Live burning
-
పపువా న్యూ గినియా విషాదం..
మెల్బోర్న్: దక్షిణ పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూ గినియా శుక్రవారం కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఎంగా ప్రావిన్స్‌లోని యంబాలి గ్రామంలో చోటుచేసుకున్న ఘటనలో 670 మంది వరకు చనిపోయి ఉంటారని మొదట ఐరాస విభాగం అంచనా వేసింది. అయితే, మట్టిదిబ్బల కింద రెండు వేలమందికి పైగానే గ్రామస్తులు సజీవ సమాధి అయి ఉంటారని పపువా న్యూ గినియా ప్రభుత్వం లెక్కగట్టింది. ఈ మేరకు ఐరాసకు సమాచారం పంపింది. ఈ విషాద సమయంలో తమను ఆదుకోవాలంటూ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. అయితే, ఐరాస వలసల విభాగం మాత్రం నేలమట్టమైన 150 నివాసాలను పరిగణనలోకి తీసుకునే మృతుల సంఖ్య 670గా నిర్ణయించామని, ప్రభుత్వ గణాంకాలపై మాట్లాడబోమని తెలిపింది. మృతుల సంఖ్యను 2 వేలుగా ఏ ప్రాతిపదికన నిర్ణయించారని ప్రధాని జేమ్స్ మరాపేను మీడియా ప్రశ్నించగా ఆయన బదులివ్వలేదు. కాగా, దేశంలో దశాబ్దాలుగా జనగణన జరగలేదు. సైన్యం కాపలా మధ్య.. గ్రామంలోని 200 మీటర్ల ప్రాంతంలో ఉన్న నివాసాలను 6 నుంచి 8 మీటర్ల మేర భారీ రాళ్లు, చెట్లు, మట్టి భూస్థాపితం చేశాయి. స్థానికులే తమ వ్యవసాయ పరికరాలైన పార, గొడ్డలి వంటి వాటితో వాటిని తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగారు. స్థానిక కాంట్రాక్టర్ పంపించిన బుల్డోజర్తో ఆదివారం నుంచి పని చేయిస్తున్నారు. -
పాకిస్తాన్లో రోడ్డు ప్రమాదం
లాహోర్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 40 మంది ప్రయాణికులతో కరాచీ నుంచి ఇస్లామాబాద్ వెళ్తున్న ఓ బస్సు తన ముందున్న వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ వ్యాన్‌లో ఇంధన ట్యాంక్ ఉంది. దీంతో రెండు వాహనాలు వెంటనే నిప్పంటుకున్నాయి. ఈ ఘటనలో బస్సులోని పలువురు మహిళలు, చిన్నారులు సహా 18 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 16 మంది గాయపడ్డారు. కొందరు బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు లాహోర్‌కు 140 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కొందరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు మృతిచెందడం పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి మొహిసిన్ నక్వీ విచారం వ్యక్తం చేశారు. -
రాజుతో అంగరక్షకుడి సహగమనం
సాక్షి, హైదరాబాద్: సతీ సహగమనం గురించి అందరికీ తెలిసిందే. భర్త చితిపైనే భార్యను సజీవంగా దహనం చేసే దారుణ పద్ధతది. కానీ, రాజు చనిపోతే అంగరక్షకులను అతనితోపాటు సజీవ సమాధి చేసే మరో వికృత ఆచారం కొన్ని ప్రాంతాల్లో కొనసాగింది. స్వామి భక్తితో ఆత్మాహుతి చేసుకున్న అంగరక్షకుడు/ఆంతరంగిక సేవకుడి(లెంక) స్మృతిలో ఏర్పాటు చేసిన స్మారక ఆత్మాహుతి శిల ఇటీవల వెలుగుచూసింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ శివారు ఆల్వాన్‌పల్లిలో ఉన్న అతి పురాతన జైన దేవాలయం గొల్లత్తగుడి వెనక దీన్ని గుర్తించారు. అక్కడి శిథిల శైవమఠం గోళకీ ఆలయం పరిసరాల్లో ఆరు వీరగల్లు శిలలున్నాయి. వాటిల్లో ఒకటిగా ఉన్న ఈ శిలను కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, ముచ్చర్ల దినకర్లు పరిశీలించారు. దానిపై పరిశోధన చేసి, అది చనిపోయిన రాజుతోపాటు సజీవంగా సమాధి చేయించుకున్న అంగరక్షకుడు/ఆంతరంగిక సేవకుడిదిగా తేల్చారు. స్థానికంగా ఉన్న రాజు లేదా రాజు హోదాలో ఉన్న వ్యక్తి చనిపోయినప్పుడు అతని సేవకుడు కూడా ఆత్పార్పణ చేసుకోవటంతో తొలుత సేవకుడిని సమాధి చేసి, దాని మీద రాజు శవాన్ని సమాధి చేసినట్టు పేర్కొన్నారు. ఈ శిలమీద చనిపోయిన రాజు చిత్రం, దిగువ ఆ సేవకుడి చిత్రాన్ని చెక్కారు. వారు శివైక్యం చెందారనటానికి గుర్తులు చెక్కి ఉన్నాయి. యుద్ధంలో చనిపోతే... ‘శిల మీద లఘు శాసనం ఉంది. అది ఆ సేవకుడు, రాజుకు సంబంధించే ఉండి ఉంటుంది. అస్పష్టంగా ఉన్నందున చదవటం సాధ్యం కావటం లేదు’ అని హరగోపాల్ పేర్కొన్నారు. ఇక్కడికి చేరువలోని గంగాపూర్ ప్రాంతంలో గతంలో చాలా యుద్ధాలు జరిగాయని, ఓ యుద్ధంలో స్థానిక రాజు/ ఆ స్థాయి వ్యక్తి చనిపోవటంతో అతని సేవకుడు కూడా సజీవ సమాధి ద్వారా ఆత్మార్పణ చేసుకుని ఉంటాడని, దానికి గుర్తుగా స్థానిక దేవాలయం వద్ద ఈ ఆత్మాహుతి శిలను ఏర్పాటు చేసి ఉంటారని ఆయన చెప్పారు. ఏడెనిమిది శతాబ్దాల్లో దీన్ని ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు. ఏపీలోని గుంటూరు జిల్లా ఈపూర్లో గతంలో కాకతీయ రాణి రుద్రమ మరణంతో ప్రమేయమున్న ఇలాంటి శిల్పం లభించిందని, అది చెన్నై మ్యూజియంలో ఉందని, మరోటి త్రిపురాంతకంలో ఉందని వెల్లడించారు. తెలంగాణలో తొలిసారి వెలుగు చూసిన ఈ శిల్పానికి చరిత్రలో ప్రాధాన్యముంటుందన్నారు. -
రాజస్తాన్‌లో ఘోరం.. మహిళపై రేప్.. ఆపై సజీవదహనం
జైపూర్: రాజస్తాన్‌లో ఘోరం జరిగింది. ఓ దుర్మార్గుడు దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆమెకు నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. బార్మెర్ జిల్లాకు చెందిన దళిత మహిళ(30) ఈ నెల 6న రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన షకూర్‌ఖాన్ అనే వ్యక్తి బలవంతంగా లోపలికి ప్రవేశించాడు. ఆమెపై లైంగికదాడికి పాల్పడిన అనంతరం యాసిడ్ వంటి ద్రావకాన్ని ఒంటిపై పోసి, నిప్పంటించి పరారయ్యాడు. 50 శాతం గాయాలపాలైన బాధితురాలు జోథ్‌పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితుడు ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
వివాహేతర సంబంధమే హత్యకు కారణమా..?
-
కారుకు నిప్పు పెట్టడంతో ఓ వ్యక్తి సజీవ దహనం
-
మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం
నాసిక్: ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు ట్రక్కు ట్రైలర్‌ను ఢీకొట్టిన ఘటనలో మంటలు చెలరేగి బస్సులోని ఇద్దరు చిన్నారులు సహా 12 మంది సజీవ దహనమయ్యారు. మరో 43 మంది గాయపడ్డారు. మహారాష్ట్రలోని నాసిక్–ఔరంగాబాద్ హైవేపై నాదుర్నాకా సమీపంలో శనివారం ఉదయం 5.15 గంటల సమయంలో దుర్ఘటన సంభవించింది. యావత్మాల్ నుంచి ముంబై వైపు వెళ్తున్న ప్రైవేట్ లగ్జరీ బస్సు ట్రక్కు ట్రైలర్‌ను, ఆపై కార్గో వ్యాన్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులో వేగంగా వ్యాపించిన అగ్నికీలలు రెండేళ్ల వయస్సున్న ఇద్దరు చిన్నారులు సహా 12 మందిని బలి తీసుకున్నాయి. మరో 43 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆదుపులోకి తెచ్చారు. బస్సు పూర్తిగా తగులబడిపోయింది. క్షతగాత్రులను నాసిక్‌లోని వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం షిండే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తామన్నారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్య సాయం అందజేస్తామని చెప్పారు. -
తల్లీకూతుళ్ల సజీవ దహనం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి..
సాక్షి, కోనసీమ(అల్లవరం): తల్లీకుమార్తెల సజీవ దహనం కేసు మిస్టరీ వీడింది. మాజీ ప్రియుడ్ని తన వైపు తిప్పుకునే క్రమంలో ఓ మహిళ పన్నాగానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తేల్చారు. అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో ఈ నెల 2వ తేది తెల్లవారుజామున సాధనాల మంగాదేవి, మేడిశెట్టి జ్యోతి సజీవదహనమైన సంగతి తెలిసిందే. అమలాపురం రూరల్ సీఐ వీరబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొమరగిరిపట్నానికి చెందిన సురేష్, జ్యోతి ప్రేమించుకుని ఈ ఏడాది ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకుని గోడితిప్పలో నివసిస్తున్నారు. అంతకుముందు సురేష్‌కు నాగలక్ష్మి అనే వివాహితతో వివాహేతర సంబంధముండేది. పెళ్లయిన తర్వాత ఆమెకు దూరమవడంతో నాగలక్ష్మి ఎలాగైనా జ్యోతి సురేష్లను విడదీయాలనుకుంది. ఇందులో భాగంగా సురేష్ ఇంటి వద్ద ఆకాశరామన్న ఉత్తరాలు రాసి పడేసేది. ఇందుకు తన సవతి కుమార్తెలు సౌజన్య, దివ్య హరితలను వినియోగించుకునేది. ఆ ఉత్తరాలలో జ్యోతికి అక్రమ సంబంధం ఉన్నట్లు రాసేవారు. వాటిని చదివినా సురేష్ ఆమెతో ప్రేమగానే ఉండేవాడు. ఇలా కాదని జ్యోతిని హతమారిస్తే సురేష్ తనకు దగ్గరవుతాడని భావించింది. ఇదే సమయంలో జ్యోతి తన పుట్టింటికి వెళ్లింది. చదవండి: (తీరని శోకం: రెండు కుటుంబాలు.. నలుగురు బిడ్డలు..) ఈనెల 2వ తేదీ రాత్రి తన తల్లి సాధనాల మంగాదేవితో కలిసి పడుకుంది. ఇదే అదునుగా నాగలక్ష్మి తన సవతి కుమార్తెలిద్దరినీ ఉసి గొల్పింది. నిద్రిస్తున్న తల్లీ కూతుళ్లపై పెట్రోలు పోయాలని చెప్పింది. వారు ఇంట్లోకి వెళ్లి తల్లీకూతుళ్లపై పెట్రోలు పోసి బయటకు వచ్చి నిప్పంటించారు. కాసేపటికే మంటలు ఎగసిపడుతుండటంతో జ్యోతి తండ్రి లింగన్న మేల్కొన్నాడు. మంటలను ఆర్పేందుకు విఫలయత్నం చేశాడు. అప్పటికే మంగాదేవి, జ్యోతి సజీవ దహనమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి చురుగ్గా దర్యాప్తు చేశారు. ఈ హత్యతో సంబంధమున్న నాగలక్ష్మ, సౌజన్య, దివ్య హరితలను బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వీరికి న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. నిందితులనురాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. దర్యాప్తులో ఎస్సై ప్రభాకరరావు, కానిస్టేబుళ్లు ధర్మరాజు, సుభాకర్, క్రైం పార్టీకి చెందిన కానిస్టేబుల్ బాలకృష్ణ, రామచంద్రరావు, జి.కృష్ణసాయి, డి.అర్జున్ కీలక భూమిక పోషించారు. చదవండి: (ఏఈ హత్య కేసు: భార్యే కుంటలో వేసి తొక్కి.. ఏమీ ఎరగనట్లు) -
కారులో పెట్రోల్ పోసుకుని ప్రేమికుల సజీవ దహనం
బనశంకరి: కారులో పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని ప్రేమజంట సజీవ దహనమైన ఘటన కర్ణాటకలో ఉడుపి జిల్లా బ్రహ్మవర పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. బెంగళూరు సుల్తాన్పాళ్యవాసి యశవంత్‌యాదవ్ (23), మనోరాయనపాళ్యవాసి జ్యోతి (23) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. జ్యోతి బీకాం చదివింది. యశవంత్ కంప్యూటర్ కోర్సు చేశాడు. ఈ నెల 18న మధ్యాహ్నం 12 గంటలకు యశవంత్ కంప్యూటర్ క్లాస్‌కు వెళ్తానని ఇంట్లో చెప్పి బైక్‌పై బయటకు వెళ్లాడు. జ్యోతి కూడా పని ఉందని బయటకు వెళ్లింది. రెండురోజులైనా కనిపించకపోవడంతో ఇద్దరి తల్లిదండ్రులూ హెబ్బాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రేమ జంట మంగళూరుకు వెళ్లి తమకు ఉద్యోగం వచ్చిందని చెప్పి ఒక అద్దె ఇంటిని తీసుకున్నారు. అక్కడే హుసేనఖ అనే వ్యక్తి నుంచి స్విఫ్ట్ కారును బాడుగకు తీసుకుని ఉడుపికి వెళ్లారు. ఉడుపిలో వివిధ దేవస్థానాలను సందర్శించి ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. యశవంత్ తన సోదరునికి మెసేజ్ పంపాడు. తరువాత ప్రేమికులు కారులోనే కూర్చుని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. మంటలు చెలరేగి కారులో గ్యాస్ సిలండర్ పేలిపోవడంతో యశవంత్ శరీరం బయటకు ఎగిరిపడింది. జ్యోతి కారులోనే కాలిపోయింది. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. బ్రహ్మవర పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. -
కారులో ముగ్గురు సజీవ దహనం
మార్కాపురం/భాకరాపేట: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన ముగ్గురు యువకులు సజీవదహనం అయ్యారు. టైరు పేలి అదుపు తప్పిన కారు.. కంటైనర్ లారీని ఢీకొనడంతో స్నేహితులు సాకిరి బాలాజీ (21), పటాన్ ఇమ్రాన్‌ఖాన్ (21), రావూరి తేజ (29) నిలువునా కాలిపోయారు. తేజ పాస్‌పోర్ట్ పనిమీద ముగ్గురు విజయవాడ వెళ్లారని, తిరుగు ప్రయాణంలో ఈ ఘోరం జరిగిందని భావిస్తున్నారు. కంభం వైపు నుంచి మార్కాపురం వైపు వస్తున్న ఏపీ39 డీఈ 6450 నంబరు కారు తిప్పాయపాలెం–జంగంగుంట్ల మధ్య మిట్టమీదిపల్లి అడ్డరోడ్డు వద్దకు రాగానే టైరు పేలిపోయింది. దీంతో కుడివైపు మార్కాపురం నుంచి కంభం వైపు వెళుతున్న కేఏ14 సీ 2949 నంబరు కంటైనర్ లారీని ఢీకొంది. కారులో ఉన్న పెట్రోల్ ట్యాంక్‌కు మంటలు అంటుకోవడంతో అందులోని ముగ్గురు సజీవ దహనమయ్యారు. మంటలు ఎగిసిపడుతుండటంతో కారు వద్దకు వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. డీఎస్పీ డాక్టర్ కిశోర్‌కుమార్, సీఐ ఆంజనేయరెడ్డి సమాచారం ఇవ్వడంతో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కారు నంబరు ఆధారంగా యజమాని చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం మోటుమల్లెలపాలెం పోస్టు, ఆదినారాయణవారిపల్లికి చెందిన ఈటెలమర్రి నరేంద్రగా గుర్తించి పోలీసులు అతడికి సమాచారమిచ్చారు. తాను కారును బాడుగకు ఇచ్చానని నరేంద్ర పోలీసులకు తెలిపారు. దీంతో డ్రైవర్ రావూరు తేజ అయి ఉండవచ్చని అనుమానించిన పోలీసులు వివరాలు సేకరించారు. మూడు కుటుంబాల్లో విషాదం భాకరాపేటకు చెందిన సాకిరి బాలాజీ, పటాన్ ఇమ్రాన్‌ఖాన్, రావూరి తేజ స్నేహితులు. వీరు ముగ్గురు ఎక్కడికెళ్లారో తమకు తెలియదని తల్లిదండ్రులు చెబుతున్నారు. స్నేహితులు మాత్రం త్వరలో గల్ఫ్‌కు వెళ్లాలనుకుంటున్న రావూరి తేజ పాస్‌పోర్ట్ పనిమీద విజయవాడ వెళ్లారని చెబుతున్నారు. బాలాజీ తండ్రి సత్యనారాయణ, తల్లి ఇంద్ర టీటీడీలో పనిచేసి రిటైరయ్యారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా.. మృతుడు పెద్ద కుమారుడు. పటాన్ ఇమ్రాన్‌ఖాన్ తండ్రి మస్తాన్ పంక్చర్ షాపు నిర్వహిస్తున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం కాగా.. ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. రావూరి తేజ తండ్రి భాస్కర్ పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయన ఒక్కగానొక్క కుమారుడు తేజ తండ్రికి సాయంగా ఉండేందుకు గల్ఫ్ వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంతలోనే జరిగిన ఈ ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. -
కారులో వ్యక్తి సజీవ దహనం.. హత్యా? లేదా ప్రమాదమా?
-
కారులో వ్యక్తి సజీవ దహనం.. హత్యా? లేదా ప్రమాదమా?
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కంటేపల్లి రైల్వే గేట్ సమీపంలోని పొలాల్లో ఓ కారు పూర్తిగా దగ్ధమై కనిపించింది. కారులో ఉన్న వ్యక్తి సజీవదహనం అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. హత్యా? లేక ప్రమాదమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
మాలిలో ఉగ్ర దాడి.. 31మంది పౌరులు మృతి
బమాకో: ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 31 మంది అమాయకపౌరులు బలయ్యారు. బండియగర పట్టణ సమీపంలో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకుంది. సుమారు 50 మంది పౌరులతో వెళ్తున్న ట్రక్కుపై అల్‌ఖైదా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ట్రక్కులో మంటలు చెలరేగి 31 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువమంది సజీవ దహనమైనట్లు బండియగర మేయర్ హొస్సేనీ తెలిపారు. పలువురు గాయాలపాలయ్యారని, ఇద్దరు గల్లంతయ్యారని ఆయన తెలిపారు. స్థానిక సాయుధ బృందాల హింసాత్మక చర్యల కారణంగా మాలిలో వివిధ వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. (చదవండి: ఇంటికి కాళ్లుంటే.. అది ఎంచక్కా నడుచుకుంటూ వెళుతుంటే..!) -
వివాహేతర సంబంధం: చేతులు, కాళ్లు కట్టేసి..
తిరువొత్తియూరు (తమిళనాడు): చేతులు, కాళ్లు కట్టేసి మహిళను సజీవ దహనం చేసిన చెన్నై కార్పొరేషన్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై నోలంబోర్ బైపాస్ రోడ్డులో మంగళవారం సాయంత్రం స్థానికులు ఇచ్చిన సమాచారంతో కాలుతున్న మహిళ మృతదేహాన్ని నోలంబూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మృతురాలు చెన్నై వానగరం శక్తిసాయి రాంనగర్ కు చెందిన మురుగన్ భార్య రేవతి (35)గా తేలింది. ఆమె చెన్నై కార్పొరేషన్ వలసరవాక్కం మండల కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న బ్యాటరీ వాహనం డ్రైవర్ తెలంగాణకు చెందిన తిమ్మప్ప (24)తో ఆమెకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ నేపథ్యంలో 16వ తేదీన రేవతి వద్ద ఐదు సవర్ల బంగారు నగ తీసుకున్నాడు. 22వ తేదీన ఇద్దరూ నిర్మానుష్య ప్రాంతంలో కలుసుకున్నారు. ఆ సమయంలో నగ గురించి రేవతి అతన్ని కోరింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆగ్రహం చెందిన తిమ్మప్ప ఆమె చున్నీతో చేతులు, కాళ్లు కట్టేసి కత్తితో గొంతు కోశాడు. స్పృహతప్పి పడి న రేవతిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పారిపోయాడు. తిమ్మప్పను గురువారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: టిక్ టాక్ స్టార్‌కు జైలు శిక్ష.. కాపాడమంటూ వేడుకోలు రాత్రిళ్లు కల్లోకి వచ్చి నాపై అత్యాచారం చేస్తున్నాడు -
చిన్నపాటి ఘర్షణ.. ఆసుపత్రిలోనే పెట్రోల్ పోసి నిప్పంటించాడు
భోపాల్: మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా ఆసుపత్రిలో చోటుచేసుకున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో ఒక వ్యక్తి తనతో గొడవపడిన మరో వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీనికి సంబంధించిన సన్నివేశాలు ఆసుపత్రి సీసీ టీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం బాధితుడు కాలిన గాయాలతో సాగర్ బుందేల్ ఖండ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు.. దామోదర్ కోరి, మిలన్ మాచే రజాక్ మధ్య గురువారం(జూన్ 10న) ఏదో విషయంలో చిన్నపాటి గొడవ జరిగింది. ఈ ఘర్షణలో దామోదర్ కోరికి గాయాలు కావడంతో చికిత్స చేయించుకునేందుకు బుందేల్ ఖండ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వచ్చాడు. అయితే తనతో గొడవపడిన కోరిపై ఆగ్రహంతో ఉన్న మిలన్ మాచే కొన్ని గంటల తర్వాత కోరి ఉన్న ఆసుపత్రికి వచ్చాడు. ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని బయటకు వస్తున్న కోరీపై పెట్రోల్ పోసి తన వద్ద ఉన్న లైటర్‌తో నిప్పు అంటించి అక్కడినుంచి పరారయ్యాడు. దాదాపు 50 శాతం కాలిన గాయాలతో కిందపడిపోయిన కోరిని వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స నిర్వహించారు. కాగా మిలన్ మాచే కోరికి నిప్పు అంటించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. సీసీటీవీ, బాధితుడి వాంగ్మూలం ఆధారంగా నిందితుడు మిలన్ మాచే రజాక్ ను పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్ 307 ప్రకారం హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. చదవండి: స్థల వివాదం; వెంటాడి.. వివస్త్రను చేసి ‘న్యూడ్ కాల్ చేస్తావా.. ఫొటోస్ అప్లోడ్ చేయలా?’ -
ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం: ఇద్దరు సజీవ దహనం
రాజేంద్రనగర్: ఔటర్ రింగ్ రోడ్లో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏపీ నుంచి రొయ్యల లోడ్‌తో మహారాష్ట్రకు వెళ్తున్న కంటైనర్ ముందు వెళ్తున్న గుర్తుతెలి యని వాహనాన్ని ఢీకొంది. ఈ తీవ్రతకు కంటైనర్ క్యాబిన్లో మంటలు చెలరేగాయి. డోర్లు లాక్ కావడం, లోపల ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో క్షణాల్లో అగ్నికీలలు విస్తరించాయి. దీంతో అందులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతా నిమిషాల్లోనే... ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఉమామహేశ్వరరావు రొయ్యల వ్యాపారి. పాలకొల్లు నుంచి ముంబైకి రొయ్యలు ఎగుమతి చేస్తుంటారు. ఈయన వద్ద థానేకు చెందిన ముత్యంజయ యాదవ్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సూర్యకుమార్ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. పాలకొల్లు నుంచి ఓ కంటైనర్ (ఏపీ 39 టీక్యూ 5734)లో ఇద్దరు డ్రైవర్లు బయలుదేరారు. వీరిలో ఒకరు వాహనం నడుపుతుండగా మరొకరు క్యాబిన్లో ఉన్నారు. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ వాహనం ఓఆర్ఆర్ మీదుగా ప్రయాణిస్తూ హిమాయత్‌సాగర్ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదం ధాటికి కంటైనర్ ముందు భాగం దెబ్బతినడంతో పాటు మంటలు అంటుకున్నాయి. క్యాబిన్ కూడా ధ్వంసం కావడంతో పాటు దాని డోర్స్ లాక్ అయ్యాయి. నిమిషాల వ్యవధిలోని మంటలు క్యాబిన్ మొత్తం ఆక్రమించాయి. వీటిలో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లు రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. అదే సమయంలో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న ఇతర వాహన చోదకులు ఆగి వారిని కాపాడే ప్రయత్నాలు చేశారు. క్యాబిన్ ముందు అద్దాలు పగులకొట్టినా.. మంటల ఉధృతి కి వెనక్కు తగ్గారు. గ్యాస్‌సిలిండర్ పేలిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. కేబిన్‌లో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లు పూర్తిగా కాలిపోయారు. రాజేంద్రనగర్ పోలీసులు అగ్నిమాపక శాఖకు సమాచారమివ్వడంతో ఫైరింజన్ మంటల్ని ఆర్పింది. మృతదేహాలకు పంచనామా నిర్వహించిన రాజేంద్రనగర్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు. ఈ ఉదం తంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు కంటైనర్ ఢీకొట్టిన వాహనం వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రమాద దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. -
ప్రాణం తీసిన అగ్గిపుల్ల, చూస్తుండగానే ఘోరం
నిజాంసాగర్(జుక్కల్): బీడీ కాల్చేందుకు వెలిగించిన అగ్గిపుల్ల ప్రాణాలనే తీసింది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రానికి చెందిన తాటివార్ బాలరాజ్ (35) శనివారం మధ్యాహ్నం తన చెల్లెలు సోని కిరాణా దుకాణానికి వెళ్లాడు. దుకాణంలో ముగ్గురు చిన్నపిల్లలు ఉండటంతో బాలరాజ్ పెట్రోల్ డబ్బాల పక్కన కింద కూర్చున్నాడు. అనంతరం అగ్గిపుల్ల వెలిగించి బీడీ అంటించుకున్నాడు. ఆ తర్వాత అగ్గిపుల్లను పారవేసే క్రమంలో అది పెట్రోల్ డబ్బాలపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బాలరాజ్‌కు అంటుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న బాలరాజ్ హాహాకారాలు చేస్తూ కింద పడిపోయాడు. చుట్టుపక్కల వారు, అటు వైపు వచ్చిన వారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో అందరూ చూస్తుండగానే బాలరాజ్ సజీవదహనం అయ్యాడు. ప్రమాద సమయంలో కిరాణా దుకాణంలో ఉన్న పిల్లలు భయంతో బయటకు పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్.ఐ దత్తాత్రిగౌడ్ తెలిపారు. చదవండి: యువతి కిడ్నాప్; ఆపై అత్యాచారం -
శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు సజీవ దహనం
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట రాజీవ్ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొట్టిన ఘటనలో మంటలు చెలరేగి ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు. నగరం నుండి తమిళనాడు సేలం కు వెళ్తున్న కంటైనర్ ను లారీ ఓవర్టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీల మధ్య రాపిడి జరగడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. ఒక వ్యక్తి సజీవదహనమయ్యాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఫైర్ ఇంజిన్ లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. -
ఇంజినీరింగ్ విద్యార్థి సజీవ దహనం
భువనేశ్వర్: ఇంజినీరింగ్ విద్యార్థి సజీవ దహనమయ్యాడు. పలు అనుమానాలకు దారితీసిన ఈ దారుణం రణస్థలం మండలంలో సంచలమైంది. రణస్థలం పంచాయతీ పరిధి సీతంపేట గ్రామ సమీప తోటల్లో విద్యార్థి సజీవదహనమై కనిపించిన ఘటన బుధవారం ఉదయం వెలుగు చూసింది. జె.ఆర్.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 5.30 గంటల సమయంలో పొలాలకు వెళ్లిన రైతులకు దుర్గారావు అనే వ్యక్తికి చెందిన పొలంలోని ధాన్యం బస్తాలు కాలిపోయి పొగలు రావడాన్ని గమనించారు. దీంతో వారంతా పక్కనే ఉన్న తోటపల్లి కాలువలోని నీటిని బకెట్లతో తీసుకొచ్చి కాలిపోతున్న ధాన్యం బస్తాలపై జల్లుతుండగా...పక్కనే కాలిపోయిన శవం కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో విషయాన్ని రణస్థలంలోని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా.. వారు జె.ఆర్.పురం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సీఐ వి.చంద్రశేఖర్ సిబ్బందితో వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని క్లూస్‌టీంకు తెలియజేయడంతో వారు వచ్చి కాలిపోయిన మృతదేహాన్ని, సమీపంలో పడిఉన్న ఏటీఎం కార్డు, పర్సులోని కళాశాల ఫీజు రశీదును గుర్తించారు. వాటి ఆధారంగా సజీవ దహనమైన యువకుడు మువ్వల నగేష్(18)గా తెలుసుకున్నారు. ఇతను ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలోని శివాని కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడని, స్వగ్రామం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం నువ్వులరేవుగా తేలిందని పోలీసులు తెలిపారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా మృతుడు సోదరుడు మేఘనాథ్ (ఆర్ఎంపీ వైద్యుడు) సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. సజీవదహనమైన తమ్ముడు నగేష్‌ని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. మృతుని సోదరుడు ఏం చెప్పాడంటే.. ఈ నెల 7వ తేదీన శివాని ఇంజినీరింగ్ కళాశాలలో జాయినయ్యాడని, తరువాత మధ్యలో రెండు సార్లు ఇంటికి వచ్చాడని నగేష్ సోదరుడు మేఘనాథ్ చెప్పారు. ఈ నెల 25న ఉదయం తొమ్మిది గంటలకు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి వచ్చేశాడన్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కాలేజీలో సెల్‌ఫోన్ విడిచిపెట్టి వెళ్లిపోయినట్టు స్నేహితుల ద్వారా తెలిసిందన్నారు. బుధవారం ఉదయం పోలీసుల నుంచి ఫోన్ రావడంతో తమ్ముడు చనిపోయిన విషయం తెలిసిందని రోదిస్తూ చెప్పారు. నగేష్ తల్లిదండ్రులు సుందరి, గోపాల్ మత్స్య వేటే వృత్తిగా బతుకుతున్నారు. కాగా విద్యార్థి సజీవ దహనంపై పోలీసులు, క్లూస్ టీం అన్ని కోణాల్లో లోతుగా విచారణ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ చంద్రశేఖర్ చెప్పారు. -
భర్తను సజీవ దహనం చేసిన భార్య
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో బుధవారం వేర్వేరు చోట్ల వెలుగు చూసిన హత్యలు ఆయా ప్రాంతాల్లో కలకలం రేపాయి. చెన్నై తురై పాక్కం కన్నగి నగర్‌కు చెందిన ఆట్రోడ్రైవర్ రఘు, మైలాపూర్‌కు చెందిన కార్తీక్ స్నేహితులు. అయితే, భార్య వినోదిని(21)తో కార్తీక్‌తో సాగిస్తున్న వివాహేతర సంబంధాన్ని పసిగట్టిన రఘు వేకువజామున తాను లేననుకుని ఇంటికి వచ్చిన కార్తిక్‌ను, రఘు హతమార్చాడు. చదవండి: ప్రియుడిని కలవడానికి నిరాకరించినందుకు .. తండ్రి కోసం.. తిరునల్వేలి జిల్లా తచ్చనల్లూరుకు చెందిన సుడలైమణి(55), షణ్ముగవేల్(52) అన్నదమ్ముళ్లు. ఆస్తి కోసం తండ్రికి సుడలైమణి చేతబడి చేసినట్టు షణ్ముగవేల్ కుమారుడు ముత్తుమారి కొంతకాలంగా గొడవ పడుతూ కక్ష గట్టాడు. ఉదయం గ్రామ శివార్లలో ఒంటరిగా కనిపించిన సుడలైమణిని మారిముత్తు నరికి చంపేశాడు. చదవండి: తరచూ ఫోన్ చేసి భార్యను వేధిస్తున్నాడని.. డ్రమ్ములో హిజ్రా శవం.. కోవై జిల్లా హిజ్రాల సంఘం నేతగా సంగీత(50) వ్యవహరిస్తున్నారు. హిజ్రాల్ని ఏకం చేసి ట్రాన్స్ కిచ్చన్ పేరిట బిర్యానీ సెంటర్‌ను నడుపుతూ వస్తున్న సంగీత ఆమె ఇంట్లో ఓ డ్రమ్ములో శవంగా తేలింది. కోయంబత్తూరు రత్నగిరికి చెందిన పెరియస్వామి(46) రాంగ్ కాల్లో తగిలిన ఓ మహిళతో పరిచయం పెంచుకునేందుకు తీవ్రంగా యత్నించాడు. కారమలైకు చెందిన వితంతువు ధనలక్ష్మిగా గుర్తించాడు. ప్రతిరోజూ రాత్రుల్లో సిమ్ కార్డుల్ని మారుస్తూ, ఫోన్‌చేసి అశ్లీల వ్యాఖ్యలు చేయడం, కోరిక తీర్చాలని వేధించడం మొదలెట్టాడు. దీంతో విషయాన్ని తన తల్లి మల్లిక, బంధువు లక్ష్మణన్ దృష్టికి తీసుకెళ్లింది. మంగళవారం అర్ధరాత్రి పథకం ప్రకారం పెరియస్వామి ఇంటికి రప్పించుకున్న ధనలక్ష్మి తన తల్లి, బంధువుతో కలిసి చెట్టుకు కట్టేసి చితక్కొట్టింది. దీంతో పెరియస్వామి విగత జీవి అయ్యాడు. పెట్రోల్ పోసి తగలబెట్టింది... ఈరోడ్ వలరసం పట్టికి చెందిన సుధాకర్(40)ను అదే ప్రాంతానికి చెందిన లక్ష్మి గత ఏడాది రెండో పెళ్లి చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇంట్లో ఉన్న పెట్రోల్‌ను సుధాకర్‌పై పోసి తగలబెట్టేసింది. అతడు సజీవ దహనం కావడం, ఇంట్లో నుంచి పొగరావడంతో ఇరుగు పొరుగు పరుగులు తీశారు. దీంతో లక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసి, ఆస్పత్రి పాలైంది. తండ్రి ఆత్మహత్య టీ.నగర్: కుమారుడు మృతిని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగపట్నం జిల్లా, శీర్గాళి సమీపంలోగల సంజీవరాయన్ కోవిల్ గ్రామానికి చెందిన శేఖర్ (48) రైతు. భార్య తమిళరసి.. వీరి కుమారుడు సంతోష్ (27). ఈనెల తొమ్మిదో తేదీన చెన్నైకు వెళుతున్నట్లు తెలిపి బయలుదేరాడు. ఈ క్రమంలో 10న కడలూరు జిల్లా చిదంబరం సమీపం పి.ముట్లూరు ప్రాంతంలో సంతోష్ హత్యకు గురయ్యాడు. కుమారుడు మృతిని తట్టుకోలేక శేఖర్ మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి తమిళరసి అనే భార్య ఉంది. -
అగ్నికీలల్లో ఆర్తనాదాలు
సాక్షి, బళ్లారి: బస్సు బెంగళూరుకు పరుగులు తీస్తోంది. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఇంతలో బస్సులో అగ్నికీలలు. కొందరికి మెలకువ వచ్చి బస్సులో నుంచి దూకేశారు. డ్రైవర్ బస్సును నిలిపేసి పారిపోయాడు. డ్రైవర్ వెనుక సీట్లో ›కూర్చున్న బెంగళూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన కవిత(28), ఆమె అక్క శీలా (33), వారి ముగ్గురు పిల్లలు స్పర్శ (8), సమృద్ధి(5), నిశ్చిత(3)లు మంటల్లో చిక్కి సజీవ దహనమయ్యారు. ఈ హృదయవిదారక ఘటన చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకా కేఆర్‌హళ్లి వద్ద జాతీయ రహదారిలో బుధవారం తెల్లవారుజామున 3–4 సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. విజయపుర(బీజాపూర్) నుంచి బెంగళూరుకు వెళ్తున్న కుక్కేశ్రీ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు మంటల్లో చిక్కుకుంది. పై ఐదుగురి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా మారిపోయాయి. ఈ ఘటనలో మరో 27 మంది తీవ్రంగా గాయపడటంతో చిత్రదుర్గ, హిరియూరు ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. కలెక్టర్, ఎస్పీ పరిశీలన ఈ ఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ కవిత, ఎస్పీ రాధికలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. డ్రైవర్ పరారు కావడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నిద్రలోకి జారుకొన్న వారు ప్రమాదం నుంచి బయట పడేందుకు వీలుకాకపోగా ముగ్గురు చిన్నారులు కావడం వల్ల వారికి ఏం జరుగుతోందో తెలియక క్షణాల్లో కాలిబూడిదయ్యారు. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో విషాదం తాండవించింది. -
ఆస్తి కోసం అత్తను కాల్చేసింది
శంకర్పల్లి: ఓ మహిళ ఆస్తి కోసం తన కుమారుడితో కలిసి అత్తను కాల్చి చంపేసింది. ఈ సంఘటన మండల పరిధిలోని ఎల్వర్తి అనుబంధ కొజ్జగూడలో మంగళవారం సాయంత్రం జరిగింది. సీఐ గోపినాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కంసమ్మ(70)కు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. గతేడాది కొడుకు చనిపోయాడు. అతడికి భార్య విజయ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం కంసమ్మ గ్రామంలో ఉన్న పొలం విక్రయించి మెదక్ జిల్లా కాదులబాద్‌లో 5 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. సదరు భూమిని తన ముగ్గురు కూతుళ్లతో పాటు తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకుంది. అయితే, ఈ విషయం కోడలు విజయకు తెలియడంతో మంగళవారం సాయంత్రం అత్తను నిలదీసింది. తనకు భూమి ఎందుకు ఇవ్వవు అని గొడవపడింది. ఈక్రమంలో విజయ తన కుమారుడు శివతో కలిసి ఇంట్లో ఉన్న కంసమ్మపై పెట్రోల్ పోసి నిప్పటించారు. మంటలు అంటుకొని కాలిన గాయాలతో ఇంటి గడప వద్దే కంసమ్మ మృతి చెందింది. ఇల్లు పూర్తిగా కాలి పోయింది. ఇరుగుపొరుగు వారు గమనించినా ఫలితం లేకుండా పోయింది. అయితే, కంసమ్మను హత్య చేసిన అనంతరం విజయ, ఆమె కుమారుడు పరారయ్యారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తమ్ముడు కిష్టయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బాలిక సజీవదహనం
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుకోట్టై జిల్లాలో ఇటీవలే ఏడేళ్ల చిన్నారిపై లైంగికదాడి, కిరాతకంగా హతమార్చిన ఉదంతం నుంచి ఇంకా కోలుకోక ముందే తిరుచ్చిరాపల్లి జిల్లాలో మరో ఘోరం జరిగిపోయింది. ఆడుతూ పాడుతూ అందరిముందు తిరుతుండిన మైనర్ బాలిక అంతలోనే శరీరం కాలిపోయిన స్థితిలో ముళ్లపొదల్లో శవంగా మారిపోయింది. పోలీసుల కథనం ప్రకారం.. తిరుచ్చిరాపల్లి జిల్లా సోమరసంపేట అదవత్తూరుపాళయంకు చెందిన పెరియస్వామి (45) రైతుకు భార్య మహేశ్వరి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రెండో కుమార్తె గంగాదేవి (14) ఎట్టరై ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో సహచరి విద్యార్థినులతో కలిసి ఆడుకుంది. ఆ తరువాత ఇంట్లోని చెత్తను పారవేసేందుకు సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లిన గంగాదేవి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు, బంధువులు గాలింపు చేపట్టగా అడవిలోని ముళ్లపొదల్లో శరీరమంతా కాలిపోయిన స్థితిలో బాలిక శవంగా పడి ఉంది. సమీపంలో ఒక లీటరు క్యానులో కొద్దిగా కిరసనాయిలు, సంఘటన జరిగిన రోజున బాలిక ధరించిన దుస్తులు సమీపంలో చిరిగిపోయి పడి ఉన్నాయి. కుమార్తెను సజీవంగా తగలబెట్టారంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి విచారణ ప్రారంభించారు. బాలిక శవాన్ని పోస్టుమార్టంకు తరలించేందుకు పోలీసులు సిద్ధపడగా గ్రామస్తులు అడ్డుకుని నిందితులను అరెస్ట్ చేసేవరకు పంచనామా చేయరాదని బైఠాయించారు. అదే సమయానికి అక్కడికి చేరుకున్న అంబులెన్స్ అద్దాలను పగలగొట్టి రాస్తారోకోకు దిగారు. పోలీసు అధికారులు స్థానికులతో చర్చలు జరిపి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాలిక శవాన్ని తిరుచ్చిరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుచ్చి ఎస్పీ, ఏఎస్పీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు మీడియాతో మాట్లాడుతూ, పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ బాలికపై లైంగికదాడి జరిగిందా లేదా అనేది చెప్పగలమని తెలిపారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పుదుక్కోట్టై జిల్లా అరిమళంలో ఏడేళ్ల చిన్నారిపై కొన్ని రోజుల క్రితమే లైంగికదాడి, దారుణహత్య జరిగింది. ఇంతలోనే మరో బాలికను వికృతంగా హతమార్చిన సంఘటనతో ప్రజల్లో భీతినెలకొంది. తిరుచ్చిరాపల్లి మండల డీఐజీ విజయ మీడియాతో మాట్లాడుతూ బాలిక ఒంటి నిండా ఉన్న కాలినగాయాలపై పరిశోధన చేయాల్సిందిగా వైద్య నిపుణులను కోరామని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ఏడీఎస్పీ నేతృత్వంలో ఐదుగురు ఇన్స్పెక్టర్లతో కూడిన 11 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిందితులను వదిలే ప్రసక్తేలేదన్నారు. కఠిన శిక్షకు గురిచేస్తామన్నారు. ఇదిలా ఉండగా, బాలికపై లైంగికదాడి జరగలేదని మంగళవారం విడుదల చేసిన పోస్టుమార్టం రిపోర్టు ద్వారా తేటతెల్లమైంది. ఇది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. జాతీయ చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈ ఘటనను సుమోటాగా స్వీకరించి విచారణ జరిపేందుకు ముందుకు వచ్చింది. లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తరువాత తమిళనాడులో ఆరు సార్లు బాలికలపై ఆఘాయిత్యాలు, లైంగికదాడుల ఘటనలు చోటుచేకున్నాయి. కమిషన్ సైతం ఆరోసారి తమిళనాడులోని కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. -
నిప్పంటించుకుని యువతి ఆత్మహత్య
శ్రీకాకుళం, పాతపట్నం: మెళియాపుట్టి మండలం వెంకటాపురం పంచాయతీ బందపల్లి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం తన ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకుని సవర హేమలత (25) ఆత్మహత్య చేసుంది. పోలీసులు, గ్రామస్తులు వివరాల ప్రకారం... ఆమె తండ్రి సవర పాపయ్య, తల్లి జానకమ్మ పోడు వ్యవసాయం కోసం కొండపైకి వెళ్లారు. ఇంతలో ఈ దారుణానికి ఒడిగట్టింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. సంఘటన స్థలానికి ఎస్ఐ సిద్ధార్థ కుమార్ చేరుకుని పరిశీలించి, మృతురాలి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హేమలత ఇంటర్ వరకు చదువుకుంది. తమ్ముడు అనిల్ ఉన్నాడు. పోస్టుమార్టం కోసం పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
అత్తను మట్టుబెట్టిన కోడలు..
సాక్షి, చెన్నై: తన కాపురంలో వరకట్న చిచ్చు పెట్టడమే కాదు, భర్తను తనకు దూరం చేయడానికి ప్రయత్నించిన ఓ అత్తను కోడలు సజీవదహనం చేసింది. పాలల్లో నిద్రమాత్రలు వేసి నిద్ర పుచ్చినానంతరం కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది. అత్త శరీరం మంటల్లో కాలుతున్నా, ఏమీ ఎరుగనట్టుగా మరో గదిలో నిద్ర నాటకం ఆడి అడ్డంగా ఈ కోడలు బుక్కైంది. పోలీసుల కథనం మేరకు వివరాలు...(కాళ్ల పారాణి ఆరకముందే... ) పుదుకోట్టై జిల్లా వెల్లకోట సమీపంలోని మనియాందపురం గ్రామానికి చెందిన రమేష్‌కు రెండేళ్ల క్రితం ప్రతిభతో వివాహం అయింది. వీరికి తొమ్మిది నెలల ఆడ బిడ్డ ఉంది. రమేష్ పుదుకోట్టైలోని ఓ మందుల తయారీ సంస్థలో ఉద్యోగి. రమేష్‌తో పాటు తండ్రి అరుల్ పుళవన్, తల్లి రాజమ్మాల్ కూడా ఉన్నారు. ఈ కుటుంబానికి సొంతంగా ఇళ్లు, పంట పొలాలు ఉన్నాయి. అయితే, కోడల్ని కూతురుగా చూసుకోవాల్సిన అత్త రాజమ్మాల్ మొదటి నుంచి ఆరళ్లు పెడుతూ వచ్చింది. పెళ్లి సమయంలో కట్న కానుకల్ని బకాయి పెట్టారని, అది తీసుకు రావాలని, పదే పదే కోడల్ని వేధించేది. తన కుమారుడికి ఆడ బిడ్డ పుట్టినానంతరం కోడలిపై వేధింపుల్ని ఈ గయ్యాలి అత్త పెంచింది. అదనపు కట్నం తీసుకురావాలని లేని పక్షంలో తన కుమారుడికి మరో పెళ్లి చేస్తానంటూ బెదిరించడం మొదలెట్టింది. భర్త, అత్తమామలు తనను బాగానే చూసుకుంటున్నా, అత్తరూపంలో తనకు వేధింపులు పెరగడంతో బయటకు చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోయేది. తన పుట్టింట్లో ఆదరణ కరువు కావడం, అత్త వేధింపులు పెరగడం వెరసి మానసికంగా కృంగిన ›ప్రతిభ చివరకు ఉన్మాదిగా మారింది. (అక్కాచెల్లెలు అదృశ్యం..) పథకం ప్రకారం.. వంద రోజుల ఉపాధి పథకం కూలీలకు హెడ్‌గా ఉన్న అత్త రాజమ్మాల్ ఇంటికి రాగానే, ప్రతిరోజూ పాలు తాగడం అలవాటు. దీనిని ఆసరగా చేసుకుని ఆమెను మట్టుబెట్టేందుకు ప్రతిభ పథకం వేసుకుంది. వారం రోజులుగా ఒక్కక్కటి చొప్పున నిద్ర మాత్రల్ని మెడికల్ షాపు ద్వారా సేకరించింది. బుధవారం సాయంత్రం మామ అరుల్ పుళవన్ బయటకు వెళ్లడం, భర్త ఇంటికి వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశాల్ని పరిగణలోకి తీసుకుంది. ఇంటికి వచ్చిన అత్త పాలు తాగింది. అప్పటికే అందులో నిద్ర మాత్రల్ని ప్రతిభ వేసింది. ఆ మత్తులో ఆమె నిద్రకు ఉపశ్రమించింది. తన కాపురంలో చిచ్చు పెట్టే రీతిలో వేధింపులు ఇవ్వడమే కాదు, భర్తను తనకు కాకుండా చేస్తానన్న అత్తను హతమార్చేందుకు ఉన్మాదిగా మారింది. ముందుగా సిద్ధం చేసుకున్న కిరోసిన్‌ను ఆమెపై పోసి నిప్పు పెట్టింది. ఏమీ ఎరుగనట్టుగా మరో గదిలోకి వెళ్లి నిద్ర పోయినట్టు నాటకం రచించింది. అయితే, ఈ ఇంట్లో నుంచి హఠాత్తుగా పొగ, కాలిన వాసన రావడాన్ని గుర్తించిన స్థానికులు పరుగులు తీశారు. తలుపులు తెరిచే ఉండడంతో లోనికి వెళ్లారు. అక్కడ మంటల్లో రాజమ్మాల్ కాలుతుండడంతో ఆర్పే యత్నం చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఇంత జరుగుతున్నా, కోడలు గదికే పరిమితం కావడం, గాడ నిద్ర నుంచి లేచినట్టు బయటకు రావడం స్థానికుల్లో అనుమానం రేకెత్తించింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, ఆస్పత్రిలో రాజమ్మాల్ మరణించడం, సంఘటన స్థలంలో సాగిన పోలీసులు విచారణతో కోడలి బండారం బయటపడింది. భర్తకు మరో పెళ్లి చేస్తే, తాను, తన బిడ్డ ఒంటరి అవుతామన్న భయంతోనే ఈ కిరాతకానికి ఒడి గట్టాల్సి వచ్చిందని ప్రతిభ కన్నీటి పర్యంతమైంది. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. అత్త కోడళ్ల మధ్య సాగిన వరకట్న వేధింపులు, ఉన్మాద చర్య కారణంగా ముక్కు పచ్చలారని 9 నెలల చంటి బిడ్డ పాల కోసం అలమటిస్తుండడం కొసమెరుపు.