిక్ పాలిథిన్ కవర్లో చుట్టి రెండు గోనె సంచుల్లో ప్యాక్ చేశారు. అమర్‌కాంత్ తాను పనిచేస్తున్న బార్ ఫ్లోర్ మేనేజర్, ఒడిశా వాసి సిద్ధార్థ బర్దన్ యమహా బైక్(ఏపీ10ఏఎల్9947) తీసుకుని గోనె సంచులను తీసుకెళ్లి బొటానికల్ గార్డెన్ సమీపంలో పడేసి వెళ్లిపోయారు. సీసీ కెమెరా దృశ్యాలే కీలకం.. తొలుత సీసీ కెమెరాలకు చిక్కిన కార్ల యజమానులను ప్రశ్నించిన పోలీసులకు ఎటువంటి సమాచారం లభించలేదు. దీంతో బైక్‌లపై దృష్టిపెట్టగా.. బైక్‌పై నీలిరంగు చొక్కా ధరించి.. ముఖానికి కళ్లద్దాలు పెట్టుకున్న వ్యక్తి, మరో మహిళ వెనక కూర్చున్న దృశ్యాలు కనబడ్డాయి. హైడ్రైన్ కెమెరాల ద్వారా వారి వద్ద బ్యాగులు గుర్తించారు. అయితే నిందితుల ముఖాలు సరిగా లేక విచారణ ఆలస్యమైంది. ఆ బైక్ బౌద్ధనగర్‌కు చెందిన విజయ్‌కుమార్ బాద్రే పేరు మీద ఉందని గుర్తించి విచారించారు. 2009లో ఆ బైక్‌ను విజయ్ శశికుమార్గౌడ్కు విక్రయించగా.. అది పలువురి చేతులు మారి సిద్ధార్థ బర్దన్ చేతికి వచ్చింది. మూడేళ్ల క్రితం ఈ బైక్ కొనుగోలు చేసిన బర్దన్.. హాఫీజ్నగర్లో రాంగ్రూట్లో వస్తుంటే పోలీసులు విధించిన ‘స్పాట్ పేమెంట్ చలాన్’ద్వారా కేసును ఛేదించగలిగారు. -
ప్రియురాలిని కడతేర్చిన ప్రియుడు.
-
ప్రియుడే యముడు
♦ పద్ధతి మార్చుకోలేదని హత్య ♦ మృతదేహంతో పోలీస్‌స్టేషన్‌లో లొంగుబాటు తనకల్లు: తనతో కాకుండా మరికొంతమందితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం సహించలేకపోయిన ప్రియుడు విచక్షణారహితంగా ప్రియురాలిని కడతేర్చాడు. శవాన్ని నేరుగా కారులో పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తనకల్లు మండలంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కదిరి పట్టణానికి చెందిన అశోక్‌కు భార్య సుభాషిణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అశోక్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అదే పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో నివాసముంటున్న కుమార్ బ్రిక్స్, టైల్స్ వర్క్ చేసేవాడు. కుమార్ అప్పుడుప్పుడు సిమెంట్ ఇటుకలు, టైల్స్‌ని అశోక్‌కు చెందిన టాటా ఏస్ వాహనంలో తరలించేవాడు. దీంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కుమార్ ఇంట్లో లేని సమయంలో అశోక్ వచ్చి వెళ్లేవాడు. ఆ క్రమంలోనే కుమార్ భార్య మల్లీశ్వరి(40)తో వివాహేతర సంబం«ధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న కుమార్.. అశోక్‌తో గొడవపడ్డాడు. కొద్దిరోజుల తర్వాత అశోక్ తిరుపతికి మకాం మార్చాడు. అక్కడే కారు పెట్టుకొని బాడుగలకు తిప్పేవాడు. దూరంగా వెళ్లినా మల్లీశ్వరితో వివాహేతర సంబంధాన్ని వదులుకోలేదు. మంగళవారం తనకల్లు మండలం కొక్కంటిక్రాస్‌కు మల్లీశ్వరిని రప్పించుకున్నాడు. అక్కడి నుంచి తన కారు(ఏపీ 03 టీవీ 5788)లో ఆమెను కూర్చోబెట్టుకొని పెట్రోల్ బంకు ఎదురుగా రోడ్డు పక్కన ఆపాడు. కారులోనే గొడవకు దిగాడు. ‘నువ్వు నాతోనే కాదు.. ఇంకా ఆరుగురితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావు. వెంటనే వాటన్నింటినీ వదులుకో’ అని అశోక్ హుకుం జారీ చేయడంతో ఆమె ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన అశోక్ కొడవలితో మల్లీశ్వరి మెడపై ఐదుసార్లు నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం మృత దేహంతో పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు. తానే ఆమెని హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. మృతురాలికి ఇద్దరు పిల్లులు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ తెలిపారు. -
80 20 రూల్!
మానసికం భార్యాభర్తల సంబంధాలు కూడా ఆర్థికశాస్త్రంలోని ‘80-20’ రూల్లాంటివేనని మానసిక నిపుణులు చెబుతున్నారు. పరెటో ప్రిన్సిపల్ ప్రకారం 80 శాతం కంపెనీ సేల్స్, 20 శాతం ప్రొడక్ట్స్ నుంచి వస్తాయి. అలాగే 80 శాతం కంపెనీ లాభాలు 20 శాతం కస్టమర్ల మీద ఆధారపడి ఉంటాయి. కంపెనీకి వచ్చే 80 శాతం ఫిర్యాదులు 20 శాతం కస్టమర్ల నుంచి వస్తాయి. వైవాహిక బంధంలో కూడా ఇది వర్తిస్తుంది. వైవాహిక బంధంలోని 80 శాతం కోపతాపాలు, అసంతృప్తులు 20 శాతం సమస్యల వల్లే వస్తున్నాయి. ఆ 20 శాతం సమస్యల మూలాలేమిటో తెలుసుకుంటే... సంసారరథం హ్యాపీగా సాగిపోతుంది. -
విడిపోయినా... ధైర్యాన్ని వీడనక్కర్లేదు
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమౌతాయంటారు కదా, మరి వాటి వైఫల్యాలను ఎక్కడ, ఎలా నిర్ణయిస్తారో తెలుసా? నరకంలో..! అవును నిజం! ఎందుకంటే పవిత్రమైన వైవాహిక బంధం విఫలమైతేగనక వారితోబాటు వారి పిల్లలు, వారిపైన ఆధారపడిన వారు కూడా రకర కాల సామాజిక ఇబ్బందుల రూపేణా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఒకప్పటి కాలంలో భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా విడాకుల దాకా వెళ్లకుండా ఓపిగ్గా సర్దుకుపోయేవారు. ప్రస్తుత కాలంలో మాత్రం విడాకులు లేదా చట్టబద్ధంగా విడిపోవడం సర్వసాధారణమైపోయింది. బాధాకరమైన విషయం ఏమిటంటే, భర్తల నుంచి విడిపోతున్న భార్యలకన్నా, నయానో, భయానో, బెదిరించో విడాకుల రూపేణా భార్యలను వదిలించుకుంటున్న పురుషులే ఎక్కువమంది ఉండటం! భర్త నిరాదరణకు, అత్తమామల ఛీత్కరింపులకు గురై, వారే ఆమెను ఎలాగోలా వదలించుకున్న సందర్భాలే అధికం. సదరు స్త్రీ విద్యావంతురాలూ, ఉద్యోగస్థురాలూ అయితే, ఇతరుల మీద అంతగా ఆధారపడవలసిన అవసరం ఉండదు. అదే, అసలు ఆమె ఏమీ చదువుకోనిదీ, సంపాదన లేనిదీ అయితే..? ఆమె పరిస్థితి వర్ణనాతీతమే కదా! అటువంటి వారికోసం ఢిల్లీకి చెందిన అదనపు జిల్లా జడ్జి స్వర్ణకాంత శర్మ అందించిన అక్షర సహకారమే ‘డైవోర్స్’ అనే పుస్తకం. ‘విడిపోయినా విలపించనక్కర్లేదు’ అనేది దీనికి ట్యాగ్‌లైన్. వైవాహిక జీవితం విచ్ఛిన్నమై, ఏ ఆసరా లేక దిక్కుతోచని స్త్రీల పాలిట చీకట్లో చిరుదీపం లాంటిది ఈ పుస్తకం. న్యాయమూర్తిగా పని చేసిన అనుభవంతో ఆమె రాసిన ఈ పుస్తకం వివిధ కారణాలతో భర్త నుంచి చట్టరీత్యా విడిపోయిన స్త్రీలకు, భర్త నిరాదరణకు గురై, పిల్లలను పెట్టుకుని ఒంటరి పోరాటం చేస్తున్న అబలలకు భరోసా ఇస్తూ, వారికి ధైర్యంగా జీవించడమెలాగో నేర్పుతూ, కొండంత అండగా నిలిచే ఈ పుస్తకం ఇప్పటికే మూడు ముద్రణలు పూర్తి చేసుకుని, నాలుగో ముద్రణకు సిద్ధమైంది. ఒంటరి ఆడవాళ్లు మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, ప్రతికూలతలనే అనుకూలతలుగా మలచుకుంటూ, స్వతంత్రంగా, ధైర్యంగా జీవించడమెలాగో తెలియజెప్పే ఈ పుస్తకం ఒకవిధంగా ఒంటరి స్త్రీల పాలిట చింతామణి వంటిది. ప్రస్తుతం ఇంగ్లీషు, హిందీ భాషలలో లభ్యమవుతున్న ఈ పుస్తకం త్వరలోనే తెలుగుతో సహా అన్ని ప్రాంతీయ భాషల్లోకీ అనువాదం కావాలని ఆశిద్దాం.