
సజీవ దహనమైన శ్రీనివాసులు, కవిత
ముత్తుకూరు: ఇంట్లో తన భార్య ప్రియుడితో కలిసి ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయిన భర్త ఇంటిపై పెట్రోలు పోసి నిప్పు పెట్టి, ఇద్దరినీ సజీవ దహనం చేశాడు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాళెం పంచాయతీ కోళ్లమిట్టలో మడపాక కవిత (34), హరిబాబు దంపతులు నివాసం ఉంటున్నారు. పంటపాళెం దళితవాడకు చెందిన నన్నం శ్రీనివాసులు (36) కవితతో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. కాగా, బుధవారం భార్య, ఆమె ప్రియుడు లోపల ఉన్న విషయం తెలుసుకున్న హరిబాబు పూరింటి తలుపుకి గడియపెట్టి, ఇంటిపై పెట్రోలు పోసి నిప్పు అంటించాడు.
ఇంటి లోపల ఉన్న ఇద్దరు ఆర్తనాదాలు చేస్తుంటే హరిబాబు కర్ర చేత పట్టి ఎవరూ వారిని రక్షించకుండా భయపెట్టాడు. స్థానికులు చూస్తుండగానే ఇంట్లోని సామగ్రితోపాటు కవిత, శ్రీనివాసులు పూర్తిగా సజీవదహనమయ్యారు. ఇంతలో స్థానికులు కొందరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి హరిబాబును పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించుకుని పారిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment