
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట రాజీవ్ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొట్టిన ఘటనలో మంటలు చెలరేగి ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు. నగరం నుండి తమిళనాడు సేలం కు వెళ్తున్న కంటైనర్ ను లారీ ఓవర్టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీల మధ్య రాపిడి జరగడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. ఒక వ్యక్తి సజీవదహనమయ్యాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఫైర్ ఇంజిన్ లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.