over take
-
పెళ్లి చూసుకుని తిరిగి వస్తుండగా.. ప్రాణాలు తీసిన ఓవర్టేక్
కెలమంగలం: బెంగళూరులో పెళ్లి చూసుకుని కారులో స్వగ్రామానికొస్తూ చెట్టును ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. వివరాలు.. శుక్రవారం రాత్రి డెంకణీకోటకు చెందిన మంజునాథ్ (22), మిత్రులు వేదాంత (21), భరత్ (21), లోకనాథన్ (22)లు కలిసి బెంగళూరులో ఒక పెళ్లికి హాజరై తిరుగుముఖం పట్టారు. హోసూరు– డెంకణీకోట రోడ్డులోని తండ్రి గ్రామం వద్ద ఒక వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి కారు అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. తీవ్రగాయాలతో మంజునాథ్, భరత్‌లు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వేదాంత, లోకనాథన్‌ల పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు గాయపడిన వారిని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. చెరువులోకి కారు పల్టీ ఇద్దరు మృతి, ఒకరు గల్లంతు యశవంతపుర: కారు అదుపుతప్పి చెరువులో పడడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన బెంగళూరు కగ్గలిపుర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఐదు మంది స్నేహితులు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో డాబాలో భోజనం చేసి కగ్గలిపుర చెరువుకట్టపై నగరానికి తిరిగి వస్తున్నారు. కనకపుర రోడ్డు సోమనహళ్లి చెరువు కట్టపై అతివేగంలో అదుపుతప్పి చెరువులోకి బోల్తా పడింది. పుండలీక(30), కల్లేశ్ (33) అనే ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇద్దరు ఈదుకుంటూ బయటకు వచ్చారు. మరొకరి జాడ తెలియరాలేదు. మృతులు హుబ్లీ, హావేరికి చెందినవారని తెలిసింది. నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. వీకెండ్ కావడంతో షికారుకు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. -
శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు సజీవ దహనం
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట రాజీవ్ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొట్టిన ఘటనలో మంటలు చెలరేగి ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు. నగరం నుండి తమిళనాడు సేలం కు వెళ్తున్న కంటైనర్ ను లారీ ఓవర్టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీల మధ్య రాపిడి జరగడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. ఒక వ్యక్తి సజీవదహనమయ్యాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఫైర్ ఇంజిన్ లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. -
ప్రాణం తీసిన ఓవర్టేక్
అనంతపురం , ఆత్మకూరు: ఓవర్ టేక్ ఒక ప్రాణాన్ని బలిగొంది. వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పడంతో వెనుక కూర్చున్న మహిళ ఎగిరి రోడ్డుపై పడింది. ఆ వెనుకే వస్తున్న ఆర్టీసీ బస్సు టైరు ఆమెపై వెళ్లడంతో మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. శరణమ్మ (43) అనే మహిళ తన కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంలో కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వైపు వస్తున్నారు. మండల కేంద్రం ఆత్మకూరు స్టేట్ బ్యాంకు వద్ద ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్‌చేయబోయాడు. అయితే అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉండటంతో బ్రేక్ వేశాడు. కుదుపునకు బైక్‌లో వెనుక కూర్చున్న శరణమ్మ ఎగిరి రోడ్డుపై పడింది. ఆమె కుమారుడు రోడ్డు పక్కన పడిపోయాడు. వెనుకే వస్తున్న ఆర్టీసీ బస్సు టైరు శరణమ్మ ఛాతీభాగంపై వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో 108 వాహనంలో అనంతపురం తరలిస్తుండగా మార్గం మధ్యలోనే శరణమ్మ ప్రాణం విడిచింది. మృతురాలి వద్ద లభించిన ఆధార్ కార్డులో వివరాల ప్రకారం ఆమె అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి అని, బ్యాంకు పాస్‌పుస్తకంలో కంబదూరు మండలం కొత్తపల్లికి చెందినదిగా ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు. -
ఇన్నోవాను ఆటోతో ఓవర్‌టెక్ చేశాడని..
సాక్షి, హైదరాబాద్ : కారుని ఓవర్ టేక్ చేశాడనే కోపంతో ఆటో డ్రైవర్ని నిర్బంధించి చితక బాదిన ఘటన చందానగర్‌లో చోటుచేసుకుంది. గౌలిదొడ్డి గ్రామానికి చెందిన రమేష్ తన మిత్రుడుతో కలిసి నల్లగండ్ల పెట్రోల్ బంకు వైపు వెళ్తున్నారు. అదే వైపు ఇన్నోవా కారులో కొంతమంది యువకులు వెళ్తున్నారు. కారుని ఆటోతో ఓవర్ టేక్ చేశాడనే కోపంతో చేజ్ చేసి ఆటోను అడ్డగించారు. అంతటితో ఆగకుండా రమేష్‌ను కారులో కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని వెళ్లి మరికొంతమంది యువకులతో కలిసి తీవ్రంగా కొట్టారు. దీంతో రమేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయాడని వదిలి పెట్టి పోయారు. మూడు రోజులు క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రమేష్‌కు చికిత్స అందిస్తున్నారు. -
పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
మానకొండూర్: కరీంనగర్–వరంగల్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. వాహనాల రద్ధీ కూడ పెరిగిపోతోంది. డబుల్‌లైన్ కావడంతో వాహనదారులు ఓవర్టేక్ చేస్తూ దూసుకెళ్తున్నారు. ఇదే సమయంలో ఎదురుగా వచ్చిన వాహనాలను ఢీకొనడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పెరిగిన రద్దీ దృష్ట్యా రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ భారీ రోడ్డు ప్రమాదాలన్నీ ఓవర్టేక్ చేయడం వల్ల జరుగుతున్నవే. గతంలో కూడ మానకొండూర్ మండలం ఖాదర్‌గూడెం సమీపంలో ఓ కారు ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వచ్చిన బస్సును ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఓకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. ఈదులగట్టెపల్లి బిడ్జిపై ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటున్నాయి. నెల రోజుల కిందటే మానకొండూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో లారీ, కారు ఢీకొన్న సంఘటన ఇలాంటిదే. ఈ నెల 10న కేసీఆర్ సభకు వెళ్లి వస్తున్న పోలీసుల వాహనం మరో కారు ఢీకొన్నాయి. 14 మంది వరకు గాయాలపాలయ్యారు. ఒకరు మృతిచెందారు. నిబంధనలు అవసరం కరీంనగర్– వరంగల్ రహదారిపై వాహనాలు రద్ధీ పెరిగిపోయిన దృష్ట్యా ఎక్కువగా ప్రమాదా లు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వాహనదారులు జాగ్రత్తగా వేగంగా కాకుండా నడిపేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తూన్నారు. -
ప్రాణం తీసిన ఓవర్టేక్
ఆటో బోల్తా.. ఒకరి మృతి మరో ఏడుగురికి గాయాలు బత్తలపల్లి : ఓవర్టేక్ చేయబోయిన ఆటో బోల్తాపడటంతో ఒకరు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ముదిగుబ్బ మండలం చిన్నకోట్లకు చెందిన ఎనిమిది మంది దేవాలయం వద్దకు సిమెంట్ రేకులు తీసుకురావడానికి ఆటోలో అనంతపురం బయల్దేరారు. బత్తలపల్లి దాటి కొంత దూరం వెళ్లగానే ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోతుండగా ఎదురుగా మరో వాహనం రావడంతో దాన్ని తప్పించేక్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అందరూ గాయపడ్డారు. వెంటనే అదే ఆటోను పైకిలేపి అనంతపురం ఆస్పత్రికి వెళుతుండగా మార్గంమధ్యలోనే సూర్యనారాయణరెడ్డి (53) మృతి చెందాడు. మరో ఆరుగురు నారాయణప్ప, ఉదయ్‌కుమార్‌రెడ్డి, చంద్ర, గిట్టా నారాయణ, నాగభూషణ, క్రిష్టలు గాయపడ్డారు. సూర్యనారాయణరెడ్డికి భార్య సుధామణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆటో డ్రైవర్ బ్రహ్మా సురక్షితంగా బయటపడ్డారు. ట్రాక్టర్, లారీ ఢీ.. ముగ్గురికి గాయాలు తాడిపత్రి రూరల్ : తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి సమీపంలో లారీ ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టడంతో గ్రాసం లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో మడ్డిపల్లికి చెందిన వెంకటేశ్వరరెడ్డి (51), వెంకటరామిరెడ్డి (58), వెంకటటేశ్వరెడ్డి (53)లు గాయపడ్డారు. కర్నూలు జిల్లా అవుకు నుంచి గ్రాసం తీసుకుని స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రూరల్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని, క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
టాటా వాహనాన్ని ఢీకొట్టిన ఇన్నోవా.. వ్యక్తి మృతి
బాలానగర్ (మహబూబునగర్): వేగంగా వెళ్తున్న టాటా గూడ్స్ వాహనం అదుపుతప్పి ఒకరు మృతి చెందగా, 8 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబునగర్ జిల్లా బాలానగర్ మండలం రంగారెడ్డి గ్రామం సమీపంలో సోమవారం జరిగింది. వివరాలు.. షాద్‌నగర్ నుంచి జడ్చర్ల వె ళ్తున్న టాటా గూడ్స్ వాహనం బుస్సును ఓవర్‌టేకు చే యబోయింది. ఈ క్రమంలో బస్సును, కారును ఢీ కొంటు వెళ్లిన టాటా వాహనం ఢీవైడర్ దాటిపోయింది. అదే సమయంలో అటుగా వస్తున్న ఇన్నోవా వాహనం టాటా వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో టాటా వాహనాన్ని నడుపుతున్న కొత్తకోట మండలం, కొన్నూరు గ్రామానికి చెందిన వాసుకి సుధాకర్(45) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో టాటా వాహనంలో ఉన్న 5గురు, ఇన్నోవాలో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. గాయాలైనవారిని షాద్ నగర్ ఆస్పత్రికి తరలించారు. సంఘనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం షాద్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ యువకుడు యమజాతకుడు
ఓ యువకుడు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ తన ముందుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో ఎదుటి వైపు నుంచి మరో బస్సు అతివేగంగా దూసుకొచ్చింది. యువకుడు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం బస్సు చక్రాల కిందకు దూసుకెళ్లి పెద్ద శబ్దం వచ్చింది. ఆర్టీసీ డ్రైవర్ బస్సును నిలిపివేశారు. ఆ యువకుడి తీవ్ర ప్రమాదం జరిగిందని బస్సు ప్రయాణికులు భావిం చారు. స్పల్పగాయాలతో ప్రాణాపాయం నుంచి బయట పడిన యువకుడిని చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఘటన అవనిగడ్డ మండలం, తుంగలవారిపాలెం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని గుడివాకవారిపాలేనికి చెందిన గుడివాక వెంకటేశ్వరరావు ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై నాగాయలంక బయలుదేరాడు. తుంగలవారిపాలెం వద్ద నాగాయలంక ఫంటు బస్సును ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఎదురుగా నాగాయలంక నుంచి నర్సాపురం వెళ్లే బస్సు వేగంగా దూసుకొచ్చింది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన వెంకటేశ్వరరావు ద్విచక్రవాహనాన్ని వదిలేసి పక్కకు దూకాడు. ఆ ద్విచక్రవాహనం ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కిందకు వెళ్లిపోవడం, బస్సు పంటకాలువవైపు వరగటంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే డ్రైవర్ బస్సును చాకచక్యంగా నిలిపివేశారు. ప్రయాణికులు అందరూ వెంకటేశ్వరరావుకు ఏ ప్రమాదం జరిగిందోనని ఆందోళన చెందారు. అతను స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.